• TFIDB EN
  • వెంకీ
    UTelugu2h 50m
    వెంకటేశ్వర్లు పోలీస్ ఫోర్స్‌లో తన స్నేహితులతో కలిసి రైలులో హైదరాబాద్‌కు బయల్దేరుతాడు. కానీ రైలులో ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య వెంకీ అనతి స్నేహితులపై పడుతుంది. అయితే వీరంతా శిక్షణ కోసం అకాడమీలో చేరినప్పుడు.. రైలులో జరిగిన హత్యకు కారణం తెలుసుకుంటారు.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రవితేజ
    వెంకటేశ్వరరావు వెంకీ
    స్నేహ
    శ్రావణి
    అశుతోష్ రాణా
    యోగేంద్ర శర్మ IPS
    శ్రీనివాస రెడ్డి
    సూరి బాబు
    చిత్రం శీను
    రమణ
    బ్రహ్మానందం
    జికె గజాల
    ధర్మవరపు సుబ్రహ్మణ్యం
    బిక్షం
    AVS
    బొక్కా సుబ్బారావు
    వేణు మాధవ్
    టికెట్ కలెక్టర్
    మల్లికార్జునరావు
    జగదాంబ చౌదరి జెసి
    తనికెళ్ల భరణి
    వెంకీ నాన్న
    ఢిల్లీ రాజేశ్వరివెంకీ తల్లి
    కృష్ణ భగవాన్
    నకిలీ యజమాని
    మాస్టర్ భరత్
    రైలు ప్రయాణీకుడు
    జీవా
    భరత్ తేజACP భరత్
    ఆహుతి ప్రసాద్
    శరత్ కుమార్ IPS
    రసూల్రైలులో కిల్లర్
    అపూర్వరైలు ప్రయాణికుడు
    కౌశల్ మంద
    సిబ్బంది
    శ్రీను వైట్ల
    దర్శకుడు
    అట్లూరి పూర్ణచంద్రరావు
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    ప్రసాద్ మూరెళ్ల
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
    Saindhav Movie Review: యాక్షన్‌ సీక్వెన్స్‌లో వెంకీ మామ ఉగ్రరూపం.. ‘సైంధవ్‌’ హిట్టా? ఫట్టా?
    నటీనటులు: వెంకటేష్‌, శ్రద్ద శ్రీనాథ్‌, నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా తదితరులు దర్శకత్వం: శైలేష్‌ కొలను సంగీతం: సంతోష్‌ నారాయణ్‌ నిర్మాణ సంస్థ: నిహారిక ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌ నిర్మాత: వెంకట్‌ బోయినపల్లి శైలేష్‌ కొలను (Sailesh Kolanu) దర్శకత్వంలో విక్ట‌రీ వెంకటేశ్(Venkatesh) హీరోగా నటించిన చిత్రం ‘సైంధవ్‌’. వెంకటేష్‌ కెరీర్‌లో ఇది 75వ సినిమా (Saindhav Movie Review). బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ, తమిళ్ నటుడు ఆర్య, బేబీ సారా ఇందులో కీలక పాత్రలు పోషించారు. శ్రద్ధ శ్రీనాథ్‌ వెంకటేష్‌కు జోడీగా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా, ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఇవాళ (జనవరి 13న) విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? వెంకటేష్‌ ఖాతాలో మరో హిట్‌ చేరినట్లేనా? ఇప్పుడు చూద్దాం. కథ సైంధవ్‌ (Venkatesh) తన పాపతో(బేబీ సారా) కలిసి చంద్రప్రస్థ అనే ఓ ఊరిలో జీవిస్తుంటాడు. ఓ రోజు పాప కళ్లు తిరిగిపడిపోవడంతో ఆస్పత్రికి తీసుకెళ్తారు. పాప ప్రాణాంతక జబ్బుతో బాధపడుతుందని తెలుస్తుంది. అదే సమయంలో చంద్రప్రస్థలో టెర్రరిస్టు క్యాంప్‌ నడుస్తుంటుంది. సైంధవ్‌ ఉగ్రవాద చర్యలకు అడ్డుతగులుతాడు. అసలు ఉగ్రవాదులకు సైంధవ్‌కు ఏంటి సంబంధం? గతంలో ఏం చేశాడు? పాపని ఎలా బతికించుకుంటాడు? వికాస్ మాలిక్ (నవాజుద్దీన్ సిద్దికీ), ఆర్య పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది మిగతా కథ. ఎవరెలా చేశారంటే సైంధవ్‌ పాత్రలో వెంకటేష్ (Saindhav Movie Review) అద్భుత నటన కనబరిచాడు. ఎమోషన్, యాక్షన్‌ సన్నివేశాల్లో తన మార్క్‌ నటన కనబరిచి మెప్పించాడు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వెంకీ తన విశ్వరూపం చూపించాడు. సైంధవ్‌, పాపకు దగ్గరయ్యే పాత్రలో శ్రద్ధ శ్రీనాథ్‌ (Shraddha Srinath) ఆకట్టుకుంది. ఇక బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్‌ సిద్ది (Nawazuddin Siddiqui)కి విలన్‌ పాత్రలో అదరగొట్టాడు. అతని అసిస్టెంట్‌గా, లేడీ విలన్‌గా ఆండ్రియా కూడా మెప్పిస్తుంది. తమిళ నటుడు ఆర్య పర్వాలేదనిపిస్తాడు. శ్రద్ద శ్రీనాధ్ మాజీ భర్త పాత్రలో గెటప్ శ్రీను సీరియస్‌గా కనిపించినా కామెడీని పండిస్తాడు. ఎలా సాగిందంటే  గతాన్ని వదిలేసి దూరంగా బతుకుతున్న హీరోకి ఓ సమస్య వస్తే మళ్ళీ ఆ గతంలోని మనుషులు రావడం అనేది చాలా సినిమాల్లో చూశాము. సైంధవ్‌ సినిమా కథ (Saindhav Movie Review in Telugu) కూడా ఇంచుమించు ‌అలాంటిదే.  ఫస్ట్ హాఫ్ అంతా సైంధవ్‌, తన కూతురు మధ్య ప్రేమ, పాపకు జబ్బు ఉందని తెలియడం, కంటైనర్లు గురించి గొడవ, సైంధవ్‌ మళ్ళీ తిరిగొచ్చాడు అంటూ సాగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో విలన్ సైంధవ్‌ కి పెట్టే ఇబ్బందులు, వాటిని తట్టుకొని సైంధవ్‌ ఎలా నిలబడ్డాడు అని ఫుల్ యాక్షన్ మోడ్ లో సాగుతుంది. చివరి ఇరవై నిమిషాలు ఓ పక్క పిల్లల ఎమోషన్ చూపిస్తూనే మరో పక్క స్టైలిష్ యాక్షన్ సీన్స్ సాగుతాయి. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు శైలేష్‌ కొలను(Sailesh Kolanu) చాలా రొటిన్‌ కథను తీసుకున్నారు. 'సైంధవ్‌' సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడో  చూసిన భావన కలుగుతుంది. కమల్‌హాసన్‌ 'విక్రమ్‌', రజనీకాంత్‌ 'జైలర్‌' సినిమాను మళ్లీ చూస్తున్న ఫీలింగ్‌ వస్తుంది. కథ, కథనం కంటే కూడా వెంకటేష్, నవాజుద్దీన్ క్యారెక్టర్లపైనే డైరెక్టర్‌ ఎక్కువగా దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది. ఆర్య, ముఖేష్‌ రుషి, రుహానీ శర్మ వంటి స్టార్‌ నటులు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిదీ రొటిన్‌ పాత్రలాగే తీర్దిదిద్దారు డైరెక్టర్‌. సన్నివేశాల మధ్య కనెక్షన్‌ ఉండదు. దీని వల్ల ప్రేక్షకులు కథతో ప్రయాణం చేయడంలో ఇబ్బంది ఎదురువుతుంది.. అయితే యాక్షన్‌ సన్నివేశాల్లో మాత్రం శైలేష్‌ తన మార్క్‌ను చూపించాడు. వెంకీ మామ చేత విశ్వరూపాన్ని చూపించేశారు. ఓవరాల్‌గా యాక్షన్‌ ప్రియులను ఈ సినిమా ఆకట్టుకుంటుంది. కథ, లాజిక్‌ పక్కన పెడితే సైంధవ్‌ మెప్పిస్తాడు. సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. సంతోష్ నారాయణ్‌ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో, బుజ్జికొండవే సాంగ్‌లో మ్యూజిక్ మనసుకి హత్తుకుంటుంది. మిగిలిన పాటలు మాత్రం పర్వాలేదనిపిస్తాయి. మణికందన్ సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్‌గా అనిపించింది. వెంకీ మామని చాలా స్టైలిష్‌గా చూపించారు. చంద్రప్రస్థ అనే ఊరిని, సముద్రం లొకేషన్స్, పోర్ట్.. అన్నిటిని చాలా చక్కగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ వెంకటేష్‌ నటనభావోద్వేగ సన్నివేశాలుసంగీతం మైనస్‌ పాయింట్స్‌ కొత్తదనం లేని కథలాజిక్‌కు అందని సీన్స్‌ రేటింగ్‌: 3/5
    జనవరి 13 , 2024
    <strong>Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?</strong>
    Boxoffice Collections: అమరన్, లక్కీ భాస్కర్‌, ‘క’ చిత్రాల్లో&nbsp; దీపావళి విన్నర్ ఎవరంటే?
    దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా విడుదలతోనే మంచి క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే కథాంశం, దుల్కర్ సల్మాన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా చేసింది. లక్కీ భాస్కర్ మూవీ వసూళ్లు(Lucky Baskar Movie collections) మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 26.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి యూనానిమస్ హిట్‌గా నిలిచింది. దీపావళికి విడుదలైన తెలుగు సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమా స్క్రీన్‌ప్లే, దుల్కర్ సల్మాన్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఈ సినిమా విజయంలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ కూడా కీలక పాత్ర పోషించింది.&nbsp; కాగా ఈ సినిమాను నాగవంశీ మరియు సాయి సౌజన్య&nbsp; ప్రొడ్యూస్ చేశారు. తొలి రెండు రోజుల్లో మంచి వసూళ్లు సాధించడంతో.. వీకెండ్‌లో మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే…భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది&nbsp; కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి అమరన్ మూవీ వసూళ్లు (Amaran movie collections) ఇక తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘అమరన్’ కూడా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రూపొందించబడింది, ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విడుదలకు ముందే ఈ సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడగా, తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 42.3 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి భారీ విజయాన్ని సాధించింది.&nbsp; తెలుగులోనూ ఈ చిత్రం డీసెంట్ వసూళ్లు రాబట్టింది.&nbsp; రెండు రోజుల్లో ఈ చిత్రం రూ.4.34 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్‌కి మరో రూ.0.66 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. తెలుగులో అమరన్ చిత్రం రూ.4.45 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ దాటాలంటే రూ.5 కోట్ల వరకు వసూళ్లు రావాలి. వీకెండ్‌లో ఈ టార్గెట్‌ను ఈజీగా క్రాస్ చేసే అవకాశం ఉంది. &nbsp;ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు. కమల్ హాసన్ నిర్మించిన ఈ చిత్రానికి జివి. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడిగా జీవితాన్ని గడపాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు అనేది మిగతా కథ. ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి “క” సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు(KA Movie Collections) కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో, నయన్ సారిక మరియు తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించిన పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘క’ చిత్రం కూడా దీపావళి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మొదటిరోజే రూ. 6.18 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్ రికార్డ్‌ను సృష్టించింది. సినిమాకు అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ అవుతుండగా, రెండో రోజున కూడా మంచి వసూళ్లు సాధించింది. మొదటి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 13.11 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం ఈ సినిమా ఫైనల్ కలెక్షన్లు సుమారు రూ. 30 కోట్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే… అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది.&nbsp; చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు? అనేది మిగతా కథ. &nbsp;ఈ సినిమా పూర్తి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ దీపావళి టాలీవుడ్ బాక్సాఫీస్‌ను ప్రభావితం చేసిన ఈ మూడు చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కలెక్షన్ల పరంగా సత్తా చాటుతున్నాయి.
    నవంబర్ 02 , 2024
    <strong>Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!</strong>
    Sreeleela: అల్లు అర్జున్‌పై శ్రీలీల కామెంట్స్ వైరల్!
    నితిన్ (Nithiin), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం 'రాబిన్‌ హుడ్‌' (Robinhood). యంగ్‌ డైరెక్టర్‌ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ క్రమంలో తాజాగా ఫస్ట్‌ సింగిల్‌ 'లుక్‌ ఇస్తే చాలే చాలు.. లక్కీగా ఫీలవుతాను' పాటను రిలీజ్‌ చేశారు. అనంతరం నిర్వహించిన ప్రెస్‌ మీట్‌లో నటి శ్రీలీల మాట్లాడారు. 'పుష్ప 2'లో చేసిన ‘కిస్సిక్‌’ పాటతో పాటు అల్లు అర్జున్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'అల్లు అర్జున్‌.. కింగ్‌ ఆఫ్‌ డ్యాన్స్‌' యంగ్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela)కు డ్యాన్సింగ్‌ క్వీన్‌గా పేరొంది. ఆమె నటించిన పాత్రల కంటే వేసిన స్టెప్పులే టాలీవుడ్‌లో ఎక్కువ క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. ఈ క్రమంలోనే 'పుష్ప 2'లోని కిస్సిక్‌ ఐటెం సాంగ్‌ కూడా ఆమెను వరించింది. ఇదిలా ఉంటే 'రాబిన్‌ హుడ్‌' సినిమా ఈవెంట్‌లో ఓ విలేఖరి మీ దృష్టిలో డ్యాన్సింగ్‌ కింగ్‌ ఎవరు? అని శ్రీలీలను ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ఇచ్చేందుకు తొలుత శ్రీలీల తటపటాయించింది. అప్పుడు వెంటనే పక్కనే ఉన్న హీరో నితిన్‌ గుడ్‌ క్వశ్చన్ అంటూ వ్యాఖ్యానించాడు. అప్పుడు శ్రీలీల నవ్వుతూ 'మనం ఇద్దరం ఒకే టీమ్ అండి.. గుడ్ క్వశ్చన్‌ అంట పక్క నుంచి' అని అన్నది. ఆ తర్వాత సమాధానం దాటేస్తుండగా నితిన్‌ కలుగచేసుకొని విలేఖరి అడిగిన ప్రశ్నను తిరిగి రిపీట్‌ చేశాడు. దీంతో 'ఇప్పటివరకూ చూసిన వారిలో బన్నీ గారు అండి. బన్నీ గారు ఈజ్‌ డ్యాన్సింగ్‌ కింగ్‌ ' అని శ్రీలీల ఆన్సర్ ఇచ్చింది. దీంతో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1861678559686689235 ‘ఎన్నో ఐటెం సాంగ్స్‌ రిజెక్ట్‌ చేశా’ 'పుష్ప 2' సినిమాలో ‘కిస్సిక్’ అనే ఐటెం సాంగ్‌ చేయడానికి కారణాన్ని కూడా శ్రీలీల (Sreeleela) వివరించింది. ఈ ప్రశ్నకు సమాధానం ఆ సాంగే చెబుతుందని అన్నారు. ఇది యావరేజ్‌ ఐటెం సాంగ్‌ కాదని ఆమె శ్రీలీల పేర్కొంది. ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్‌ చేయాలని అడిగారని కానీ తాను అంగీకరించలేదని చెప్పింది. అయితే ‘కిస్సింగ్‌’ సాంగ్‌ చేయడానికి ఒక స్ట్రాంగ్‌ రీజన్ ఉందని ఆమె స్పష్టం చేసింది. డిసెంబర్‌ 5న మీకు సమాధానం దొరుకుతుందని ఆమె చెప్పింది. ఇక శ్రీలీల నటనను డ్యాన్స్‌ డామినేట్‌ చేస్తుందా? అని మరో విలేఖరి ప్రశ్నంచగా అందుకు ఆమె నిజమే అని సమాధానం చెప్పారు. ప్రస్తుతం పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నానని, అందుకే ఈ ఏడాది సినిమాలకు గ్యాప్‌ తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం మంచి స్క్రిప్ట్‌లపై ఫోకస్‌ చేస్తున్నట్లు చెప్పింది. రాబిన్‌ హుడ్‌ సినిమా నటన పరంగా తనకు సంతృప్తి ఇచ్చిందని తెలిపింది.&nbsp; https://twitter.com/i/status/1861653446795169936 https://twitter.com/i/status/1861679449458229501 శ్రీలీల రెమ్యూనరేషన్‌పై క్లారిటీ రాబిన్‌ హుడ్‌ ప్రెస్‌ మీట్‌లో ‘పుష్ప 2’ ఐటెం సాంగ్ రెమ్యూనరేషన్‌ పైనా ప్రశ్న ఎదురైంది. ఈ ఐటమ్‌ సాంగ్‌ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్‌ తీసుకుందని సోషల్‌ మీడియా కోడై కూస్తోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ పాటకు అంతే మొత్తంలో డిమాండ్‌ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. తాజాగా ఈ పుకారుపై శ్రీలీలతో పాటు నిర్మాతలు స్పందించారు. ‘కిస్సిక్‌’ సాంగ్‌ కోసం సినిమా స్థాయిలో రెమ్యునరేషన్‌ తీసుకున్నారట కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా ‘ఇప్పటి వరకు రెమ్యునరేషన్‌ మ్యాటరే మా మధ్య జరగలేదని శ్రీలీల, నిర్మాతలు చెప్పుకొచ్చారు. ‘అంత ఇంత అని ఏమి అనుకోలేదు. అవకాశం వచ్చింది చేసేశా. ఇంకా డబ్బుల గురించి మాట్లాడలేదు’ అని శ్రీలీల అన్నారు. నిర్మాత నవీన్‌ యేర్నెని మాట్లాడుతూ ‘రెమ్యునరేషన్‌ టాపికే శ్రీలీల తీయలేదు. మీరు అనుకున్నంత రెమ్యునరేషన్‌ అయితే ఇవ్వలేదు’ అని క్లారిటీ ఇచ్చారు. https://twitter.com/i/status/1861684691021242731
    నవంబర్ 27 , 2024
    <strong>Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది</strong>
    Anil Ravipudi: తెలియక రియల్ గన్ గురిపెట్టా.. తృటిలో తప్పింది
    దిగ్గజ నటుడు వెంకటేష్‌ (Venkatesh) హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) రూపొందిస్తున్న చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam). ఇందులో వెంకీకి జోడీగా యంగ్‌ హీరోయిన్‌ మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటిస్తోంది. ఐశ్వర్య రాజేష్‌ (Aishwarya Rajesh) కూడా రెండో హీరోయిన్‌గా అలరించనుంది. ఈ చిత్రానికి దిల్‌ రాజు సమర్పులు వ్యవహరిస్తున్నారు. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం ఓ ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ క్రమంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి షూటింగ్ సమయంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ‘తెలియక రియల్‌ గన్‌ గురిపెట్టా’ ‘బీస్ట్’ సినిమాలో ‘ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావు’ అనే ఒక్క డైలాగ్‌తో తమిళ నటుడు వీటీవీ గణేష్‌ (VTV Ganesh) తెలుగు ప్రేక్షకుల అభిమాన యాక్టర్‌గా మారిపోయారు. ప్రస్తుతం వెంకటేష్‌ చేస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) మూవీలోనూ ఆయన ఓ కీలక పాత్ర పోషించారు. తాజా ప్రెస్‌మీట్‌ నేపథ్యంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వీటీవీ గణేష్‌తో సెట్‌లో జరిగిన ఇంట్రెస్టింగ్‌ ఘటనను పంచుకున్నారు. ‘గణేష్‌ గారు నీకు రియల్‌ గన్‌ తెలుసా? అంటూ ప్రశ్నించారు. అప్పుడు సెట్‌లో ఉన్న నరేష్‌ గారు తన వద్ద ఉన్న లైసెన్స్‌డ్‌ గన్‌ తెప్పించారు. ఆ గన్‌ను గణేష్‌కు పాయింట్‌ బ్లాంక్‌లో గురి పెట్టగానే నరేష్‌ కంగారు పడ్డారు. వెంటనే గన్‌ నుంచి బుల్లెట్స్‌ తీశారు. అది జస్ట్‌ ఇలా టచ్‌ చేస్తే బుల్లెట్లు దూసుకు వస్తాయని నరేష్‌ చెప్పారు. ఆ చిన్న గన్ రియల్‌ గన్‌ అని తెలియక గణేష్‌ తలకు గురిపెట్టా. తృటిలో పెను ప్రమాదం తప్పింది. మీకు చాలా ఫ్యూచర్ ఉంది గనుకే ఆ రోజు తప్పించుకున్నారు' అంటూ గణేష్‌ను ఉద్దేశించి చెప్పారు. ఇలాంటి ఫన్నీ ఘటనలు షూటింగ్‌లో చాలానే జరిగాయని అనిల్‌ రావిపూడి తెలిపారు.&nbsp; https://twitter.com/i/status/1859203309460242668 'అప్పుడే పరిశ్రమ బాగుంటుంది' ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రెస్‌మీట్‌లో హీరో వెంకటేష్‌ (Venkatesh)కూడా మాట్లాడారు. సంక్రాంతికి రిలీజ్‌ చేయాలన్న లక్ష్యంతోనే ఈ సినిమా (Sankranthiki Vasthunnam)ను మెుదలుపెట్టినట్లు తెలిపారు. అనుకున్నట్లుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చెప్పారు. అభిమానులు, కుటుంబ ప్రేక్షకులకు తప్పకుండా ఈ సినిమా (సంక్రాంతికి వస్తున్నాం) నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. పండగకి ఒక అద్భుతమైన సినిమా చూస్తారని ప్రేక్షకులకు చెప్పారు. ఈ సారి రామ్‌చరణ్‌ ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer), బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ (Daku Magaraj) కూడా విడుదలవుతున్నాయని, అవి కూడా మంచి విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షించారు. అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుందని వెంకటేష్‌ అభిప్రాయపడ్డారు. సీనియర్‌ నటుడు నరేష్‌ (Naresh) మాట్లాడుతూ ఇండియాలో ఎలాంటి క్యారెక్టర్ అయిన చేయగల యాక్టర్‌ వెంకటేష్ అని కొనియాడారు.&nbsp; https://twitter.com/i/status/1859532368333373653 https://twitter.com/i/status/1859206087821737998 సంక్రాంతికి హ్యాట్రిక్‌ చిత్రాలు! 2025 సంక్రాంతి నిర్మాత దిల్‌రాజు ఎంతో కీలకం కాబోతోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సహా ఆయన నుంచి ఏకంగా మూడు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవబోతున్నాయి. రామ్‌చరణ్‌ (Ram Charan) హీరోగా తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ (Director Shankar) రూపొందిస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ (Game Changer)కు దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2025 జనవరి 10న వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అలాగే బాలకృష్ణ హీరోగా దర్శకుడు బాబీ రూపొందిస్తున్న ‘డాకు మహారాజ్‌’ (Daku Maharaj) కూడా సంక్రాంతికే రానుంది. ఈ మూవీని కూడా తామే డిస్ట్రిబ్యూట్‌ చేయబోతున్నట్లు తాజా ప్రెస్‌మీట్‌లో దిల్‌రాజు తెలిపారు. ఈ మూడు చిత్రాలు పెద్ద విజయాలు సాధిస్తాయని దిల్‌రాజు ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో దర్శకుడు అనిల్‌ రావిపూడి గురించి ఫన్నీ కామెంట్స్‌ చేశారు. గేమ్‌ ఛేంజర్‌ నేపథ్యంలో సంక్రాంతికి ఎక్కడ సైడ్‌ చేస్తారోనని భావించి తెలివిగా ఈ సినిమాకు ‘సంక్రాంతి వస్తున్నాం’ అనే టైటిల్‌ను అనిల్‌ పెట్టారని వ్యాఖ్యానించారు.&nbsp; https://twitter.com/i/status/1859522147229573619 70% థియేటర్లు దిల్‌రాజుకే! 2025 సంక్రాంతికి రెండు చిత్రాలను నేరుగా రిలీజ్‌ చేస్తుండటంతో పాటు మరో సినిమా థియేట్రికల్‌ హక్కులను దక్కించుకోవడంతో దిల్‌రాజుకు థియేటర్లు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటి నుంచే దిల్‌రాజు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లతో సంప్రదింపులు జరిపి తమ చిత్రాన్ని థియేటర్లో ప్రసారం చేసేలా ఆయన అడుగులు వేస్తున్నట్లు ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సంక్రాంతి నేపథ్యంలో ఇప్పటికే 70 శాతం థియేటర్లు దిల్‌రాజు ఖాతాలోకి వెళ్లిపోయాయని స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. మిగిలిన చిత్రాలు రీమైనింగ్ 30 శాతం థియేటర్లతో సర్దుకోవాల్సి ఉంటుందనిఅంటున్నారు. ప్రస్తుతానికి ఇది ప్రచారమే అయినప్పటికీ త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp;
    నవంబర్ 21 , 2024
    <strong>Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?&nbsp;</strong>
    Ravi Teja: బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టిన రవితేజ... ఎలాగంటే?&nbsp;
    టాలీవుడ్‌కు చెందిన స్టార్‌ హీరోల్లో మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) ఒకరు. ‘ఇడియట్‌’, ‘భద్ర’, ‘వెంకీ’, ‘విక్రమార్కుడు’, ‘కిక్‌’, ‘మిరపకాయ్‌’, ‘పవర్‌’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘రాజాది గ్రేట్‌’ వంటి బ్లాక్‌బాస్టర్‌ తీసిన రవితేజ గత కొన్నేళ్లుగా టాలీవుడ్‌లో కలిసి రావడం లేదు. ఇటీవల ధమకా, ఈగల్‌ చిత్రాలతో పర్వాలేదనిపించినా రవితేజ స్థాయికి తగ్గ సక్సెస్ మాత్రం అవి ఇవ్వలేకపోయాయి. ఇక రీసెంట్‌గా మిస్టర్‌. బచ్చన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చి దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నాడు. వరుస ఫ్లాప్స్‌ వెంటాడుతుండటంతో ఈ మాస్‌ మహారాజ్‌ డేరింగ్‌ స్టెప్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. మలయాళంలో మంచి విజయం సాధించిన ఓ సినిమాను రీమేక్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.&nbsp; ‘ఆవేశం’ రీమేక్‌లో రవితేజ! మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రధాన పాత్రలో జీతూ మాధవన్‌ రూపొందించిన చిత్రం 'ఆవేశం' (Aavesham). యాక్షన్‌, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఆవేశం ఈ ఏడాదే రిలీజై మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్‌ వద్ద రూ.150 కోట్లకు పైగా వసూలు చేసింది. అయితే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారని గత కొంతకాలంగా టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. లేటెస్ట్ బజ్‌ ప్రకారం మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja) ఈ సినిమా రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. రవితేజ స్వయంగా ఈ సినిమా రైట్స్‌ దక్కించుకోవడంతో ఆయనే ఇందులో నటిస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. రవితేజ సొంత నిర్మాణ సంస్థలోనే ఈ సినిమా రావొచ్చని అంటున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. దీంతో రవితేజ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అవుతున్నారు.&nbsp; బాలయ్యను కాదని.. ‘ఆవేశం’ చిత్రాన్ని నందమూరి బాలకృష్ణ (Balakrishna) తెలుగులోకి రీమేక్‌ చేస్తారని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇందులో ఫహాద్ ఫాజిల్‌ పోషించిన పాత్ర బాలయ్యకు బాగా సెట్ అవుతుందని కూడా ప్రచారం జరిగింది. అటు నందమూరి ఫ్యాన్స్ సైతం ‘ఆవేశం’ చిత్రాన్ని బాలయ్య ఖాతాలోనే వేసుకున్నారు. అయితే అనూహ్యంగా బాలయ్యను కాదని మాస్ మాహారాజా రవితేజ ఈ ప్రాజెక్ట్‌ను దక్కించుకున్నారు. తద్వారా బాలయ్య ఫ్యాన్స్‌కు మస్కా కొట్టారు. అయితే రవితేజకు కూడా ఫహాద్‌ ఫాజిల్‌ పాత్ర సెట్ అవుతుందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు. ఆ పాత్రలోని డిఫరెంట్‌ షేడ్స్‌ను రవితేజ (Ravi Teja) చక్కగా పలికిస్తారని అంటున్నారు. మరి ఈ రీమేక్ ప్రాజెక్ట్‌కు ఎవరు దర్శకత్వం వహిస్తారన్నది ప్రస్తుతం ఆసక్తిరేపుతోంది.&nbsp; ఫ్లాప్స్‌ బెడద తట్టుకోలేకనే! ఒకప్పుడు మంచి హిట్స్‌తో ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసిన రవితేజ (Ravi Teja) ప్రస్తుతం వరుస ఫ్లాప్స్‌తో పూర్తిగా డీలా పడ్డారు. ఆయన చేసిన గత పది చిత్రాల్లో కేవలం ఒకే ఒక్క చిత్రం (క్రాక్‌) సూపర్‌ హిట్‌గా నిలిచింది. మరో రెండు చిత్రాలు (ధమకా, ఈగల్‌) యావరేజ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. మిగిలిన ఏడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా విఫలమయ్యాయి. రీసెంట్‌గా వచ్చి ‘మిస్టర్ బచ్చన్‌’ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. మిస్టర్‌ బచ్చన్‌ ఫ్లాప్‌తో రవితేజపై కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్‌, విమర్శలు వచ్చాయి. వయసుకు తగ్గ పాత్రలు చేయట్లేదని, కథ కంటే తనలో సగం ఏజ్‌ ఉన్న హీరోయిన్స్‌తో ఘాటు రొమాన్స్ చేయడానికే రవితేజ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారని నెటిజన్లు మండిపడ్డారు. దీంతో ఆలోచనలో పడ్డ రవితేజ ఈసారి ఎలాగైన హిట్‌ కొట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సేఫ్‌ జోన్‌గా మలయాళం మంచి విజయం సాధించిన ‘ఆవేశం’ను రీమేక్ చేస్తే బాగుంటుందని ఆయన భావించినట్లు సమాచారం.&nbsp; మరి ‘ఆవేశం’ సెట్ అవుతుందా? ‘ఆవేశం’ ఓ వైవిధ్యమైన కథ. ఓ ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు, తమ సీనియర్లను కొట్టించడానికి లోకల్‌ గ్యాంగ్‌స్టర్‌ అయిన రంగా (ఫహద్‌ ఫాజిల్‌)ను ఆశ్రయిస్తారు. ఆ క్రమంలో రంగాకి, విద్యార్థులకి మంచి స్నేహం ఏర్పడుతుంది. అయితే ఓ దశ దాటిన తర్వాత రంగా క్యారెక్టర్‌ కారణంగా ముగ్గురు విద్యార్థులు చిక్కుల్లో పడతారు. తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా వుంటుంది. ముఖ్యంగా ఫహద్‌ ఫాజిల్‌ క్యారెక్టరైజేషన్‌ ఈ కథలో స్పెషల్‌ ఎట్రాక్షన్‌. తెలుగులో ఆ క్యారెక్టర్‌ సీనియర్‌ నటులు ఎవరు చేసినా బాగానే ఉంటుంది. అందుకే మెుదటి బాలయ్య పేరు తెరపైకి వచ్చింది. అయితే ఇప్పుడు రవితేజ (Ravi Teja) పేరు తెరపైకి రావడంతో అతడికి ఎలా ఉంటుందన్న సందేహం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం లేకుండా రవితేజ చేయవచ్చు. ఎందుకంటే కామెడీ, యాక్షన్‌, అగ్రెషన్‌ ఇలా అన్ని షేడ్స్‌ రంగా పాత్రలో ఉన్నాయి. దీనికి రవితేజ పూర్తిగా న్యాయం చేస్తాడని చెప్పవచ్చు.&nbsp;
    నవంబర్ 06 , 2024
    <strong>Diwali Movies Weekend Collections: దీపావళి చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. ఏకైక చిత్రంగా ఆ మూవీ రికార్డ్‌!</strong>
    Diwali Movies Weekend Collections: దీపావళి చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. ఏకైక చిత్రంగా ఆ మూవీ రికార్డ్‌!
    దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పలు చిత్రాలు విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా ‘లక్కీభాస్కర్‌’ (Lucky Bhaskar), ‘క’ (KA), ‘అమరన్‌’ (Amaran) చిత్రాలు మంచి హిట్‌ టాక్‌ సొంతం చేసుకున్నాయి. అంతేకాకుండా బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సైతం సాధిస్తున్నాయి. తొలి రోజు సాలిడ్‌ కలెక్షన్స్‌ రాబట్టిన ఈ మూడు చిత్రాలు వీకెండ్‌కు వచ్చే సరికి తమ వసూళ్లను గణనీయంగా పెంచుకున్నాయి. తొలి నాలుగు రోజుల్లో ఏ మూవీ, ఎంత వసూలు చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar Weekend Collections) మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ‘లక్కీ&nbsp; భాస్కర్‌’ (Lucky Bhaskar) చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. దీపావళి కానుకగా గురువారం (అక్టోబర్‌ 31) రిలీజైన ఈ మూవీ తొలి నాలుగు రోజుల్లో రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వీకెండ్‌ పూర్తయ్యేసరికి రూ.55.4 కోట్ల (GROSS) కలెక్షన్స్‌ను 'లక్కీ భాస్కర్‌' రాబట్టినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు హీరో, దర్శకుడితో పాటు నిర్మాత నాగవంశీ ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను మూవీ టీమ్‌ రిలీజ్‌ చేసింది. ట్రేడ్‌ వర్గాల విశ్లేషణల ప్రకారం ఒక్క ఏపీ, తెలంగాణల్లోనే ఈ చిత్రం రూ.19.10 కోట్లు (GROSS) రాబట్టింది. కేరళలో రూ.8.75 కోట్లు, కర్ణాటకలో రూ. 2.65 కోట్లు, తమిళనాడులో రూ. 3.40 కోట్లు, రెస్ట్‌ ఆఫ్‌ ఇండియాలో రూ.95 లక్షలు, ఓవర్సీస్‌లో రూ.13.40 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు వివరించాయి. క (KA Weekend Collections) టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ ‘క’ (KA Movie). అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి షోతోనే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. గురువారం ఈ మూవీ రిలీజవ్వగా శని, ఆదివారాల్లో కలెక్షన్స్ మరింత పెరిగినట్లు సమాచారం. తొలి నాలుగు రోజుల్లో రూ.26.52 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. అటు తొలి మూడు రోజుల్లోనే ‘క’ చిత్రం బ్రేక్‌ ఈవెన్‌ సాధించినట్లు ఫిల్మ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇకపై వచ్చేవన్ని లాభాలే అంటూ తెలిపాయి. అంతేకాదు రోజురోజుకు ఈ మూవీ కలెక్షన్స్ మరింత పెరుగుతున్నాయని సంతోషం వ్యక్తం చేసింది.&nbsp; అమరన్‌ శివ కార్తికేయన్ (Sivakarthikeyan) సాయిపల్లవి (Sai Pallavi) కాంబోలో తెరకెక్కిన ‘అమరన్’ (Amaran Movie) పాన్‌ ఇండియా స్థాయిలో అదరగొడుతోంది. అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చితక్కొడుతోంది. తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ.136 కోట్ల (GROSS) వసూళ్లు సాధించినట్లు ట్రెడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ. 65.05 కోట్లు రాబట్టినట్లు పేర్కొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రూ.15.45 కోట్లు, కర్ణాటకలో రూ.8.05 కోట్లు, కేరళలో రూ.4.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.15 కోట్లు ఖాతాలో వేసుకున్నట్లు వివరించాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ.41.85 రాబట్టినట్లు స్పష్టం చేశాయి. రానున్న రోజుల్లో కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీపావళికి రిలీజైన చిత్రాల్లో ప్రస్తుతం రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక చిత్రంగా ‘అమరన్’ నిలిచింది.&nbsp;
    నవంబర్ 04 , 2024
    <strong>Lucky Baskhar Review: మధ్యతరగతి ఆశల్ని మోసిన లక్కీ భాస్కర్… సినిమా ఎలా ఉందంటే?</strong>
    Lucky Baskhar Review: మధ్యతరగతి ఆశల్ని మోసిన లక్కీ భాస్కర్… సినిమా ఎలా ఉందంటే?
    సినిమా: లక్కీ భాస్కర్నటీనటులు: దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, రాంకీ, మానస చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్ మరియు ఇతరులుసంగీతం: జీవీ ప్రకాశ్ కుమార్ఎడిటింగ్: నవీన్ నూలిసినిమాటోగ్రఫీ: నిమేశ్ రవినిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యరచన, దర్శకత్వం: వెంకీ అట్లూరివిడుదల తేదీ: అక్టోబర్ 31, 2024 ఈ దీపావళికి ముందు పండగ సందడి తెచ్చిన చిత్రం ‘లక్కీ భాస్కర్.’ పాన్ ఇండియా స్థాయి చిత్రంగా, దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దుల్కర్ - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రత్యేకతలు ఏమిటి? ఈ కథలో హీరో లక్కీ అవుతాడా? అన్నది తెలుసుకుందాం. కథ భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు అనేది&nbsp; కథ. సినిమా ఎలా ఉందంటే? చాలా కాలం తర్వాత బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్ నేపథ్యంపై ఓ తెలుగు సినిమా తెరపై ఆవిష్కరించబడింది. 90ల్లో భారత ఆర్థిక వ్యవస్థకు ముడి పడిన హర్షద్ మెహతా కుంభకోణం కథకు కీలకమైన అంశం. దర్శకుడు వెంకీ అట్లూరి సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను, వారి ఆర్థిక చిత్తశుద్ధిని మిళితం చేస్తూ ఈ కథను ఆవిష్కరించారు. కథలోని మలుపులు మరియు పాత్రలు ప్రేక్షకుల హృదయానికి చేరువగా ఉంటాయి. మొదటగా భాస్కర్ కుటుంబం ఎదుర్కొంటున్న కష్టాలను, అతనికి జరిగిన అవమానాలను కథలో భాగంగా చూపించడం, ఆ తర్వాత అతను కష్టాల్ని దాటుకునేందుకు చేసిన ప్రయత్నాలు అతినికి జీవితంపై నమ్మకాన్ని కలిగిస్తాయి. భాస్కర్ చేసే రిస్క్, దాని వల్ల ఎదురయ్యే సమస్యలు, వాటిని ఎదుర్కొంటూ తన తెలివితేటలతో బతికే విధానం ప్రేక్షకులను థ్రిల్‌కి గురిచేస్తుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు, ప్రథమార్ధంలో భాస్కర్ పడ్డ చిక్కులు ఆకట్టుకుంటాయి. కానీ, రెండవ అర్ధభాగం లో కొన్ని సన్నివేశాలు కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటాయి. స్టాక్ మార్కెట్, షేర్ల వంటి అంశాలు సాధారణ ప్రేక్షకులకు అంత సులభంగా అర్థం కావు. భాస్కర్ జీవితంలో వచ్చిన మార్పు, కుటుంబ సమస్యలను పరిష్కరించాలనే తీరు ఆకర్షిస్తుంది. ఎవరెలా చేశారంటే? భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ అద్భుతంగా నటించాడు. అతని అభినయం, మధ్య తరగతి వ్యక్తిగా పాత్రలో జీవించడం మంచి అనుభూతినిస్తుంది. సుమతిగా మీనాక్షి చౌదరి తన పాత్రలో నిజాయితీని చూపించింది. రాంకీ, సచిన్ ఖేడేకర్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికత సాంకేతికంగా, చిత్రం ఉన్నతంగా ఉంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం సినిమాకి కీలకంగా నిలిచింది. అతని నేపథ్య సంగీతం కథకు హైప్ ఇచ్చింది. నిమేశ్ రవి ఛాయాగ్రహణం సినిమా వాతావరణాన్ని 90 వ దశకానికి తీసుకెళ్తుంది.&nbsp; వెంకీ అట్లూరి రచన, పాత్రల అభివృద్ధిలో చూపించిన నైపుణ్యం, కథా మలుపుల నిర్వహణ సినిమాను ప్రత్యేకంగా నిలబెడతాయి. 90ల కాలంలో ముంబై వాతావరణాన్ని ప్రతిబింబించడానికి రాజీ లేకుండా నిర్మాణ విలువలను ప్రదర్శించారు. బలాలు బలమైన కథ దుల్కర్ సల్మాన్ నటన నేపథ్య సంగీతం, ట్విస్టులు బలహీనతలు సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు చివరగా ‘లక్కీ భాస్కర్’ ఒక ఆకట్టుకునే కథా నేపథ్యంతో, స్మార్ట్ థ్రిల్లర్. భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆకట్టుకుంటూ, ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు మంచి అనభూతి పంచాడు. కథలో అనేక ట్విస్టులు, ముఖ్యంగా క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంటుంది. రెండవ అర్ధభాగంలో కొన్ని సన్నివేశాలు కొంచెం నెమ్మదించినప్పటికీ, కథనం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఆసక్తికరమైన పాత్రలు సినిమాని ప్రేక్షకుల మనసుకు దగ్గర చేస్తాయి. రేటింగ్: 4/5
    నవంబర్ 01 , 2024
    <strong>OTT Releases Telugu: దీపావళి కానుకగా రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    OTT Releases Telugu: దీపావళి కానుకగా రాబోతున్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    ఈ వారం దీపావళి (Diwali Festival)ని పురస్కరించుకొని పలు కొత్త చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. మీ ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు రెడీ అవుతున్నాయి. వెలుగుల పండగ సందర్భంగా ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచేందుకు తాము సిద్ధమంటున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు క కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా సుజిత్‌ - సుదీప్‌ సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘క’ (KA Movie). నయన సారిక, తన్వీ రామ్‌ హీరోయిన్లుగా నటించారు. అక్టోబర్‌ 31న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఇందులో కిరణ్ అబ్బవరం పోస్టుమ్యాన్‌ పాత్రలో నటించాడు. ఇటీవల విడుదలై ‘క’ ట్రైలర్‌ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసింది.&nbsp; లక్కీ భాస్కర్‌ మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) హీరోగా వెంకీ అట్లూరి (Venky Atluri) దర్శకంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం 'లక్కీ భాస్కర్' (Lucky Bhaskar).&nbsp; మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. ఒక సాధారణ ఉద్యోగి కోటీశ్వరుడిగా ఎలా మారాడు అన్న ఆసక్తికర కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు మేకర్స్ తెలిపారు. సింగమ్‌ అగైన్‌ భారీ అంచనాలతో దీపావళి కానుకగా రాబోతున్న బాలీవుడ్‌ చిత్రం ‘సింగమ్‌ అగైన్‌’ (Singam Again). డీసీపీ బాజీరావు సింగమ్‌గా అజయ్‌ దేవ్‌గన్‌ నటించాడు. నవంబర్‌ 1న ఈ చిత్రం రిలీజ్‌ కాబోతోంది. ఇందులో అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌, రణ్‌వీర్‌సింగ్‌, కరీనా కపూర్‌, దీపికా పదుకొణె లాంటి స్టార్‌లు నటించడంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.&nbsp; అమరన్‌ తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'అమరన్‌' (Amaran). ఉగ్రదాడిలో మరణించిన ఆర్మీ ఉద్యోగి మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. దిగ్గజ నటుడు కమల్‌ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. రాజ్‌కుమార్‌ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్‌ కాబోతోంది.&nbsp; బఘీర స్టార్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ అందించిన కథతో రూపొందిన కన్నడ చిత్రం 'బఘీర' (Bagheera). ఈ చిత్రంలో శ్రీమురళి, రుక్మిణీ వసంత్‌ జంటగా నటించారు. సూరి దర్శకత్వం వహించారు. పాన్‌ ఇండియా స్థాయిలో అక్టోబర్‌ 31న ఈ చిత్రం రిలీజ్‌ కాబోతోంది. ఇటీవల రిలీజైన ట్రైలర్‌ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, సిరీస్‌లు తంగలాన్‌ తమిళ నటుడు చియాన్ విక్రమ్‌ నటించిన రీసెంట్‌ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా 'తంగలాన్‌' (Thangalan). ఆగస్టు 15న తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో రిలీజైన ఈ చిత్రం యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది. చాలా రోజుల జాప్యం తర్వాత ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. అక్టోబర్‌ 31 నుంచి ఈ సినిమాను వీక్షించవచ్చు.&nbsp; మా నాన్న సూపర్‌ హీరో సుధీర్‌బాబు హీరోగా న‌టించిన ‘మా నాన్న సూప‌ర్ హీరో’ (Ma Nanna Super Hero) మూవీ ఈ వారం స్ట్రీమింగ్‌లోకి రానుంది. అక్టోబర్‌ 31 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 వేదికగా ప్రసారం కానుంది. అభిలాష్ కంక‌ర ద‌ర్శ‌కత్వం వహించిన ఈ చిత్రంలో సాయిచంద్‌ షాయాజీ షిండే కీలక పాత్రలు పోషించారు. ఆర్ణ హీరోయిన్‌గా చేసింది. అక్టోబ‌ర్ 11న థియేట‌ర్ల‌లోకి వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. అర్థమైందా అరుణ్‌కుమార్‌ 2 హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్‌ 'అర్ధమయ్యిందా..? అరుణ్‌ కుమార్‌'. సీజన్‌ 1కు విశేష స్పందన రావడంతో సీజన్ 2 (Arthamainda Arun Kumar Season 2)ను అక్టోబర్‌ 31న తీసుకొస్తున్నారు. ఆహాలో ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సిరీస్‌లో పవన్‌ సిద్దు మెయిన్‌ లీడ్‌గా నటించాడు. TitleCategoryLanguagePlatformRelease DateTime Cut&nbsp;MovieEnglishNetflixOct 30Murder MindfullyMovieEnglishNetflixOct 31The Diplomat Season 2&nbsp;SeriesEnglishNetflixOct 31Love Mocktail Season 2SeriesTeluguETV WinOct 31Wizards Beyond Waverly PlaceSeriesEnglishHotstarOct 30Lubber PandhuMovieTelugu DubHotstarOct 31Koshkinda KandamMovieTelugu DubNetflixNov 1Joker: Folie à DeuxMovieEnglishAmazon&nbsp;Oct 29AnjamaiMovieTamilAha&nbsp;Oct 31Somebody Somewhere S3SeriesHindiAmazon&nbsp;Oct 25VettaiyanMovieTelugu/TamilAmazon&nbsp;Nov 7Mithya: The Dark ChapterSeriesTelugu, HindiZee 5Nov 1
    అక్టోబర్ 28 , 2024
    <strong>Vijay Devarakonda: ఈ తరం గొప్ప నటుడు విజయ్ దేవరకొండ: త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్</strong>
    Vijay Devarakonda: ఈ తరం గొప్ప నటుడు విజయ్ దేవరకొండ: త్రివిక్రమ్ కామెంట్స్ వైరల్
    టాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉన్న యంగ్‌ హీరోల్లో ‘విజయ్‌ దేవరకొండ’ (Vijay Devarakonda) ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడ్ని ఫ్యాన్స్‌ అభిమానిస్తుంటారు. ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy), ‘టాక్సీవాలా’ (Taxiwala), ‘గీతాగోవిందం’ (Geetha Govindam) హిట్స్‌తో స్టార్‌ స్టేటస్‌ అందుకున్నాడు. అయితే గత కొంతకాలంగా సరైన హిట్‌ లేక విజయ్‌ ఇబ్బంది పడుతున్నాడు. అతడు చేసిన గత మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ దారుణంగా విఫలమయ్యాయి. దీంతో అతడిపై ట్రోల్స్‌, విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఫిల్మ్ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండపై దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం అది టాలీవుడ్‌తో పాటు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారింది.  ‘ప్రేమతో పాటు ద్వేషమూ చూశాడు’ మ‌లయాళ న‌టుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం 'లక్కీ భాస్కర్‌' (Lucky Bhaskar). వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో తాజాగా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ హాజరయ్యారు. ఈ క్రమంలో త్రివిక్రమ్‌ మాట్లాడుతూ నటుడు విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌పై ప్రశంసలు కురిపించారు. ఈ తరం గొప్పనటులు అంటూ ఆకాశానికెత్తారు. అంతేకాదు తాను అభిమానించే నటుల్లో విజయ్‌ ఒకరని వ్యాఖ్యానించారు. 'విజయ్ ఎంతో ప్రేమ చూశాడు. అంతకంటే రెట్టింపు ద్వేషం కూడా చూసాడు. బాలగంగాధర్ తిలక్ అమృతం కురిసిన రాత్రి న‌వ‌ల‌లో ఒక లైన్ ఉంటుంది. మావాడే మ‌హాగ‌ట్టివాడ‌ని. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు అది వ‌ర్తిస్తుంది. మా వాడు మహా గట్టోడు' అంటూ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.  https://www.youtube.com/watch?v=PhzeAy5OUl8 ‘ఖలేజా బాలేదంటే కొట్లాటే’ ‘లక్కీ భాస్కర్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) సైతం మాట్లాడారు. దర్శకుడు త్రివిక్రమ్‌ గురించి ప్రస్తావిస్తూ క్రేజీ కామెంట్స్ చేశాడు. పెళ్లి చూపులు హిట్ అయిన తర్వాత తన ఫస్ట్‌ చెక్‌ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తరపున త్రివిక్రమ్‌ ఇచ్చినట్లు చెప్పారు. చెక్ ఇస్తూ నువ్వు స్టార్‌ అవుతావని చెప్పారని పేర్కొన్నారు. ఆరోజు త్రివిక్రమ్ గారిని కలవడం తన లైఫ్‌లో ఒక బిగ్ మూమెంట్ అని చెప్పుకొచ్చాడు. ‘మన్మథుడు’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘జల్సా’ చిత్రాలు ఎంత క్రేజ్ సంపాదించుకున్నాయో మన జనరేష్‌కు బాగా తెలుసాని అన్నాడు. అంతేకాదు త్రివిక్రమ్ డైరెక్ట్‌ చేసిన ‘అతడు’, ‘ఖలేజా’ తన ఫేవరేట్స్ అని తెలిపాడు. ‘ఖలేజా’ను ఎవరైనా ఫ్లాప్ అంటే వారితో కొట్లాడేవాడినని వివరించాడు.&nbsp; https://twitter.com/oneindiatelugu/status/1850807211817369676 దుల్కర్‌ - విజయ్‌ మల్టీస్టారర్‌ లక్కీ భాస్కర్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు తన బ్రదర్ దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) కోసం వచ్చానని నటుడు విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) వ్యాఖ్యానించారు. ‘కల్కి’, ‘మహానటి’ సినిమాల్లో తామిద్దరం నటించిన విషయాన్ని గుర్తుచేశాడు. కానీ తమ ఇద్దరి కాంబినేషన్ సీన్స్‌ పడలేదని పేర్కొన్నాడు. గతంలో ఓ డైరెక్టర్ దుల్కర్ తనతో మల్టీస్టారర్‌ చేయాలని భావించినట్లు చెప్పాడు. అప్పుడు చెన్నైలో కలిసి కథ కూడా విన్నట్లు చెప్పాడు. కానీ ఆ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదని పేర్కొన్నాడు. భవిష్యత్‌లో కలిసి సినిమా చేయోచ్చేమే అంటూ ఒక్కసారిగా ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్ చేశాడు. https://twitter.com/ihsan21792/status/1850579970093129862 పెళ్లి చూపులు కాంబో రిపీట్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్ భాస్కర్‌ రూపొందించిన 'పెళ్లి చూపులు' చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఆ మూవీ తర్వాత వీరిద్దరు కలిసి మరో చిత్రం చేయలేదు. ఇప్పుడు అందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లో విజయ్‌ హీరోగా మరో సినిమా రాబోతున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ఇప్పటికే విజయ్‌కు కథ కూడా చెప్పేశాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు రౌడీ బాయ్‌ కూడా ఓకే చెప్పాడని ఫిల్మ్‌ వర్గాల్లో టాక్‌ ఉంది. యాక్షన్‌తో పాటు, తరుణ్‌ స్టైల్‌ ఆఫ్‌ కామెడీతో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. కాగా, విజయ్‌ ప్రస్తుతం ‘VD12’ ప్రాజెక్ట్ చేస్తున్నారు. గౌతం తిన్ననూరి దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.  విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌! ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ‘VD12’తో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌ ఉన్నాయి. ‘ఫ్యామిలీ స్టార్‌’ తర్వాత విజయ్‌తో దిల్‌రాజు మరో చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు ర‌వికిర‌ణ్ కోలా ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అలాగే డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌ దర్శకత్వంలో విజయ్‌ మరో ప్రాజెక్ట్‌ చేయనున్నాడు. పీరియాడికల్‌ జానర్‌లో రాయల సీమ బ్రాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కు జోడీగా రష్మిక మందన్న నటించే అవకాశముంది. తరుణ్‌ భాస్కర్‌ డైరెక్షన్‌లోనూ మూవీ ఉంటుందన్న వార్తల నేపథ్యంలో విజయ్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌పై ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.&nbsp;
    అక్టోబర్ 28 , 2024
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్ గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?
    పాయల్ రాజ్‌పుత్&nbsp; 2017లో పంజాబీ చిత్రం "చన్నా మెరేయా"తో వెండితెరకు పరిచయమైంది. తెలుగులో "RX 100" చిత్రం ద్వారా విస్తృత గుర్తింపు పొందింది. ఈ రెండు చిత్రాలు ఆమెకు మంచి విజయాలను అందించాయి. పాయల్ రాజ్‌పుత్ చాలా తక్కువ వ్యవధిలో అనేక విజయవంతమైన ప్రాజెక్ట్‌లలో భాగం అయ్యింది. "RX 100", "వెంకీ మామ," "RDX లవ్, "మంగళవారం", "తమిళ చిత్రం "ఏంజెల్" వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది.&nbsp; శృంగార తారగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిను పాయల్ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. పాయల్ రాజ్‌పుత్ ముద్దు పేరు? టింకీ పాయల్ రాజ్‌పుత్ ఎప్పుడు పుట్టింది? 1990, డిసెంబర్ 6న జన్మించింది పాయల్ రాజ్‌పుత్ తొలి సినిమా? చన్నా మేరేయా (2017) పాయల్ రాజ్‌పుత్‌కు తెలుగులో తొలి సినిమా? RX 100(2018) పాయల్ రాజ్‌పుత్ ఎత్తు ఎంత? 5 అడుగుల 7అంగుళాలు&nbsp; పాయల్ రాజ్‌పుత్ ఎక్కడ పుట్టింది? ఢిల్లీ పాయల్ రాజ్‌పుత్ ఏం చదివింది? యాక్టింగ్‌లో డిప్లోమా చేసింది పాయల్ రాజ్‌పుత్&nbsp; అభిరుచులు? &nbsp;మోడలింగ్, ట్రావెలింగ్ పాయల్ రాజ్‌పుత్‌కు ఇష్టమైన ఆహారం? బిర్యాని పాయల్ రాజ్‌పుత్‌కి&nbsp; ఇష్టమైన కలర్ ? బ్లాక్, వైట్ పాయర్ రాజ్‌పుత్ తల్లిదండ్రుల పేర్లు? విమల్ కుమార్ రాజ్‌పుత్( అకౌంట్ టీచర్), నిర్మల రాజ్‌పుత్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరో? సల్మాన్ ఖాన్ పాయల్ రాజ్‌పుత్‌కి ఇష్టమైన హీరోయిన్? దీపికా పదుకునే పాయల్ రాజ్‌పుత్ పారితోషికం ఎంత? ఒక్కొ సినిమాకు రూ.60లక్షల నుంచి రూ.80 లక్షల వరకు ఛార్జ్ చేస్తోంది పాయల్ రాజ్‌పుత్&nbsp; ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/rajputpaayal/ పాయల్ రాజ్‌పుత్&nbsp; బాయ్ ఫ్రెండ్? పాయల్ రాజ్‌పుత్ ముంబైకి చెందిన మోడల్ సౌరబ్ డింగ్రాతో డేటింగ్‌లో ఉంది. పాయల్‌కు వచ్చిన అవార్డులు? &nbsp;తెలుగులో "RX 100"చిత్రానికి గాను ఉత్తమ తొలిచిత్ర నటిగా సైమా అవార్డును పొందింది. పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు ఏం చేసేది? పాయల్ రాజ్‌పుత్&nbsp; సినిమాల్లోకి రాకముందు టీవీ సీరియళ్లలో నటించింది. మహాకుంభ్, సప్నోంసే భరె నైనా అనే సీరియళ్లలో పాయల్ నటించింది. https://www.youtube.com/watch?v=jPSBXjYO9uU
    ఏప్రిల్ 08 , 2024
    వెంకటేష్ (Venkatesh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    వెంకటేష్ (Venkatesh) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    తెలుగు ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ చేసిన అరుదైన నటుల్లో వెంకటేష్ ఒకరు. ఆయన నటనతో ప్రేక్షకులకు కంటనీరు తెప్పించిన సందర్భాలెన్నో. విక్టరీని ఇంటిపేరుగా మార్చుకుని ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు ఆయన సొంతం చేసుకున్నారు. ఇటు కుర్ర హీరోలతో మల్టీ స్టారర్ చిత్రాల్లో నటిస్తూ తన తోటి నటులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల చేత్ వెంకీ మామాగా పిలిపించుకుంటున్న వెంకటేష్ గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు తెలుసుకుందాం. వెంకటేష్ ఎవరు? టాలీవుడ్‌లో స్టార్ హీరో అయిన వెంకటేష్ ప్రముఖ నిర్మాత దగ్గుపాటి రామానాయుడి గారు రెండవ కుమారుడు. వెంకటేష్ ముద్దు పేర్లు? విక్టరీ వెంకటేష్, వెంకీ మామా వెంకటేష్ ఎత్తు ఎంత? 5 అడుగుల 11 అంగుళాలు వెంకటేష్ ఎక్కడ పుట్టారు? హైదరాబాద్ వెంకటేష్ పుట్టిన తేదీ ఎప్పుడు? 1960 డిసెంబర్ 13 వెంకటేష్ భార్య పేరు? నీరజ వెంకటేష్- నీరజ దంపతులకు ఎంత మంది పిల్లలు? ముగ్గురు అమ్మాయిలు( ఆశ్రిత, భావన, హయవాహిని), ఒక అబ్బాయి( అర్జున్) వెంకటేష్ అభిరుచులు? క్రికెట్ ఆడటం, చూడటం వెంకటేష్‌కు ఇష్టమైన ఆహారం? కబాబ్స్ అండ్ హలీం వెంకటేష్ అభిమాన నటుడు? కమల్ హాసన్ వెంకటేష్ అభిమాన హీరోయిన్? సౌందర్య వెంకటేష్‌కు స్టార్ డం అందించిన సినిమాలు? ప్రేమించుకుందాం రా, పవిత్ర బంధం, కలిసుందాం రా, ప్రేమంటే ఇదేరా, సూర్యవంశం, ఎఫ్‌2, నారప్ప వెంకటేష్‌ ఇష్టమైన కలర్? బ్లూ వెంకటేష్ ఏం చదివాడు? MBA వెంకటేష్ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 75 సినిమాల్లో నటించాడు https://www.youtube.com/watch?v=R3jZ-Nr_mhw వెంకటేష్ సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటున్నారు. వెంకటేష్ ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు? వెంకటేష్ మొత్తం 6 నంది అవార్డులు, 7 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు పొందారు.
    మార్చి 19 , 2024
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    Telugu Youthful Songs: తెలుగులో యూత్‌ను అమితంగా ఆకట్టుకున్న టాప్‌-10 సాంగ్స్‌ ఇవే!
    ప్రేమ కథా చిత్రాలకు టాలీవుడ్ పెట్టింది పేరు. దశాబ్దాల కాలం నుంచి ఎన్నో కల్ట్‌ లవ్‌ స్టోరీలు తెలుగు ప్రేక్షకులను పలకరించాయి. ఆయా సినిమాలతో పాటు అందులోని పాటలూ సూపర్‌ హిట్‌గా నిలిచాయి. ప్రత్యేకించి కొన్ని మెలోడి సాంగ్స్‌ ప్రేక్షకుల మదిలో చెరగని స్థానాన్ని సంపాదించాయి. ఆ పాటలు వచ్చి ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ చాలా మంది ఫేవరేట్‌ ఆల్బమ్స్‌లో అవి తప్పక ఉంటాయి. అటు యూట్యాబ్‌లోనూ అత్యధిక వ్యూస్‌తో ఆ సాంగ్స్‌ దూసుకెళ్తున్నాయి. ఇంతకీ ఆ యూత్‌ఫుల్‌ సాంగ్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.&nbsp; 1. మాష్టారు మాష్టారు ధనుష్‌ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన సార్‌ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘మాష్టారు మాష్టారు’ పాట విశేష ఆదరణ పొందింది. ఈ తరం యువత ఫేవరేట్‌ సాంగ్‌గా మారిపోయింది. అటు యూట్యూబ్‌లోనూ ఈ సాంగ్ ‌అత్యధిక వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఇప్పటివరకూ 70 మిలియన్ల మంది ఈ సాంగ్‌ను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=AXSm49NGkg8 2. నీ కన్ను నీలి సముద్రం ఉప్పెన సినిమాలోని ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్‌ అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఇప్పటికీ ఈ పాట చాలమందికి ఫేవరేట్. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా జావేద్ అలీ ఆ సాంగ్‌ పాడారు. యూట్యూబ్‌లో 39 మిలియన్ల మంది ఈ పాటను చూశారు.&nbsp; https://www.youtube.com/watch?v=zZl7vDDN8Ek 3. చిట్టి నీ నవ్వంటే&nbsp; జాతి రత్నాలు సినిమాలోని ‘చిట్టి నీ నవ్వంటే’ పాట యూత్‌ను ఎంతగానో ఆకర్షించింది.&nbsp;రాధన్ సంగీతం అందించిన ఈ పాటను రామ్ మిరియాల పాడారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి ఈ పాటను యూత్‌కు కనెక్ట్‌ అయ్యేలా రాశారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను ఏకంగా 145 మిలియన్ల మంది వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=uvCbZxYdLuU 4. ఇంకేం ఇంకేం కావాలి విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన ‘గీతా గోవిందం’ చిత్రం ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ఇందులోని ‘ఇంకేం ఇంకేం కావాలి’ సాంగ్‌ యువతను విపరీతంగా ఆకట్టుకుంది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాటను సిద్ శ్రీరామ్ ఆలపించారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. అటు యూట్యూబ్‌లో ఈ పాటకు 155 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. https://www.youtube.com/watch?v=cC8AmhPUJPA 5. అడిగా అడిగా నాని, నివేదా థామస్‌ జంటగా చేసిన సినిమా ‘నిన్నుకోరి’. ఇందులోని ‘అడిగా అడిగా’ పాట హృదయాలను హత్తుకుంటుంది. గోపి సుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు మ్యూజిక్‌ లవర్స్‌ను మెప్పించాయి.&nbsp; https://www.youtube.com/watch?v=evbYFsSJ4pU 6. చూసి చూడంగానే 2018లో రిలీజైన ‘ఛలో’ సినిమా నాగశౌర్య కెరీర్‌లోని బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘చూసి చూడంగానే’ పాట అప్పట్లో యమా క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఆటోల్లోనూ, బస్‌స్టాండ్లలోనూ ఎక్కడ చూసిన ఈ సాంగ్‌ మారుమోగేది. అనురాగ్‌ కులకర్ణి, స్వరసాగర్‌ మహతి ఈ పాటను పాడారు. కాగా, యూట్యూబ్‌లో ఈ పాటను 205 మిలియన్ల మంది వీక్షించారు. https://www.youtube.com/watch?v=_JVghQCWnRI 7. పూలనే కునుకేయమంటా శంకర్‌ డైరెక్షన్‌లో విక్రమ్‌, అమీ జాక్సన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐ’. ఏ.ఆర్‌ రెహమాన్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలో ‘పూలనే కునుకేయమంటా’ అనే పాట కోట్లాది మంది హృదయాలను దోచుకుంది. హరిచరణ్, శ్రేయా ఘోషల్‌ ఎంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. అంతేగాక ఈ సాంగ్‌ను చిత్రీకరించిన లోకేషన్స్‌ కూడా ఆకట్టుకుంటాయి.&nbsp; https://www.youtube.com/watch?v=cjoz0FZ-wWs 8. మాటే వినదుగా విజయ్‌ దేవరకొండ హీరోగా చేసిన ‘టాక్సీవాలా’ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చి హిట్‌ అందుకుంది. ఈ సినిమాలోని ‘మాటే వినదుగా’ పాట కూడా మ్యూజిక్ లవర్స్‌ను&nbsp; ఉర్రూతలూగించింది. ఇప్పటికీ ఈ సాంగ్‌ను రిపీట్‌ మోడ్‌లో పెట్టుకొని వింటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=HMh6W8oxmyc 9. మధురమే విజయ్‌ దేవరకొండ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమా ‘అర్జున్‌ రెడ్డి’. ఇందులో ‘మధురమే’ పాట మోస్ట్‌ రొమాంటిక్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది. యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ పాటలో విజయ్‌, హీరోయిన్‌ షాలిని పాండే రొమాన్స్‌ను తారా స్థాయిలో చూపించారు. రాధన్ సంగీతం అందించిన ఈ పాటకు సమీరా భరద్వాజ్ స్వరాన్ని అందించింది. https://www.youtube.com/watch?v=YaZuEkCgctA&amp;feature=youtu.be 10. ఎంత సక్కగున్నావే రంగస్థలం సినిమాలోని ‘ఎంత సక్కగున్నావే’ పాట అందరినీ కట్టిపడేసింది. దేవిశ్రీ ప్రసాద్‌ ఈ పాటకు సంగీతంతో పాటు స్వరాన్ని కూడా అందించారు. సమంత అందాన్ని పొగిడే క్రమంలో రామ్‌చరణ్‌ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. యూట్యూబ్‌లో 61 మిలియన్ల మంది ఈ పాటను వీక్షించారు.&nbsp; https://www.youtube.com/watch?v=eABViudPBFE
    మే 31 , 2023
    Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
    Telugu Comedy Scenes: తెలుగులో ఎవర్‌గ్రీన్‌ కామెడీ సీన్స్‌.. చూస్తే కడుపుబ్బా నవ్వాల్సిందే..!
    తెలుగు సినీ అభిమానులు ఎక్కువగా హాస్యాన్ని ఇష్టపడుతుంటారు. తెరపైన హీరోలు, హాస్య నటులు చేసే కామెడీని చూస్తూ తమ సమస్యలు, ఒత్తిడిల నుంచి కాస్త ఉపశమనం పొందుతుంటారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ డైరెక్టర్లు సైతం తమ సినిమాల్లో హాస్య సన్నివేశాలకు పెద్దపీట వేస్తుంటారు. గత 20 ఏళ్లలో ఎన్నో కామెడీ సినిమాలు విడుదలై ప్రేక్షకుల మన్ననలు చూరగొన్నాయి. వాటిలోని హైలెట్‌ కామెడీ సీన్లను ఇప్పటికీ యూట్యూబ్‌లలో సెర్చ్ చేసి చూస్తుంటారు. ఈ నేపథ్యంలో గత కొన్నెళ్లలో వచ్చిన తెలుగు సినిమాల్లోని టాప్‌-10 కామెడీ సీన్స్‌ మీకోసం..&nbsp; 1. ట్రైన్‌ సీన్‌ (వెంకీ) హీరో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్లు ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తావో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వెంకీ (2003) సినిమాలో రవితేజ, బ్రహ్మనందం మధ్య వచ్చే ట్రైన్‌ సీన్‌ ఇప్పటికీ ఎంతో మందిని నవ్విస్తూనే ఉంది. మెుదట రవితేజను బ్రహ్మీ ఓ ఆట ఆడుకోవడం.. ఆ తర్వాత హీరో రివేంజ్‌ తీర్చుకునే సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=pcpuYeqwloY 2. బ్రహ్మీ vs నాజర్‌ (బాద్‌షా) బాద్‌షా సినిమాలో బ్రహ్మానందం కామెడీనే హైలెట్‌ అని చెప్పాలి. పిల్లి పద్మనాభ సింహాగా బ్రహ్మీ చేసే కామెడీ పొట్టచెక్కలయ్యేలా చేస్తుంది. ముఖ్యంగా నాజర్‌, బ్రహ్మీ మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను మరింతగా కితకితలు పెడతాయి. కలలో ఉన్నట్లు భ్రమిస్తూ బ్రహ్మానందం చేసే హంగామా అంతా ఇంతా కాదు.&nbsp; https://www.youtube.com/watch?v=dxRDHXsQ2YQ 3. MS నారాయణ డైలాగ్స్‌ (దూకుడు) దూకుడు సినిమాలో ఎం.ఎస్‌ నారాయణ, మహేష్‌ మధ్య వచ్చే కామెడీ సీన్లు నవ్వులు పూయిస్తాయి. సినిమా హీరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వెంకట్రావ్‌ పాత్రలో MS నారాయణ అద్భుతంగా నటించారు. పలు సినిమాల్లోని సూపర్‌ హిట్‌ డైలాగ్‌లను ఏకధాటిగా చెప్పే సీన్‌ సినిమాకే హైలెట్. MS నారాయణ ఒక్కో డైలాగ్‌ చెప్తున్న సమయంలో మహేష్‌ ఇచ్చే రియాక్షన్స్ హాస్యాన్ని మరింత పెంచింది.&nbsp; https://www.youtube.com/watch?v=uR3mdOT8DWY 4. సునీల్‌ కాలేజ్‌ సీన్స్ (సొంతం)&nbsp; శ్రీను వైట్ల తీసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘సొంతం’ ఒకటి. అప్పట్లో&nbsp; ఈ సినిమా ఓ కామెడీ సెన్సేషన్‌ అని చెప్పాలి. శేషగిరి పాత్రలో సునీల్‌ తనదైన కామెడీతో ప్రేక్షకులను ఎంతగానో నవ్వించాడు. వెంకటలక్ష్మీ (ఝాన్సీ), భోగేశ్వరావు (M.S. నారాయణ) పాత్రలతో సునీల్‌ చేసిన కామెడీని ఇప్పటికీ యూట్యూబ్‌లో చూసుకుంటూ హాస్య ప్రియులు నవ్వుకుంటుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=d5rZgi9JHXU 5. బ్రహ్మీ ఫన్‌ వరల్డ్‌ సీన్స్‌ ( నువ్వు నాకు నచ్చావ్‌) వెంకటేష్‌ చేసిన సూపర్‌ హిట్‌ సినిమాల్లో ‘నువ్వు నాకు నచ్చావ్‌’ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది. ఇందులో తన కామెడీ టైమింగ్‌తో వెంకీ అలరించాడు. బ్రహ్మీ ఎంట్రీతో సినిమాలో కామెడీ మరింత పీక్స్‌కు వెళ్తుంది. ముఖ్యంగా రోలర్‌ కోస్టర్‌ ఎక్కినప్పుడు బ్రహ్మీ ఇచ్చే హావభావాలను చూసి ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకుంటారు.&nbsp; https://www.youtube.com/watch?v=D87NXZXotWY 6. క్విజ్‌ సీన్‌ (ఆగడు) ఆగడు సినిమాలో వచ్చే క్విజ్‌ సీన్‌ కూడా తెలుగు టాప్‌ కామెడీ సీన్లలో ఒకటిగా ఉంది. ఈ సన్నివేశంలో మహేష్‌ యాంకర్‌గా, వెన్నెల కిషోర్‌ జడ్జీగా కనిపిస్తారు. పోసాని కృష్ణమురళి కంటిస్టెంట్‌గా నవ్వులు పూయించాడు.&nbsp; https://www.youtube.com/watch?v=ufmXlnz9R4w 7. బ్రహ్మీ సీన్స్ (అతడు) మహేష్‌ హీరోగా చేసిన అతడు సినిమాలో బ్రహ్మీ డిఫరెంట్‌ కామెడీ టైమింగ్‌తో అలరించాడు. ఫ్రస్టేషన్‌తో ఉన్న ఇంటి అల్లుడు పాత్రలో నవ్వులు పూయించాడు. తన ఎటకారపు మాటలతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టాడు.&nbsp; https://www.youtube.com/watch?v=UhmDHGt81l4 8. సప్తగిరి (ప్రేమ కథా చిత్రం) సప్తగిరిని కామెడియన్‌గా నిలబెట్టిన సినిమా ప్రేమ కథా చిత్రం. ఇందులో సప్తగిరి కామెడీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా దయ్యం కొడుతున్నప్పుడు అతను ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది.&nbsp; https://www.youtube.com/watch?v=9sUIkrR2U9c 9. ఎస్కేప్‌ సీన్‌ (నమో వెంకటేశా) ‘నమో వెంకటేశా’ సినిమాలో బ్రహ్మీ వెంకటేష్‌ పాత్రల మధ్య వచ్చిన కామెడీ కూడా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో గిలిగింతలు పెట్టింది. ముఖ్యంగా ఇంటి నుంచి తప్పించుకునే క్రమంలో బ్రహ్మీకి ఎదురయ్యే ఆటంకాలు వీక్షకుల కుడుపును చెక్కలయ్యేలా చేస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=Llwxco8Ek2o 10. బ్రహ్మీ రివేంజ్‌ (ఢీ) మంచు విష్ణు కెరీర్‌లోనే ‘ఢీ’ చిత్రం బిగ్గెస్ట్‌ హిట్‌ అని చెప్పాలి. ఇందులో బ్రహ్మీ-విష్ణు మధ్య వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అయితే తనను ఎంతగానో హింసించిన సునీల్‌, జయ ప్రకాష్‌ రెడ్డిపై బ్రహ్మీ రివేంజ్‌ తీర్చుకునే సీన్‌ సినిమాకే హైలెట్‌. ఫుల్‌గా మద్యం సేవించిన బ్రహ్మీ వారిద్దరినీ ఓ ఆట ఆడుకుంటాడు. ఈ క్రమంలో బ్రహ్మీ జనరేట్ చేసిన కామెడీ అతడి కెరీర్‌లోనే బెస్ట్ ‌అని చెప్పాలి.&nbsp; https://www.youtube.com/watch?v=m7B4qtmgHkk
    మే 03 , 2023
    <strong>Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో రూ.100 కోట్లు క్రాస్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే!</strong>
    Tollywood Rewind 2024: ఈ ఏడాది తెలుగులో రూ.100 కోట్లు క్రాస్ చేసిన టాప్ 10 సినిమాలు ఇవే!
    2024 సంవత్సరం తెలుగు సినిమా పరిశ్రమకు ఒక చరిత్రాత్మక సంవత్సరం అని చెప్పవచ్చు. పలు పెద్ద చిత్రాలు విడుదలై, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. తెలుగు సినిమాలు దేశం వ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకుల మనసు దోచాయి. ప్రతిసారి హీరోల స్టార్ పవర్‌తోనే కాకుండా, కథనం, పాటలు, సంగీతం వంటి అంశాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమను గ్లోబల్ మార్కెట్లో నిలిపాయి. ఈ సంవత్సరంలో పలు చిత్రాలు వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. హనుమాన్, దేవర, పుష్ప 2 వంటి చిత్రాలు ఈ జాబితాలో చేరి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. ఇప్పుడు 2024లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన ప్రధాన తెలుగు చిత్రాల గురించి వివరంగా తెలుసుకుందాం. 1. హనుమాన్ (Hanuman): తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, దర్శకుడు ప్రశాంత్ వర్మ సృష్టి. సంక్రాంతి సందర్భంగా విడుదలై, దేశవ్యాప్తంగా సుమారు రూ.256 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. స్టార్ హీరోల అవసరం లేకుండానే, మంచి కథ, దర్శకత్వం ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ చిత్రం నిరూపించింది. 2. టిల్లు స్క్వేర్ (Tillu Square): సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రం, 'డీజే టిల్లు'కి సీక్వెల్‌గా విడుదలైంది. చిన్న చిత్రంగా ప్రారంభమైనప్పటికీ, బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, సిద్ధు కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. 3. కల్కి 2898 AD (Kalki 2898 AD): ప్రభాస్ ప్రధాన పాత్రలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం, జూన్‌లో విడుదలై ట్రెమండస్ రెస్పాన్స్‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించి, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఆరోవది కావడం విశేషం. 4. సరిపోదా శనివారం (Saripoda Sanivaram): నాని ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందింది. బాక్సాఫీస్ వద్ద వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, నానికి మరో విజయాన్ని అందించింది. 5. దేవర (Devara): ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం, భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ సక్సెస్‌తో పాటు కలెక్షన్ల సునామీ సృష్టించింది. 52 సెంటర్స్‌లో 50 రోజులు విజయవంతంగా ప్రదర్శితమై, రూ.509 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. 6. లక్కీ భాస్కర్ (Lucky Bhaskar): దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, దీపావళికి విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ పొందింది. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, దుల్కర్ కెరీర్‌లో మరో విజయాన్ని నమోదు చేసింది. 7. పుష్ప 2 (Pushpa 2): అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ఇటీవల విడుదలై రూ.1400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఫస్ట్ డే దేశంలోనే అత్యధిక వసూళ్లు (రూ.280 కోట్లు)సాధించిన తొలి చిత్రంగా నిలిచి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 8. సలార్ (Salaar): ప్రభాస్ నటించిన ఈ చిత్రం, 2023 డిసెంబర్‌లో విడుదలైనప్పటికీ, 2024లో కూడా గూగుల్ సెర్చ్‌లో టాప్ 10లో నిలవడం గమనార్హం. ఈ చిత్రం కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ప్రభాస్‌కు మరో విజయాన్ని అందించింది. 9. అమరన్ (Amaran): శివ కార్తికేయన్ మరియు సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం, తమిళనాట విడుదలై, పాన్ ఇండియావైడ్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొత్తంగా రూ.320 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, శివ కార్తికేయన్ కెరీర్‌లో ది బెస్ట్ హిట్‌గా నిలిచింది. 10. గోట్ (G.O.A.T): విజయ్ నటించిన ఈ చిత్రం, పలు చోట్ల మిక్సిడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ, వసూళ్లలో మాత్రం రికార్డు క్రియేట్ చేసింది. రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి, విజయ్‌కు మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందించింది.
    డిసెంబర్ 19 , 2024
    <strong>Unstoppable: బాలయ్య షోలో రియల్‌ జాతిరత్నం.. శ్రీలీలకు గిఫ్ట్‌ ఇస్తుంటే ఏం చేశాడో చూడండి!</strong>
    Unstoppable: బాలయ్య షోలో రియల్‌ జాతిరత్నం.. శ్రీలీలకు గిఫ్ట్‌ ఇస్తుంటే ఏం చేశాడో చూడండి!
    నందమూరి బాలకృష్ణ పాపులర్ టాక్ షో అన్‌స్టాపబుల్‌ సీజన్ 4 (Unstoppable Season 4) విజయవంతంగా కొనసాగుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ (Aha)లో రికార్డు వ్యూస్‌తో దూసుకు వెళ్తోంది. సీజన్‌ 4 ఫస్ట్‌ ఎపిసోడ్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సందడి చేయగా ఆ తర్వాత నుంచి స్టార్‌ హీరోలు వేదికపై మెరిశారు. ఇప్పటివరకూ దుల్కర్‌ సల్మాన్‌, సూర్య, అల్లు అర్జున్‌ ఈ షోలో పాల్గొని బాలయ్యతో తమ సీక్రెట్స్‌ పంచుకున్నారు. ఇప్పుడు ఈ వేదికపై స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీల (Sreeleela)తో పాటు, యంగ్‌ హీరో నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty) రాబోతున్నారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ఆహా పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; ‘రీల్ అండ్‌ రియల్‌ జాతిరత్నం’ నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ (Unstoppable) సీజన్‌ 4లో స్టార్ హీరోలు సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే మరో ఎపిసోడ్‌ సైతం బాలయ్య సిద్ధం చేశారు. ఈసారి స్టార్‌ హీరోయిన్‌ శ్రీలీలతో పాటు యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టి బాలయ్యతో ముచ్చట్లు చెప్పినట్లు తెలుస్తోంది. వీరిద్దరు షోలో పాల్గొన్న ఫొటోను ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ తాజాగా తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేసింది. ఇందులో జాతిరత్నాలు ఫోజు పెట్టి నవీన్‌ నవ్వులు పూయించాడు. ఇందులో బాలయ్య శ్రీలీలకు గిఫ్ట్‌ ఇస్తుండగా దూరంగా నిలబడి చేత్తో దాన్ని పట్టుకుంటున్నట్లు నవీన్‌ పోలిశెట్టి నిలబడ్డాడు. అచ్చం ఇలాగే జాతిరత్నాలు సినిమాలోనూ నవీన్‌ పోలిశెట్టి చేశాడు. దీంతో ఆ రెండు ఫొటోలను పక్క పక్కన పెట్టి ఆహా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'రీల్‌ అండ్‌ రియల్‌ జాతిరత్నం ఆఫ్ ఇండియా' అంటూ రాసుకొచ్చింది. కారణం ఏమైనా ఉందా? బాలయ్య టాక్ షో (Unstoppable)కు వచ్చిన మెజారిటీ సెలబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వచ్చారు. మరికొందరు సింగిల్‌గానే షోలో పాల్గొని బాలయ్యతో సరదాగా గడిపారు. అయితే ఈసారి ఎపిసోడ్‌లో శ్రీలీల - నవీన్‌ పోలిశెట్టి ఇద్దరూ పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం వారిద్దరు కలిసి ఏ సినిమా చేయడం లేదు. గతంలో ఓ సినిమా పట్టాలెక్కుతున్నట్లు వార్తలు వచ్చినా అది వర్కౌట్‌ కాలేదు. ఈ నేపథ్యంలో పర్టిక్యూలర్‌గా ఈ యువ హీరో, హీరోయిన్‌నే బాలయ్య పిలవడానికి కారణం ఏమైనా ఉందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే వారిద్దరిని బాలయ్య అడిగే ప్రశ్నలు చాలా ఆసక్తికరంగా ఉంటాయని ఓటీటీ వర్గాలు చెబుతున్నాయి. బాలయ్య కొంటే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేక అల్లాడిపోయినట్లు కూడా తెలుస్తోంది. ఎపిసోడ్‌ రిలీజయ్యాక ఆ ప్రశ్నలపై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; https://twitter.com/i/status/1861348565508862042 https://twitter.com/iam_NBKCult/status/1861306464893026701 100% ఫన్‌ పక్కా నవీన్‌ పోలిశెట్టి సినిమాల్లో ఏ విధంగా నవ్వులు పూయిస్తాడో బయట కూడా అదే విధంగా గిలిగింతలు పెడుతుంటాడు. ఏమాత్రం తడుముకోకుండా జోక్స్‌ వేస్తూ నవ్విస్తుంటాడు. మరోవైపు బాలయ్య అన్‌స్టాబుల్‌ షో ద్వారా తనలోని కామెడీ టైమింగ్‌కు మరింత పదును పెట్టారు. సరదా క్వశ్చన్స్‌ వేస్తూ సెలబ్రిటీలను ఇరాకటంలో పడేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు తొలిసారి ఒకే షోలో ఎదురుపడుతుండటంతో ఆ ఎపిసోడ్ కామెడీకి కేరాఫ్‌గా మారిపోతుందని నెటిజన్లు అంచనావేస్తున్నారు. 100% పక్కా ఎంటర్‌టైనింగ్‌గా ఈ ఎపిసోడ్ ఉండబోతుందని ఇప్పటి నుంచే కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ కుర్ర హీరోను బాలయ్య ఓ ఆట ఆడుకోవడం ఖాయమని కూడా అంటున్నారు. ఈ శుక్రవారం (నవంబర్‌ 29) ఈ ఎపిసోడ్‌ (Unstoppable) స్ట్రీమింగయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.&nbsp; ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌.. గతేడాది నవీన్‌ పొలిశెట్టి (Naveen Polishetty), అనుష్క (Anushka Shetty) కాంబోలో వచ్చిన 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి' బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ సక్సెస్‌ తర్వాత నవీన్‌ ప్రస్తుతం 'అనగనగా ఒక రాజు' అనే సినిమా చేస్తున్నాడు. షూటింగ్‌లో చేతికి ఫ్రాక్చర్‌ కావడంతో గత కొంతకాలంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇప్పుడు నయం కావడంతో తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. మరోవైపు శ్రీలీల విషయానికి వస్తే నితీన్‌తో చేసిన 'రాబిన్‌హుడ్‌' మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్‌ 25న క్రిస్మస్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే శ్రీలీల స్పెషల్‌ సాంగ్‌లో మెరిసిన ‘పుష్ప 2’&nbsp; చిత్రం డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.&nbsp;
    నవంబర్ 28 , 2024
    <strong>This Week Telugu Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!</strong>
    This Week Telugu Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
    ఈ వారం చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్నాయి. వచ్చే వారం 'పుష్ప 2' (Pushpa 2) రిలీజ్‌ ఉన్న నేపథ్యంలో పెద్ద సినిమాలేవి ఈ వారం థియేటర్లలోకి రావడం లేదు. అటు ఓటీటీలో రీసెంట్‌ సూపర్ హిట్‌ చిత్రాలు స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. వెబ్‌సిరీస్‌లు సైతం అలరించేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. (This Week Telugu Movies) థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు రోటి కపడా రొమాన్స్‌ (Roti Kapada Romance) హర్ష నర్రా, సందీప్‌ సరోజ్, తరుణ్, సుప్రజ్‌ రంగా, సోనూ ఠాకూర్, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోటి కపడా రొమాన్స్‌’. విక్రమ్‌ రెడ్డి దర్శకత్వం వహించారు. బెక్కం వేణుగోపాల్‌, సృజన్‌ కుమార్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ వారమే రిలీజ్‌ కాబోతోంది. నవంబర్‌ 28న తెలుగు ఆడియన్స్‌ను పలకరించనుంది. అయితే ఈ వారం రిలీజ్ కాబోతున్న డైరెక్ట్‌ తెలుగు చిత్రం ఇదే కావడం విశేషం.&nbsp; మిస్‌ యూ (Miss You) ప్రముఖ నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ (Ashika Ranganath) జంటగా చేసిన తాజా తమిళ చిత్రం ‘మిస్‌ యూ’ (Miss You). ఎన్‌. రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. లవ్ అండ్ యాక్షన్ జానర్లలో రూపొందిన ఈ చిత్రం నవంబర్‌ 29న తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, టీజర్ సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి.&nbsp; భైరతి రణగల్‌ (Bhairathi Ranagal) కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌కుమార్‌ (Sivaraj Kumar) నటించిన లేటెస్ట్‌ యాక్షన్ థ్రిల్లర్‌ ‘భైరతి రణగల్‌’. ఇప్పటికే కన్నడలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి నవంబరు 29 (This Week Telugu Movies)న విడుదల కానుంది. నర్తన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాహుల్‌బోస్‌, రుక్మిణి వసంత్, దేవరాజ్‌ తదితరులు నటిస్తున్నారు. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు క (Ka) యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్‌ బ్లాక్ బాస్టర్‌ చిత్రం 'క' బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అతడి కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అయితే ఈ చిత్రం వారమే (This Week Telugu Movies) ఓటీటీలోకి రాబోతోంది. ఈటీవీ విన్‌ వేదికగా నవంబర్‌ 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. దీపావళి సందర్భంగా అక్టోబర్‌ 31న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar) దుల్కర్‌ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ సైతం ఈ వారమే ఓటీటీలోకి రానుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం కానుంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. దీపావళి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దుల్కర్‌ కెరీర్‌లో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన ఫస్ట్ ఫిల్మ్‌గా లక్కీ భాస్కర్‌ నిలిచింది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateBloody BeggarMovieTelugu/TamilAmazonNov 29Sikandar Ka MuqaddarMovieHindiNetflixNov 29The TrunkMovieKoreanNetflixNov 29Our Little SecretMovieEnglishNetflixNov 27Find Me In ParisMovieEnglishNetflixNov 28The Snow SisterMovieEnglishNetflixNov 29The MadnessMovieEnglishNetflixNov 28ParachuteSeriesTelugu/TamilNetflixNov 29VikatakaviSeriesTeluguZee 5Nov 28Divorce Ke Liye Kuch Bhi KaregaSeriesHindiZee 5Nov 29Krishnam Pranaya SakhiMovieTelugu/ KannadaSunNXTNov 29
    నవంబర్ 25 , 2024
    <strong>Viswam Movie Review: ‘విశ్వం’తో గోపిచంద్‌, శ్రీను వైట్ల కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా?</strong>
    Viswam Movie Review: ‘విశ్వం’తో గోపిచంద్‌, శ్రీను వైట్ల కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా?
    నటీనటులు : గోపిచంద్‌, కావ్యా థాపర్, నరేష్‌, ముఖేష్‌ రిషి, జిషూ సేన్‌గుప్తా, వెన్నెల కిషోర్‌, సునీల్‌, శ్యామ్‌, ప్రగతి, రాహుల్‌ రామకృష్ణ, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, పృథ్వీ తదితరులు దర్శకత్వం : శ్రీను వైట్ల సంగీతం : చేతన్ భరద్వాజ్‌ సినిమాటోగ్రఫీ : కె. వి. గుహన్‌ ఎడిటింగ్‌ : అమర్‌ రెడ్డి నిర్మాతలు : వేణు దోనేపూడి, టి.జి. విశ్వ ప్రసాద్‌ విడుదల తేదీ : అక్టోబర్‌ 11, 2024 ప్రముఖ నటుడు గోపిచంద్‌ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేసింది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్ల, యాక్షన్‌ హీరో గోపిచంద్‌ గతకొంత కాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 11న (Viswam Movie Review) విడుదలైన ‘విశ్వం’ వారికి విజయాజాన్ని అందించిందా? ఈ పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి హైదరాబాదులో కేంద్రమంత్రి (సుమన్) హత్యకు గురవుతాడు. ఆ హత్యను కళ్ళారా చూసిన ఒక చిన్నారిని చంపేందుకు హంతకులు వెంబడిస్తూ ఉంటారు. అయితే ఆ చిన్నారి కుటుంబానికి పరిచయమైన గోపిరెడ్డి (గోపీచంద్) ఆమె పలుసార్లు ప్రమాదం నుంచి కాపాడుతాడు. అయితే గోపిరెడ్డి ఆ కుటుంబానికి పరిచయం కావడం వెనుక ఓ కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి? ఇటలీలో కలిసిన సమైరా (కావ్య థాపర్‌)కు గోపిరెడ్డి ఎందుకు దూరమయ్యాడు? అసలు గోపిరెడ్డి ఎవరు? ఎందుకు చిన్నారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాడు? అసలు గోపిరెడ్డి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? తెలియాలంటే థియేటర్లకు వెళ్లాల్సిందే.  ఎవరెలా చేశారంటే నటుడు గోపిచంద్‌ ఎప్పటిలాగే తన సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. యాక్షన్‌ సీక్వెన్స్‌లో మెప్పించాడు. తనలో మంచి కామెడీ టైమింగ్‌ కూడా ఉందని విశ్వంతో మరోమారు నిరూపించుకున్నాడు. అయితే గత చిత్రాలతో పోలిస్తే గోపిచంద్‌ పాత్రలో పెద్దగా వైవిధ్యం లేదు. రొటీన్‌ పాత్రనే చేసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్‌ కావ్యా థాపర్‌కు నటన పరంగా పెద్దగా స్కోప్‌ దక్కలేదు. అయితే గ్లామర్‌గా మాత్రం ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. నరేష్‌, వెన్నెల కిషోర్‌, సునీల్‌, రాహుల్ రామకృష్ణ పాత్రలు సినిమాలో బాగా నవ్విస్తాయి. ముఖ్యంగా ట్రైన్‌ ఎపిసోడ్‌లో వారి పాత్రలు మెప్పిస్తాయి. మిగిలిన పాత్ర దారులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే ‘ఆనందం’, ‘సొంతం, ‘వెంకీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ చిత్రాలు తీసిన శ్రీనువైట్ల ఇటీవల కాలంలో కాస్త ట్రాక్‌ తప్పారు. అయితే తన బలాబలాలు గుర్తించి ‘విశ్వం’తో మళ్లీ యాక్షన్‌ అండ్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే ఈ సినిమాకు ఔట్‌డేటేడ్‌ స్టోరీని ఎంచుకోవడం మైనస్‌గా చెప్పవచ్చు. పంచ్‌లు, కామెడీ ట్రాక్‌ మాత్రం సినిమాకు ప్రధాన బలంగా మారాయి. ముఖ్యంగా వెన్నెల కిషోర్‌, పృథ్వీ మధ్య వచ్చే కామెడీ సీక్వెన్స్ ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తాయి. ఇక ఇటలీ ట్రాక్‌లో కొత్త దనం కనిపించదు. విలన్‌ పాత్ర కూడా బలహీనంగా అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ లవ్‌ ట్రాక్‌ కూడా ఎక్కడో చూసిన ఫీలింగ్‌ కలుగుతుంది. అయితే ఇంటర్వెల్‌ సీన్, క్లైమాక్స్ మాత్రం ఆకట్టుకుంటాయి. ఓవరాల్‌గా విశ్వం పర్వాలేదనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే చేతన్ భరద్వాజ్‌ అందించిన సంగీతం డీసెంట్‌గా అనిపిస్తుంది. రెండు, మూడు సాంగ్స్‌ బాగున్నాయి. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. కె.వి గుహన్‌ కెమెరా పనితనం కూడా మెప్పిస్తుంది. అమర్‌ రెడ్డి కుడుముల తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టే ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రతీ సీన్‌ రిచ్‌గా కనిపించింది. ప్లస్‌ పాయింట్స్‌ గోపిచంద్‌ నటనకామెడీ&nbsp;నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్ ఔట్‌డేటెడ్‌ స్టోరీ&nbsp;సాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>IIFA 2024: అబుదాబిలో చిరు, బాలయ్యకు అరుదైన గౌరవం.. చూస్తే రెండు కళ్లు సరిపోవు!&nbsp;</strong>
    IIFA 2024: అబుదాబిలో చిరు, బాలయ్యకు అరుదైన గౌరవం.. చూస్తే రెండు కళ్లు సరిపోవు!&nbsp;
    సినీరంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా (IIFA-2024) అవార్డుల వేడుక అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. సెప్టెంబర్‌ 27నుంచి 29 మధ్య మూడురోజుల పాటు జరగనున్న ఈవెంట్‌లో రెండో రోజు సమంత, రానా, ఏఆర్‌ రెహమన్‌, వెంకటేశ్‌, బాలకృష్ణ హాజరై సందడి చేశారు. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌ నటీనటులు పలు జాబితాల్లో అవార్డులు సొంతం చేసుకున్నారు. ఈ వేడుక‌ల్లో&nbsp; మెగాస్టార్‌ చిరంజీవితో పాటు నందమూరి బాలకృష్ణలు ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ఈ ఇద్దరు అగ్రహీరోలు ఒకే వేదికపై అవార్డులు తీసుకోవడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; మెగాస్టార్‌కు మరో గౌరవం మెగాస్టార్‌ చిరంజీవికి (Megastar Chiranjeevi) ఈ ఏడాది వరుసగా అవార్డులు వరిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం నుంచి పద్మ విభూషణ్‌ అందుకున్న మెగాస్టార్‌ ఇటీవలే గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఇప్పుడు తాజాగా ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ -2024 వేడుకల్లో మరో అవార్డును సొంతం చేసుకున్నారు. అవుడ్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ ఇన్‌ ఇండియన్‌ సినిమా అవార్డును కైవసం చేసుకున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ జావేద్ అక్తర్‌ చేతుల మీదగా మెగాస్టార్ ఈ అవార్డు అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; https://twitter.com/PulagamOfficial/status/1839749384667316719 https://twitter.com/PROSaiSatish/status/1839938794956439677 https://twitter.com/PraveeGv/status/1839930181143703686 బాలకృష్ణకు సైతం.. నటసింహం నందమూరి బాలకృష్ణ ఇటీవలే తన 50 ఏళ్ల నటన జీవితం పూర్తి చేసుకున్నాడు. దీనికి సంబంధించి టాలీవుడ్‌లో పెద్ద ఈవెంట్‌ను సైతం నిర్వహించారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జరుగుతున్న ఐఫా - 2024 వేడుకల్లో బాలయ్యను అవార్డుతో నిర్వాహకులు గౌరవిచంారు. ప్రతిష్టాత్మక గోల్డెన్‌ లెగసీ అవార్డ్‌ను బాలకృష్ణకు అందజేశారు. బాలీవుడ్‌ స్టార్‌ నిర్మాత కరణ్‌ జోహార్‌ చేతుల మీదుగా ఈ అవార్డును అందచేశారు. అవార్డు ఇవ్వడానికి ముందు బాలయ్య కాళ్లకు కరణ్‌ జోహర్‌ నమస్కారం చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. నందమూరి ఫ్యాన్స్ వీటిని తెగ ట్రెండ్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/SureshPRO_/status/1839855063390454090 ఒకే వేదికపై చిరు, బాలయ్య, వెంకీ అబుదాబిలో జరుగుతున్న ఐఫా వేడుకలకు టాలీవుడ్‌ నుంచి దిగ్గజ నటుడు వెంకటేష్‌ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌ ముగ్గుర్ని ఒకేసారి స్టేజిపైకి పిలవడంతో ఈవెంట్లో ఒక్కసారిగా సందడి వచ్చింది. ఒకే వేదికపై ఈ ముగ్గురు స్టార్ హీరోలను చూసి అక్కడి వారంతా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేదికపైన బాలయ్య, చిరు, వెంకీ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఈ వేడుకలో చిరంజీవికి అవుడ్‌ స్టాండింగ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు రావడంతో ఆ అవార్డుని పట్టుకొని వెంకటేష్‌, బాలకృష్ణలతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. అయితే ఈ ఫొటోల్లో నాగార్జున కూడా ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/TeluguCinema7/status/1839748107602444312 ఐఫా - 2024 అవార్డు విజేతలు..&nbsp; &nbsp;ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్‌ ఇండియ‌న్ సినిమా-&nbsp; చిరంజీవి&nbsp;ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా - ప్రియదర్శన్‌&nbsp;ఉమెన్‌ ఆఫ్‌ది ఇయర్‌ - సమంత&nbsp;గోల్డెన్‌ లెగసీ అవార్డు - బాలకృష్ణ&nbsp;ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్‌ (కన్నడ)- రిషబ్‌ శెట్టి&nbsp;ఉత్తమ చిత్రం (తమిళం) - జైలర్‌&nbsp;ఉత్తమ చిత్రం (తెలుగు)- దసరా&nbsp;ఉత్తమ నటుడు (తెలుగు)- నాని&nbsp;&nbsp;ఉత్తమ నటుడు (తమిళం)- విక్రమ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)&nbsp;ఉత్తమ నటి (తమిళం) - ఐశ్వర్యారాయ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)&nbsp;ఉత్తమ దర్శకుడు (తమిళం) - మణిరత్నం (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)&nbsp;ఉత్తమ సంగీత దర్శకుడు (తమిళం) - ఏఆర్‌ రెహమన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)&nbsp;ఉత్తమ విలన్‌ (తమిళం) - ఎస్‌జే సూర్య (మార్క్‌ ఆంటోనీ)&nbsp;ఉత్తమ విలన్‌ (తెలుగు) - షైన్‌ టామ్‌ (దసర)&nbsp;ఉత్తమ విలన్‌ (కన్నడ) - జగపతి బాబు&nbsp;ఉత్తమ సహాయ నటుడు (తమిళం) - జయరామ్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)&nbsp;ఉత్తమ సినిమాటోగ్రఫీ - మిస్‌శెట్టి మిస్టర్‌ పోలిశెట్టి&nbsp;ఉత్తమ సాహిత్యం - జైలర్‌ (హుకుం)&nbsp;ఉత్తమ నేపథ్య గాయకుడు - చిన్నంజిరు (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)&nbsp;ఉత్తమ నేపథ్య గాయని - శక్తిశ్రీ గోపాలన్‌ (పొన్నియిన్‌ సెల్వన్‌ 2)&nbsp;ఉత్తమ విలన్‌ (మలయాళం) - అర్జున్‌ రాధాకృష్ణన్‌
    సెప్టెంబర్ 28 , 2024
    <strong>Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?</strong>
    Dulquer Salmaan: టాలీవుడ్‌పై కన్నేసిన దుల్కర్‌ సల్మాన్‌.. ‘టైర్‌-2’ హీరోలకు గట్టి పోటీ?
    ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ (Dulquer Salmaan) దక్షిణాది సినీ పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. మలయాళ దిగ్గజ నటుడు మమ్ముట్టి (Mammootty) నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన దుల్కర్‌ అతి తక్కువ కాలంలోనే తనకంటూ సెపరేట్ ఫ్యాన్‌ బేస్‌ను సృష్టించుకున్నారు. తన అద్భుత నటనతో తండ్రికి తగ్గ తనయుడు అని నిరూపించుకున్నాడు. మలయాళంతో పాటు తెలుగులోనూ పార్లర్‌గా చిత్రాలు చేస్తూ టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు. అయితే దుల్కర్‌ తన ఫోకస్‌ మెుత్తం తెలుగు ఇండస్ట్రీ వైపు మళ్లించినట్లు తెలుస్తోంది. తెలుగులో వరుసగా ప్రాజెక్ట్స్‌ అనౌన్స్‌ చేస్తూ రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌ వంటి టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.&nbsp; తెలుగు రైజింగ్‌ హీరోగా దుల్కర్‌! యంగ్‌ హీరో దుల్కర్‌ సల్మాన్‌ తన రెండు, మూడు చిత్రాలతోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరో క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. తెలుగులో నాగ్ అశ్విన్ (Nag Ashwin) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానటి’ సినిమాలో జెమినీ గణేషన్ పాత్రలో నటించి మెప్పించాడు. తన అద్భుతమైన నటుడితో తెలుగు ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు. ఆ తర్వాత ‘సీతారామం’ సినిమాలో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. సైనికుడిగా, ప్రేమికుడిగా, శత్రుదేశంలో పట్టుబడ్డ బందీగా తన విభిన్నమైన నటనతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. రీసెంట్ గా ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీలో ప్రభాస్ ను పెంచి పెద్ద చేసే గురువు పాత్రలో నటించి మెప్పించాడు. ఓ రకంగా అది పరశురాముడి పాత్ర అని చెబుతున్నారు. ‘కల్కి 2’ లోనూ దుల్కర్‌ పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది.&nbsp; డబ్బింగ్‌ చిత్రాలతోనూ గుర్తింపు డైరెక్ట్‌ తెలుగు చిత్రాలే కాకుండా తమిళం, మలయాళ భాషల్లో అతడు నటించిన పలు చిత్రాలు తెలుగులో డబ్బింగ్ అయ్యాయి. దుల్కర్‌ నటించిన 9 వరకూ చిత్రాలు తెలుగు ఆడియన్స్‌ను పలకరించాయి. అందులో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన 'ఓకే బంగారం', సాయిపల్లవితో చేసిన 'హేయ్‌ పిల్లగాడ', ‘అందమైన జీవితం’ వంటి చిత్రాలు తెలుగు యూత్‌ను ఎంతగానో ఆకర్షించాయి. దుల్కర్‌ మనవాడే అన్న ఫీలింగ్‌ను వారిలో కలిగించాయి. అలాగే ‘కురుప్‌’, ‘సెల్యూట్‌’, ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ వంటి యాక్షన్‌ చిత్రాలు సైతం మాస్‌ ఆడియన్స్‌లో మంచి గుడ్‌విల్‌ తెచ్చిపెట్టాయి. దీంతో తెలుగులో క్లాసు-మాసు కలగలిసిన హీరోగా దుల్కర్‌ మారిపోయాడు.&nbsp; కొత్త ప్రాజెక్ట్స్‌తో దూకుడు తెలుగులోనూ స్టార్‌ హీరో క్రేజ్‌ సంపాదించుకున్న దుల్కర్‌తో సినిమా చేసేందుకు టాలీవుడ్‌ దర్శక, నిర్మాతలు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో వరుసగా టాలీవుడ్‌లో ప్రాజెక్ట్స్‌కు ఓకే చెబుతూ దుల్కర్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి ‘లక్కీ భాస్కర్‌’ చిత్రంలో దుల్కర్‌ నటిస్తున్నాడు. అక్టోబర్‌ 31న ఈ చిత్రం విడుదల కానుంది. దీని తర్వాత పవన్‌ సాధినేని దర్శకత్వంలో 'ఆకాశంలో ఒక తార' అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు దుల్కర్‌ ఓకే చెప్పాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్ కూడా విడుదలై అందర్నీ ఆకట్టుకుంది. ఇందులో రైతు పాత్రలో దుల్కర్‌ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తెలుగు స్టార్‌ హీరో రానా నిర్మాణంలో కొత్త ప్రాజెక్ట్‌ 'కాంత'ను పట్టాలెక్కించాడు. ఇందులో దుల్కర్‌కు జోడీగా టాలీవుడ్ రైజింగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించనుంది. 1950 నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రానా కీలక పాత్ర పోషించనున్నాడు. తమిళ డైరెక్టర్‌ సెల్వమణి సెల్వరాజ్‌ ఈ సినిమాను పాన్‌ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు.&nbsp; https://twitter.com/vamsikaka/status/1817427815249133673 https://twitter.com/imwpolitikos/status/1833028992456089818 https://twitter.com/Chrissuccess/status/1832279694118400071 ‘టైర్‌ 2’ హీరోలకు గట్టిపోటీ! టాలీవుడ్‌లో దుల్కర్‌ సల్మాన్‌ దూకుడు చూస్తుంటే టైర్‌ 2 హీరోలకు గట్టి పోటీ తప్పదని అనిపిస్తోంది. రామ్‌, విజయ్‌ దేవరకొండ, నాగచైతన్య, నితిన్‌, అడవి శేష్‌ తదితర హీరోలకు దుల్కర్‌ పోటీగా మారతాడని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలుగులో అతడు చేస్తున్న మూడు ప్రాజెక్టుల్లో కనీసం రెండు హిట్స్‌ అయినా అతడి గ్రాఫ్‌ అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. క్లాసిక్‌ లుక్స్‌తో పాటు యాక్షన్‌ సీక్వెన్స్‌లో దుమ్మురేప గల సత్తా అతడికి ఉండటంతో తెలుగు డైరెక్టర్ల ఫస్ట్‌ ఛాయిస్‌ అతడు అయ్యే పరిస్థితులు రావొచ్చని అంటున్నారు. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న నాగచైతన్య, రామ్‌, విజయ్ దేవరకొండ వంటి హీరోలు దుల్కర్‌ విషయంలో జాగ్రత్త ఉండాలని సూచిస్తున్నారు.&nbsp;
    సెప్టెంబర్ 10 , 2024
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    Trending Telugu Movies 2024: గూగుల్‌లో అత్యధికంగా వెతికిన టాప్ 60 తెలుగు సినిమాలు ఇవే!
    నెట్టింట ఏదైనా సమాచారాన్ని వెతకాలంటే వెంటనే గూగుల్ చేస్తాం. అలా ప్రతి సమాచార శోధనకు గూగుల్ సెర్చ్ ఇంజిన్ కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అయితే, ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా వెతికిన సినిమాల జాబితాను ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే విచిత్రంగా బ్లాక్ బాస్టర్ సూపర్ డూపర్ హిట్లను తలదన్నీ మన తెలుగు ప్రేక్షకులు చక్కని కథనం, ఫీల్ గుడ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు పట్టం కట్టడం విశేషం. మరి గూగూల్‌లో ఎక్కువ మంది వెతికిన టాప్ 60 సినిమాల లిస్ట్‌ను మీరు చూడండి. [toc] Drushyam దృశ్యం చిత్రం వచ్చి 10 సంవత్సరాలైనా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. పెద్ద పెద్ద చిత్రాలను తలదన్ని ఆశ్చర్యకరంగా గూగుల్‌లో అత్యధికంగా వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా మొదటి స్థానంలో నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ చిత్రంలో భావోద్వేగాలు.. సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశం, వెంకటేష్ నటన ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపాయి.ఇక సినిమా కథలోకి వెళ్తే.. రాంబాబు (వెంకటేష్‌) ఊరిలో కేబుల్‌ నెట్‌వర్క్‌ పెట్టుకొని కుటుంబంతో హాయిగా జీవిస్తుంటాడు. ఓ రోజు ఐజీ గీత ప్రభాకర్‌ (నదియా) కొడుకు కనిపించకుండా పోతాడు. కానిస్టేబుల్‌ వీరభద్రం కారణంగా ఆ కేసులో రాంబాబు, అతని ఫ్యామిలీ ఇరుక్కుటుంది. ఆ కేసుకి రాంబాబు ఫ్యామిలీకి ఏంటి సంబంధం? అన్నది కథ. Karthikeya 2 ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కార్తీకేయ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పదే పదే చూసేందుకు ఇష్టపడుతున్నారని గూగుల్ ట్రెండ్స్‌ బట్టి తెలుస్తోంది. అత్యధిక మంది వెతుకుతున్న చిత్రాల్లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే… కార్తికేయ (నిఖిల్‌)కు ప్రశ్నలకు సమాధానం వెతకడం అంటే ఇష్టం. తల్లితో పాటు కార్తికేయ ద్వారక వెళ్లగా అక్కడ ఓ ఆర్కియాలజిస్ట్ హత్యకు గురవుతాడు. దాని వెనక కారణాల్ని వెతుకుతూ కార్తికేయ చేసే సాహసోపేతమైన ప్రయాణమే అసలు కథ. Bichagadu 2 ఆశ్చర్యకరంగా ఈ సినిమా తెలుగులో ట్రెండ్ అవుతున్న సినిమాల్లో మూడో స్థానంలో నిలవడం విశేషం. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌గా వచ్చిన బిచ్చగాడు 2 సైతం మంచి విజయం సాధించింది. తల్లి కొడుకుల మధ్య చక్కని సెంటిమెంట్, చక్కని పాత్రల చిత్రణ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో నిలిపింది. అందుకే ఈ చిత్రం టాప్ ట్రెండింగ్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని) భారతదేశంలోని 7వ అత్యంత సంపన్నుడు. అతని సహోద్యోగి మరియు స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్), అతని గ్యాంగ్‌తో కలిసి, అతని సంపద కోసం విజయ్‌ని చంపి, అతని మెదడును బిచ్చగాడు సత్య (విజయ్ ఆంటోని) మెదడుతో మారుస్తాడు. అయితే సత్య వారిని చంపి తన ప్రతీకారం తీర్చుకుంటాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తాడు. యాంటీ బికిలీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి? సత్య అరవింద్ ఇంతకు ఆ గ్యాంగ్‌ను ఎందుకు చంపాడు? ఇంతకు సత్య వెనుక ఉన్న కథ ఏమిటి? అన్నది మిగతా కథ F2 2019 సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. వెంకీ-వరుణ్ తేజ్‌ల జోడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. ఈ సినిమా వచ్చి ఏళ్లు గడుస్తున్నా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పటికీ ఈ సినిమాను చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తారు. గూగుల్ సెర్చ్‌లో టాప్‌లో ట్రెండ్‌ అవుతున్న సినిమాల్లో ఈ చిత్రం ఒకటి. ఇక ఈ సినిమా కథలోకి వెళ్తే.. వెంకీ(వెంకటేష్) MLA దగ్గరా పీఏ పనిచేస్తుంటాడు. ఆత్మగౌరవం, మొగుడుపై పెత్తనం చలాయించే వ్యక్తిత్వం ఉన్న తమన్నాను వెంకీ పెళ్లి చేసుకుంటాడు. కొద్దిరోజులు వీరి కాపురం బాగానే సాగినా.. ఇగోల వల్ల సమస్యలు వస్తాయి. దీంతో తమన్నా ఫ్యామిలీ వెంకీని టార్చర్ పెడుతుంది. ఈక్రమంలో తమన్నా చెల్లెలు హాని(మెహరీన్) వరుణ్‌(వరుణ్‌ తేజ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. తమన్నా ఫ్యామిలీ దెబ్బకు వరుణ్ సైతం బాధితుడిగా మారుతాడు. అప్పుడు వెంకీ- వరుణ్ కలిసి ఏం చేశారు? తమ ఇగో సమస్యలను ఎలా పరిష్కరించుకున్నారు అనేది కథ. Ante Sundaraniki గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమాల జాబితాలో ఈ చిత్రం కూడా ఒకటి. నాని మార్క్ కామెడీ, నజ్రియా నదియా క్యూట్ నెస్, వల్గారిటీ లేని కామెడీ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలిపాయి. అందుకే నెటిజన్లు ఈ సినిమా చూసేందు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే..బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సుందర్‌ (నాని) ఇంకో మతానికి చెందిన లీల (నజ్రియా నజీమ్‌)ను ప్రేమిస్తాడు. భిన్నమైన సంప్రదాయాలు కలిగిన ఈ జంట పెళ్లి కోసం కుటుంబ సభ్యులతో అబద్దం ఆడతారు. దాని వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారన్నది కథ. Tholiprema ఈ చిత్రం వచ్చి 25 ఏళ్లు దాటినా ఇప్పటికీ ఎప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ క్లాసిక్ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఇప్పటికీ ఆసక్తి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ యాక్టింగ్, కీర్తి రెడ్డి మెస్మరైజింగ్ బ్యూటీ, చక్కని లవ్ స్టోరీ ఈ సినిమాను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మరణీయం చేశాయి. గూగుల్ సెర్చ్‌లో అధికంగా వెతుకుతున్న సినిమాల్లో ఈ సినిమా ఒకటిగా నిలిచింది. ఇక కథలోకి వెళ్తే.. అమెరికా నుంచి వచ్చి తన తాత ఇంటికి వెళ్తున్న అనూను బాలు ఓ ప్రమాదం నుండి కాపాడతాడు. దీంతో అను అతడితో స్నేహం చేస్తుంది. ఈ ప్రయాణంలో బాలు అనూని ఇష్టపడతాడు. కానీ, ఆమెకు చెప్పలేకపోతాడు. వీరి ప్రేమ కథ చివరికి ఏమైంది? అన్నది కథ. Pelli Choopulu తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటన ఆకట్టుకుంటుంది. ఇక కథలోకి వెళ్తే..పెళ్లి చూపుల్లో ప్రశాంత్‌ (విజయ్‌ దేవరకొండ)ను చిత్ర (రీతు వర్మ) రిజెక్ట్‌ చేస్తోంది. ఓ కారణం వల్ల హీరోయిన్‌ పెట్టే ఫుడ్‌ ట్రక్‌ బిజినెస్‌లో హీరో భాగమవుతాడు. ఈ ఇద్దరి ప్రయాణం తర్వాత ఏయే మలుపులు తిరిగింది? అన్నది కథ. ఓటీటీ సన్ నెక్ట్స్ Spyder స్పైడర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ.. మంచి స్టోరీ లైన్‌తో వచ్చింది. ఈ సిని సస్పెన్స్ థ్రిల్లర్‌గా అలరించింది. ఈ సినిమా చూసేందుకు ఇప్పటికీ చాలా మంది నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కథలోకి వెళ్తే… ఇంటెలిజెన్స్ అధికారి అయిన శివ, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉన్నవారి ట్రాక్ చేయడంలో సహాయపడే ఫోన్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తాడు. ఒక సీరియల్ కిల్లర్ అమాయకులను హత్య చేస్తున్న క్రమంలో అతడి ఆగడాలను అరికడుతాడు. ఇంతకు ఆ హత్యలు చేస్తుంది ఎవరు? అతన్ని శివ పట్టుకోవడంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు అనేది మిగతా కథ. ఓటీటీ- నెట్‌ఫ్లిక్స్ Raja The Great రవితేజ చేసిన బెస్ట్ కామెడీ చిత్రాల్లో రాజా ది గ్రేట్ ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమా చూసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. కంటి చూపులేని రాజా.. ఆసాధారణ ప్రతిభకలవాడు. ఓ యువతి ఆపాదలో ఉన్నప్పుడు ఆమెకు సాయం చేయాలనుకుంటాడు. ఆమెను రక్షించే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అన్నది మిగతా కథ.ఓటీటీ: ఆహా Ori Devuda వెంకటేష్- విశ్వక్ సేన్ మేయిన్‌ లీడ్‌లో నటించిన ఈ చిత్రం మంచి ఫీల్ గుడ్ సినిమా. ఈ సినిమా అత్యధికంగా వెతుకుతున్న తెలుగు సినిమా జాబితాలో పదో స్థానంలో నిలిచింది. అర్జున్ (విశ్వక్‌ సేన్‌), అను (మిథిలా పాల్కర్) పెళ్లి చేసుకుంటారు. అర్జున్‌ని అను అనుమానిస్తూనే ఉంటుంది. దీంతో పెళ్లి తర్వాత స్వేచ్చ కోల్పోయినట్లు అతడు భావిస్తాడు. పెళ్లి విషయంలో తనకు సెకండ్ ఛాన్స్ ఇవ్వమని దేవుడ్ని మెురపెట్టుకుంటాడు. కొన్ని షరతులతో దేవుడు (వెంకటేష్‌) అందుకు అంగీకరిస్తాడు. ఆ తర్వాత ఏమైందన్నది కథ.ఓటీటీ: ఆహా Bichagadu ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త తల్లి ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోతుంది. వైద్యులు ఆమెకు నయం చేయలేమని చెబుతారు. అయితే, ఒక పూజారి ఆ వ్యాపారవేత్త బిచ్చగాడుగా జీవిస్తే ఆమె కోలుకుంటుందని స్పష్టం చేస్తాడు.ఓటీటీ: ప్రైమ్ వీడియో Jalsa సంజయ్‌ చిన్నప్పుడు ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నక్సలైట్‌గా మారతాడు. ఓ పోలీసాఫీసర్‌ కారణంగా ప్రజా జీవితంలోకి వస్తాడు. అయితే అనుకోకుండా ఆ పోలీసు అధికారి కూతుర్లనే రెండు పర్యాయాలలో ప్రేమిస్తాడు. ఓటీటీ: ఆహా Nenu అల్లరి నరేష్‌లో అద్భుతమైన నటనను ఆవిష్కరించింది ఈ చిత్రం. మానసిక రోగి పాత్రలో అతని యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. అందుకే ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. కథలోకి వెళ్తే..మానసిక రోగి అయిన వినోద్ తన స్నేహితురాలిగా భావించే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే ఆ యువతి వెరొకరితో ప్రేమలో ఉంటుంది. ప్రేమను గెలిపిస్తాననే నెపంతో ఆ యువతిని వినోద్ అడవిలోకి తీసుకెళ్లడంతో కథ మలుపు తిరుగుతుంది. ఓటీటీ: సన్ నెక్ట్స్ Sye Raa Narasimha Reddy భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించనప్పటికీ… ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది. కథలోకి వెళ్తే.. భారతదేశాన్ని ఆక్రమించుకునే క్రమంలో బ్రిటిష్ సైన్యాన్ని ఎదురించలేక పాలెగాళ్లు అందరూ లొంగిపోతారు. అయితే రేనాడు ప్రాంతానికి చెందిన రాజు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బ్రిటిష్ సైనికులకు ఎదురుతిరిగి వారు దోచుకున్న భూమిని సంపదను అడ్డుకుని ప్రజలకు అండగా నిలబడతాడు. తోటి పాలెగాళ్ళలో మార్పు తెచ్చి వారితో కలిసి దేశ స్వాతంత్ర్యం కోసం ఉద్యమాన్ని నిర్మిస్తాడు? ఈ క్రమంలో ఆయన ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అసలు యుద్దానికి దారి తీసిన అంశాలు ఏమిటి? అన్నది మిగతా కథ Hari Hara Veera Mallu పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ చిత్రం ఇంకా విడుదల కాలేదు. కానీ ఈ సినిమా కోసం నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందని ఎదురు చూస్తున్నరు. ఇక ఈ సినిమా మొగల్స్ కాలం నాటి పరిస్థితుల ఆధారంగా తెరకెక్కుతోంది. Bharat Ane Nenu సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్‌ (మహేష్‌) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్‌ పెట్టాడు? అన్నది కథ.ఓటీటీ: ఆహా Ye Maaya Chesave ఈ చిత్రం 15 ఏళ్లు గడిచినా ఈ క్లాసిక్ సినిమాపై ఇంకా క్రేజ్ పోలేదు.ఇంజినీరింగ్‌ విద్యార్థి అయిన కార్తీక్‌కి ఫిల్మ్ డైరెక్టర్ కావాలని కోరిక. ఈక్రమంలో అతను తన ఇంటి యజమాని కూతురు జెస్సీతో ప్రేమలో పడతాడు. ఇద్దరు మతాలు వేరుకావడంతో ఆమె తండ్రి వారి ప్రేమను వ్యతిరేకిస్తాడు. మరి కార్తీక్ తన ప్రేమను గెలిచేందుకు ఏం చేశాడు అన్నది మిగతా కథ. ఓటీటీ: జీ5, ప్రైమ్ Baahubali: The Beginning మాహిష్మతి రాజ్యంలో, శివుడు అనే ధైర్యవంతుడైన యువకుడు… ఒక యువ యోధురాలుతో ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమిస్తున్న క్రమంలో అతని కుటుంబం, తన నిజమైన వారసత్వం గురించి తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: హాట్ స్టార్ Businessman ముంబయిని ఏలాలన్న లక్ష్యంతో సూర్య నగరానికి వస్తాడు. లోకల్‌ గ్యాంగ్‌స్టర్లతో కలిసి పవర్‌ఫుల్‌ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. ఇంతకీ ఆ యువకుడు పెట్టిన బిజినెస్ ఏంటి? చిత్ర-సూర్యల లవ్‌స్టోరీ ఏంటి? అన్నది కథ. ఓటీటీ: హాట్ స్టార్, ప్రైమ్ Good Luck Sakhi బంజార యువతి సఖి (కీర్తి సురేష్‌) అంటే గోలి రాజు (ఆది పినిశెట్టి)కి ఎంతో ఇష్టం. సఖి గురిపై రాజుకు మహా నమ్మకం. ఆమెను షూటింగ్‌ వైపు వెళ్లేలా ప్రోత్సహిస్తాడు. ఇందుకోసం ఊరికి వచ్చిన కల్నల్ (జగపతిబాబు) సాయం తీసుకుంటాడు. షూటింగ్‌లో ఎదిగే క్రమంలో సఖికి ఎదురైన సవాళ్లు ఏంటి? అన్నదే కథ. ఓటీటీ: ప్రైమ్, ఆహా Oxygen అరవింద్ కృష్ణ తాను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఇండియాకు వస్తాడు. కానీ ఆ అమ్మాయి కుటుంబాన్ని కొంతమంది చంపుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అరవింద్ కృష్ణ ఏం చేశాడు అన్నది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ Adipurush ఆదిపురుష్ సినిమా కథ వాల్మికి రామాయణంలోని యుద్ధకాండ నుంచి ప్రారంభం అవుతుంది. తండ్రి దశరథుడి ఆజ్ఞపై రాఘవ (ప్రభాస్) తన భార్య జానకి (కృతి సనన్) – శేషు (సన్ని సింగ్)తో కలిసి వనవాసానికి వెళ్తాడు. తన సోదరి శూర్పణఖకు జరిగిన అవమానం తెలిసిన రావణ (సైఫ్ అలీ ఖాన్) మారు వేషంలో వచ్చి జానకిని తీసుకు వెళ్తాడు. స్త్రీలోలుడైన రావణ.. జానకిపై ఆశ పడుతాడు. ఆ తర్వాత జానకిని రావణుడి చర నుంచి జానకిని ఎలా కాపాడాడు అనేది కథ ఓటీటీ: సన్ నెక్ట్స్ SR Kalyanamandapam కల్యాణ్‌ (కిరణ్‌ అబ్బవరం) వారసత్వంగా వస్తున్న ఎస్‌.ఆర్‌. కళ్యాణ మండపం నిర్వహణ బాధ్యతలను తీసుకుంటాడు. ఇంజనీరింగ్‌ చదివే కల్యాణ్‌ గిరాకీ లేని కల్యాణ మండపాన్ని నడపించాలని ఎందుకు అనుకున్నాడు? దానికి పూర్వ వైభవం తీసుకొచ్చాడా లేదా? తండ్రి (సాయికుమార్‌)తో మాట్లాడకపోవడానికి కారణమేంటి? అన్నది కథ. ఓటీటీ: ఆహా Disco Raja భయంకమైన మాఫియా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న డిస్కో రాజా బాడీని హిమాలయాల్లో శాస్త్రవేత్తల బృందం కనిపెడుతుంది. అతనికి చికిత్స చేయడంతో మాములు మనిషిగా మారుతాడు. తన గతం గురించి తెలుసుకున్న డిస్కో రాజా ఏం చేశాడు. అసలు డిస్కో రాజా హిమాలయాల్లో ఎందుకు కూరుకు పోయాడు అనేది మిగతా కథ ఓటీటీ: సన్ నెక్స్ట్ Goutham Nanda మల్టీ బిలియనీర్ కొడుకైన గౌతమ్, ఓ కంపెనీలో ఉద్యోగి అయిన నందాతో జీవితాన్ని మార్చుకోవడం ద్వారా తన ఆస్తిని విడిచిపెట్టి సాధారణ జీవితం గడపాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: ప్రైమ్ Kirrak Party కృష్ణ(నిఖిల్) అనే ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితుల బృందంతో కలిసి సంతోషంగా జీవిస్తుంటాడు. అతను తన సీనియర్ మీరా(సిమ్రాన్)తో ప్రేమలో పడతాడు. అంతా సవ్యంగా సాగుతున్న క్రమంలో.. ఒక విషాద సంఘటన కృష్ణ జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఆ తర్వాత కృష్ణ ఏం చేశాడన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Teja తేజ ( తరుణ్ ) పుట్టుకతోనే మేధావి. 6 వ తరగతి చదువే అతను 10 వ తరగతికి సిద్ధమవుతుంటాడు. భౌతికశాస్త్రం, కంప్యూటర్లు, రోబోల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. ఓ రోజు ప్రిన్సిపాల్ భర్త ఓ మహిళను హత్య చేయడం చూసి ఫొటోలు తీస్తాడు. తేజ సాక్ష్యంతో కోర్టు ప్రిన్సిపల్ భర్తకు ఉరి శిక్ష విధిస్తుంది. జైలు నుంచి తప్పించుకున్న అతను తేజపై ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. Pelli Sandadi శ్రీకాంత్‌ తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి చెల్లెలు అని తెలియక స్వప్నతో ప్రేమలో పడతాడు. సోదరి పెళ్లి విషయం తెలుసుకున్న స్వప్న తన అక్క సంతోషం కోసం ప్రేమను త్యాగం చేసేందుకు సిద్ధపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకు శ్రీకాంత్ పెళ్లి ఎవరితో జరిగిందనేది మిగతా కథ. ఓటీటీ:యూట్యూబ్ Swathi Muthyam బాలమురళీ కృష్ణ (బెల్లంకొండ గణేష్) భాగ్యలక్ష్మీ(వర్షా బొల్లమ్మ)ని చూడగానే ప్రేమలో పడతాడు. వారికి పెళ్లి జరుగుతుండగా చంటిబిడ్డతో శైలజ (దివ్య శ్రీపాద) ప్రత్యక్షం అవుతుంది. ఆ బిడ్డకు తండ్రి బాలమురళీ కృష్ణ అని చెబుతుంది. మరి భాగ్యలక్ష్మీ స్పందన ఏంటి? ఆ శైలజ ఎవరు? అనేది కథ. ఓటీటీ: జియో టీవీ Dhruva ఐపీఎస్‌ అధికారి అయిన ధ్రువ (రామ్‌చరణ్‌).. సిద్ధార్థ్‌ అభిమన్యూ (అరవింద స్వామి) నడిపే అక్రమ వైద్య నెట్‌వర్క్‌ను ఎలా ధ్వంసం చేశాడు? అన్నది కథ. ఓటీటీ: సన్ నెక్స్ట్ KGF 2 రాకీ గరుడను చంపి KGFని స్వాధీనం చేసుకుంటాడు. కొద్దికాలంలోనే సూపర్ పవర్‌గా ఎదుగుతాడు. కానీ అతనికి అధీర (సంజయ్ దత్) రూపంలో అడ్డంకులు వస్తాయి. ఇదేక్రమంలో రాకీని అణిచివేసేందుకు ప్రధాన మంత్రి ఆదేశాలు జారీ చేస్తుంది. మరి రాకీ, అధీరను, రాజకీయ శక్తిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరకు వీరిపై విజయం సాధించాడా? లేదా? అన్నది మిగతా కథ. Baadshah ఓ యువకుడు తన తండ్రికి గ్యాంగ్‌స్టర్‌తో ఉన్న సంబంధాల కారణంగా పోలీస్ ఫోర్స్‌లో ఉద్యోగం పొందడంలో విఫలమవుతాడు. ఓ మాఫియా బాంబు దాడిలో అతని స్నేహితుడు చనిపోవడంతో వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఓటీటీ: యూట్యూబ్ Pushpa పుష్ప (అల్లుఅర్జున్‌) ఎర్రచందనం కూలీ. కొండా రెడ్డి (అజయ్‌ ఘోష్‌) సోదరులకు స్మగ్లింగ్‌లో సలహాలు ఇచ్చే స్థాయికి అతడు వెళతాడు. అక్కడ నుంచి సిండికేట్‌ను శాసించే రేంజ్‌కు పుష్ప ఎలా ఎదిగాడు? మంగళం శ్రీను (సునీల్‌)తో ఉన్న గొడవేంటి? అన్నది కథ. ఓటీటీ: ప్రైమ్ Nannaku Prematho హీరో తండ్రిని ఓ వ్యాపారవేత్త మోసం చేస్తాడు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తండ్రి ద్వారా హీరో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హీరో ఏం చేశాడు? తన తండ్రి కోసం విలన్‌పై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: సన్‌ నెక్స్ట్ Ala Modalaindi లవ్‌ ఫేయిల్ అయిన ఓ వ్యక్తి ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే, ఆమెకు అప్పటికే నిశ్చితార్థం జరిగిందని తెలియగానే కథలో ట్విస్ట్‌ మొదలవుతుంది. ఓటీటీ: జీ5, ప్రైమ్ Sir బాలగంగాధర్ (ధనుష్ ) ఒక జూనియర్ మ్యాథ్స్ లెక్చరర్. సిరిపురం అనే గ్రామంలోని జూనియర్ కళాశాలకు మ్యాథ్స్ చెప్పడానికి వెళ్తాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ పాస్ అయ్యేలా చదువు చెబితే.. సీనియర్ మ్యాథ్స్ లెక్చరర్‌గా ప్రమోషన్ ఇస్తానని కాలేజీ యాజమాన్యం చెబుతుంది. అయితే, అక్కడ పరిస్థితులు బాలుకి అనుకూలంగా ఉండవు. అయినా, తన మాటలతో, చేతలతో ఆ సిరిపురం స్టూడెంట్స్‌ను ప్రభావితం చేస్తాడు. అనంతరం జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బాలు జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఆ మార్పులు ఏమిటి అనేది మిగతా కథ ఓటీటీ: నెట్‌ప్లిక్స్ Jersey అర్జున్(నాని) మాజీ రంజీ ఆటగాడు, అతను తన భార్య సారా(శ్రద్ధా శ్రీనాథ్) కొడుకు నానితో సాధారణం జీవితం గడుపుతుంటాడు. ఈక్రమంలో అతని ఉద్యోగం పోతుంది. చేచడానికి ఎలాంటి పనిలేక ఖాళీగా తిరుగుతుంటాడు. జీవితంలో ఏదోఒకటి చేయాలన్న తపన ఉన్న అర్జున్ తన కొడుకు కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంటాడు. ఇంతకు అతను తీసుకున్న నిర్ణయం ఏమిటి? తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది కథ. ఓటీటీ: జీ5 Hit: The First Case ఇన్‌స్పెక్టర్ విక్రమ్ తన లవర్ నేహా మిస్‌కావడంతో గందరగోళంలో ఉంటాడు. ఇదే సమయంలో తన లవర్ మిస్సింగ్ కేసుతో సంబంధం ఉన్న ప్రీతీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసులో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా విక్రమ్ అపాయింట్ అవుతాడు. ఈ కేసు దర్యాప్తులో కొన్ని షాకింగ్ విషయాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత విక్రమ్ ఏం చేశాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Aditya 369 అనుకోని పరిస్థితుల్లో ఓ సైంటిస్ట్ కనిపెట్టిన టైం మిషన్ ఎక్కిన కృష్ణకుమార్ (బాలకృష్ణ) అతని ప్రేయసి మోహిని(హేమ)… గతంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలంలోకి వెళ్తారు.. అప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత భవిష్యత్‌ కాలంలోకి ఎలా ప్రయాణించారు? తిరిగి వారు ప్రస్తుత కాలానికి వచ్చారా? లేదా అనేది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్, యూట్యూబ్ Aha Naa Pellanta ఒక ధనిక పారిశ్రామిక వేత్త కొడుకై కృష్ణ మూర్తి, పరమ పిసినారి అయిన లక్ష్మిపతి కూతురు పద్మతో ప్రేమలో పడతాడు. అయితే లక్ష్మిపతిని తమ పెళ్లికి ఒప్పిస్తానని కృష్ణమూర్తి తన తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు. ఈక్రమంలో అతను ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? చివరకు తాను చేసిన ఛాలెంజ్‌లో గెలిచాడా లేదా అన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Vikram Vedha వేదా అనే గ్యాంగ్ స్టర్‌ను కనిపెట్టడానికి విక్రమ్ అనే పోలీస్ ఆఫీసర్ బయలుదేరాడు. వేద స్వచ్ఛందంగా తనకు తాను లొంగిపోతాడు. ఆ తర్వాత విక్రమ్‌కు అతను మూడు కథలు చెప్తాడు.దీంతో విక్రమ్ మంచి, చెడుపై ఉన్న తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. ఇంతకు వేదా.. విక్రమ్‌కు ఏం చెప్పాడు అనేది మిగిలిన కథ. ఓటీటీ: ప్రైమ్ Bro మార్క్( సాయి ధరమ్ తేజ్) ఎప్పుడూ తన ఉద్యోగంతో బిజీగా ఉంటాడు. దేనికి టైం లేదు టైం లేదు అంటుంటాడు. కుటుంబం మొత్తం అతని సంపాదన మీదే ఆధారపడి ఉంటుంది. చివరకు తన ప్రేయసి రమ్య( కేతిక శర్మ)తో సమయం గడిపాడు. ఓ రోజు అకస్మాత్తుగా మార్క్ ప్రమాదం చనిపోతాడు. అతని ఆత్మ టైం గాడ్‌(పవన్ కళ్యాణ్‌)ను కలుస్తుంది. తన బాధ్యతలు నిర్వర్తించేందుకు తనకు రెండో ఛాన్స్ ఇవ్వాలని కోరగా.. టైం గాడ్ 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ తర్వాత మార్క్ ఏం చేశాడు అనేది మిగతా కథఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Khaidi ఒక పేద రైతు కొడుకు సూర్యం, ఓ క్రూరమైన భూస్వామి కూతురుతో ప్రేమలో పడుతాడు. దీంతో ఆ భూస్వామి, సూర్యం కుటుంబాన్ని, అతని జీవితాన్ని చిద్రం చేస్తాడు. ఓటీటీ: యూట్యూబ్ Uppena మత్స్యకార కుటుంబానికి చెందిన ఆశీ (పంజా వైష్ణవ్‌ తేజ్‌) గొప్పింటి కుటుంబానికి చెందిన బేబమ్మ (కృతి శెట్టి)ను ప్రేమిస్తాడు. విషయం తెలుసుకున్న తండ్రి(విజయ్ సేతుపతి) ఏం చేశాడు? ప్రేమను దక్కించుకునే క్రమంలో ఆశీ ఏం కోల్పోయాడు? చివరకూ ఆ జంట ఎలా ఒక్కటైంది? అన్నది కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Geetha Govindam గోవింద్‌ (విజయ్‌ దేవరకొండ) గుడిలో గీత (రష్మిక)ను చూసి తొలిచూపులోనే ఇష్టపడతాడు. విజయ్‌ ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కగా అతడి పక్క సీటులోనే గీత కూర్చుంటుంది. ఆమె నిద్రిస్తున్న క్రమంలో ముద్దు పెట్టేందుకు యత్నించి గీత దృష్టిలో విజయ్‌ రోగ్‌లా మారిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? విజయ్‌ ఆమె ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది కథ. ఓటీటీ: జీ5 Acharya బసవ(సోనూసూద్) పాలనలో ఉన్న ధర్మస్థలిలో అధర్మం రాజ్యమేలుతుంటుంది. ఆ సమయంలో ఆచార్య(చిరంజీవి) అక్కడకి వస్తాడు. బసవ, అతని మనుషులు చేసే అరాచకాలను ఆచార్య ఎలా ఎదురించాడు. అసలు ధర్మస్థలికి ఆచార్య ఎందుకు వస్తాడు? పాదఘట్టం సంరక్షకుడిగా ఉన్న సిద్ధకు ఆచార్యకు మధ్య సంబంధం ఏమిటి అనేది మిగిలిన కథ Rang De అను (కీర్తి సురేష్), అర్జున్ (నితిన్) ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. ఒకరంటే ఒకరికి పడదు. అను అర్జున్‌ని ప్రేమిస్తుంది కానీ అతను ఆమెను ద్వేషిస్తాడు. కానీ ఓ సంఘటన వల్ల అర్జున్‌ అనును పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అను ప్రేమను అర్జున్ అర్థం చేసుకున్నాడా? లేదా? అన్నది మిగతా కథ.ఓటీటీ: జీ5 ఓటీటీ: ప్రైమ్ Induvadana వాసు (వరుమ్‌ సందేశ్‌) ఫారెస్ట్‌ పోలీసాఫీసర్‌. గిరిజన యువతి ఇందు (ఫర్నాజ్‌ శెట్టి)తో ప్రేమలో పడతాడు. కులం పేరుతో వారి పెళ్లిని పెద్దలు నిరాకరిస్తారు. ఈ క్రమంలోనే ఇందు హత్యకు గురవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. ఓటీటీ: యూట్యూబ్ Maharshi మహర్షి అనేది వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన 2019 భారతీయ తెలుగు భాషా యాక్షన్ డ్రామా చిత్రం మరియు దీనిని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్ మరియు PVP సినిమా నిర్మించాయి. ఇందులో మహేష్ బాబు, అల్లరి నరేష్, పూజా హెగ్డే నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రం 9 మే 2019న విడుదలైంది. ఓటీటీ: ప్రైమ్, ఆహా Aakaasam Nee Haddhu Ra సూర్య (మహా) గుంటూరులోని ఓ చిన్న కుగ్రామంలోని పోస్ట్ మాస్టర్ కొడుకు. తన తండ్రి వల్ల ఆ ఊరుకి కరెంట్ వస్తోంది. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన మహా వల్ల ఆ ఊరికి రైలు వస్తోంది. అయితే ఆ తరువాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం పేదవాడు కూడా ఫ్లైట్ లో ప్రయాణించగలగాలనే లక్ష్యంతో మహా 'డెక్కన్ ఎయిర్ లైన్' ప్రారంభిస్తాడు. కానీ ఈ మధ్యలో తన ఫ్లైట్ ఎగరడానికి మహా ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు? అసలు చివరకు తాను కన్న కలను సాధించగలిగాడా ? లేదా ? అన్నది మిగతా కథ ఓటీటీ: ప్రైమ్ Ala Vaikunthapurramuloo బంటు(అల్లు అర్జున్) తన పెంపుడు తండ్రి అవమానాల మధ్య పెరిగి పెద్దవాడవుతాడు. కానీ తన నిజమైన తల్లిదండ్రుల గురించి తెలుసుకుని వారికి దగ్గర కావాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో బంటు నిజమైన తండ్రి కుటుంబానికి ఓ సమస్య వస్తుంది. ఆ సమస్యను బంటు ఎలా పరిష్కరించాడు? తన కుటుంబంలో ఎలా చేరాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్ Munna కాలేజీ స్టూడెంట్ అయిన మున్నా.. తన తల్లి, సోదరిని చంపిన కాకా అనే గుండాను చంపాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటాడు. ఈ ప్రక్రియలో కాకా గురించి మున్నా ఓ నిజాన్ని తెలుసుకుంటాడు. మున్నా తెలుసుకున్న నిజం ఏమిటి? కాకాతో మున్నాకు ఉన్న సంబంధం ఏమిటి? అన్నది మిగతా కథ. ఓటీటీ: యూట్యూబ్ RRR నిజాం రాజును కలిసేందుకు వచ్చిన బ్రిటిష్ అధికారి గోండు పిల్లను తమ వెంట ఢిల్లీకి తీసుకెళ్తారు. ఆ గోండు జాతి నాయకుడైన భీమ్(జూ.ఎన్టీఆర్) ఆ పిల్లను వెతుక్కుంటూ ఢిల్లీకి వస్తాడు. ఈ విషయం తెలిసిన బ్రిటిష్ ప్రభుత్వం అతన్ని పట్టుకునేందుకు రామరాజు(రామ్‌చరణ్‌)ను ప్రత్యేక అధికారిగా నియమిస్తుంది. ఈక్రమంలో ఓ సంఘటన వల్ల భీమ్- రామరాజు ఒకరికొకరు తెలియకుండానే ప్రాణ స్నేహితులుగా మారుతారు. కానీ కొన్ని పరిణామాల వల్ల ఒకరిపై ఒకరు దాడి చేసుకోవాల్సి వస్తుంది. ఇంతకు గోండు పిల్లను బ్రిటిష్ చర నుంచి భీమ్ విడిపించాడా? అసలు రామరాజు బ్రిటిషర్ల దగ్గర ఎందుకు పనిచేశాడు అనేది మిగతా కథ. ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్, జీ5 Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. ఓటీటీ: యూట్యూబ్ Dear Comrade స్టూడెంట్ లీడర్ అయిన బాబీ(విజయ్ దేవరకొండ).. స్టేట్ లెవల్ క్రికెటర్ అయిన లిల్లీతో ప్రేమలో పడుతాడు. అతని దుడుకు స్వభావం వల్ల లిల్లీ అతనికి దూరం అవుతుంది. ఈ క్రమంలో లిల్లీ ఓ సమస్యలో చిక్కుకుంటుంది. లిల్లీ సమస్యను బాబీ ఏవిధంగా పరిష్కరించి తిరిగి ఆమెకు ఎలా దగ్గరయ్యాడు అనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Jathi Ratnalu మంచి ఉద్యోగాల కోసం తమ ఊరి నుంచి హైదరాబాద్ వచ్చిన ముగ్గురు యువకులు ఓ అపార్ట్‌మెంటులో దిగుతారు. అక్కడ పిలువని పార్టీకి వెళ్లి మర్డర్ అటెంప్ట్ కేసులో ఇరుక్కుంటారు. ఆ తర్వాత కేసు నుంచి ఎలా బయటపడ్డారనేది కథ. ఓటీటీ: ప్రైమ్ Dirty Hari హరికి హైదరాబాద్‌లో కోటీశ్వరురాలైన వసుధతో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమ సాగుతున్న క్రమంలో వసుధ అన్న గర్ల్‌ఫ్రెండ్ అందానికి ఆకర్షితుడవుతాడు. ఒకరికి తెలియకుండా ఒకరితో సంబంధాన్ని కొనసాగిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది కథ ఓటీటీ: ఆహా Arjun Reddy అర్జున్ రెడ్డి టాలెంట్ ఉన్న ఒక యువ సర్జన్. ప్రీతి అనే యువతిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తాడు. అయితే ఓ సంఘటన అర్జున్ రెడ్డిని షాక్‌కు గురిచేస్తుంది. మద్యానికి బానిసవుతాడు. ఇంతకు తన ప్రేయసిని అతను తిరిగి కలుసుకున్నాడా లేదా? అన్నది మిగతా కథ. ఓటీటీ: ఆహా, ప్రైమ్ Rangasthalam ఊరి ప్రెసిడెంట్‌గా 30 ఏళ్ల నుంచి ఫణీంద్ర భూపతి (జగపతిబాబు) ప్రజలను పీడిస్తుంటాడు. అతడి అన్యాయాలకు హీరో అన్న కుమార్‌బాబు (ఆది పినిశెట్టి) ఎదురు తిరుగుతాడు. ఫణీంద్ర భూపతికి పోటీగా నామినేషన్‌ వేస్తాడు. ఈ క్రమంలోనే కుమార్‌బాబు అనూహ్యంగా హత్యకు గురవుతాడు. అన్న చావుని చూసిన చిట్టిబాబు (రామ్‌చరణ్‌) ఎలా రివేంజ్‌ తీర్చుకున్నాడన్నది కథ. ఓటీటీ: ప్రైమ్
    జూన్ 25 , 2024

    @2021 KTree