UTelugu2h 3m
పెద్ద రచయిత కావాలనేది భూషణ్(సుహాస్) కల. అసిస్టెంట్ లైబ్రేరియన్‌గా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఓ పుసక్తం రాసి.. దానిని ప్రింట్ చేయించడానికి రూ.4లక్షల అప్పు చేస్తాడు. ఈ పుస్తకానికి సరైన ఆదరణ రాదు. దీంతో అందరితో చదివించడానికి భూషణ్ చాలా కష్టపడుతుంటాడు. ఈ క్రమంలో పద్మభూషణ్ పేరుతో మరో పుసక్తం విడుదలై మంచి ఆదరణను పొందుతుంది. కానీ, ఆ పుస్తకాన్ని తనే రాశానంటూ భూషణ్ చెబుతూ తిరుగుతుంటాడు. ఈ క్రమంలో ఆ పుస్తకం నచ్చి తన కూతురు సారిక(టీనా శిల్పరాజ్)ను ఇచ్చి పెళ్లి చేస్తానంటూ మేనమామ ముందుకొస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా కథ
ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Zee5ఫ్రమ్
Watch
రివ్యూస్
How was the movie?
తారాగణం
సుహాస్
పి. పద్మభూషణ్టీనా శిల్పరాజ్
సారికశ్రీ గౌరీ ప్రియకన్నా
రోహిణి
పద్మభూషణ్ తల్లిఆశిష్ విద్యార్థి
పద్మభూషణ్ తండ్రిగోపరాజు రమణలోకేంద్ర కుమార్ మరియు సారిక తండ్రి
ప్రవీణ్ కటారిసౌమిత్రి మరియు పద్మభూషణ్ స్నేహితుడు
అశోక్ కుమార్
పద్మభూషణ్ మేనేజర్ప్రజ్ఞా కిరణ్కన్న తల్లి
సిబ్బంది
షణ్ముఖ ప్రశాంత్దర్శకుడు
అనురాగ్ రెడ్డినిర్మాత
శరత్ చంద్రనిర్మాత
చంద్రు మనోహరన్నిర్మాత
శేఖర్ చంద్ర
సంగీతకారుడుకళ్యాణ్ నాయక్సంగీతకారుడు
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
పెద్ద సినిమాలకు ‘రైటర్ పద్మభూషణ్’ గుణపాఠం.. సినిమా సక్సెస్‌కు ఇది చాలు..
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
ఫిబ్రవరి 15 , 2023
Writer Padmabhushan Review: రైటర్ పద్మభూషణ్‌గా సుహాస్ ప్రేక్షకుడిని మెప్పించాడా?
]మరిన్ని కథనాల కోసం
మా వెబ్‌సైట్ చూడండి.
YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.Download Our App
ఫిబ్రవరి 11 , 2023
FAMILY MOVIES: ఈ మధ్యకాలంలో కుటుంబ విలువలు చాటి చెప్పిన టాప్ 5 తెలుగు సినిమాలు
సినిమాల ప్రభావం జనాలపై ఎంతో కొంత కచ్చితంగా ఉంటుంది. చిత్రంలో వచ్చే సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో కదిలిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇటీవల వచ్చిన కొన్ని చిత్రాలు కుటుంబాలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. థియేటర్లు, ఓటీటీ అనే తేడా లేకుండా ఆదరించారు ప్రేక్షకులు. కుటుంబాలపై ప్రభావం చూపించిన టాప్ 5 చిత్రాలు ఇవే !
బలగం
ఈ ఏడాది విడుదలైన కుటుంబ కథా చిత్రాల్లో మెుదటిది బలగం. చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన కుటుం మళ్లీ ఎలా కలుస్తుందనే కథను అద్భుతంగా తెరకెక్కించడంతో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ప్రతి ఒక్కర్ని కంటతడి పెట్టించిన ఈ చిత్రం కారణంగా ఎన్నో విడిపోయిన కుటుంబాలు మళ్లీ కలుసుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
రంగ మార్తాండ
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన తల్లిదండ్రులు, ఇప్పటి జనరేషన్ పిల్లల మధ్య జరిగిన సంఘర్షణలే రంగ మార్తాండ. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు కృష్ణవంశీ నుంచి వచ్చింది ఈ సినిమా. ఈ చిత్రం నేటితరం యువతకు మంచి పాఠంగా నిలుస్తుంది. తల్లిదండ్రులు మనకు ఏం చేశారో తెలుసుకొని వారిని ఎలా గౌరవించాలో తెలుసునేందుకు ఉపయోగపడుతుంది రంగ మార్తాండ.
రైటర్ పద్మభూషణ్
యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్ చేసిన సినిమా రైటర్ పద్మభూషణ్. సినిమా మెుత్తం ఓ యువకుడు కెరీర్‌లో నిలదొక్కుకోవటానికి పడే కష్టాల గురించి వివరించినా… అతడికి తల్లిదండ్రులు ఎలా మద్దతుగా నిలబడ్డారనేది అసలు అంశం. కలల్ని వదిలి వంటింటికే పరిమితమైన తల్లి కుమారుడి కోసం రచనలు చేయడం ప్రారంభించడం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. అంతేకాదు, మహిళల కలల్ని అర్థం చేసుకొని వారి ఆలోచనల్ని గౌరవించాలనే విషయాన్ని చాలామందికి చెబుతుంది ఈ సినిమా.
మట్టి కుస్తీ
భార్య, భర్తల మధ్య సమస్యలను ఓ చిన్న కథతో ముడి పెట్టి తీశారు. భర్త ఆధిపత్యమే కొనసాగాలనే వ్యక్తికి.. మగవాళ్లకు మేము ఏం తక్కువ కాదనే భార్య. కానీ, ఒకరికొకరు అర్థం చేసుకుంటేనే జీవితం ముందుకు సాగుతుందని కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమా చాలామందిలో మార్పు తీసుకువచ్చింది. ఇల్లాలికి తగిన గౌరవం ఇస్తామని చెప్పినవారు కూడా ఉన్నారు.
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
సంప్రదాయాలు, కట్టుబాట్ల పేరుతో మహిళలను ఇంటి పనులకే పరిమితం చేస్తున్నారనేది సింపుల్ కథ. ఓ మహిళకు కొత్తగా పెళ్లై అత్తారింటికి వెళ్తుంది. మగవాళ్ల ఆధిపత్యం ఉన్న ఇంట్లో ఆమె ఇమడలేకపోతుంది. ఇళ్లు, వంటపని మెుత్తం చేస్తూ విసిగిపోయి శివమెత్తుతుంది. పురుషాధిక్యాన్ని ఎదురించి స్వతంత్రంగా తన లక్ష్యం వైపు సాగుతుంది. పురుషాధిక్య సమాజంలో మహిళలు ఇంకా ఎదుర్కొంటున్న అంశాలను సినిమాలో చక్కగా ప్రస్తావించారు. కొందరికి కళ్లు తెరిపిస్తే.. మరికొందరికి సమస్యగా మారింది ఈ చిత్రం. అన్ని పనులు షేర్ చేసుకోవాలంటూ ఆఫీసుల నుంచి వచ్చిన భర్తల్ని భార్యలు ఆటపట్టిస్తున్నారంట ఈ సినిమా చూసి…!
జయ జయ జయ జయ జయహే
ఈ సినిమా కూడా భార్య భర్తల మధ్య వచ్చే ఇగో ప్రాబ్లమ్స్‌తో తెరకెక్కించారు. అన్ని తను అనుకున్నట్లుగా సాగాలనుకునే భర్త.. అనుకోని సందర్భంలో భార్యపై చేయిచేసుకుంటాడు. ఎవరికి చెప్పినా పట్టించుకోకపోవటంతో తానే అన్ని చూసుకోవాలని ఆమె తైక్వాండో నేర్చుకుంటుంది. ఈ క్రమంలో ఇబ్బందులు రావటం, వాళ్లు విడిపోవడం జరుగుతుంది. అబ్బాయిపై ఆధారపడకుండా కూడా అమ్మాయిలు జీవిస్తారు. కానీ, అలా మగవారు ఉండలేరని చూపించారు. ఇది కూడా చాలామంది కపుల్స్‌పై ప్రభావం చూపించింది. ఇందులో భర్తను తైక్వాండోతో ఆటాడుకునే రీల్ తెగ వైరల్ అయ్యింది. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఒక్కసారి ఊహించుకోండి.
ఏప్రిల్ 27 , 2023
మెుదటి త్రైమాసికంలో టాలివుడ్, బాలివుడ్,కొలివుడ్, శాండల్‌వుడ్ పైచేయి ఎవరిది?
కొత్త సంవత్సరం ప్రారంభమై దాదాపు 3 నెలలు పూర్తయ్యింది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో చాలా చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని చిత్రాలు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తే…. మరికొన్ని అంచనాలు అందుకోలేక డిజాస్టర్లుగా మిగిలాయి. పఠాన్ వంటి ఆల్‌టైమ్ బ్లాక్ బస్టర్‌తో బాలీవుడ్‌కు పూర్వ వైభవం వచ్చింది. వీరసింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య చిత్రాలు టాలీవుడ్ మేనియాను కొనసాగించాయి. తమిళ్, కన్నడ ఇండస్ట్రీలకు మంచి హిట్లే పడ్డాయి.
టాలివుడ్ పరంపర
గతేడాది ధమాకా వంటి సూపర్ హిట్‌తో ముగించిన టాలీవుడ్… ఏడాది ఆరంభంలోనే బ్లాక్‌బస్టర్లను అందుకుంది. సీనియర్ హీరోలు బాలకృష్ణ, చిరంజీవి అభిమానులు పండుగ చేసుకొనే సినిమాలను ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహా రెడ్డి రూ. 110 కోట్లు పెట్టి తెరకెక్కిస్తే రూ. 134 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇదే బ్యానర్‌లో వచ్చిన వాల్తేరు వీరయ్య రూ.140 కోట్లతో రూపొందించగా.. రూ. 219 కోట్లు సాధించింది.
చిన్న హిట్లు
తెలుగు ప్రేక్షకులను చిన్న సినిమాలు కూడా అలరించాయి. సుహాస్ హీరోగా వచ్చిన రైటర్ పద్మభూషణ్ బాక్సాఫీస్ వద్ద క్లాసిక్ హిట్‌గా నిలిచింది. రూ.2.5 కోట్లతో తెరకెక్కించగా.. రూ. 12.5 కోట్లు వచ్చాయి. ఇదే సమయంలో చాలా రోజుల తర్వాత హిట్ అందుకున్నాడు కిరణ్ అబ్బవరం. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో వచ్చిన వినరో భాగ్యము విష్ణు కథ సినిమా ప్రేక్షకులను మెప్పించింది. రూ.1 కోటి బడ్జెట్ పెట్టి నిర్మించగా.. రూ. 9.15 కోట్లు వచ్చాయి.
భావోద్వేగాల బలగం
మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని బలగం సినిమాతో మరోసారి రుజువయ్యింది. కమెడియన్ వేణు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదించారు. సూపర్ హిట్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించారు ప్రేక్షకులు. రూ. 1.5 కోట్లతో దిల్‌రాజు నిర్మించగా.. రూ. 18.65 కోట్లు వసూలు చేసింది చిత్రం. ఇంకా థియేటర్లలో అలరిస్తోంది.
డిజాస్టర్లు
బింబిసార వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ ఈ ఏడాది నిరాశపర్చాడు. సరికొత్త కాన్సెప్ట్‌తో అమిగోస్ అనే చిత్రం తెరకెక్కించి విఫలమయ్యాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఎప్పట్నుంచో హిట్ కోసం ఎదురుచూస్తున్న సందీప్ కిషన్‌కి కూడా సరైన హిట్ దక్కలేదు. మైఖేల్ సినిమాతో మళ్లీ ఫ్లాప్ మూటగట్టుకున్నాడు సందీప్. ఇవి మినహా తెలుగులో మంచి హిట్లే దక్కాయి.
బాలీవుడ్ బాద్షా
వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలీవుడ్ పరిశ్రమకు చాలాకాలం గ్యాప్ తర్వాత వచ్చిన బాద్షా షారుఖ్ ఖాన్ ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌ను అందించాడు.ఏకంగా వెయ్యి కోట్ల కలెక్షన్లను దాటేశాడు. రూ.250 కోట్లతో తెరకెక్కిన పఠాన్ చిత్రం రూ. 1047 కోట్లు వసూలు చేసింది. బాలీవుడ్‌లో బాహుబలి పేరిట ఉన్న రికార్డును చేరిపేశాడు కింగ్ ఖాన్.
రొమాంటిక్ హిట్
కింగ్ ఖాన్ తెచ్చిన వైభవాన్ని రణ్‌బీర్ కపూర్ కొనసాగించాడు. తూ జూటీ మై మక్కర్ వంటి రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాతో హిట్ కొట్టాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా రూ. 70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా.. రూ.151.35 కోట్లు వసూలు చేసింది. అయితే, తెలుగు రీమేక్‌గా రూపుదిద్దుకున్న షెహజాదా మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది.
షెహ్‌జాదా ఎందుకు ఫ్లాప్ అయింది?
https://telugu.yousay.tv/why-did-the-remake-of-ala-vaikunthapuram-not-work-out-why-shehzada-is-a-disaster.html
తమిళ్ సూపర్ స్టార్స్
కోలీవుడ్‌లో కూడా ఈ ఏడాది శుభారంభంతోనే ప్రారంభమయ్యింది. దిల్ రాజు నిర్మాణంలో దళపతి విజయ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తీసిన వారిసు ఇండస్ట్రీ హిట్ అయ్యింది. రూ.297 కోట్లు వసూళ్లు సాధించింది ఈ సినిమా. సంక్రాంతి బరిలో అజిత్ చిత్రం తునివు కూడా హిట్‌గానే నిలిచింది. కాకపోతే పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చింది అంతే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ నటించిన సార్ సినిమా సగటు ప్రేక్షకులను మెప్పించింది. రూ.35 కోట్లతో తీర్చిదిద్దితే రూ.115 కోట్లు సాధించింది ఈ చిత్రం.
ఇంకా మెుదలుకాలేదు
కన్నడలో విడుదలైన ఒకే ఒక్క పెద్ద చిత్రం కబ్జ. దాదాపు కేజీఎఫ్ రేంజ్ ట్రైలర్ చూపించినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడటం లేదు. ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివన్న వంటి స్టార్లు ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోయారు.
ఆధిపత్యం ఎవరిది?
చిత్ర పరిశ్రమలన్నింటిలో హిట్లు, ఫ్లాపులు ఉన్నాయి. తెలుగులో వరుస బ్లాక్‌బస్టర్లు కొట్టాయి. తమిళ్ నుంచి డబ్ అయిన చిత్రాలు కూడా బాగానే ఆదరించారు. కానీ, కలెక్షన్ల పరంగా బాలీవుడ్ దూసుకుపోయింది. ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్‌ను కొట్టేశాయి. తమిళ్‌లోనూ రూ.100 కోట్ల క్లబ్ సినిమాలు మూడు వచ్చాయి. ఈ పరంగా చూసుకున్నట్లయితే… ఒక్కో విభాగంలో ఒక్కో ఇండస్ట్రీ టాప్‌లో నిలిచిందనే చెప్పాలి. లేదు ప్రస్తుతం కలెక్షన్లే మ్యాటర్ అనుకుంటే.. బాలీవుడ్ దే పైచేయి.
మార్చి 20 , 2023
MARCH 17 | ఈ వారం థియేటర్లు/ఓటీటీలో విడుదలయ్యే తెలుగు చిత్రాలు
గతవారం పూర్తిగా చిన్న సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. ఈ సారి ప్రేక్షకులను అలరించేందుకు భారీ సినిమాలు వస్తున్నాయి. కేజీఎఫ్ రేంజ్ ట్రైలర్‌తో ఆకట్టుకున్న కబ్జ(Kabzaa) థియేటర్లలో సందడి చేయనుంది. అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రాబోతుంది. భారీ చిత్రాలు ఓటీటీ వేదికగా సందడి చేయనున్నాయి.
మల్టీస్టారర్ కబ్జ
ఇండియన్ రియల్ స్టార్ ఉపేంద్ర, కిచ్చా సుదీప్, పునిత్ శివరాజ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ చిత్రం కబ్జ. టీజర్ విడుదలైనప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ రేంజ్‌లో ట్రైలర్ ఉండటంతో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని అంటున్నారు. ప్రముఖ హీరో పునీత్ రాజ్‌కుమార్ జయంతి పురస్కరించుకొని మార్చి 17న విడుదల చేస్తున్నారు.
https://www.youtube.com/watch?v=CHc1bsUKv4U
హ్యాట్రిక్ మూవీ
దర్శకుడు అవసరాల శ్రీనివాస్, హీరో నాగశౌర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఫలనా అబ్బాయి- ఫలనా అమ్మాయి. టి.జి విశ్వ ప్రసాద్, దాసరి పద్మ నిర్మాతలు. ఈ చిత్రం కూడా మార్చి 17న రిలీజ్ అవుతుంది. సినిమా అందరినీ అలరిస్తోందని చిత్రబృందం నమ్మకంతో ఉంది.
https://www.youtube.com/watch?v=kX5vAM8TXzE
‘సార్’ సందడి
ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన సార్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఓటీటీలో విడుదలకు సిద్ధమయ్యింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 17న విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉండనుంది.
రైటర్ పద్మభూషణ్ రెడీ
ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం ట్రైలర్‌తో హైప్ క్రియేట్ చేసి బాక్సాఫీస్ హిట్ కొట్టాడు సుహాస్. రైటర్ పద్మభూషణ్‌తో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకొని ఇప్పుడు ఓటీటీలో సందడి చేయనున్నాడు. మార్చి 17వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు / వెబ్ సిరీస్‌లు
Title CategoryLanguagePlatformRelease DateSathigani rendu ekaraluMovie Telugu Aha March 17Locked Series Telugu Aha March 17Money shotMovieEnglishNetflixMarch 15Kuthey Movie Hindi NetflixMarch 16Shadow and bone SeriesEnglish Netflix March 16Maestro Series English Netflix March 17In his shadow marchMovieEnglish Netflix March 17The magician elephant Animated MovieEnglishNetflix March 17Black adamMovieEnglish Prime videoMarch 15Dome Series English Prime video March 17Lock Movie Tamil Zee5 March 17Pop kaun Series Hindi Disney+hoststarMarch 17Rocket boysSeries Hindi Sony livMarch 16
మార్చి 14 , 2023
Young Telugu Heroes: వైవిధ్యతకు ప్రాధాన్యమిస్తున్న కుర్ర హీరోలు.. సీనియర్లు చూసి నేర్చుకోవాల్సిందే!
టాలీవుడ్ యంగ్ హీరోలు కథల ఎంపిక విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. కథలో కొత్త దనం ఉంటేనే సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. లేకుంటే నిర్మొహమాటంగా తిరస్కరిస్తున్నారు. తద్వారా రొటిన్ స్టోరీలతో వస్తోన్న నాగార్జున, వెంకటేష్, రవితేజ, రామ్ పోతినేని, నితిన్, గోపిచంద్ వంటి సీనియర్ హీరోలకు పాఠాలు నేర్పుతున్నారు. యువ హీరో సుహాస్ రీసెంట్‌గా 'గొర్రెపురాణం' అనే మరో విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలో కుర్ర హీరోలు ఎంచుకుంటున్న కొత్త తరహా సబ్జెక్ట్స్‌పై మరోమారు చర్చ మెుదలైంది. ఇంతకీ కొత్త కథలతో వస్తోన్న యంగ్ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
సుహాస్ (Suhas)
ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ నటుడిగా కొనసాగుతూ వచ్చిన సుహాస్ ‘కలర్ ఫోటో’ సినిమాతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ వచ్చిన క్రేజ్‌తో సినిమా అవకాశాలను పట్టేశాడు. ‘రైటర్ పద్మభూషణ్’, ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’, ‘శ్రీరంగనీతులు’, ‘ప్రసన్నవదనం’ వంటి వైవిధ్యవంతమైన చిత్రాల్లో నటించి ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేశాడు. అంతేకాదు ‘హిట్ 2’ మూవీలో విలన్‌గానూ నటించి ఆకట్టుకున్నాడు. తాజాగా ‘గొర్రెపురాణం’ అనే సరికొత్త సబ్జెక్ట్‌తో శుక్రవారం (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తేజ సజ్జ (Teja Sajja)
బాలనటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తేజ సజ్జ ‘జాంబి రెడ్డి’ సినిమాతో హీరోగా మారాడు. తొలి చిత్రంతోనే హీరో మెటీరియల్‌గా అనిపించాడు. ఆ తర్వాత ‘ఇష్క్’, ‘అద్భుతం’ వంటి వైవిధ్యమైన చిత్రాలు చేసినప్పటికీ పెద్దగా పేరు రాలేదు. తిరిగి ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లోనే 'హనుమాన్' చిత్రం చేసి జాతీయ స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్‌తో తేజ సజ్జ పేరు మార్మోగింది. ప్రస్తుతం 'మిరాయ్' అనే మరో పాన్ ఇండియా చిత్రంలో తేజ నటిస్తున్నాడు. ఇందులో మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘మిరాయ్’ టీజర్ గూస్‌బంప్స్ తెప్పించింది.
నిఖిల్ సిద్దార్ధ్ (Nikhil Siddhartha)
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హ్యాపీ డేస్ చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో వరుణ్ సందేశ్ పక్కన ఫ్రెండ్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.ఆ తర్వాత సోలో హీరోగా పలు సినిమాలు చేసి యూత్‌కు దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే స్వామి రారా, కార్తికేయా, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కార్తికేయ, కార్తికేయ 2, స్పై వంటి డిఫరెంట్ జానర్ ఫిల్మ్స్ చేసి మినమం గ్యారెంటీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం రామ్‌చరణ్ నిర్మాణంలో స్వయంభు అనే హిస్టారికల్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్నాడు. అలాగే ‘కార్తికేయ 3’ చిత్రం కూడా అతడి లైనప్‌లో ఉంది.
విశ్వక్ సేన్ (Visvak Sen)
యువ నటుడు విశ్వక్ సేన్ యూత్‌లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ ప్రారంభం నుంచి సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా విశ్వక్ జాగ్రత్త పడుతున్నాడు. తొలి చిత్రం ‘వెళ్లిపోమాకే’ పెద్దగా సక్సెస్ కాకపోయిన ‘ఈ నగరానికి ఏమైంది’ ఫిల్మ్‌తో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ‘ఫలక్‌నామా దాస్’ పేరుతో మాస్ యాక్షన్ డ్రామా తీసి మరో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ‘హిట్’, ‘పాగల్’, ‘అశోక వనంలో అర్జున కల్యాణం’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధమ్కీ’, ‘గామి’, ‘గ్యాంగ్స్ గోదావరి’ సక్సెస్‌లతో తెలుగులో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’, ‘లైలా’ అనే డిఫరెంట్ జానర్ ఫిల్మ్‌లో విశ్వక్ నటిస్తున్నాడు. ‘లైలా’లో లేడీ గెటప్‌లో అతడు కనిపించనుండటం గమనార్హం.
అడివి శేష్ (Adivi Sesh)
ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన సొంతం సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసిన అడివి శేష్ ‘కర్మ’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్ కల్యాణ్ నటించిన ‘పంజా’ సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్’ సినిమాతో అడివి శేష్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడు గూఢచారి సీక్వెల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీ కూడా సక్సెస్ అయితే అడివి శేష్‌కు తిరుగుండదని చెప్పవచ్చు.
సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda)
నాగచైతన్య హీరోగా నటించిన మొదటి సినిమా జోష్‌తోనే సిద్దు జొన్నలగడ్డ కూడా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’, ‘ఆరెంజ్’, ‘గుంటూర్ టాకీస్’ వంటి సినిమాలలో నటించినప్పటికీ సిద్ధు కెరీర్ గ్రోత్ అంతగా లేదనే చెప్పాలి. అయితే ఆయా చిత్రాల్లో సిద్ధు రోల్స్ మాత్రం చాలా వైవిధ్యంగా ఉంటాయి. నటనతోపాటు రైటర్‌గా, ఎడిటర్‌గా కూడా వర్క్ చేస్తూ వచ్చిన సిద్ధు ‘డిజే టిల్లు’తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాకు వచ్చిన క్రేజ్‌తో సీక్వెల్ కూడా తెరకెక్కించి మరో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ‘టిల్లు స్క్వేర్’ చిత్రం ఏకంగా రూ.135 కోట్లు వసూలు చేయడం విశేషం. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ వంటి చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు. వాటి తర్వాత ‘టిల్లు క్యూబ్’ కూడా పట్టాలెక్కనుంది.
నార్నే నితిన్ (Narne Nithin)
జూనియర్ ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘మ్యాడ్’తో తెరంగేట్రం చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రావడంతో యూత్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇక నితిన్ తన తర్వాతి చిత్రం ‘ఆయ్’ను పక్కా విలేజ్ నేపథ్యంలో తీసుకొచ్చి వైవిధ్యం చూపించాడు. అంతేకాదు మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. మ్యాడ్‌లో కాస్త సెటిల్‌గా కనిపించిన నితీన్ ‘ఆయ్’ సినిమాలో మంచి ప్రదర్శన చేశాడు. నటన, డ్యాన్స్, కామెడీ ఇలా అన్ని రంగాల్లో మ్యాడ్‌తో పోలిస్తే బెటర్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. భావోద్వేగాలను కూడా చక్కగా పండించి ఆకట్టుకున్నాడు.
సెప్టెంబర్ 17 , 2024
Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్ ఫేమస్’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
నటీనటులు: సుమంత్ ప్రభాస్, సిరి రాశి, మురళిధర్ గౌడ్, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి,
డైరెక్టర్: సుమంత్ ప్రభాస్
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ దూపాటి
నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, సూర్య చౌదరి
ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా వరకూ సినిమాలు తెలంగాణ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నాయి. ఇలా వచ్చిన బలగం, జాతిరత్నాలు బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ సాధించాయి. తాజాగా ఇదే కోవలో తెరకెక్కిన సినిమా ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. `రైటర్ పద్మభూషణ్` వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన ఛాయ్ బిస్కెట్, లహరి ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. అంతేగాక టాలీవుడ్ స్టార్స్‌తో చేసిన విభిన్న ప్రమోషన్స్ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 26) రిలీజ్ అయిన ‘మేమ్ ఫేమస్’ అందరి అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.
కథ
తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్ ప్రభాస్), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి తన మరదలు మౌనిక (సార్య లక్ష్మణ్)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. మయి ఫ్రెండ్ బాలి కూడా ఊరిలోని ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంటాడు.
అయితే జులాయిగా తిరిగే స్నేహితులంతా కలిసి ఓ టెంట్ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్ సర్య్కూట్‌కి టెంట్ హౌజ్ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్ ఛానెల్ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? మయి, బాలి ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనేది మిగతా కథ. ఇది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
ఎలా సాగిందంటే..
ముగ్గరు ఫ్రెండ్స్ ఎడాపెడా తప్పులు చేస్తూ పంచాయతీలో నిలబడటం ఫస్టాఫ్ అంతా రిపీట్ మోడ్‌లో కనిపిస్తుంది. అది చూసేవారికి కాస్త బోరింగ్ అనిపిస్తుంది. అసలు సినిమాలో కథ ఉందా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. ఊరి ప్రజల సూటిపోటీ మాటలతో టెంట్ హౌజ్ పెట్టుకొని స్నేహితులు బాధ్యత తెలుసుకున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలో వచ్చే లవ్ ఇష్యూస్, టెంట్‌హౌజ్ అగ్నిప్రమాదానికి గురికావడం సెకాండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకాండాఫ్ అంతా యూట్యూబ్ వీడియోస్ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ పంచ్‌లు నవ్విస్తాయి. అలాగే సుమంత్ ప్రభాస్, సార్య లక్ష్మణ్ మధ్య లవ్ ట్రాక్ యూత్‌కి కనెక్ట్ అవుతుంది. సుమంత్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక మణి, సార్య లక్ష్మణ్, మణి ఏగుర్ల, మురళీధర్ తదితరులు వారి వారి పాత్రల మేరకు నటించారు.
ఎవరెలా చేశారంటే?
నటన పరంగా సుమంత్ ప్రభాస్ ఫర్వాలేదనిపించాడు. నటనలో ఇంకాస్తా రాటుదేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మణి, మౌర్య పాత్రల పరిధి మేరకు నటించారు. అంజిమామ, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చా పాత్రలు గుర్తిండి పోతాయి. లిప్‌స్టిక్ స్పాయిలర్ రోల్‌లో యాక్ట్ చేసిన శివనందన్ కామెడీ బాగుంది. అనవసర సన్నివేశాలు సినిమాలో ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే?
మేమ్ ఫేమస్ సినిమా చూస్తున్నంత సేపు ‘పెళ్లిచూపులు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలే గుర్తుకువస్తాయి. సుమంత్ ప్రభాస్ కథను తన స్టైల్‌లో అద్భుతంగా రాసుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో విఫలమైనట్లు కనిపించింది. సుమంత్ రాసుకున్న స్టోరీలో ఏమాత్రం బలం లేదు. రోటీన్‌గా ఉంది. కామెడీ, భావోద్వేగాల్ని తాను రాసుకున్న విధంగా తెరపై చూపించలేకపోయాడు. షార్ట్‌ఫిల్మ్‌ను తలపిస్తుంది. సినిమాను సరదాగా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్ సీన్స్‌ను ఇరికించారు. ఇక రైతు పడే కష్టం గురించి చెప్పే సీన్లు సందర్భానుసారంగా అనిపించదు. అయితే కొన్ని సీన్లు చాలా కొత్తగా అన్నిపిస్తాయి. కామెడీ కూడా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్లు మినహా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.
టెక్నికల్‌గా
సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వర్క్ బావుంది. కళ్యాణ్ నాయక్ పాటల కంటే నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి. సినిమాకు ఎక్కువ బడ్జెట్ ఎందుకని భావించినట్లు అనిపించింది.
ప్లస్ పాయింట్స్
కామెడీనేపథ్య సంగీతంఇంటర్‌వెల్‌కు ముందు సీన్లు
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీసాగదీతపాటలు
రేటింగ్: 2.75/5
మే 26 , 2023
HBD Sri Gouri Priya: మంచి నటే కాదు.. గొప్ప గాయని కూడా.. శ్రీ గౌరి ప్రియ టాప్ సీక్రెట్స్ ఇవే?
టాలీవుడ్‌కు టాలెంటెడ్ యంగ్ నటీమణుల్లో శ్రీ గౌరి ప్రియ ఒకరు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది ‘మ్యాడ్’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో మంచి మార్కులు సంపాదించింది. ఫ్యూచర్‌లో స్టార్ హీరోయిన్ కాగల సత్తా తనలో ఉందని చాటి చెప్పింది. ఇదిలా ఉంటే ఇవాళ శ్రీ గౌరి ప్రియ పుట్టిన రోజు. 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం.
శ్రీ గౌరి ప్రియ మన హైదరాబాదీ అమ్మాయే. 1998 నవంబరు 13న ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రుల పేర్లు శ్రీనివాస్ రెడ్డి, వసుంధర.
శ్రీ గౌరి ప్రియ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. బేగంపేట్‌లోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్తి చేసింది.
స్కూల్ డేస్ నుంచే కల్చరల్ యాక్టివిటీస్‌లో శ్రీగౌరి చురుగ్గా ఉండేది. స్కూల్, కాలేజ్‌లో జరిగే వినోద కార్యక్రమాల్లో పాల్గొని మంచి ప్రశంసలు అందుకుంది.
శ్రీగౌరిలో మంచి నటితో పాటు బెస్ట్ సింగర్ కూడా దాగుంది. బాల్యంలోనే పలు టెలివిజన్ షోలలో ఈ అమ్మడు పాటల ప్రదర్శన చేసింది. విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది.
ప్రముఖ టెలివిజన్ షో ‘బోల్ బేబీ బోల్’ (Bol Baby Bol)లో చిన్నప్పడు శ్రీగౌరి పాల్గొంది. సెకండ్ సీజన్‌లో రన్నరప్‌గా, మూడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది.
సినిమాల్లోకి రాకముందు జెమినీ టీవీలో యాంకర్‌గానూ చేసింది. తన వాక్ చాతుర్యంతో టెలివిజన్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.
2016లో వచ్చిన 'నిర్మలా కాన్వెంట్' మూవీతో ఈ అమ్మడు సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ అందులో పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయలేదు.
ఆ తర్వాత చేసిన 'మనలో ఒకడు', 'ఫిదా' చిత్రాల్లోనూ గుర్తుంచుకోతగ్గ రోల్స్ చేయలేదు. దీంతో మూడు సినిమాలు చేసిన శ్రీగౌరి పేరు పెద్దగా ఎవరికీ తెలియలేదు.
దీంతో మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈ అమ్మడు 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచి సినీ పెద్దల దృష్టిలో పడింది.
View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya)
ఆహాలో వచ్చిన ‘మెయిల్’ వెబ్‌సిరీస్‌లో తొలిసారి లీడ్ రోల్ యాక్ట్రెస్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రోజా అనే పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది.
ఆ తర్వాత సుహాస్ నటించిన 'రైటర్ పద్మభూషణ్' సినిమాలో కన్నా అనే పాత్రలో కనిపించి మెప్పించింది. తన నటనతో మంచి మార్కులు సంపాదించింది.
గతేడాది వచ్చిన 'మ్యాడ్' చిత్రం శ్రీగౌరి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇందులో శ్రుతి పాత్రలో కనిపించి యూత్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది.
ఈ ఏడాది తమిళంలో 'ట్రూ లవర్' అనే చిత్రంలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇందులో దివ్య అనే పాత్రతో శభాష్ అనిపించుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది.
View this post on Instagram A post shared by Sri Gouri Priya (@srigouripriya)
ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సరసన ఓ సినిమాలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో 'ప్రొడక్షన్ నెం.27' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది.
సింగర్‌గా గౌరి ప్రియ రెండు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తేజ దర్శకత్వంలో వచ్చిన 'హోరాహోరీ', 'మనలో ఒక్కడు' చిత్రాలకు గాయనిగా పనిచేసి అభిమానులను మెప్పించింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రజనీ.. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చింది.
ఏ కాస్త సమయం దొరికినా డ్యాన్స్ చేస్తుంటానని శ్రీగౌరి తెలిపింది. అలాగే పుస్తకాలు చదవం, పెయింటింగ్ వేయడం, ఫొటోగ్రఫీ తన హాబీస్ అని స్పష్టం చేసింది.
ఫుడ్ విషయానికి వస్తే భారతీయ వంటకాలను ఈ అమ్మడు ఎంతగానో ఇష్టపడుతుంది. అలాగే చైనీస్, జపనీస్ ఫుడ్‌ను సైతం ఇష్టంగా తింటుంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ శ్రీగౌరి చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
శ్రీగౌరి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రస్తుతం 510K మంది ఫాలో అవుతున్నారు. ఆమె పోస్టు చేసిన ఫొటోలను వెంటనే షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
నవంబర్ 13 , 2024
Tollywood Comedians As Heros: హీరోలుగా సత్తా చాటుతున్న ఈ తరం హాస్యనటులు వీరే..!
టాలీవుడ్‌కి చెందిన దిగ్గజ హాస్య నటులు గతంలో హీరోలుగా నటించి మంచి విజయాలు సాధించారు. బ్రహ్మానందం (Brahmandam), అలీ (Ali), సునీల్ (Sunil), వేణుమాదవ్ (Venu Madhav) లాంటి సీనియర్ కమెడియన్లు పలు చిత్రాల్లో కథానాయకులుగా చేసి అలరించారు. తాజాగా ఈ జనరేషన్ కమెడియన్స్ కూడా వారిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. కథానాయకులుగా కనిపిస్తూ ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. సాలిడ్ కథతో వచ్చి మంచి హిట్స్ సైతం సాధిస్తున్నారు. అలా రీసెంట్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చిన వారెవరు? ఆ సినిమాలేంటి? ఇప్పుడు చూద్దాం.
సుహాస్ (Suhas)
ప్రముఖ నటుడు సుహాస్.. వరుస హిట్లతో టాలీవుడ్‌లో దూసుకెళ్తున్నాడు. షార్ట్‌ఫిల్మ్స్‌తో ఫేమస్ అయిన సుహాస్.. 2018లో ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో తెరంగేట్రం చేశాడు. తర్వాత ‘మజిలీ’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘డియర్ కామ్రేడ్’, ‘ప్రతిరోజూ పండగే’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి నవ్వులు పంచాడు. ‘కలర్ ఫొటో’తో తొలి ప్రయత్నంలోనే హీరోగా విజయం అందుకున్న సుహాస్..‘ఫ్యామిలీ డ్రామా’, ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రాలతో మంచి పేరు సంపాదించాడు. రీసెంట్‌గా ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ (Ambajipeta Marriage Band)తో కథానాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ప్రస్తుతం ‘కేబుల్ రెడ్డి’, ‘శ్రీరంగ నీతులు’, ‘ప్రసన్నవదనం’ తదితర చిత్రాల్లో సుహాస్ నటిస్తున్నాడు.
వైవా హర్ష (Harsha Chemudu)
షార్ట్‌ఫిల్మ్స్ నుంచి వెండితెరపైకి వచ్చిన ప్రముఖ కమెడియన్స్‌లో వైవా హర్ష ఒకరు. ‘మసాలా’తో సినీ కెరీర్ ప్రారంభించిన హర్ష.. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజాది గ్రేట్’, ‘పక్కా కమర్షియల్’, ‘కార్తికేయ 2’, ‘బింబిసార’ తదితర చిత్రాల్లో నవ్వులు పూయించాడు. తాజాగా ‘సుందరం మాస్టర్’ (Sundaram Master) చిత్రంతో హర్ష కథానాయకుడిగా మారాడు. గతనెల ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
అభినవ్ గోమటం (Abhinav Gomatam)
యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ తరం హాస్య నటుల్లో ‘అభినవ్ గోమటం’ (Abhinav Gomatam) ముందు వరుసలో ఉంటాడు. షార్ట్‌ఫిల్మ్స్‌లో ప్రతిభ కనబరిచి సినిమాల్లోకి వచ్చి అభినవ్.. తొలి చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ‘మీకు మాత్రమే చెప్తా’, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ తదితర చిత్రాల్లోనూ కమెడియన్‌గా వినోదం పంచాడు. రీసెంట్‌గా ‘మస్త్ షేడ్స్ ఉన్నయ్‌రా..’ (Masthu Shades Unnai Ra) సినిమాతో అభినవ్ హీరోగా మారాడు.
సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer)
‘జబర్దస్త్’ వేదికగా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుడిగాలి సుధీర్.. ‘అడ్డా’తో సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ‘రేసుగుర్రం’, ‘సుప్రీం’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ తదితర చిత్రాల్లో సందడి చేసిన అతడు.. ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’తో హీరో అయ్యాడు. తర్వాత ‘గాలోడు’, ‘కాలింగ్ సహస్ర’లో ప్రధాన పాత్రలు పోషించాడు. ప్రస్తుతం ‘జి.ఒ.ఎ.టి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధయ్యాడు.
సత్యం రాజేష్ (Satyam Rajesh)
సత్యం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రాజేష్.. ఆ మూవీ టైటిల్‌నే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ‘మా ఊరి పొలిమేర’ సినిమాతో హీరోగా మారిన అతడు.. మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కొవిడ్ కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ చిత్రానికి విశేష స్పందన వచ్చింది. దీనికి సీక్వెల్‌గా ఇటీవల వచ్చిన ‘మా ఊరి పొలిమేర 2’ గతేడాది చివర్లో థియేటర్లలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది.
ప్రియదర్శి (Priyadarsi)
యంగ్ కమెడియన్ ప్రియదర్శి కూడా పలు చిత్రాల్లో హీరోగా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించాడు. ‘మల్లేశం’తో తొలిసారి కథానాయకుడిగా మారిన ప్రియదర్శి.. గతేడాది ‘బలగం’ (Balagam) సినిమాతో సాలిడ్ విజయాన్ని అందుకున్నాడు. ఇటీవల ‘మంగళవారం’ (Mangalavaram) చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి అలరించాడు. దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించనున్న ఓ సినిమాకి ప్రియదర్శి హీరోగా ఎంపికయ్యాడు.
వెన్నెల కిషోర్ (Vennela Kishore)
టాలీవుడ్‌లోని స్టార్ కమెడియన్స్‌లో వెన్నెల కిషోర్ ఒకరు. తన తొలి సినిమా ‘వెన్నెల’ టైటిల్‌ను ఇంటి పేరుగా మార్చుకున్న కిషోర్.. ‘దూకుడు’, ‘జులాయి’ వంటి పలు సూపర్ చిత్రాల్లో హాస్య నటుడిగా మెప్పించాడు. ‘అతడు ఆమె ఓ స్కూటర్’తో కథానాయకుడిగా మారిన కిషోర్.. రీసెంట్‌గా ‘చారి 111’ (Chari 111)తో మరోమారు ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అయితే ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా విఫలమైంది.
ధన్‌రాజ్ (Dhanraj)
జబర్దస్త్ షో ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకున్న మరో కమెడియన్ ధన్‌రాజ్. ‘బుజ్జీ ఇలారా’ చిత్రంలో ప్రధాన పాత్రదారిగా కనిపించిన ధన్‌రాజ్.. ప్రస్తుతం ‘రామం రాఘవం’లో లీడ్ రోల్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమాకు అతడే దర్శకత్వం వహిస్తుండటం విశేషం. దర్శకుడు సముద్రఖని మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
మార్చి 14 , 2024
Tollywood Debut Directors in 2023: తొలి చిత్రంతోనే సంచనాలు సృష్టించిన కొత్త దర్శకులు వీరే!
ప్రతీ సంవత్సరం స్టార్ డైరెక్టర్ల చిత్రాలు టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తుంటాయి. కనీసం రెండు లేదా మూడు చిత్రాలు జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అయితే ఈ ఏడాది స్టార్ డైరెక్టర్ల హవా టాలీవుడ్‌లో పెద్దగా కనిపించలేదు. అయితే కొత్త దర్శకులు మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి సినిమాతోనే సంచలనాలు సృష్టించారు. మరి ఆ దర్శకులు ఎవరు? వాళ్ళు తెరకెక్కించిన సినిమాలు ఏంటి? ఇప్పుడు చూద్దాం.
శౌర్యువ్
నాని హీరోగా తెరక్కిన హాయ్ నాన్న చిత్రం రీసెంట్‌గా విడుదలై బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. సినిమాలో భావోద్వేగాలను చక్కగా పలికించి తొలి సినిమాతోనే అందరి మన్ననలు పొందాడు.
కళ్యాణ్ శంకర్
కొత్త నటీనటులను, కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ ని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తెరకెక్కించిన సినిమా ‘మ్యాడ్’. కాలేజీ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
సుమంత్ ప్రభాస్
షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమ్‌ని సంపాదించుకున్న సుమంత్ ప్రభాస్.. హీరోగా, దర్శకుడిగా చేస్తూ వెండితెరపై అరంగేట్రం చేసిన సినిమా ‘మేమ్ ఫేమస్’. ఈ సినిమా యూత్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. సినిమాకు ముందు చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ కూడా అందరి దృష్టిని ఆకర్షించాయి.
క్లాక్స్
చిన్న సినిమాగా విడుదలైన ‘బెదురులంక 2012’ మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ క్లాక్స్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఒక యునిక్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది.
వేణు యెల్దండి
ఈ ఏడాది సంచలనం సృష్టించిన కొత్త దర్శకుల్లో వేణు యెల్దండి ముందు వరుసలో ఉంటారు. ఆయన తెరకెక్కించిన 'బలగం' అంతర్జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. అంతేగాక విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. గ్రామాల్లో తెరలు పెట్టి మరి సినిమాను ప్రదర్శించారంటే ఈ చిత్రం ఏ స్థాయిలో ఆదరణ సంపాదించిందో అర్థమవుతుంది.
శ్రీకాంత్ ఓదెల
నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు ఓదెల. గొప్ప సినిమాలు చేయగల సత్తా తనలో ఉందని నిరూపించుకున్నాడు.
షణ్ముఖ ప్రశాంత్
ఈ ఏడాది విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారా షణ్ముఖ ప్రశాంత్ డైరెక్టర్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. రూ.4 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. బాక్స్ ఆఫీస్ వద్ద రూ.12 కోట్లు కొల్లగొట్టి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
మురళి కిషోర్
కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు మురళి కిషోర్ అబ్బుర డైరెక్ట్ చేసిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంది. తొలి చిత్రంతోనే డైరెక్టర్‌గా తనకు మంచి భవిష్యత్ ఉందని నిరూపించుకున్నారు మురళి కిషోర్.
డిసెంబర్ 16 , 2023
69th Filmfare Awards South 2024: ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ నామినేషన్స్‌లో ‘బేబీ’ మూవీ హవా.. రేసులోని తెలుగు చిత్రాలు ఇవే!
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో విజేతల ఎంపిక ప్రక్రియ మెుదలైంది. దక్షిణాది సినీ పరిశ్రమలైన తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అవార్డులను సొంతం చేసుకునేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024లో పోటీ పడుతున్న సినిమాల జాబితాను నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. అవార్డుల ప్రధానోత్సవం ఎప్పుడు? ఎక్కడ? అనే విషయాలని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా గణనీయ సంఖ్యలో టాలీవుడ్ చిత్రాలు, నటీనటులు నామినేషన్స్ బరిలో నిలిచారు. ఇంతకీ ఆ తెలుగు చిత్రాలు ఏవి? ఏ విభాగాల్లో ఏ తెలుగు నటులు పోటీలో నిలిచారు? ఇప్పుడు పరిశీలిద్దాం.
నాని.. డబుల్ ధమాకా!
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ 2024 నామినేషన్స్‌లో హీరో నాని (Nani) డబుల్ ధమాకాగా నిలిచారు. ఉత్తమ నటుడు కేటగిరిలో రెండు సినిమాలకు (దసరా, హాయ్ నాన్న) నాని నామినేట్ అయ్యాడు. ఇదే కేటగిరిలో టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి (వాల్తేరు వీరయ్య), బాలకృష్ణ (భగవంత్ కేసరి), ధనుష్ (సర్), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ), ఆనంద్ దేవరకొండ (బేబీ) నిలిచారు. అటు ఉత్తమ దర్శకుడు విభాగంలోనూ హాయ్ నాన్న, దసరా చిత్రాలు ఉండటం విశేషం. ఉత్తమ నటి విభాగంలో కీర్తి సురేష్ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డు రేసులో నిలిచింది.
బేబీ చిత్రం హవా!
69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్స్‌లో బేబీ చిత్రం సత్తా చాటింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేషన్స్‌లో నిలిచింది. ఉత్తమ నటుడు (ఆనంద్ దేవరకొండ) కేటగిరితో పాటు ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్ (సాయి రాజేష్), ఉత్తమ నటి (వైష్ణవి చైతన్య), ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ (విజయ్ బుల్గానిన్), ఉత్తమ గేయ రచయిత (ఆనంత శ్రీరామ్), ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్ (శ్రీరామ చంద్ర, పీవీఎన్‌ఎస్ రోహిత్) విభాగాల్లో బేబి చిత్రం బరిలో నిలిచింది. దీంతో ఫిల్మ్‌ఫేర్‌లో ‘బేబీ’ చిత్రానికి భారీగానే అవార్డ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
https://twitter.com/MassMovieMakers/status/1813445764934431164
ఫిల్మ్ అవార్డ్స్ కోసం వివిధ కేటగిరీల్లో పోటీపడుతున్న చిత్రాలివే...
ఉత్తమ చిత్రం
బేబీబలగందసరాహాయ్ నాన్నమిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టిసామజవరగమనసలార్: పార్ట్-1 సీజ్ ఫైర్
ఉత్తమ నటుడు
ఆనంద్ దేవరకొండ (బేబీ)బాలకృష్ణ (భగవంత్ కేసరి)చిరంజీవి (వాల్తేర్ వీరయ్య)ధనుష్ (సర్)నాని (దసరా)నాని (హాయ్ నాన్న)నవీన్ పొలిశెట్టి (మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)ప్రకాశ్‌రాజ్ (రంగమార్తాండ)
ఉత్తమ నటి:
అనుష్క (మిస్‌శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి)కీర్తిసురేశ్ (దసరా)మృణాళ్ ఠాకూర్ (హాయ్ నాన్న)సమంత (శాకుంతలం)వైష్ణవీ చైతన్య (బేబీ)
ఉత్తమ దర్శకుడు:
అనిల్ రావిపూడి (భగవంత్ కేసరి)కార్తిక్ దండు (విరూపాక్ష)ప్రశాంత్‌నీల్ (సలార్:పార్ట్-1 సీజ్ ఫైర్)సాయి రాజేశ్ (బేబీ)శౌర్యువ్ (హాయ్ నాన్న)శ్రీకాంత్ ఓదెల (దసరా)వేణు యెల్దండ (బలగం)
ఉత్తమ సహాయ నటుడు:
బ్రహ్మానందం (రంగ మార్తండ)దీక్షిత్‌శెట్టి (దసరా)కోట జయరాం (బలగం)నరేశ్ (సామజవరగమన)రవితేజ (వాల్తేర్ వీరయ్య)విష్ణు ఓఐ (కీడా కోలా)
ఉత్తమ సహాయ నటి:
రమ్యకృష్ణ (రంగమార్తండ)రోహిణి మోల్లెటి (రైటర్ పద్మభూషణ్)రుపా లక్ష్మీ (బలగం)శ్యామల (విరూపాక్ష)శ్రీలీల (భగవంత్ కేసరి)శ్రియారెడ్డి (సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్)శ్వేతరెడ్డి (మంత్ ఆఫ్ మధు)
ఉత్తమ గాయని:
చిన్మయి శ్రీపాద (ఆరాధ్య – ఖుషి)చిన్మయి శ్రీపాద (ఓడియమ్మ – హాయ్ పాప)దీ (చమ్కీల అంగీలేసి -దసరా)మంగ్లీ (ఊరు పల్లెటూరు-బలగం)శక్తిశ్రీ గోపాలన్ (అమ్మాడి -హాయ్ నాన్న)శ్వేత మోహన్ (మాస్టారు.. మాస్టారు -సర్)
ఉత్తమ గాయకుడు:
అనురాగ్ కుల్‌కర్ణి (సమయ-హాయ్ నాన్న)హేషమ్ అబ్దుల్ వాహబ్ (ఖుషి -టైటిల్ సాంగ్)పీవీఎన్‌ఎస్ రోహిత్ (ప్రేమిస్తున్నా -బేబీ)రామ్ మిర్యాల (పొట్టిపిల్ల -బలగం)సిధ్ శ్రీరామ్ (ఆరాధ్య – ఖుషి)శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్:
బేబీ (విజయ్ బుల్గానిన్)బలగం (భీమ్స్ సిసిరిలియో)దసరా (సంతోష్ నారాయణ్)హాయ్ నాన్న (హేషమ్ అబ్దుల్ వాహబ్)ఖుషి (హేషమ్ అబ్దుల్ వాహబ్)వాల్తేర్ వీరయ్య (దేవిశ్రీ ప్రసాద్)
ఉత్తమ సాహిత్యం:
అనంత శ్రీరామ్ (గాజు బొమ్మ -హాయ్ నాన్న)అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలు -బేబీ)కాసర్ల శ్యామ్ (చమ్కీల అంగీలేసి -దసరా)కాసర్ల శ్యామ్ (ఊరు పల్లెటూరు -బలగం)పి.రఘు (లింగి లింగి లింగ్డి -కోట బొమ్మాళి పి.ఎస్)
జూలై 17 , 2024
Tollywood Debut Actress in 2023: అరంగేట్రంతోనే తమ జాతకాన్ని మార్చుకున్న హీరోయిన్స్ వీరే!
ప్రతీ సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా పలువురు తారలు టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. అరంగేట్రం సినిమాతోనే తమదైన ముద్ర వేశారు. జయపజయాలకు అతీతంగా తమ నటన, అభినయం, గ్లామర్‌తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. భవిష్యత్‌లో స్టార్ హీరోయిన్స్‌గా ఎదిగేందుకు అవసరమైన టాలెంట్ తమలో ఉందని నిరూపించుకున్నారు. ఇంతకీ ఆ నటీమణులు ఎవరు? తెలుగులో వారు చేసిస తెరంగేట్ర చిత్రం ఏది? ఇప్పుడు చూద్దాం.
ఆషికా రంగనాథ్
కర్ణాటకకు చెందిన ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘అమిగోస్’ (Amigos) చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం నాగార్జునతో ‘నా సామిరంగ’ సినిమాలో నటిస్తోంది. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాతి కానుకగా ఈ మూవీ విడుదల కానుంది. అలాగే కళ్యాణ్ రామ్ నటిస్తున్న మరో సినిమాలోనూ ఈ ముద్దుగుమ్మ ఛాన్స్ కొట్టేసింది.
ప్రియా భవాని శంకర్
తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రియా భవాని శంకర్ (Priya Bhavani Shankar).. ‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. యువనటుడు సంతోష్ శోభన్‌కు జంటగా కనిపించి మెప్పించింది. మంచు మనోజ్ అప్‌కమింగ్ మూవీ 'అహం బ్రహ్మాస్మి' లోనూ ఈమె నటిస్తోంది. అలాగే కమల్‌హాసన్ 'భారతీయుడు-2' చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.
టీనా శిల్పరాజ్
'రైటర్ పద్మభూషణం' సినిమా ద్వారా టీనా శిల్పరాజ్ (Tina Shilparaj) తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇది ఆమె చేసిన మెుట్ట మెుదటి సినిమానే అయిన్పపటికీ నటనలో ఎంతో అనుభవం ఉన్నట్లు చేసింది. తన అందం, అభినయంతోనే మంచి మార్కులే కొట్టేసింది.
రెబా మోనికా జాన్
ఈ భామ ‘సామజవరగమన’ చిత్రం ద్వారా తెలుగులో అడుగుపెట్టింది. రెబా (Reba Monica John) ఇప్పటికే తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సూపర్ హిట్ చిత్రాలు చేసింది. పలు టీవీ షోలలోనూ పాల్గొంది.
గీతిక తివారి
రానా సోదరుడు అభిరామ్ దగ్గుబటి హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'అహింస'. ఇందులో గీతికా తివారి (Geethika Tiwary) హీరోయిన్‌గా చేసింది. నటిగా తొలి చిత్రమే అయినప్పటికీ గీతిక అద్భుత నటన కనబరిచింది. తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది.
ఐశ్వర్య మీనన్
నిఖిల్ హీరోగా చేసిన 'స్పై' (Spy) చిత్రంలో ఐశ్వర్య మీనన్ (Iswarya Menon) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ తొలుత అక్కడ సీరియళ్లలో నటించింది. నటిగా గుర్తింపు తెచ్చుకొని సినిమాల్లో ఛాన్స్ సంపాదించింది. ప్రస్తుతం మలయాళంలో ఓ రొమాంటిక్ సినిమాలో ఐశ్వర్య నటిస్తోంది. ఇందులో ఫహద్ ఫాసిల్ హీరోగా చేస్తున్నాడు.
యుక్తి తరేజా
కన్నడ ఇండస్ట్రీకి చెందిన యుక్తి తరేజా (Yukti Thareja) ఈ ఏడాది వచ్చిన రంగబలి చిత్రం ద్వారా తెలుగులో అరంగేట్రం చేసింది. ఇందులో నాగశౌర్యకు జోడీగా సహజ పాత్రలో మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ నిఖిల్ గౌడ జంటగా కన్నడలో ఓ సినిమాలో నటిస్తోంది. ఇందులో దునియా విజయ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
సాక్షి వైద్య
యంగ్ బ్యూటీ సాక్షి వైద్య (Sakshi Vaidya) ఈ ఏడాది రెండు చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. అఖిల్ ఏజెంట్ సినిమాతో తెలుగులో అరంగేట్రం చేసిన సాక్షి.. ఆ తర్వాత గాండీవధారి అర్జున మూవీతో మరోమారు పలకరించింది. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విఫలం అయినప్పటికీ నటిగా సాక్షి వైద్యకు మంచి మార్కులే పడ్డాయి.
ప్రగతి శ్రీవాస్తవ
ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన చిత్రం 'పెద్ద కాపు'. ఈ సినిమా ద్వారా ప్రగతి శ్రీవాస్తవ (Pragati Srivastava) హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. గ్రామీణ యువతి పాత్రలో అదరగొట్టింది. తొలి సినిమాతోనే యూత్‌ను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ ఆనంద్ దేవరకొండ సరసన ‘గం గం గణేశ’ చిత్రంలో నటిస్తోంది.
నుపుర్ సనన్
బాలీవుడ్ బ్యూటీ నుపుర్ సనన్ (Nupur Sanon) టైగర్ నాగేశ్వర రావు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. మాస్ మహారాజా రవితేజతో పోటాపోటీగా నటించి అదరగొట్టింది.
వైష్ణవి చైతన్య
బేబి చిత్రం ద్వారా 'వైష్ణవి చైతన్య' (Vaishnavi Chaitanya) వెండితెరకు హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. తన నటన, అభినయంతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. పలు యూట్యూబ్ సిరీస్‌లలో వైష్ణవి హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. పలు సినిమాల్లోనూ ఆడపా దడపా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసింది.
డిసెంబర్ 15 , 2023
Rupali Barua: ఆశీష్ విద్యార్థి- రూపాలి పెళ్లికి ముందు ఇంత కథ నడిచిందా?
జాతీయ అవార్డు, గ్రహీత విలక్షణ నటుడైన ఆశీష్ విద్యార్థి 60 ఏళ్ల వయసులో వివాహం చేసుకున్నాడు. అసోంకి చెందిన రూపాలి బారువా (50)ను పెళ్లాడాడు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
https://twitter.com/sunaina_bhola/status/1661959392940654593
ఆశిష్ - రూపాలి వివాహానికి అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ జంట పెళ్లికి ఆహ్వానించింది.
https://twitter.com/MilagroMovies/status/1661726388339216389
రూపాలి ఎవరు?
అసోంలోని గువాహటిలో ఏప్రిల్ 21, 1973న రూపాలి జన్మించారు. ప్రస్తుతం ఆమె కోలకత్తాలో స్థిరపడ్డారు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా ఆమెకు పేరుంది. సోషల్ ఇన్‌ఫ్లూయెన్సర్‌గానూ రూపాలీ గుర్తింపు పొందారు.
రూపాలీకి కోల్‌కత్తాలో ఫ్యాషన్ డిజైన్ స్టోర్స్ ఉన్నాయి. నటుడు ఆశీష్ తన వ్లాగ్స్‌లో భాగంగా ఓసారి కోల్‌కత్తాలో రూపాలీని కలిశారు. ఆ సందర్భంగా ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తొలి పరిచయంలోనే తాము మళ్లీ మళ్లీ కలవాలని నిర్ణయించుకున్నట్లు రూపాలి తెలిపారు. మానవత్వం కలిగిన వ్యక్తి ఆశిష్ అని ప్రశంసించారు.
గతంలో ఆశీష్ విద్యార్థి రాజోషి బారువాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రముఖ బెంగాలి నటి శకుంతల బారువా కుమార్తె. రాజోషి.. థియేటర్ ఆర్టిస్ట్‌గా, నటిగా, సింగర్‌గా చాలా ఫేమస్. వీరికి అర్త్ విద్యార్థి అనే కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే మనస్పర్థల కారణంగా ఆశీష్ విద్యార్థి-రాజోషి బారువా విడిపోయారు. దీంతో అప్పటినుంచి ఆశీష్ ఒంటరిగానే తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. రూపాలి పరిచయం తర్వాత వారు ఇరువురు డేటింగ్‌లో ఉన్నట్లు తెగ వార్తలు వచ్చాయి. దాన్ని నిజం చేస్తూ రూపాలి - ఆశీష్ పెళ్లి చేసుకున్నారు.
ఆశిష్ రెండో పెళ్లిపై బాలీవుడ్ సినీ విమర్శకుడు కమల్ R. ఖాన్ ఘాటు విమర్శలు చేశారు. విషెస్ చెబుతూనే ’60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవడానికి కొంచెమైనా సిగ్గుండాలి బాయ్‌సాబ్!’ అంటూ ఆశిష్ పెళ్లి ఫొటోను షేర్ చేశాడు.
https://twitter.com/kamaalrkhan/status/1661716692970655744?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1661716692970655744%7Ctwgr%5E01885b8d59f8e3fcd913f78a1914f6f43b653343%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Fentertainment%2Ftollywood%2Fkrk-viral-comments-on-ashish-vidyarthis-2nd-marriage-with-rupali-barua-at-60-964922.html
‘కాల్ సంధ్య’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆశీష్.. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో నటించి మంచి గుర్తింపు పొందారు.
తెలుగులో పోకిరి, గుడుంబా శంకర్ చిత్రాలతో ఆశీష్ మరింత పాపులారిటి సంపాదించుకున్నారు. తన మూడవ సినిమా ‘దోర్హ్ కాల్’తో నేషనల్ అవార్డు గెలుచుకున్నాడు.
ఇప్పటివరకు 11 భాషల్లో సినిమాలు చేసిన ఆశీష్.. సుమారు 200కి పైగా చిత్రాల్లో నటించారు. రీసెంట్‌గా రైటర్ పద్మాభూషన్ సినిమాలోనూ హీరో తండ్రిగా నటించి మెప్పించాడు.
https://twitter.com/sunaina_bhola/status/1661959392940654593
మే 26 , 2023
నేషనల్ స్క్రీన్ రైటర్స్ డే: తెలుగులో టాప్ స్క్రీన్ రైటర్స్
]ఈయన పుస్తక రచయిత అలానే స్క్రీన్ రైటర్ కూడా.స్ఫూర్తిని నింపే ఆయన రచనలు చాలా ఫేమస్. ఆయన రాసిన పుస్తకాలను కథలు రూపంలోకి మార్చి చిత్రాలను తీశారు. ఆయన ఒక ఊరి కథ అనే సినిమాకి రచయితగా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు.యండమూరి వీరేంద్రనాథ్
ఫిబ్రవరి 13 , 2023
SSMB29: హమ్మయ్యా..! మొత్తానికి పూర్తి చేశారు… త్వరలో అప్‌డేట్!
దర్శక దిగ్గజం SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కాంబోలో వస్తున్న చిత్రం SSMB29 (వర్కింగ్ టైటిల్). ఈ సినిమా అప్‌డేట్ గురించి మహేష్ ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుంది ? ఎలా ఉండబోతుంది అనే వాటిపై సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమ్మర్‌లో కనీసం ఒక్క అప్‌డేట్ అయినా ఇస్తారా? లేదా? అంటూ మదన పడుతున్నారు. సోషల్ మీడియాలో తమ ఆవేదనను పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈ చిత్రం గురించి ఓ రూమర్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే పూర్తయిందని, ప్రస్తుతం సంభాషణలపై కసరత్తు చేస్తున్నారని తెలిసింది. డైలాగ్స్ రచయిత సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి మాటలు రాస్తున్నట్లు సమాచారం. ఆయన గతంలో RRR చిత్రానికి మాటలు రాసిన సంగతి తెలిసిందే.
మరోవైపు ఆఫ్రికా అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ థ్రిల్లర్‌గా కథ రాసుకున్నట్లు రచయిత విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాను, రాజమౌళి సౌతాఫ్రికా రైటర్ విల్బర్ స్మిత్ వీరాభిమానులం అని చెప్పుకొచ్చారు. ఆయన నవలల ఆధారంగానే స్క్రిప్ట్ వర్క్ చేసినట్లు వెళ్లడించారు. దీంతో ఈ చిత్రం అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనుంది.
మహేష్ లుక్‌పై జాగ్రత్తలు
SSMB 29లో మహేష్ లుక్(Mahesh look) ఎలా ఉండనుందన్న ఆసక్తి ప్రస్తుతం ఫ్యాన్స్ అందరిలోనూ నెలకొంది. ఈ క్రమంలో మహేష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘లేజర్ ఫోకస్’ అంటూ కొత్త ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిక్‌లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్‌తో కనిపించాడు. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా? లేదా నార్మల్ లుక్? అన్న దానిపై చిత్ర యూనిట్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. అయితే రాజమౌళి చిత్రం కోసం ఈ లుక్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ కూడా రానుంది.
మహేష్ సరసన అలియా భట్?
'SSMB 29' సినిమాలో మహేష్‌కు జోడీగా అలియా భట్ (Alia Bhatt) అయితే ఎలా ఉంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. 'ఆర్‌ఆర్‌ఆర్' చిత్రంలో దర్శకుడు రాజమౌళి.. అలియా భట్‌తో పని చేశారు. ఇందులో అలియా భట్ నటన నచ్చడంతో మళ్లీ ఆమెను రిపీట్ చేసే అవకాశముందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాగా, హాలీవుడ్ నటి చెల్సియా ఇస్లాన్ కూడా 'SSMB 29' చిత్రానికి ఎంపికైనట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తను కూడా మేకర్స్ ఇప్పటివరకూ ధ్రువీకరించలేదు.
SSMB 29.. టైటిల్ ఇదేనా?
దర్శకధీరుడు రాజమౌళి.. తన సినిమాల టైటిల్ విషయంలో చాలా జాగ్రత్త వహిస్తుంటారు. ఇప్పటివరకూ ఆ తీసిన మూవీల పేర్లను గమనిస్తే.. చాలా కొత్తగా ప్రేక్షకులకు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఈ క్రమంలోనే 'SSMB 29' సినిమాకు కూడా రాజమౌళి ఓ పేరును పరిశీలిస్తున్నారట. మహేష్ చిత్రానికి 'మహారాజ' అనే టైటిల్‌ను అనుకుంటున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మహేష్ పేరులో మహా.. రాజమౌళిలలో 'రాజ' తీసుకొని ఈ టైటిల్‌ను క్రియేట్ చేశారట. దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే.
ఏప్రిల్ 01 , 2024
Gaddar Super Hit Songs: పాటలతో ఉద్యమస్ఫూర్తిని రగిలించిన గద్దర్.. ఈ సాంగ్స్ వింటే పూనకాలే!
ప్రజా గాయకుడు గద్దర్ (74) తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) కన్నుమూశారు. అయిదే గద్దర్ గురించి ఈ తరం వారికి పెద్దగా తెలియనప్పటికీ కిందటి తరం వారికి ఆయన గొప్ప విప్లవకారుడు. ముఖ్యంగా ఆయన స్వరం ప్రజల్లో చైతన్యాన్ని నింపుతుంది. ఆయన సాహిత్యం.. పౌరులను ఆలోచింపజేస్తుంది. తన ఆటపాటలతో ప్రజా ఉద్యమాలను నడిపించిన గొప్ప ధీశాలి గద్దర్. పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకూ గద్దర్ తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్ ఎందుకంత స్పెషల్. ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన పాటలు ఏవి? ఈ కథనంలో చూద్దాం.
బండెనక బండి కట్టి
గద్దర్ పాడిన వాటిలో 'బండెనక బండి కట్టి' అనే పాట చాలా స్పెషల్. 'మా భూమి' సినిమాలోని ఈ పాట అప్పట్లో ఓ ఊపు ఊపింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ఈ సాంగ్‌తో గద్దర్ ఒక్కసారిగా అందరిలో దృష్టిలో పడ్డారు.
https://www.youtube.com/watch?v=8T3F4IuYarM
మల్లెతీగకు పందిరివోలె
1995లో వచ్చిన 'మల్లె తీగకు పందిరివోలె’ పాట సైతం గద్దర్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ పాటను గద్దర్ స్వయంగా రాశారు. ఈ సాంగ్ ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని సైతం సొంతం చేసుకుంది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమాలోనిది ఈ పాట.
https://www.youtube.com/watch?v=8BxYfk0WhYI
పొడుస్తున్న పొద్దుమీద
గద్దర్ పాడిన ‘పొడుస్తున్న పొద్దుమీద’ పాట తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఈ పాట విన్న ఎంతో మంది యువకులు ఉద్యమం వైపు నడిచారు. ఈ పాటకు గాను బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ కేటగిరీలో గద్దర్ నంది అవార్డు అందుకున్నారు. 'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్.
https://www.youtube.com/watch?v=vywBbz6QL7g
నా రక్తంతో నడుపుతా
ఓరేయ్ రిక్షా సినిమాలోని ‘నా రక్తంతో నడుపుతాను రిక్షాను’ అనే పాట కూడా అప్పట్లో ఎంతగానో పాపులర్ అయ్యింది. గద్దర్ ఆవేశంతో రాసిన లిరిక్స్‌కు అంతకు మించిన నటనతో ఆర్. నారాయణమూర్తి రక్తి కట్టించారు.
https://www.youtube.com/watch?v=XhbiuSTugNc
అమ్మ తెలంగాణా
తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను తెలియజేస్తూ ‘అమ్మా తెలంగాణమా.. ఆకలి కేకల గానమా’ అనే పాటను రాశారు. తన స్వరంతో ఆ సాంగ్‌కు ప్రాణం పోశారు. ఇది విన్న తెలంగాణ ప్రజలు కదం తొక్కారు. ఉద్యమం వైపు కాలు కదిపారు. ఈ పాటను రాష్ట్ర గీతంగా తెలంగాణ ప్రభుత్వం గుర్తించడం విశేషం.
https://www.youtube.com/watch?v=pXgjUMosLWY
మరిన్ని పాటలు
పైన పేర్కొన్న పాటలతో పాటు 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది నిజం.
ఆగస్టు 07 , 2023
Item Songs Lyrics: ఈ ఐటెమ్ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.
ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం)
కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.
‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద..
వలలు వెయ్యొద్దు వయసు మీద..
ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి.
సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.
‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని..
చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ..
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ..
దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’
‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా..
కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా..
కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా..
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.
https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk
పుడుతూనే ఉయ్యాల(నేనింతే)
పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.
‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే..
ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే..
చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే..
నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా..
నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’
‘‘టర్నే లేని దారులూ..
ట్విస్టే లేని గాథలూ..
రిస్కే లేని లైఫులూ..
బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.
https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc
తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్)
సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.
ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి.
‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని..
చేతకాని వాడల్లే చూడొద్దే..
ధర్మరాజు అంతటివాడు ఆడాడే..
తీసిపారేయొద్దు జూదాన్ని..
మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే..
స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే..
ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే..
వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’
https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk
పక్కా లోకల్(జనతా గ్యారేజ్)
ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.
తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది..
రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే…
‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో..
ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో..
ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో..
అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’
డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది.
ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది.
https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA
మరికొన్ని..
తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.
https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
జూన్ 23 , 2023
Telangana Background Songs: సినిమాల్లో తెలంగాణ నేపథ్య పాటలు.. ఈ సాంగ్స్‌ని మీరెప్పుడైనా విన్నారా..!
తెలంగాణ నేపథ్యమున్న సినిమాలు ఎన్నో వస్తున్నాయి. బాక్సాఫీస్ ముందు భారీ విజయం సాధిస్తున్నాయి. అయితే, కొన్ని పాటలు అచ్చమైన తెలంగాణను ప్రతిబింబిస్తాయి. అందులోని సాహిత్యాన్ని పరీక్షించినా, విజువల్స్‌ని చూసినా, మ్యూజిక్ బీట్ విన్నా.. తెలంగాణమే గుర్తొస్తుంది. ఏదో ఒక రూపంలో తెలంగాణ ఆచార, సంప్రదాయాలను యావత్ ప్రజలకు చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అలాంటి పాటలేంటో ఓసారి చూద్దాం.
ఊరు పల్లెటూరు
ఓ కుటుంబంలోని బంధాల నేపథ్యంలో తీసిన సినిమా బలగం. ఇందులోని ‘ఊరు పల్లెటూరు’ సాంగ్ తెలంగాణ నేటివిటీని పరిచయం చేస్తుంది. ‘వంద గడపల మంద నా పల్లె.. గోడ కట్టని గూడు నా పల్లె’ అంటూ కాసర్ల శ్యాం అందించిన లిరిక్స్ అచ్చమైన తెలంగాణ పల్లెల స్వభావాన్ని తెలియజేస్తాయి. మామా అత్త బావ బాపు వరసల్లె.. అంటూ సాగే లిరిక్స్ ప్రజల మధ్య అన్యోన్య బంధాన్ని చాటిచెప్తాయి. ఇక్కడ అందరినీ ఏదో ఒక బంధుత్వంతో పిలుస్తారని చెప్పేందుకు ఈ లిరిక్స్ సాక్ష్యం. పాట చిత్రీకరణ కూడా తెలంగాణ తనాన్ని రుచి చూపిస్తుంది. వేణు ఎల్దండి డైరెక్ట్ చేశాడు.
https://www.youtube.com/watch?v=KpBksxKsrIU
బతుకమ్మ
సల్మాన్ ఖాన్, వెంకటేశ్, పూజా హెగ్డే కాంబోలో వచ్చిన మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్’ సినిమాలోని ఓ పాట పూర్తిగా తెలంగాణ సంప్రదాయాన్ని చూపిస్తుంది. రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ నేపథ్యంలోనే సాంగ్‌ని తీర్చిదిద్దారు. బతుకమ్మ పేరుతో చేసిన ఈ సాంగ్ ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా, పండుగ సమయంలో తెలంగాణ ఆడపడుచుల వస్త్రాలంకరణను కళ్లకు కట్టినట్లు ఇందులో చూపించారు. బతుకమ్మ తయారీ విధానంపై కూడా ఫోకస్ పెట్టారు. కిన్నల్ రాజ్, హరిని ఇవతూరి పాటకు లిరిక్స్ అందించారు.
https://www.youtube.com/watch?v=tdOg8X0RV9I
చమ్కీల అంగీలేసి
దసరా మూవీని పూర్తిగా తెలంగాణ నేపథ్యంలో జరిగే సినిమాగా తీర్చిదిద్దారు. కాబట్టి, ఇందులో ప్రతీ పాట తెలంగాణను ప్రస్ఫుటీకరిస్తుంది. ‘చమ్కీల అంగీలేసి ఓ వదినె చాకు లెక్కుండేటోడే’ అంటూ ఈ గీతం సాగుతుంది. కాసర్ల శ్యాం ఈ పాటకు ప్రాణం పోశాడు. మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ ఈ పాటను రామ్ మిరియాల, ధీతో పాడించారు. తెలంగాణ పల్లెల్లో పెళ్లైన భార్య, భర్తలు ఇరువురిపై ఫిర్యాదులు చేసుకుంటే ఎలా ఉంటుందో పాటలో చూపించారు. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు.
https://www.youtube.com/watch?v=XeGdY8RoxQY
దండికడియాల్
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన చిత్రం ధమాకా. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. ఇందులోని ‘దండకడియాల్.. దస్తిరుమాల్’ సాంగ్ తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. భీమ్స్ స్వయంగా ఈ పాటను రాశాడు. ఈడు మీదున్న అబ్బాయి, అమ్మాయి కలిసి సరదాగా మాట్లాడుకునే సంభాషణనే పాటగా మార్చారు. మధ్యలో అల్లో మల్లో రాములమల్లో.. అనే లైన్‌ని తెలంగాణ పల్లెల్లో ఇప్పటికీ పాడుకుంటుంటారు.
https://www.youtube.com/watch?v=K0p3Mx_GNsY
దిల్ కుష్
తెలంగాణలో హైదరాబాద్‌ది ప్రత్యేక స్థానం. రాజధాని నగరానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. నైజాం పాలనకు కేంద్రంగా నిలిచింది. దీంతో హైదరాబాదీలు ఎక్కువగా ఉర్దూ, తెలుగు కలగలిపి మాట్లాడుతుంటారు. ముఖ్యంగా పాతబస్తీలో మాట్లాడే ప్రతి వాక్యంలో ఒక తెలుగు, మరొక ఉర్దూతో కూడిన హిందీ పదం ఉంటుంది. ఇదే విషయాన్ని చెబుతూ సెల్పిష్ సినిమాలో ‘దిల్‌కుష్’ సాంగ్‌ని కంపోజ్ చేశారు. తనకు హీరోయినే సర్వస్వం అంటూ హీరో పాడుకునే పాట ఇది. తెలుగు, హిందీ భాషలను కలగలిపి లిరిక్ రైటర్ సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఈ పాట రాశారు.
https://www.youtube.com/watch?v=kPU4FXB7pNE
సౌ శర(పరేషాన్)
పరేషాన్ సినిమాలోని సౌ శర పాట కూడా పూర్తిగా తెలంగాణ యాసలో ఉంటుంది. పనీ, పాట లేని పోరగాళ్లు మాట్లాడుకునే మాటల్లాగే పాట ఉంటుంది. అక్కాల చంద్రమౌలి ఈ పాటను రాశారు. ఈ సాంగ్‌తో పాటు ‘అత్తరు బుత్తరు’, ‘గాంధారి ఖిల్లా’ పాటలు తెలంగాణ నేటివిటీని చెబుతున్నాయి.
https://www.youtube.com/watch?v=M7uR7cQoUQI
గల్లీ చిన్నది(మేమ్ ఫేమస్)
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గోరేటి వెంకన్న రచించిన ‘గల్లీ చిన్నది’ పాటను మేమ్ ఫేమస్ సినిమాలో రీమిక్స్ చేశారు. మళ్ళీ గోరేటి వెంకన్నతోనే పాడించారు. తెలంగాణ పల్లెల్లోని ప్రజల జీవన శైలికి ఈ పాట అద్దం పడుతుంది. ఇందులోని మిగతా పాటలు కూడా తెలంగాణ బ్యాక్‌గ్రౌండ్‌లో సాగుతాయి.
https://www.youtube.com/watch?v=O_9tnIOvKYk
జూన్ 07 , 2023
Bhargavi Nilayam OTT Review: ఆత్మతో రైటర్ స్నేహం చేస్తే.. ‘భార్గవి నిలయం’ ఎలా ఉందంటే?
నటీనటులు : టొవినో థామస్, చెంబన్ వినోద్, రోషన్ మ్యాథ్యూ, రీమా కల్లింగల్, షైన్ టామ్ చాకో, అభిరామ్ రాధా కృష్ణ
డైరెక్టర్: ఆషిక్ అబు
సినిమాటోగ్రఫీ : గిరిష్ గంగాధరన్
ఎడిటింగ్ : వి. సాజన్
సంగీతం : బిజిబాల్, రెక్స్ విజయన్
నిర్మాతలు : అషిక్ అబు, రీమా కల్లింగల్
ఓటీటీ : ఆహా
డిజిటల్ ప్రేక్షకులను అలరించడానికి ఈ వారం ఓ మలయాళ హర్రర్ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. 1964లో మలయాళంలో వచ్చిన ‘భార్గవి నిలయం’ (Bhargavi Nilayam) సినిమాను తిరిగి 2023లో ‘నీలవెలిచం’ (Neelavelicham) పేరుతో కొన్ని మార్పులు చేసి రిమేక్ చేశారు. ఈ మూవీలో స్టార్ హీరో టోవినో థామస్, రీమా కల్లింగల్, రోషన్ మాథ్యూ, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రల్లో నటించారు. అశిక్ అబు దర్శకత్వం వహించాడు. గతేడాది ఏప్రిల్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. తాజాగా ఆ సినిమాను తెలుగులో ‘భార్గవి నిలయం’ (Bhargavi Nilayam)గా అనువాదం చేసి ఓటీటీలో తీసుకొచ్చారు. ఆహా వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటి
సముద్రతీరానికి సమీపంలో ఉన్న పల్లెటూళ్లో భార్గవి నిలయం చాలా రోజులుగా మూతపడి ఉంటుంది. ఆ బంగళా పేరు వింటనే ఊరివాళ్లు వణికిపోతుంటారు. భార్గవి (రీమా కల్లింగల్) అనే అమ్మాయి ఆత్మగా మారి ఆ ఇంట్లో తిరుగుతుందని అందులో అడుగుపెట్టిన వారిని చంపడానికి ప్రయత్నిస్తుందనే ఊహాగానాలు వినిపిస్తుంటాయి. ఈ క్రమంలో బషీర్ (టోవినో థామస్) అనే రైటర్ ఆ ఊరికి కొత్తగా వస్తాడు. భార్గవి నిలయం చరిత్ర గురించి తెలియక అందులో అద్దెకు దిగుతాడు. ఇల్లు మారేందుకు డబ్బుల్లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ ఆత్మతో స్నేహం చేస్తాడు. ఆమెపై కథ రాయాలని ఫిక్సవుతాడు. అసలు భార్గవి ఎందుకు చనిపోయింది? ఆమెను ప్రాణంగా ప్రేమించిన శివకుమార్ (రోషన్ మాథ్యూ) ఎలా అదృశ్యం అయ్యాడు? ఈ ప్రేమ జంట జీవితంలోని మిస్టరీని బషీర్ ఎలా బయటపెట్టాడు? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
రచయిత పాత్రలో టోవినో థామస్ నటన బాగుంది. అతడి లుక్, డైలాగ్ డెలివరీ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా అనిపిస్తాయి. సినిమా మెుత్తాన్ని ఆయన భుజస్కందాలపై వేసుకొని మోశారు. కీలక సన్నివేశాల్లో నటుడిగా తన మార్క్ ఏంటో చూపించాడు. అటు ప్రేమ జంటగా రీమా కల్లింగల్, రోషన్ మథ్యూ పర్వాలేదనిపించారు. విలన్‌గా టామ్ చాకో యాక్టింగ్ బాగుంది. విలన్ పాత్రపై అతడు గట్టి ప్రభావాన్నే చూపారు. ఇతర నటీనటులు తమ పరిధి మేరకు నటించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
ఆషిక్ అబు ఒక రొటిన్ స్టోరీనే ఈ సినిమాకు ఎంచుకున్నప్పటికీ కథనాన్ని మాత్రం ఆసక్తికరంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఒక ప్రేమ జంట జీవితంలోని విషాదాన్ని ఓ రచయిత వెలికితీసే క్రమంలో వచ్చే సీన్స్ ఆకట్టుకుంటాయి. భార్గవి ఆత్మ ఉన్న ఇంట్లో హీరో దిగడం, ఆ ఊరి వాళ్లు భయంకరమైన కథలతో అతడ్ని భయపెట్టడం ఇంటస్ట్రింగ్‌గా అనిపిస్తాయి. అసలేం జరుగుతుందా అన్న ఆసక్తిని కలిగిస్తాయి. ఈ క్రమంలో వచ్చే కొన్ని హార్రర్ ఎలిమెంట్స్ భయపెడతాయి. ఇంటర్వెల్‌కు ముందు హీరోకు ఆత్మతో దోస్తీ కుదరడంతో సెకండాఫ్‌పై ఆసక్తి ఏర్పడుతుంది. ద్వితియార్థంలో భార్గవి - శివకుమార్ లవ్‌స్టోరీ, వారి ప్రేమకథకు విలన్ ఎవరన్నది డైరెక్టర్ చూపించారు. భార్గవి మరణానికి కారణంతో పాటు ఆమె రివేంజ్ డ్రామాను ఆసక్టికరంగా చూపించి కథ ముగించారు. అయితే రొటిన్ స్టోరీ, బోరింగ్ లవ్ ట్రాక్, రెగ్యులర్ హార్రర్ సీన్స్ సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్ మంచి పనితీరు కనబరిచాడు. తన కెమెరా పనితనంతో 1964 కాలం నాటి పరిస్థితులను కళ్లకు కట్టాడు. అటు నేపథ్య సంగీతం కూడా సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటింగ్ వర్క్ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
టోవినో థామస్ నటనఆసక్తికర కథనంసాంకేతిక విభాగం
మైనస్ పాయింట్స్
రొటిన్ హార్రర్ కాన్సెప్ట్‌థ్రిల్లింగ్ అంశాలు లేకపోవడం
Telugu.yousay.tv Rating : 3/5
సెప్టెంబర్ 06 , 2024
Ananya Pandey HBD : గూగుల్‌లో తన గురించి ఎక్కువగా వెతుకుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పిన అనన్య పాండే
బాలీవుడ్ అందాల తారా అనన్య పాండే నేడు 27 వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. గూగుల్‌లో నెటిజన్లు ఎక్కువగా తనగురించి అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలను చాలా ఫన్నీగా చెప్పింది. అవేంటో మీరు ఓసారి చూసేయండి.
View this post on Instagram A post shared by Ananya 🌙 (@ananyapanday)
గూగుల్: అనన్య పాండేకు టాటూ ఉందా?
అనన్య పాండే: నాకు ఎలాంటి టాటూ లేదు. కానీ ఒక టాటూ అయితే వేయించుకోవాలని ఉంది. ఓసారి టాటూ కోసం డబ్బులు కూడా చెల్లించాను. కానీ అక్కడి వెళ్లి టాటూ వేయించుకోవాలంటే భయమేసింది. నాకు ఎలాంటి టాటూ బాగుంటుందో ఐడియాస్ ఇవ్వండి.
గూగుల్: అనన్య పాండే దగ్గర డాగ్స్ ఉన్నాయా?
అనన్య పాండే: అవును, నా దగ్గర రెండు శునకాలు ఉన్నాయి. ఒకటి గొల్డెన్ రిట్రివర్ జాతికి చెందినది, మరొకటి మల్టిపుల్ కాల్ రైట్
గూగుల్: అనన్య పాండే ఫెవరెట్ లిప్స్‌టిక్ ఏది?
అనన్య పాండే: నాకు లాక్మీకి చెందిన Blushing Bae లిప్స్‌టిక్ అంటే చాలా ఇష్టం. ఇందులోని ప్రెటి కలర్స్ నాకు బాగా నచ్చుతాయి.
గూగుల్: అనన్య పాండే ఫెవరెట్ సాంగ్ ఏది?
అనన్య పాండే: నాకు మిల్లి సైరస్( Miley Cyrus) పాడిన ఫ్లవర్స్ సాంగ్ అంటే చాలా ఇష్టం. అది వింటున్నప్పుడు నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.
వీటితో పాటు మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం.
ఇక అనన్య పాండే విద్యభ్యాసమంతా ముంబైలో జరిగింది. ఆమె ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేయగా.. యూనివర్సిటీ ఆఫ్ సథరన్ కాలిఫోర్నియాలో ఉన్నత విద్యను అభ్యసించింది.
అనన్యకు ట్రావెలింగ్, డ్యాన్సింగ్, పార్టీయింగ్, రీడింగ్ అంటే చాలా ఇష్టం. ఎక్కువగా స్నేహితులతో గడిపేందుకు ఇష్టపడుతుంది.
బాలీవుడ్‌లో ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ సారా అలీ ఖాన్, సుహానా ఖాన్
అనన్య తండ్రి చుంకీ పాండే బాలీవుడ్‌లో ప్రముఖ నటుడు. 30 ఏళ్ల సినీ జీవితంలో 100కి పైగా చిత్రాల్లో నటించారు. తల్లి భావన పాండే.. ఫేమస్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. అనన్య తాత శరద్ పాండేకు దేశంలోనే ప్రముఖ హార్ట్ సర్జన్‌గా పేరుంది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ -2 చిత్రం ద్వారా అనన్య పాండే బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. తన తొలి సినిమాకే ఉత్తమ ఆరంగేట్ర నటిగా అవార్డు అందుకుంది.
సినిమాల్లోకి రాకముందు అనన్య పాండే మోడలింగ్ చేసింది. లాక్మీతో పాటు మరికోన్ని వాణిజ్య ప్రకటనల్లో ఆమె నటించింది.
ఇక తెలుగులో లైగర్ సినిమాతో అనన్య టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఒంపుసొంపులతో తెలుగు ఆడియన్స్ ఆకట్టుకుంది.
లైగర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అనన్య అందానికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. దీంతో ఆమె పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోయింది.
‘పతి పత్నీ ఔర్ వో’ చిత్రంలో అనన్య చేసిన గ్లామర్ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది.
సినిమా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో సోషల్ మీడియాపై ఫోకస్ పెట్టింది ఈ బ్యూటీ. ఎప్పటికప్పుడు తన బోల్డ్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.
అనన్య నుంచి ఏ చిన్న ఫొటో వచ్చిన అది సోషల్ మీడియాలో సెన్సేషననే చెప్పాలి. ఈ భామ పెట్టే హాట్ ఫొటోలను చూసిన నెటిజన్లు కవ్వించే కామెంట్లతో చెలరేగుతుంటారు.
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన చుంకీ పాండే కూతురే అనన్య. సెలబ్రెటీ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తన టాలెంట్‌ను నమ్ముకొని అనన్య ఎదుగుతోంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధికమంది ఫాలోవర్లు ఉన్న బాలీవుడ్ నటిగా అనన్య పాండే ఉంది. ప్రస్తుతం ఆమె ఖాతాను 25 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
అక్టోబర్ 30 , 2024