ఇంగ్లీష్‌లో చదవండి
మూవీ & ఓటీటీ అప్‌డేట్స్
స్ట్రీమింగ్ ఆన్Primeఫ్రమ్
ఇన్ ( Telugu )
Watch
స్ట్రీమింగ్ ఆన్Aha
ఇన్ ( Telugu )
Watch
2024 Apr 128 months ago
యాత్ర 2 సినిమా అమెజాన్ ప్రైమ్‌లో ముందుగానే (ఏప్రిల్ 12నుంచి) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది
రివ్యూస్
YouSay Review
Yatra 2 Movie Review: టీడీపీ టార్గెట్‌గా ‘యాత్ర 2’.. సినిమా ఎలా ఉందంటే?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yat...read more
How was the movie?
తారాగణం
మమ్ముట్టి
వై ఎస్ రాజశేఖర్ రెడ్డిజీవా
వైయస్ జగన్ మోహన్ రెడ్డికేతకీ నారాయణ్
Y. S. భారతిమహేష్ మంజ్రేకర్
ఎన్.చంద్రబాబు నాయుడుసుజానే బెర్నెర్ట్సోనియా గాంధీ
శుభలేఖ సుధాకర్
జార్జ్ మేరియన్
సిబ్బంది
మహి వి రాఘవ్
దర్శకుడుశివ మేకనిర్మాత
ఎడిటోరియల్ లిస్ట్
కథనాలు
Yatra 2 Movie Review: టీడీపీ టార్గెట్‌గా ‘యాత్ర 2’.. సినిమా ఎలా ఉందంటే?
నటీనటులు: మమ్ముట్టి, జీవా, కేతకీ నారాయణ్, సచిన్ ఖేడ్కర్, మహేష్ మంజ్రేకర్ తదితరులు
రచన, దర్శకత్వం: మహీ వీ రాఘవ
సినిమాటోగ్రఫి: మధీ
మ్యూజిక్: సంతోష్ నారాయణ్
ఎడిటర్: శ్రవణ్
బ్యానర్: త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యూలాయిడ్
నిర్మాత: మేక శివ
రిలీజ్ డేట్: 08-02-2024
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) వచ్చింది. యాత్ర సినిమా వైఎస్సార్ బయోపిక్‌గా రాగా.. యాత్ర 2 ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌ను ఉద్దేశించి తీశారు. ఈ సీక్వెల్ మూవీ ఇవాళ గ్రాండ్‌గా థియేటర్స్ రిలీజయింది. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? సినిమాలో జగన్‌కు సంబంధించి ఏం చూపించారు? వంటి విశేషాలను ఈ రివ్యూలో తెలుసుకుందాం.
కథ
ఈ కథ మనందరికీ తెలిసిందే (Yatra 2 Movie Review). వైఎస్సార్(మమ్ముట్టి) తన కొడుకు జగన్(జీవా)ని 2009 ఎన్నికల్లో కడప ఎంపీగా నిలబెడతాడు. తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతాడు. వైఎస్సార్ అకస్మిక మరణంతో జగన్ ఓదార్పు యాత్రను చేపడతాడు. అధికార పార్టీ ఆదేశాలను దిక్కరించి ప్రజల్లోకి వెళ్తాడు. యాత్ర చేపట్టిన జగన్‌కు అధికార పార్టీ నుంచి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? ఎలాంటి పరిస్థితుల్లో జగన్ పార్టీ పెట్టాల్సి వచ్చింది? అరెస్టు తర్వాత జగన్ జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదిరించి జగన్ సీఎం అయ్యారు? అన్నది మిగిలిన కథ.
ఎవరెలా చేశారంటే
వైఎస్సార్‌గా మమ్ముటి (Mammootty) తొలి 10 నిమిషాలే కనిపించినా తన మార్క్ నటనతో మెప్పించారు. ఇక వైఎస్ జగన్ పాత్రలో నటుడు జీవా (Jeeva) పరకాయ ప్రవేశం చేశారు. జగన్ హావభావాలు, రోల్‌కు సంబంధించిన యాటిట్యూడ్‌ను జీవా పక్కాగా దించేశాడనే చెప్పాలి. ఎలాంటి తడబాటు, సందేహాలు లేకుండా జీవా తనకు లభించిన పాత్రలో దూరిపోయాడు. ఇక వైఎస్సార్ భార్య విజయమ్మ పాత్రలో ఆశ్రిత వేముగంటి అదరగొట్టారు. చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్, సోనియాగాంధీ పాత్రలో సుజన్నే బెర్నార్ట్, వైఎస్ భారతి పాత్రలో కేతకి నారాయణ్.. మిగిలిన నటీనటులు కూడా ఆకట్టుకున్నారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
‘యాత్ర’ సినిమాతో అందర్నీ మెప్పించిన దర్శకుడు మహి రాఘవ్.. ‘యాత్ర 2’ లోనూ తన మార్క్ చూపించారు. పొలిటికల్ బయోపిక్ అయినా ఎమోషనల్‌గా కథను నడిపి మరోమారు సక్సెస్ అయ్యారు. 2009-2019 మధ్య జరిగిన ముఖ్య రాజకీయ ఘట్టాలను తీసుకొని జగన్‌కు ఎలివేషన్స్ ఇస్తూ కథ నడిపించారు. ఫస్టాఫ్‌లో తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయి. అయితే సెకండాఫ్‌లో రెగ్యులర్ పొలిటికల్ స్టఫ్ ఉండటంతో రొటీన్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ వస్తుంది. వైఎస్సార్, జగన్‌కు సంబంధించిన కొన్ని ఒరిజినల్ విజువల్స్ సినిమాలో వాడటం ప్లస్ అయ్యింది. గత కొన్ని సంవత్సరాలుగా మీడియాను, జగన్‌ను ఫాలో అయిన వారికి ఈ సినిమా అంత ఎక్సైటింగ్ అనిపించదు. అలాగే కొన్ని సీన్లు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తాయి.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. మధీ అందించిన సినిమాటోగ్రఫీ మెప్పిస్తుంది. అలాగే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయింది. ఎమోషనల్ సీన్స్‌లో, జగన్ పాత్రకి ఎలివేషన్స్ సమయంలో సంతోష్ నారాయణ్ ఇచ్చిన BGM హైలెట్‌గా నిలుస్తుంది. శ్రవణ్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
జీవా నటనభావోద్వేగ సన్నివేశాలునేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 3/5
CLICK HERE FOR ENGLISH REVIEW
ఫిబ్రవరి 08 , 2024
Tollywood Political Movies: తెలుగు రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన చిత్రాలు ఇవే!
సినిమాలు కేవలం వినోద మాద్యమం మాత్రమే కాదు. అవి వినోదాన్ని పంచడంతో పాటు సమాజంలోని స్థితిగతులను కూడా ప్రతిబింబిస్తాయి. తద్వారా ప్రజల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్‌లో గత కొంత కాలంగా పొలిటికల్ చిత్రాల హవా పెరిగింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల వేళ ప్రజల రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే విధంగా ఆ చిత్రాలు విడుదలవుతున్నాయి. టాలీవుడ్‌లో 2019 నుంచి ఈ పొలిటికల్ చిత్రాల ఒరవడి మెుదలవ్వగా.. 2024లోనూ అది కొనసాగుతూ వచ్చింది. ఆయా చిత్రాల విడుదల సందర్భంగా మెుదలయ్యే రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఇదిలా ఉంటే మరికొన్ని సినిమాలు ఆదర్శనీయమైన రాజకీయ కథాంశాలతో వచ్చి సూపర్ హిట్‌గా నిలిచాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
యాత్ర (Yatra)
దివంగత ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం 'యాత్ర' (Yatra). మహి వి. రాఘవ్ దర్శకత్వం వహిచారు. వైఎస్‌ఆర్ పాదయాత్ర చేయడానికి గల కారణాలు? చంద్రబాబు 9ఏళ్ల పాలనను కాదని ప్రజలు వైఎస్‌ఆర్‌కు ఎందుకు పట్టం కట్టారు? అన్నది చూపించారు. 2019 ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ అప్పటి తెలుగు దేశం పార్టీని గద్దె దిగడానికి ఒకింత సాయం చేసిందనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపించింది.
ఎన్.టి.ఆర్. మహానాయకుడు (NTR Mahanayakudu)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్.టి.రామారావు.. రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను పోషించారు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నటి విద్యా బాలన్.. ఎన్టీఆర్ భార్య బసవ తారకం పాత్రలో కనిపించింది. ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నాదెండ్ల భాస్కరరావు.. కేంద్రంలోని కాంగ్రెస్ సాయంతో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఇందులో చూపించారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ బలంగా ప్రజల్లోకి, దేశవ్యాప్తంగా ఉన్న విపక్షాల దృష్టికి తీసుకెళ్లి తిరిగి అధికారంలోకి రావడాన్ని దర్శకుడు క్రిష్ తెరపై ఆవిష్కరించారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ (Lakshmi's NTR)
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో జరిగిన సంఘటనలతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరకెక్కించారు. లక్ష్మీ పార్వతి ఆయన జీవితంలోకి ఎలా వచ్చింది? ఆమె రాక తర్వాత ఎన్టీఆర్‌కు కుటుంబసభ్యులు ఎందుకు దూరమయ్యారు? ఎన్టీఆర్‌కు వెన్నుపోటు ఎలా జరిగింది? వంటి అంశాలను దర్శకుడు ఇందులో చూపించారు. ఈ మూవీపై అప్పటి తెలుగు దేశం పార్టీ కక్ష కట్టి విడుదల కాకుండా ఎన్నో ప్రయత్నాలు చేసినా.. చివరకు థియేటర్స్‌లో విడుదలై ఓ మోస్తరు విజయం సాధించింది. ఈ మూవీ అప్పటి ప్రతిపక్ష వైఎస్‌ఆర్సీపీకి అనుకూలంగా ఈ సినిమాను తెరకెక్కించినట్టు వర్మ తెలిపారు.
అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు (Amma Rajyamlo Kadapa Biddalu)
2019 డిసెంబర్‌లో వచ్చిన 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు' సినిమాను కూడా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఏపీ రాజకీయాలను ఆధారంగా తీసుకొని రూపొందించాడు. సీఎం జగన్ అధికారం చేపట్టాక మాజీ సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేష్ మనోవేదనకు గురై ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఎలాంటి పన్నాగాలు చేశారు అన్న కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తీశారు. ఈ సినిమా విడుదలకు ముందు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారింది.
జై బోలో తెలంగాణ (Jai Bholo Telangana)
తెలంగాణ ఉద్యమాన్ని ఆధారంగా చేసుకొని ఈ సినిమా (Jai Bolo Telangana) తెరకెక్కింది. ప్రత్యేక తెలంగాణ కోసం తరతరాలుగా ప్రాణాలర్పిస్తూ వస్తున్న ఓ కుటుంబం చుట్టూ కథ సాగుతుంది. ముఖ్యంగా ఉద్యమం సమయంలో జరిగిన కొన్ని యథార్థ సంఘటనలను ఈ సినిమాలో చూపించడంతో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఎన్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో జగపతి బాబు, స్మృతి ఇరానీ, సందీప్, మీరానందన్ ప్రధాన పాత్రలు పోషించారు.
యాత్ర 2 (Yatra 2)
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెమీ బయోపిక్‌గా ‘యాత్ర 2’ తెరకెక్కింది. వైఎస్ఆర్ మరణానంతరం ప్రజల భావోద్వేగాలు ఎలా ఉన్నాయి.. తన తండ్రి బాటలో నడవాలని జగన్ ఎందుకు నిర్ణయించుకున్నాడు.. ఆ లక్ష్యం కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు అన్నది ఈ సినిమాలో చూపించారు. మహి వి. రాఘవ్ దర్శకత్వంలో ‘యాత్ర’ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.
వ్యూహాం (Vyuham)
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. ఈ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. వైఎస్‌ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యే వరకు చోటుచేసుకున్న సంఘటనల సమాహారంగా దీన్ని తెరకెక్కించారు. ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్.. జగన్‌ను ఎలాంటి ఇబ్బందులు పెట్టారు? వాటిని జగన్ ఎలా ఎదుర్కొన్నాడు? అన్నది రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో ఇందులో చూపించాడు.
శపథం (Sapadam)
'వ్యూహం' సినిమాకు కొనసాగింపుగా 'శపథం' మూవీని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక జరిగిన పరిస్థితులను ఈ సినిమాలో తెరకెక్కించారు. జగన్ చేపట్టిన ప్రజా సంక్షేమాలను ఆపడానికి విపక్ష నేత చంద్రబాబు చేసిన కుట్రలు ఏంటి? ఓటమి తర్వాత పవన్ పరిస్థితి ఎలా ఉంది? అన్నది దర్శకుడు ఇందులో చూపించాడు.
రజాకార్ (Razakar)
సెప్టెంబర్ 17, 1948కి ముందు హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం అణచివేత పాలనకు, రజాకార్ల అరాచకాల మధ్య ప్రజలు ఎలాంటి కష్టాలు అనుభవించారు. వారి అన్యాయాలకు వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారు అన్న దానిని కథాంశంగా చేసుకొని దర్శకుడు యాట సత్యనారాయణ ఈ సినిమాను రూపొందించారు.
రాజధాని ఫైల్స్ (Rajadhani Files)
గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని 29 గ్రామాల రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఆధారంగా ఈ సినిమా రూపొందింది. భాను శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంల అఖిలన్ పుష్పరాజ్, విశాల్ పతి, వినోద్ కుమార్, వాణీ విశ్వనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఏపీ సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని నిర్మించడం గమనార్హం.
లీడర్ (Leader)
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘లీడర్’ చిత్రం.. బ్లాక్‌బాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాతోనే హీరో రానా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తండ్రి మరణించడంతో స్వార్థపరుడైన వ్యక్తికి అధికారం కట్టబెట్టడం ఇష్టం లేని అర్జున్ (రానా) సీఎం అవుతాడు. అతడు సమాజంలోని అవినీతి, కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఎలాంటి పోరాటం చేశాడన్నది సినిమా. మిక్కీ జే మేయర్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది.
భరత్ అనే నేను (Bharath Ane Nenu)
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ కూడా మంచి విజయాన్ని సాధించింది. సీఎం అయిన తండ్రి చనిపోవడంతో భరత్ (మహేష్) ఆ పదవిలోకి వస్తాడు. బాధ్యతగా ప్రజలకు మంచి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో అతడికి ఎదురైన సమస్యలు ఏంటి? సొంత పార్టీ నేతలు చేస్తున్న కుట్రలకు ఎలా చెక్ పెట్టాడు? అన్న కోణంలో ఈ సినిమా తెరకెక్కింది.
నోటా (Nota)
యంగ్ హీరో విజయ్ దేవరకొండ చేసిన తొలి పొలిటికల్ చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఇందులో ఓ రాష్ట్ర సీఎం కొడుకు అయిన వరుణ్ (విజయ్).. తండ్రి కేసులో ఇరుక్కోవడంతో పదవిలోకి వస్తాడు. ఆ తర్వాత సమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాడు? తప్పుచేసిన తండ్రిని సైతం ఎలా శిక్షించాడు? అన్న కోణంలో సినిమా రూపొందింది. ఇందులో విజయ్‌కు జోడీగా మెహ్రీన్ చేసింది.
మార్చి 13 , 2024
This Week Movies: ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లోకి స్టార్ హీరోల చిత్రాలు.. ఓ లుక్కేయండి!
సంక్రాంతి తర్వాత గతవారం చిన్న సినిమాలు సందడి చేయగా.. ఈ వీక్ (This Week Movies) పెద్ద చిత్రాలే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. వాస్తవానికి ఆయా చిత్రాలు సంక్రాంతికే విడుదల కావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. మరోవైపు సంక్రాంతికి రిలీజైన రెండు పెద్ద సినిమాలు సైతం ఈ వారమే ఓటీటీలోకి (This Week OTT Releases) రాబోతున్నాయి. వాటితో పాటు మరిన్ని సిరీస్‌లు మిమ్మల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. వాటికి సంబంధించిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
ఈగల్
రవితేజ (Raviteja) కథానాయకుడిగా (This Week Movies) కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ (Eagle). సంక్రాంతి బరిలో నిలిచిన ఈ మూవీ చివరి నిమిషంలో వెనక్కి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్, కావ్య థాపర్ కథానాయికలు నటించారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాదేవ్ సంగీతం అందిస్తున్నారు. స్టైలిష్‌గా సాగే ఓ మంచి మాస్ యాక్షన్ మూవీగా ‘ఈగల్’ అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.
లాల్ సలామ్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘లాల్ సలామ్’ (Lal Salaam) చిత్రం కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. ఫిబ్రవరి 9వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రజనీ కుమార్తె ఐశ్వర్య తెరకెక్కించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ ఓ ప్రత్యేక పాత్ర పోషించారు. క్రికెట్ ఆట చుట్టూ అల్లుకున్న ఓ యాక్షన్ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. రజనీ ఇందులో మొయిద్దీన్ భాయ్ పాత్రలో అలరించనున్నారు.
యాత్ర-2
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర రెడ్డి పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన చిత్రం 'యాత్ర' (Yatra). ఈ సినిమాకు సీక్వెల్‌గా 'యాత్ర 2' (Yatra 2) ఫిబ్రవరి 8న రిలీజ్ కానుంది. వైఎస్సార్ తనయుడు, ఏపీ సీఎం జగన్ ప్రజానాయకుడిగా ఎదిగిన తీరు, 2009-2019 మధ్య ఏపీలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 'యాత్ర 2' సాగుతుంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ మహీ వి. రాఘవ్ తెరకెక్కించారు. ఇందులో వైఎస్సార్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో జీవా నటించారు.
ట్రూ లవర్
మణికందన్, శ్రీ గౌరి ప్రియ, కన్న రవి (This Week OTT Releases) కీలక పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం ‘ట్రూ లవర్’. ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఫిబ్రవరి 10న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమికుల మధ్య మోడరన్ డే రిలేషన్స్ నేపథ్యంలో ట్రూ లవర్ రూపొందించినట్లు చిత్ర బృందం తెలిపింది.
పవన్ మూవీ రీ-రిలీజ్
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan kalyan) హీరోగా పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ మూవీ ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ (Cameraman Gangatho Rambabu). 2012లో వచ్చిన ఈ చిత్రం రీరిలీజ్‌కు (This Week OTT Releases) సిద్ధమైంది. ఫిబ్రవరి 7న ఎంపిక చేసిన థియేటర్‌లలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు
గుంటూరు కారం
మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ డ్రామా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఫిబ్రవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కెప్టెన్ మిల్లర్
తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కెప్టెన్ మిల్లర్’ (Captain Miller). ప్రియాంక మోహన్ కథానాయికగా చేసింది. సందీప్ కిషన్, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. తమిళంలో సంక్రాంతి కానుకగా, తెలుగులో రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 9నుంచి స్ట్రీమింగ్ కానుంది.
బబుల్‌గమ్
సుమ-రాజీవ్ కనకాల తనయుడు రోషన్ (Roshan Kanakala) కథానాయకుడిగా రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రూపొందిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ‘బబుల్‌గమ్’(Bubblegum). మానస చౌదరి (Maanasa Choudhary) కథానాయిక. ఈ చిత్రం కూడా ఈ వారమే ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 9 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
TitleCategoryLanguagePlatformRelease DateOne Day MovieEnglishNetflixFeb 8BhakshakSeriesHindiNetflixFeb 9AryaSeriesHindiDisney+HotstarFeb 9Aqua ManMovieEnglishBook My ShowFeb 5Bubble gumMovieTeluguAhaFeb 9The ExorcistMovieEnglishJio CinemaFeb 6The Nun 2MovieEnglishJio CinemaFeb 7HelloSeriesEnglishJio CinemaFeb 8AyalaanMovieTamilSun NXTFeb 9
ఫిబ్రవరి 05 , 2024
This Week Movies: ఈ వారం విడుదలయ్యే చిత్రాలు / సిరీస్‌లు.. ఓ లుక్కేయండి!
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు విభిన్నమైన చిత్రాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ శుక్రవారం శివరాత్రి పండగను పురస్కరించుకొని థియేటర్లలో సందడి చేయనున్నాయి. అటు థియేటర్లలో, ఇటు ఓటీటీల్లో ఏయే సినిమాలు రానున్నాయో ఈ ప్రత్యేక కథనంలో ద్వారా పరిశీలిద్దాం.
థియేటర్లలో రిలీజయ్యే చిత్రాలు
గామి
విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా రూపొందిన అడ్వెంచర్ డ్రామా ఫిల్మ్ ‘గామి’ (Gaami). విద్యాధర్ కాగిత ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్. ‘మానవ స్పర్శ సమస్యను ఎదుర్కొంటున్న ఓ అఘోర హిమాలయాల్లో చేసే సాహసోపేతమైన ప్రయాణమే ఈ చిత్ర కథాంశం’ అని దర్శకుడు తెలిపారు. విశ్వక్ అఘోరాకు నటించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, ప్రచార చిత్రాలు సినిమాపై భారీగా అంచనాలను పెంచాయి.
భీమా
గోపీచంద్ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ. హర్ష రూపొందించిన ఫాంటసీ యాక్షన్ డ్రామా ఫిల్మ్ ‘భీమా’ (Bhimaa). మాళవికా శర్మ (Malvika Sharma), ప్రియా భవానీ శంకర్ (Priya Bhavani Shankar) కథానాయికలుగా చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కు అధిక ప్రాధాన్యతనిస్తూ రూపొందించిన ఈ సినిమాలో గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. మార్చి 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
షైతాన్
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ నటించిన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘షైతాన్’ (హిందీ) (Shaitaan). వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దేవగణ్‌తో పాటు ఆర్. మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకొస్తుంది.
ప్రేమలు
మలయాళంలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ‘ప్రేమలు’.. ఈ వారం తెలుగులో రిలీజవుతోంది. గిరీశ్ ఎ.డి. దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్ కె. గఫూర్ (Naslen K Gafoor), మ్యాథ్యూ థామస్ (Mathew Thomas), మమితా బైజూ (Mamitha Baiju) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీని ప్రముఖ దర్శకుడు రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ చిత్రం మార్చి 8న రిలీజ్ కానుంది.
రికార్డ్ బ్రేక్
నిహార్, నాగార్జున, రగ్ధా ఇఫ్తాకర్, సత్యకృష్ణ, సంజన, తుమ్మల ప్రసన్నకుమార్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’ (Record Break). ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.
వి లవ్ బ్యాడ్ బాయ్స్
అజయ్, వంశీ ఏకశిరి, ఆదిత్య శశాంక్ నేతి, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘వి లవ్ బ్యాడ్ బాయ్స్’ (We Love Bad Boys). రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మార్చి 8న విడుదల కానుంది.
రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి
రవితేజ నున్న, నేహా జురెల్ జంటగా సత్య రాజ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘రాజు గారి అమ్మాయి - నాయుడు గారి అబ్బాయి’ (Raju Gari Ammayi Naidu Gari Abbayi). హాస్యంతోపాటు ఊహించని మలుపులతో ఈ చిత్రం ఆద్యంతం ఉత్కంఠ రేపుతుందని రవితేజ పేర్కొన్నారు. ఈ సినిమా మార్చి 9న రిలీజ్ కానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/వెబ్ సిరీస్‌లు
హనుమాన్
ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ ‘హనుమాన్’. సంక్రాంతికి రిలీజై సంచలన విజయం సాధించిన ఈ సినిమా.. సుమారు రెండు నెలల తర్వాత అంటే ఈ శుక్రవారం (మార్చి 8) మహా శివరాత్రినాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక జీ5 (Zee 5) ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించిన విషయం తెలిసిందే.
లాల్ సలామ్
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) అతిథిపాత్రలో కనిపించిన ఈ ‘లాల్ సలామ్’ (Lal Salaam) మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఫిబ్రవరి 9న రిలీజైన ఈ మూవీ నెలలోపే నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెడుతోంది. మార్చి 8న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రాబోతోంది.
యాత్ర 2
యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజ్ కాగా.. సరిగ్గా నెల రోజులకు ఓటీటీలోకి వస్తోంది. మాజీ సీఎం వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి సీఎం కుర్చీని ఎక్కిన తీరును ఈ మూవీలో చూపించారు. 2019లో వచ్చిన యాత్రకు ఇది సీక్వెల్. ఈ చిత్రం కూడా మార్చి 8న అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్‌లోకి రానుంది.
వళరి
‘గురు’ ఫేమ్ రితికా సింగ్ (Ritika Singh) కీలక పాత్రలో నటించిన హారర్ మూవీ ‘వళరి’ (Valari). శ్రీరామ్ కీలక పాత్ర పోషించాడు. మ్రితికా సంతోషిణి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్’ (ETV Win)లో మార్చి 6 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateAnweshippin KandethumMovieMalayalam / TeluguNetflixMarch 08The Gentleman MovieEnglishNetflixMarch 07DamselMovieEnglishNetflixMarch 08The Backup PlanMovieEnglishNetflixMarch 08SaaguMovieTeluguAmazon / MX PlayerMarch 08Captain MillerMovieHindiAmazon March 08Show TimeMovieHindiDisney + HotstarMarch 08Maha Rani Season 2Web SeriesTelugu/HindiSony LIVMarch 07
మార్చి 04 , 2024
Telugu Movies 2025: వచ్చే ఏడాది రాబోతున్న మోస్ట్ వాంటెడ్ టాప్-10 చిత్రాలు!
సాధారణంగా ప్రతీ సంవత్సరం కొత్త సినిమాలు రిలీజవుతూనే ఉంటాయి. అయితే 2025 సంవత్సరం మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎంతో ముఖ్యమైనది. వారు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా చిత్రాలు 2025లోనే గ్రాండ్‌గా విడుదల కాబోతున్నాయి. ముఖ్యంగా పది చిత్రాల కోసం సినీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాలకు సంబంధించి ఏ చిన్న అప్‌డేట్ వచ్చిన ట్రెండింగ్ చేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో చేస్తోన్న స్టార్ హీరోలు ఎవరు? ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.
[toc]
రాజాసాబ్ (The Raja Saab)
ప్రభాస్ (Prabhas) సినిమా వస్తుందంటే ఇండియన్ బాక్సాఫీస్ కళకళలాడిపోతుంది. ఈ ఏడాది ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ వచ్చే ఏడాది ‘రాజాసాబ్’ మరోమారు బాక్సాఫీస్‌పై దండ యాత్ర చేయబోతున్నాడు. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. లవర్ బాయ్ మేకోవర్‌తో అదరగొడుతున్నాడు. దీంతో రాజా సాబ్ కోసం ప్రభాస్ ఫ్యాన్ తెగ ఎదురుచూస్తున్నాడు.
ఓజీ (OG)
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ‘ఓజీ’ చిత్రంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. సుజీత్ (Director Sujeeth) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ తొలిసారి గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో పవన్ ఊచకూత చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. దీంతో పవన్ చేతిలో ‘హరిహర వీరమల్లు’, ‘ఉస్తాద్ భగత్’ వంటి ప్రాజెక్ట్స్ ఉన్నప్పటికీ ‘ఓజీ’ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. 2025 సమ్మర్‌లో ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లేదంటే సెప్టెంబర్‌లోనైనా కచ్చితంగా విడుదల చేసే ఛాన్స్ ఉంది.
గేమ్ ఛేంజర్ (Game changer)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. జనవరి 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నారు. ‘RRR’ వంటి బ్లాక్‌బాస్టర్ తర్వాత చరణ్ చేసిన చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో రామ్‌చరణ్ తొలిసారి కలెక్టర్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి లుక్స్‌కు సంబంధించిన ఫొటోలు సైతం ఇటీవల పెద్ద ఎత్తున లీకయ్యాయి. అవినీతిపరులైన రాజకీయ నాయకులపై పోరాటం చేసే ఐఏఎస్ అధికారి పాత్రలో చరణ్ ఎలా నటించాడోనని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
వార్ 2 (War 2)
టాలీవుడ్ అగ్ర కథనాయకుల్లో ఒకరైన జూ.ఎన్టీఆర్ (Jr NTR) ‘వార్ 2’ (War 2) చిత్రంతో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. ఇందులో హృతిక్ రోషన్ (Hrithik Roshan)కు ప్రత్యర్థిగా తారక్ నటిస్తున్నారన్న టాక్ బలంగా ఉంది. దేవర వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత తారక్ స్క్రీన్‌పై కనిపించనున్న చిత్రం కూడా ఇదే కావడంతో ‘వార్ 2’ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తెలుగు ప్రేక్షకుల లాగానే హిందీ ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకోవాలని కోరుకుంటున్నారు. 2025 ఆగస్టు 15న వార్ 2 ప్రేక్షకుల ముందుకు రానుంది.
VD 12
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘VD 12’ తెరకెక్కుతోంది. వరుసగా నాలుగు ఫ్లాప్స్ తర్వాత చేస్తోన్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ప్రాణం పెట్టి చేస్తున్నాడు. ఇందులో రగ్‌డ్ లుక్‌లో కనిపించి మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం విజయ్‌కు కేజీఎఫ్ లాంటి మూవీ అవుతుందని ప్రముఖ నిర్మాత నాగవంశీ వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా హైప్ పెరిగింది. దీంతో ఈ మూవీ కోసం తెలుగు ఆడియన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. 2025 మార్చి 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తండేల్ (Thandel)
నాగచైతన్య (Naga Chaitanya), సాయిపల్లవి (Sai Pallavi) జంటగా నటిస్తున్న ‘తండేల్’ మూవీపై టాలీవుడ్‌లో మంచి హైప్ ఉంది. వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘లవ్ స్టోరీ’ (Love story) మంచి హిట్ కావడంతో పాటు చైతూ మత్సకారుడిగా ఇందులో నటిస్తుండంతో తండేల్‌పై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఎంతో ప్రతీష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
మిరాయ్ (Mirai)
‘హనుమాన్’ (Hanuman) వంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత యంగ్ హీరో తేజ సజ్జ (Teja Sajja) ‘మిరాయ్’ అనే మరో పాన్‌ఇండియా చిత్రంలో నటిస్తున్నాడు. కార్తిక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మంచు మనోజ్ (Manchu Manoj) విలన్‌గా నటిస్తున్నాడు. కెరీర్‌లో తొలిసారి నెగిటివ్ పాత్ర పోషిస్తున్నాడు. దీంతో తేజ సజ్జా - మంచు మనోజ్ మధ్య ఫైట్ ఏ విధంగా ఉంటుందోనని తెలుగు ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం 2024 ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
కుబేరా (Kubera)
క్లాసిక్ సినిమాలకు పెట్టింది పేరైనా దర్శకుడు శేఖర్ కమ్ముల (Sekhar Kammula) 'కుబేర' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో తమిళ నటుడు ధనుష్ (Dhanush)తో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున (Akkineni Nagarjuna) లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఇందులో బిచ్చగాడి పాత్రలో ధనుష్ చేస్తున్నట్లు టాక్. మరోవైపు నాగార్జున పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరి స్టార్ హీరోలను శేఖర్ కమ్ముల ఏ విధంగా చూపిస్తారోనన్న అంచనాలు అందరిలో ఉన్నాయి. ఈ మూవీని వచ్చే ఏడాది పక్కాగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు.
జీ 2 (G2)
అడివి శేష్ (Adivi Sesh) హీరోగా వినయ్ కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'జీ 2'. గతంలో విడుదలై బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన 'గూడాఛారి' (Goodachari) చిత్రానికి సీక్వెల్‌గా ఇది రూపొందుతోంది. పైగా ఇందులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) విలన్‌గా నటిస్తుండటంతో అందరిలోనూ భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. స్పైగా అడివి శేష్ ఈసారి ఎలాంటి సాహసాలు చేస్తాడోనని సినీ లవర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా 2025లో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
NANI 33
‘దసరా’ (Dasara) తో గతేడాది ఘన విజయాన్ని అందుకున్నారు నాని (Nani), దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). వీరిద్దరి కాంబోలో ఇటీవల కొత్త ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆఖరిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందించే ఛాన్స్ ఉంది. దీంతో ‘NANI 33’ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దసరా లాంటి బ్లాక్ బాస్టర్ మరోమారు రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.
అక్టోబర్ 23 , 2024
Pushpa 2: పవన్ సాయంతో చరిత్ర సృష్టించబోతున్న ‘పుష్ప 2’.. ఎలాగంటే?
మెగా, అల్లు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తినట్లు గత కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఏపీ ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఎన్నికల అనంతరం పవన్ భాగస్వామిగా ఉన్న కూటమి పార్టీలు భారీ విజయం సాధించడం, ఉప ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం చేయడం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే ప్రస్తుతం బన్నీ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘పుష్ప 2’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టికెట్ల పెంపు విషయంలో పవన్ ఏ విధంగా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర నిర్మాతలు పవన్ వద్దకు వెళ్లినట్లు సమాచారం. అక్కడ పవన్ స్పందన చూసి అందరూ షాకవుతున్నారు.
పవన్.. గ్రీన్ సిగ్నల్!
అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం డిసెంబర్ 5న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13,500 స్క్రీన్స్‌లో ప్రదర్శితం కానుంది. దేశంలో 8,500, ఓవర్సీస్‌లో 5,000 థియేటర్లలో పుష్ప 2 షోలు పడనున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను నిర్మాతలు నవీన్ యెర్నేని, రవి శంకర్‌లు దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారు. దీంతో టికెట్ల రేట్లు పెంపునకు అనుమతివ్వాలని తాజాగా వారు ఏపీ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేసుకున్నారట. ఈ విషయపై పవన్‌తో నిర్మాతలు చర్చించినట్లు ఏపీ రాజకీయ వర్గాలు తెలిపాయి. టికెట్ల పెంపుపై పవన్ (Pawan Kalyan) సానుకూలంగా స్పందించారని అంటున్నారు. అల్లు వర్సెస్ మెగా అంటూ బయట జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో పవన్ ఎలా రియాక్ట్ అవుతారోనని నిర్మాతలు తెగ ఆందోళన చెందారట. కానీ, పవన్ చాలా కూల్‌గా ఓకె చెప్పడం చూసి వారు ఆశ్చర్యపోయారట. టికెట్ల పెంపునకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం ఏపీ ప్రభుత్వం నుంచి రానున్నట్లు తెలుస్తోంది.
పవన్ సాయం.. రూ.350 కోట్లు పక్కా!
టికెట్ల పెంపు అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని సంప్రదించినట్లే త్వరలోనే తెలంగాణ సర్కార్‌ను కూడా ‘పుష్ప 2’ (Pushpa 2) టీమ్ కలవనుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా టికెట్ల పెంపుపై సానుకూలంగా స్పందించే ఛాన్స్ ఉంది. సగటున టికెట్‌పై రూ.100-125 పెరిగే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం సింగిల్ స్క్రీన్ ధరలు ప్రస్తుతం రూ.175 ఉండగా రూ.300, మల్టీప్లెక్స్‌లలో రూ.275 ఉండగా రూ.425 లేదా అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీనికితోడు 13,500 స్క్రీన్స్‌లో ప్రదర్శితం కానుండటంతో ‘పుష్ప 2’ తొలిరోజే దాదాపుగా రూ.350 కోట్లు కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే కలెక్షన్స్ పరంగా ఇండియాలోనే బిగ్గెస్ట్ డే 1 గ్రాసర్‌గా పుష్ప 2 చరిత్ర సృష్టించనుంది. రూ.223.5 కోట్ల తొలి రోజు కలెక్షన్స్‌తో ప్రస్తుతం RRR టాప్‌లో కొనసాగుతోంది. ‘పుష్ప 2’ తొలిరోజు రూ.350+ కోట్లు కలెక్ట్ చేస్తే టికెట్ల పెంపు ద్వారా పవన్ ఇచ్చిన ప్రోత్సాహం కూడా అందుకు కారణం కానుందని చెప్పవచ్చు.
ట్రైలర్ నేపథ్యంలో మళ్లీ లొల్లి..!
బిహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 (Pushpa 2) ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఈ వేడుకకు ఎవరు ఊహించని స్థాయిలో భారీగా బన్నీ అభిమానులు తరలివచ్చారు. పొరుగు రాష్ట్రంలో బన్నీకి దక్కిన ఈ స్థాయి ఆదరణ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయాన్ని ఆయుధంగా చేసుకొని బన్నీ ఫ్యాన్స్ పవన్‌ను టార్గెట్ చేస్తున్నారు. పవన్‌కు కేవలం ఏపీలో మాత్రమే జనం వస్తారని, కానీ బన్నీకి ఉత్తరాది రాష్ట్రంలోని పాట్నాలో కూడా పోటెత్తారని కామెంట్స్ చేస్తున్నారు. బన్నీకి మద్దతుగా పోస్టులు పెడుతున్న వారిలో వైకాపా అభిమానులు సైతం ఉండటం విశేషం. అల్లు అర్జున్ ముందు పవన్ కల్యాణ్ నథింగ్ అంటూ మెగా ఫ్యాన్స్‌ను రెచ్చగొడుతున్నారు. మరోవైపు పవన్ ఫ్యాన్స్ సైతం గట్టిగా సమాధానం ఇస్తున్నారు. మహాారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్‌కు వచ్చిన ఆదరణ చూడాలని సూచిస్తున్నారు. దేశ ప్రధాని మెచ్చిన గొప్ప వ్యక్తి పవన్ అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
పుష్ప 2 మరో రికార్డు
'పుష్ప 2' (Pushpa 2) చిత్రం రిలీజ్‌కు ముందే పలు రికార్డులను కొల్లగొడుతోంది. తాజాగా ప్రీసేల్ బుకింగ్స్‌లో మరో ఘనత సాధించింది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా ‘పుష్ప2’ (Pushpa 2) వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరింది. అమెరికన్ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్ ద్వారానే వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా ‘పుష్ప2’ నిలిచింది. ఈ విషయాన్ని తెలుపుతూ నిర్మాణ సంస్థ పోస్ట్ పెట్టింది. ‘మరో రోజు.. మరో రికార్డుతో చరిత్ర సృష్టించాడు. బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ హవా కొనసాగుతూనే ఉంటుంది’ అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఇది చూసిన అల్లు ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. పుష్ప గాడి జైత్ర యాత్ర మెుదలైందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
https://twitter.com/PushpaMovie/status/1858759197883834867
నవంబర్ 19 , 2024
Veeranjaneyulu Vihara Yatra Review: ‘వీరాంజనేయులు విహార యాత్ర’లో కొన్ని స్పీడ్ బ్రేకులు.. కానీ!
నటీనటులు: వి.కె.నరేశ్, ప్రియా వడ్లమాని, రాగ్ మయూర్, శ్రీలక్ష్మి, ప్రియదర్శిని, రవితేజ, హర్షవర్ధన్ తదితరులు
రచన, దర్శకత్వం: అనురాగ్ పాలుట్ల
సంగీతం: ఆర్.హెచ్.విక్రమ్
ఛాయాగ్రహణం: సి.అంకుర్
నిర్మాతలు: బి.బాపినీడు, సుధీర్ ఈదర
స్ట్రీమింగ్ వేదిక : ఈటీవీ విన్
విడుదల తేదీ: 14-08-2024
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను తీసుకొచ్చింది. 'వీరాంజనేయులు విహార యాత్ర' (Veeranjaneyulu Vihara Yatra Review) పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. సీనియర్ నటుడు నరేశ్ (Naresh), శ్రీలక్ష్మీ (Srilakshmi), యువ నటులు రాగ్ మయూర్ (Rag Mayoor), ప్రియా వడ్లమాని (Priya Vadlamani) ఈ మూవీలో కీలక పాత్ర పోషించారు. దర్శకుడు అనురాగ్ పాలుట్ల ఈ చిత్రాన్ని మధ్యతరగతి కుటుంబం నేపథ్యంలో రూపొందించారు. మరి ఈ మూవీ ఎలా ఉంది? ఈ వీరాంజనేయులు కథేంటి? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అన్నది స్టోరీ.
కథేంటి
రైల్వే ఉద్యోగి వీరాంజనేయులు (బ్రహ్మానందం) పదవి విరమణ డబ్బుతో 1962లో గోవాలో ఓ ఇంటిని కొనుగోలు చేస్తాడు. వీరాంజనేయులు మరణంతో ఇంటి బాధ్యత కుమారుడు నాగేశ్వరరావు (నరేశ్)పై పడుతుంది. దీంతో వైజాగ్‌లో మ్యాథ్స్ టీచర్‌గా చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తుంటాడు. ఓ కారణం చేత ఉద్యోగం ఊడిపోవడంతో నాగేశ్వరరావు సమస్యల్లో చిక్కుకుంటాడు. మరోవైపు కుమార్తె సరయు (ప్రియా వడ్లమాని)కు ప్రేమించిన కుర్రాడితో పెళ్లి చేయాల్సి వస్తుంది. అదే సమయంలో గోవాలోని ఇంటిని అమ్మితే రూ.60లక్షలు ఇస్తామని ఆఫర్ వస్తుంది. దీంతో నాగేశ్వరరావు ఫ్యామిలీ మెుత్తం గోవాకు బయల్దేరుతుంది. మరి ఈ యాత్ర ఎలా సాగింది? ఈ క్రమంలో ఆ కుటుంబానికి ఎదురైన సవాళ్లు ఏంటి? నాగేశ్వరరావు తనయుడు వీరు (రాగ్ మయూర్)కు, సరయు చేసుకోబోయే కుర్రాడికి ఉన్న గొడవేంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
నాగేశ్వరరావు అనే మధ్యతరగతి తండ్రి పాత్రలో నరేశ్ తనదైన శైలిలో చక్కగా ఒదిగిపోయారు. ఇందులోని పాత్ర అతడి కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగభరిత సన్నివేశాల్లో నరేష్ నటన అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. యున నటుడు రాగ్ మయూర్‌కు నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్రే దక్కింది. సెకండాఫ్‌లో నరేశ్‌తో పోటీ పడి మరి నటించి ఆకట్టుకున్నాడు. నరేశ్ భార్యగా ప్రియదర్శిని పరిధి మేరకు నటించింది. కూతురిగా ప్రియా వడ్లమాని నటన పర్వాలేదు. ఇక రవితేజ, రాకేశ్, హర్షవర్ధన్ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు అనురాగ్ పాలుట్ల రాసుకున్న కథలో కొత్తదనం లేకపోయిన ఎంతో సహజంగా సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేశారు. నాగేశ్వరరావు, అతడి కుటుంబ నేపథ్యం, కొడుకు, కూతురు జీవితాలను ఒక్కొక్కొటిగా ఆసక్తికరంగా చూపించారు. గోవాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో చాలా ఇంట్రస్టింగ్‌గా తెలియజేశారు. ఈ క్రమంలో కథనం నెమ్మదిగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. కథ స్లాగా సాగడంతో పాటు అనవసరమైన సన్నివేశాలను ఇరిక్కించినట్లు అనిపిస్తుంది. గోవా పయనమైనప్పటికీ నుంచి కథనంలో కాస్త వేగం పెరుగుతుంది. నాగేశ్వరావు, ఆయన తల్లి శ్రీలక్ష్మీ మధ్య జరిగే గొడవలు, పిల్లల మధ్య తలెత్తే గిల్లికజ్జాలు కొద్దిసేపు నవ్వులు పూయిస్తాయి. ఇక సెకండాఫ్‌ను భావోద్వేగాలతో నడిపే ప్రయత్నం చేశారు డైరెక్టర్. తల్లి అనారోగ్యం బారిన పడటం, ఇంటి విషయంలో తండ్రి కొడుకుల మధ్య నడిచే సంవాదం భావోద్వేగభరితంగా సాగుతాయి. అయితే క్లైమాక్స్ మాత్రం ఊహాజనితంగానే ఉండటం, డైలాగ్స్ అంతగా ప్రభావం చూపకపోవడం ఈ సినిమాపై ప్రభావం చూపింది.
టెక్నికల్‌గా
సాంకేతిక అంశాల విషయానికి వస్తే విక్రమ్ సంగీతం బాగుంది. భావోద్వేగ సన్నివేశాలను నేపథ్య సంగీతం బాగా ఎలివేట్ చేసింది. అటు అంకుర్ ఛాయాగ్రహణం సినిమాకి అదనపు ఆకర్షణను తీసుకొచ్చింది. ఎడిటర్ సినిమా తొలి భాగంలో తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు కూడా స్టోరీకి అనుగుణంగా ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
నరేశ్, రాగ్ మయూర్ నటనభావోద్వేగాలుసంగీతం
మైనస్ పాయింట్స్
రొటిన్ స్టోరీకొన్ని సాగదీత సీన్స్
Telugu.yousay.tv Rating : 2.5/5
ఆగస్టు 14 , 2024
Pragya Jaiswal: హాట్ థైస్ షోతో చెమటలు పట్టిస్తున్న ప్రగ్యా పాప.. హిట్ లేకున్నా ఆ పనితోనే సంతృప్తి!
హాట్ క్వీన్ ప్రగ్యా జైశ్వాల్ అందాల ఆరబోతతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. లెటెస్ట్‌గా థైస్ షోతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది.
ప్రగ్యా జైస్వాల్ థైస్ షోతో చేసిన లెటెస్ట్ ఫొటో షూట్ నెట్టింట వైరల్‌గా మారాయి. ప్రగ్యా పాపని చూసిన నెటిజన్లు కొంటెగా తమ కామెంట్లకు పనిచెబుతున్నారు.
ప్రగ్యా అందాలు తమకు ఫుల్ కిక్కు ఇస్తున్నాయని కామెంట్ల రూపంలో వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పెట్టిన ఈ ఫొటోలు కుర్రాళ్లలో మంచి జోష్‌ను ఇస్తున్నాయి.
ఫోటోషూట్‌లో పరువాలు ఆరబోస్తూ సోషల్ మీడియాని హీటెక్కించింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పొట్టి దుస్తుల్లో అందాల ప్రదర్శన చేస్తూ సామాజిక మాధ్యమాల్లో తన క్రేజ్‌ను అమాంతం పెంచుకుంటోంది.
అఖండ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నా ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అవకాశాలు మాత్రం దక్కడం లేదు.
తనను తాను నిరూపించుకోవడం కోసం సరైన ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు ఈ కొంటెది పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం విదేశాల్లో తిరుగుతూ వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తోంది. వాటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేస్తూ తృప్తిపడుతోంది.
ప్రగ్యా పర్సనల్ విషయానికొస్తే.. 1991 జనవరి 12న జన్మించింది. తెలుగులో 2015లో క్రిష్ డైరెక్ట్ చేసిన కంచె సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్‌గా పరిచయమైంది.
హిందీలోనూ టిటూ MBA సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ అక్కడా పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో కంచె తర్వాత నక్షత్రం (2017), మంచు విష్ణుతో చేసిన 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలు విజయం సాధించలేకపోయాయి.
చాలా రోజుల తర్వాత అఖండతో రీఎంట్రీ ఇచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. ఈమె కెరీర్‌లో ఎన్ని సినిమాల్లో నటించినా.. బ్లాక్ బాస్టర్ హిట్లు సాధించినా ఈ ముద్దుగుమ్మకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు.
ఆగస్టు 20 , 2023
5 YEARS FOR BHARAT ANU NENU: వెండితెరపై CMలుగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన టాలీవుడ్ హీరోలు
సినీ హీరోలు రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తున్నారంటే జనాలకు ఎక్కువ ఆసక్తి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులను ప్రతిబింబించేలా చెప్పే డైలాగులు, సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మహేశ్ బాబు లాంటి స్టార్ హీరో ముఖ్యమంత్రి పాత్రలో మెప్పించిన చిత్రం భరత్ అనే నేను. ఈ సినిమా వచ్చి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ క్రమంలో వెండితెరపై ఏ హీరోలు ముఖ్యమంత్రి రోల్స్ చేశారో ఓ సారీ చూద్దాం.
ఒకే ఒక్కడు
దర్శకుడు శంకర్, అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు. ఇందులో హీరో అనుకోకుండా ఒక్క రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తాడు. ఉన్న సమయంలోనే ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజలను మెప్పిస్తాడు. ఈ కోణంలో తెరకెక్కించిన సినిమా అప్పట్లో సంచలన సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడంతో పాటు 100 రోజులు ఆడింది సినిమా. ఈ కథను మెుదట రజినీకాంత్, కమల్ హాసన్‌కు వినిపించినా వాళ్లు బిజీగా ఉండటంతో అర్జున్‌తో తెరకెక్కించినట్లు చెప్పాడు శంకర్.
భరత్ అనే నేను
పక్కా కమర్షియల్ మాస్ రోల్స్ చేసే మహేశ్ బాబు.. భరత్ అనే నేను సినిమాలో ముఖ్యమంత్రిగా నటించి మెప్పించాడు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. నేటికి ఐదేళ్లు పూర్తయ్యింది. ఈ పవర్‌ఫుల్ రోల్‌లో సూపర్ స్టార్ చెప్పిన డైలాగ్స్ బాగా పేలాయి. చాలామందికి స్ఫూర్తి కలిగించాయి. సినిమాను నిర్మించేందుకు రూ. 65 కోట్లు ఖర్చు చేయగా…రూ. 225 కోట్ల వరకు కలెక్షన్లు సాధించింది. ఇందులో I Don't know అనే పాటను బాలీవుడ్ హీరో ఫర్హాన్ అక్తర్ పాడాడు. అంతేకాదు, ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు.
లీడర్
దగ్గుపాటి రానా ఏకంగా మెుదటి సినిమాతోనే ప్రయోగం చేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ చిత్రంలో సీఎం రోల్‌లో మెరిశాడు రానా. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తండ్రి మరణానంతరం సీఎం అయిన కుమారుడు.. అవినీతి నిర్మూలన దిశగా ఎలా అడుగులు వేశాడనే కథతో సినిమా తెరకెక్కించారు. సినిమా కథ దాదాపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్‌కు సంబంధించిలా కనిపిస్తుంది. కానీ, కొద్దిపాటి మార్పులు చేశారని అప్పట్లో టాక్ నడిచింది. రూ. 9 కోట్లతో తెరకెక్కించగా… రూ. 16 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి.
నేనే రాజు నేనే మంత్రి
విలక్షణ చిత్రాల దర్శకుడు తేజ తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో రానా మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపించాడు. వడ్డీ వ్యాపారిగా జీవితం ప్రారంభించి ఎమ్మెల్యేగా ఎదిగి సీఎంలా ఎలా అయ్యాడనే పవర్‌ఫుల్ కథతో సినిమా తీశారు. రూ. 12 కోట్లతో నిర్మించగా.. రూ. 45 కోట్లు వసూళ్లు చేసింది. సినిమా కథను చెప్పేందుకు వెళ్లినప్పుడు జరిగిన ఆసక్తికర విషయాన్ని తేజ పంచుకున్నాడు. కథలో మార్పులు చేయమంటే ఇటే వెళ్లిపోతానని డోర్ దగ్గర నిల్చుని చెప్పినట్లు వెల్లడించాడు.
నోటా
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి ప్రేమకథా చిత్రాల్లో నటించిన విజయ్ దేవరకొండ…కెరీర్ తొలి నాళ్లలోనే ముఖ్యమంత్రి పాత్రలో నటించాడు. నోటా సినిమా ద్వారా సీఎంగా తన నటనను చూపించాడు. అయితే, సినిమా పెద్దగా ఆడలేదు. కానీ, రూ. 12 కోట్లతో నిర్మించామని.. రూ. 25 కోట్లు వసూళ్లు సాధించామని నిర్మాత చెప్పారు. వెట్టాట్టమ్ అనే నవల ఆధారంగా చిత్రాన్ని రూపొందించారు.
కథానాయకుడు
ఎన్టీఆర్ బయోపిక్ ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కథానాయకుడు. ఇందులో బాలకృష్ణ సీఎంగా కనిపించారు. నిజ జీవితంలో నందమూరి తారకరామ రావు ముఖ్యమంత్రి జీవితంలో జరిగిన సంఘటనల్లో అచ్చుగుద్దినట్లుగా నటించారు. కానీ, సినిమాకు ఆశించిన స్థాయిలో ఆదరణ లభించలేదు. రూ.50 కోట్లు పెట్టి తీశారు. రూ. 70. కోట్లు వచ్చాయి. బాలకృష్ణ సహానిర్మాతగా వ్యవహరించారు.
యాత్ర
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన చిత్రం యాత్ర. మళయాలం నటుడు మమ్ముట్టి ఇందులో లీడ్ రోల్ పోషించాడు. వైఎస్ పాదయాత్ర, పథకాల ఆలోచనకు మూలం ఏంటి? సీఎంగా ఎలాంటి పనులు చేశారు? ఇలా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ తీర్చిదిద్దారు. వైఎస్ క్యారెక్టర్‌లో మమ్ముట్టి జీవించారు. ఆయన నటకు మంచి మార్కులు పడ్డాయి. రూ. 12 కోట్లు పెట్టి తీస్తే ఏకంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించింది.
ఏప్రిల్ 20 , 2023
This Week Movies: ఆగస్టు 15 సందర్భంగా ఓటీటీలోకి మోస్ట్ వాంటెడ్ చిత్రాలు
పంద్రాగస్టు సందర్భంగా ఈ వారం థియేటర్లలో పెద్ద ఎత్తున సందడి నెలకొననుంది. భారీ చిత్రాలతో థియేటర్స్ కళకళలాడేందుకు సిద్ధమవుతున్నాయి. రవితేజ, రామ్ పోతినేని, విక్రమ్ వంటి స్టార్ హీరోల చిత్రాలు ఈ వారం విడుదల కాబోతున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, సిరీస్‌లు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.
థియేటర్లో విడుదలయ్యే చిత్రాలు
మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan)
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. బాలీవుడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న (Mr. Bachchan Release Date) థియేటర్స్‌లో సందడి చేయనుంది. రవితేజ ఇందులో ఐటీ అధికారిగా కనిపించనున్నారు. ఆయన ఎనర్జీ యాక్టింగ్, భాగ్యశ్రీ అందాలు, హరీశ్ శంకర్ టేకింగ్ ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తాయని చిత్ర బృందం తెలిపింది.
డబుల్ ఇస్మార్ట్ (Double iSmart)
హీరో రామ్ పోతినేని, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రం ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. బ్లాక్ బాస్టర్ చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్‌గా దీన్ని నిర్మించారు. కావ్య థాపర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు 15న (Double Ismart Release Date) థియేటర్స్‌లో సందడి చేయడానికి ఈ మూవీ సిద్ధమైంది. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి.
తంగలాన్ (Thangalaan)
తమిళ స్టార్ హీరో విక్రమ్ (Vikram) నటించిన లేటెస్ట్ చిత్రం ‘తంగలాన్’ కూడా ఈ వారమే గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌రాజా నిర్మించారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఈనెల 15న విడుదల కానుంది. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ సినిమాను రూపొందించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఆయ్ (Aay)
ఎన్టీఆర్ బావ మరిది నార్నే నితిన్ నటించిన రెండో చిత్రం ‘ఆయ్’. మ్యాడ్ చిత్రంతో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ యంగ్ హీరో తన సెకండ్ హిట్ కోసం ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అంజి కె.మణిపుత్ర దర్శకత్వం ‘ఆయ్’ మూవీ ఆగస్టు 15న రిలీజ్ కాబోతోంది. గోదావరి విలేజ్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందించారు. నార్నే నితిన్‌కు జోడీగా నయన్ సారిక నటించింది. ఈ మూవీ తప్పకుండా ఎంటర్‌టైన్ చేస్తుందని చిత్ర బృందం తెలిపింది.
వేదా (Vedaa)
జాన్ అబ్రహం (John Abraham), శార్వరీ వాఘ్, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘వేదా’ (Vedaa). నిఖిల్ అడ్వాణీ దర్శకుడు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ ఆగస్టు 15న హిందీ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘వేదా’ను వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది తెరకెక్కించారు. నేటి సమాజంలో పరిస్థితులను ప్రతిబింబిస్తుందని చిత్ర బృందం తెలిపింది.
ఖేల్ ఖేల్ మే (Khel Khel Mein)
ఏకంగా 26సార్లు రీమేక్ అయి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్న పర్‌ఫెక్ట్ స్ట్రేంజర్స్ (Perfetti Sconosciuti) ఇప్పుడు హిందీలో ‘ఖేల్ ఖేల్ మే’ (khel khel mein)గా రాబోతోంది. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్, తాప్సి, అమ్మీ వ్రిక్, వాణీకపూర్, ఫర్దీన్‌ఖాన్, ఆదిత్య సీల్, ప్రజ్ఞా జైశ్వాల్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ముదస్సర్ అజీజ్ తెరకెక్కిస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
డార్లింగ్
ప్రియదర్శి, నభా నటేష్ నటించిన 'డార్లింగ్' (Darling) ఈ వారం ఓటీటీలోకి రాబోతోంది. థియేటర్లలోకి వచ్చి నెల రోజులు కాకముందే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఆగస్టు 13 నుంచి హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే సమస్యకు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించారు. జులై 19న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ పెద్దగా సక్సెస్ కాలేదు.
వీరాంజనేయులు విహార యాత్ర (Veeranjaneyulu Vihara Yatra)
ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ వారం మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రాబోతోంది. 'వీరాంజనేయులు విహార యాత్ర' పేరుతో ఆగస్టు 14 నుంచి కొత్త మూవీని స్ట్రీమింగ్ చేయబోతోంది. సీనియర్ నటుడు నరేశ్, శ్రీలక్ష్మీ, యువ నటులు రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని ఈ సిరీస్‌లో కీలక పాత్ర పోషించారు. టైటిల్‌ని బట్టి విహార యాత్ర నేపథ్యంలో ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.
మనోరథంగల్ (Manorathangal)
కమల్‌హాసన్, మోహన్‌లాల్, మమ్ముట్టి, ఫహాద్ ఫాజిల్ వంటి ప్రముఖ సౌత్ ఇండియన్ స్టార్స్ నటించిన లేటెస్ట్ సిరీస్ ‘మనోరథంగల్’. తొమ్మిది కథలతో, ఎనిమిది మంది దర్శకులు తీర్చిదిద్దిన ఈ సిరీస్‌ను ఆగస్టు 15న ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జీ 5 వేదికగా తెలుగు, హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ రచయిత, దర్శకుడు ఎమ్.టి వాసుదేవన్ రాసిన కథల ఆధారంగా ఈ ఆంథాలజీ సిరీస్‌ను రూపొందించారు.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
TitleCategoryLanguagePlatformRelease DateDaughtersMovieEnglishNetflixAugust 14Worst Ex EverSeriesEnglishNetflixAugust 14Emily In ParisSeriesEnglishNetflixAugust 14The UnionMovieEnglishNetflixAugust 16Love Nexts DoorMovieKorean/EnglishNetflixAugust 17DarlingMovieTeluguHotstarAugust 13The TyrantMovieKorean/EnglishHotstarAugust 14Nam Namak NishanMovieHindiAmazon August 14JackpotMovieEnglishAmazon August 15ChanakSeriesHindiSonyLIVAugust 16ManorathangalSeriesTelugu DubZee 5August 15Sekhar HomeMovieHindiJio CinemaAugust 14
ఆగస్టు 12 , 2024
అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్‌గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?
డిజిటల్ విప్లవంలో భాగంగా వచ్చిన కీలక మార్పు ఓవర్ ది టాప్(OTT). ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, టీవీల్లోనే ప్రసారమయ్యేవి. కానీ, OTT వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం ఊపందుకుంది. అయితే, ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చ ఊపందుకుంది.
ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ, విస్తృతంగా ప్రజలకు చేరువయ్యింది మాత్రం కరోనా కాలంలోనే. థియేటర్లు మూత పడటంతో సినీ ప్రేక్షకులకు వినోదం దూరమైంది. దీంతో ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీవీల్లో, ఫోన్లలో సినిమాలు, సిరీస్‌లు చూడటానికి చాలామంది అలవాటు పడ్డారు. ఒక్కసారిగా యూజర్ బేస్ పెరిగిపోవడంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలు ప్రేక్షకుడిని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. అయితే, ఈ మార్కెట్ బిజినెస్ పెంచుకునే క్రమంలో కంటెంట్ పరంగా కొన్ని సంస్థలు దిగజారాయి. యూజర్లను త్వరగా అట్రాక్ట్ చేయడానికి బూతు పదాలు, బోల్డ్ సన్నివేశాలను ఎంకరేజ్ చేశాయి.
ఓటీటీలో ప్రసారమయ్యే కంటెంట్‌కు సెన్సార్‌షిప్ లేదు. దీంతో విచ్చలవిడి తనం పెరిగిపోయింది. ఫిల్మ్ మేకర్స్‌కి పూర్తిగా రెక్కలొచ్చాయి. జనాలు ఆదరిస్తుండటం వీరికి మరింత ఉత్సాహాన్నిచ్చింది. నటీనటులు కూడా ఇందుకు తగ్గట్టు నడుచుకోవాల్సి వచ్చింది. చిలికి చిలికి గాలివాన అయినట్లు క్రమంగా అసభ్యకర సన్నివేశాలు, బూతులు, అశ్లీలత, హింస తీవ్రత పెరిగిపోయింది. బహిరంగ ప్రదేశాల్లో ఉపయోగించని పదజాలాన్ని వాడేలా వ్యూయర్స్‌పై ఓటీటీ సిరీస్‌లు తీవ్ర ప్రభావం చూపాయి. తాజాగా వచ్చిన ‘రానానాయుడు’ ఇందుకు ఉదాహరణ అని పలువురు చెబుతున్నారు.
ఈ సిరీస్‌పై ఒకప్పటి స్టార్ హీరోయిన్, బీజేపీ నేత విజయశాంతి కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు.
సెన్సార్‌షిప్ ఎందుకు లేదు?
ఓటీటీలకు సెన్సార్‌షిప్ ఇవ్వడం ఒకరకంగా కాస్త కష్టతరమే. ఇదే విషయమై గతేడాది సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండాలనేది పిటిషన్ సారాంశం. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం సాధ్యాసాధ్యాలను వెల్లడించింది. వెబ్‌సిరీస్‌లు ఎక్కువ డ్యురేషన్ ఉండటం సమస్యకు ప్రధాన కారణమని కోర్టు అభిప్రాయపడింది. అన్ని గంటల సేపు కూర్చుని ఓ వెబ్‌సిరీస్‌ని సెన్సార్ చేయడం కాస్త ఇబ్బందికరమేనని తేల్చిచెప్పింది. పైగా, ఒక్కో దేశంలో ఒక్కో సెన్సార్‌షిప్ నిబంధనలు ఉంటాయని గుర్తు చేసింది. ఓటీటీ పరిధి ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది గనుక సెటాఫ్ రూల్స్‌ని డిజైన్ చేయలేమని తెలిపింది.
సెన్సార్ ఇస్తే ప్రయోజనకరమేనా?
రెచ్చగొట్టే ప్రసంగాలకు ప్రజలు సులువుగా ఆకర్షితులవుతారు. పైగా ఓటీటీ అందరికీ అందుబాటులో ఉండటం కారణంగా ఇలాంటి కంటెంట్‌కి తర్వగా అట్రాక్ట్ అవుతారు. ఫలితంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయో ఊహించలేం. అందుకే సెన్సార్ ఇవ్వడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. విద్వేశ పూరిత ప్రసంగాలకు అడ్డుకట్ట వేయొచ్చు. దేశ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించే కంటెంట్‌ని నివారించవచ్చు. ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్ షిప్ ఇవ్వడం వల్ల హానికర కంటెంట్ నుంచి చిన్నపిల్లలను దూరంగా ఉంచవచ్చు.
ఎందుకు వద్దంటున్నారు?
ఓటీటీ కంటెంట్‌కి సెన్సార్‌షిప్ ఉండకకూదనే వాదన ఉంది. కొన్ని విషయాలపై ప్రజలకు సినిమాల ద్వారా పూర్తిగా అవగాహన కల్పించలేకపోవచ్చు. మరికొన్నింటిని విడమరచి చెప్పాల్సిన అవసరం ఉండవచ్చు. అలాంటి వాటికి విఘాతం కలిగే అవకాశం ఉందనేది ప్రధాన వాదన. అలాగే ఫిల్మ్ మేకర్ల క్రియేటివిటీని అణచివేసే ముప్పు ఉందని కొందరు ఆరోపిస్తున్నారు. సెన్సార్ ఇస్తే విభిన్నంగా సిరీస్‌లు తీసే ఫిల్మ్ మేకర్లను ఆలోచనలో పడేలా చేస్తుందని చెబుతున్నారు.
మంచి కన్నా చెడు ఎక్కువ..!
ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌తో ప్రేక్షకుడికి మంచి కన్నా ఎక్కువగా చెడు జరుగుతుందని పలువురు వాదిస్తున్నారు. బూతు పదాలకు ప్రభావితమై వాటినే ప్రేక్షకులు ఉచ్చరిస్తున్నారని అంటున్నారు. ఫలితంగా ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెబుతున్నారు. ఇదే విషయమై బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, అలనాటి నటి విజయశాంతి ఇటీవల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓటీటీ కంటెంట్‌కు సెన్సార్‌షిప్ ఉండాలనేది వారి వాదన.
ఈ ప్లాట్‌ఫాంలలో అధికంగా..
కొన్ని ఓటీటీ ప్లాట్‌ఫాంలో అడల్ట్ కంటెంట్‌కి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. ఆల్ట్ బాలాజీ, ఉల్లు యాప్, గప్‌చుప్, ఫనియో మూవీస్, హాట్‌షాట్, 8షాట్స్, ఫిజ్ మూవీస్ తదితర యాప్‌లు అడల్ట్ కంటెంట్‌ని పెద్దఎత్తున ప్రసారం చేస్తున్నాయి.
టాప్ అడల్ట్ ఓటీటీ సిరీస్‌లు(ఇండియా)..
క్లాస్ ఆఫ్ 2020
విద్యార్థుల చుట్టూ తిరిగే కథ ఇది. స్నేహితులే సరదాగా డ్రగ్స్ తీసుకోవడం, శృంగారం చేసుకోవడం, రిలేషన్‌షిప్ మెయింటేన్ చేయడం చుట్టూ కథ తిరుగుతుంది. మొత్తం 32 ఎపిసోడ్‌లు ఉంటుంది.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్
జీవితంలో నిలబడటానికి నలుగురు అమ్మాయిలు ఏం చేయాల్సి వచ్చిందనేది సిరీస్ సారాంశం. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అయింది.
మేడ్ ఇన్ హెవెన్
నేటి సమాజంలో పెళ్లిళ్లు జరుగుతున్న తీరు గురించి ఉంటుందీ వెబ్‌సిరీస్. 2019లో రిలీజైంది.
గందీబాత్
అడల్ట్ సిరీస్‌లలో దేశంలోనే గందీబాత్ ఫేమస్. చాలా బోల్డ్ సీన్లు ఇందులో ఉన్నాయి. ఐఎండీబీ రేటింగ్ కూడా నాసిరకంగా ఉంది.
మాయా: స్లేవ్స్ ఆఫ్ హర్ డిజైర్
మీరు కాస్త బలహీనులైతే ఈ సిరీస్ అస్సలు చూడొద్దు. గతం మర్చిపోయిన ఓ మహిళను తిరిగి మామూలు మనిషిని చేయడానికి సెక్స్‌ని ఓ కారకంగా చూపెడతారు.దీనికి ఐఎండీబీ రేటింగ్ 5.5 ఇచ్చింది.
వర్జిన్ భాస్కర్
రచయిత అయిన ఓ వ్యక్తి, అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథే ఇది. ఏక్తాకపూర్, శోభాకపూర్ నిర్మించారు.
ఆశ్రమ్
ఆశ్రమాల్లో జరిగే వాటి గురించి ఆశ్రమ్ సిరీస్ తెలుపుతుంది. ఆశ్రమాల పేరిట జరిగే కార్యకలపాల గురించి చెబుతుంది.
రాత్రి కీ యాత్రి
2021లో ఈ సిరీస్ విడుదలైంది. రెడ్ లైట్ ఏరియా గురించి ఈ సిరీస్ వివరిస్తుంది.
మీర్జాపూర్
అమెజాన్ ప్రైమ్‌లో అప్పట్లో సంచలనంగా మారిందీ వెబ్‌సిరీస్. క్రైం, అశ్లీలం ఇందులో అధికంగా ఉంటుంది.
రానానాయుడు
ఇటీవల విడుదలైన ఈ సిరీస్‌లో అశ్లీలత అధికంగా ఉంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథ గురించి తెలుపుతుంది. వీటితో పాటు తదితర సిరీస్‌లు అధికంగా అశ్లీలత, బూతు కంటెంట్‌ని కలిగి ఉన్నాయి.
ఏప్రిల్ 08 , 2023
Kissik Song: ‘ఊ అంటావా’ సాంగ్‌ను బీట్ చేయనున్న ‘పుష్ప 2’లోని ‘కిస్సిక్’ సాంగ్?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2)పై దేశవ్యాప్తంగా బజ్ ఉంది. డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) కిస్సిక్ అనే (Kissik Song) ఐటెం సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని మేకర్స్ స్పెషల్ పోస్టర్ వేసి మరి తెలియజేశారు. అంతకుముందు సెట్‌లో శ్రీలీల, బన్నీ డ్యాన్స్‌కు సంబంధించి ఓ ఫోటో సైతం లీకయ్యింది. దీంతో ఈ సాంగ్ ఏ రేంజ్‌లో ఉంటుందోనని అభిమానుల్లో భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఇదిలా ఉంటే ‘పుష్ప 2’ రిలీజ్‌కు రెండు వారాల సమయమే ఉండటంతో మూవీ టీమ్ వరుసగా అప్‌డేట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే శ్రీలీల చేసిన ఐటెం సాంగ్‌కు సంబంధించి అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.
ఆ రోజు మోతమోగాల్సిందే!
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘పుష్ప 2’ యావత్ సినీ లోకం ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే పుష్ప 2 టీమ్ క్రేజీ అప్‌డేట్‌ను ప్రేక్షకులకు ఇచ్చింది. ప్రేక్షకుల్లో ఎంతో హైప్ క్రియేట్ చేసిన ‘కిస్సిక్’ సాంగ్ (Kissick Song)ను నవంబర్ 24న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఆ రోజు సా.7.02 పాట విడుదల కానున్నట్లు స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియజేశారు. ఇక పోస్టర్‌లో బన్నీ, శ్రీలీల లుక్ అదిరిపోయింది. సాంగ్‌లోని ఓ స్టెప్‌ను రిఫరెన్స్‌గా తీసుకొని ఈ పోస్టర్‌ను క్రియేట్ చేశారు. తాజా అప్‌డేట్ చూసి అల్లు అర్జున్ ఫ్యాన్స్‌తో పాటు మ్యూజిక్ లవర్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఈ సాంగ్ పక్కాగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.
https://twitter.com/PushpaMovie/status/1859572237457817685
ఎందుకంత హైప్?
డైరెక్టర్ సుకుమార్ తన ప్రతీ చిత్రంలోనూ ఓ ఐటెం సాంగ్ (Kissik Song) తప్పనిసరిగా ఉంచుతారు. ఫస్ట్ ఫిల్మ్ ‘ఆర్య’ నుంచి ఈ ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. సుకుమార్ ఇప్పటివరకూ 8 చిత్రాలు చేయగా అన్నింట్లోను దుమ్మురేపే ఐటెం సాంగ్స్ ఉన్నాయి. అయితే ‘కిస్సిక్’ పాటకు వస్తున్నంత హైప్ గతంలో ఏ పాటకు రాలేదు. సుకుమార్ గత చిత్రం ‘పుష్ప’లోని ‘ఊ అంటావా ఊఊ అంటావా’కు సైతం రిలీజ్‌కు ముందు ఇంత బజ్ క్రియేట్ కాలేదు. అయితే ‘కిస్సిక్’కు మాత్రమే ఈ స్థాయి హైప్ ఏర్పడటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ‘పుష్ప’కి మించి ‘పుష్ప 2’ ఉంటుందని చిత్ర బృందం ముందు నుంచి చెబుతూ వస్తోంది. దీంతో ఇండియాను షేక్ చేసిన ‘ఊ ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ కంటే ‘కిస్సిక్’ ఇంకా అదిరిపోతుందని ఆడియన్స్ ఓ అభిప్రాయానికి వచ్చేశారు. దానికి తోడు డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల సాంగ్‌లో చేస్తుండటం, సమంత కంటే బెటర్ డ్యాన్సర్ కావడం, బన్నీ కూడా స్టెప్పులు ఇరగదీస్తాడని పేరుండటంతో ఈ సాంగ్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
శ్రీలీల దెబ్బకు ఫ్లోర్లు అదరాల్సిందే!
‘పుష్ప 2’ ఐటెం సాంగ్ ఎలా ఉన్నా శ్రీలీల డ్యాన్స్ మాత్రం అదిరిపోతుందని చెప్పవచ్చు. ప్రస్తుత తరం కథానాయికల్లో డ్యాన్స్‌లో శ్రీలీలను కొట్టేవారే లేరనడంతో అతిశయోక్తి లేదు. ఈ భామ తన నటన కంటే డ్యాన్స్ పరంగానే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుంది. రవితేజ 'ధమాకా' చిత్రంలో పల్సర్ బైక్ సాంగ్‌లో ఈ అమ్మడు ఏవిధంగా అదరగొట్టిందో అందరికీ తెలిసిందే. రీసెంట్‌గా మహేష్ బాబుతో 'కుర్చీని మడతపెట్టి' సాంగ్‌లో ఏకంగా తన స్టెప్పులతో విధ్వంసం సృష్టించింది. శ్రీలీలతో డ్యాన్స్ అంటే హేమా హేమీ డ్యాన్సర్లు సైతం కాస్త వెనక్కి తగ్గుతుంటారు. అటువంటి శ్రీలీలతో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచే బన్నీ జతకలిస్తే ఇక ఐటెం సాంగ్ ఏ స్థాయిలో ఉంటుందో అభిమానుల ఊహకే వదిలేయవచ్చు.
https://twitter.com/CeleBeautyHQ/status/1858330541592088786
ఏరికోరి సెలెక్ట్ చేసిన బన్నీ!
‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్ (Kissik Song)కు శ్రీలీలను ఎంచుకోవాలన్నది డైరెక్టర్ సుకుమార్ ఆలోచన కాదట. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్వయంగా శ్రీలీలను సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. బన్నీ ఇంతకుముందే శ్రీలీలతో కలిసి ప్రముఖ ఓటీటీ ‘ఆహా’ కోసం ఒక యాడ్ చేశాడు. వీరిద్దరి కెమెస్ట్రీ బాగుందంటూ అప్పట్లోనే సోషల్ మీడియాలో కామెంట్స్ వచ్చాయి. మరోవైపు ఈ జనరేషన్ హీరోయిన్లలో శ్రీలీల బెస్ట్ డ్యాన్సర్ కీర్తింప బడుతోంది. ఈ నేపథ్యంలో బన్నీ-శ్రీలీల ఒకే వేదికపై ఆడి పాడితే ఆడియన్స్‌లో పూనకాలు రావడం పక్కా. ఇవన్నీ ఆలోచించే శ్రీలీలపై బన్నీ మెుగ్గు చూపినట్లు సమాచారం. అంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ శ్రద్ధా కపూర్, దిశా పటానీ, త్రిప్తి దిమ్రి పేర్లు ఈ ఐటెం సాంగ్ పరిశీలనలోకి వచ్చినట్లు వార్తలు వచ్చాయి.
శ్రీలీల పారితోషికం ఎంతంటే?
అల్లుఅర్జున్ - సుకుమార్ కాంబోలో రూపొందుతున్న ‘పుష్ప 2’ చిత్రం డిసెంబర్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖర్చు విషయంలో ఏమాత్రం వెనకాడకుండా సుకుమార్‌గా తమవంతు తోడ్పాటు అందిస్తున్నారు. ఈ క్రమంలో కిస్సిక్ ఐటెం సాంగ్ (Pushpa 2 Item Song)లో చేసిన హీరోయిన్ శ్రీలీలకు భారీ మెుత్తంలో పారితోషికం ముట్టచెప్పినట్లు నెట్టింట టాక్ వినిపిస్తోంది. ‘కిస్సిక్కి’ అంటూ సాగే ఈ పాట కోసం ఆమె ఏకంగా రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సెట్, హీరోయిన్ పారితోషికం ఇతర మొత్తం కలిపి రూ.5 కోట్లు ఖర్చు అయినట్లు అంచనా వేస్తున్నాయి.
నవంబర్ 21 , 2024
Pushpa 2: మీరు మాత్రం టికెట్లు రేట్లు తగ్గాకే చూడండి.. లేకపోతే చూడొద్దు!
ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ పీవర్ నడుస్తోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రీమియర్స్ మరికొద్ది గంటల్లో థియేటర్లలో పడనున్నాయి. అయితే టికెట్ల ధరలు భారీగా ఉండటంతో సినీ లవర్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టికెట్ రూ.1000 - రూ.3000 వరకూ విక్రయిస్తుండటంపై బన్నీ అభిమానులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావించిన తమను టికెట్ ధరల పెంపు తీవ్ర నిరాశకు గురిచేస్తోందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రగడ నేపథ్యంలో వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) స్పందించారు. సుబ్బారావు ఇడ్లీ స్టోరీ చెప్పి నెట్టింట మరో చర్చకు కారణయ్యాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్యాన్స్ జేబులకు చిల్లులు!
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో రూపొందిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం గురువారం (డిసెంబర్ 5) ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఒక రోజు ముందే అంటే బుధవారం రా.9:30కి స్పెషల్ ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే తెలంగాణలో ఈ ప్రీమియర్స్ టికెట్ ధర సింగిల్ స్క్రీన్‌లో రూ.1,121, మల్టీప్లెక్స్‌లో రూ.1,239 పలుకుతోంది. ఆన్‌లైన్‌లో పెట్టిన టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోవడంతో బ్లాక్‌లో రూ.2000 నుంచి రూ.3000 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సినీ లవర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ స్థాయిలో టికెట్ ధరలు ఉంటే సినిమా ఎలా చూస్తామని ప్రశ్నిస్తున్నారు. తొలిరోజే సినిమా చూడాలని భావిస్తే తమ జేబుకి చిల్లులు పడటం ఖాయమని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. అభిమానులే తమ బలం అని పదే పదే చెప్పే హీరోలు.. ప్రీమియర్స్ పేరుతో ఇలా దోచుకోవడం ఏంటని నిలదీస్తున్నారు.
https://twitter.com/icon_uday_09/status/1862842546986058178
https://twitter.com/HemanthSriram14/status/1862891462121152785
‘రేట్లు తగ్గాకే చూడండి’
'పుష్ప 2' టికెట్ ధరలను నియంత్రించాలని నెటిజన్లు కోరుతుండటంతో పాటు ఈ విషయమై పలువురు న్యాయస్థానాన్ని సైతం ఆశ్రయించారు. ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు ఆర్జీవీ (RGV) ఓ ఆసక్తికర పోస్టు పెట్టాడు. పుష్ప 2 టికెట్లను స్టార్ హోటల్ ఇడ్లీతో పోలుస్తూ చేసిన పోస్టు నెట్టింట వైరల్ అవుతోంది. ‘సుబ్బారావు అనే ఒకడు హోటల్ పెట్టి ప్లేట్ ఇడ్లీ ధరను రూ.1000గా నిర్ణయించాడు. ఆ ఇడ్లీలు మిగతావాటి కంటే చాలా గొప్పవని నమ్ముతున్నాడు. కస్టమర్‌కు ఆ ఇడ్లీలు వర్త్ అనిపించకపోతే హోటల్‌కు వెళ్లడు. సుబ్బారావు ఇడ్లీ ధర సామాన్యులకు అందుబాటులో లేదని ఎవరైనా ఏడిస్తే, అది సెవెన్‌స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత వెర్రితనం. అన్ని ప్రొడక్ట్స్‌లాగే సినిమాలు కూడా లాభాల కోసమే నిర్మిస్తారు. ప్రజా సేవ కోసం కాదు. ఆకాశం లాంటి పుష్ప 2 సినిమాకి ఇప్పుడు పెట్టిన రేట్లు తక్కువే. అలా అనుకొని వారు చూడటం మానేయొచ్చు లేదా రేట్లు తగ్గాక చూసుకోవచ్చు’ అని ఆర్జీవీ రాసుకొచ్చాడు.
https://twitter.com/RGVzoomin/status/1864188826387873892
ఆర్జీవీకి నెటిజన్ల కౌంటర్
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) చెప్పిన సుబ్బారావు ఇడ్లీ స్టోరీకి నెటిజన్లు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నారు. 7 స్టార్ హోటల్స్‌లో 10 మంది ఇడ్లీలు తింటే బయట హోటల్‌లో 50వేల మంది తింటారని గుర్తుచేస్తున్నారు. డే 1 రూ.1200 ఉన్న టికెట్‌ను మరుసటి రోజుకు రూ.500, ఆ తర్వాత రూ.200కి మార్చడం అంటే 'పుష్ప 2' విలువ అంత నీచంగా పడిపోయిందని అర్థమా? అని నిలదీస్తున్నారు. ‘మెుదటి రోజు 7 స్టార్ ఇడ్లీలు ఎవరు కొనట్లేదు భయ్యా!’ అంటూ ఖాళీ సీట్లు ఉన్న థియేటర్లను పోస్టు చేస్తున్నారు. గతంలో పవన్ సినిమా టికెట్ ధరను జగన్ తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. రూ.10 ధరతో తొలి భాగం చూపించి రూ.1000 కడితేనే రెండో సగం చూడాలని కండీషన్ పెడితే అది దోపిడి కాదా? అని మండిపడుతున్నారు. హోటల్‌లో ఇడ్లీ ధర మరీ ఎక్కువగా ఉంటే ఇంట్లో చేసుకుంటామని, అలాగే ‘పుష్ప 2’ని ఓటీటీలోకి వచ్చాక చూస్తామని స్పష్టం చేస్తున్నారు.
https://twitter.com/Raja__JSP/status/1864210260183142807
https://twitter.com/shravan_salaar/status/1864190328200179911
డిసెంబర్ 04 , 2024
Pushpa 2: గేమ్ చేంజర్‌కు పోటీగా పుష్ప2 సాంగ్? తగ్గేదేలే!
ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) మేనియా నడుస్తోంది. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం ‘పుష్ప’ (2021)కు సీక్వెల్‌గా ఇది వస్తుండటంతో సహజంగానే అందరి దృష్టి ఈ మూవీపై పడింది. రిలీజ్‌కు వారం రోజుల సమయం కూడా లేకపోవడంతో హీరో బన్నీతో పాటు మూవీ టీమ్ దేశవ్యాప్తంగా భారీగా ప్రమోషన్స్ చేస్తోంది. పాట్నా, చెన్నై, కొచ్చి నగరాల్లో భారీ ఈవెంట్లు నిర్వహించి సినిమా మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇటీవల కొచ్చి ఈవెంట్‌లో ‘పీలింగ్స్’(peelings) అనే సాంగ్‌ను మలయాళ ప్రేక్షకుల కోసం బన్నీ స్పెషల్‌గా ప్లే చేశారు. ఇది ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. రిలీజ్ డేట్‌ను సైతం ప్రకటించారు. అయితే ఈ పాటను ‘గేమ్ ఛేంజర్’ (Game Changer)కు పోటీగా తీసుకొస్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
సాంగ్ వచ్చేది ఎప్పుడంటే?
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటించిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా చేసింది. ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. జగపతిబాబు, సునీల్, అనసూయ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఇదిలా ఉంటే తాజాగా 'పుష్ప 2' టీమ్ నాలుగో పాటకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. కొచ్చి ఈవెంట్‌లో కొద్ది సెకన్ల పాటు ప్లే చేసిన 'పీలింగ్స్' పాటకు సంబంధించి ఈ ప్రోమోను విడుదల చేశారు. ఆ ఈవెంట్‌లో బన్నీ చెప్పినట్లుగానే మలయాళ లిరిక్స్‌తో పాట మెుదలైంది. 25 సెకన్ల పాటు ఉన్న ఈ ప్రోమో మంచి బీట్‌తో ఆకట్టుకుంటోంది. డిసెంబర్ 1 ఆదివారం రోజున ఈ పాటకు సంబంధించి లిరికల్ వీడియోను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
https://twitter.com/i/status/1862395532343484578
https://twitter.com/baraju_SuperHit/status/1862394696338973169
‘నానా హైరానా’కు పోటీగా రిలీజ్?
రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి గురువారం (నవంబర్ 28) మూడో సింగిల్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘నానా హైరానా’ (Naanaa Hyraanaa) అంటూ సాగే ఈ మెలోడీ సాంగ్‌కు మ్యూజిక్ లవర్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. ఇటీవల ‘పుష్ప 2’ నుంచి రిలీజైన ‘కిస్సిక్’ పాట కంటే ‘నానా హైరానా’ చాలా బాగుందంటూ నెట్టింట పెద్ద ఎత్తున కామెంట్స్ వినిపిస్తున్నాయి. పలు యూట్యూబ్ చానెళ్లు సైతం దీనిపై పోల్స్ నిర్వహించగా మెజారిటీ ప్రేక్షకులు ‘నానా హైరానా’కు అనుకూలంగా ఓట్లు వేశారు. ఈ నేపథ్యంలో ఆ మెలోడీ సాంగ్‌కు పోటీగా మంచి బీట్ ఉన్న ‘పీలింగ్స్’ పాటను ‘పుష్ప 2’ మేకర్స్ రిలీజ్ చేయబోతున్నట్లు నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతో ‘పుష్ప 2’ మేకర్స్‌కే తెలియాలి.
హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్
తెలుగు రాష్ట్రాలు మినహా దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘పుష్ప 2’ (Pushpa 2) వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. ఇవాళ ముంబయిలోనూ ఈవెంట్‌ను మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే హోమ్ ల్యాండ్ అయిన తెలుగు స్టేట్స్ ఇప్పటివరకూ ఒక్క ప్రమోషన్ ఈవెంట్ నిర్వహించలేదు. దీంతో హైదరాబాద్‌లో బిగ్ ఈవెంట్‌ను ‘పుష్ప 2’ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. సినిమాకు ఎంతో కీలకమైన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించాలని అనుకుంటున్నారట. ఈవెంట్ ఆర్గనైజర్ శ్రేయాస్ మీడియా ఇప్పటికే మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యంతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పోలీసుల అనుమతి సైతం లభిస్తే డిసెంబర్ 1న సాయంత్రం ఈవెంట్ జరగనుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే ఫోర్త్ సింగిల్ ‘పీలింగ్స్’ను కూడా రిలీజ్ చేసే అవకాశముంది.
సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బన్నీనే!
‘పుష్ప 2’ చిత్రానికి సంబంధించి గురువారం సెన్సార్ బోర్డ్ రివ్యూ పూర్తైంది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. అంతేకాదు 3 గంటల 20 నిమిషాల 38 సెకన్ల నిడివితో ఈ సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ‘పుష్ప 2’ ఓ అరుదైన ఘనతను సాధించింది. తెలుగులో ఇప్పటివరకూ వచ్చిన అత్యధిక నిడివి గల చిత్రాల జాబితాలో టాప్ - 3 నిలిచింది. గతంలో నందమూరి తారకరామారావు చేసిన దాన వీర శూర కర్ణ (3 గం.ల 43 నిమిషాలు), లవ కుశ (3 గం.ల 28 నిమిషాలు) చిత్రాలు నిడివి పరంగా తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. కాబట్టి నిడివి పరంగా సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బన్నీ టాప్‌లో ఉన్నాడని చెప్పవచ్చు.
https://twitter.com/sairaaj44/status/1862102202971787356
నెట్టింట హీట్ పెంచేసిన రష్మిక!
ఈ తరం స్టార్ హీరోయిన్లలో యంగ్ బ్యూటీ రష్మిక మందన్న (Rashmika Mandanna) ఒకరు. ఆమెను అంతా నేషనల్ క్రష్ అని కూడా ముద్దుగా పిలుస్తుంటారు. తాజాగా ‘పుష్ప 2’ ఈవెంట్‌కు హాజరైన రష్మిక తన గ్లామర్‌తో అక్కడి వారి మతి పోగొట్టింది. గ్రీన్ కలర్ శారీలో ఎద అందాలు చూపిస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీంతో ఈ ముద్దుగుమ్మ ఫొటోలు, వీడియోలు ఒక్కసారిగా నెట్టింట వైరల్‌గా మారాయి. నేషనల్ క్రష్ అంటే ఆమాత్రం అందం ఉండాలిలే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ‘పుష్ప 2’ సినిమా లవర్స్ సైతం శ్రీవల్లి భలే గ్లామర్‌గా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోలను మీరూ ఓసారి చూడండి.
https://twitter.com/Actresshddd/status/1862326105690317215
https://twitter.com/CeleBeautyHQ/status/1862195078669681134
https://twitter.com/itzFantasyWorld/status/1862382376334057619
https://twitter.com/natshathiram/status/1862209642795016288
https://twitter.com/RSprabha8/status/1862200290948391300
నవంబర్ 29 , 2024
Project K Glimpse: నిమిషం వీడియోతో సినిమా మెుత్తం చెప్పేశారు భయ్యా..! ‘కల్కి 2898 AD’లో జరగబోయేది ఇదే?
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ప్రాజెక్ట్ K. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీని రూపొందిస్తున్నారు. ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని, కమల్ హాసన్.. ఇలా స్టార్ క్యాస్ట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ కాలిఫోర్నియాలోని శాన్ డియాగాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ ‘కామిక్ కాన్’లో రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మొదటి ఇండియన్ సినిమాగా ‘ప్రాజెక్ట్ K’ సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాతలతో పాటు ప్రభాస్, కమల్ హాసన్ పాల్గొన్నారు.
గ్లింప్స్ చెప్పే సీక్రెట్స్ ఇవే!
కాగా, ప్రాజెక్ట్ K సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద ‘2898 AD’ అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో జరిగే కథ అని డైరెక్టర్ చెప్పకనే చెప్పాడు. గ్లింప్స్ చూస్తే సాధారణంగా ప్రపంచాన్ని చీకటి కమ్ముకున్నప్పుడు ఒక వెలుగు వస్తుంది అని, ప్రపంచాన్ని విలన్ తన గుప్పిట్లోకి తీసుకున్నప్పుడు కల్కి ఉద్భవిస్తాడని, ప్రజల్ని కాపాడతాడని తెలుస్తుంది. అయితే గ్లింప్స్‌ను మరింత పరిశీలనగా చూస్తే చాలా విషయాలు మనకు అర్థమౌతాయి. కలియుగాంతం సమయంలో ఈ ప్రపంచం పూర్తిగా రోబోల మయంగా, ఆధునిక ఆయుధాలతో యుద్ధం జరిగే స్థాయికి వెళ్తుందని గ్లింప్స్‌ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా 2898 ADలో ప్రస్తుత స్థాయిలో జనాభా కాకుండా చాలా కొద్దిమంది ప్రజలే ఉండొచ్చని భావించవచ్చు. వారంతా ఓ వ్యక్తి (రాజు) పాలనలో జీవిస్తుండవచ్చు.
https://twitter.com/DEADLINE/status/1682221771154677760?s=20
అమితాబ్ పాత్ర నిడివి తక్కువేనా?
ప్రాజెక్ట్‌లో Kలో రాజు (అమితాబ్ బచ్చన్) తన ప్రజలని పాలిస్తుంటే ఒక విలన్ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటాడు. ఆ రాజుని బంధించి అతని ప్రజలని విలన్ తనకు బానిసలుగా చేసుకున్నట్లు గ్లింప్స్‌లో కనిపిస్తోంది. అలాంటప్పుడు రాజు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలోకి వెళ్లిపోతాడు. ఆ సమయంలో వారిని ఆదుకునేందుకు కల్కి అవతారంలో హీరో (ప్రభాస్) ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. మూవీలో అయితే మొదట అమితాబ్ వచ్చి ఆ తర్వాత ప్రభాస్ వస్తాడని అర్థం చేసుకోవచ్చు. శివాలయంలోకి ఓ రోబో రావడం గ్లింప్స్‌లో చూశాం. ఈ ఆలయానికి క్షేత్ర పాలకుడి క్యారెక్టర్‌లో అమితాబ్ నటిస్తున్నట్లు టాక్.
https://twitter.com/DEADLINE/status/1682129398600966146?s=20
ప్రభాస్ అందుకే కల్కి అవుతాడా?
ఇక ప్రాజెక్ట్ K అంటే ‘ప్రాజెక్ట్ కల్కి’ అని, ప్రభాస్‌తో లోకాన్ని కాపాడించడానికి కొంతమంది చేసే యుద్ధమని గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. నిమిషం వీడియోతో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇండైరెక్ట్‌గా కథ మెుత్తం రివీల్ చేసినట్లు అర్థమవుతోంది. ఇక కొంచెం డీటేలింగ్‌లోకి వెళ్తే అమితాబ్ బచ్చన్‌తో పాటు హీరోయిన్ దీపికా పదుకొణేను కూడా విలన్లు బంధించినట్లు గ్లింప్స్‌లో చూపించారు. దీన్ని బట్టి ప్రభాస్ ఆమె కోసం వచ్చి కల్కి లాగా మారతాడా? అన్న సందేహం కూడా ఉత్పన్నమవుతుంది. లేదా హీరోయిన్‌ను కాపాడే క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా దీపికా, ప్రభాస్ మధ్య ప్రేమ సన్నివేశాలను కూడా బాగా ఎలివేట్ చేయాలని డైరెక్టర్ నాగ్ అశ్విన్ భావిస్తున్నారు.
చీకటికి రారాజు అతడే?
ఇకపోతే ఈ సినిమాలో లోక నాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన ప్రతినాయకుడిగా కనిపిస్తాడని మెున్నటి వరకూ ఊహాగానాలు వినిపించినా తాజాగా విడుదలైన గ్లింప్స్ వీడియోతో అది కన్‌ఫార్మ్ అయింది. ఎందుకంటే ప్రాజెక్ట్Kలో కమల్ హాసన్ నటించనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సమయంలో ఆసక్తికర విషయాన్ని తెలియజేశారు. 'భూమి మెుత్తాన్ని కమ్మేసే షాడో (చీకటి) కోసం వెతికామని.. ఆ పాత్ర చేయగల ఒకే ఒక్కడు దొరికేశాడు' అని కమల్ గురించి ప్రకటించారు. తాజా గ్లింప్స్ కూడా భూమిని చీకటి కమ్మేయడం గమనించవచ్చు. ఈ రెండు కలిపి చూస్తే ఇందులో విలన్లకు రారాజుగా కమల్ హాసన్ కనిపిస్తాడని అర్థం చేసుకోవచ్చు.
https://twitter.com/i/status/1672854637014138880
సూపర్ రెస్పాన్స్
గ్లింప్స్‌ని చూస్తుంటే గూస్‌బమ్స్ వస్తున్నాయని ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. విజువల్ వండర్‌గా, హాలీవుడ్ రేంజ్ సినిమాని తలపిస్తోందని చెబుతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ విజనరీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక, సంతోష్ నారాయణన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మళ్లీ మళ్లీ వినాలనిపించే ట్రాక్‌ని అందించాడు. గ్లింప్స్ చూశాక మ్యూజిక్ హాంట్ చేస్తూనే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
https://twitter.com/THR/status/1682126315229683715?s=20
విడుదల తేదీ?
ముందుగా అనౌన్స్ చేసిన ప్రకారం ఈ మూవీ 2024 సంక్రాంతికి రిలీజ్ కావాలి. అయితే, గ్లింప్స్‌లో కేవలం 2024లో వస్తుందనే ఇచ్చారు. అంటే, మూవీ డేట్ మారుతుందనే సంకేతాలు ఇచ్చారు. మరి, జనవరి 12న కాకుండా సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే టాక్ నడుస్తోంది. నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్‌కి అచ్చొచ్చిన ‘మే9’న కల్కిని కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజున జగదేక వీరుడు అతిలోక సుందరి, మహానటి సినిమాలు ఇదే రోజున రిలీజ్ అయ్యాయి.
https://www.youtube.com/watch?v=bC36d8e3bb0
జూలై 21 , 2023
Rajendra Prasad: ‘ఎర్ర చందనం దొంగ హీరోనా’.. రాజేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్!
ప్రస్తుతం యావత్ దేశం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా గురించి మాట్లాడుకుంటోంది. రోజు రోజుకి కలెక్షన్స్ పరంగా పుష్పరాజ్ సృష్టిస్తున్న రికార్డ్స్ చూసి సినీ లవర్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయి విజయం భారత సినీ చరిత్రలో అల్లు అర్జున్‌కు తప్ప ఏ నటుడికి సాధ్యం కాలేదని ప్రశంసిస్తున్నారు. ‘పుష్ప 2’తో బన్నీకి మరో నేషనల్ అవార్డు రావడం ఖాయమని నెట్టింట పోస్టులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశం మెుత్తం పుష్ప 2 ఫీవర్ నడుస్తున్న సమయంలో సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Harikatha Prerelease Event) ఈ సినిమాపై స్టన్నింగ్ కామెంట్స్ చేశారు. సినిమా పేరు ప్రస్తావించకుండా ‘ఎర్ర చందనం దొంగిలించేవాడు హీరోనా’ అని మాట్లాడారు. అంతటి సీనియర్ యాక్టర్ ఇలా ఎందుకు మాట్లాడారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
హరికథ ప్రీరిలీజ్ ఈవెంట్..
రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ హరికథ వెబ్ సిరీస్ ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. పలు సూపర్ హిట్ చిత్రాలు నిర్మించిన ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఈ సిరీస్ ద్వారా ఓటీటీలో అడుగుపెడుతోంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్, శ్రీరామ్, దివి, అంబటి అర్జున్ కీలక పాత్రలు పోషించారు. మగ్గీ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్‌కు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో సిరీస్ బృందమంతా పాల్గొంది.
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..
‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ (Harikatha Prerelease Event) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం గురించి ఆయన ప్రస్తావించారు. ప్రస్తుత కలియుగంలో కథలు ఎలా వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నామని అన్నారు. ‘నిన్న గాక మెున్న చూశాం. వాడెవడో చందనం దొంగిలించే దొంగ.. వాడు హీరో. హీరోల మీనింగ్‌లు మారిపోయాయి’ అంటూ చెప్పుకొచ్చారు. తన 48 ఏళ్ల సినీ జీవితంలో మన చుట్టూ ఉండే పాత్రలు చేసే అదృష్టం లభించిందన్నారు. ‘లేడీస్ టైలర్’, ‘అప్పుల అప్పారావు’, ‘పేకాట పాపారావు’ వంటి సినిమాలను ప్రస్తావించారు.
https://www.youtube.com/watch?v=N-eSYXCH7KM
‘రూ.1000 టికెట్ పెట్టి వెళ్లక్కర్లా’
‘హరికథ’ (Harikatha Prerelease Event) సిరీస్‌లో దేవుడే దుష్టసంహారం చేస్తున్నట్లు చూపించనున్నారు. దీనిపై రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ దేవుడు ఎందుకు చంపుతాడు? అనుకునే వారు సిరీస్ చూడాల్సిందేనన్నారు. ‘ఇది పెద్ద కష్టమేమి కాదు. థియేటర్లకు రూ.1000 ఖర్చు పెట్టిమరీ వెళ్లేంత పని లేదు. హ్యాపీగా ఇంట్లోనే చూడొచ్చు’ అని చెప్పారు. అయితే ‘పుష్ప 2’ ప్రీమియర్స్ సందర్భంగా ఒక్కో టికెట్ రూ.1000కి పైగా అమ్మారు. ఈ నేపథ్యంలోనే రాజేంద్ర ప్రసాద్ సెటైర్లు వేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/peoplemediafcy/status/1866082101659070546
తొడ కొట్టిన రాజేంద్ర ప్రసాద్..
‘హరికథ’ సిరీస్ గురించి మాట్లాడుతూ రాజేంద్ర ప్రసాద్ తొడగొట్టి అందరికీ ఛాలెంజ్ చేశారు. ఈ సిరీస్ చూశాక మీరందరూ థియేటర్‌లో ఎందుకు రిలీజ్ చేయలేదని తనను తిడతారని అన్నారు. అలా జరగకపోతే తన పేరు మార్చి మరొకటి పెట్టుకుంటానని అన్నారు. సత్యంగా చెబుతున్నానని అన్నారు. ఈ మాటలతో ఈవెంట్ ప్రాంగణం మెుత్తం చప్పట్లు, విజిల్స్‌తో మారు మోగింది. అటు ఓటీటీల గురించి సైతం రాజేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. థియేటర్ల నుంచి సినిమా ఇంటికి వచ్చేసిందని, ఈ రోజుల్లో సినిమా ఇంట్లోనే ఉందని అన్నారు.
https://twitter.com/peoplemediafcy/status/1866091296110318029
డిసెంబర్ 09 , 2024
Pushpa 3: ‘పుష్ప 3’ స్లోగన్ రివీల్ చేసిన అల్లు అర్జున్
అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Director Sukumar) దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప 2' (Pushpa 2) చిత్రం కనీవినీ ఎరుగని రీతిలో బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామీ చూసి ప్రతీ ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు రోజుల్లోనే రూ.1002 కోట్ల కలెక్షన్స్ సాధించి కొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఈ మూవీ సక్సెస్‌ను హీరో అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తున్నాడు. ‘పుష్ప 2’ విజయాన్ని ఉత్తరాది ప్రేక్షకులతో పంచుకునేందుకు అతడు దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టాడు. అక్కడి ప్రెస్‌మీట్‌లో బన్నీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ మారాయి.
దేశ రాజధానిలో ‘పుష్ప 2’ టీమ్
అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘పుష్ప 2’ చిత్రానికి యావత్ దేశం నుంచి విశేష స్పందన వచ్చింది. నార్త్, సౌత్, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కాసుల వర్షం కురిసింది. ముఖ్యంగా హిందీ ఆడియన్స్ ‘పుష్ప 2’ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. దేశ వ్యాప్తంగా వచ్చిన విశేష ఆదరణ చూసి థ్యాంక్యూ ఇండియా పేరుతో ‘పుష్ప 2’ టీమ్ దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టింది. హీరో అల్లు అర్జున్‌తో పాటు డైరెక్టర్ సుకుమార్, చిత్ర నిర్మాతలు ఇందులో పాల్గొన్నారు. ఢిల్లీ ల్యాండ్ అయిన వెంటనే బన్నీ పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. ‘నమస్తే ఢిల్లీ’ అంటూ బన్నీ ఫ్లైట్ దిగుతున్న ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది.
https://twitter.com/alluarjun/status/1867097726837838200
‘నా రికార్డులు బద్దలు కొట్టండి’
ఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ నార్త్ ఆడియన్స్‌ను బన్నీ ఆకాశానికెత్తాడు. హిందీ ఆడియన్స్ లేకుంటే ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ చిత్రాలు లేవని పేర్కొన్నాడు. ఇక పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డుల పైనా బన్నీ స్పందించాడు. 'రికార్డ్స్ అనేవి శాశ్వతంగా ఉండిపోవు. రూ.1000 కోట్లు అనేది అభిమానుల ప్రేమకు ప్రతిబింబం. ఈ నంబర్స్ తాత్కాలికం. కానీ, వాళ్ల ప్రేమ మాత్రమే శాశ్వతం. రికార్డులు అనేవి ప్రతిసారీ బద్దలవుతూనే ఉండాలి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతూనే ఉండాలని నేను ఎక్కువగా నమ్ముతా. మరో మూడు నెలలపాటు ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తా. వచ్చే వేసవిలోపు ఈ రికార్డులన్నీ బద్దలు కావాలని కోరుకుంటున్నా. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ పరిశ్రమ ఏదైనా కావచ్చు పుష్ప రికార్డ్స్‌ను మరో సినిమా దాటాలని నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో పురోగతి అనేది ఉండాలని ఆశిస్తున్నాను' అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు.
https://twitter.com/CinemaWithAB/status/1867157258909663347
‘పుష్ప 3’పై హైప్ పెంచిన బన్నీ
ప్రసంగం మొదట్లోనే దర్శకుడు సుకుమార్ మీద తనకున్న అభిమానం, ప్రేమను మరోమారు బన్నీ చాటుకున్నారు. ఆయన లేకపోతే పుష్ప ప్రపంచం ఉండేది కాదని అల్లు అర్జున్ స్పషం చేశాడు. ‘పుష్ప 3’ (Pushpa 3) ఉంటుందా అనే యాంకర్ ప్రశ్నకు సైతం బన్నీ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ఈసారి ఝుకేగా నహీ (తగ్గేదేలే) కాదు.. రుకేగా నహీ (ఆగేదేలే)’ అంటూ సీక్వెల్‌పై అమాంతం అంచనాలు పెంచేశాడు. ఇదిలా ఉంటే సీక్వెల్ కచ్చితంగా ఉంటుందని ‘పుష్ప 2’ క్లైమాక్స్‌లోనే దర్శకుడు సుకుమార్ హింట్ ఇచ్చాడు. సెకండ్ పార్ట్‌తో పోలిస్తే పుష్పరాజ్‌కు మరింత మంది శత్రువులు పెరిగినట్లు క్లైమాక్స్‌లో చూపించాడు. దీన్ని బట్టి థర్డ్ పార్ట్‌లో పుష్ప గాడి వేట మరో లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే అంచనాలు వేసుకుంటున్నారు.
https://twitter.com/alluarjun/status/1867184468043485606
బన్నీ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ
రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్‌ను దేశ రాజధాని ఢిల్లీలో బన్నీ కలిశాడంటూ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో బన్నీ త్వరలో రాజకీయ ప్రవేశం చేయబోతున్నాడంటూ ఒక్కసారిగా వార్తలు ఊపందుకున్నాయి. మామయ్య పవన్ బాటలో బన్నీ నడువబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున రూమర్లు వచ్చాయి. దీంతో అల్లు అర్జున్ టీమ్ దీనిపై స్పందించింది. ఆ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వార్తలను దయచేసి ఏ ఒక్కరు లేదా మీడియా ప్రచారం చేయవద్దని విజ్ఞప్తి చేసింది. బన్నీకి సంబంధించినంత వరకూ అల్లు అర్జున్ టీమ్ నుంచి వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మమని కోరింది.
https://twitter.com/M9News_/status/1867142805908586808
https://twitter.com/SDM_official1/status/1867148165381837069
https://twitter.com/imsarathchandra/status/1867175853383143687
డిసెంబర్ 12 , 2024
Drinker Sai Movie Review: బాక్సాఫీస్ వద్ద తడబడ్డ ‘డ్రింకర్ సాయి’.. తేడా ఎక్కడ కొట్టిదంటే?
నటీనటులు : ధర్మ కాకాని, ఐశ్వర్య శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పోసాని కృష్ణ మురళి, సమీర్, కిర్రాక్ సీత తదితరులు
దర్శకత్వం : తిరుమలశెట్టి కిరణ్
సంగీతం: శ్రీ వసంత్
సినిమాటోగ్రఫీ: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్
నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, లహరిధర్
విడుదల తేదీ: డిసెంబర్ 27, 2024
ధర్మ, ఐశ్వర్య హీరో హీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం 'డ్రింకర్ సాయి' (Drinker Sai). తిరుమలశెట్టి కిరణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. మద్యం, ధూమపానం వల్ల లైఫ్‌ను ఎలా తలకిందులు చేస్తాయో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్, టీజర్ వినూత్నంగా ఉండి అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో డిసెంబర్ 27, 2024న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆడియన్స్‌ను మెప్పించిందా? సమాజానికి మంచి సందేశం ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Drinker Sai Movie Review)
కథేంటి
కోటీశ్వరుడైన సాయి (ధర్మ) నిత్యం తాగుతూ డ్రింకర్ సాయిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో అతడికి మంచి, చెడు చెప్పేవారే లేకుండా పోతారు. మరోవైపు బాగీ (ఐశ్వర్య శర్మ) క్రమశిక్షణ కలిగిన యువతిగా జీవిస్తుంటుంది. మంచి ఆరోగ్య అలవాట్లను పాటిస్తుంటుంది. ఓ యాక్సిడెంట్ ద్వారా డ్రింకర్ సాయి ఆమె లైఫ్‌లోకి వస్తాడు. తొలి చూపుతోనే ఆమెను ప్రేమిస్తాడు. బాగీకి అతడంటే ఇష్టం లేనప్పటికీ వైలెన్స్ చేస్తాడన్న భయంతో భరిస్తూ వస్తుంటుంది. ఈ బలవంతపు లవ్‌స్టోరీ ఎక్కడ వరకూ సాగింది? డ్రింకర్ సాయిని బాగీ ప్రేమిస్తుందా ? ఒకవేళ ప్రేమిస్తే దానికి గల కారణాలు ఏంటి? బాగీ ప్రేమతో డ్రింకర్ సాయిలో వచ్చిన మార్పులు ఏంటి? అన్నది స్టోరీ.
ఎవరెలా చేశారంటే
డ్రింకర్ సాయి పాత్ర (Drinker Sai Movie Review)లో యువ నటుడు ధర్మ సాలిడ్ పర్‌ఫార్మెన్స్ చేశాడు. అతడి రూపంలో ఇండస్ట్రీకి మంచి నటుడు దొరికాడని చెప్పవచ్చు. భావోద్వేగాలను ఎలాంటి తడబాటు లేకుండా చక్కగా పలికించాడు. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. హీరోయిన్‌గా ఐశ్వర్య శర్మ ఆకట్టుకుంది. హావాభావాలను చక్కగా పలకిస్తూ మెప్పించింది. నటిగా మంచి మార్కులు కొట్టేసింది. కిర్రాక్ సీత, రీతు చౌదరి తమ కామెడీతో అక్కడక్కడ నవ్వించారు. మంతెన సత్యనారాయణకు స్పూఫ్‌గా చేసిన వంతెన పాత్రతో నటుడు భద్రం ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఆ పాత్ర పెద్దగా ఫన్ క్రియేట్ చేయలేకపోయింది. మిగిలిన పాత్రధారులు తమ పరిధిమేరకు నటించి పర్వాలేదనిపించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
దర్శకుడు తిరుమలశెట్టి కిరణ్ రొటీన్ కథతో సినిమాను తెరకెక్కించారు. తాగుడుకు బానిసైన హీరో.. తనను చూస్తేనే చికాకు పడే హీరోయిన్‌ను ఎలా ప్రేమలో పడేశాడు? అన్న కాన్సెప్ట్‌తో మూవీని తెరకెక్కించారు. హీరో, హీరోయిన్ల పాత్రలు పరిచయం, ఆపై బాగీ వెంట సాయి పడటం, ఆమె ఛీకొట్టడం వంటి సీన్లతో తొలిభాగాన్ని ఫన్నీగా నడిపించాడు డైరెక్టర్. సెకండాఫ్ వంతెన ఆశ్రమానికి కథ మళ్లడం, ఆశ్రమంలో కనిపించే ప్రతి విషయాన్ని సెటైరికల్‌గా చూపించారు. కొంతవరకూ వంతెన క్యారెక్టర్ బాగునప్పటికీ ఆశ్రమం చుట్టూ కథను ఎక్కువగా సాగదీయడం విసుగు తెప్పించింది. ఇక క్లైమాక్స్‌లో దర్శకుడు ఇచ్చిన సందేశం బాగుంది. కథ, కథనం విషయంలో దర్శకుడు కాస్త జాగ్రత్త పడి ఉంటే రిజల్ట్ నెక్స్ట్ లెవల్లో ఉండేదని చెప్పవచ్చు.
సాంకేతికంగా
టెక్నికల్ విషయాలకు వస్తే శ్రీ వసంత్ సమకూర్చిన పాటలు జస్ట్ ఓకే అనేలా ఉన్నాయి. నేపథ్య సంగీతం అక్కడక్కడ ఆకట్టుకుంది. కెమెరామెన్ ప్రశాంత్ అంకిరెడ్డి మంచి పనితీరు కనబరిచాడు. సినిమాను చూపించిన విధానం మెప్పిస్తుంది. ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
హీరో, హీరోయిన్ నటనభావోద్వేగాలుసందేశం
మైనస్ పాయింట్స్
రొటిన్ కథ, కథనంసాగదీత సన్నివేశాలుసహనానికి పరీక్షించే వంతెన పాత్ర
Telugu.yousay.tv Rating : 2.5/5
డిసెంబర్ 27 , 2024
Ram Charan: రూట్‌మార్చిన రామ్‌చరణ్.. ఫుల్ జోష్‌లో మెగా ఫ్యాన్స్!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ramcharan) 'ఆర్‌ఆర్‌ఆర్' (RRR) సక్సెస్‌తో గ్లోబల్ స్థార్‌గా ఎదిగారు. ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఇదిలా ఉంటే రామ్ చరణ్‌ను కెరీర్ ప్రారంభం నుంచి ఓ సమస్య వెంటాడుతోంది. ఈ సమస్య నుంచి చరణ్ ఎన్నిసార్లు బయటపడాలని చూసిన కుదరడం లేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ సైతం అసంతృప్తిగా ఉన్నారు. దీంతో ఆ ప్రాబ్లమ్‌కు చెక్ పెట్టే దిశగా రామ్‌చరణ్ సరికొత్త ప్లాన్స్‌ను రచిస్తున్నాడు. ఆ దిశగా ఓ కీలక నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్ సైతం తెగ ఖుషీ అవుతున్నారట. ఇంతకీ ఆ సమస్య ఏంటి? దానిపై చెర్రీ తీసుకున్న నిర్ణయం ఏంటి? అన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
సెట్స్‌పైకి రెండు చిత్రాలు!
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ చిరు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి 17 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకూ ఆయన నుంచి వచ్చింది 13 చిత్రాలు మాత్రమే. మిగతా స్టార్స్‌తో పోలిస్తే సినిమా సినిమాకు చరణ్ ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారన్న విమర్శ ఉంది. దీని నుంచి ఎన్నిసార్లు బయటపడాలని చూసిన అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ సమస్యకు కచ్చితంగా చెక్ పెట్టాలని చరణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై సంవత్సరానికి రెండు చొప్పున చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. ఇందులో భాగంగానే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కాకముందే డైరెక్టర్ బుచ్చిబాబుతో RC16 ప్రాజెక్ట్‌ను చరణ్ అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ చిత్రంతో పాటుగానే సుకుమార్ దర్శకత్వంలో మరో మూవీ చేయబోతున్నాడు. ఒకేసారి ఆ రెండు ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని రామ్‌చరణ్ భావిస్తున్నారట. ఈ రెండు సినిమాలను 2026 లోపే రిలీజ్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు.
ప్రభాస్‌ను అనుసరిస్తున్నాడా?
ప్రభాస్ కూడా తన ప్రాజెక్టుల విషయంలో గతంలో కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పటిలాగా ప్రాజెక్ట్ తర్వాత ప్రాజెక్ట్ అనే విధానానికి స్వస్థి పలికి ఒకేసారి మూడు ప్రాజెక్ట్స్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతీతో 'రాజాసాబ్' అనే చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించాడు. నవంబర్ కల్లా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లోని 'స్పిరిట్'ను కూడా సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్లాన్‌లో డార్లింగ్ ఉన్నాడు. తద్వారా ఏక కాలంలో ఈ మూడు చిత్రాల షూటింగ్స్‌లో పాల్గొని ఒక్కో సినిమాను ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు. మరోవైపు ‘సలార్ 2’, ‘కల్కి 2’ చిత్రాలను కూడా వచ్చే ఏడాది పట్టాలెక్కించే ఛాన్స్ ఉంది.
ముఖ్య అతిథిగా రామ్‌చరణ్
దక్షిణాది సినీ అవార్డుల పండుగ ‘ఐఐఎఫ్ఏ ఉత్సవం’ (IIFA Utsavam 2024) కార్యక్రమానికి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హాజరుకానున్నారు. అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో సెప్టెంబరు 27న ఐఐఎఫ్ఏ (ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్) వేడుక జరగనుంది. ఇక్కడి ఎతిహాద్ ఎరీనా వేదికగా జరిగే ఈ అవార్డుల ఉత్సవంలో రామ్ చరణ్ సందడి చేయనున్నారు. ఈ మేరకు ఐఐఎఫ్ఏ నిర్వాహకులు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ ఈవెంట్‌కు చరణ్‌తో పాటు పలువురు దక్షిణాది ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ ఏడాది లేనట్లే!
ప్రస్తుతం 'గేమ్ ఛేంజర్' చిత్రంలో రామ్‌చరణ్ నటిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ఈ చిత్రం రిలీజ్ కానున్నట్లు ఇటీవల పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. నిర్మాత దిల్ రాజు కూడా డిసెంబర్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయితే లేటెస్ట్ బజ్ ప్రకారం గేమ్ ఛేంజర్ డిసెంబర్‌లో రావడం కష్టమేనని అంటున్నారు. డిసెంబర్ 20కి ఇప్పటికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే కలెక్షన్స్ తగ్గే ఛాన్స్ ఉందని మేకర్స్ భావిస్తున్నారట. వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయవచ్చని అంటున్నారు. దీనిపై మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
సెప్టెంబర్ 14 , 2024
War 2: ఎన్టీఆర్ ‘వార్ 2’ చిత్రంపై క్రేజీ అప్‌డేట్.. పూర్తిగా లుక్ మార్చిన తారక్
భారతీయ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా ‘వార్ 2’ (War 2). YRF (Yash Raj Films) స్పై యూనివర్స్‌లో 6వ చిత్రంగా రానుండటంతో అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇటీవల ‘బ్రహ్మస్త’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అయాన్ ముఖర్జీ.. ‘వార్ 2’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ స్టార్ హీరో జూ.ఎన్టీఆర్ (Jr NTR) ఈ సినిమాలో నటించనున్నారు. 'ఆర్ఆర్ఆర్' లాంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నేరుగా చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో హిందీతో పాటు తెలుగులోనూ ఈ ప్రాజెక్టుపై భారీ హైప్ నెలకొంది. 2019లో హృతిక్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించిన ‘వార్’కి సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అయితే తాజాగా హృతిక్, తారక్‌లకు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
హృతిక్, తారక్ షూట్ ఎప్పుడంటే!
‘వార్ 2’ (War 2) చిత్రంలో కీలక పాత్రలు పోషించనున్న హృతిక్ రోషన్ (Hrithik Roshan), తారక్ (Jr NTR) షూటింగ్‌కు సంబంధించి క్రేజీ అప్‌డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. దీని ప్రకారం 'వార్ 2'లో హృతిక్‌కు సంబంధించిన సన్నివేశాలను జపాన్‌లో చిత్రీకరించనున్నారు. షావోలిన్ టెంపుల్ దగ్గర హృతిక్ ఎంట్రీ సీన్స్ తెరకెక్కిస్తారని టాక్ వినిపిస్తోంది. మార్చి 7 నుంచి షూటింగ్ ప్రారంభమవుతుందని సమాచారం. ఇక తారక్ విషయానికి వస్తే అతడు ఏప్రిల్‌లో షూటింగ్‌లో జాయిన్ అవుతాడని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల నుంచి తారక్-హృతిక్‌కు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తారని అంటున్నారు.
గాయం నుంచి కోలుకున్న హృతిక్!
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్.. వార్ 2 చిత్రం కోసం గత కొంతకాలం నుంచి వర్కౌట్స్ చేస్తున్నాడు. పర్ఫెక్ట్ బాడీ షేప్ పొందేందుకు జిమ్‌లో కష్టపడుతున్నాడు. ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం ఆయన జిమ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో అనుకున్న దానికంటే ‘వార్ 2’ షూట్ కాస్త ఆలస్యమైంది. ప్రస్తుతం హృతిక్ పూర్తి ఫిట్‌గా ఉండటంతో మార్చి 7 నుంచి ఆయనకు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు హృతిక్ కూడా ఓకే చెప్పడంతో మూవీ యూనిట్ జపాన్‌లో వాలిపోయేందుకు సిద్ధమవుతోంది.
https://twitter.com/i/status/1764908346640040382
‘వార్ 2’లో తారక్ గెటప్ అదేనా?
కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ (Devara) చిత్రంలో ప్రస్తుతం తారక్ నటిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి వరుస షెడ్యూల్స్‌లో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో తారక్‌కు జోడీగా బాలీవుడ్ స్టార్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తోంది. అయితే తాజాగా బెంగళూరులో జరిగిన ఓ పార్టీకి తారక్ సతీసమేతంగా హాజరయ్యాడు. అక్కడ తారక్ లుక్ చూసి అంతా ఫిదా అయ్యారు. మెున్నటి వరకూ కాస్త లావుగా కనిపించిన తారక్.. లేటెస్ట్ ఫొటోల్లో బరువు తగ్గి చాలా స్లిమ్ అయ్యారు. దేవరలో ఎన్టీఆర్ ద్విపాత్రిభినయం చేస్తున్నారని వార్తలొస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఇలా మారి ఆ గాసిప్స్‌ను కన్ఫార్మ్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు. మరోవైపు ‘వార్ 2’లోనూ తారక్ ఇదే గెటప్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం.
‘వార్ 2’ రిలీజ్ ఎప్పుడంటే?
భారీ బడ్జెట్‌తో రూపొందనున్న 'వార్ 2' చిత్రం విడుదల తేదీని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 2025 ఆగష్టు 14న ఇండిపెండెన్స్ డే కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇందులో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం ఉంది. హృతిక్ రోషన్‌కు ధీటుగా పవర్‌ఫుల్‌గా అతడి క్యారెక్టర్ సాగుతుందని సమాచారం. అటు బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహం కూడా ‘వార్ 2’లో కీలక పాత్ర పోషించనున్నాడు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనుంది.
మార్చి 05 , 2024