• TFIDB EN
  • విద్యా వాసుల అహం
    రేటింగ్ లేదు
    UATelugu
    విద్య తనకు ఎలాంటి భర్త కావాలో క్లారిటీతో ఉంటుంది. కొన్ని పరీక్షలు పెట్టి వాసును పెళ్లి చేసుకుంటుంది. కొద్ది రోజుల తర్వాత వారి కాపురంలో సమస్యలు మెుదలవుతాయి. అహంతో ఒకరితో ఒకరు గొడవపడుతుంటారు. ఈ కొత్త జంట తమ కలహాలకు ఎలా ముగింపు పలికింది? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Ahaఫ్రమ్‌
    ఇన్ ( Telugu )
    Watch
    2024 May 88 months ago
    విద్య వాసుల ఆహం చిత్రం నేరుగా ఆహా ఓటీటీలో విడుదల కానుంది. త్వరలో రిలీజ్ డేట్ రానుంది.
    రివ్యూస్
    YouSay Review

    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?

    రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన లేటేస్ట్‌ చిత్రం ‘విద్య వాసుల అహం‘. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై ...read more

    How was the movie?

    తారాగణం
    రాహుల్ విజయ్
    శివాని రాజశేఖర్
    రఘు బాబు
    తనికెళ్ల భరణి
    శ్రీనివాస్ అవసరాల
    వివా రాఘవ్
    నానిమళ్ల రవితేజ
    సిబ్బంది
    మణికాంత్ గెల్లిదర్శకుడు
    రంజిత్ కుమార్ కొడాలినిర్మాత
    నవ్య మహేష్ ఎమ్నిర్మాత
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే?
    నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన  లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?  ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.   సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5  
    మే 17 , 2024
    <strong>OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?</strong>
    OTT Suggestions: ‘పుష్ప 2’ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
    ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. అయితే ఈ వారంతం కంటెంట్‌ పరంగా తెలుగు ప్రేక్షకులకు ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. థియేటర్‌లో పలు ఆసక్తికర చిత్రాలు ఈ వారం ఓటీటీలోకి వచ్చేశాయి. మరికొన్ని రాబోతున్నాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం. (OTT Suggestions) అమరన్‌ (Amaran) పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం 'అమరన్‌' (Amaran OTT Platform). అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. తెలుగు, హిందీతో పాటు దక్షిణాది భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ. మట్కా (Matka) మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటించిన తాజా చిత్రం ‘మట్కా’ (Matka) కూడా ఈ వీకెండ్‌ ఓటీటీలోకి వచ్చింది. డిసెంబర్‌ 5 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో వరుణ్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించింది. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలో 20 రోజులు తిరక్కముందే ఓటీటీలోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? సుజాతతో వాసు లవ్‌ట్రాక్‌ ఏంటి?’ అన్నది స్టోరీ. విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video) ’యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్‌ చిత్రం ఈ వీకెండ్‌లోనే ఓటీటీలోకి రాబోతోంది . 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కాబోతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ&nbsp; భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. అక్టోబర్‌ 11న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్‌ నైట్‌ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ. జిగ్రా (Jigra) బాలీవుడ్‌ బ్యూటీ అలియా భట్‌ నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ మూవీ 'జిగ్రా' (Jigra OTT). ఈ చిత్రం కూడా ఈ వీకెండ్‌లో ఓటీటీలోకి రాబోతోంది. డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లోకి రానుంది. కరుణ్‌ జోహర్‌ నిర్మించిన ఈ చిత్రం దీపావళికి రిలీజై యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. వాసన్‌ బాల డైరెక్ట్‌ చేసిన ఈ మూవీలో తెలుగు నటుడు రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్ర పోషించాడు. అలియా చేసిన సత్య పాత్రకు తమ్ముడిగా వేదాంగ్‌ రైనా నటించాడు. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోని ఈ చిత్రం ఓటీటీలో మంచి రెస్పాన్స్ అందుకుంటుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ప్లాట్‌ ఏంటంటే ‘సత్యభామ (ఆలియా భట్) ఓ డబ్బున్న ఇంట్లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ స్టాఫ్‌గా చేస్తుంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముడు అంకుర్ ఆనంద్ (వేదాంగ్ రైనా)ను తనే పెంచి పెద్దవాడ్ని చేస్తుంది. ఓ బిజినెస్‌ పనిమీద విదేశాలకు వెళ్లిన అంకుర్‌ అక్కడ డ్రగ్స్‌ తీసుకొని పట్టుబడతాడు. అక్కడి చట్టాల ప్రకారం అతడికి ఉరిశిక్ష విధిస్తారు. అప్పుడు సత్య ఏం చేసింది? తమ్ముడ్ని ఎలా రక్షించుకుంది?’ అన్నది స్టోరీ. మందిర (Mandira) సన్నీ లియోనీ (Sunny Leone) ప్రధాన పాత్రలో దర్శకుడు ఆర్‌. యువన్‌ తెరకెక్కించిన సినిమా ‘మందిర’ (Mandira). ఈ మూవీ డిసెంబర్‌ 5 (OTT Suggestions) నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌ వచ్చింది. నవంబర్‌ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇందులో సన్నీ ద్విపాత్రాభియనం చేసింది. ఈ హారర్‌ కామెడీ మూవీలో యోగిబాబు, సతీశ్‌ కీలక పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే 'గత జన్మలో అనకొండపురం అనే రాజ్యానికి ఓ యువరాణి అయిన మందిర ఇప్పుడు దెయ్యంలా ఎలా మారింది? అసలు ఆమె కథేంటి? అన్నది స్టోరీ. కంగువా (Kanguva) తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) ఓటీటీ రిలీజ్‌ డేట్‌ను లాక్‌ చేసుకుంది. వచ్చే వారం డిసెంబర్‌ 13 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది. నెల రోజుల వ్యవధిలోనే ఈ సినిమా ఓటీటీలోకి రానుండటం విశేషం. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. తమిళ డైరెక్టర్ శివ రూపొందించిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ బాబీ డియోల్‌ విలన్‌గా చేసింది. హిందీ నటి దిశా పటాని కథానాయికగా చేసింది. థియేటర్లలో మోస్తరు టాక్‌ తెచ్చుకోవడంతో కంగువాను త్వరగా ఓటీటీలోకి తీసుకొస్తున్నారు. ప్లాట్‌ ఏంటంటే ‘ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ. క (Ka) ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. యంగ్ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన లేటెస్ట్‌ బ్లాక్ బాస్టర్‌ చిత్రం 'క' (Ka OTT Release) గత వారమే ఓటీటీలోకి వచ్చింది. ఈటీవీ విన్‌ వేదికగా నవంబర్‌ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో నయన్‌ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు. ప్లాట్‌ ఏంటంటే ‘అభినయ్ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనే యువకుడు ఒక అనాథ. తన కుటుంబాన్ని కోల్పోయిన బాధలో గడిపే అభినయ్, చిన్నతనం నుంచే తల్లి దండ్రుల కోసం బాధపడుతూ ఉంటాడు. అనాధ ఆశ్రమం నుండి తప్పించుకుని, తన మాస్టర్ గురునాథం వద్ద డబ్బులు దొంగిలించి పారిపోతాడు. అతనికి పుస్తకాలు, ఉత్తరాలు చదవడం అంటే ఇష్టం. ఈ ఉత్సాహం అతనిని కొత్త మార్గంలో పయనించేలా చేస్తుంది. చివరకు కృష్ణగిరి అనే గ్రామానికి వచ్చి అక్కడ పోస్ట్ మాన్ ఉద్యోగంలో చేరతాడు. ఆ ఊరిలో సత్యభామ (నయన్ సారిక)ని చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా అభినయ్‌ను ప్రేమిస్తుంది.. ఇదే సమయంలో ఆ ఊరిలో అమ్మాయిలు ఆచూకీ లేకుండా పోతుంటారు. ఆ మిస్టరీ వెనక ఉన్నది ఎవరు? చివరికి అభినయ్ వాసుదేవ్ ఈ సమస్యను ఎలా ఎదుర్కొన్నాడు?’ అనేది మిగతా కథ. లక్కీ భాస్కర్‌ (Lucky Bhaskar) దుల్కర్‌ సల్మాన్ (Dulquar Salman), మీనాక్షి చౌదరి (Meenakshi Chowdhary) నటించిన తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Bhaskar OTT Release) సైతం గత వారమే ఓటీటీలోకి వచ్చింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్‌ 28 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రసారం అవుతోంది. తెలుగుతోపాటు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘భాస్కర్ కుమార్ (దుల్కర్ సల్మాన్) ముంబైకి చెందిన సాధారణ బ్యాంకు ఉద్యోగి. అతని జీవితంలో ప్రధాన బాధ్యతలతో పాటు కుటుంబ అవసరాలు కూడా ఉంటాయి. భార్య సుమతి (మీనాక్షి చౌదరి), కొడుకు, తండ్రి, చెల్లి, తమ్ముడితో అతని జీవితం సాగుతుంది. అతను తన జీతంతో కుటుంబాన్ని పోషించే క్రమంలో అప్పుల ముప్పు తట్టుకుని కూడా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ, ఆ ప్రమోషన్ అతని కలగానే మిగిలిపోతుంది. తాను చేస్తున్న అన్ని ప్రయత్నాలు విఫలమవుతుంటాయి. చివరికి తన కుటుంబాన్ని ఆదుకోవడం కోసం భాస్కర్ ఓ పెద్ద రిస్క్ తీసుకుంటాడు. ఆ రిస్క్ అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నాడు?’ అనేది కథ. వికటకవి (Vikkatakavi) యువ నటుడు నరేష్‌ అగస్త్య (Naresh Agastya) 'మత్తు వదలరా', 'సేనాపతి', 'పంచతంత్రం' చిత్రాలతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. ఇప్పుడు అతడు చేసిన లేటెస్ట్‌ సిరీస్ ‘వికటకవి’ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రదీప్‌ మద్దాలి దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మేఘా ఆకాష్ (Megha Akash) హీరోయిన్‌గా చేసింది. షిజు అబ్దుల్ రషీద్, రఘు కుంచె, అమిత్ తివారి, ముక్తార్ ఖాన్, అమిత్ తివారి, తారక్ పొన్నప్ప కీలక పాత్రలు చేశారు. జీ5 ఓటీటీలో గతవారం తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే 'అమరగిరి ఊరిలోని దేవతల గుట్ట (కొండ)కు వెళ్లిన ప్రజలు గతం మర్చిపోతుంటారు. అమ్మోరు శాపం వల్లే అలా జరుగుతున్నట్లు వారు నమ్ముతుంటారు. ఈ మిస్టరీని కనుగొనేందుకు డిటెక్టివ్ రామకృష్ణ రంగంలోకి దిగుతాడు. దేవతల గుట్టపైకి వెళ్తాడు. అక్కడ ఏం తెలుకున్నాడు? అమరగిరి సంస్థానానికి చెందిన లక్ష్మీ (మేఘా ఆకాష్‌)తో అతడికి పరిచయం ఎలా ఏర్పడింది? ఇంతకీ దేవతల గుట్టకు ఉన్న శాపం ఏంటి?' అన్నది స్టోరీ.&nbsp; ‘పుష్ప 2’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే? 'పుష్ప 2' (Pushpa 2 OTT Release) థియేటర్లను షేక్‌ చేస్తోంది. దీంతో ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రావొచ్చన్న చర్చ మెుదలైంది. వాస్తవానికి 'పుష్ప 2' స్ట్రీమింగ్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ దక్కించుకుంది. సాధారణగా ఏ సినిమా అయినా 6-8 వారాల గ్యాప్‌తో ఓటీటీలోకి వస్తుంటాయి. అయితే 'పుష్ప 2'ను మాత్రం నెల రోజుల్లో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేలా ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అదే నిజమైతే జనవరి ఫస్ట్‌ వీక్‌లో ఓటీటీలోకి రావాల్సి ఉంటుంది. కానీ, ‘పుష్ప 2’ బ్లాక్‌ బాస్టర్‌ విజయం సాధించడం, సంక్రాంతి వరకూ పెద్ద హీరోల సినిమాలు లేకపోవడంతో థియేటర్లలో నెల రోజులకు పైగా పుష్పగాడికి తిరుగుండక పోవచ్చు. కాబట్టి సంక్రాంతికి ‘పుష్ప 2’ను ఓటీటీలోకి తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అది మిస్‌ అయినా పది రోజుల గ్యాప్‌తో వచ్చే రిపబ్లిక్‌ డే (జనవరి 26) రోజునైనా 'పుష్ప 2' కచ్చితంగా స్ట్రీమింగ్‌లోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.
    డిసెంబర్ 05 , 2024
    <strong>Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?</strong>
    Aay Movie Review: ఎన్టీఆర్‌ బావమరిది ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా?
    నటీనటులు: నార్నె నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్, అంకిత్ కొయ్య తదితరులు దర్శకుడు: అంజి కె మణిపుత్ర సంగీత దర్శకుడు: రామ్ మిర్యాల, అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: సమీర్ కళ్యాణి నిర్మాతలు : బన్నీ వాస్, విద్యా కొప్పినీడి ఎన్టీఆర్‌ బావ మరిది నార్నే నితిన్‌ నటించిన రెండో చిత్రం ‘ఆయ్‌’. మ్యాడ్‌ చిత్రంతో సాలిడ్‌ విజయాన్ని అందుకున్న ఈ యంగ్‌ హీరో తన సెకండ్‌ హిట్‌ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం వహించిన ‘ఆయ్‌’ చిత్రంలో నయన్‌ సారిక హీరోయిన్‌గా చేసింది. కాగా, ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి అమలాపురంకు చెందిన కార్తీక్‌ (నార్నే నితిన్‌) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో చేరతాడు. కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఊరికి వస్తాడు. ఇంటి నుంచి పని చేసుకుంటూనే బాల్య మిత్రులు హరి, సుబ్బుతో సరదాగా గడుపుతుంటాడు. ఈ క్రమంలో పక్క ఊరికి చెందిన పల్లవి (నయన్‌ సారిక)ని ప్రేమిస్తాడు. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే పల్లవికి కులం పట్టింపులు ఎక్కువ. కార్తీక్‌ తన కులం వాడేనని భావించి ఇష్టపడుతుంది. అతడి కులం వేరని తెలిసి దూరం పెడుతుంది. పెద్దలు కుదిర్చిన పెళ్లికి అంగీకరిస్తుంది. దీంతో కార్తీక్‌ తట్టుకోలేకపోతాడు. మరోవైపు వారిద్దరిని కలిపేందుకు స్నేహితులు హరి, సుబ్బు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ ప్రయత్నం ఫలిచిందా? పల్లవితో కార్తీక్‌ పెళ్లి జరిగిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే కార్తీక్ పాత్రలో నార్నే నితిన్‌ ఆకట్టుకున్నాడు. మెుదటి చిత్రంతో పోలిస్తే నటనకు మంచి స్కోప్‌ ఉన్న పాత్రే అతడికి దక్కింది. హావభావాలు, సంభాషణల్లో అత‌నిలో ప‌రిణ‌తి కనిపించింది. డ్యాన్స్ తోనూ మెప్పించాడు. ఇక పల్లవి పాత్రలో నటించిన నయన్ సారిక తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అచ్చ‌మైన గోదావ‌రి అమ్మాయిగా తెర‌పై సందడి చేసింది. ఫ్రెండ్స్‌ పాత్రల్లో రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ కోయ చేసిన కామెడీ సినిమాకి హైలెట్‌గా నిలిచింది. ముఖ్యంగా క‌సిరెడ్డి పాత్ర ప్రతీ ఒక్కరికీ గుర్తుండిపోతుంది. మైమ్ గోపి, వినోద్ కుమార్‌లు పాత్రల పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అంజి ఎంచుకున్న కథ పాతదే అయినప్పటికీ దానిని ప్రెజెంట్‌ చేసిన తీరు మెప్పిస్తుంది. అమలాపురం నేపథ్యం, చిన్ననాటి స్నేహితులు, మనుషుల్లో కనిపించే అమాయకత్వం, ఆప్యాయతలు ఇలా అన్నింటీని మేళవిస్తూ కథను నడిపించారు. ముగ్గురు స్నేహితులు కలిసినప్పటి నుంచి సినిమాలో సందడి మెుదలవుతుంది. ముఖ్యంగా కార్తిక్ ప్రేమలో పడినప్పటి నుంచి కథ ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. హీరో ప్రేమ కోసం ఇద్దరు స్నేహితులు చేసే సాయం, ఈ క్రమంలో వారు పడే ఇబ్బందులు నవ్వులు పంచుతాయి. సాఫీగా సాగిపోతున్న కథలో ట్విస్ట్ తీసుకొచ్చి సెకండాఫ్‌పై ఆసక్తి పెంచాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌లో ఇరు కుటుంబాల పెద్దలను ఇన్‌వాల్వ్‌ చేసి మంచి సందేశం కూడా ఇచ్చారు. ఈ క్రమంలో క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. అయితే రొటీన్‌ స్టోరీ, లవ్‌ట్రాక్‌ను కామెడీ డామినేట్‌ చేయడం, లాజిక్‌ లేని సన్నివేశాలు మూవీకి మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సమీర్‌ కళ్యాణి కెమెరా పనితనం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అమలాపురం పరిసరాలు, గ్రామీణ నేపథ్యాన్ని తన కెమెరాతో చూపించిన తీరు మెప్పిస్తుంది. సంగీతం విషయానికొస్తే పాటలు సినిమాకి ప్రాణం పోశాయి. రామ్ మిర్యాల అందించిన సూఫియానా పాట ఎంతో వినసొంపుగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ్యుసర్లు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.&nbsp; ప్లస్ పాయింట్స్‌ నటీనటులుకామెడీక్లైమాక్స్‌ మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీఊహకందేలా సాగే కథనం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 16 , 2024
    <strong>Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. విజేత ఎవరంటే?</strong>
    Dussehra Movies Weekend Collections: దసరా చిత్రాల వీకెండ్ కలెక్షన్స్‌.. విజేత ఎవరంటే?
    దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని గతవారం బాక్సాఫీస్‌ వద్ద పెద్ద ఎత్తున చిత్రాలు రిలీజ్‌ అయ్యాయి. వీటిలో ప్రధానంగా అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రాలు నాలుగు ఉన్నాయి. ‘వేట్టయన్‌’, ‘విశ్వం’, ‘మా నాన్న సూపర్‌ హీరో’, ‘జిగ్రా’ మూవీస్‌ దసరా కానుకగా రిలీజై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్నాయి. మరి వీకెండ్‌ పూర్తయ్యే సరికి ఏ మూవీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ఏ చిత్రం వసూళ్ల పరంగా టాప్‌లో నిలిచింది? ఇప్పుడు పరిశీలిద్దాం.&nbsp; వేట్టయన్‌ (Vettaiyan) రజనీకాంత్‌ హీరోగా టి. జే. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ‘వేట్టయన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంపర కొనసాగిస్తోంది. గురువారం (అక్టోబర్ 10)న విడుదలైన ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా రూ. 201.21 కోట్లు (GROSS) కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ఒక్క తమిళనాడులోనే రూ.81 కోట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు తెలిపాయి. తెలుగుల రాష్ట్రాల్లో రూ.15.50 కోట్లు, కేరళలో రూ.13.20 కోట్లు, కర్ణాటకలో రూ. 19.25 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.5 కోట్లు రాబట్టినట్లు చెప్పాయి. అటు ఓవర్సీస్‌లో ఏకంగా రూ. 67.26 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. కలెక్షన్ల పరంగా చూస్తే వేట్టయన్‌ రూ.200 కోట్ల క్లబ్‌లో చేరి దసరా విజేతగా నిలిచిందని చెప్పవచ్చు.&nbsp; https://twitter.com/Filmy_Track/status/1845727131768082555 విశ్వం (Viswam) మాస్ సినిమాల స్పెషలిస్ట్ గోపీచంద్, కామెడీ కింగ్‌ శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన విశ్వం చిత్రం దసరా సందర్భంగా రిలీజై పర్వాలేదనిపించింది. అక్టోబర్‌ 11 (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా దారుణంగా ఫెయిల్‌ అయినట్లు తెలుస్తోంది. తొలి మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 7 కోట్ల గ్రాస్‌ మాత్రమే సాధించినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఏపీలో రూ.3.60 కోట్లు, నైజాంలో రూ. 2.20 కోట్లు, కర్ణాటకలో రూ.30 లక్షలు, రెస్ట్‌ ఆఫ్ ఇండియాలో రూ.20 లక్షలు మాత్రమే రాబట్టినట్లు అభిప్రాయపడ్డాయి. అటు ఓవర్సీస్‌లో కేవలం రూ.20 లక్షలు మాత్రమే వసూలు చేసినట్లు పేర్కొన్నాయి. అయితే రెండో రోజు నాటికే డిస్టిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి 100 శాతం రికవరీ అయినట్లు నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారిక పోస్టు పెట్టడం గమనార్హం. https://twitter.com/AndhraBoxOffice/status/1845695019199463627 https://twitter.com/Colliderreview/status/1845720361499083121 మా నాన్న సూపర్‌ హీరో (Maa Nanna Super Hero) సుధీర్ బాబు&nbsp; (Sudheer Babu)&nbsp; హీరోగా తెరకెక్కిన మరో వైవిధ్యమైన సినిమా ‘మా నాన్న సూపర్ హీరో’ (Maa Nanna Superhero). అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి ఫీల్‌గుడ్‌ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం కలెక్షన్స్‌ పరంగా మాత్రం తీవ్రంగా నిరాశ పరుస్తోంది. ఈ చిత్రం వీకెండ్‌ పూర్తయ్యేసరికి రూ. 75 లక్షలు (GROSS) మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో రూ.68 కోట్లు నెట్‌ వసూళ్లుగా ఉన్నట్లు తెలిపాయి. తొలి రోజు రూ.19 లక్షలు, రెండో రోజు రూ.26 లక్షలు, మూడో రోజు రూ.23 లక్షలు మాత్రమే రాబట్టినట్లు వివరించాయి. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌ సాధించాలంటే రూ.5.2 కోట్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత వసూళ్లను బట్టి చూస్తే ఈ సినిమా లాభాల్లోకి రావడం కష్టంగానే కనిపిస్తోంది.&nbsp; జిగ్రా (Jigra) బాలీవుడ్‌ బ్యూటీ లీడ్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్ చిత్రం 'జిగ్రా'. వాసన్ బాలా దర్శకత్వం వహించారు. తెలుగు నటుడు రాహుర్‌ రవీంద్రన్‌ ముఖ్య పాత్ర పోషించాడు. అక్టోబర్‌ 11న తెలుగు, హిందీతో పాటు పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా రిలీజ్‌ అయ్యింది. ఈ చిత్రం తొలి మూడు రోజుల్లో వరల్డ్‌ వైడ్‌గా ఈ చిత్రం రూ.26 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాలు అంచనా వేశాయి. ఒక్క హిందీ బెల్ట్‌లోనే రూ.16.47 కోట్లు వసూలు చేసినట్లు వివరించాయి. హిందీలో రాజ్‌కుమార్‌ రావు, త్రిప్తి దిమ్రీ కాంబోలో రిలీజైన 'విక్కీ ఔర్‌ విద్యా కా వోహ్‌ వాలా' మూవీ నుంచి జిగ్రాకు గట్టి పోటీ ఎదురైనట్లు ట్రేడ్ పండితులు తెలిపారు. దీంతో జిగ్రా కలెక్షన్స్‌లో కొంతమేర కోత పడినట్లు అభిప్రాయపడుతున్నారు.&nbsp;
    అక్టోబర్ 14 , 2024
    <strong>Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!</strong>
    Adulthood Telugu Movies: తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ అడల్ట్‌హుడ్ సినిమాలు ఇవే!
    అడల్ట్ వుడ్ అంటే.. తెలుగులో వయోజన స్థితి.  ఒక వ్యక్తి పూర్తి శారీరక, మానసిక పరిపక్వత పొందుతున్న జీవన దశను అడల్ట్‌వుడ్ అంటారు. ఈ దశలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ, జీవితంలో నిలదొక్కుకునే సమయంలో ఎదురయ్యే(Adulthood Telugu Movies) సవాళ్లు, కుటుంబ సమస్యలు, ప్రేమ, ఆర్థిక స్వావలంబన వంటి సామాజిక అంశాలు ప్రభావం చూపుతాయి. తెలుగులో ఈ జనర్‌లో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ప్రేక్షాకాదరణ పొందిన కొన్ని చిత్రాలను ఇక్కడ అందిస్తున్నాం. మీరు ఓ లుక్‌ వేయండి. [toc] Jersey అర్జున్ రంజీ క్రికెటర్, ఎప్పటికైనా ఇండియన్ టీమ్‌లో ఆడాలని కలలు కంటాడు. అయితే 26 సంవత్సరాల వయసులో ఓ కారణం వల్ల క్రికెట్‌కు దూరమవుతాడు. ఆ తరువాత ఆర్ధిక సమ్యసల వల్ల అలాగే తన కొడుకు కోసం 36 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ ఆడడం మొదలు పెడుతాడు. ఈక్రమంలో అతను ఎలాంటి పరిస్థులను ఎదుర్కున్నాడు? ఇంతకి అర్జున్ నేషనల్ టీంలో సెలక్ట్ అయ్యాడా ? అనేది మిగిలిన కథ. Ee Nagaraniki Emaindi&nbsp; నలుగురు యువకులు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. అనివార్య కారణాలతో వారు విడిపోతారు. వారిలో ఒకరి పెళ్లి ఫిక్స్‌ కావడంతో అందరూ ఒక్కటవుతారు. అనుకోని పరిస్థితుల్లో వారంతా గోవాకు వెళతారు? అక్కడ వారు ఏం చేశారు? గోవా ట్రిప్‌ వారిలో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అన్నది కథ. Chi La Sow అర్జున్‌ (సుశాంత్‌) తల్లితండ్రులు అంజలి(రుహాని శర్మ)తో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. అంజలి ఎన్నో బాధ్యతలు ఉన్న మధ్యతరగతి అమ్మాయి. అంజలిని చూసిన అర్జున్‌ పెళ్లికి ఒప్పుకున్నాడా? వీరి పెళ్లి చూపులు ఎలా జరిగింది? అన్నది కథ. (Adulthood Telugu Movies) C/o Kancharapalem కంచరపాలెంలో మెుదలైన నాలుగు ప్రేమకథలు వారి జీవితాల్లో ఎలాంటి మలుపులకు కారణమయ్యాయి? ఈ నాలుగు జంటలకు ఉన్న సంబంధం ఏంటి? చివరకు వారి కథలు ఎలా ముగిశాయి? అన్నది కథ. Brochevarevarura పరీక్షల్లో ఫెయిలై ఖాళీగా సమయం వృథా చేస్తున్న ముగ్గురు విద్యార్థులు తమ కాలేజీలో మిత్ర అనే అమ్మాయితో స్నేహం చేస్తారు. ఆమెకు తండ్రితో ఓ సమస్య వస్తుంది. మిత్రను ఆ సమస్య నుంచి బయట పడేలా చేస్తారు. కానీ వారు చిక్కుల్లో పడతారు. (Adulthood Telugu Movies) Ninnila Ninnila పలు సమస్యలతో బాధపడుతున్న దేవ్, తార ఓ రెస్టారెంటులో చెఫ్‌గా పనిచేస్తుంటారు. అనుకోకుండా వీరిద్దరి ఆ రెస్టారెంట్‌లో రాత్రంతా ఇరుక్కుపోతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. Raja Raja Chora&nbsp; భాస్కర్‌ (శ్రీ విష్ణు) సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా సంజన (మేఘా ఆకాష్‌)కు పరిచయమవుతాడు. అబ్బద్దాలు చెప్పి ఆమెను ప్రేమలో పడేస్తాడు. అయితే భాస్కర్‌కు ఇదివరకే పెళ్లై ఓ బాబు కూడా ఉన్నాడని సంజన తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? విద్య (సునైనా) ఎవరు? అన్నది కథ. Nootokka Jillala Andagadu&nbsp; హీరో వంశపారంపర్యంగా వచ్చిన బట్టతలతో బాధపడుతుంటాడు. విగ్గు, టోపీతో మేనేజ్‌ చేస్తుంటాడు. (Adulthood Telugu Movies) ఈ విషయం దాచి సహోద్యోగి అంజలి (రుహానిశర్మ)ని ప్రేమిస్తాడు. ఈ రహస్యం ఓ రోజు అంజలికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Balagam ఓ పల్లెటూరిలో అందరితో సరదాగా ఉండే ఓ ముసలాయన కొమురయ్య( సుధాకర్‌ రెడ్డి). అతడి మనవడు సాయిలు (ప్రియదర్శి). విపరీతంగా అప్పులు చేసిన సాయిలు పెళ్లి చేసుకుని ఆ కట్నం డబ్బులతో అప్పు తీర్చాలనుకుంటాడు. కానీ సరిగ్గా వరపూజ రోజున అతడి తాత కొమురయ్య చనిపోతాడు. Pareshan&nbsp; ఇస్సాక్ , పాషా, సత్తి, RGV అనే నలుగురు యువకులు సింగరేణి ప్రాంతంలో నివసిస్తుంటారు.. వీరంతా మద్యానికి బానిసలు కావడంతో ఎలాంటి పరిస్థితి వచ్చినా మద్యం తాగుతూనే ఉంటారు. సత్తి, పాషాలకు డబ్బు అవసరం కావడంతో, ఇస్సాక్ తన తండ్రి డబ్బును వారికి ఇస్తాడు. ఇదే క్రమంలో ఇస్సాక్‌కు ఓ సమస్య వచ్చి డబ్బు అవసరమవుతుంది. కానీ సత్తి, పాషా డబ్బు తిరిగి ఇవ్వరు. మరి ఇస్సాక్ వారి నుంచి డబ్బు వసూలు చేశాడా? ఇంతకు అతనికి వచ్చిన సమస్య ఏమిటి? అన్నది మిగతా కథ. Nuvvu Naaku Nachchaav వెంకీని అతని తండ్రి శేఖరం.. తన చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ దగ్గరికి ఉద్యోగం కోసం పంపిస్తాడు. అయితే పెళ్లి నిశ్చయమైన శ్రీనివాస్ కూతురు నందిని వెంకీని ప్రేమిస్తుంది. కానీ వెంకీ, శ్రీనివాస్‌తో తన తండ్రి స్నేహం చెడిపోవద్దని ప్రేమను త్యాగం చేయాలని అనుకుంటాడు.&nbsp; Vedam రాజు, సరోజ, రాములు, వివేక్ చక్రవర్తి, రహీముద్దీన్ ఖురేషీ అనే ఐదుగురు వ్యక్తులు తమ జీవితంలో విభిన్నమైన లక్ష్యాలు ఉన్నవారు. అయితే వీరంతా ఓ ఆస్పత్రిలో జరిగే ఉగ్రవాద దాడిలో బాధితులైనప్పుడు ఏం జరిగిందనేది కథ. Bommarillu సిద్ధూ తండ్రి అతనికి ఓ ధనవంతుడి కూతురితో పెళ్లి ఖాయం చేస్తాడు. అయితే సిద్ధూ తన తండ్రి తెచ్చిన సంబంధాన్ని కాదని హాసిని అనే యువతితో ప్రేమలో పడటంతో కథ ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది. Keedaa Cola ఓ కూల్ డ్రింక్ లో బొద్దింక వస్తే... కోర్టు వరకు ఆ విషయాన్ని తీసుకువెళ్తే వచ్చే డబ్బు కంటే.. సదరు కార్పొరేట్ సంస్థనే బ్లాక్ మెయిల్ చేస్తే వచ్చే డబ్బు ఎక్కువ అని భావించిన కొందరు కుర్రాళ్ళు ఎలాంటి చిక్కుల్లో పడ్డారు? అనేది కీడా కోలా కథ. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో పాటు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. Seethamma Vakitlo Sirimalle Chettu ఇది మధ్య తరగతి కుటుంబంలో ఉన్న ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు, చిన్నోడు జీవితాలను చుట్టూ తిరుగుతుంది. ఈ కథలో వాళ్ళ బంధం, వారి ప్రేమ, తల్లిదండ్రుల పట్ల గౌరవం చూపిస్తుంది. ఈ సినిమాలో సాంప్రదాయ విలువలు, కుటుంబం మీద ప్రేమ, విభేదాల మధ్య కూడా కలిసి ఉండటం ఎంత ముఖ్యమో చూపిస్తుంది. Miss Shetty Mr Polishetty మాస్టర్ చెఫ్‌ అయిన అన్విత రవళి తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఈక్రమంలో ఓ కీలక నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లిచేసుకోవద్దని నిశ్చయించుకుంటుంది. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సిద్దు పొలిశెట్టిస్టాండప్ కమెడియన్‌గా అలరిస్తుంటాడు. అన్విత అతని కామెడీ ఇష్టపడుతుంటుంది. ఈక్రమంలో సిద్దూ ఆమెతో ప్రేమలో పడతాడు. అన్విత తన నుంచి ఏమి ఆశిస్తుందో చెప్పినప్పుడు సిద్దూ షాక్‌కు గురవుతాడు. ఇంతకు అన్విత సిద్ధుని ఏం అడిగింది? అందుకు సిద్ధు అంగీకరించాడా? అన్నది మిగతా కథ. Pilla Zamindar అల్లరి చిల్లరగా తిరిగే ప్రవీణ్ పెద్ద భూస్వామి మనవడు. తన తాతగారి ఆస్తిని వారసత్వంగా పొందడం కోసం తన చదువును పూర్తి చేసేందుకు ఓ బోర్డింగ్ కాలేజీకి వెళ్తాడు. అక్కడ అతను జీవితం గురించి ఎలాంటి పాఠాలు నేర్చుకున్నాడన్నది మిగతా కథ. Josh దుర్గరావు అనే స్థానిక రాజకీయ మాఫియా నాయకుడు విద్యార్థులను తన అవసరాల కోసం వాడుకుంటుంటాడు. కాలేజీలో చేరిన సత్య అనే విద్యార్థి మిగతా విద్యార్థులను మార్చే ప్రయత్నం చేస్తాడు. Rowdy Boys అక్షయ్ (ఆశిష్) బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడు. బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో చేరడానికి కాలేజీకి వెళ్తూ మెడికల్ స్టూడెంట్ కావ్యను (అనుపమ పరమేశ్వరన్) చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. ఆ మెడికల్ కాలేజీకి, ఆశిష్ చేరబోయే కాలేజీకి అస్సలు పడదు. ఆ తర్వాత ఏం జరిగిందన్నది కథ. Middle Class Melodies రాఘవ అనే యువకుడు తన తండ్రిలాగా కాకుండా.. సమీపంలోని పట్టణంలో హోటల్‌ బిజినెస్ చేయాలనుకుంటాడు. పట్టణంలో హోటల్ తెరిచినప్పటికీ.. వ్యాపారం సక్సెస్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాడు. వాటి నుంచి బయటపడేందుకు రాఘవ ఏం చేశాడు అనేది కథ.
    ఆగస్టు 24 , 2024
    <strong>OTT Suggestions: ఈ వీకెండ్‌.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే</strong>
    OTT Suggestions: ఈ వీకెండ్‌.. పక్కా వినోదాన్ని పంచే చిత్రాలు ఇవే
    ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను పసందైన ఆనందాన్ని పంచుతున్నాయి. ఈ వారంతం పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు ఓటీటీలోకి రానున్నాయి. మరికొన్ని ఇప్పటికే స్ట్రీమింగ్‌లోకి వచ్చేశాయి. వీటిలో మీ అభిరుచికి తగ్గ సినిమాను ఎంచుకుని ఓటీటీలో చూసేందుకు వీకెండ్‌ (OTT Suggestions)లో ప్లాన్ చేసుకోండి. ఇంతకీ ఆ చిత్రాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి? వాటి ప్లాట్స్‌ ఏంటి? ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; జీబ్రా (Zebra) సత్యదేవ్‌, ధనుంజయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్‌ కథానాయిక. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’ అధికారికంగా ప్రకటించింది. డేట్ అనౌన్స్‌ చేయనప్పటికీ డిసెంబర్‌ 14న ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్లాట్ ఏంటంటే ‘మిడిల్‌ క్లాస్‌కు చెందిన సూర్య (సత్యదేవ్‌) బ్యాంక్‌ ఆఫ్‌ ట్రస్ట్‌లో రిలేషన్‌ షిప్‌ మేనేజర్‌గా పని చేస్తుంటాడు. తోటి ఉద్యోగిని స్వాతి (ప్రియ భవానీ శంకర్‌)ని తప్పుడు అకౌంట్‌కు రూ.4 లక్షల డబ్బును ట్రాన్‌ఫర్‌ చేస్తుంది. ఆ సమస్య నుంచి స్వాతిని కాపాడే క్రమంలో సూర్య రూ.5 కోట్ల ఫ్రాడ్‌లో ఇరుక్కుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాలతో ఎంతో ప్రమాదకారి అయిన ఆది (ధనంజయ్‌)ని సూర్య ఢీ కొట్టాల్సి వస్తుంది. సూర్య అతడ్ని ఎలా ఎదుర్కొన్నాడు? ఈ క్రమంలో ఎదురైన సవాళ్లు ఏంటి?’ అన్నది స్టోరీ. తంగలాన్‌ (Thangalan) తమిళ స్టార్‌ హీరో విక్రమ్ హీరోగా నటించిన 'తంగలాన్‌' చిత్రం ఈ వారమే సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 10 నుంచి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి పా. రంజిత్‌ దర్శకత్వం వహించగా మాళవిక మోహనన్‌, పార్వతి తిరువొత్తులు ప్రధాన పాత్రలు పోషించారు. ప్లాట్‌ ఏంటంటే ‘తంగలాన్‌ తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తుంటాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల బ్రిటిషర్లతో కలిసి బంగారం వెతికేందుకు వెళ్తాడు. అయితే బంగారాన్ని నాగజాతికి చెందిన మంత్రగత్తె ఆరతి (మాళవిక) రక్షిస్తుంటుంది. ఆమె నుంచి తంగలాన్‌ బృందానికి ఎదురైన సవాళ్లు ఏంటి? ఆమె నుంచి తప్పించుకొని తంగలాన్‌ బంగారాన్ని ఎలా సాధించాడు?’ అన్నది స్టోరీ. &nbsp;7/G&nbsp; సోనియా అగర్వాల్‌ (OTT Suggestions), స్మృతి వెంకట్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘7/G’. హరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టెరిఫిక్‌ హారర్‌ థ్రిల్లర్‌గా థియేటర్లలో ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రం తాజాగా ఆహా వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. తెలుగులో వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే ‘రాజీవ్‌, వర్ష దంపతులు ఐదేళ్ల కుమారుడితో కలిసి కొత్త ఫ్లాట్‌లోకి షిఫ్ట్‌ అవుతారు. అక్కడ వర్షకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. అతీతశక్తులతో ఆమె పోరాటం చేయాల్సి వస్తుంది. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ.   బౌగెన్‌విల్లా (Bougainvillea) మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌, కుంచకో బోబన్‌, జ్యోతిర్మయి ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ చిత్రం 'బౌగెన్‌విల్లా'. థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. డిసెంబర్‌ 13 నుంచి సోని లివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. తెలుగులోనూ వీక్షించవచ్చు. ప్లాట్‌ ఏంటంటే 'థామస్, రీతు భార్య భర్తలు. యాక్సిడెంట్‌లో గీతు గతం మర్చిపోతుంది. మరోవైపు మినిస్టర్‌ కుమార్తె మిస్సింగ్‌ కేసు రాష్ట్రంలో సంచలనం సృషిస్తుంటుంది. యాక్సిడెంట్‌కు ముందు మినిస్టర్‌ కుమార్తెను రీతు ఫాలో కావడం చూసి దర్యాప్తు చేసేందుకు ఏసీపీ కోషి వాళ్ల ఇంటికి వస్తాడు. అక్కడ ఏసీపీకి తెలిసిన షాకింగ్‌ నిజాలేంటి? అసలు మినిస్టర్‌ కూతుర్ని కిడ్నాప్‌ చేసింది ఎవరు? అన్నది స్టోరీ. హరికథ (Harikatha) పలు సూపర్‌ హిట్‌ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపీల్‌ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓ ఆసక్తికర వెబ్‌సిరీస్‌ను నిర్మించింది. 'హరికథ: సంభవామి యుగే యుగే' (OTT Suggestions) పేరుతో రూపొందిన ఈ సిరీస్‌ ఈ వారమే హాట్‌ స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది. డిసెంబర్‌ 13 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. ఇందులో రాజేంద్ర ప్రసాద్‌, శ్రీరామ్‌, దివి, అంబటి అర్జున్‌ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు.  రోటి కపడా రొమాన్స్ (Roti Kapada Romance) హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్ పొనుగంటి, సుప్రజ్ రంగా హీరోలుగా నటించిన సినిమా 'రోటి కపడా రొమాన్స్'. ఇందులో సోనూ ఠాకూర్, నువేక్ష, మేఘ లేఖ, ఖుష్బూ చౌదరి హీరోయిన్లు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ రెస్పాన్స్ అందుకుంది. ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు ఈ వారం స్ట్రీమింగ్‌కు వచ్చింది. డిసెంబర్‌ 12 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్‌ ఏంటంటే ‘ఈవెంట్‌ ఆర్గనైజర్‌ హర్ష (హర్ష నర్రా), సాఫ్ట్‌వేర్‌ రాహుల్‌ (సందీప్‌ సరోజ్‌), ఆర్జే సూర్య (తరుణ్‌), విక్కీ(సుప్రజ్‌ రంగ) చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. ఒకే రూమ్‌లో ఉంటూ హ్యాపీగా జీవిస్తుంటారు. సాఫీగా సాగుతున్న వీరి లైఫ్‌లోకి నలుగురు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. వారి రాకతో ఆ నలుగురు ఫ్రెండ్స్‌ లైఫ్‌ ఎలా మారింది? ప్రేమ వల్ల వారు ఎలాంటి ఇబ్బందులు ఫేస్‌ చేశారు? వారిలో వచ్చిన రియలైజేషన్‌ ఏంటి?’ అన్నది స్టోరీ కంగువా (Kanguva) ఇదిలా ఉంటే గతవారం పలు ఆసక్తికర చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. తమిళ హీరో సూర్య (Suriya) నటించిన లేటెస్ట్‌ చిత్రం 'కంగువా' (Kanguva OTT Release) డిసెంబర్‌ 10 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్‌ ఏంటంటే ‘ఫ్రాన్సిస్‌ (సూర్య) గోవాలో బౌంటీ హంటర్‌గా పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రాన్సిస్‌ను ఒక పాప కలుస్తుంది. ఆ పాపకి తనకు ఎదో బంధం ఉందని అతడికి అనిపిస్తుంది. ఆ బంధం ఇప్పటిది కాదు గత జన్మదని అతడికి అర్థమవుతుంది. 1000 ఏళ్ల కిందట ఆ పాపతో ఫ్రాన్సిస్‌కు ఉన్న సంబంధం ఏంటి? అసలు కంగువా ఎవరు? తెగ నాయకుడిగా అతడు చేసిన పోరాటాలు ఏంటి? విలన్ (బాబీ డియోల్‌) నుంచి అతడి తెగకు ఎదురైన ముప్పు ఏంటి?’ అన్నది స్టోరీ. అమరన్‌ (Amaran) పాన్‌ ఇండియా స్థాయిలో (OTT Releases) విడుదలై భారీ విజయం అందుకున్న రీసెంట్‌ తమిళ చిత్రం 'అమరన్‌' . అమరుడైన మేజర్‌ ముకుంద్‌ వరదరాజన్‌ బయోపిక్‌ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. శివ కార్తికేయన్‌, సాయి పల్లవి కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ కుమార్‌ పెరియసామి డైరెక్ట్‌ చేశారు. డిసెంబర్‌ 5న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) బాల్యం నుంచే సైనికుడు కావాలని కలగంటాడు. మద్రాస్ క్రిస్టియన్ కళాశాలలో చదువుతున్నప్పుడు తన జూనియర్ అయిన కేరళ అమ్మాయి ఇందు (సాయి పల్లవి)తో ప్రేమలో పడతాడు. ఆయన భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికవుతాడు. విధుల్లో చేరిన తర్వాత వారి ప్రేమను ఇందు కుటుంబం తిరస్కరిస్తుంది. తల్లిదండ్రులను ఒప్పించి, వివాహం చేసుకుని కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఈ జంట తర్వాత ఎదురైన సవాళ్లను ఎలా అధిగమించారనేది ఆసక్తికరంగా సాగుతుంది. మరి ముకుంద్ వరదరాజన్ దేశం కోసం ఎలాంటి త్యాగం చేశాడు? దేశం కోసం ఎలాంటి సాహసాలు చేశాడు?’ అనేది మిగతా కథ. విక్కీ విద్యా కా వో వాలా వీడియో (Vicky Vidya Ka Woh Wala Video) ’యానిమల్‌’ బ్యూటీ త్రిప్తి దిమ్రి (OTT Suggestions) నటించిన లేటెస్ట్‌ చిత్రం గత వారం ఓటీటీలోకి వచ్చింది. 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో' (Vicky Vidya Ka Woh Wala Video OTT Platform) సినిమా డిసెంబర్‌ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ  భాషల్లో ఈ సినిమాను వీక్షించవచ్చు. ఇందులో రాజ్‌కుమార్‌ రావ్‌, త్రిప్తి దిమ్రి జంటగా నటించారు. రాజ్‌ శాండిల్య డైరెక్ట్ చేశారు. ప్లాట్ ఏంటంటే ‘1997 సంవత్సరంలో వికీ (రాజ్ కుమార్ రావు), విద్యా (త్రిప్తి డిమ్రీ) ఇద్దరు పెళ్లి చేసుకొంటారు. ఫస్ట్‌ నైట్‌ మధుర జ్ఞాపకాలను ఓ సిడీలో బంధిస్తారు. అయితే అనూహ్యంగా ఆ సీడీ దొంగతనానికి గురవుతుంది. ఆ తర్వాత ఆ ఇద్దరి దంపతుల పరిస్థితి ఏంటి? అన్నది స్టోరీ.
    డిసెంబర్ 12 , 2024
    Seerat Kapoor: ‘భామకలాపం-2’తో గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన సీరత్‌.. ఆమె గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    Seerat Kapoor: ‘భామకలాపం-2’తో గట్టి కమ్‌బ్యాక్‌ ఇచ్చిన సీరత్‌.. ఆమె గురించి ఈ సీక్రెట్స్‌ తెలుసా?
    యంగ్‌ బ్యూటీ సీరత్‌ కపూర్‌ (Seerat Kapoor).. ఇటీవల వచ్చిన ‘భామకలాపం 2’ (Bhamakalapam 2) వెబ్‌సిరీస్‌తో మరోమారు తెలుగు ప్రేక్షకులను పలకరించింది. తన అందం, నటనతో ఓటీటీ ఆడియన్స్‌ను అలరించింది. టాలీవుడ్‌లో తన అరంగేట్ర చిత్రంతోనే బ్లాక్‌ బ్లాస్టర్‌ విజయాన్ని అందుకున్న సీరత్‌ కపూర్‌.. రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయింది. ఆ తర్వాత చిత్రాలు చెప్పుకోతగ్గ విజయాలు సాధించకపోవడంతో ఈ భామకు అవకశాలు తగ్గాయి. ఇప్పుడు మళ్లీ ‘భామకలాపం 2’ మళ్లీ మెరవడంతో అందరి దృష్టి ఈ బ్యూటీపై పడింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో చూద్దాం.&nbsp; సీరత్‌ కపూర్‌ ఎవరు? సీరత్‌ కపూర్‌.. ప్రముఖ హీరోయిన్‌. తెలుగు, హిందీ చిత్రాల్లో నటించింది.&nbsp; సీరత్‌ కపూర్‌ ఎక్కడ పుట్టింది? మహారాష్ట్ర ముంబైలో ఈ భామ జన్మించింది. సీరత్‌ కపూర్‌ ఎప్పుడు జన్మించింది? ఏప్రిల్ 3, 1993 సీరత్‌ కపూర్‌ వయసు ఎంత? 31 సంవత్సరాలు (2024) సీరత్‌ కపూర్‌ ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు (165 సెం.మీ) సీరత్‌ కపూర్‌ తల్లిదండ్రులు ఎవరు? వినీత్ కపూర్, నీనా సిహోత కపూర్‌ దంపతులకు సీరత్‌ జన్మించింది. ఆమె తండ్రి ముంబయిలోని ప్రముఖ హోటల్‌కు యజమాని. తల్లి ఎయిర్‌ హోస్టేస్‌గా పనిచేసింది.&nbsp; సీరత్‌ కపూర్‌కు తోబుట్టువులు ఉన్నారా? ఈ భామకు ఒక సోదరుడు ఉన్నాడు. అతడి పేరు వరుణ్‌ కపూర్‌ (గ్రాఫిక్‌ డిజైనర్‌) సీరత్‌ కపూర్‌ ఎక్కడ చదువుకుంది?&nbsp; ముంబయిలోని పోదర్ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో సీరత్‌ ప్రాథమిక విద్యను అభ్యసించింది. ఆర్‌.డి నేషనల్‌ కాలేజీలో బిఏ మాస్‌ కమ్యూనికేషన్‌లో చేరిన సీరత్‌..చదువు మధ్యలోనే ఆపేసింది. సీరత్‌ కపూర్‌కు పెళ్లి అయ్యిందా? ఆమెకు ఇంకా మ్యారేజ్‌ కాలేదు సీరత్‌ కపూర్‌ తన కెరీర్‌ను ఎలా మెుదలుపెట్టింది? సీరత్‌కు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. 16 ఏళ్లకే బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్‌ యాష్లే లోబో వద్ద అసిస్టెంట్‌గా తన కెరీర్‌ ప్రారంభించింది.&nbsp; సీరత్‌ కపూర్‌ కొరియోగ్రాఫ్‌ చేసిన చిత్రం? బాలీవుడ్‌ చిత్రం రాక్‌స్టార్‌కు సీరత్ అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌గా పనిచేసింది.&nbsp; సీరత్‌ కపూర్‌ మోడల్‌గా చేసిందా? సినిమాల్లోకి రాకముందు మోడల్‌గానూ ఈ బ్యూటీ పనిచేసింది. రోషన్ తనేజా స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో నటనకు శిక్షణ కూడా తీసుకుంది.&nbsp; సీరత్‌ కపూర్‌ తెరంగేట్ర చిత్రం? 2014లో బాలీవుడ్‌లో వచ్చిన 'జిద్‌' ఆమెకు మెుట్ట మెుదటి సినిమా. నాన్సీ పాత్రతో ఆమె హిందీ ఆడియన్స్‌ను పలకరించింది.&nbsp; సీరత్‌ కపూర్‌ చేసిన తొలి తెలుగు చిత్రం? శర్వానంద్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో వచ్చిన 'రన్‌ రాజా రన్‌'.. సీరత్‌కు తొలి తెలుగు చిత్రం. ప్రియా పాత్రలో గ్లామర్‌గా కనిపించి టాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది.&nbsp; సీరత్‌ కపూర్‌ నటించిన తెలుగు చిత్రాలు? ‘రన్‌ రాజా రన్‌’తో పాటు ‘టైగర్‌’, ‘కొలంబస్‌’, ‘రాజు గారి గది - 2’, ‘ఒక్క క్షణం’, ‘టచ్‌ చేసి చూడు’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’, ‘మా వింత గాధ వినుమా’ చిత్రాల్లో సీరత్‌ నటించింది.&nbsp; సీరత్‌ కపూర్‌ చేసిన బాలీవుడ్‌ చిత్రాలు? తొలి చిత్రం జిద్‌తో పాటు మార్రిచ్‌ (Maarrich) సినిమాలో ఆమె నటించింది.&nbsp; సీరత్‌ కపూర్‌ హాబీస్? ట్రావెలింగ్‌ &amp; డ్రాయింగ్‌ సీరత్‌ కపూర్‌కు ఇష్టమైన హీరో? హిందీలో రణ్‌బీర్‌ కపూర్‌.. తెలుగులో మహేష్‌ బాబు అంటే తనకూ ఎంతో ఇష్టమని సీరత్‌ ఓ ఇంటర్యూలో తెలిపింది.&nbsp; సీరత్‌ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా? https://www.instagram.com/iamseeratkapoor/?hl=en https://www.youtube.com/watch?v=Hv1HLoWBEMU
    ఏప్రిల్ 05 , 2024
    Rashi Singh: రాశి సింగ్‌ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
    Rashi Singh: రాశి సింగ్‌ గురించి టాప్ సీక్రెట్స్ మీకోసం!
    యంగ్‌ హీరోయిన్‌ రాశి సింగ్‌ (Rashi Singh).. ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’ (Bhoothaddam Bhaskar Narayana) సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. అంతేకాకుండా గత కొన్ని రోజులుగా తన అంద చందాలతో మతి పోగొడుతూ నెటిజన్లకు హాట్‌ ట్రీట్‌ ఇస్తోంది. ఎద, నాభి సోయగాలను చూపిస్తూ కుర్రకారుకి వలపు వల విసురుతోంది. దీంతో ఈ భామ గురించి తెలుసుకునేేందుకు ప్రతీ ఒక్కరూ ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాశి సింగ్‌ సినిమాలతో పాటు ఆమె ఇష్టా ఇష్టాలు, ఆసక్తులు వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.&nbsp; రాశి సింగ్‌ పుట్టిన రోజు ఎప్పుడు?&nbsp; రాశి సింగ్.. చత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో జనవరి 5, 1994లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు రమేష్‌ సింగ్‌, సరితా సింగ్‌. రాశికి ఓ సోదరుడు కూడా ఉన్నాడు. అతడి పేరు సౌరభ్‌ సింగ్‌.&nbsp; రాశి సింగ్‌ విద్యాభ్యాసం ఎక్కడ? ఈ భామ ప్రాథమిక విద్యాభ్యాసం అంతా చత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌ పట్టణంలో గల క్రిష్ణ పబ్లిక్‌ స్కూల్‌లో జరిగింది. ఆ తర్వాత ముంబయిలో ఉన్నత విద్యను అభ్యసించింది.&nbsp; View this post on Instagram A post shared by Rashi Singh (@rashi.real) రాశి సింగ్‌ కెరీర్‌ ఎలా మెుదలైంది? ఈ భామ కెరీర్‌లో ప్రారంభంలో ఎయిర్‌ హోస్టేస్‌ (Air Hostess)గా పని చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌&nbsp; (Indigo Airlines) విధులు నిర్వర్తించింది. మోడలింగ్‌లోనూ ఈ భామకు ప్రవేశం ఉంది.&nbsp; రాశి సింగ్‌ వయసు ఎంత? రాశి సింగ్‌ జనవరి 5, 1994లో జన్మించినందున ప్రస్తుతం ఆమె వయసు 30 సంవత్సరాలు.&nbsp; రాశి సింగ్‌ ఎత్తు, బరువు ఎంత?&nbsp; రాశి సింగ్‌ 5.5 అంగుళాల ఎత్తు, 55 కేజీల బరువు కలిగి ఉంది. ఈ&nbsp; భామ బాడీ కొలతలు 32-26-34. రాశి సింగ్‌ సినిమాలపై ఆసక్తి ఎలా ఏర్పడింది? చిన్నప్పటి నుంచి రాశి సింగ్‌కు సినిమాలపై ఆసక్తి ఉండేదట. హీరోయిన్ కావాలని చిన్నప్పుడే నిర్ణయించుంది.&nbsp; ఎంతో హార్డ్‌ వర్క్‌ చేసి సినిమాల్లో అవకాశం దక్కించుకుంది.&nbsp; రాశి సింగ్‌ ప్రస్తుతం ఎక్కడ ఉంటున్నారు? ఎయిర్‌ హోస్టేస్‌గా ఉద్యోగం చేస్తున్న సమయంలో ఆమె ముంబయిలో ఉండేది. ప్రస్తుతం తెలుగు సినిమాలపై ఫోకస్‌ పెట్టడంతో తన మకాంను హైదరాబాద్‌కు మార్చింది.&nbsp; రాశి సింగ్‌ ఏ ఏ భాషలు మాట్లాడుతుంది? రాశి సింగ్‌ ఇంగ్లీష్‌, హిందీ బాగా మాట్లాడకలదు. టాలీవుడ్‌లో సినిమా అవకాశాలు వస్తుండటంతో తెలుగు మాట్లాడటం కూడా నేర్చుకున్నట్లు ఓ ఇంటర్యూలో ఈ బ్యూటీ చెప్పింది.&nbsp; రాశి సింగ్‌ ఎలాంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు ? వైవిధ్యభరితమైన పాత్రలు చేసేందుకు రాశి సింగ్ ఆసక్తి కనబరుస్తుంది. ఒకే తరహా పాత్రలు చేయడం తనకు నచ్చదని ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చింది.&nbsp; రాశి సింగ్‌ తెలుగులో ఫేవరేట్‌ హీరో ఎవరు? రాశిసింగ్‌ ఫేవరేట్‌ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆర్య 2 చూసి ఆమె ఆయన అభిమాని అయిపోయింది. ప్రతి సినిమాలో బన్నీ వైవిధ్యం చూపిస్తుండటం రాశిసింగ్‌కు బాగా నచ్చుతుందట.&nbsp;&nbsp;&nbsp; రాశి సింగ్‌ మెుదటి సినిమా ఏది? తెలుగులో జెమ్(2019) చిత్రం ద్వారా రాశి సింగ్ వెండి తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పోస్టర్, రీసౌండ్ వంటి చిన్నా చితక సినిమాల్లో నటించిన పెద్దగా గుర్తింపు లభించలేదు. రాశి సింగ్‌ గుర్తింపు తెచ్చిన చిత్రం? ఈ ముద్దుగుమ్మ తాజాగా నటించిన ‘భూతద్దం భాస్కర్ నారాయణ' చిత్రం పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో రాశి సింగ్‌ నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఆమెపై దర్శక నిర్మాతల దృష్టి పడింది.&nbsp; రాశి సింగ్‌ మద్యం సేవిస్తుందా? లేదు. రాశి సింగ్‌ సిగరేట్‌ దాగుతుందా? లేదు. రాశి సింగ్‌ మాంసాహారం తింటుందా? అవును. రాశి సింగ్‌ చికెన్‌, మటన్‌తో చేసిన నాన్‌ వెజ్‌ వంటకాలను చాలా ఇష్టంగా లాగించేస్తుందట.&nbsp; ఇన్‌స్టాగ్రామ్ ఖాతా లింక్‌? https://www.instagram.com/rashi.real/?hl=en ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లు? ఇన్‌స్టాలో ఈ సుందరాంగికి 1మిలియన్‌కు దగ్గర్లో ఫాలోవర్లు ఉన్నారు.
    మార్చి 05 , 2024
    Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?
    Kotabommali PS Review: పోలీసుల కష్టాలను కళ్లకు కట్టిన ‘కోట బొమ్మాళి’... సినిమా హిట్టా? ఫట్టా?
    నటీనటులు:&nbsp; శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌, మురళి శర్మ, బెనర్జీ, ప్రవీణ్‌ తదితరులు దర్శకత్వం: తేజ మర్నీ సంగీతం: రంజిన్‌ రాజ్‌, మిధున్‌ ముకుందన్ సినిమాటోగ్రఫీ: జగదీష్‌ చీకటి&nbsp; నిర్మాణ సంస్థ: గీతా ఆర్ట్స్‌ నిర్మాతలు: బన్నీ వాసు,&nbsp; విద్యా&nbsp; విడుదల తేదీ: నవంబర్‌ 24, 2023 ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ (Srikanth) ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ వరుస సినిమాలతో అలరిస్తున్నారు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kotabommali PS). తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాహుల్‌ విజయ్‌, శివానీ రాజశేఖర్‌ (Shivani) ప్రధాన పాత్రలు పోషించారు. మలయాళంలో నేషనల్‌ అవార్డు అందుకున్న 'నయట్టు'కు రీమేక్‌గా ఈ మూవీగా తెరకెక్కింది. మరి తెలుగులోనూ ఈ చిత్రం మెప్పించిందా? శ్రీకాంత్‌ ఖాతాలో మరో హిట్‌ చేరిందా? శివానీ రాజశేఖర్‌ తొలి సక్సెస్‌ను అందుకుందా? ఇప్పుడు చూద్దాం.&nbsp; కథ కోట బొమ్మాళి పోలీసు స్టేషన్‌లో పని చేసే ముగ్గురు కానిస్టేబుళ్లు (శ్రీకాంత్‌, శివానీ, రాహుల్‌ విజయ్‌) చేయని తప్పుకు ఓ కేసులో ఇరుక్కుంటారు. పోలీసు ఉన్నాతాధికారులు, రాజకీయ నాయకులు చేసిన వికృత చర్యలకు బలై అజ్ఞాతంలోకి పారిపోతారు. వీరిని పట్టుకునేందుకు ప్రభుత్వం పోలీసు ఆఫీసర్‌ వరలక్ష్మీని రంగంలోకి దింపుతుంది. దీంతో పోలీసులే పోలీసులను ఛేజ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? వరలక్ష్మీ నుంచి తప్పించుకోవడానికి శ్రీకాంత్‌, విజయ్‌, శివానీ ఏం చేశారు? చివరికి వారు పట్టుబడ్డారా లేదా? అన్నది కథ. ఎవరెలా చేశారంటే శ్రీకాంత్ అద్భుత నటన కనిబరిచాడు. చాలా రోజుల తర్వాత ఒక డెప్త్‌ ఉన్న పాత్రను పోషించాడు. అటు రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌లు కూడా తమ నటనలతో పాత్రలకు ప్రాణం పోశారు.&nbsp; మురళీ శర్మ యాక్టింగ్‌ కూడా సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. మిగతా ఆర్టిస్టులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే పోలీసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను డైరెక్టర్‌ తేజ మర్నీ చిత్ర కథాంశంగా ఎంచుకోవడం నిజంగా ప్రశంసనీయం. పోలీసుల కుటుంబాలకు ఉండే ఇబ్బందులను ఆయన చక్కగా చూపించారు. పొలిషియన్స్‌ చేతుల్లో పోలీసులు ఎలా నలిగిపోతారో కూడా చక్కగా తెరకెక్కించారు. అయితే సినిమాలో ఆధ్యంతం ఛేజింగ్‌ ఉండటం వల్ల కాస్త బోరింగ్‌ ఫీల్‌ అవుతారు. కథ బాగున్నప్పటికీ స్క్రీన్‌ప్లే విషయంలో డైరెక్టర్‌ కాస్త జాగ్రత్త పడాల్సింది. కొన్ని సీన్లు మరి సాగదీతగా అనిపిస్తాయి. వాటిని కాస్త ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్‌గా డైరెక్టర్‌ పని తీరును మెచ్చుకోవాల్సిందే.&nbsp; టెక్నికల్‌గా&nbsp; టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే రంజన్‌ రాజ్‌ ఇచ్చిన మ్యూజిక్‌ చాలా బాగుంది. ముఖ్యంగా ‘లింగిడి లింగిడి’ పాటకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే నేపథ్య సంగీతం మూవీకి చాలా ప్లస్‌ అయ్యింది. అటు జగదీష్‌ కెమెరా పనితనం ఆకట్టుకుంటుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథప్రధాన పాత్రల నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్ ప్లేబోరింగ్ సీన్లు రేటింగ్‌: 3/5
    నవంబర్ 24 , 2023
    <strong>Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్‌’ మెప్పించిందా?</strong>
    Vettaiyan Movie Review: విద్యా వ్యవస్థ లోపాలపై రజనీ పోరాటం.. ‘వేట్టయన్‌’ మెప్పించిందా?
    నటీనటులు : రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు దర్శకుడు : టీజీ జ్ఞానవేల్‌ సంగీతం : అనిరుధ్‌ రవిచంద్రన్‌ ఎడిటర్‌ : ఫిలోమిన్‌ రాజ్‌ సినిమాటోగ్రఫీ : ఎస్‌. ఆర్‌. ఖదీర్‌ నిర్మాణ సంస్థ : లైకా ప్రొడక్షన్స్‌ నిర్మాత: సుభాస్కరన్‌ అల్లిరాజా విడుదల తేదీ:&nbsp; అక్టోబర్‌ 10, 2024 సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన సినిమా 'వేట్టయన్ - ద హంటర్' (Vettaiyan Movie Review In Telugu). లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ నిర్మించారు. అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజూ వారియర్, ఫహాద్ ఫాజిల్, దుషారా విజయన్, రితికా సింగ్ ముఖ్య పాత్రలు పోషించారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. అయితే తెలుగు టైటిల్‌లోనూ తమిళ పేరే పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి వాటిని తట్టుకొని ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ సాధించిందా? ‘జైలర్‌’ వంటి బ్లాక్‌ బాస్టర్‌ తర్వాత రజనీకి మరో సాలిడ్‌ విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి పోలీసు ఆఫీసర్‌ అదియన్ (రజనీకాంత్) కన్యాకుమారిలో ఎస్పీగా పనిచేస్తుంటాడు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా డిపార్ట్‌మెంట్‌లో పేరు తెచ్చుకుంటాడు. స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదు ఆధారంగా గంజాయి మాఫియా నడిపే వ్యక్తిని ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. ఆ తర్వాత శరణ్య చెన్నైకు ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. అక్కడ అనూహ్యంగా ఆమె హత్యాచారానికి గురవుతుంది. దీనిపై ఉపాధ్యాయ సంఘాలు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో ఈ కేసును అదియన్‌కు అప్పగిస్తారు. ఆదియన్‌ 48 గంటల్లో గుణ అనే వ్యక్తిని పట్టుకొని అతడే నిందితుడని చెప్పి ఎన్‌కౌంటర్‌ చేస్తాడు. దానిపై జడ్జి సత్యదేవ్ (అమితాబ్ బచ్చన్) నేతృత్వంలో విచారణ కమిటీ ఏర్పాటవుతుంది. సత్యదేవ్ కమిటీ ఏం తేల్చింది? శరణ్య మరణానికి కారణం ఏంటి? ఆమె మరణం వెనకున్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? ఈ కేసులో ప్యాట్రిక్ (ఫహాద్ ఫాజిల్), నటరాజ్ (రానా దగ్గుబాటి), ఏసీపీ రూప కిరణ్ (రితికా సింగ్), హను రెడ్డి (సంపత్ రాజ్) పాత్రలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్ ఎప్పటిలాగే ఇందులో అద్భుతమైన నటన కనబరిచారు. మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం, ఎలివేషన్స్‌తో ఆయన పాత్ర కన్నుల పండుగగా అనిపిస్తుంది. ముఖ్యంగా రజనీ డైలాగ్‌ డెలివరీ, మ్యానరిజమ్స్‌ ఆడియన్స్‌ను బాగా మెప్పిస్తాయి. ఇక రజనీకి ధీటైన పాత్రలో అమితాబ్‌ బచ్చన్‌ అదరగొట్టారు. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అదుర్స్ అనిపిస్తాయి. పోలీసు ఇన్‌ఫార్మర్‌గా ఫహాద్‌ ఫాజిల్‌ పాత్ర ఆకట్టుకుంటుంది. ఓవైపు నవ్విస్తూనే తన నటనతో ఫహాద్‌ మెప్పించాడు. అటు దగ్గుబాటి రానా, దుషారా విజయన్‌లకు సైతం మంచి పాత్రలే దక్కాయి. తమ నటనతో వారు ఎంతో సర్‌ప్రైజ్‌ చేశారు. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు. డైరెక్షన్ ఎలా ఉందంటే 'జై భీమ్' వంటి క్లాస్ సబ్జెక్ట్ తీసిన దర్శకుడు టీజే జ్ఞానవేల్ 'వేట్టయన్‌'తో కూడా మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆడియన్స్‌ కోరుకునే మాస్‌ మూమెంట్స్‌, హీరోయిజం ఎలివేషన్స్‌, కమర్షియల్‌ హంగులు కథకు జతచేయడం బాగా ప్లస్‌ అయ్యింది. స్మార్ట్‌ ఎడ్యుకేషన్‌ పేరుతో ఎలా దోచుకుంటున్నారు? అన్న సున్నితమైన పాయింట్‌ను ఎంతో బలంగా చెప్పే ప్రయత్నం చేశారు డైరెక్టర్‌. రజనీకాంత్‌ ఇంట్రడక్షన్‌, గంజాయి మాఫియాపై ఉక్కుపాదంతో కమర్షియల్‌గా మూవీని మెుదలుపెట్టిన డైరెక్టర్‌, శరణ్య రేప్‌ కేసు తర్వాత అసలు కథలోకి తీసుకెళ్లారు. అయితే కథనం నెమ్మదిగా సాగడం, ఊహాకందేలా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. కానీ, అమితాబ్‌ బచ్చన్‌ - రజనీ మధ్య వచ్చే సీన్స్‌ సినిమాను ఆసక్తికరంగా మార్చేశాయి. రజనీ చెప్పే డైలాగ్స్‌, ఫహాద్‌ ఫాజిల్‌, రానా వంటి స్టార్‌ క్యాస్ట్‌ను డైరెక్టర్ ఉపయోగించుకున్న విధానం మెప్పిస్తుంది. క్లైమాక్స్‌ కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే ప్రతీ విభాగం మంచి పనితీరు కనబరిచింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కథకు కమర్షియల్‌ లుక్ తీసుకురావడానికి కెమెరా వర్క్‌ ఉపయోగిపడింది. ఇక అనిరుధ్‌ నేపథ్య సంగీతం ఎప్పటిలాగే ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్‌ తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు. ఎడిటిర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. లైకా ప్రొడక్షన్స్‌ సినిమా నిర్మాణంలో రాజీ పడలేదు.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రజనీకాంత్‌ నటనసోషల్‌ మెసేజ్‌సంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ నెమ్మదిగా సాగే కథనంఊహజనీతంగా ఉండటం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    అక్టోబర్ 10 , 2024
    <strong>Manchu Manoj: మంచు మనోజ్‌ వెన్నుపూస, పొట్ట, మెడపై తీవ్రగాయాలు!</strong>
    Manchu Manoj: మంచు మనోజ్‌ వెన్నుపూస, పొట్ట, మెడపై తీవ్రగాయాలు!
    టాలీవుడ్‌కు చెందిన పెద్ద కుటుంబాల్లో మంచు ఫ్యామిలీ (Manchu Family) ఒకటి. హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, నిర్మాతగా మోహన్‌ బాబు (Manchu Mohan Babu) ఇండస్ట్రీపై చెరగని ముద్ర వేశారు. తన నటవారసులుగా మంచు విష్ణు (Manchu Vishnu), మంచు మనోజ్‌ (Manchu Manoj), మంచు లక్ష్మీ (Manchu Lakshmi)ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం వారు సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం (డిసెంబర్‌ 8) మంచు ఫ్యామిలీలో పెద్ద గొడవ జరిగింది. తనపై దాడి చేశాడంటూ మోహన్‌బాబు, మంచు మనోజ్‌ (Mohan Babu Manoj) ఒకరిపై ఒకరు డయల్‌ 100కు ఫిర్యాదు చేశారు. అనంతరం మంచు మనోజ్‌ గాయాలతో ఆస్పత్రికి వెళ్లడం ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారి తీసింది. గొడవ నేపథ్యంలో దుబాయి నుంచి మంచు విష్ణు హుటాహుటీనా హైదరాబాద్‌కు వస్తుండటంతో ఈ వివాదం ఏ స్థాయికి వెళ్లి ఆగుతుందన్న ఆందోళన మెుదలైంది.  పోటా పోటీగా బౌన్సర్ల మోహరింపు హైదరాబాద్‌లో జల్‌పల్లిలోని మోహన్‌బాబు (Manchu Family Controversy) ఇంటి వద్ద ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మోహన్‌ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లు చేరుకున్నారు. విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు రాగా, మనోజ్‌ కూడా మరో 30 మందిని తెప్పించారు. అయితే మోహన్‌ బాబు సెక్యూరిటీ మనోజ్‌ తెప్పించిన బౌన్సర్లను లోనికి అనుమతించలేదని తెలుస్తోంది. కాగా, కాసేపట్లో మంచు విష్ణు కూడా దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ చేరుకొని మోహన్‌ బాబు ఇంటికి వస్తారని తెలుస్తోంది. అటు ముంబయిలో ఉంటున్న మంచు లక్ష్మీ సైతం మోహన్‌ బాబు ఇంటికి చేరినట్లు సమాచారం. దీంతో మోహన్‌ వర్సెస్‌ మనోజ్‌ వ్యవహారం మరింత పెద్దదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.&nbsp; https://twitter.com/NtvTeluguLive/status/1866028153187230206 మనోజ్‌ మెడికల్‌ రిపోర్ట్‌ మోహన్‌ బాబు దాడి చేశారన్న వార్తలు వచ్చిన కొద్ది గంటల వ్యవధిలోనే మంచు మనోజ్‌ (Mohan Babu Manoj) తన భార్య సాయంతో ఆస్పత్రికి వెళ్లారు. సరిగ్గా నడవలేక కుంటుతూ ఆస్పత్రిలోకి వెళ్తున్న దృశ్యాలు మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం అయ్యాయి. మనోజ్‌ను పరీక్షించిన వైద్యులు కాలు, మెడ భాగంలో గాయాలైనట్లు నిర్ధారించినట్లు తెలిసింది. సిటీ స్కాన్‌, అల్ట్రా సౌండ్‌ పరీక్షలు కూడా చేసినట్లు సమాచారం. మనోజ్‌ కుడివైపు భుజానికి ఫ్రాక్చర్‌ అయినట్లు తెలుస్తోంది. జల్‌పల్లి ఫామ్‌ హౌస్‌లో గుర్తు తెలియని వ్యక్తులు మంచు మనోజ్‌పై దాడి చేసినట్లు మెడికల్‌ రిపోర్ట్‌లో వైద్యులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. పొట్ట, వెన్నపూస, నెక్‌కు కనిపించని గాయం అయినట్లు వారు నిర్ధారించినట్లు సమాచారం. అనంతరం ఆదివారం (డిసెంబర్‌ 8) రాత్రి చెయ్యి, మెడ, కాలుకి కట్టుతో ఆస్పత్రి నుంచి మనోజ్ డిశ్చార్జ్‌ అయ్యారు.&nbsp; https://twitter.com/sudhakarudumula/status/1865759830608171371 https://twitter.com/Deccan24x7/status/1866014924163420621 https://twitter.com/aadabhyd/status/1865809601628696785 విద్యా సంస్థల విషయంలోనే గొడవ! మోహన్‌బాబు, మంచు మనోజ్‌ (Mohan Babu vs Manchu Manoj) మధ్య ఆస్తుల విషయంలోనే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అయితే మోహన్‌ బాబు ఇప్పటికే ఆస్తులను పిల్లలకు పంచేశారని సమాచారం. అయితే మోహన్‌ బాబు ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టేది తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థలు. ఆ విద్యా సంస్థల్లో మనోజ్‌ కోరుకున్నట్లు అతడికి వాటా రాలేదని ప్రచారం జరుగుతోంది. వాటిలో తన హక్కు కోసం మనోజ్‌ గత కొంతకాలంగా పోరాడుతున్నట్లు సమాచారం. ఈ విషయమై మోహన్‌బాబుతో మరోమారు చర్చించేందుకు భార్యతో కలిసి మనోజ్‌ ఆదివారం ఆయన ఇంటికి వెళ్లారట. ఈ క్రమంలో మాట మాట పెరిగి అది దాడి వరకూ వెళ్లిందని అంటున్నారు. ఈ వివాదం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని మంచు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.&nbsp; మనోజ్‌ వర్సెస్‌ విష్ణు వీడియో మంచు ఫ్యామిలీ (Manchu Manoj vs Manchu Vishnu)లో గత కొంతకాలంగా వివాదాలు ఉన్నట్లు&nbsp; తెలుస్తోంది. గతేడాది మార్చిలో విష్ణు దౌర్జన్యం చేస్తున్న వీడియోను మంచు మనోజ్‌ సోషల్‌ మీడియాలో షేర్ చేశాడు. అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 'ఇళ్లల్లోకి వచ్చి మా వాళ్లను బంధువులను ఇలా కొడుతుంటారండి. ఇది ఇక్కడి పరిస్థితి' అంటూ మనోజ్‌ వీడియోలో చెబుతుంటాడు. అప్పుడు విష్ణు 'వాడు ఏదో అన్నాడు కదా ఒరేయ్‌ గిరేయ్‌' అంటూ కేకలు వేయడం గమనించవచ్చు. అయితే వీడియోను పోస్టు చేసిన కొద్దిసేపటికో మనోజ్‌ దానిని డిలీట్‌ చేశాడు. ఓ రియాలిటీ షోలో భాగంగా దాన్ని షూట్‌ చేసినట్లు మంచు ఫ్యామిలీ పీఆర్‌ టీమ్‌ చెప్పుకొచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు మరో వివాదంతో మంచు ఫ్యామిలీ మీడియాకెక్కింది.&nbsp; https://twitter.com/R24Telugu/status/1639156881892712448
    డిసెంబర్ 09 , 2024
    <strong>Jithender Reddy Review: నక్సలిజంలోని చీకటి కోణాన్ని బయటపెట్టిన ‘జితేందర్‌ రెడ్డి’.. హిట్టా? ఫట్టా?</strong>
    Jithender Reddy Review: నక్సలిజంలోని చీకటి కోణాన్ని బయటపెట్టిన ‘జితేందర్‌ రెడ్డి’.. హిట్టా? ఫట్టా?
    నటీనటులు: రాకేష్ వర్రే, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్, ఛత్రపతి శేఖర్ తదితరులు.. దర్శకత్వం: విరించి వర్మ సంగీతం: గోపి సుందర్ సినిమాటోగ్రఫీ: వి.ఎస్. జ్ఞాన శేఖర్ ఎడిటర్: రామకృష్ణ అర్రం నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి విడుదల తేదీ: నవంబర్‌ 7, 2024 రాకేశ్‌ వర్రే కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ పొలిటికల్‌ యాక్షన్‌ చిత్రం ‘జితేందర్‌రెడ్డి’ (Jithender Reddy). ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్‌ ద‌ర్శ‌కుడు విరించి వ‌ర్మ ఈ సినిమాను రూపొందించారు. 1980లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తీర్చిదిద్దారు. ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్‌ స్వయం సేవకుడిగా పనిచేసిన వ్యక్తుల జీవిత కథను బేస్‌ చేసుకొని రూపొందించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? ఇప్పుడు తెలుసుకుందాం.&nbsp; కథేంటి 1980లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది. జితేందర్ రెడ్డి (రాకేష్ వర్రే) ఫ్యామిలీ మెుదటి నుంచి RSS స్వయంసేవకులు. అలాంటి ఫ్యామిలీలో పుట్టిన జితేందర్ రెడ్డి చిన్నపుడే RSS సిద్దాంతాలకు ఆకర్షితుడు అవుతాడు. దేశం, ధర్మం, ప్రజలు కోసం ఏదైనా చేయాలని తపన పడుతుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు 18 ఏళ్లు కూడా నిండని ఓ కుర్రాడిని నక్సలైట్లు అన్యాయంగా చంపేస్తారు. ఈ ఘటనతో కాలేజ్‌ స్టూడెంట్‌ అయిన జితేందర్‌ రెడ్డి కామ్రేడ్స్‌పై రగిలిపోతాడు. ప్రజల శ్రేయస్సు కోసం గన్ను పట్టుకున్నామని చెప్పుకునే నక్సలైట్స్‌ దారి తప్పారని గ్రహిస్తాడు. ఆ తర్వాత నక్సలైట్స్‌పై జితేందర్ రెడ్డి ఎలాంటి పోరాటం చేశాడు? విద్యా వ్యవస్థల్లో బలంగా నాటుకుపోయిన PDSUకి ధీటుగా ABVB ఎలా ఎదురొడ్డి నిలిచింది? కాలేజ్‌ స్టూడెంట్‌ లీడర్‌గా, ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కొనే నాయకుడిగా జితేందర్‌ రెడ్డి చేసిన సేవలు ఏంటి? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే జితేందర్ రెడ్డి పాత్రలో రాకేష్ వర్రే చక్కగా ఒదిగిపోయాడు. RSS భావజాలం కలిగిన వ్యక్తిగా ఆకట్టుకున్నాడు. ప్రజల్లో చైతన్యం కల్పించే సీన్స్‌లో మంచి నటన కనబరిచాడు. ఇప్పటివరకూ చేసిన చిత్రాలతో పోలిస్తే నటన పరంగా ఎంతో మెచ్యూరిటీ ప్రదర్శించాడు. మొత్తంగా రాకేష్‌ వర్రే ఈ సినిమా కోసం బాగా కష్టపడ్డాడని చెప్పవచ్చు. రాకేష్‌ తర్వాత PDSU నేతగా చేసిన నటుడి యాక్టింగ్‌ బాగుంది. స్వయం సేవకుడిగా సుబ్బరాజు నటన, నక్సలైట్ లీడర్‌గా ఛత్రపతి శేఖర్ యాక్టింగ్‌ మెప్పిస్తుంది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు నటించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే తెలుగు తెరపై ఇప్పటి వరకు నక్సలైట్స్‌పై&nbsp; పాజిటివ్ యాంగిల్‌లోనే సినిమాలు తెరకెక్కాయి. కానీ తొలిసారి నక్సలిజం వెనకున్న చీకటి కోణాన్ని దర్శకుడు విరించి వర్మ ధైర్యంగా చూపించే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం చేపట్టే ప్రగతికారక పనులకు వారు ఏ విధంగా అడ్డుగా నిలుస్తున్నారో కళ్లకు కట్టారు. అప్పట్లో అట్టడగు వర్గాల కోసం పాటుపడిన స్వయంసేవకులను నక్సలైట్స్ ఏ విధంగా కాల్చి చంపారో చూపించారు. కామ్రేడ్స్ ఆగడాలను చూసి చలించిపోయిన హీరో వారిపై చేసే పోరాటాన్ని ఎంతో ఇంట్రస్టింగ్‌గా తెరకెక్కించారు. ఇంటర్వెల్‌ వరకూ కాలేజీ రాజకీయాలు చూపించిన దర్శకుడు ఆ తర్వాత మెయిన్‌ స్ట్రీమ్‌ పొలిటికల్ యాంగిల్‌ను టచ్‌ చేశాడు. నిజమైన రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో కూడా జితేందర్‌ రెడ్డి పాత్ర ద్వారా తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్‌గా తను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా, స్పష్టంగా చెప్పడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే ఫస్ట్‌ హాఫ్‌ స్లోగా సాగడం, కమర్షియల్‌ హంగులు లేకపోవడం, ప్రిడిక్టబుల్‌గా స్టోరీ ఉండటం మైనస్‌గా చెప్పవచ్చు. సాంకేతికంగా.. టెక్నికల్ విషయాలకు వస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. పాటలు కాస్త ఇబ్బంది పెట్టినా క్లైమాక్స్‌లో వచ్చే ఓ సాంగ్‌ గుండెలను హత్తుకుంటుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంరాకేష్‌ వర్రే నటనసంగీతం మైనస్‌ పాయింట్స్‌ ఫస్టాఫ్‌ స్లోగా ఉండటంకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    నవంబర్ 07 , 2024
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
    ఎప్పటిలాగే ఈ వారం కూడా ప్రేక్షకులను అలరించేందుకు పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు సిద్ధమయ్యాయి. నవంబర్ ఆఖరి వారంలో ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చేందుకు థియేటర్లలోకి రాబోతున్నాయి. అలాగే ఓటీటీలోనూ పలు చిత్రాలు, కొత్త వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కానున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.&nbsp; ఆదికేశవ మెగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ (Vaishnav Tej), శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన చిత్రం ‘ఆదికేశవ’ (Aadikeshava). శ్రీకాంత్‌ ఎన్‌.రెడ్డి దర్శకత్వం వహించారు. నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘మాస్‌ యాక్షన్‌ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్‌ తెలిపింది. కోట బొమ్మాళి పి.ఎస్‌ ప్రముఖ నటుడు శ్రీకాంత్‌ కీలకపాత్రలో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్‌’ (Kota bommali PS). వరలక్ష్మి శరత్‌కుమార్‌ (Varalaxmi Sarathkumar), రాహుల్‌ విజయ్‌, శివాని రాజశేఖర్‌ (Shivani Rajashekar) ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. తేజ మార్ని దర్శకుడు. బన్నీ వాస్‌, విద్యా కొప్పినీడి నిర్మించారు. నవంబరు 24న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇక ఇందులోని ‘లింగి లింగి లింగిడి’ (Lingi Lingi Lingidi) పాటకు శ్రోతల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. ధృవ నక్షత్రం విక్రమ్‌ (Vikram) హీరోగా గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’ (Dhruva Natchathiram). స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ మూవీ తెరకెక్కింది. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కగా.. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. చిత్రీకరణ పూర్తయినప్పటికీ అనుకోని కారణాలతో వాయిదా పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. పర్‌ఫ్యూమ్‌ జేడీ స్వామి దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘పర్‌ఫ్యూమ్‌’ (Perfume). చేనాగ్‌, ప్రాచీ థాకర్‌ జంటగా నటించారు. జె.సుధాకర్‌, శివ.బి, రాజీవ్‌ కుమార్‌.బి, లావురి శ్రీనివాస్‌, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్‌ అక్కినేని కలిసి నిర్మించారు. స్మెల్‌ బేస్డ్‌ థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాని ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. మాధవే మధుసూదన ‘మాధవే మధుసూదన’ (Madhave Madhusudana) చిత్రం కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో తేజ్‌ బొమ్మదేవర, రిషిక లోక్రే జంటగా నటించారు. బొమ్మదేవర రామచంద్రరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జయప్రకాష్‌, సుమన్‌ కీలక పాత్రలు పోషించారు. ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు మరిన్ని OTT చిత్రాలు &amp; వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి (telugu.yousay.tv/tfidb/ott) TitleCategoryLanguagePlatformRelease DateChaaverMovieMalayalamSonyLIVNov 24Stamped from the Beginning&nbsp;MovieEnglishNetflixNov 20Squid Game Season 2MovieEnglishNetflixNov 22Puli madaMovieTelugu/MalayalamNetflixNov 23My DemonWeb SeriesEnglishNetflixNov 23Doll boyMovieEnglishNetflixNov 24Gran TurismoMovieTelugu/EnglishNetflixNov 25FargoWeb SeriesEnglishDisney+HotStarNov 21The villageMovieTamilAmazon PrimeNov 24
    నవంబర్ 21 , 2023
    <strong>Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?</strong>
    Kasthuri Controversy: తెలుగు వారు లేకుండా తమిళుల ఉనికి ఉందా? చరిత్ర ఏం చెబుతోంది?
    ‘భారతీయుడు’ సహా పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన తమిళ నటి కస్తూరి (Kasthuri Shankar)&nbsp; తాజాగా తెలుగువారిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. తెలుగు మాట్లాడే ప్రజల్ని బానిసలతో పోలుస్తూ కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేశారు. చరిత్రలో ఏం జరిగిందో వివరిస్తూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమె చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సైతం చర్చనీయాంశంగా మారాయి. అయితే నటి కస్తూరికి చరిత్ర తెలిసి ఉంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయరు. తమిళ నేలపై తెలుగు రాజులు, నేతలు, వ్యక్తులు ఎంతటి ఘనత సాధించారో తెలుసుకొని మాట్లాడి ఉంటే బాగుండేది.&nbsp; అసలేం జరిగిందంటే? తమిళ నటి కస్తూరి చేసిన తాజా కామెంట్స్‌ తెలుగు రాష్ట్రాల్లో తీవ్రదుమారం రేపాయి. భాజాపాలో చేరిన ఆమె చెన్నైలోని గురుమూర్తి నగరంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. డీఎంకే (DMK), కరుణానిధి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు. 300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారని అన్నారు. రాణులకు సేవలు చేయడానికి ఇక్కడికి వచ్చిన తెలుగువారు ఇప్పుడు తమది తమిళ జాతి అంటుంటే మరి ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులను తమిళులు కాదు అని చెప్పడానికి మీరెవరు అంటూ ప్రశ్నించారు. ఇతరుల భార్యలపై కన్నేయవద్దని బ్రాహ్మణులు చెబుతున్నందుకే ద్రవిడ (Dravida) వాదులు వాళ్లని వ్యతిరేకిస్తున్నారని, అందుకే సనాతన ధర్మాన్ని (Sanathana Dharmam) డీఎంకే వ్యతిరేకిస్తోందన్నారు. తెలుగు మాట్లాడితే చాలు తమిళనాడు కేబినెట్‌లో మంత్రులు అవుతున్నారని, డీఎంకే ప్రభుత్వంలో ఐదుగురు తెలుగు మంత్రులు ఉన్నారని వ్యాఖ్యానించారు. తమిళ చరిత్రపై ప్రభావం తమిళనాడును పరిపాలించిన ప్రముఖ రాజవంశాల్లో చోళులు ఒకరు. వారిలో కుళోత్తంగ చోళుడు తెలుగువాడు. అతడి తండ్రి రాజ రాజ నరేంద్రుడు వేంగి చాళుక్య రాజు. ఈయన ఏపీలోని కృష్ణ- గోదావరి మధ్య ప్రాంతాన్ని పాలించాడు. కుళుత్తోంగ చోళుడి&nbsp; తల్లి అమ్మాంగైదేవి చోళ రాజ్యపు యువరాణి.&nbsp; ఆమె తండ్రి మరణం తర్వాత చోళ రాజ్యంలో అస్థిరత నెలకొంటుంది. దీంతో కులుత్తోంగ చోళుడు తన తాతా సామ్రాజ్యాన్ని కాపాడి చక్రవర్తిగా అక్కడే కొనసాగుతాడు. ఆ తర్వాత ఆయన వారసులు కూడా తమిళనాడుని దిగ్విజయంగా ఏలారు. (క్రీ.శ. 1061-1118) మధ్య చాళుక్యుల చక్రవర్తిగా కులోత్తుంగుడు వ్యవహరించారు. అయితే అతడి కుమారుడు విక్రమ చోళుడు.. చోళ రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. తెలుగు వారైన చాళుక్యుల రక్తం విక్రమ చోళుడిలో ఉంది. దీన్ని బట్టి గొప్ప తమిళ రాజ్యంగా చెప్పుకుంటున్న చోళ సామ్రాజ్యాన్ని ఓ తెలుగు వ్యక్తి పరిపాలించాడని చరిత్రకారులు చెబుతుంటారు. ఆ ప్రకారం చూసుకుంటే తమిళ చరిత్రపైనా మనవారి ముద్ర స్పష్టంగా ఉందని చెప్పవచ్చు.&nbsp; Image credit: Wikimedia Commons తెలుగు రాజు పేరు మీద ‘చెన్నై’ తమిళనాడు రాజధానిగా ఉన్న చెన్నైకి ఆ పేరు ఓ తెలుగు వ్యక్తి ద్వారా వచ్చింది. ఆంధ్ర పద్మనాయక ప్రభువైన వెంకటపతి నాయకుని కుమారుడైన దామెర్ల చెన్నప్ప నాయకుడు క్రీ.శ. 1639లో ఈ పట్టణాన్ని పాలించాడు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ పేరుతో వచ్చిన బ్రిటిషర్లు ఆ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకొని మద్రాసు పట్టణంగా మార్చారు. కాలక్రమణా ఆ పట్టణం మద్రాసుగా మారింది. కానీ స్థానికులు మాత్రం చెన్న పట్టణం లేదా చెన్నపురి అని పిలవడానికే ఇష్టపడేవారు. స్థానికుల కోరిక మేరకు స్వాతంత్రం అనంతరం 1996 ఆగస్టులో మద్రాసు పేరును చెన్నైగా మార్చారు.&nbsp; Image credit: Wikimedia Commons మద్రాసుపై తెలుగు వారి ప్రభావం ఒకప్పడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, మద్రాసు (ప్రస్తుత తమిళనాడు) రాష్ట్రం ఒక్కటిగా కలిసి ఉండేది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష కారణంగా 1953 అక్టోబర్‌ 1న ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైంది. ఒకప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో తెలుగువారే అన్ని రంగాల్లో కీలకపాత్రలు పోషించారు. రాష్ట్రాభివృద్ధికి కృషి చేశారు. 1925-29 మధ్య శ్రీకాళహస్తి జమీందారు పానగంటి రామారాయనం జస్టిస్ పార్టీ అధ్యక్షులుగా, మద్రాసు ముఖ్యమంత్రిగా పనిచేశారు. వారి హయాంలోనే ప్రస్తుత త్యాగరాయనగర్ రూపుదిద్దుకుంది. 1932-36 మధ్యకాలంలో బొబ్బిలి రాజు శ్రీ రామకృష్ణ రంగారావు మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్య మంత్రిగా వ్యవహరించారు. రావు బహదూర్ కూర్మా వెంకట రెడ్డి మద్రాసు గవర్నర్‌గా పనిచేశారు. అంతేకాదు వీడిపోయే ముందువరకూ కూడా తెలుగు వ్యక్తి ప్రకాశం పంతులు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సీఎం చేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి మొట్టమొదటి న్యాయ శాస్త్రంలో పట్టా పొందిన ముగ్గురు వ్యక్తులు తెలుగువారే. ఇలా రాజకీయాలతో పాటు విద్య, వైద్యం, న్యాయశాస్త్రం, వ్యాపారం ఇలా అన్ని రంగాల్లో తమదైన ముద్ర వేశారు. Image credit: Wikimedia Commons వందల్లో తెలుగు గ్రంధాలు విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు అంటే తెలియని తెలుగు వారు ఉండరేమో. అటువంటి దేవరాయలు తన ఆస్థానంలోని అష్టదిగ్గజాల సాక్షిగా రాసిన ‘ఆముక్తమాల్యద’ తాళపత్ర గ్రందం ఇప్పటికీ తమిళనాడులోని తంజావూరు గ్రంథాలయంలో భద్రంగా ఉంది. దానితో పాటు 778 తాళపత్ర గ్రంథాలు అక్కడి లైబ్రరీలో ఉన్నాయి. గణితం, వైజ్ఞానిక శాస్త్రం, గణితం, పురాణాలు ఇలా ఎన్నో ఉన్నాయి. దీన్నిబట్టి తెలుగు సంస్కృతి ప్రభావం తమిళనాడుపై ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పటి రాజుల సాంస్కృతిక కళా పోషణకు తమిళనాడు ప్రతీకగా నిలవడాన్ని ప్రతీ ఒక్కరూ గమనించాలి.&nbsp;
    నవంబర్ 04 , 2024
    Priya Vadlamani: యంగ్ బ్యూటీ ప్రియా వడ్లమాని గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    Priya Vadlamani: యంగ్ బ్యూటీ ప్రియా వడ్లమాని గురించి ఈ సీక్రెట్స్ తెలుసా?
    టాలీవుడ్‌కి చెందిన యంగ్ హీరోయిన్లలో ‘ప్రియా వడ్లమాని’ (Priya Vadlamani) ఒకరు. ‘ప్రేమకు రెయిన్‌చెక్‌’ (Premaku Raincheck) సినిమాతో తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. తన నటనతో ఆకట్టుకుంది. తర్వాత 'హుషారు' (Hushaaru), ‘ముఖచిత్రం’ (Mukhachitram) వంటి చిత్రాలతో మంచి గుర్తింపు సంపాందించింది. ప్రియా వడ్లమాని సంబంధించిన పూర్తి వివరాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; ప్రియా వడ్లమాని ఎక్కడ పుట్టింది? మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో ప్రియా వడ్లమాని జన్మించింది&nbsp; ప్రియా వడ్లమాని పుట్టిన తేది? 27 ఆగస్టు, 1997 ప్రియా వడ్లమాని స్వరాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్‌ ప్రియా వడ్లమాని ఎక్కడ పెరిగింది? హైదరాబాద్‌ ప్రియా వడ్లమాని ఎక్కడ చదువుకుంది? హైదరాబాద్‌లోని స్లేట్‌ ది స్కూల్‌లో ఆమె ప్రాథమిక విద్య చదివింది. ప్రియా వడ్లమాని ఎంత వరకూ చదివింది? బెంగళూరులోని క్రిస్ట్‌ కాలేజీలో ప్రియా గ్రాడ్యుయేషన్‌ చేసింది. ప్రియా వడ్లమాని వయసు ఎంత? 27 సంవత్సరాలు (2024) ప్రియా వడ్లమాని సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? కెరీర్‌ ప్రారంభంలో ప్రియా మోడలింగ్‌ చేసింది. ఫెమినా మిస్‌ ఇండియా (2016) పోటీల్లో ఈ భామ పాల్గొంది.&nbsp; ప్రియా వడ్లమాని కెరీర్‌ ఇండస్ట్రీలో ఎలా మెుదలైంది? సినిమాపై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రియా.. మెుదట అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసింది.&nbsp; ప్రియా వడ్లమాని తెరంగేట్ర చిత్రం? తెలుగులో ఈ బ్యూటీ నటించిన మెుదటి చిత్రం&nbsp; ‘ప్రేమకు రెయిన్‌చెక్‌’ (Premaku Raincheck). ప్రియా వడ్లమూడి ఇప్పటివరకూ చేసిన చిత్రాలు? ‘ప్రేమకు రెయిన్‌చెక్‌’ (Premaku Raincheck), ‘శుభలేఖలు’ (Subhalekhalu), ‘హుషారు’ (Hushaaru), ‘ఆవిరి’ (Aaviri), ‘కాలేజ్‌ కుమార్‌’ (College Kumar), ‘ముఖచిత్రం’ (Mukhachitram), ‘మనుచరిత్ర’ (Manu Charitra) ప్రియా వడ్లమూడికి గుర్తింపు తీసుకొచ్చిన చిత్రాలు? 'హుషారు' (Hushaaru), ‘ముఖచిత్రం’ (Mukhachitram)&nbsp; ప్రియా వడ్లమాని హాబీలు? డ్యాన్సింగ్‌, స్విమ్మింగ్‌, రీడింగ్‌ బుక్స్‌ ప్రియా వడ్లమాని ఫేవరేట్‌ నటుడు? బాలీవుడ్‌ స్టార్‌ ‘ఫర్హాన్‌ అక్తర్’ నటన అంటే ఈ బ్యూటీకి చాలా ఇష్టమట.&nbsp; ప్రియా వడ్లమాని ఫేవరేట్‌ చిత్రాలు? డి డే (D Day), లక్ష్య (Lakshya), ది నోట్‌బుక్‌ (The Notebook), ప్రైడ్‌ అండ్‌ ప్రీజుడైస్‌ (Pride and Prejudice) ప్రియా వడ్లమాని ఫేవరేట్‌ ఫుడ్‌ ఏది? ప్రియ తనకు ఇష్టమైన ఫుడ్‌ ఏంటన్న విషయాన్ని ఎక్కడా పంచుకోలేదు.&nbsp; ప్రియా వడ్లమాని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా? https://www.instagram.com/priyavadllamani/
    ఏప్రిల్ 08 , 2024
    Priyanka Halder: ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ గురించి టాప్ 20 సీక్రెట్స్!
    Priyanka Halder: ఇంటర్‌నెట్‌ను షేక్ చేస్తున్న ఈ బోల్డ్ బ్యూటీ గురించి టాప్ 20 సీక్రెట్స్!
    ప్రియాంకా హాల్దర్(Priyanka Halder) బెంగాల్‌కి చెందిన నటి, టీవీ మరియు వెబ్ సిరీస్‌లలో సెన్సేషనల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘క్రైమ్ పాట్రోల్’, ‘గాందీ బాత్’, ‘ఉతా పటాక్’ వంటి ప్రసిద్ధ షోల్లో నటించి గుర్తింపు పొందింది. థియేటర్ నుండి టీవీ స్క్రీన్ వరకూ తన ప్రయాణంలో ఆమె వివిధ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. తాజా వివాదం తాజాగా, ఆమె ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ అనే కామెడీ షోలో ఆమె వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.  షోలో ఆమె 'కాస్ట్యూమ్ కట్టర్', ఆమె స్నేహితుడు మోహమ్మద్ ఆదిల్ తో కలసి చేసిన ‘డ్రెస్ కట్టింగ్ స్టంట్’  నేషనల్ వైడ్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది. మోహమ్మద్ ఆదిల్ ఆమెను అసభ్యంగా తాకుతూ ఆమె డ్రెస్ కట్‌ చేసిన తీరు తీవ్ర దుమారానికి దారితీసింది.  అయితే ప్రియాంక హల్దర్ డ్రెస్ కట్టర్‌ను ఏమి(Priyanka Halder) అనకుండా ప్రొత్సహించడంతో నెటిజన్లు ఆమెను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ డ్రెస్ కట్టింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రియాంక హాల్దర్‌కు పెళ్లై.. 15 ఏళ్ల బాబు కూడా ఉన్నాడు. ఈ వయసులో ఇలాంటివి చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావ్ అని నెటిజన్లు తప్పు పడుతున్నారు.  View this post on Instagram A post shared by India’s Got Latent (@indiasgotlatent) ప్రస్తుతం ప్రియాంక హల్దర్ పేరు సోషల్ మీడియాతో పాటు… ఇంటర్‌నెట్‌లో ట్రెండింగ్‌గా మారడంతో ఆమె పర్సనల్ లైఫ్, సినిమా కెరీర్ గురించి&nbsp; నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రియాంక హల్దర్ కోల్‌కతాలో పుట్టి పెరిగింది. అక్కడే ఆమె 12వ తరగతి వరకు విద్యను పూర్తి చేసింది. View this post on Instagram A post shared by Priya (@priyankahalderofficial)  సాదాసీదా జీవితంతో ప్రారంభమైన ఆమె ప్రయాణం, చాలా చిన్న వయస్సులో (Priyanka Halder Viral Video)పెళ్లి కావడంతో ఒక్కసారిగా మారిపోయింది. 18 సంవత్సరాల వయస్సులోనే ప్రియాంక గర్భవతి అయి మగ బిడ్డకు జన్మనిచ్చింది. 2024 నాటికి ఆమె కుమారుడు 15 సంవత్సరాలు. ప్రియాంక హల్దర్ భర్త భారతీయ రైల్వేలో నాగ్‌పూర్‌ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఆయన దాదాపు మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఆమె బెంగాళీ కాగా, హిందూ ధార్మిక విశ్వాసాలపై నమ్మకం ఎక్కువ. పెద్ద ఎత్తున ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. తాను సినిమా రంగంలో ఉన్న విషయం మొదట తన భర్తకు తెలియకుండా ఉన్నట్లు సమాచారం. ప్రియాంక ప్రధానంగా బి-గ్రేడ్ సినిమాల‌్లో నటిస్తుండటంతో వీరిద్దరి మధ్య సమస్యలు ఎదురైనట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రియాంక ఆమె భర్త వెర్వేరుగా జీవిస్తున్నారు.  View this post on Instagram A post shared by Priya (@priyankahalderofficial) ప్రియాంక తన కుడి చేతిపై "A" అనే అక్షరంతో ఉన్న టాటూ వేయించుకుంది. అయితే&nbsp; దాని అర్థం మాత్రం తెలియదు. త్రికాల జ్ఞానుడైన శివుని భక్తురాలిగా, ఆమె తరచుగా ఆలయాలకు వెళ్తుంటుంది. నట ప్రస్థానం ప్రియాంక హల్దర్ తన నటనా జీవితాన్ని బి-గ్రేడ్ సినిమాలతో ప్రారంభించింది. ఆమె పాత్రలు(Priyanka Halder) బోల్డ్, సెన్సువల్‌గా ఉండటంతో ఆమె ఎప్పుడు వార్తల్లో నిలిచేది. హిందీ వెబ్‌సిరీస్ రంగంలో, ముఖ్యంగా ALT బాలాజీ నిర్మించిన "గందీ బాత్" అనే వెబ్‌సిరీస్‌తో ఆమె మంచి గుర్తింపు పొందింది.  ప్రియాంక హల్దర్ నటించిన రీసెంట్ వెబ్‌ సిరీస్‌లు&nbsp; సెకండ్ హనీమూన్.సాజిష్ ప్యాస్ మాంటీ బెలాగం టీవీ కెరీర్ ప్రియాంకా హాల్దర్ తన కెరీర్‌ను ‘క్రైమ్ పాట్రోల్ డయల్ 100’ ద్వారా ప్రారంభించింది. ఈ షోలో ఆమె పలు కథలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షోలో న్యాయపరమైన కేసులు, బాధితుల కథలు ప్రధానంగా టెలీకాస్ట్ అవుతుంటాయి. ఈ షోతో పాటు ఆమె ‘క్రైమ్ వరల్డ్’,  ‘షీమారూ టీవీ’ షోల్లో కూడా కనిపించింది. అనంతరం ఆమె ALT బాలాజీ వెబ్ సిరీస్ ‘గాందీ బాత్’ లో నటించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆమె ప్రధాన ప్రాజెక్టులలో ‘ఉతా పటాక్’, ‘ప్యాస్’, ‘సజిష్’ లాంటి వెబ్ సిరీస్‌లు కూడా ఉన్నాయి. ఉతా పటాక్ 4 ప్రస్తుతం చిత్రీకరణలో ఉంది. ప్రియాంకా హాల్దర్ ‘ఇండియాస్ గాట్ లాటెంట్’ కామెడీ షోలో ‘కాస్ట్యూమ్ కట్టర్ స్టంట్’ కి సంబంధించిన వివాదంలో చిక్కుకుంది. ఆమె రెడ్ బాడీకాన్ డ్రెస్ లో కనిపించి, షోలో ఆమె గౌనును కత్తిరిస్తూ కట్-అవుట్ డ్రెస్ గా మార్చడం నెటిజన్ల నుండి తీవ్ర విమర్శలకు గురైంది. పబ్లిక్‌లో అనైతిక ప్రవర్తన అని కొందరు విమర్శించగా, ప్రమోషనల్ స్టంట్ అని మరికొందరు అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియా లింకులు ఇన్‌స్టాగ్రామ్: Priyanka Halder Officialఫేస్‌బుక్: Priyanka Halder Facebookయూట్యూబ్: Priyanka Halder YouTube
    డిసెంబర్ 10 , 2024
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    Pavani Gangireddy: సాఫ్ట్‌వేర్‌ టూ స్టార్‌ నటి.. పావని గంగిరెడ్డి గురించి ఈ విషయాలు తెలుసా?
    ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ (Disney + Hotstar)లో ఇటీవల వచ్చిన 'సేవ్‌ ద టైగర్స్ 2' (Save The Tigers 2) ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. ప్రియదర్శి, అభినవ్‌ గోమఠం, చైతన్య కృష్ణ కామెడీ టైమింగ్‌ ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఇందులో అభినవ్‌ గోమఠంకు జోడీగా చేసిన పావని గంగిరెడ్డి (Pavani Gangireddy) అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తన నటన, అభినయంతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో&nbsp; పావని గంగిరెడ్డికి(Some Lesser Known Facts about Pavani Gangireddy) సంబంధించిన విశేషాలను ఈ కథనంలో తెలుసుకుందాం. పావని గంగిరెడ్డి ఎవరు? ఈమె టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి. పావని గంగిరెడ్డి ఎక్కడ పుట్టింది? హైదరాబాద్‌ పావని గంగిరెడ్డి పుట్టిన తేదీ? ఆగస్టు 23, 1987&nbsp; పావని గంగిరెడ్డి వయసు ఎంత? 37 సంవత్సరాలు (2024) పావని గంగిరెడ్డి తల్లిదండ్రులు ఎవరు? ఓబుల్‌ రెడ్డి గంగిరెడ్డి (రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌), శాంతి గంగిరెడ్డి (హౌస్‌ వైఫ్‌) పావని గంగిరెడ్డి తోడబుట్టిన వారు ఉన్నారా? సోదరుడు చందు గంగిరెడ్డి, సోదరి క్రిష్ణవేణి గంగిరెడ్డి పావని గంగిరెడ్డి ఏం చదువుకుంది? బీటెక్‌ చేసింది. పావని గంగిరెడ్డికి వివాహం జరిగిందా? అవును, 11 ఫిబ్రవరి, 2011లో ఆమెకు విష్ణు వర్ధన్‌ రెడ్డితో పెళ్లి జరిగింది.&nbsp; పావని గంగిరెడ్డి భర్త ఏం చేస్తారు? హైదరాబాద్‌లోని ప్రెస్టీజ్‌ గూప్‌ కంపెనీలో వర్క్‌ చేస్తున్నారు.&nbsp; పావని గంగిరెడ్డి ఎంత మంది పిల్లలు? ఈమెకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు. పాప పేరు దియా. పావని గంగిరెడ్డి సినిమాల్లోకి రాకముందు ఏం చేసింది? పావని సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఐటీ ఉద్యోగం చేసింది. 2008 నుంచి ఇన్ఫోసీస్‌లో 11 ఏళ్లకు పైగా జాబ్‌ చేసింది. తర్వాత కండ్యూయెంట్‌ బిజినెస్‌ సర్వీస్‌ ఎల్‌ఎల్‌పీ ఇండియాలో రెండేళ్ల పాటు మేనేజర్‌గా చేసింది. పావని గంగిరెడ్డి తొలి సినిమా? ‘వింధ్యా మారుతం’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో పావని నటనను చూసి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రకు ఆమెను ఎంపిక చేశారు. ఆ చిత్రం 2015లో విడుదల అయింది. పావని గంగిరెడ్డి చేసిన చిత్రాలు? మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju), సైజ్ జీరో (Size Zero), బ్రహ్మోత్సవం (Brahmotsavam), రైట్ రైట్ (Rite Rite) , జో అచ్యుతానంద (Jyo Achyutananda), అంతరిక్షం (Antariksham), మీకు మాత్రమే చెప్తా (Meku Matrame Chepta), జెస్సీ (Jessy) సినిమాల్లో ఆమె నటించింది.&nbsp; పావని గంగిరెడ్డి నటించిన వెబ్‌సిరీస్‌లు? ‘ఎక్కడికి ఈ పరుగు’ (Ekkadiki Ee Parugu), ‘లూజర్‌’ (Looser) ‘సేవ్‌ ద టైగర్స్‌ 1 &amp; 2’ (Save The Tigers S1 &amp; S2), ‘వ్యూహాం’ (Vyooham). పావని గంగిరెడ్డి ఇష్టమైన అభిరుచులు? విహార యాత్రలకు వెళ్లడం, పుస్తకాలు చదవడం, గార్డెనింగ్‌ పావని గంగిరెడ్డికి ఇష్టమైన పెంపుడు జంతువు? పెట్ డాగ్ అంటే పావనికి చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను పరిశీలిస్తే శునకంతో దిగిన ఫొటోలు ఎక్కువగా కనిపిస్తాయి.&nbsp; పావని గంగిరెడ్డికి ఇష్టమైన ఆహారం? దోశ, పిజ్జా పావని గంగిరెడ్డికి ఇష్టమైన హీరో, హీరోయిన్‌? తన ఫేవరేట్‌ హీరో, హీరోయిన్‌ గురించి పావని ఎక్కడా వెల్లడించలేదు. పావని గంగిరెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ?https://www.instagram.com/pavani_gangireddy/?hl=en
    ఏప్రిల్ 02 , 2024
    <strong>#BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!</strong>
    #BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!
    భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్‌. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్‌ అన్నా, డైలాగ్‌ డెలీవరి అన్నా ఇప్పటికీ ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతుంటారు. అటువంటి రజనీకాంత్‌ నుంచి ‘వేట్టయన్‌’ సినిమా రానుండటంతో సహజంగానే దేశవ్యాప్తంగా మంచి హైప్ ఏర్పడింది. దసరా కానుకగా అక్టోబర్‌ 10న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్‌ కాబోతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌పై తెలుగు ఆడియన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాయ్‌కాట్‌ చేయాలంటూ #BoycottVettaiyanInTelugu హ్యాష్‌ట్యాగ్‌ను ఎక్స్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; ‘తెలుగు ప్రేక్షకులంటే లోకువా’ రజనీకాంత్‌ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'వేట్టయన్'. ఈ మూవీలో రజినీకాంత్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా నటిస్తున్నారు. ‘వేట్టయన్’ అంటే తెలుగులో వేటగాడు అని అర్థం. అయితే తమిళంలో పెట్టిన వేట్టయన్‌ టైటిల్‌నే తెలుగులోనూ మక్కీకి మక్కీ దించారు. దీనిని తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. తెలుగులో వేటగాడు అనే పదం ఉన్నప్పటికీ తమిళ టైటిల్‌నే తెలుగులో పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు అంత లోకవయ్యారా? అంటూ నిలదీస్తున్నారు. బాషాభిమానం ఉన్నది మేకేనా? తెలుగు వారికి లేదనకున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేట్టయన్‌ను తెలుగు బహిష్కరించాలంటూ ఎక్స్‌ వేదికగా హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు.&nbsp; https://twitter.com/thenaani29/status/1843888854568431666 https://twitter.com/Kadirodu/status/1843694483508211884 https://twitter.com/kannayyaX/status/1843899836732743696 https://twitter.com/Jyotheshkum/status/1843844509123391639 ఆ సినిమాలు కూడా అంతే! కథ బాగుంటే భాషతో సంబంధం లేకుండా సినిమాలను ఆదరిస్తారని తెలుగు ఆడియన్స్‌కు పేరుంది. తమిళంలో ఫ్లాప్‌ అయిన చిత్రాలు సైతం తెలుగులో సూపర్‌ హిట్‌గా నిలిచిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒకప్పుడు ‘డబ్బింగ్‌’ సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. ఇతర భాషలలో ఉండే బోర్డులని చక్కగా తెలుగులోకి మార్చేవారు. ఇప్పుడు అదంతా మానేసి నేరుగా సినిమాలను రిలీజ్‌ చేస్తున్నారు. ‘కంగువ’, ‘వేట్టయన్‌’, ‘తంగలాన్‌’, ‘రాయన్‌’ ‘వలిమై’ వంటి తమిళ టైటిల్స్‌ను తెలుగులో అదే పేరుతో తీసుకురావడాన్ని తెలుగు ఆడియన్స్‌ తీవ్రంగా తప్పుబడుతున్నారు. చక్కగా తెలుగు టైటిల్స్‌ పెట్టొచ్చు కదా అని కామెంట్స్‌ చేస్తున్నారు. తెలుగును గౌరవించని వారిని తెలుగు ఆడియన్స్‌ ఆదరించరని స్పష్టం చేస్తున్నారు.&nbsp; తెలుగు భాష వద్దా! గతంలో తమిళ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేస్తుంటే మణిరత్నం లాంటి దర్శకులు తెలుగు డైలాగులు, పాటలు దగ్గరుంచి రాయించుకునేవారు. నేరుగా తెలుగు సినిమా చూస్తున్న భావన కలిగేది. ఘర్షణ, సఖి, యువ, చెలియా లాంటి మంచి మంచి టైటిళ్లు పెట్టడం చూశాం. కానీ ఇప్పుడు ఈ వ్యవహారం మారిపోయింది. డబ్బింగ్, పాటల విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదు. తమిళ వాసనలు గుప్పుమంటున్నాయి. ఇక టైటిల్స్ సంగతి సరే సరి. రజినీకాంత్ లాంటి హీరో కూడా ‘వేట్టయాన్‌’ టైటిల్ విషయంలో అభ్యంతరం పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యపోతున్నారు. తెలుగు ఆడియన్స్‌ డబ్బు కావాలి కానీ భాష వద్దా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
    అక్టోబర్ 09 , 2024
    5 Years Of Jersey : సినిమా సక్సెస్ కావడానికి అంతలా ఏముంది?
    5 Years Of Jersey : సినిమా సక్సెస్ కావడానికి అంతలా ఏముంది?
    నేచురల్ స్టార్‌ నాని (Nani) నటించిన జెర్సీ (Jersey) చిత్రం అతడి కెరీర్‌లోనే ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది. 2019లో ఏప్రిల్‌ 19న విడుదలైన ఈ చిత్రం.. టాలీవుడ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఇందులో నాని నటనకు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. రిపీటెడ్‌ మోడ్‌లో ఈ సినిమాను చాలా ఏమోషనల్ అయ్యారు. నేటితో (ఏప్రిల్‌ 19) ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ‘జెర్సీ’ సక్సెస్‌కు కారణమైన అంశాలేంటో ఓసారి గుర్తు చేసుకుందాం.&nbsp; స్టోరీ అండ్ స్క్రీన్‌ ప్లే జెర్సీ సినిమా ఘన విజయం సాధించడానికి మూలకారణం ‘కథ’. చాలా యునిక్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్పోర్ట్స్‌ డ్రామాకు తండ్రి కొడుకుల ఎమోషనల్‌ టచ్ జోడించడం సినిమాకు బాగా ప్లస్‌ అయ్యింది. డైరెక్టర్‌ గౌతమ్‌ తిన్ననూరి స్క్రీన్‌ప్లే ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. అర్జున్‌ జర్నీని హృదయానికి హత్తుకునేలా ఆయన చూపించారు. కథలో ఫ్యామిలీ, త్యాగం, ఏమోషనల్‌, స్పోర్ట్స్‌ను మిళితం చేసి చక్కటి విజయాన్ని అందుకున్నారు.&nbsp; ప్రధాన తారాగణం నటన కథ ఎంత బాగున్నా దానికి తగ్గ తారాగణం లేకపోతే ఆశించిన ఫలితం రాదు. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు. పాత్రలకు తగ్గట్లు నటీనటులను ఎంచుకొని ఆయన మంచి ఫలితాన్ని రాబట్టాడు. ముఖ్యంగా అర్జున్ పాత్రకు నాని ఎంచుకోవడం ద్వారానే ఆయన సంగం విజయం సాధించాడని చెప్పవచ్చు. తెరపై చూస్తున్నంత సేపు అర్జున్‌ పాత్ర తప్ప నాని ఎక్కడా కనిపించలేదు. హీరో భార్య సారా పాత్రలో శ్రద్దా శ్రీనాథ్‌ కూడా అద్భుత నటన కనబరిచింది. నాని, శ్రద్ధా కెమెస్ట్రీ బాగా వర్కౌట్‌ అయ్యింది. అర్జున్‌ కోచ్‌గా నటించిన సత్యరాజ్‌ కూడా సినిమాపై మంచి ప్రభావం చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో తన అసాధారణమైన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు. సంగీతం - సినిమాటోగ్రఫీ స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన సంగీతం సినిమాను హైలెట్‌గా నిలిపింది. చాలా కాలం తర్వాత మంచి పాటలు విన్నామన్న ఫీలింగ్‌ అప్పట్లో ప్రేక్షకులకు కలిగించింది. ఇక&nbsp; నేపథ్య సంగీతం కూడా సినిమాకు చాలా బాగా కుదిరింది. ఆడియన్స్‌ ఎమోషనల్‌గా సినిమాకు కనెక్ట్‌ అయ్యేందుకు BGM ఉపయోగపడింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాలకు అనిరుధ్‌ ఇచ్చిన BGM.. ఆ సీన్స్‌ తాలుకూ డెప్త్‌ను తెలియజేసింది. మరోవైపు సినిమాటోగ్రఫీ కూడా జెర్సీ చిత్రానికి ప్లస్‌గా మారింది. సినిమాటోగ్రాఫర్‌ సాను వర్గీస్‌.. చూపించిన విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. నటీనటుల ముఖాల్లోని భావోద్వేగాలను ఆయన చాలా బాగా క్యాప్చర్‌ చేశారు. అలాగే క్రికెట్‌ మ్యాచ్‌లను అతడు చాలా రియలస్టిక్‌గా చూపించాడు.&nbsp; తండ్రి-కొడుకుల అనుబంధం టాలీవుడ్‌లో ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు వచ్చినప్పటికీ కొన్ని మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ కోవకు చెందిన చిత్రమే ‘జెర్సీ’. ఈ సినిమాలోని అర్జున్‌ పాత్ర చాలా మంది తండ్రులకు కనెక్ట్‌ అవుతుంది. కుమారుడి సంతోషం కోసం ఏదైనా సాధించాలని తపన పడే ఆ పాత్ర మిడిల్‌క్లాస్‌ జీవితాలకు అద్దం పడుతుంది. కొడుకు పుట్టిన రోజున అడిగిన జెర్సీని కూడా బహుమతిగా కొనివ్వలేని తండ్రి.. తన బిడ్డకు హీరోలా కనిపించాలన్న సంకల్పంతో ఆపేసిన క్రికెట్‌ను మళ్లీ మెుదలు పెట్టడం ఆడియన్స్‌ను చాలా ఏమోషనల్‌ చేస్తుంది.&nbsp; జెర్సీ&nbsp; డైలాగ్స్‌ జెర్సీ సినిమా గురించి చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం డైలాగ్స్‌. ఒక్కో డైలాగ్‌ ప్రతీ ఒక్కరికీ జీవిత పాఠాన్ని నేర్పేలా స్పూర్తివంతంగా ఉంటాయి. ఆణిముత్యాల్లాగా కనెక్ట్ అవుతాయి. సినిమాల్లోని హైలెట్‌ డైలాగ్స్‌ ఇప్పుడు చూద్దాం. 'ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు'_ అర్జున్‌ 'నీ అంత టాలెంట్‌ ఉన్న వాళ్లని చాలా మందిని చూశాను. కానీ.. డిస్సిప్లైన్‌ లేకుండా ఎదిగిన వాళ్లని ఒక్కరిని కూడా చూడలేదు'_ సత్యరాజ్‌ పాత్ర&nbsp; కొడుకు: నాన్న నువ్వు మళ్లీ క్రికెట్‌ ఆడవా? అర్జున్‌ : నువ్వు చెప్పు ఆడనా వద్దా? కొడుకు: ఆడు నాన్న నువ్వు ఆడితే చాలా బాగుంటుంది.. హీరోలా అనిపిస్తావు? ‘ఇంత పెద్ద ప్రపంచంలో ఈ రోజు దాకా నన్ను జడ్జ్‌ చేయంది.., నా కొడుకు ఒక్కడే. వాడికి వాళ్ల నాన్న ఉద్యోగం చేస్తున్నాడా? డబ్బులు సంపాదిస్తున్నాడా? సక్సెస్ఫుల్లా? ఫెయిల్యూరా? ఇవేమి సంబంధం లేదు.., వాడికి నేను నాన్న అంతే. వాడి దృష్టిలో నేను కొంచెం తగ్గిన తట్టుకోలేను సారా..' లాస్‌ మూడు రోజులలో నాకు నేను దొరికాను సర్‌. నా 36 ఏళ్ల జీవితం కనిపించింది' 'అర్జున్‌ కథ, వందలో సక్సెస్‌ అయిన ఒకడిది కాదు, సక్సెస్‌ అవ్వకపోయిన ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మందిది' ‘మా నాన్న సంకల్పం ఎంత గొప్పది కాకపోతే.. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఈ జెర్సీ నాకు వస్తుంది’
    ఏప్రిల్ 19 , 2024
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    Chandra Mohan: సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ కన్నుమూత.. ఆయన గురించి ఈ విషయాలు తెలుసా?
    టాలీవుడ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ (78) కన్నుమూశారు. గత కొంత కాలంగా షుగర్‌, గుండె, డయాలసిస్‌ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం (నవంబర్‌ 11న) తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లో సోమవారం ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన మరణంపై సెలబ్రిటీలు, అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. చంద్రమోహన్‌ మృతి నేపథ్యంలో ఆయనకు సంబంధించిన పూర్తి సమాచారం YouSay మీ ముందుకు తీసుకొచ్చింది.&nbsp; కుటుంబ నేపథ్యం చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రమోహనరావు. ఏపీలోని కృష్ణాజిల్లా పమిడిముక్కలలో 1945 మే 23న ఆయన జన్మించారు. మేడూరు, బాపట్లలో చదువుకున్నారు. ఈయన దివంగత దర్శకుడు కె.విశ్వనాథ్‌కి చాలా దగ్గరి బంధువు. చంద్ర మోహన్ భార్య పేరు జలంధర. ఈమె రచయిత్రి. వీరికి మధుర మీనాక్షి, మాధవి అని ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మధుర మీనాక్షి సైకాలజిస్ట్‌గా అమెరికాలో స్థిరడ్డారు. రెండో కుమార్తె మాధవి చెన్నైలో వైద్యవృత్తిలో సేవలందిస్తున్నారు.&nbsp; సినిమా నేపథ్యం చంద్రమోహన్‌ 1966లో ‘రంగుల రాట్నం’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. 1987లో ‘చందమామ రావే’ చిత్రానికి ఉత్తమ హాస్యనటుడిగా, 2005లో ‘అతనొక్కడే’ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ‘పదహారేళ్ల వయసు’ సినిమాకుగానూ ఫిలిం ఫేర్‌ అవార్డు గెలుచుకున్నారు. ‘రంగుల రాట్నం’, ‘ఆమె’ ‘పదహారేళ్ల వయసు’, ‘సీతామహాలక్ష్మి’, ‘రాధాకల్యాణం’, ‘రెండు రెళ్ల ఆరు’, ‘చందమామ రావే’, ‘రామ్‌ రాబర్ట్ రహీమ్‌’ చిత్రాలతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరయ్యారు. 55 ఏళ్ల సినీ కెరీర్‌లో దాదాపు 932 సినిమాలలో నటించారు. చంద్రమోహన్‌ మెచ్చిన చిత్రాలు సినిమాల్లోకి రాకపోయి ఉంటే డబ్బులు లెక్కపెట్టే ఉద్యోగం చేసుకుని ఉండేవాడినని ఓ ఇంటర్యూలో చంద్రమోహన్‌ చెప్పారు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో కొనసాగాలా? వద్దా? అని ఒకటికి రెండుసార్లు ఆలోచించినట్లు చెప్పుకొచ్చారు. అంతిమంగా సినిమావైపే అడుగులు వేశారు. తన కెరీర్‌లో ‘సిరిసిరిమువ్వ’, ‘శుభోదయం’, ‘సీతామహాలక్ష్మి’, ‘పదహారేళ్ల వయసు’ చిత్రాలను ఎన్నటికీ మర్చిపోలేనని చెప్తూ ఉండేవారు. లక్కీ హీరోగా గుర్తింపు ఒకప్పుడు చంద్రమోహన్‌ను అందరూ లక్కీ హీరోగా అనేవారు. ఆయనతో ఏ హీరోయిన్‌ అయినా నటిస్తే సినిమా హిట్‌ అవ్వాల్సిందే. అలా కెరీర్‌ ప్రారంభంలో శ్రీదేవి (Sri Devi), జయసుధ (Jayasuda), జయప్రద (Jaya Prabha) ఆయనతో కలిసి నటించి హిట్స్‌ అందుకున్నారు. చంద్రమోహన్‌-సుధ కాంబినేషన్‌ అయితే సూపర్‌హిట్‌ అయింది. అటు చంద్రమోహన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చాలా చిత్రాలు చేశారు. తెలుగులోనే కాకుండా తమిళంలోనూ నటించారు. ఈయన నటించిన చివరి చిత్రం ఆక్సిజన్‌. సంపాదనలో శూన్యమే! చంద్రమోహన్‌ 50 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ పెద్దగా ఆస్తులు కూడబెట్టలేదు. చివరి రోజుల్లో ఆయన సాదాసిదా జీవితాన్నే గడిపారు. వందల కోట్లు విలువ చేసే ఆస్తులు పోగొట్టుకున్నట్లు చంద్రమోహన్‌ స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. హైదరాబాద్‌ కోంపల్లిలో 35 ఎకరాల ద్రాక్ష తోట కొన్నప్పటికీ చూసుకోవడం వీలుపడటం లేదని దాన్ని అమ్మేశారు. శోభన్‌ బాబు చెబుతున్నా వినకుండా చెన్నైలోని 15 ఎకరాలు కూడా విక్రయించేశారు. దాని విలువ ప్రస్తుతం&nbsp; రూ.30 కోట్లపైనే. శంషాబాద్‌ ప్రధాన రహదారి పక్కన ఆరు ఎకరాలు కొన్నప్పటికీ దాన్ని నిలుపుకోలేకపోయారు.&nbsp;&nbsp; చెయ్యి చాలా మంచిదట! చంద్రమోహన్‌ దగ్గర ఆస్తి నిలవలేదు కానీ, ఆయన చేతితో ఒక్క రూపాయి తీసుకున్నా బాగా కలిసొస్తుందని చాలామంది నమ్మకం. అందుకని కొత్త ఏడాది ప్రారంభంలో (జనవరి 1) ఎంతోమంది ఆయన ఇంటికి వెళ్లి చంద్రమోహన్‌ చేతుల మీదుగా డబ్బు తీసుకునేవారు. ఈ విషయాన్ని చంద్రమోహన్‌ భార్య, రచయిత్రి జలంధర స్వయంగా తెలిపారు.
    నవంబర్ 11 , 2023

    @2021 KTree