• TFIDB EN
  • వేట
    UTelugu
    వేట అనేది చిరంజీవి, జయప్రద మరియు సుమలత నటించిన 1986 భారతీయ తెలుగు-భాషా కాలపు యాక్షన్ చిత్రం. ఇది 28 మే 1986న విడుదలైంది. ఈ చిత్రాన్ని సంయుక్త మూవీస్ నిర్మించింది, దీని అంతకుముందు బ్లాక్ బస్టర్ ఖైదీ. 1844లో అలెగ్జాండర్ డుమాస్ రాసిన ది కౌంట్ ఆఫ్ మోంటే క్రిస్టో అనే నవల ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. దర్శకుడు ఎ. కోదండరామి రెడ్డి, స్వరకర్త కె. చక్రవర్తి మరియు రచయితలు పరుచూరి సోదరుల విజయవంతమైన టీమ్ ఈ సినిమాలోనూ పునరావృతమైంది.
    ఇంగ్లీష్‌లో చదవండి
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    చిరంజీవి
    ఒక నావికుడు
    జయ ప్రద నహత
    సరోజ
    సుమలత
    జ్యోతిర్మయే
    జగ్గయ్య
    మహేంద్ర భూపతి
    రంగనాథ్
    బెనర్జీ
    నూతన్ ప్రసాద్
    చౌడప్ప
    మోహన్ శర్మ
    జయరామ్
    సిబ్బంది
    ఎ. కోదండరామి రెడ్డి
    దర్శకుడు
    ధనంజయరెడ్డినిర్మాత
    పరుచూరి బ్రదర్స్
    రచయిత
    కె. చక్రవర్తి
    సంగీతకారుడు
    వీఎస్ఆర్ స్వామి
    సినిమాటోగ్రాఫర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>SSMB 29:కెన్యాలో లోకేషన్‌ వేటలో రాజమౌళి, వీడియో వైరల్</strong>
    SSMB 29:కెన్యాలో లోకేషన్‌ వేటలో రాజమౌళి, వీడియో వైరల్
    ‘RRR’ మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొట్టిన దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu)తో తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు. దీంతో ఈ క్రేజీ కాంబో చిత్రం ఎప్పుడు మెుదలవుతుందా అని యావత్‌ సినీ లోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే వచ్చిన అప్‌డేట్స్‌ సైతం ఫ్యాన్స్‌ను తెగ ఖుషి చేశాయి. మహేష్‌ లుక్‌ ఇదేనంటూ బయటకొచ్చిన ఫొటోలు సైతం అందర్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో జక్కన్న బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి షేర్ చేసిన ఓ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది.  లొకేషన్‌లో వేటలో జక్కన్న మహేష్‌ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో ఓ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రబృందం దృష్టంతా #SSMB29కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులపైనే ఉంది. ఈ నేపథ్యంలో రాజమౌళి తాజాగా పంచుకున్న ఓ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఎడారి ప్రాంతంలో తిరుగుతున్న ఓ ఫొటోను రాజమౌళి షేర్‌ చేశారు. ‘కనుగొనడం కోసం తిరుగుతున్నా’ అంటూ దానికి క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆయన మహేష్‌ సినిమా కోసం లొకేషన్స్‌ సెర్చ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అప్‌డేట్‌ షేర్‌ చేయాలని అభిమానులు కోరుతున్నారు.  View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) ఆ ప్లేస్‌ కన్ఫార్మ్‌ అయినట్లేనా! దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నాడు. కెన్యాలోని నేషనల్ పార్కులో రాజమౌళి, కార్తికేయలు చక్కర్లు కొడుతున్నారు. అక్కడి అటవీ ప్రాంతాన్ని, జంతువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలను సెర్చ్ చేస్తున్నారు. తాజాగా రాజమౌళి షేర్‌ చేసిన ఫొటో సైతం అక్కడ తీసిందే. దానితో పాటు మరో వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. దర్శకధీరుడు రాజమౌళి ఓ సవారి వెహికల్‌లో ప్రయాణిస్తూ కనిపించాడు. నేషనల్ పార్కులో ప్రయాణిస్తూ అక్కడి లొకేషన్స్‌ను రాజమౌళి పరిశీలించడం గమనించవచ్చు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే కథ కావడంతో కెన్యాలోని నేషనల్ పార్కులోనే కొంత భాగం షూట్‌ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.&nbsp; https://twitter.com/ch76891/status/1851175580273631275 ఏఐ టెక్నాలజీ వినియోగం! గ్లోబల్‌ స్థాయిలో రూపొందున్న 'SSMB 29' ప్రాజెక్ట్ కోసం జక్కన్న ఏఐ టెక్నాలజీని వినియోగించబోతున్నట్లు సమాచారం. దీనికోసం ప్రత్యేక శిక్షణ సైతం తీసుకున్నట్లు టాక్‌.&nbsp; సినిమాలోని కొన్ని పాత్రలు, జంతువుల కోసం ఆయన ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారట. మాములుగానే రాజమౌళి సినిమాల్లో వీఎఫ్‌ఎక్స్‌లు భారీస్థాయిలో ఉంటాయి. ఏఐ కలయిక నేపథ్యంలో ఈ సినిమాలో అవి రెట్టింపుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ దీనిని అనువదించనున్నారు. రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందనున్నట్లు తెలుస్తోంది. ‘కాపీ కొట్టడం తప్పుకాదు’ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత రాజమౌళికే దక్కుతుంది. అటువంటి జక్కన్నపై సినిమా రిలీజైన ప్రతీసారి కొన్ని విమర్శలు వస్తుంటాయి. హాలీవుడ్‌ చిత్రాల్లోని సీన్స్‌ను రాజమౌళి కాపీ కొట్టారని నెట్టింట ప్రచారం జరుగుతుంటుంది. ఇదిగో ప్రూఫ్స్‌ను అంటూ కొన్ని వీడియోలను సైతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ చేస్తుంటారు. దీనిపై స్పందించిన రాజమౌళి తాను హాలీవుడ్ సినిమాలను కాపీ చేస్తానన్న విషయాన్ని అంగీకరించారు. ‘చిన్నతనం నుంచీ మనపై హాలీవుడ్‌ సినిమాల ప్రభావం ఉంటూనే ఉంటుంది. నా వరకు నేను మన సినిమాలు ఆ స్థాయిలో ఎందుకు ఉండవు అని ఆలోచిస్తూ ఉండేవాడిని. కాపీ చేసామంటున్న ప్రతి సారి మేం ఒరిజినల్ కంటే బాగా తీసాం. దీని వల్ల ఎవరికి నష్టం ఉండదు. అదే నేను ఓ తమిళ్‌ సినిమా నుంచో, మలయాళ సినిమా నుంచో కాపీ చేస్తే అది ఆ రైటర్‌కి, డైరెక్టర్‌కి ఎఫెక్ట్‌ అవుతుంది. కాబట్టి హాలీవుడ్‌ సినిమాల నుంచి ప్రేరణ పొందడం తప్పు అని నేను భావించడం లేదు' అని సమర్థించుకున్నారు.&nbsp; https://twitter.com/i/status/1565532933183930368 కథ.. ఆ నవలల ఆధారమేనా? రాజమౌళి తండ్రి స్టార్‌ రైటర్‌ విజయేంద్ర ప్రసాద్‌ ‘SSMB29’ సినిమాకు కథను అందిస్తున్నారు. ఈ క్రమంలో రాజమౌళి &amp; టీమ్‌ రెండు ఆఫ్రికా నవలల హక్కులను కొనుగోలు చేసినట్లు ప్రచారం జరిగింది. విల్బర్‌ స్మిత్‌ రాసిన రెండు నవలలను వారు కొనుగోలు చేసినట్లు జోరుగా టాక్‌ వినిపించింది. ఇప్పటికే ఆఫ్రికా అడవుల నేపథ్యంలో 'SSMB29' ఉంటుందని  సినీ వర్గాల్లో టాక్ ఉంది. దీంతో ఆ నవలల ఆధారంగానే రాజమౌళి ఈ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నారా? అన్న సందేహాం కలుగుతోంది. ఇందులో నిజానిజాలు ఎంతో చిత్ర యూనిట్‌ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
    అక్టోబర్ 29 , 2024
    <strong>Devera Bookings: రికార్డుల వేట షురూ చేసిన ‘దేవర’.. ఓవర్సీస్‌లో హాట్‌ కేకుల్లా టికెట్స్‌ సేల్‌!</strong>
    Devera Bookings: రికార్డుల వేట షురూ చేసిన ‘దేవర’.. ఓవర్సీస్‌లో హాట్‌ కేకుల్లా టికెట్స్‌ సేల్‌!
    యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’ (Devara). తారక్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. తారక్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో బిజీగా ఉంది. సెప్టెంబరు 27న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. అయితే రిలీజ్‌కు 28 రోజుల సమయం ఉండగానే ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాల్లో ప్రీ బుకింగ్స్‌ ప్రారంభించారు. ఈ క్రమంలో నిమిషాల వ్యవధిలోనే టికెట్స్‌ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో రిలీజ్‌కు ముందే ‘దేవర’ రికార్డుల వేట మెుదలైందంటూ తారక్‌ ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు.&nbsp; ఓవర్సీస్‌లో ప్రీ బుకింగ్స్ జోరు! తారక్‌ హీరోగా నటించిన ‘దేవర’ చిత్రం కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. సెప్టెంబర్‌ 27 ఎప్పుడు వస్తుందా అని తారక్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అటు ఓవర్సీస్‌లోనూ తారక్‌కు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్ ఉండటంతో అక్కడ కూడా ‘దేవర’పై మంచి హైప్‌ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఓవర్సీస్‌లోని కొన్ని ఏరియాల్లో ‘దేవర’ ప్రీ బుకింగ్స్ ఓపెన్‌ చేశారు. డల్లాస్‌లోని XD స్క్రీన్స్‌లో తొలుత ఈ టికెట్స్‌ అందుబాటులోకి తీసుకొని రాగా నిమిషాల వ్యవధిలోనే అవి సేల్ అయ్యాయి. యూఎస్‌లో ఇప్పటివరకూ 19 ప్రాంతాల్లో 52 షోల కోసం టికెట్స్‌ విక్రయించారు. దాని ద్వారా ఇప్పటికే 75,727 డాలర్లు దేవర ఖాతాలోకి వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేవర ప్రీ బుకింగ్‌ కలెక్షన్స్ 100K డాలర్ల దిశగా పయనిస్తున్నట్లు అక్కడి ట్రేడ్‌ వర్గాలు తెలిపాయి.&nbsp; https://twitter.com/PrathyangiraUS/status/1829778068090863715 ట్రైలర్‌ రిలీజ్‌ డేట్‌ లాక్‌! ఎన్టీఆర్‌ ‘దేవర’ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ బజ్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సెప్టెంబర్‌ 15న దేవర ట్రైలర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్లు నెట్టింట ప్రచారం జోరుగుతోంది. ఆ దిశగా మేకర్స్‌ సన్నాహాలు సైతం మెుదలుపెట్టినట్లు సమాచారం. ట్రైలర్‌ ఎడిటింగ్‌ వర్క్‌ను కూడా రెండ్రోజుల్లో షురూ చేయబోతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో తారక్ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు. సెప్టెంబర్‌ 15న టాప్‌ లేచిపోతుందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆ రోజు కోసం ఇప్పటి నుంచే ఎదురుచూస్తున్నట్లు పోస్టులు చేస్తున్నారు. అయితే ట్రైలర్‌ రిలీజ్‌పై దేవర టీమ్‌ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.&nbsp; మూడో పాటకు రంగం సిద్ధం! దేవర సినిమా నుంచి రిలీజైన ‘ఫియర్‌’, ‘చుట్టమల్లే’ సాంగ్స్‌కు మ్యూజిక్‌ లవర్స్‌ నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘చుట్టమల్లే’ సాంగ్‌ యూట్యూబ్‌లో రికార్డ్‌ వ్యూస్‌ను సొంతం చేసుకొని ఆకట్టుకుంది. దీంతో మూడో పాటపై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే ఈ పాట గురించి లిరికిస్ట్‌ రామజోగయ్య శాస్త్రి హింట్స్ ఇచ్చారు. ఈ పాట అద్భుతంగా ఉంటుందంటూ హైప్‌ పెంచేశారు. ఇక దేవర థర్డ్‌ సాంగ్‌ మాస్‌ బీట్‌తో ఉండే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. సంగీత దర్శకుడు అనిరుధ్‌ తనదైన మ్యూజిక్‌తో ఈ పాటను సిద్ధం చేసినట్లు సమాచారం. సెప్టెంబర్‌ 7న వినాయక చవితి కానుకగా ఈ సాంగ్ రిలీజ్‌ కానునట్లు తెలుస్తోంది.&nbsp; తారక్‌ డబుల్‌ షేడ్‌ చూశారా.. దేవర రిలీజ్‌కు నెల రోజుల సమయం ఉన్న నేపథ్యంలో మంగళవారం (ఆగస్టు 27) ఓ స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. ఇందులో ఎన్టీఆర్‌ రెండు డిఫరెంట్‌ గెటప్‌లలో కనిపించాడు. అంతేకాదు 'నెల రోజుల్లోనే అతడి రాక ప్రపంచాన్ని కదిలించబోతోంది' అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్‌ ఒక్కసారిగా వైరల్‌గా మారింది. డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న ఎన్టీఆర్‌ లుక్‌ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ మాస్‌ జాతర పక్కా అంటూ అభిప్రాయపడుతున్నారు.&nbsp; https://twitter.com/DevaraMovie/status/1828291026936832064 ప్రమోషన్స్‌పై ఫోకస్‌! దేవర సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ మూవీలో తన పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్నానని ఎన్టీఆర్ ఇటీవలే వెల్లడించారు. అయితే, మిగిలిన కాస్త షూటింగ్‍ను కూడా డైరెక్టర్ కొరటాల శివ పూర్తి చేశారని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్‌ కూడా మెుదలు కానున్నట్లు తెలుస్తోంది. దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుమారు రూ.250కోట్ల బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందినట్లు సమాచారం. ఇందులో తారక్‌కు జోడీగా జాన్వీ కపూర్‌ నటించింది. బాలీవుడ్‌ నటులు సైఫ్ అలీఖాన్‌, బాబీ డియోల్‌ విలన్‌ పాత్రల్లో కనిపించనున్నారు.&nbsp;
    ఆగస్టు 31 , 2024
    Kalki 2898 AD Record: ప్రభాస్‌ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ రికార్డు గల్లంతు!
    Kalki 2898 AD Record: ప్రభాస్‌ వేట.. ‘కల్కి’ దెబ్బకు ‘ఆర్ఆర్‌ఆర్‌’ రికార్డు గల్లంతు!
    ప్రస్తుతం దేశంలో 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) ఫీవర్‌ నడుస్తోంది. గ్లోబల్‌ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ చేయగా ఆడియన్స్‌ నుంచి విశేష స్పందన వచ్చింది. ట్రైలర్‌లోని యాక్షన్ సీక్వెన్స్‌, గ్రాఫిక్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ హాలీవుడ్‌ రేంజ్‌ను తలపించాయి. ఇక ఏమాత్రం వేచి ఉండలేమన్న స్థాయిలో ట్రైలర్ ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. తాజాగా అమెరికాలో ఈ చిత్రం ప్రీ బుకింగ్స్ ఓపెన్‌ చేయగా అక్కడ కల్కి సరికొత్త రికార్డును నెలకొల్పింది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు బద్దలు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ'.. జూన్‌ 27న (Kalki Release Date) వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌ తేదీ దగ్గర పడుతుండంతో అమెరికాలో ఈ సినిమా ప్రీ బుకింగ్స్‌ను ఓపెన్‌ చేశారు. లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. అమెరికా ప్రీ బుకింగ్స్‌ హిస్టరీలో సరికొత్త చరిత్రను కల్కి క్రియేట్‌ చేసింది. బ్లాక్‌ బాస్టర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌' రికార్డును బద్దలు కొట్టింది. అమెరికా ప్రీ బుకింగ్స్‌లో అతి తక్కువ సమయంలో వన్‌ మిలియన్ కలెక్షన్స్‌ క్రాస్‌ చేసిన తొలి భారతీయ చిత్రంగా కల్కి సరికొత్త రికార్డు క్రియేట్‌ చేసింది. గతంలో ఈ రికార్డు 'ఆర్‌ఆర్‌ఆర్‌' పేరిట ఉండేది. ప్రస్తుతం ప్రీ బుకింగ్ అయిన టికెట్ల సంఖ్య గంట గంటకు గణనీయంగా పెరుగుతున్నట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.&nbsp; దిశా పటానీ.. క్యారెక్టర్‌ రివీల్‌ కల్కి సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్ హాసన్ (Kamal Hassan), దీపికా పదుకొనే (Deepika Padukone), దిశా పటాని (Disha Patani).. ఇలా పలువురు స్టార్స్ నటించిన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి ఇప్పటికే పలువురు స్టార్స్ క్యారెక్టర్ల పేర్లను పోస్టర్ల రూపంలో చిత్ర యూనిట్‌ రివీల్‌ చేసింది. తాజాగా దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా మేకర్స్‌ రిలీజ్‌ చేశారు.&nbsp; నేడు దిశా పటాని పుట్టిన రోజు కావడంతో మూవీలోని ఆమె పాత్ర పేరును కల్కి టీమ్‌ రివీల్‌ చేసింది. క్యారెక్టర్ పేరు ‘రాక్సీ’ అని పరిచయం చేస్తూ.. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో దిశా గోడకు ఆనుకొని తన నడుము అందాలు చూపిస్తూ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించింది. ప్రస్తుతం ఈ పోస్టర్‌ నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; బుజ్జిని నడిపిన ఆనంద్‌ మహీంద్ర ‘కల్కి’లో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన బుజ్జి(వాహనం)ని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా బుధవారం నడిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ తన యూట్యూబ్‌ ఛానెల్‌లో పంచుకుంది. డ్రైవ్‌ చేసిన అనంతరం ఆనంద్‌ మహీంద్ర బుజ్జితో ఫొటోలు దిగారు. కాగా, బుజ్జి వెహికల్‌ తయారీకి.. 'మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ' టీమ్‌ సహాయపడినట్లు ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఈ వాహనం రెండు మహీంద్ర ఇ-మోటర్లతో నడుస్తుందని చెప్పారు. నాగ్ అశ్విన్‌, అతడి టీమ్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆయన ప్రశంసించారు.&nbsp; https://www.youtube.com/watch?v=wS0gKXgO_AA&amp;t=25s
    జూన్ 13 , 2024
    <strong>Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!</strong>
    Vettaiyan Day 1 Collections: బాక్సాఫీస్‌ వద్ద తలైవా దూకుడు.. రికార్డు స్థాయిలో ‘వేట్టయన్‌’ డే 1 కలెక్షన్స్‌!
    సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గురువారం (అక్టోబర్‌ 10) ఈ సినిమా విడుదలైంది. అన్ని చోట్ల పాజిటివ్‌ టాక్‌ సంపాదించింది. మరి తొలి రోజు ఈ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? బాక్సాఫీస్‌ వద్ద ఎన్ని కోట్లు రాబట్టింది? ఇప్పుడు చూద్దాం. డే 1 కలెక్షన్స్ ఎంతంటే? రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘వేట్టయాన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సాలిడ్‌ కలెక్షన్స్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఈ చిత్రం వరల్డ్‌ వైడ్‌గా రూ. 60-68 కోట్లు (GROSS) వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక్క తమిళనాడులోనే రూ.20 కోట్లకు పైగా గ్రాస్‌ను తన ఖాతాలో వేసుకున్నట్లు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కలిపి రూ.10 కోట్లు, కేరళలో రూ.4 కోట్లు, హిందీ బెల్ట్‌లో రూ.60 లక్షలు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది అత్యధిక డే 1 కలెక్షన్స్‌ సాధించిన తమిళ చిత్రాల్లో వేట్టయాన్‌ రెండో స్థానంలో నిలిచినట్లు పేర్కొంటున్నాయి. ఓవరాల్‌గా 8 స్థానంలో చోటు దక్కించుకున్నట్లు తెలిపాయి. దసరా సెలవుల నేపథ్యంలో ఈ మూవీ కలెక్షన్స్‌ మరింత పెరిగే అవకాశముందని ట్రేడ్‌ పండితులు అభిప్రాయపడుతున్నారు.&nbsp; ఎప్పటికీ తలైవా ఒక్కరే..&nbsp; ‘వేట్టయన్’ మంచి విజయం సాధించడంపై రజనీ కుమార్తె సౌందర్య రజనీకాంత్‌ హర్షం వ్యక్తంచేశారు. చిత్రబృందాన్ని అభినందిస్తూ ఎక్స్‌ వేదికగా పోస్ట్ పెట్టారు. ‘ఎప్పటికీ ఒక్కరే తలైవా ఉంటారు. జ్ఞానవేల్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. నా సోదరుడు అనిరుధ్‌ బెస్ట్‌ మ్యూజిక్‌ అందించారు. వేట్టయన్‌ కంటెంట్‌కు తలైవా మాస్‌ యాక్షన్‌కు ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. దీన్ని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు’ అంటూ సౌందర్య ఎక్స్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తలైవా ఎప్పటికీ ఒక్కరే అంటూ రజనీ ఫ్యాన్స్‌ సైతం కామెంట్స్ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/soundaryaarajni/status/1844388762458976334 ‘వేట్టయన్‌’లో ఇవే హైలెట్స్‌! 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్‌'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అమితాబ్‌ బచ్చన్‌ - రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది. ముఖ్యంగా అనిరుధ్‌ రవిచంద్రన్ అందించిన సంగీతం సినిమాను నెక్స్ట్‌ లెవల్‌కు తీసుకెళ్లింది.&nbsp; కథేంటి పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp;
    అక్టోబర్ 11 , 2024
    <strong>Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్‌’ మెప్పించిందా?</strong>
    Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్‌’ మెప్పించిందా?
    నటీనటులు : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు దర్శకుడు : టీజీ జ్ఞానవేల్‌ సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఎడిటర్‌ : ఫిలోమిన్‌ రాజ్‌ సినిమాటోగ్రఫీ : ఎస్‌. ఆర్‌. ఖదీర్‌ నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాత: సుభాస్కరన్‌ అల్లిరాజా విడుదల తేదీ:&nbsp; అక్టోబర్‌ 10, 2024 సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే తెలుగు టైటిల్‌లోనూ తమిళ పేరే పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సాధించిందా? ‘జైలర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీకి మరో సాలిడ్‌ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఎప్పటిలాగే ఇందులో అద్భుతమైన నటన కనబరిచారు. మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం, ఎలివేషన్స్‌తో ఆయన పాత్ర కన్నుల పండుగగా అనిపిస్తుంది. ముఖ్యంగా రజనీ డైలాగ్‌ డెలివరీ, మ్యానరిజమ్స్‌ ఆడియన్స్‌ను బాగా మెప్పిస్తాయి. ఇక రజనీకి ధీటైన పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ అదరగొట్టారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తాయి. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. ఓవైపు నవ్విస్తూనే తన నటనతో ఫహాద్‌ మెప్పించాడు. అటు దగ్గుబాటి రానా, దుషారా విజయన్‌లకు సైతం మంచి పాత్రలే దక్కాయి. తమ నటనతో వారు ఎంతో సర్‌ప్రైజ్‌ చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. డైరెక్షన్ ఎలా ఉందంటే 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్‌'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం, ఊహాకందేలా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. కానీ, అమితాబ్‌ బచ్చన్‌ - రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథకు కమర్షియల్‌ లుక్ తీసుకురావడానికి కెమెరా వర్క్‌ ఉపయోగిపడింది. ఇక అనిరుధ్‌ నేపథ్య సంగీతం ఎప్పటిలాగే ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్‌ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. ఎడిటిర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. లైకా ప్రొడక్షన్స్‌ సినిమా నిర్మాణంలో రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రజనీకాంత్‌ నటనసోషల్‌ మెసేజ్‌సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనంఊహజనీతంగా ఉండటం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 10 , 2024
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    Top 10 Melody Hits Of Veturi : ఈ సాంగ్స్ వింటే ఎవరైన ప్లాట్ కావాల్సిందే భయ్యా..!
    వేటూరి సుందరరామమూర్తి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పేరు తెలియని వారుండరు. గేయ రచయితగా తెలుగు అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. తన కెరీర్‌లో 5 వేలకు పైగా పాటలకు సాహిత్య దానం చేశారు వేటూరి. వేటూరి పాటను కీర్తిస్తూ ఎన్నో పాటలు పుట్టుకు రావడం సుందర రామమూర్తి సాహిత్యానికి నిదర్శనం. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా తన పాటలతో అందరినీ మరిపించగలరు. మంచి మెలోడీ పాటలనూ రాయగలరు. మరి, వేటూరి కలం నుంచి జాలువారిన కొన్ని మెలోడీ గీతాలేంటో తెలుసుకుందామా.&nbsp; పూసింది పూసింది పున్నాగ సీతారామయ్యగారి మనవరాలు సినిమాలోని ‘పూసింది పూసింది పున్నాగ’ గేయం ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంది. పదాలను ప్రాసలో వాడటంలో వేటూరి ప్రావీణ్యమేంటో ఈ పాటలో తెలిసిపోతుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆహ్లాదంగా ఉంటాయి. వేటూరి మాటకు కీరవాణి బాణీ కడితే ఈ పాటలా ఉంటుంది. మీరూ వినేయండి మరి. https://www.youtube.com/watch?v=sBG_Z3zv96s యమహా నగరి కలకత్తా పురి చూడాలని వుంది సినిమాలోని పాట ఇది. కలకత్తా నగర విశిష్ఠతను తెలియజేస్తూ సాగిపోతుంటుందీ గీతం. బెంగాళీ చరిత్రను ఒక పాటలో అవపోసన పడితే వచ్చేదే ఈ గేయం. ‘కలలకు నెలవట.. కళలకు కొలువుట.. విధులకు సెలవట.. అతిథుల గొడవట.. కలకట నగరపు కిటకిటలో’ అంటూ ప్రాసలో చేర్చేశారు. వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్(నేతాజీ)లకు జన్మనిచ్చిన చోటు అంటూ గేయంలో చరిత్రను ఇనుమడించారు. https://www.youtube.com/watch?v=q2mt5XNgFVE యమునాతీరం ఆనంద్ సినిమాలోని ‘యమునాతీరం’ పాట చాలా మందికి ఎంతో ఇష్టం. ఉదయం లేవగానే ఈ పాటను ఎంతో మంది వింటుంటారు. ఉల్లాసంగా ఉంటూ.. కొత్త ఉత్సాహాన్ని నింపుతుందీ పాట. ‘శిశిరంలో చలి మంటై రగిలేది ప్రేమ.. చిగురించే రుతువల్లే విరబూసే ప్రేమ’ అంటూ సాగే గీతం నూతనోత్తేజాన్ని నింపుతుంది. హరిహరన్, చిత్ర వేటూరి సాహిత్యానికి ప్రాణం పోశారు. https://www.youtube.com/watch?v=375j2vlMbxM ఉప్పొంగెలే గోదావరి గోదావరి సినిమాలోని ‘ఉప్పొంగెలే గోదావరి’ పాట ఎంతో అద్భుతం. గోదావరి గొప్పదనాన్ని వేటూరి పాటకన్నా గొప్పగా ఏదీ వర్ణించదేమో అన్నట్లుగా ఉంటుందీ గీతం. ‘వెతలు తీర్చే మా దేవేరి.. వేదమంటి మా గోదారి.. శబరి కలిసిన గోదారి..రామ చరితకే పూదారి’ అంటూ గోదారి విశిష్ఠతను వర్ణించారు. బాల సుబ్రహ్మణ్యం పాటను మరోస్థాయికి తీసుకెళ్లారు.&nbsp; https://www.youtube.com/watch?v=yWnhTwJeKbQ తొలిసారి మిమ్మల్ని శ్రీవారికి ప్రేమలేఖ సినిమాలోని పాట ఇది. ఓ అబ్బాయిని చూసి మనసు పారేసుకున్న యువతి పాట పాడితే ఎలా ఉంటుందో ఈ గేయం చెబుతుంది. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు.. కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు’ అంటూ నివేదిస్తుంది.&nbsp; https://www.youtube.com/watch?v=VZEIVEjC5TE చుక్కల్లారా చూపుల్లారా ఆపద్భాందవుడు సినిమాలోని మధురమైన పాట ఇది. ‘చుక్కల్లారా చూపుల్లారా.. ఎక్కడమ్మా జాబిలీ.. మబ్బుల్లారా, మంచుల్లారా తప్పుకోండీ దారికీ’ అంటూ గేయం మొదలవుతుంది. ఇందులోని లిరిక్స్ శ్రోతలను కట్టిపడేస్తాయి. మీరూ ఈ మధుర గీతాన్ని ఆస్వాదించండి.&nbsp; https://www.youtube.com/watch?v=5QYZGxyg1ZE పచ్చందనమే సఖి సినిమాలోని తెలుగు వెర్షన్ పాటలను రాసింది వేటూరీనే. ఇందులో పచ్చందనమే పాట మ్యూజిక్ లవర్స్‌కి ఫేవరేట్ సాంగ్. ‘ఎర్రని రూపం ఉడికే కోపం.. మసకే పడితే మరకత వర్ణం.. అందం చందం అలిగిన వర్ణం’ అని సాగే లిరిక్స్ మెస్మరైజ్ చేసేస్తాయి.&nbsp; https://www.youtube.com/watch?v=XruNLPI0yQc జిలిబిలి పలుకుల సితార సినిమాలోని ‘జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా’ అంటూ ఈ పాట సాగుతుంది. ‘కలలను తెంచకు.. కలతను దాచకు’, ‘అడగను లే చిరునామా ఓ మైనా ఓ మైనా.. చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా’ వంటి వాక్యాలు ఇంప్రెస్ చేస్తాయి. ఇలాంటివి ఎన్నో ఉంటాయీ పాటలో. https://www.youtube.com/watch?v=yJNSkGafGJw మౌనమేళనోయి సాగర సంగమం సినిమాలోని పాటలన్నీ ప్రత్యేకం. అందులోనూ ‘మౌనమేళనోయి’ మెలోడీ మరెంతో స్పెషల్. ‘ఎదలో వెన్నెల.. వెలిగే కన్నుల.. తారాడే హాయిల’ అంటూ శ్రోతలను హాయిని చేకూర్చారు వేటూరి. అందుకే ఇప్పటికీ ఈ పాట వెంటాడుతూనే ఉంటుంది.&nbsp; https://www.youtube.com/watch?v=N-J2YjDtBGs రెక్కలొచ్చిన ప్రేమ బస్ స్టాప్ సినిమాలోని ‘రెక్కలొచ్చిన ప్రేమా నింగికి ఎగిరిందా’ పాట మ్యూజిక్ లవర్స్‌కి ఎంతో ఇష్టం. ‘ఆకాశం ఇల్లవుతుందా రెక్కలొచ్చాక.. అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక’ అంటూ ప్రశ్నిస్తూనే తత్వాన్ని చెప్పారు వేటూరి. ఈ పాటను ఓసారి వినేయండి మరి. https://www.youtube.com/watch?v=hQ7EaelCpP8
    జూన్ 21 , 2023
    <strong>Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. విజేత ఎవరంటే?</strong>
    Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. విజేత ఎవరంటే?
    దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గతవారం బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. వీటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. ‘వేట్టయన్‌’, ‘విశ్వం’, ‘మా నాన్న సూపర్‌ హీరో’, ‘జిగ్రా’ మూవీస్‌ దసరా కానుకగా రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. మరి వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం వసూళ్ల పరంగా టాప్‌లో నిలిచింది? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; వేట్టయన్‌ (Vettaiyan) రజనీకాంత్‌ హీరోగా టి. జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘వేట్టయన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ. 201.21 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.81 కోట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపాయి. తెలుగుల రాష్ట్రాల్లో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.20 కోట్లు, కర్ణాటకలో రూ. 19.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5 కోట్లు రాబట్టినట్లు చెప్పాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ. 67.26 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. కలెక్షన్ల పరంగా చూస్తే వేట్టయన్‌ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి దసరా విజేతగా నిలిచిందని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/Filmy_Track/status/1845727131768082555 విశ్వం (Viswam) మాస్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్, కామెడీ కింగ్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం చిత్రం దసరా సందర్భంగా రిలీజై పర్వాలేదనిపించింది. అక్టోబర్‌ 11 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దారుణంగా ఫెయిల్‌ అయినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 7 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఏపీలో రూ.3.60 కోట్లు, నైజాంలో రూ. 2.20 కోట్లు, కర్ణాటకలో రూ.30 లక్షలు, రెస్ట్‌ ఆఫ్ ఇండియాలో రూ.20 లక్షలు మాత్రమే రాబట్టినట్లు అభిప్రాయపడ్డాయి. అటు ఓవర్సీస్‌లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే రెండో రోజు నాటికే డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ అయినట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక పోస్టు పెట్టడం గమనార్హం. https://twitter.com/AndhraBoxOffice/status/1845695019199463627 https://twitter.com/Colliderreview/status/1845720361499083121 మా నాన్న సూపర్‌ హీరో (Maa Nanna Super Hero) సుధీర్ బాబు&nbsp; (Sudheer Babu)&nbsp; హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero). అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ చిత్రం వీకెండ్‌ పూర్తయ్యేసరికి రూ. 75 లక్షలు (GROSS) మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో రూ.68 కోట్లు నెట్‌ వసూళ్లుగా ఉన్నట్లు తెలిపాయి. తొలి రోజు రూ.19 లక్షలు, రెండో రోజు రూ.26 లక్షలు, మూడో రోజు రూ.23 లక్షలు మాత్రమే రాబట్టినట్లు వివరించాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ సాధించాలంటే రూ.5.2 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది.&nbsp; జిగ్రా (Jigra) బాలీవుడ్‌ బ్యూటీ లీడ్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం 'జిగ్రా'. వాసన్ బాలా దర్శకత్వం వహించారు. తెలుగు నటుడు రాహుర్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబర్‌ 11న తెలుగు, హిందీతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ.26 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ.16.47 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. హిందీలో రాజ్‌కుమార్‌ రావు, త్రిప్తి దిమ్రీ కాంబోలో రిలీజైన 'విక్కీ ఔర్‌ విద్యా కా వోహ్‌ వాలా' మూవీ నుంచి జిగ్రాకు గట్టి పోటీ ఎదురైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో జిగ్రా కలెక్షన్స్‌లో కొంతమేర కోత పడినట్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp;
    అక్టోబర్ 14 , 2024
    <strong>#BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!</strong>
    #BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!
    భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్‌. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్‌ అన్నా, డైలాగ్‌ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్‌ నుంచి ‘వేట్టయన్‌’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్‌ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; ‘తెలుగు ప్రేక్షకులంటే లోకువా’ రజనీకాంత్‌ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట్టయన్'. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. అయితే తమిళంలో పెట్టిన వేట్టయన్‌ టైటిల్‌నే తెలుగులోనూ మక్కీకి మక్కీ దించారు. దీనిని తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో వేటగాడు అనే పదం ఉన్నప్పటికీ తమిళ టైటిల్‌నే తెలుగులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అంత లోకవయ్యారా? అంటూ నిలదీస్తున్నారు. బాషాభిమానం ఉన్నది మేకేనా? తెలుగు వారికి లేదనకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్‌ను తెలుగు బహిష్కరించాలంటూ ఎక్స్‌ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/thenaani29/status/1843888854568431666 https://twitter.com/Kadirodu/status/1843694483508211884 https://twitter.com/kannayyaX/status/1843899836732743696 https://twitter.com/Jyotheshkum/status/1843844509123391639 ఆ సినిమాలు కూడా అంతే! కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని తెలుగు ఆడియన్స్‌కు పేరుంది. తమిళంలో ఫ్లాప్‌ అయిన చిత్రాలు సైతం తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ‘డబ్బింగ్‌’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి నేరుగా సినిమాలను రిలీజ్‌ చేస్తున్నారు. ‘కంగువ’, ‘వేట్టయన్‌’, ‘తంగలాన్‌’, ‘రాయన్‌’ ‘వలిమై’ వంటి తమిళ టైటిల్స్‌ను తెలుగులో అదే పేరుతో తీసుకురావడాన్ని తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. చక్కగా తెలుగు టైటిల్స్‌ పెట్టొచ్చు కదా అని కామెంట్స్‌ చేస్తున్నారు. తెలుగును గౌరవించని వారిని తెలుగు ఆడియన్స్‌ ఆదరించరని స్పష్టం చేస్తున్నారు.&nbsp; తెలుగు భాష వద్దా! గతంలో తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. ఇక టైటిల్స్ సంగతి సరే సరి. రజినీకాంత్ లాంటి హీరో కూడా ‘వేట్టయాన్‌’ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఆడియన్స్‌ డబ్బు కావాలి కానీ భాష వద్దా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
    అక్టోబర్ 09 , 2024
    <strong>Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్‌ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్</strong>
    Kalki 2898 AD Collections: రూ.1000 కోట్లు క్రాస్‌ చేసిన కల్కి, ఆ విషయంలో ఏకైక హీరోగా ప్రభాస్
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 15 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్‌ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్‌ చిత్రం దూసుకెళ్తోంది. తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్‌ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. ఈ సినిమా రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరినట్లు నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో గతంలో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రాలు ఏవి? అందులో కల్కి ఏ స్థానంలో నిలిచింది? ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.&nbsp; 15 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే? ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం 15 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 15 రోజుల్లో రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేసింది. ప్రభాస్ కర్ణుడు గెటప్‌లో ఉండి రూ.1000 కోట్లకు గురి పెట్టినట్లుగా ఈ పోస్టర్‌ను డిజైన్‌ చేశారు. ప్రస్తుతం ఇది&nbsp; నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ సత్తా ఏంటో మరోమారు నిరూపితమైందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/Kalki2898AD/status/1812023448681750927 ఏకైకా సౌత్‌ హీరోగా ప్రభాస్‌ ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం ద్వారా హీరో ప్రభాస్‌ రికార్డు సృష్టించాడు. రెండు సార్లు రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరిన ఏకైక దక్షిణాది హీరోగా నిలిచాడు. 'బాహుబలి 2' చిత్రం ద్వారా ప్రభాస్‌ తొలిసారి రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరాడు. సలార్‌తో మరోమారు రూ.1000 కోట్లను టచ్‌ చేస్తాడని భావించినా రూ.705–715 కోట్ల దగ్గరే ఆగిపోయాడు. అయితే తాజాగా కల్కితో రెండోసారి ఈ ఫీట్‌ను సాధించాడు. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్‌ వద్ద తనకు తిరుగులేదని నిరూపించాడు. తద్వారా బాలీవుడ్‌ బాద్‌ షా షారుక్‌ ఖాన్‌ (Shah Rukh Khan) రికార్డ్‌ను ప్రభాస్‌ సమం చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్లే రెండుసార్లు తమ చిత్రాలను వెయ్యి కోట్ల క్లబ్‌లో నిలిపాడు. జవాన్‌, పఠాన్‌ చిత్రాల ద్వారా షారుక్ ఈ ఘనత సాధించాడు.&nbsp; త్వరలో టాప్‌-3లోకి ‘కల్కి’ తాజా కలెక్షన్స్‌తో భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కల్కి ఏడో స్థానంలో నిలిచింది. రూ.2,023 కోట్లతో అమీర్‌ ఖాన్‌ నటించిన ‘దంగల్‌’ (Dangal) టాప్ ప్లేసులో కొనసాగుతోంది. ప్రభాస్‌ నటించిన 'బాహుబలి 2' చిత్రం రూ.1,810 కోట్లతో సెకండ్‌ ప్లేస్‌లో ఉంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రూ.1,387 కోట్లు, ‘కేజీఎఫ్‌ 2’ రూ.1,200–1,250 కోట్లు, ‘జవాన్‌’ రూ.1,148 కోట్లు, ‘పఠాన్’ రూ.1,050 కోట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అయితే కల్కి రెండు వారాల వ్యవధిలోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది. రూ.1300 కోట్లకు పైగా రాబట్టి ఈ జాబితాలో ఈజీగా మూడో స్థానంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 3, 4, 5 స్థానాల్లో నిలిచిన ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, జవాన్ సినిమాలకు షాక్‌ తప్పేలా లేదు. డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ&nbsp; వైజయంతీ మూవీస్‌.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘లెట్స్‌ సెలబ్రేట్‌ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్‌ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్‌ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్‌ చేసుకుంది. ఫస్ట్‌ వీకెండ్‌ ఎంత వచ్చిందంటే? ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్‌ వీకెండ్‌లో వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్‌ వీక్‌ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది.&nbsp; https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
    జూలై 13 , 2024
    <strong>Kalki 2898 AD : రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’? బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం!</strong>
    Kalki 2898 AD : రూ.1000 కోట్ల క్లబ్‌లో ‘కల్కి’? బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం!
    రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas), నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) దర్శకత్వంలో రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ బాక్సాఫీస్‌ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సినిమా విడుదలై 11 రోజులు గడిచినప్పటికీ కలెక్షన్స్‌ వేటలో ఏమాత్రం జోరు తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ప్రభాస్‌ చిత్రం దూసుకెళ్తోంది. మరీ ముఖ్యంగా నార్త్‌ అమెరికాలో 'కల్కి' మేనియా కొనసాగుతోంది. అక్కడి ప్రవాస భారతీయులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా వెల్లడైన కల్కి వరల్డ్ వైడ్‌ కలెక్షన్స్‌ కళ్లు చెదిరేలా చేస్తున్నాయి. 11 రోజుల కలెక్షన్స్‌ ఎంతంటే? ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 11 రోజులుగా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఇప్పటివరకూ వసూలైన కలెక్షన్స్‌ను నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్‌ అధికారికంగా ప్రకటించింది. కల్కి చిత్రం 11 రోజుల్లో రూ.900 కోట్లకు పైగా వసూళ్లను సాధించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ స్పెషల్‌ పోస్టర్‌ను ఎక్స్‌ వేదికగా రిలీజ్‌ చేసింది. ఈ పోస్టర్‌ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ సత్తా ఏంటో మరోమారు నిరూపితమవుతోందని ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తున్నారు. https://twitter.com/VyjayanthiFilms/status/1810220707357565060 నార్త్‌ అమెరికాలో రికార్డు కల్కి సినిమాకు నార్త్‌ అమెరికాలో ఊహించని స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది. అక్కడి సినీ లవర్స్‌ ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఫలితంగా మెుదటి 9 రోజుల్లోనే ఈ చిత్రం 14.82 మిలియన్‌ డాలర్లను వసూలు చేసినట్లు ట్రెడ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇది భారతీయ కరెన్సీ ప్రకారం రూ.123.76 కోట్లకు సమానమని పేర్కొన్నాయి. ఈ వీకెండ్‌కు భారీ ఎత్తున అడ్వాన్స్‌ బుకింగ్స్‌ కూడా జరిగినట్లు చెబుతున్నారు. https://twitter.com/PrathyangiraUS/status/1809472342265065863 రూ.1000 కోట్లకు అడుగు దూరంలో! ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం రూ.1000 కోట్ల మార్క్‌ను అందుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఇంకో రూ.100 కోట్లు సాధిస్తే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరుతుంది. తద్వారా రిలీజ్‌కు ముందు పెట్టుకున్న టార్గెట్‌ను అందుకుంటుంది. బుధవారం నాటికి రూ.1000 కోట్ల మార్క్‌ను కల్కి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ శుక్రవారం వరకూ ఏ కొత్త సినిమా లేకపోవడం కల్కికి కలిసిరానుంది. కలెక్షన్స్‌ మరింత పెరగనున్నాయి. https://twitter.com/i/status/1808841062838063340 డే1 కలెక్షన్స్‌ ఎంతంటే? 'కల్కి 2898 ఏడీ' మూవీ డే 1 కలెక్షన్స్‌పై ప్రస్తుతం అందరి దృష్టి నెలకొంది. నిర్మాణ సంస్థ&nbsp; వైజయంతీ మూవీస్‌.. మెుదటి రోజు వసూళ్లను అధికారికంగా ప్రకటించింది. ‘కల్కి’ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.191.5 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు మేకర్స్‌ ప్రకటించారు. ‘లెట్స్‌ సెలబ్రేట్‌ సినిమా’ అనే క్యాప్షన్‌తో స్పెషల్‌ పోస్టర్‌ను సైతం రిలీజ్‌ చేశారు. వాస్తవానికి కల్కి చిత్రం తొలిరోజు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని ట్రైడ్‌ వర్గాలు ముందు నుంచి లెక్కలు వేశాయి. ఇప్పటివరకూ ఉన్న డే1 రికార్డ్స్‌ అన్ని తుడిచిపెట్టుకుపోతాయంటూ విశ్లేషణలు వచ్చాయి. అయితే కొద్దిలో రూ.200 కోట్ల మార్క్‌ను ‘కల్కి’ మిస్‌ చేసుకుంది. కానీ, ఈ వారంతంలో కల్కి కచ్చితంగా రూ.500 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.&nbsp; https://twitter.com/Kalki2898AD/status/1806617136690839769 ఫస్ట్‌ వీకెండ్‌ ఎంత వచ్చిందంటే? ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం.. ఫస్ట్‌ వీకెండ్‌లో వరల్డ్‌ వైడ్‌గా రూ.555 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. ఈ మేరకు హీరో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, దీపికా పదుకొనే ఇతర ప్రధాన తారాగణం ఉన్న స్పెషల్‌ పోస్టర్‌ను నిర్మాణ సంస్థ లాస్ట్‌ వీక్‌ పోస్టు చేసింది. ‘గ్లోబల్ బాక్స్ ఆఫీస్‌లో అతిపెద్ద శక్తులు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. నెమ్మదించే సూచనలు కనిపించడం లేదు’ అంటూ ఈ పోస్టర్‌కు క్యాప్షన్‌ ఇచ్చింది. https://twitter.com/VyjayanthiFilms/status/1807678411529506945
    జూలై 08 , 2024
    <strong>Rana Daggubati: బాహుబలి కలెక్షన్లు అంతా ఉత్తిదేనా? రానా ఎందుకు అలా అన్నాడు?</strong>
    Rana Daggubati: బాహుబలి కలెక్షన్లు అంతా ఉత్తిదేనా? రానా ఎందుకు అలా అన్నాడు?
    ఒకప్పుడు సినిమా సక్సెస్‌ను కలెక్షన్స్‌ బట్టి కాకుండా ఎన్ని రోజులు ఆడింది అన్నదానిని కొలమానంగా తీసుకునేవారు. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కలెక్షన్స్‌ను బట్టి ఆ సినిమా సక్సెస్‌ను డిసైడ్‌ చేస్తున్నారు. ఇందులో భాగంగా మేకర్స్‌ సైతం ఏ రోజుకారోజు వసూళ్లను ప్రకటిస్తూ ఆడియన్స్‌లో హైప్‌ పెంచే ప్రయత్నం చేస్తుంటారు. అయితే మేకర్స్‌ అనౌన్స్‌ చేసే కలెక్షన్స్‌ రియాలిటీకి చాలా దూరంగా ఉంటుందన్న కామెంట్స్‌ ఇండస్ట్రీలో తరుచూ వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) మూవీ కలెక్షన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; కలెక్షన్స్‌పై రానా ఏమన్నారంటే? దగ్గుబాటి రానా (Rana Daggubati)కు నటుడిగా టాలీవుడ్‌ (Tollywood)లో మంచి పేరుంది. ‘బాహుబలి’ (Baahubali) ‘బాహుబలి 2 (Baahubali 2)’ తర్వాత అతడి క్రేజ్‌ పాన్ ఇండియా స్థాయికి చేరింది. రీసెంట్‌గా రజనీకాంత్‌ ‘వేట్టయాన్‌’ సినిమాలోనూ రానా ప్రతీనాయకుడిగా కనిపించి తన మార్క్ చూపించాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రానా మూవీ కలెక్షన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘బాక్సాఫీస్ నంబర్లు అనేది ఒక కామెడీ విషయం. చాలా మందికి తెలుసో లేదో పోస్టర్స్‌లో నెంబర్స్ అనేది టైం పాస్‌కి వేస్తారు. అవి రియల్ నెంబర్స్ కాదు. జస్ట్ మార్కెటింగ్ కోసం వేస్తారు. వచ్చే గ్రాస్‌కి ఫైనల్‌గా వచ్చే డబ్బులకు సంబంధం ఉండదు’ అని అన్నాడు. దీంతో రానా వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. మా హీరోల చిత్రాలకు వచ్చిన కోట్ల కలెక్షన్స్ నిజం కాదా? అని అభిమానులు పోస్టులు పెడుతున్నారు.&nbsp; https://twitter.com/i/status/1858578978132685054 ఈసారి బూతులు తగ్గించి.. బాబాయ్‌ విక్టరీ వెంకటేష్‌తో రానా (Rana Daggubati) చేసిన తొలి వెబ్‌సిరీస్ 'రానా నాయుడు' (Rana Naidu) పై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయిన వెంకటేష్ ఈ సిరీస్‌లో బూతులు మాట్లాడటాన్ని ఆడియన్స్‌ తీసుకోలేకపోయారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ చూసే విధంగా సిరీస్‌ లేదని అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు పార్ట్‌ 2 త్వరలోనే రానున్నట్లు ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సీజన్‌ 2పై రానా మాట్లాడారు. సెకండ్‌ సిరీస్‌ షూటింగ్‌ పూర్తైనట్లు చెప్పారు. తొలి సీజన్‌తో పోలిస్తే ఈసారి కంటెంట్‌, భాష మెరుగ్గా ఉంటుందని రానా హామీ ఇచ్చాడు. అయితే తొలి సిరీస్‌ను ఫ్యామిలీ ఆడియన్స్ చూడొద్దని ముందే సూచించామని రానా గుర్తుచేశారు. కానీ ఎవరు వినలేదని అందుకే ఆ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయని అభిప్రాయపడ్డారు. అమెజాన్‌లో రానా టాక్‌ షో టాలీవుడ్‌ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న అన్‌ స్టాపబుల్‌ (Unstoppable) ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా రూపొందించిన ఈ టాక్‌ షో మంచి బజ్‌ క్రియేట్‌ చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా అమెజాన్‌ ప్రైమ్‌ కూడా దగ్గుబాటి రానా హోస్ట్‌గా ఓ టాక్‌ షోను ప్లాన్‌ చేసింది. 'ది రానా దగ్గుబాటి షో' పేరుతో నవంబర్‌ 23 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ షోకు రామ్‌గోపాల్‌ వర్మ, నాని, నాగ చైతన్య, దుల్కర్ సల్మాన్‌, సిద్ధు జొన్నలగడ్డ, తేజ సజ్జా, శ్రీలీల గెస్టులుగా రానున్నట్లు సమాచారం. తొలి సీజన్‌లో 8 ఎపిసోడ్స్ ఉంటాయని తాజా ఇంటర్వ్యూలో రానా (Rana Daggubati) చెప్పాడు. ఒక్కో ఎపిసోడ్‌ 40 నిమిషాలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభాస్‌, బాలకృష్ణలను ఈ టాక్‌ షోకు ఆహ్వానించాలని ఉందని రానా తెలిపారు. దీనిపై వారితో మాట్లాడి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. దీంతో రెబల్‌, నందమూరి ఫ్యాన్స్ తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.&nbsp;
    నవంబర్ 19 , 2024
    <strong>Kanguva Movie: ‘కంగువా’ టీమ్‌ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!</strong>
    Kanguva Movie: ‘కంగువా’ టీమ్‌ వినూత్న నిర్ణయం.. ఇది కదా టెక్నాలజీని వాడుకోవడం అంటే!
    సూర్య (Suriya) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). శివ దర్శకత్వంలో ఇది రూపొందుతుంది. స్టూడియో గ్రీన్‌, యూవీ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఏఐ (ఆర్టిఫిషయల్‌ ఇండిలిజెన్స్‌)తో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. ఏఐతో డబ్బింగ్‌ ‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్‌ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు.&nbsp; రూ.1000 కోట్ల లక్ష్యం! రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్‌ చెప్పారు. పార్ట్‌ 2, పార్ట్‌ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్‌ ఫేమ్‌ బాబీ డియోల్‌ విలన్‌ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.&nbsp; ధూమ్‌ 4 విలన్‌గా సూర్య! హిందీలో వచ్చిన ధూమ్‌, ధూమ్‌ 2, ధూమ్‌ 3 చిత్రాలు ఎంతటి విజయాన్ని సాధించాయో అందరికీ తెలిసిందే. త్వరలోనే 'ధూమ్‌ 4' పట్టాలెక్కించేందుకు నిర్మాణ సంస్థ యశ్‌ రాజ్‌ ఫిల్మ్‌ సన్నాహాలు చేస్తోంది. ‘ధూమ్‌, పార్ట్‌ 2, 3’లకు కథను అందించిన ఆదిత్య చోప్రానే (Aditya chopra) ఈ సినిమాకీ వర్క్‌ చేస్తున్నారని సమాచారం. ఇందులో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. దీంతో కోలీవుడ్‌ నటుడు సూర్యను అతడికి ప్రతినాయకుడిగా తీసుకోవాలని చిత్ర వర్గాలు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై చిత్రబృందం ఇప్పటికే సూర్యను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఈ రోల్‌లో యాక్ట్‌ చేేసేందుకు సూర్య ఆసక్తి చూపారని కూడా టాక్‌ వినిపించింది. దీంతో అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అని సూర్య ఫ్యాన్స్‌తో పాటు సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు.&nbsp; రోలెక్స్‌గా మార్క్‌! కమల్‌ హాసన్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన 'విక్రమ్‌ చిత్రం దేశవ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది. డ్రగ్స్‌ నేపథ్యంలో సాగిన ఈ సినిమాలో తమిళ నటుడు విజయ్‌ సేతుపతి విలన్‌గా నటించాడు. మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అయితే క్లైమాక్స్‌లో డ్రగ్‌ డీలర్లకు హెడ్‌గా సూర్య కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. రోలెక్స్‌ పాత్రలో అతడి లుక్‌ ఎంతో క్రూరంగా కనిపించింది. 'విక్రమ్ 2' చిత్రంలో సూర్య విలన్‌ పాత్రలో కనిపించనున్నట్లు ఈ క్లైమాక్స్‌ ద్వారా డైరెక్టర్‌ స్పష్టం చేశారు. అంతకుముందు ‘24’ చిత్రంలోనూ సూర్య విలన్‌గా చేశాడు. ఇందులో రెండు పాత్రలు పోషించగా అందులో ఒకటి నెగిటివ్‌ రోల్.
    అక్టోబర్ 14 , 2024
    <strong>Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్‌.. ఇది మామూలు హైప్‌ కాదు భయ్యా!&nbsp;</strong>
    Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్‌.. ఇది మామూలు హైప్‌ కాదు భయ్యా!&nbsp;
    ‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్‌ ఇండియా స్థాయిలో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హిందీలోనూ పలు చిత్రాలు చేసి అక్కడా మంచి పేరు సంపాదించాడు. హిందీలో తెలుగు సినిమాలను ప్రమోట్‌ చేస్తూ అండగా నిలుస్తున్నాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’ రానా ఓ ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రం అక్టోబర్‌ 10న గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ఆడియో లాంచ్‌ జరగ్గా రానాపై రజనీకాంత్‌ ఆసక్తికర కామెంట్స్ చేశారు.&nbsp; ‘రానా భయపెట్టాడు’ రజనీకాంత్‌ హీరోగా ‘జై భీమ్' ఫేమ్ టీజీ జ్ఞానవేల్ రూపొందించిన చిత్రం ‘వేట్టయన్‌’. తాజాగా జరిగిన ఈ మూవీ ఆడియో ఫంక్షన్‌లో రజనీకాంత్‌ మాట్లాడారు. ఈ క్రమంలో రానా గురించి ఓ రేంజ్‌లో హైప్‌ ఇచ్చారు. అతడిపై ప్రశంసల వర్షం కురిపించారు. రామానాయుడి మనవడిగా రానా చిన్నప్పటి నుంచి తనకు తెలుసని రజనీ అన్నారు. అప్పట్లోనే రానా షూటింగ్‌కి వచ్చేవాడని, ఫుల్‌ జాలీగా ఉండేవాడని తెలిపారు. కానీ ఇప్పుడు యాక్టింగ్‌ చేస్తూ సీరియస్‌ లుక్స్‌లో కనిపిస్తున్నట్లు చెప్పారు. రానా సీరియస్‌ లుక్‌ చూసి తాను నిజంగా భయపడేవాడినని రజనీ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. రజనీకాంత్‌ లాంటి సూపర్‌స్టార్ రానాని పొగడటం నిజంగా గొప్ప విషయమని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/i/status/1843720706057724332 కథ మార్చేసిన రజనీ వేట్టయన్‌ కథకు సంబంధించి ఇటీవల రజనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టి.జె. జ్ఞానవేల్‌ మొదట తీసుకువచ్చిన కథకు తాను మార్పులు సూచించినట్లు చెప్పారు. ‘వేట్టయన్ కథ వినమని సౌందర్య నాకు చెప్పడంతో విన్నాను. బాగుందనిపించింది. అయితే కథలో కొన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ యాడ్‌ చేయాలని కోరాను. కథ మార్చేందుకు జ్ఞానవేల్‌ ఒప్పుకున్నారు. కానీ నెల్సన్‌ దిలీప్‌కుమార్‌, లోకేష్‌ కనగరాజ్‌ల సినిమాగా మార్చలేనని చెప్పారు. నాకూ అదే కావాలని చెప్పా. లేదంటే లోకేష్‌, దిలీప్‌ల దగ్గరకే వెళ్లేవాడిని కదా అని అన్నా. 10 రోజుల తర్వాత కథలో మార్పులు చేసి తీసుకొచ్చాడు. అది చూసి నేను ఆశ్చర్యపోయాను’ అని రజనీ తెలిపారు. అదే సమయంలో సినిమాకు అనిరుధ్‌ మాత్రమే సంగీత దర్శకుడిగా ఉండాలని జ్ఞానవేల్‌ను పట్టుపట్టినట్లు రజనీ చెప్పారు.&nbsp; రజనీపై తమిళ డైరెక్టర్‌ ఆరోపణలు సూపర్ స్టార్ రజనీ కాంత్‌పై కోలీవుడు స్టార్ డైరెక్టర్​ కె.ఎస్‌.రవికుమార్‌ చేసిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'లింగ' ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. తాజాగా యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమా పరాజయం గురించి దర్శకుడు మాట్లాడారు. ‘లింగ ఎడిటింగ్‌ విషయంలో సూపర్ స్టార్ రజనీ కాంత్‌ జోక్యం చేసుకున్నారు. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ చేసేందుకు నాకు ఏ మాత్రం కూడా సమయం ఇవ్వలేదు. సెకండాఫ్‌ మొత్తాన్ని పూర్తిగా మార్చేశారు. అనుష్కతో ఉండాల్సిన ఒక సాంగ్​, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తీసేశారు. ఆర్టిఫిషియల్​గా ఉండే బెలూన్‌ జంపింగ్‌ సీన్‌ కూడా ఆయనే జోడించారు. మొత్తంగా లింగ చిత్రాన్ని గందరగోళం చేసేశారు’ అని రవి కుమార్‌ కీలక కామెంట్స్​ చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి. రజనీ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ రజనీకాంత్‌ ఫ్యూచర్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి క్రేజీ వార్త బయటకొచ్చింది. స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంలో ఆయన నటించనున్నట్లు స్ట్రాంగ్‌ బజ్ వినిపిస్తోంది. 33 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.&nbsp; వీరిద్దరి కాంబోలో 1991లో ‘దళపతి’ చిత్రం వచ్చింది. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఇద్దకూ కలిసి సినిమా చేయలేదు. తాజా ప్రాజెక్ట్‌ కోసం రజనీ, మణిరత్నం మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబరులో రజనీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన రావొచ్చని కోలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు లోకేష్‌ కనగరాజ్‌ డైరెక్షన్‌లో ‘కూలీ’ అనే చిత్రంలో రజనీ నటిస్తున్నారు. దీని తర్వాత నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో ‘జైలర్‌ 2’ చేయనున్నారు రజనీ.&nbsp;
    అక్టోబర్ 09 , 2024
    <strong>New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!</strong>
    New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!
    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు వేట్టయాన్‌ (Vettaiyan) తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’.&nbsp; ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్న ఈ మూవీలో అమితాబ్‌, ఫహద్‌ ఫాజిల్‌, రానా, మంజు వారియర్‌, రితికా సింగ్‌, దుషారా విజయన్‌ కీలకపాత్రలు పోషించారు. అనిరుధ్‌ సంగీతం అందించారు. దసరా కానుకగా అక్టోబరు 10న ఈ చిత్రం విడుదల (Vettaiyan Release Date) కానుంది. జైలర్‌ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీ నటించిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో వేట్టయాన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. విశ్వం (Viswam) ప్రముఖ నటుడు గోపిచంద్‌ (Gopichand) హీరోగా శ్రీను వైట్ల (Srinu Vaitla) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ’విశ్వం’ (Viswam). ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి సంయుక్తంగా నిర్మించారు. కావ్య థాపర్‌ హీరోయిన్‌గా చేసింది. అక్టోబరు&nbsp; 11న (Viswam Movie Release Date) విడుదలవుతోంది. కామెడీ చిత్రాలకు కేరాఫ్‌గా మారిన శ్రీను వైట్లతో నటుడు గోపిచంద్‌ గతకొంత కాలంగా సరైన హిట్‌ లేక ఇబ్బంది పడుతున్నారు. ఈ సినిమాతో కచ్చితంగా హిట్‌ కొట్టాలని ధీమాతో ఉన్నారు. ఇప్పటికే విడుదలైన విశ్వం ట్రైలర్‌, టీజర్‌ ఆకట్టుకున్నాయి. మా నాన్న సూపర్‌ హీరో (Maa Nanna Super Hero) సుధీర్‌ బాబు (Sudheer Babu) కథానాయకుడిగా అభిలాష్‌ రెడ్డి కంకర దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘మా నాన్న సూపర్‌ హీరో’ (Maa Nanna Super Hero). ఆర్ణ కథానాయికగా చేసింది. షాయాజీ షిండే కీలక పాత్రలో కనిపించబోతున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 11న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచడంతో అంచనాలను రేకెత్తించాయి. జనక అయితే గనక (Janaka Ithe Ganaka) యంగ్‌ హీరో సుహాస్‌ వరుసగా చిత్రాలు రిలీజ్‌ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘జనక అయితే గనక’ ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. సంకీర్తన కథానాయక. ఈ చిత్రాన్ని దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. సందీప్‌ బండ్ల దర్శకత్వం వహించారు. అక్టోబరు 12న ఈ మూవీ విడుదల కానుంది.&nbsp; జిగ్రా (Jigra) అలియా భట్, వేదాంగ్‌ రైనా ప్రధాన పాత్రల్లో వాసన్‌ బాలా రూపొందించిన బాలీవుడ్‌ చిత్రం ‘జిగ్రా’.&nbsp; అక్టోబరు 11న (Jigra Release Date) థియేటర్లలోకి రానుంది. తెలుగులో ఏషియన్‌ సురేశ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రానా దగ్గుబాటి విడుదల చేస్తున్నారు. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ కలయికతో వచ్చిన ఈ చిత్రం అన్నివర్గాలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఇప్పటికే విడుదలై ట్రైలర్‌ సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉంది.&nbsp; మార్టిన్‌ (Martin) కన్నడ నటుడు ధ్రువ సర్జా ఈ వారం మార్టిన్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఎ.పి. అర్జున్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వైభవి శాండిల్య కథానాయిక.ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని అక్టోబరు 11న (Martin Movie Release Date) విడుదల చేస్తున్నారు. యాక్షన్ చిత్రాల ప్రేమికులను ఈ మూవీ తప్పక మెప్పిస్తుందని మేకర్స్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు లెవెల్ క్రాస్ అమ‌లాపాల్ హీరోయిన్‌గా న‌టించిన మ‌ల‌యాళం మూవీ ‘లెవెల్ క్రాస్’ థియేట‌ర్ల‌లో రిలీజైన రెండు నెలల త‌ర్వాత ఓటీటీలోకి వ‌స్తోంది. సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీకి అర్ఫాజ్‌ అయూబ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఆసిఫ్‌ అలీ హీరోగా న‌టించాడు. అక్టోబర్‌ 11 నుంచి ఆహాలో ఈ చిత్రం ప్రసారం కానుంది. ప్లాట్‌ ఏంటంటే చైతాలి (అమ‌లాపాల్‌) ట్రైన్ ప్ర‌మాదంలో గాయ‌ప‌డుతుంది. ఆమెను రైల్వే గేట్‌మెన్ ర‌ఘు (ఆసిఫ్ అలీ) కాపాడుతాడు. రఘుని కలిసిన తర్వాత నుంచి చైతాలి జీవితంలో ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయి. చైతాలి త‌న‌కు పెళ్లి అయిన‌ట్లుగా ఎందుకు భ్రమపడుతుంది? వారిద్దరికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateYoung SheldonMovieEnglishNetflixOct 08Monster High 2MovieEnglishNetflixOct 10Khel Khel MeinMovieHindiNetflixOct 09Starting 5SeriesEnglishNetflixOct 10Tomb Raider: Lara CroftAnimationEnglishNetflixOct 10Lonely PlanetMovieEnglishNetflixOct 10Outer Banks 4SeriesEnglishNetflixOct 10Up RisingSeriesEnglish/KoreanNetflixOct 11ChuckyMovieEnglishNetflixOct 15SurfiraMovieHindiHotstarOct 11WarieMovieTamilHotstarOct 11Pailan PillagaMovieTeluguETV WinOct 10Thatva&nbsp;MovieTeluguETV WinOct 10Guter GuMovieHindiJio CinemaOct 11Tea cupMovieEnglishJio CinemaOct 11Jai MahendranMovieMalayalamSonyLIVOct 11Raat Jawan HieMovieHindiSonyLIVOct 11
    అక్టోబర్ 07 , 2024
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్‌ ఫైట్‌ లాక్‌ అయ్యింది. ఇద్దరు పాన్‌ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్‌ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్‌ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; రజనీకాంత్‌ vs సూర్య తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్‌ ఫిల్మ్‌ వేట్టయాన్‌ను మేకర్స్‌ లాక్‌ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్‌ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.&nbsp; భారీ తారాగణం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్‌ డాల్‌ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, డైరెక్టర్‌ కే.ఎస్‌. రవికుమార్‌ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; గిరిజన యోధుడిగా 'సూర్య' కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్‌ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; రజనీకాంత్‌- అమితాబ్‌ ఇక రజనీకాంత్‌ హీరోగా చేసిన 'వేట్టయాన్‌' సినిమాకి 'జై భీమ్‌' వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందించిన టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, రావు రమేష్‌ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్‌ అయిన పోలీసు ఆఫీసర్‌.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్‌ యాక్షన్‌ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్‌’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్‌ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.&nbsp; అటు టాలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్‌ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ బాక్సాఫీస్‌ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్‌’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్‌ మెుదటి వారంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదు. &nbsp;
    జూన్ 28 , 2024
    Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
    Unique Movie Titles: సలార్‌, కంగువ, తంగలాన్‌.. ఈ టైటిల్స్‌ వెనక ఎంత అర్థం ఉందో తెలుసా?
    సినిమాపై ఆసక్తిని పెంచడంలో టైటిళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. సినిమా పేరు ఎంత యూనిక్‌గా ఉంటే ఆడియన్స్‌ అంతగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ప్రస్తుతం రూపొందుతున్న చాలావరకూ సినిమాలు తమ ప్రాంతానికే పరిమితం కాకుండా పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మితమవుతున్నాయి. అయితే కథ డిమాండ్‌ మేరకు ఆయా ప్రాంతాల్లో వాడుకలో ఉన్న పేర్లనే డైరెక్టర్లు సినిమాకు ఖరారు చేస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాల వారికి ఆ టైటిళ్లు కొత్తగా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. వాటి అర్థం తెలుసుకోవాలన్న ఉత్సాహం వారిలో పెరిగిపోతోంది. ఇంతకీ ఆ సినిమా పేర్లు ఏవి? వాటి వెనకున్న అర్థం ఏమిటీ? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; తండేల్‌ నాగ చైతన్య లేటెస్ట్ మూవీ పేరు 'తండేల్‌' (Thandel). ఈ సినిమా టైటిల్‌ వెనకున్న అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తండేల్‌ అంటే మత్సకారుల బృంద నాయకుడు అని అర్థం. సముద్రంలో వేటకు వెళ్లేటప్పుడు అతడే బోటు నడుపుతాడు. చందూ మెుండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా చేస్తోంది. అల్లు అరవింద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.&nbsp; సలార్‌ ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ ఫేమ్‌ ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'సలార్‌' (Salar). దీనికి నాయకుడు.. రక్షకుడు ఇలా పలు అర్థాలున్నాయి. ఇందులో ప్రభాస్‌కు జోడీగా శ్రుతి హాసన్‌ నటిస్తోంది. డిసెంబర్‌ 22న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.&nbsp; డంకీ (DUNKI) బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న లేటెస్ట్‌ మూవీ 'డంకీ' (DUNKI). ఈ టైటిల్‌కు అర్ధం.. అక్రమంగా దేశ సరిహద్దుల గుండా ప్రయాణించడం. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ హిరాణి దర్శకత్వం వహించారు. ప్రముఖ నటి తాప్సీ కీలక పాత్ర పోషించింది. ఈ మూవీ డిసెంబర్‌ 21న విడుదల కానుంది.&nbsp; తంగలాన్‌ చియాన్‌ విక్రమ్‌ హీరోగా చేస్తున్న కొత్త చిత్రం ‘తంగలాన్‌’ (Thangalaan). ఇది తమిళనాడులోని ఓ తెగ పేరు. కర్ణాటకలోని కోలార్ గోల్డ్‌ ఫీల్డ్స్‌ (KGF)లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో విక్రమ్‌కు జోడీగా మాళవిక మోహనన్ నటించింది. పా. రంజిత్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కానుంది.&nbsp; కంగువ స్టార్‌ హీరో సూర్య అప్‌కమింగ్‌ మూవీ పేరు 'కంగువ' (Kanguva). దీనికి ‘అగ్ని శక్తి ఉన్న వ్యక్తి, పరాక్రమవంతుడు’ అని అర్థం. పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో సూర్యకు జోడీగా దిశా పటానీ (Disha Patani) నటిస్తోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది.&nbsp; మట్కా వరణ్‌తేజ్‌, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న చిత్రం పేరు 'మట్కా' (Matka). ఇదో రకమైన జూదం. యాథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. కరుణకుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.&nbsp; జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌ రాఘవ లారెన్స్‌, ఎస్‌.జే సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'జిగర్‌తండ డబుల్‌ ఎక్స్‌' (Jigarthanda DoubleX). తమిళనాడులోని మధురైలో ప్రసిద్ధి చెందిన ఓ కూల్‌డ్రింక్‌ పేరును దీనికి పెట్టారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి కార్తిక్‌ సుబ్బరాజు దర్శకత్వం వహించారు.&nbsp; అయలాన్‌ శివకార్తికేయన్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా నటిస్తోన్న చిత్రం 'అలయాన్' (Ayalaan). దీనికి పొరుగువాడు అని అర్థం. మానవుడు ఏలియన్‌ మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది.&nbsp;
    నవంబర్ 25 , 2023
    <strong>Kanguva: లులు మాల్‌లో హై అలెర్ట్.. ఫ్యాన్స్‌కు&nbsp; మోకళ్లపై దండం పెట్టిన సూర్య!&nbsp;</strong>
    Kanguva: లులు మాల్‌లో హై అలెర్ట్.. ఫ్యాన్స్‌కు&nbsp; మోకళ్లపై దండం పెట్టిన సూర్య!&nbsp;
    తమిళ స్టార్‌ సూర్య (Suriya) హీరోగా శివ దర్శకత్వంలో రానున్న చిత్రం ‘కంగువా’ (Kanguva). అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్‌ డేట్‌ దగ్గర పడుతుండటంతో నటుడు సూర్యతో పాటు ‘కంగువా’ టీమ్‌ చురుగ్గా మూవీ ప్రమోషన్స్‌ చేస్తోంది. వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. ప్రస్తుతం కంగువా టీమ్‌ కేరళలో పర్యటిస్తోంది. అక్కడ ఓ మాల్‌కు వెళ్లిన సూర్య &amp; టీమ్‌కు ఊహించని స్థాయిలో అభిమానులు స్వాగతం పలికారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.&nbsp; సూర్య ఫ్యాన్స్‌తో కిక్కిరిసిన మాల్‌ కంగువా (Kanguva) ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా కేరళకు వెళ్లిన మూవీ టీమ్‌ కొచ్చి నగరంలో పర్యటించింది. వినూత్నంగా అక్కడి ‘లులు మాల్‌’ (Lulu International Shopping Mall, Kochi)లో ప్రమోషన్ ఈవెంట్‌ను ప్లాన్‌ చేసింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య అభిమానులు పెద్ద ఎత్తున మాల్‌కు చేరుకున్నారు. తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ఎగబడ్డారు. దీంతో మాల్‌ మెుత్తం సూర్య అభిమానులతో కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత జనం మాల్‌లో కనిపించింది. గతంలో ఎప్పుడు ఈ స్థాయి క్రౌడ్‌ను చూడలేదని మాల్‌ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1853842396104020062 https://twitter.com/i/status/1853810428616597938 https://twitter.com/AnushanSfc/status/1854009930233123020 https://twitter.com/RamuNaiduEdit/status/1853848902769967531 ఫ్యాన్స్‌కు సూర్య ‌అభివాదం ప్రమోషన్ ఈవెంట్‌లో భాగంగా కొచ్చిలోని లులు మాల్‌కు వచ్చిన సూర్య (Kanguva) అక్కడి క్రౌడ్‌ను చూసి ఆశ్చర్యపోయారు. తమిళ నటుడైన తనపై కేరళ ప్రజలు ఈ స్థాయిలో అభిమానాన్ని చూపించడం చూసి ఫిదా అయ్యాడు. ఈ సందర్భంగా 15 నిమిషాల పాటు క్రౌడ్‌ను ఉద్దేశించి మాట్లాడారు. తామిచ్చిన ఒక చిన్న ప్రకటన చూసి ఇంతమంది మాల్‌కు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మీ విలువైన సమయాన్ని తన కోసం వెచ్చించినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఆపై మోకాళ్లపై కూర్చొని మాల్‌లోని వారందరికీ అభివాదం తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్ అవుతోంది.&nbsp; https://twitter.com/ARMedia28524249/status/1853816589130293352 10 వేల స్క్రీన్స్‌లో విడుదల ‘కంగువా’ (Kanguva) చిత్రం గురించి నిర్మాత ధనుంజయ్‌ రీసెంట్‌గా ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రాన్ని ఏకంగా 10వేల స్క్రీన్స్‌లో ప్రదర్శించనున్నట్లు తెలిపారు. దక్షిణాదిలో 2500 కంటే ఎక్కువ స్క్రీన్‌లు, ఉత్తరాదిలో 3,500 స్క్రీన్లలో ప్రదర్శించునున్నట్లు చెప్పారు. ఓవరాల్‌గా 10 వేల స్క్రీన్‌లలో భారీస్థాయిలో కంగువా ప్రేక్షకుల ముందుకురానుందని స్పష్టం చేశారు.&nbsp; ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత చెప్పారు. పార్ట్ 2, పార్ట్‌ 3 కథలు కూడా సిద్ధంగా ఉన్నాయని పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఏఐతో డబ్బింగ్‌ ‘కంగువా’ (Kanguva) చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేసినట్లు సమాచారం. డబ్బింగ్‌ పనుల కోసం ఏఐని ఉపయోగించడం కోలీవుడ్‌లో ఇదే తొలిసారని నిర్మాత ధనుంజయ్‌ రీసెంట్‌గా పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్‌ చేయించినట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు.&nbsp;
    నవంబర్ 06 , 2024
    <strong>OTT Releases Telugu: ఈ వారం వచ్చేస్తోన్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!</strong>
    OTT Releases Telugu: ఈ వారం వచ్చేస్తోన్న చిత్రాలు, సిరీస్‌లు ఇవే!
    దీపావళి సందర్భంగా ‘క’, ‘లక్కీ భాస్కర్‌’, ‘అమరన్‌’ వంటి ఆసక్తికర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఈ వారం కూడా అదే తరహాలో ఎంటర్‌టైన్‌ చేసేందుకు పలు సినిమాలు రెడీ అయ్యాయి. అయితే ఈసారి చిన్న చిత్రాలు బాక్సాఫీస్‌ బరిలో దిగబోతున్నాయి. అటు ఓటీటీలోనూ ఆసక్తికర మూవీస్‌, వెబ్‌సిరీస్‌ రిలీజయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో (Appudo Ippudo Eppudo) యంగ్ హీరో నిఖిల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్ ఆకట్టుకుంటున్నాయి.&nbsp; ధూం ధాం (Dhoom Dhaam) చేతన్ కృష్ణ (Chethan Krishna), హెబ్బా పటేల్ (Hebah Patel) జంటగా చేసిన తాజా చిత్రం ‘ధూం ధాం’ (Dhoom Dhaam). సాయి కిశోర్ మచ్చ దర్శకుడు. సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటించారు. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్‌పై ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. జితేందర్‌రెడ్డి (Jithender Reddy) రాకేశ్‌ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్‌ ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నవంబరు 8నప్రేక్షకుల ముందుకు రానుంది. బ్లడీ బెగ్గర్‌ (Bledy Beggar)&nbsp; ఈ వారం ఓ తమిళ డబ్బింగ్‌ ఫిల్మ్‌ కూడా థియేటర్లలోకి రాబోతోంది. ఇటీవల దీపావళికి విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ‘బ్లడీ బెగ్గర్‌’ (Bledy Beggar) చిత్రాన్ని నవంబర్‌ 7న తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. కవిన్‌ లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రానికి శివ బాలన్‌ ముత్తుకుమార్‌ దర్శకత్వం వహించారు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ నిర్మించారు.&nbsp; జాతర (Jathara) సతీష్‌బాబు రాటకొండ హీరోగా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జాతర’ (Jathara). రాధాకృష్ణారెడ్డి, శివశంకర్‌ రెడ్డి నిర్మాతలు. నవంబర్‌ 8న ఈ మూవీ బాక్సాఫీస్‌ ముందుకు రానుంది. చిత్తూరు జిల్లా బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్‌ డ్రామా చిత్రంగా దీనిని రూపొందించినట్లు మేకర్స్‌ తెలియజేశారు.&nbsp; ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్‌సిరీస్‌లు దేవర (Devara) జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న రిలీజైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ మూవీ సుమారు 40 రోజుల తర్వాత ఓటీటీలోకి అడుగుపెట్టబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో శుక్రవారం (నవంబర్ 8) నుంచి స్ట్రీమింగ్‌కు రానున్నట్లు సమాచారం.&nbsp; వేట్టయన్ (Vettaiyan) రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన తమిళ హిట్ మూవీ వేట్టయన్ కూడా ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టనుంది. ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 8) నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ సినిమాలో రజనీ, అమితాబ్‌తోపాటు రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రలు చేశారు. ఏఆర్ఎం (ARM) మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఏఆర్‌ఎం’ (ARM). ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ మూవీ నవంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం. సిటడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny) సమంత (Samantha), వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ 'సిటడెల్: హనీ బన్నీ'. ఈ సిరీస్‌ ఈ వారమే ఓటీటీలో రిలీజ్ కాబోతోంది. అమెజాన్‌ వేదికగా నవంబర్‌ 7 నుంచి స్టీమింగ్ కాబోతోంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ వెబ్‌సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ సిరీస్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది.&nbsp; TitleCategoryLanguagePlatformRelease DateMeet Me Next ChristmasMovieEnglishNetflixNov 6Outer Banks 4SeriesEnglishNetflixNov 7Mr. PlanktonMovieEnglish/ KoreanNetflixNov 8The Buckingham MurdersMovieHindiNetflixNov 8Vijay 69MovieHindiNetflixNov 8Its end with usMovieEnglishNetflixNov 9Countdown: Paul vs. TysonSeriesTelugu DubAmazon&nbsp;Nov 1Investigation AllienSeriesEnglishAmazon&nbsp;Nov 8Despicable Me 4MovieTeluguJio CinemaNov 5Explorer: EnduranceMovieEnglishHotstarNov 3Janaka Ithe GanakaMovieTeluguAhaNov 8
    నవంబర్ 04 , 2024
    <strong>HBD Tabu: టబు లైఫ్‌లో నాగార్జునతో పాటు ఇంతమంది హీరోలు ఉన్నారా?</strong>
    HBD Tabu: టబు లైఫ్‌లో నాగార్జునతో పాటు ఇంతమంది హీరోలు ఉన్నారా?
    తెలుగు సినీ ప్రియులకు ఎంతో సుపరిచితురాలైన నటి టబు (Tabu). ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తోన్న టబు ఒకప్పుడు తెలుగులో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది. ‘కూలి నెంబర్‌ 1’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడా మా ఆవిడే’, ‘ప్రేమ దేశం’, ‘చెన్నకేశవరెడ్డి’ తదితర హిట్ చిత్రాల్లో ఆమె నటించింది. తద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించింది. ఇవాళ (నవంబర్‌ 4) టబు పుట్టిన రోజు. ఆమె 54వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా టబు లైఫ్‌లోని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం.&nbsp; 1971లో జన్మించిన టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. హైదరాబాద్‌లోనే పెరిగింది. తల్లి టబును ఒంటరి తల్లిగా పెంచింది. టబుకు 3 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఆమె తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు.&nbsp; టబు చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించింది. కేవలం 10 సంవత్సరాల వయస్సులోనే యాక్టింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 1982లో హిందీలో రిలీజైన 'బజార్' చిత్రం ఆమె ఫస్ట్‌ ఫిల్మ్‌. https://twitter.com/mimansashekhar/status/1710632340022591556 సాధారణంగా ఏ వ్యక్తికైనా ఒకటి లేదా రెండు నిక్‌ నేమ్స్‌ ఉంటాయి. కానీ టబూకి అలా కాదట. ట్యాబ్స్‌, టబ్స్‌, టబ్బీ, టోబ్లర్‌, టోబ్లెరోన్‌ ఇలా 100కు పైగాా ముద్దుపేర్లు ఉన్నాయట. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్‌, నాగార్జున వంటి స్టార్‌ హీరోలతో టబు సూపర్‌ హిట్‌ చిత్రాలు చేసింది.&nbsp; ముఖ్యంగా నాగార్జున-టబు కాంబినేషన్‌ సూపర్‌ సక్సెస్ అయ్యింది. వారు నటించిన ‘నిన్నే పెళ్లడతా’, ‘సిసింద్రీ’, ‘ఆవిడే మా ఆవిడా’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. హిందీ వచ్చిన ప్రేమ్‌ చిత్రం కోసం టబు 8 ఏళ్ల పాటు నిరీక్షించారు. శ్రీదేవి భర్త, నిర్మాత అయిన బోనీ కపూర్‌ తమ్ముడు సంజయ్‌ కపూర్‌ ఇందులో హీరోగా చేశాడు. 1987లోనే ఈ మూవీ షూట్‌ స్టార్ట్‌ కాగా అనేక వాయిదాలు పడుతూ 1995లో ఆ సినిమా రిలీజ్ అయ్యింది. ప్రేమ్‌ సినిమా సెట్స్‌లోనే నటుడు సంజయ్‌ కపూర్‌తో&nbsp; టబు ప్రేమలో పడింది. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. అయితే ఈ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు.&nbsp; తెలుగు స్టార్ హీరో నాగార్జునతో టబు చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉన్నట్లు ప్రచారం జరిగింది. పదేళ్ల పాటు వీరు డేటింగ్‌లో ఉన్నట్లు కథనాలు వచ్చాయి. తాము మంచి స్నేహితులమని పలుమార్లు చెప్పినప్పటికీ ఎవరూ విశ్వసించలేదు.&nbsp; ఆ తర్వాత నిర్మాత సాజిద్ నడియాద్వాలాతో టబు ప్రేమాయణం సాగించింది. అతడి భార్య, నటి దివ్య భారతి మరణం తర్వాత వీరిద్దరు దగ్గరయ్యారు. కానీ ఆ బంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు.&nbsp; బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవ్‌గన్‌తోనూ టబు గాఢంగా ప్రేమాయణం నడిపినట్లు అప్పట్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాము 25 ఏళ్లుగా మంచి స్నేహితులమని, ఎలాంటి విషయాలనైనా షేర్‌ చేసుకునేంత చనువు తమ మధ్య ఉందని టబు వాటిని కొట్టిపారేసింది. అయితే అజయ్‌తో ఉన్న రిలేషన్‌ వల్లే టబు ఇప్పటివరకూ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని బీటౌన్‌లో రూమర్లు ఉన్నాయి. 'భోలా' సినిమా ప్రమోషన్స్‌ సమయంలో టబుతో రిలేషన్‌పై అజయ్ దేవ్‌గన్‌ కూడా మాట్లాడారు. టీనేజ్‌ నుంచి ఒకరికొకరం తెలుసని, తమ మధ్య కంఫర్టబుల్ ఫ్రెండ్‌షిప్ ఉందని, ఒక్కోసారి తిట్టుకుంటామని కూడా వెల్లడించారు. బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ జింకను వేటాడిన కేసులో టబు పేరు కూడా వినిపించింది. 1998లో 'హమ్‌ సాథ్‌ సాథ్‌' షూటింగ్ సమయంలో ఈ ఘటన జరగ్గా ఆ సమయంలో టబు కూడా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే విచారణ అనంతరం టబును నిర్దోషిగా పోలీసులు విడుదల చేశారు. తెరపై నిజమైన కన్నీళ్లు పెట్టే నటీమణులు చాలా మంది ఉన్నారు. కానీ టబు అలా కాదట. కెమెరా ముందు తాను నిజమైన కన్నీళ్లు పెట్టలేనని ఓ ఇంటర్వ్యూలో టబు చెప్పింది. అందుకే సెంటిమెంట్‌ సీన్స్‌లో తప్పనిసరిగా గ్లిజరిన్‌ వాడతానని తెలిపింది. ప్రస్తుతం టబు సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లలోనూ నటిస్తూ ట్రెండ్‌కు తగ్గట్లు దూసుకెళ్తోంది. 54 ఏళ్ల వయసులోనూ 30 ఏళ్ల హీరోయిన్‌గా కనిపిస్తూ మెపిస్తోంది.
    నవంబర్ 04 , 2024
    Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
    Nishadh Yusuf: కంగువా ఎడిటర్ మరణంపై పోలీసుల అనుమానాలు… ఎక్కడ చనిపోయాడంటే?
    తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి రాబోతున్న భారీ పాన్‌ ఇండియా సినిమా “కంగువా” పై ప్రేక్షకులలో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో&nbsp; సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో ప్రమోట్ చేయడంలో బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో వివిధ ఈవెంట్లను నిర్వహిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమాపై మరింతగా ఆకర్షిస్తున్నారు. ఈ ప్రమోషనల్‌ కార్యక్రమాల మధ్య, చిత్ర బృందానికి ఓ ఆందోళనకరమైన వార్త ఎదురైంది. ఈ సినిమా ఎడిటర్ నిషాద్‌ యూసుఫ్‌ అనుమానాస్పదంగా కన్నుమూయడం చిత్రబృందాన్ని తీవ్రంగా కలచివేసింది. కొచ్చిలోని తన అపార్ట్మెంట్‌లో ఆయన మరణించడం సినీలోకాన్ని విస్మయపరుస్తోంది. సినిమా ఎడిటింగ్‌లో చురుకుగా పాల్గొన్న నిషాద్ ఆకస్మాత్తుగా తనువు చాలించడం పట్ల సినీ వర్గాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఈరోజు తెల్లవారుజామున రెండుగంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆయన కొచ్చి- పనంపిల్లి నగర్‌లోని తన అపార్ట్‌మెంట్లో విగత జీవై కనిపించాడు. ఆయన మృతిపై పలు అనుమానాలు రెకెత్తడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపార్ట్‌మెంట్‌ నివాసం ఉంటున్న వారితో పాటు ఆయన క్లోజ్ ఫ్రెండ్స్‌ను కూడా విచారిస్తున్నారు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలపై ఆరా తీస్తున్నారు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకునేంత బాధలు ఏమి లేవని&nbsp; ఆయన ఆత్మీయులు చెబుతున్నారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. నిషాద్ మరణ వార్త తమిళ్‌, మలయాళ పరిశ్రమను శోక సంద్రంలో ముంచి వేసింది. ఆయనకు కడసారి వీడ్కోలు తెలిపేందుకు చిత్ర పరిశ్రమ పెద్దలు తరలివస్తున్నారు. నిషాద్‌ యూసుఫ్‌ తెలుగు, తమిళ్‌ తో పాటు మలయాళ సినిమాలకు కూడా పనిచేశారు. అడియోస్ అమిగోస్, ఉండా, వన్, పెటారాప్, సౌదీ వెళ్లక్క వంటి ఎన్నో ఆసక్తికరమైన చిత్రాలకు ఎడిటింగ్ వర్క్ చేశారు. ఆయన ఆకస్మిక మరణం సినిమా రంగానికి భారీ నష్టం అని చెప్పాలి. ఇక ఆయన చివరగా పనిచేసిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా “కంగువా” నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదలకు 15 రోజుల ముందు ఇలా జరగడం చిత్ర యూనిట్‌కు పెద్ద దెబ్బగా చెప్పవచ్చు.&nbsp; నిషాద్ యూసుఫ్ మరణం పట్ల కంగువా చిత్ర బృందం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. హీరో సూర్య నిషాద్ మరణవార్త తనను తీవ్రంగా కలచి వేసిందని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు&nbsp; తెలిపారు. మరోవైపు కంగువా మూవీ ప్రమోషన్స్ తమిళ్‌తో తెలుగులోనూ శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏకంగా హీరో సూర్యనే తెలుగులో ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు. ఆదివారం బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చి నాగార్జునతో కలిసి కంటెస్టెంట్స్‌ను పలకరించారు. ప్రస్తుతం హిందీ బెల్ట్‌లోనూ సూర్య ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు . హీరోయిన్ దిశా పటాని, ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్న బాబీ డియోల్‌తో కలిసి చిత్ర ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాడు. కాగా ఈ చిత్రం నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ‘కంగువా’ చిత్రాన్ని ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని మేకర్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తిచేయనున్నట్లు తెలిపారు. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అయితే ఇప్పుడు పూర్తిగా ఏఐతో డబ్బింగ్‌ చేయిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రయోగం విజయవంతమవుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక కంగువా చిత్రాన్ని అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌లలో విడుదల చేయనున్నారు. చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తామని నిర్మాత ప్రకటించారు. &nbsp; రూ.1000 కోట్ల లక్ష్యం! రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ సాధించడమే లక్ష్యంగా 'కంగువా'ను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నట్లు ఇటీవల నిర్మాత జ్ఞానవేల్‌ చెప్పారు. పార్ట్‌ 2, పార్ట్‌ 3 కథలు కూడా రెడీగా ఉన్నాయని చెప్పారు. తొలి భాగం విజయం సాధిస్తే మిగితా భాగాలను కూడా తెరకెక్కించేలా ప్లాన్ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ సినిమా సూర్యను మరో స్థాయికి తీసుకెళ్తుందని నిర్మాత ధీమా వ్యక్తం చేశారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉన్నట్లు నిర్మాత చెప్పారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇందులో సూర్యకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ నటించింది. యానిమల్‌ ఫేమ్‌ బాబీ డియోల్‌ విలన్‌ పాత్ర పోషించాడు. కంగ అనే ఓ పరాక్రముడి పాత్రలో సూర్య కనిపించనున్నాడు.&nbsp;
    అక్టోబర్ 30 , 2024

    @2021 KTree