• TFIDB EN
  • ఎవడు
    ATelugu2h 46m
    సత్య(అల్లు అర్జున్), దీప్తి (కాజల్ అగర్వాల్) ఇద్దరూ లవర్స్. పెద్ద రౌడీ అయిన వీరూ భాయ్ (రాహుల్ దేవ్) దీప్తిని చూసి ఇష్టపడతాడు. సత్య - దీప్తి ఆ రౌడీలకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. కట్‌ చేస్తే వీరూ భాయ్, అతని గ్యాంగ్‌ని చరణ్‌ (రామ్‌ చరణ్‌) చంపడం మెుదలు పెడతాడు. అసలు చరణ్‌ ఎవరు? సత్యకి అతనికి ఉన్న సంబంధం ఏంటి? అన్నది కథ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Youtubeఫ్రమ్‌
    Watch
    Free
    స్ట్రీమింగ్‌ ఆన్‌JioCinema
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    రామ్ చరణ్
    చరణ్ (ఫ్లాష్ బ్యాక్) / సత్య అలియాస్ రామ్ (ముఖ మార్పిడి తర్వాత)
    అల్లు అర్జున్
    సత్య (ముఖ మార్పిడికి ముందు) (అతి అతిథి పాత్ర)
    శృతి హాసన్
    చరణ్ స్నేహితురాలు
    కాజల్ అగర్వాల్
    సత్య స్నేహితురాలు (అతి అతిథి పాత్ర)
    అమీ జాక్సన్
    శృతి
    జయసుధ కపూర్
    చరణ్ తల్లి
    పి. సాయి కుమార్
    ధర్మ
    రాహుల్ దేవ్
    వీరూ భాయ్
    అజయ్
    వీరూ భాయ్ సోదరుడు
    మురళీ శర్మ
    ACP K. అశోక్ వర్మ IPS
    బ్రహ్మానందం
    సత్య అక్రమ అద్దెదారు
    శశాంక్
    రాజా చెంబోలుశరత్ కునాల్
    సూర్య
    మంజు తండ్రి
    వెన్నెల కిషోర్
    చరణ్ స్నేహితుడు
    సుబ్బరాజు
    ధర్మ సేవకుడు
    సుప్రీత్
    ధర్మ కుడి చేయి
    జివి సుధాకర్ నాయుడు
    శశాంక్‌ను కొట్టిన స్థానిక రౌడీ హెడ్
    అమిత్ తివారీ
    చరణ్ కాలేజీ మేట్
    ప్రభాస్ శ్రీను
    దేవ అనుచరుడు
    ఎల్బీ శ్రీరామ్
    శశాంక్ తండ్రి
    చత్రపతి శేఖర్
    ఒక రిపోర్టర్
    సురేఖ వాణిగాయత్రి
    రఘు కారుమంచి
    లోకల్ రౌడీ గ్రూపులో ఒకడు
    శ్రవణ్ఇన్స్పెక్టర్ శ్రవణ్
    చంద్ర మోహన్
    దీప్తి తండ్రి
    షానూర్ సనా
    దీప్తి తల్లి
    నర్సింగ్ యాదవ్
    ఒక ప్రాపర్టీ డీలర్
    జానీ మాస్టర్
    సిబ్బంది
    వంశీ పైడిపల్లి
    దర్శకుడు
    దిల్ రాజు
    నిర్మాత
    దేవి శ్రీ ప్రసాద్
    సంగీతకారుడు
    మార్తాండ్ కె. వెంకటేష్
    ఎడిటర్ర్
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    <strong>Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!</strong>
    Adivi Sesh - Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్‌ హీరోయిన్‌.. అర్థాంతరంగా ప్రాజెక్ట్‌ నుంచి క్విట్‌!
    టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్‌ ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు అడివి శేష్‌ ఓకే చెప్పాడు. స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్నట్లు అనౌన్స్‌మెంట్‌ రావడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆ ప్రాజెక్ట్‌పై పడింది. Sesh Ex Shruti పేరుతో స్పెషల్‌ పోస్టర్‌ సైతం రిలీజ్‌ అయ్యింది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు మేకర్స్‌ సన్నాహాలు కూడా మెుదలుపెట్టారు. క్రమంలోనే హీరోయిన్ శ్రుతి హాసన్‌ చిత్ర యూనిట్‌కు ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నట్లు స్ట్రాంగ్‌ బజ్‌ వినిపిస్తోంది. హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! యంగ్‌ హీరో అడివి శేష్‌, స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్‌ కాంబోలో చిత్రం అనగానే ఒక్కసారిగా ఈ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి పడింది. షానియెల్‌ దేవ్‌ దర్శకత్వంలో లవ్‌, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రానికి 'డెకాయిట్: ఏ లవ్‌ స్టోరీ' అనే టైటిల్‌ను సైతం ఖరారు చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మరి శ్రుతి హాసన్‌ను కన్విన్స్‌ చేసి మళ్లీ తీసుకుంటారా? లేదా కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసుకుంటారా? అన్న దానిపై ప్రస్తుతం సందిగ్దం నెలకొంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో డెకాయిట్‌ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడుతూ ఉంటారని, అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారని మూవీ టీమ్‌ తెలిపింది. డెకాయిట్‌కు సంబంధించిన టీజర్‌ను కూడా గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేశారు. ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది.&nbsp; https://twitter.com/TrackTwood/status/1737423086188925221 బాలీవుడ్‌ స్టార్‌కు గాయం అడివి శేష్ (Adivi Sesh) నటించిన 'గూఢచారి' ఎంత‌టి విజ‌యం సాధించిందో అంద‌రికీ తెలిసిందే. ప్రస్తుతం దానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'జీ 2'లో అడివి శేష్‌ నటిస్తున్నాడు. బాలీవుడ్‌ స్టార్‌ ఇమ్రాన్‌ హష్మీ ఇందులో విలన్‌గా నటిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించిన యాక్షన్‌ సీక్వెన్స్‌ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో నటుడు ఇమ్రాన్‌ హష్మీ గొంతు వద్ద గాయమైంది. జంపింగ్ సీన్స్ తీస్తున్న స‌మ‌యంలో మెడ స్వల్పంగా కట్ అయి ర‌క్తం కారింది. దీంతో షూటింగ్ కాస్త బ్రేక్ ఇచ్చి న‌ట్టు స‌మాచారం. వెంట‌నే వైద్యులు ఇమ్రాన్‌కు చికిత్స అందించారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో బ‌నితా సంధు (Banita Sandhu) హీరోయిన్‌గా మ‌ధుశాలిని, సుప్రియ యార్ల‌గ‌డ్డ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. శ్రీచ‌ర‌ణ్ పాకాల (Sricharan Pakala) సంగీతం అందిస్తున్నాడు. https://twitter.com/Movies4u_Officl/status/1843311804039967199 అడివి శేష్‌ సినీ ప్రస్థానం ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Goodachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Major), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే.&nbsp;
    అక్టోబర్ 08 , 2024
    <strong>Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్</strong>
    Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్
    టాలీవుడ్‌ నటుడు అడివి శేష్‌ (Adivi Sesh) వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్‌’, ‘హిట్‌ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘డెకాయిట్‌: ఏ లవ్‌ స్టోరీ’ (Dacoit: A Love Story) అనే ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను అడివి శేష్‌ పట్టాలెక్కించారు. ఈ చిత్రానికి షానీల్‌ డియో డైరెక్షన్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 'డెకాయిట్‌' హీరోయిన్‌ను అనౌన్స్‌ చేశారు. ఇందులో మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తున్న ప్రకటించారు. దీంతో హీరో అడివి శేష్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్టు పెట్టాడు. మోసం చేశావంటూ రాసుకొచ్చాడు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.  ‘ప్రేమించి మోసం చేశావ్‌’ యంగ్‌ హీరో అడివి శేష్‌ (Adivi Sesh) ప్రస్తుతం ‘డెకాయిట్‌’ (Dacoit: A Love Story) అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) నటిస్తున్నట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త పోస్టర్‌ను షేర్ చేసిన అడివి శేష్‌ 'ప్రేమంచావు.. కానీ మోసం చేశావు.. విడిచిపెట్టను.. తేలాల్సిందే' అని క్యాప్షన్‌ పెట్టారు. దీనికి మృణాల్‌ ఠాకూర్‌ స్పందిస్తూ 'వదిలేశాను.. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించాను' అంటూ సమాధానం చెప్పింది. అయితే ఈ వ్యాఖ్యలు సినిమాలో తమ పాత్రలకు సంబంధించి ఒకరికొకరు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో మృణాల్‌ - అడివి శేష్‌ ప్రేమించుకొని, ఓ బలమైన కారణం వల్ల విడిపోతారని అర్థమవుతోంది.  https://twitter.com/AdiviSesh/status/1868899040303431969 హ్యాండ్ ఇచ్చిన శ్రుతి హాసన్‌! డెకాయిట్‌ చిత్రాన్ని అనౌన్స్‌ చేసినప్పుడే హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌ నటిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. దీనికి సంబంధించిన పోస్టర్స్‌, టీజర్‌ను సైతం గతంలో రిలీజ్‌ చేశారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి అనుకున్న క్రమంలో ఈ ప్రాజెక్ట్‌ నుంచి అనూహ్యంగా శ్రుతి హాసన్‌ తప్పుకుంది. అయితే దీనికి గల స్పష్టమైన కారణాలు ఏంటో బయటకు రాలేదు. మూవీ టీమ్‌ కూడా ఎలాంటి అధికారిక ప్రకటన సైతం చేయలేదు. మూవీ టీమ్‌తో విభేదాల వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు నెట్టింట ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆమె స్థానంలోకి మృణాల్‌ను మేకర్స్‌ తీసుకున్నారు. అడివి శేష్‌, మృణాల్‌ పెయిర్‌ బాగుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.  https://twitter.com/AnnapurnaStdios/status/1751466771436208424 డెకాయిట్‌ స్టోరీ ఇదే! ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో ‘డెకాయిట్‌’ చిత్రం ద్వారానే దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. ఇందులో హీరో, హీరోయిన్లు వరుస దోపిడీలకు పాల్పడతారు. అలా దొంగతనానికి పాల్పడుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడతారు. ఓ విషయమై వారి ప్రేమలో విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. ఇక ‘డెకాయిట్‌’కు సంబంధించిన టీజర్‌ను గతేడాది డిసెంబర్‌లోనే రిలీజ్‌ చేయగా ఇందులో అడివి శేష్‌, శ్రుతి హాసన్‌ కనిపించి సర్‌ప్రైజ్‌ చేశారు. కాగా, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం షూటింగ్‌ జరుపుకుంటోంది. https://twitter.com/TrackTwood/status/1737423086188925221 అడివి శేష్ ఫిల్మ్‌ జర్నీ ఇదే.. ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ (Sontham) సినిమాలో చిన్న క్యారెక్టర్‌‌ చేసిన అడివి శేష్ ‘కర్మ’ (Karma) సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన ‘పంజా’ (Panja) సినిమాలో విలన్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘రన్‌ రాజా రన్’, ‘బాహుబలి’ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించిన అతడు ‘క్షణం’ (Kshanam), ‘గూఢచారి’ (Guachari), ‘ఎవరు’ (Yevaru), ‘మేజర్’ (Mejor), ‘హిట్‌ 2’ (Hit 2) వంటి వైవిధ్యమైన చిత్రాలతో నమ్మదగిన హీరోగా మారిపోయాడు. ముఖ్యంగా ‘మేజర్‌’ సినిమాతో అడివి శేష్‌ మార్కెట్‌ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం అతడి చేతిలో గూఢచారి సీక్వెల్‌ (G2)తో పాటు, ‘డెకాయిట్’ వంటి పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్‌ ఉన్న సంగతి తెలిసిందే. 
    డిసెంబర్ 17 , 2024
    MARCH 10: ఈ వారం థియేటర్లు/OTTల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు
    MARCH 10: ఈ వారం థియేటర్లు/OTTల్లో విడుదలయ్యే చిత్రాలు/ వెబ్‌ సిరీస్‌లు
    వేసవి సెలవులకు సమయం ఉండటంతో పెద్ద చిత్రాలు రాకముందే చిన్న సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి. స్పసెన్స్‌ థ్రిల్లర్లు, మోస్ట్ వెయిటింగ్ వెబ్‌ సిరీస్‌లు ఇందులో ఉన్నాయి. మరి ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో సందడి చేసే సినిమాలు వెబ్‌ సిరీస్‌ల గురించి తెలుసుకోండి.&nbsp; సీఎస్‌ఐ సనాతన్‌ ఆది సాయి కుమార్‌, మిషా నారంగ్‌ జంటగా నటించిన చిత్రం CSI సనాతన్. ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 10న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చాలాకాలంగా హిట్‌ కోసం ఎదురుచూస్తున్న ఆది… ఈ చిత్రంతో మెప్పిస్తాడని అంతా ఆశిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.&nbsp; ట్యాక్సీ వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మేనన్ కీలక పాత్రుల్లో నటించిన చిత్రం ట్యాక్సీ. వైవిధ్యమైన సస్పెన్స్‌ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. హరీశ్ సజ్జా దర్శకత్వం వహించగా.. హరిత సజ్జా నిర్మించారు. ఈ సినిమాను మార్చి 10న విడుదల చేస్తున్నారు. నేడే విడుదల చిత్ర పరిశ్రమకు సంబంధించిన కథతో రామ్‌ రెడ్డి పన్నాల నేడే విడుదల చిత్రాన్ని రూపొందించారు. ఆసిఫ్ ఖాన్, మౌర్యాని జంటగా నటించిన ఈ సినిమా కూడా మార్చి 10న రిలీజ్ అవుతోంది. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దినట్లు మేకర్స్ తెలిపారు. వాడు ఎవడు యదార్థ సంఘటనల ఆధారంగా వాడు ఎవడు చిత్రాన్ని తెరకెక్కించారు. కార్తికేయ, అఖిల్ నాయర్‌ హీరో హీరోయిన్లుగా సస్పెన్స్ థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందించిన ఈ చిత్రం మార్చి 10న విడుదలకు సిద్ధమయ్యింది. ఎస్. శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. ఆడమ్ డ్రైవర్‌ ‘65’ హాలీవుడ్‌ నుంచి వస్తున్న మరో యాక్షన్‌, అడ్వెంచరస్‌ మూవీ 65. ఆడమ్ డ్రైవర్‌, అరియానా గ్రీన్‌బ్లాట్‌, క్లో కోల్‌మన్‌ నటించారు. స్కాట్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మార్చి 10న రిలీజ్‌ కానుంది. స్పెస్‌ షిప్‌లో తెలియని గ్రహానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులకు అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయనే కథతో తెరకెక్కించారు. యాంగర్ టేల్స్‌ డిస్లీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా మరో వెబ్‌ సిరీస్‌ రానుంది. దర్శకుడు వెంకటేశ్ మహా, సుహాస్‌, బింధు మాధవి, మడోనా సెబాస్టియన్ వంటి స్టార్ నటులు ఇందులో ఉన్నారు. మార్చి 9న ఈ వెబ్‌ సిరీస్‌ స్ట్రీమింగ్ కానుంది. ఎన్నో ఆశలతో ఉండే నలుగురికి నచ్చని జీవితం ఎదురైతే ఎలా అనేది కథాంశం. సుహాస్‌ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం.&nbsp; రానా నాయుడు బాలీవుడ్‌, టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న వెబ్‌సిరీస్‌లలో ఒకటి రానా నాయుడు. వెంకటేశ్, రానా తండ్రీ కొడుకులుగా నటిస్తున్న వెబ్‌సిరీస్‌పై అంచనాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌ ఆకట్టుకుంటుంది. వీరిద్దరికీ ఇదే తొలి వెబ్‌ సిరీస్‌ కాగా… మార్చి 10న నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‌ చేసేందుకు అన్ని సిద్ధం చేశారు. రే డొనోవాన్‌ టీవీ సిరీస్‌ ఆధారంగా భారతీయ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దారు. మరికొన్ని ఓటీటీ రిలీజ్‌లు Title CategoryLanguagePlatformRelease DateRekhaMovieMalayalamNetflixMarch 10The glorySeriesKoreanNetflixMarch 10Happy family: conditions applySeriesHindiPrime videoMarch 10Chang can dunkMovieEnglish&nbsp;disney+hotsarMarch 10Run baby runMovietamil/telugudisney+hotsarMarch 10Ram yo&nbsp;Moviekannadazee5March 10Bommai nayagiMovietamilzee5March 10Boudy canteenMovieBangla&nbsp;zee5March 10Accident farmer and coSeriesTamil&nbsp;Sony livMarch 10christyMoviemalayalamSony livMarch 10Bad trip&nbsp;Movie&nbsp;TeluguSony livMarch 10
    మార్చి 06 , 2023
    Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
    Priya Bhavani Shankar: ఎవరు పాప నువ్వు.. ఇన్నాళ్లు ఇంత అందం ఎక్కడ దాచావు?
    తమిళ్ హీరోయిన్&nbsp; ప్రియా భవాని శంకర్ టాప్ టూ బాటమ్ బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టింది.&nbsp; సొగసైన అందాలతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టేస్తుంది&nbsp; వరుస ఆఫర్స్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఈ భామ వలపుల వయ్యారాలతో కుర్రకారును చిత్తుచేస్తుంది. తమిళ చిత్రాల్లోనే నటిస్తున్న ఈ నెరజాన… తెలుగులోనూ ఓ చిత్రంలోనూ నటించింది యంగ్ హీరో సంతోష్ శోభన్ సరసన కళ్యాణం కమనీయం మూవీలో హీరోయిన్‌గా మెప్పించింది 1989 డిసెంబర్ 31న జన్మించిన ఈ సొగసుల లేడీ.. తొలుత టీవీల్లో యాంకర్‌గా ప్రస్థానం ప్రారంభించింది. తమిళ్‌లో మేయదాన్ మాన్ ( మేయని జింక) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది ప్రియా భవాని శంకర్ జయంరవికి జంటగా నటించిన అఖిలన్‌, శింబుతో జతకట్టిన పత్తుతల, తాజాగా రాఘవలారెన్స్‌ సరసన నటించిన రుద్రన్‌ చిత్రాలు వరుసగా విడుదలయ్యాయి. తాజాగా ఎస్‌ జే సూర్య సరసన బొమ్మయ్ సినిమాలో హీరోయిన్‌గా నటించింది ప్రస్తుతం తమిళ్‌లో వరుసగా ఐదు చిత్రాల్లో నటిస్తోంది హరి డైరెక్షన్‌లో విశాల్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా ఛాన్స్ కొట్టేసింది.
    జూన్ 19 , 2023
    గూగుల్‌ని షేక్ చేసిన ఈ సోషల్ మీడియా స్టార్ ఎవరు?
    గూగుల్‌ని షేక్ చేసిన ఈ సోషల్ మీడియా స్టార్ ఎవరు?
    ]మాల్దీవుల్లో ఈ బ్యూటీ ఫొటోకి పోజులిచ్చిందిలా.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Nag Ashwin: అర్జునుడు vs కర్ణుడులో ఎవరు గొప్పా? ‘కల్కి’ డైరెక్టర్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌..!</strong>
    Nag Ashwin: అర్జునుడు vs కర్ణుడులో ఎవరు గొప్పా? ‘కల్కి’ డైరెక్టర్‌ ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌..!
    భారీ అంచనాలతో విడుదలైన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) చిత్రం.. బాక్సాఫీస్‌ వద్ద దూసుకుపోతుంది. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా క్రేజీ డైరెక్టర్‌ అశ్విన్‌ (Nag Ashwin) రూపొందించిన ఈ మూవీ.. అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పురాణాలకు ఫ్యూచరిక్‌ అంశాలను ముడిపెడుతూ తీర్చిదిద్దిన ‘కల్కి’పై సర్వత్రా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. అయితే కొందరు మాత్రం.. నెట్టింట ‘కల్కి’ సినిమాను తప్పుబడుతున్నారు. పురణాలను నాగ్‌ అశ్విన్‌ వక్రీకరించారని పోస్టులు పెడుతున్నారు. కౌరవుల పక్షాన ఉన్న కర్ణుడ్ని.. అర్జునుడి కంటే బలవంతుడిగా చూపించడాన్ని తీసుకోలేకపోతున్నారు. కాగా, దీనిపై నాగ్‌ అశ్విన్‌ తనదైన శైలిలో స్పందించారు.&nbsp; కల్కిపై నెటిజన్ల ప్రశ్నలు! 'కల్కి 2898 ఏడీ' క్లైమాక్స్‌లో కర్ణుడు పాత్రను హైలెట్‌ చేయడంపై సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. కర్ణుడు మరలా తిరిగొచ్చినట్లు చూపించడం పురాణాలను వక్రీకరించినట్లేనని కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. అశ్వత్థామ చిరంజీవి కాబట్టి ఆయన తిరిగొచ్చినట్లు చూపించడంలో లాజిక్ ఉందని అంటున్నారు. కల్కి అవతార సమయంలో అశ్వత్థామ భగవంతుండికి అండగా ఉంటాడని పురణాలు సైతం చెప్పాయని పేర్కొంటున్నారు. మరి కర్ణుడు కూడా ఫ్యూచర్‌లో మళ్లీ తిరిగొస్తాడని పురణాల్లో ఎక్కడ చెప్పలేదని గుర్తు చేస్తున్నారు. అంతా ఓకే గానీ కర్ణుడు విషయంలో మాత్రం దర్శకుడు తన లెక్కతప్పాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పైగా పాండవుల్లో ఒకరైన అర్జునుడు పాత్రను తగ్గిస్తూ.. కౌరవుల పక్షాన నిలిచిన కర్ణుడుని హైలెట్‌ చేయడం బాగోలేదని అంటున్నారు. కల్కి సినిమాలో చూపించినట్టు కర్ణుడు గొప్ప అయితే అర్జునుడు గొప్ప కాదా? అని ప్రశ్నిస్తున్నారు.&nbsp; ‘కర్ణుడుని అందుకే హైలెట్‌ చేశా’ కల్కి సినిమాలో కర్ణుడు పాత్రపై వస్తున్న ప్రశ్నలపై దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తాజాగా స్పందించారు. కర్ణుడుని ఎందుకు అంత గొప్పగా చూపించారు? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 'మహాభారతంలో ఉన్న కర్ణుడిని ప్రేమించేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అతని స్వభావాన్ని మెచ్చుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు ఈ దేశంలో ఎక్కువ మంది ఉన్నారు. అందుకే అతని క్యారెక్టర్‌ని హైలైట్ చేశా' అని నాగ్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చారు. ఈ మాటలతో కొందరు నెటిజన్లు ఏకీభవిస్తున్నారు. పురణాలు సైతం కర్ణుడుని ధీశాలిగా కీర్తించాయని గుర్తు చేస్తున్నారు. ఆయన శక్తి సామర్థ్యాలు ఎంతో గొప్పవని, నాగ్‌ అశ్విన్‌ చూపించిన దాంట్లో ఎలాంటి తప్పు లేదని సమర్థిస్తున్నారు.&nbsp; కర్ణుడు vs అర్జునుడు ఎవరు గొప్పా? మరి అర్జునుడు గొప్ప? కర్ణుడు గొప్ప? అన్న ప్రశ్నను రిపోర్టర్లు నాగ్ అశ్విన్ ముందు ఉంచారు. దీనిపై నాగ్‌ అశ్విన్‌ మరో వివరణ ఇచ్చారు. ‘ వారిద్దరిలో (అర్జునుడు, కర్ణుడు) ఎవరు గొప్ప అనే దాని గురించి పక్కన పెడదాం. ఇప్పుడు మహాభారతం మీద చర్చ జరుగుతుంది కదా.. అది మంచి విషయమే కదా.. అందరూ దీని గురించి తెలుసుకుంటారు కదా’ అని అసంపూర్ణ సమాధానమిచ్చారు. ఈ కామెంట్స్‌ను కొందరు నెటిజన్లు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అంటే.. ధర్మం వైపు నిలిచిన అర్జునుడే గొప్ప అని చెప్పకుండా ప్రశ్నను దాటవేయడం ఏంటని నిలదీస్తున్నారు. ఇది సినిమా చూసే ప్రేక్షకులను అయోమయంలోకి నెట్టడమేనని మండిపడుతున్నారు. ప్రేక్షకులను తప్పుదోవ పట్టించడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంటున్నారు.&nbsp; 'కల్కి 2' రిలీజ్‌ ఎప్పుడంటే? ‘కల్కి 2898 ఏడీ’ సూపర్‌ సక్సెస్‌ కావడంతో రెండో పార్ట్‌ రిలీజ్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కల్కి 2 రిలీజ్‌పై ఇటీవల నిర్మాత అశ్వనీదత్‌ మాట్లాడారు. 'కల్కి పార్ట్-2' షూటింగ్ ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ సీక్రెట్​ను రివీల్ చేశారు.&nbsp; అంతేకాకుండా 2025 సమ్మర్​ కల్లా ఈ సినిమా థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. 'త్వరగా అఫీషియల్ అప్డేట్​ ఇవ్వండి', 'పార్ట్ 2 కోసం వెయిటింగ్​' అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేశారు.&nbsp;
    జూలై 06 , 2024
    Prithwi Shaw: పృథ్వీ షాపై దాడి చేసిన సప్న గిల్ ఎవరు? వరుస వివాదాల్లో పృథ్వీ షా
    Prithwi Shaw: పృథ్వీ షాపై దాడి చేసిన సప్న గిల్ ఎవరు? వరుస వివాదాల్లో పృథ్వీ షా
    ]మరిన్ని కథనాల కోసం&nbsp; మా వెబ్‌సైట్‌ చూడండి.&nbsp; YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.Download Our App
    ఫిబ్రవరి 17 , 2023
    సంక్రాంతి సినిమాలు..బాక్సాఫీస్‌ కలెక్షన్లు ఎవరు విన్నర్‌?
    సంక్రాంతి సినిమాలు..బాక్సాఫీస్‌ కలెక్షన్లు ఎవరు విన్నర్‌?
    ]ఇంకా రెండు మూడు రోజులు బాక్సాఫీస్‌ వార్‌ కొనసాగే అవకాశముంది. జనవరి 16న కూడా సంక్రాంతి సెలవు కావడంతో కలెక్షన్ల సునామీ కొనసాగే అవకాశముంది.
    ఫిబ్రవరి 13 , 2023
    <strong>Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్‌’తో హిట్ కొట్టినట్లేనా?</strong>
    Swag Movie Review: స్త్రీ, పురుషులలో ఎవరు గొప్పో చెప్పేసిన శ్రీవిష్ణు.. ‘స్వాగ్‌’తో హిట్ కొట్టినట్లేనా?
    నటీనటులు : శ్రీవిష్ణు, రితూ శర్మ, దక్ష నగర్కర్‌, మీరా జాస్మిన్‌, సునీల్‌, గెటప్‌ శ్రీను, రవి బాబు, గోపిరాజు రమణ, శరణ్య ప్రదీప్‌ తదితరులు రచన, దర్శకత్వం : హసిత్‌ గోలి సంగీతం : వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: వేదరామన్‌ శంకరన్‌ ఎడిటింగ్‌: విప్లవ్‌&nbsp; నిర్మాత : టి. జి. విశ్వప్రసాద్‌ విడుదల తేదీ: 04-10-2024 వివైధ్య కథలకు కేరాఫ్‌గా మారిన శ్రీవిష్ణు (Sree Vishnu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘స్వాగ్‌’ (Swag Movie)&nbsp; ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) వంటి సూపర్‌ హిట్‌ తర్వాత హసిత్‌ గోలి (Hasith Goli) దర్శకత్వంలో వచ్చిన రెండో చిత్రం ఇది. ఇందులో రీతూవర్మ (Ritu Varma), మీరా జాస్మిన్‌ (Meera Jasmine), దక్ష నగర్కర్‌ (Daksha Nagarkar) కథానాయికలుగా చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అక్టోబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా? శ్రీవిష్ణు-హసిత్‌ గోలి కాంబోకు మరో విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి శ్వాగనిక వంశానికి సంబంధించి కథ సాగుతుంది. 1550 ప్రాంతంలో మాతృస్వామ్యం, పితృస్వామ్యం అంటూ మగ, ఆడవారి మధ్య ఆధిపత్య తగాదాలు ఉండేవి. భవభూతి మహారాజు (శ్రీవిష్ణు) తన సతీమణి(రీతువర్మ)ని గుప్పెట్లో పెట్టుకోవాలని ప్లాన్ వేసి అందులో విజయం సాధిస్తాడు. అప్పటి నుండి రాజ్యంలోని మహిళలు అంతా అతని ఆధీనంలో ఉంటారు. ఇక అతని తర్వాతి సంతతిలో యభూతి (శ్రీవిష్ణు)కి వరుసగా ఆడపిల్లలు పుడతారు. తర్వాత మగపిల్లలు కవలలుగా పుడతారు. కానీ, తన స్నేహితుడు(సునీల్)కి మగపిల్లలు లేరని తన ఇద్దరి పిల్లల్లో ఒకరిని దానం చేసేస్తాడు. కాలక్రమేణా శ్వాగనిక వంశానికి చెందిన వారు చెల్లాచెదురు అవుతారు. కట్‌ చేస్తే శ్వాగనిక వంశానికి చెందిన సంపద ఓ చోట భద్రంగా ఉంటుంది. ఆ వంశానికి చెందిన వారసుడికి అది ఇవ్వాలని నిర్ణయిస్తారు. ఈ క్రమంలో తామే శ్వాగనిక వంశానికి చెందినవారమంటూ కొందరు వస్తారు. ఇంతకీ వారు ఎవరు? సంపద వారికి దక్కిందా? లేదా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే యువ నటుడు శ్రీవిష్ణు తన నటనతో అదరగొట్టాడు. భవభూతి మహారాజు, యభూతి, భవభూతి, విభూతి, సింగ వంటి ఐదు పాత్రల్లో అతడు కనిపించాడు. యభూతి పాత్రతో ప్రేక్షకులకు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయ్యాడు. భవభూతి పాత్రతో నవ్విస్తూ ఆకట్టుకున్నాడు. రీతూవర్మ కూడా తన పర్ఫామెన్స్‌తో మెప్పించింది. 11 ఏళ్ల తర్వాత తెలుగు తెరపై రీఎంట్రీ ఇచ్చిన మీరా జాస్మిన్‌ తన నటనతో పర్వాలేదనిపించింది. దక్షా నగర్కర్‌ తన గ్లామర్‌తో మంచి మార్కులు కొట్టేసింది. నటనకు పెద్దగా స్కోప్‌ లభించలేదు. రవి బాబు, సునీల్‌, గెటప్‌ శ్రీను వంటి నటులు ఉన్నప్పటికీ సినిమా మెుత్తం శ్రీవిష్ణు మీదనే తిరగడంతో వారి పాత్రలు హైలేట్‌ కాలేదు. మిగిలిన పాత్రదారులు పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు హసిత్ గోలి ఎంపిక చేసుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ చాలా గందరగోళంగా అనిపిస్తుంది. తొలి అర్ధభాగంలో దాదాపు 40 నిమిషాల వరకు కథేంటో తెలీదు. ఆ టైంలో వచ్చే కామెడీ కాస్త ఊరటనిస్తుంది. భవభూతి ఫ్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్ ఆసక్తిగా చూపించి కథలోకి తీసుకెళ్లారు డైరెక్టర్‌. ఇంటర్వెల్ బ్లాక్ గజిబిజిగా అనిపించినా ఓకే అనిపిస్తుంది. మొత్తంగా ఫస్ట్ హాఫ్ యావరేజ్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ విషయానికి వస్తే యభూతి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌ను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు నవ్వించేలా ఉన్నాయి. కానీ క్లైమాక్స్ మళ్ళీ గందరగోళంగానే ముగుస్తుంది. ‘లింగ వివక్ష అనేది సమాజానికి చీడ’ అన్నట్టు ఓ లైన్‌తో ముగించారు దర్శకుడు. అయితే అర్దాంతరంగానే సినిమా ముగిసిన భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యుజింగ్‌గా అనిపిస్తుంది. సినిమా మెుత్తం పూర్తి ఏకాగ్రతతో చూస్తే తప్ప అర్ధమయ్యేలా లేదు. టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే వివేక్ సాగర్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ సినిమాకు ప్లస్‌గా మారాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బడ్డెట్‌ తక్కువే అయినా మంచి రిచ్‌ ఔట్‌పుట్‌ను అందించారు.&nbsp; ప్లస్‌ పాయింట్స్ కథశ్రీవిష్ణు నటనకామెడీ మైనస్‌ పాయింట్స్‌ కన్ఫ్యూజింగ్‌ స్క్రీన్‌ప్లేస్లో నేరేషన్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    అక్టోబర్ 04 , 2024
    <strong>The Mystery of Moksha Island Review: మిస్టరీ ఐలాండ్‌లో ఆ హత్యలు చేస్తోంది ఎవరు?</strong>
    The Mystery of Moksha Island Review: మిస్టరీ ఐలాండ్‌లో ఆ హత్యలు చేస్తోంది ఎవరు?
    నటీనటులు: నందు, తేజస్వి మదివాడ, ప్రియా ఆనంద్‌, అశుతోష్‌ రానా, పావని రెడ్డి, కేశవ్‌ దీపక్, సుధా, భానుచందర్‌ తదితరులు డైరెక్టర్‌: అనిష్‌ కురువిల్లా సినిమాటోగ్రఫీ : నవీన్‌ యాదవ్‌ సంగీతం : శక్తికాంత్‌ కార్తిక్‌ ఎడిటింగ్‌: ఉమైర్‌ హాసన్‌, ఫయాజ్‌ రాయ్‌ నిర్మాతలు: గోపిచంద్‌ ఆచంట, రామ్ ఆచంట ఓటీటీ: డిస్నీ + హాట్‌స్టార్‌ అశుతోష్ రానా, ప్రియా ఆనంద్, నందు, సోనియా అగర్వాల్, తేజస్విని మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్‌ తెలుగు వెబ్ సిరీస్ ‘ది మిస్టరీ ఆఫ్ మోక్ష ఐల్యాండ్’ (The Mystery of Moksha Island Review). నటుడు అనిష్‌ కురువిల్లా ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించారు. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? అన్నది ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి నోబెల్ బహుమతి అందుకున్న భారతీయ శాస్త్రవేత్త విశ్వక్ సేన్ (అశుతోష్ రాణా) అనుకోకుండా ఓ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో మరణిస్తాడు. అతడి ఆస్తి దాదాపు రూ.24 వేల కోట్లు. చనిపోవడానికి ముందే ఆస్తిని తనకు సంబంధించిన వారందరికీ సమానంగా పంచాలని విశ్వక్‌ వీలునామా రాస్తాడు. అయితే ఆ ఆస్తిలో భాగస్వామ్యం సంపాదించుకోవాలంటే మోక్ష ఐలాండ్‌లో వారం రోజులపాటు ఉండాలని షరతు విధిస్తాడు. ఈ నిబంధనకు అంగీకరించిన విశ్వక్‌ సేన్‌ కుటుంబ సభ్యులు మోక్ష ఐలాండ్‌లో ల్యాండ్ అవుతారు. అయితే అక్కడ వారికి ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. ఒక్కొక్కరిగా చనిపోవడం జరుగుతుంది. అసలు మోక్ష ఐలాండ్‌ మిస్టరీ ఏంటి? అక్కడ వారం రోజులు ఉండాలని విశ్వక్ ఎందుకు నిబంధన విధించాడు? వెళ్లిన వారు విశ్వక్‌ కుటుంబ సభ్యులేనా? కాదా? విశ్వక్‌కు మోక్ష ఐలాండ్‌కు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే ఈ వెబ్‌సిరీస్‌లో (The Mystery of Moksha Island Review) చాలా మంది యాక్ట‌ర్స్ ఉన్నారు. వారిలో ప్రియా ఆనంద్‌, నందు, అశుతోష్‌ రానా ఆకట్టుకుంటాయి. ఐలాండ్ మిస్ట‌రీ ఛేదించేందుకు తాప‌త్ర‌య‌ప‌డే యువ‌కుడిగా నందు త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. క‌న్నింగ్ సైంటిస్ట్ పాత్ర‌కు అశుతోష్‌ రానా వంద‌శాతం న్యాయం చేశాడు. తేజ‌స్వి మ‌దివాడ, అక్ష‌ర గౌడ నటనతో కంటే తమ గ్లామ‌ర్‌తోనే ఎక్కువగా ఆకట్టుకున్నారు. ప్రముఖ యాంకర్‌ సుమ కనకాల కుమారుడు రోషన్‌ కనకాల గే తరహా పాత్రలో కనిపించి మెప్పించాడు. భానుచంద‌ర్‌, సోనియా అగ‌ర్వాల్‌, అజ‌య్ క‌తుర్వార్‌, స‌త్య‌కృష్ణతో పాటు మిగిలిన వారు తమ నటనతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.&nbsp; డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు అనిష్‌ కురువిల్లా ఐలాండ్‌ నేపథ్యంలో రాసుకున్న మిస్టరీ స్టోరీ బాగుంది. మాస్‌, క్లాస్ ఇలా విభిన్న నేప‌థ్యాల‌తో సిరీస్‌లోని ప్రతీ క్యారెక్టర్‌ను డిజైన్‌ చేశారు. ప్ర‌తి క్యారెక్ట‌ర్ వెనుక ఓ తెలియ‌ని కోణాన్ని చూపించిన తీరు బాగుంది. ఐలాండ్‌లో అడుగుపెట్టిన వారిని ఎవరు హ‌త్య‌లు చేస్తున్నారు? ఒక‌రిని మ‌రికొరు అనుమానించే ఎపిసోడ్స్ ఉత్కంఠ‌ను పంచుతాయి. ఆరు ఎపిసోడ్స్ వ‌ర‌కు ఐలాండ్ గురించి అనేక ప్ర‌శ్న‌లు రేకెత్తిస్తూ వీక్షకుల్లో ఆసక్తిని పెంచాడు దర్శకుడు. చివరి రెండు ఎపిసోడ్స్‌లో చిక్కుముడులను ఒక్కొక్కొటిగా విప్పిన విధానం మెప్పిస్తుంది. అయితే లెక్కకు మించి పాత్రలు స్క్రీన్‌పై కనిపించడం గందరగోళానికి గురిచేస్తుంది. రొమాంటిక్‌, బోల్డ్‌ సీన్స్‌ ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇబ్బందిగా అనిపించవచ్చు. క్లైమాక్స్‌ అంత సంతృప్తిగా అనిపించదు. అయితే థ్రిల్లర్‌ జానర్స్‌ను ఇష్టపడేవారికి మాత్రం ఈ సిరీస్‌ తప్పకుండా నచ్చుతుంది.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే నవీన్‌ యాదవ్‌ సినిమాటోగ్రఫీ వర్క్‌ బాగుంది. బీచ్‌ ఎపిసోడ్స్‌ను బాగా చూపించాడు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా మంచి పనితీరు కనబరిచింది. ల్యాబ్‌ సెటప్‌ సహజంగా అనిపిస్తుంది. శక్తికాంత్‌ కార్తీక్‌ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదు. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ ప్రధాన తారాగణం నటనఆసక్తికర కథనంట్విస్టులు మైనస్‌ పాయింట్స్‌ బోల్డ్‌ కంటెంట్‌లెక్కకు మించిన పాత్రలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;
    సెప్టెంబర్ 21 , 2024
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    Exclusive: ‘ఫ్యామిలీ స‌్టార్’ ’ నిజంగా బాగోలేదా? నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నది ఎవరు?
    విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).. గత శుక్రవారం విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ట్రైలర్‌, టీజర్‌తో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన మూవీ టీమ్‌.. వినూత్నమైన ప్రమోషన్స్‌తో మరింత హైప్‌ క్రియేట్‌ చేసింది. కానీ రిలీజ్‌ తర్వాత ఒక్కసారిగా ఈ సినిమాపై ట్రోల్స్‌, నెగిటివిటీ మెుదలైంది. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌కు గురైంది. అసలు సినిమా ఇలా ఎవరైనా తీస్తారా? అంటూ విమర్శలు సైతం వచ్చాయి. ఓ వైపు ఫ్యామిలీ స్టార్‌ బాగుందంటూ చూసినవారు చెబుతుంటే.. నెట్టింట మాత్రం ఇంత నెగిటివిటీ రావడానికి కారణమేంటి? కావాలనే ఈ సినిమాపై నెగిటివిటీని రుద్దుతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో పరిశీలిద్దాం.&nbsp; ఆడియన్స్‌ ఏమంటున్నారు? ఫ్యామిలీ స్టార్‌ సినిమాను చూసిన వారంతా సినిమా చాలా బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా అద్భుతంగా ఉందంటూ స్పష్టం చేస్తున్నారు. బయట ఎందుకు అంతలా ట్రోల్స్‌, నెగిటివిటీ స్ప్రెడ్‌ చేస్తూన్నారో అర్థం కావట్లేదని పేర్కొన్నారు. ‘ఫ్యామిలీ స్టార్‌’ యావరేజ్‌ కూడా కాదని ఒకటికి రెండుసార్లు చూడాల్సిన సినిమా అంటూ కొందరు యువకులు చెప్పడం విశేషం. https://twitter.com/cult1_rowdy/status/1776852998855262234 https://twitter.com/i/status/1776636730034245707 https://twitter.com/plaasya/status/1777072948597428600 విజయ్‌కు ముందే తెలుసా? ‘ఫ్యామిలీ స్టార్‌’ గురించి ఇద్దరు యూట్యూబ్‌ రివ్యూవర్లు మాట్లాడుకున్న వీడియోను విజయ్‌ ఫ్యాన్స్‌ తెగ ట్రెండ్‌ చేస్తున్నారు. ఇందులో ఓ రివ్యూవర్‌ మాట్లాడుతూ.. ఫ్యామిలీ స్టార్‌ సినిమాపై హేట్‌ లేదని చెప్పాడు. అయితే విజయ్‌ దేవరకొండపై మాత్రం బాగా వ్యతిరేకత ఉందని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని విజయ్‌ స్వయంగా నిర్మాత దిల్‌ రాజుతో చెప్పినట్లు రివ్యూవర్‌ అన్నాడు. ‘నాతో సినిమా చేస్తే ఓ బ్యాచ్‌ రెడీ అవుతది.. మీరు దానికి సిద్ధంగా ఉన్నారా? అంటూ దిల్‌రాజ్‌తో విజయ్‌ అన్నాడట. అలాంటి బ్యాచ్‌లు కూడా ఉంటాయా? అని అప్పుడు దిల్‌ రాజు కూడా షాకైనట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.&nbsp; https://twitter.com/chanticomrade_/status/1776839226312753263 విజయ్‌ను ఎందుకు టార్గెట్‌ చేస్తున్నారు? మెుదటి నుంచి విజయ్‌ దేవరకొండకు సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున యాంటి ఫ్యాన్స్ ఉంటున్నారు. ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్ లేకుండా ఒక్క సినిమాతో స్టార్ హీరో స్థాయికి చేరడం.. కొంత మంది స్టార్ హీరోల ఫ్యాన్స్‌కు మింగుడు పడలేదన్నది వాస్తవం. అయితే విజయ్ సహజమైన ప్రవర్తన, మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూల్లో… అతడు మాట్లాడే పద్దతి, ఉన్నది ఉన్నట్లు చెప్పే తీరు, కొన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడటం కొందరికి నచ్చలేదన్నిది వాస్తవం. పలు సందర్భాల్లో విజయ్ క్లిప్పులను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ట్రోల్ చేసిన సందర్భాలు అనేకం. &nbsp; కారణం ఏదైనా విజయ్‌ నుంచి ఏ సినిమా రిలీజైనా దాన్ని టార్గెట్‌ చేస్తూ సినిమాను వెనక్కిలాగటానికి ట్రై చేస్తున్నారు. అయితే ఈసారి ‘ఫ్యామిలీ స్టార్‌’కు విజయ్‌పై ఉన్న నెగిటివిటీతో పాటు.. నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు పరుశురామ్‌పై ఉన్న హేట్‌ కూడా తోడైనట్లు కనిపిస్తోంది. అందుకే సినిమా బాగున్నా ఈ స్థాయిలో ట్రోల్స్‌, నెగిటివ్స్‌ బయటకు వస్తున్నాయి.&nbsp; దిల్‌ రాజుపై నెగిటివిటీ దిల్‌ రాజు విషయానికి వస్తే.. గత సంక్రాంతి నుంచి ఆయనపై ట్రోల్‌ మెుదలయ్యాయి. తమిళ స్టార్‌ విజయ్‌తో చేసిన ‘వారసుడు’ చిత్రాన్ని గతేడాది సంక్రాంతికి దిల్‌ రాజు రిలీజ్‌ చేశారు. చిరు (వాల్తేరు వీరయ్య), బాలయ్య (వీరసింహా రెడ్డి)లకు పోటీగా ఈ సినిమాను తీసుకురావడం కొందరికి నచ్చలేదు. ఈ సంక్రాంతికి ‘హనుమాన్‌’ విషయంలోనూ దిల్‌ రాజుపై విమర్శలు వచ్చాయి. చిన్న సినిమాలు వెనక్కి తగ్గాలంటూ ఇన్‌డైరెక్ట్‌గా హనుమాన్‌కు ఆయన సూచించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది.&nbsp; అటు డైరెక్టర్‌ పరుశురామ్‌.. విజయ్‌తో ‘గీతా గోవిందం’ తర్వాత గీతా ఆర్ట్స్‌తో మరో సినిమా చేయాల్సి ఉంది. అయితే సడెన్‌గా దిల్‌ రాజు నిర్మాణంలో ‘ఫ్యామిలీ స్టార్‌’ చేయడం కూడా ఒక సెక్షన్‌లో ఆయనపై వ్యతిరేకత రావాడనికి కారణమైంది. ఈ ముగ్గురిపై ఉన్న వ్యతిరేకతే ‘ఫ్యామిలీ స్టార్‌’పై పెద్ద ఎత్తున ట్రోల్స్‌, నెగిటివిటీ రావడానికి కారణమై ఉండొచ్చని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.&nbsp; ఫేక్ రివ్యూస్ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని పీఆర్ టీమ్స్ పనిగట్టుకుని సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే నెగిటివిటిని స్ప్రెడ్ చేయడం మొదలు పెట్టాయి. సినిమా బాగోలేదని, ఈ సినిమా 90mm రాడ్ అంటూ ఘోరంగా ట్రోల్స్ చేశాయి. ఈ ట్రోల్స్ ప్రేక్షకులపై ప్రభావం చూపాయి. ఫలితంగా సినిమా వసూళ్లు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి.&nbsp; అయితే అమెరికా, ఇతర దేశాల్లో మాత్రం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజుల్లో 500K డాలర్లను రాబట్టింది. రిలీజ్‌కు ముందే ట్రోల్స్‌! వాస్తవానికి ‘ఫ్యామిలీ స్టార్‌’ థియేటర్లలోకి రాకముందే ట్రోల్స్‌ మెుదలయ్యాయి. ట్రైలర్‌ విడుదలైనప్పటి నుంచి కొందరు ఈ సినిమాను టార్గెట్‌ చేశారు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీ కథ అని చెప్పి.. హీరో ఎలా రిచ్‌ కాస్ట్యూమ్స్‌ ధరిస్తాడని.. బ్రాండెండ్‌ షూస్‌ ఎలా వేస్తారని విమర్శించడం మెుదలు పెట్టారు. మీడియా సమావేశంలోనూ కొందరు విలేఖర్లు ఇదే విధమైన ప్రశ్నలు వేయడంతో నిర్మాత దిల్‌ రాజు గట్టిగానే కౌంటర్‌ ఇచ్చారు. మిడిల్‌ క్లాస్ అబ్బాయిని సూపర్‌ మ్యాన్‌గా చూపించారు? అంటూ ప్రశ్నలు వేయగా.. ‘హీరో అన్నాక హీరో పని చేయాలి కదా. హీరో ఒక 20 మందిని కొడతాడు. రియల్ లైఫ్‌లో కొట్టగలుగుతామా? యాక్షన్ సినిమాలు అన్నీ బ్లాక్ బస్టర్లే కదా. అది సినిమా.. మనం కోడిగుడ్డు మీద ఈకలు పీకడం ఎందుకు? ఎమోషన్‌కి కనెక్ట్ అయితే లాజిక్స్ ఉండవు’ దిల్‌ రాజు బదులిచ్చారు. ‘గుడ్‌ మూవీని చంపే ప్రయత్నం చేస్తున్నారు’ తొలిరోజు నుంచి సినిమాపై వచ్చిన నెగిటివిటీని తగ్గించేందుకు నిర్మాత దిల్‌రాజు స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన ఓ థియేటర్‌ వద్దకు వెళ్లి సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్‌ను మైక్‌ పెట్టి స్వయంగా ప్రశ్నలు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా సినిమా చూసిన ఓ ఆడియన్‌ మాట్లాడుతూ.. తనకు సినిమా చాలా బాగా నచ్చిందని దిల్‌రాజుతో అన్నారు. మంచి సినిమాను కూడా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. నెగిటివ్ రివ్యూలు ఇస్తున్న వారిపై మీరు యాక్షన్‌ తీసుకోవాలని దిల్‌రాజుకు సూచించారు.&nbsp; అయితే దిల్‌ రాజు దీనిపై స్పందిస్తూ.. కేరళలో సినిమా విడుదలైన మూడు రోజుల వరకు రివ్యూస్ ఇవ్వకూడదని అక్కడి కోర్టు ఆదేశాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇక్కడ కూడా అలాంటి చట్టం ఏదైన వస్తే కానీ ఇండస్ట్రీకి మంచి జరగదు అంటూ చెప్పుకొచ్చారు. మేము మంచి సినిమానే తీశాం. సినిమా నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి… కానీ రివ్యూల పేరుతో మీ అభిప్రాయాలను ప్రేక్షకుల మీద రుద్దొద్దు అంటూ చురకలు అంటించారు. https://telugu.yousay.tv/family-star-first-review-vijay-who-played-as-a-middle-class-boy-is-family-star-a-hit-free.html
    ఏప్రిల్ 08 , 2024
    Adipurush Memes: ఆదిపురుష్‌ సినిమాపై కడుపుబ్బా నవ్వించే మీమ్స్.. రే ఎవడ్రా మీరంతా..!&nbsp;
    Adipurush Memes: ఆదిపురుష్‌ సినిమాపై కడుపుబ్బా నవ్వించే మీమ్స్.. రే ఎవడ్రా మీరంతా..!&nbsp;
    ఆదిపురుష్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. థియేటర్ల వద్ద మిక్స్‌డ్ టాక్‌తో సినిమా దూసుకెళ్తోంది. అయితే, రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కాబట్టి.. ఇందులోని పాత్రల చిత్రీకరణ, గెటప్, తదితర విషయాల్లో మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా సినిమా విడుదలయ్యాక కూడా ఈ విమర్శలు ఆగట్లేదు. కొందరైతే పాత్రలను ఇంతకు ముందు సినిమాలతో పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు. మరీ, ముఖ్యంగా ఇందులో ఓ పాత్ర అయితే అచ్చం మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేని పోలి ఉందని పిక్స్ షేర్ చేస్తున్నారు.&nbsp; ఆదిపురుష్‌లో ఏక్‌నాథ్ షిండే.. ఆదిపురుష్‌లో వేసిన ఓ వానర పాత్ర గెటప్‌లో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాత్ షిండే ముఖ కవలికలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ముఖాన్ని చూస్తే డిట్టో షిండేనే అంటూ కామెంట్లు పెడుతున్నారు. రెండింటికీ తేడా.. నెటిజన్లు మరొక అడుగు ముందుకేసి ట్రోలింగ్ మొదలు పెట్టారు. సినిమాలో ప్రభాస్ తెల్లటి వస్త్రాలు ధరించి కనిపిస్తాడు. ఈ ఫొటోను గుర్తు చేస్తూ ఎక్కడో చూసినట్లుందే అంటూ కమెడియన్ రఘు బాబు ఫొటో షేర్ చేస్తున్నారు. దరువు సినిమాలోని పండిట్‌జీ గెటప్‌కి, ప్రభాస్ గెటప్‌కి ఏమైనా తేడా ఉందా చెప్పండంటూ కామెంట్లు పెడుతున్నారు.&nbsp; రావణ క్యారెక్టర్‌పై.. ఆదిపురుష్‌లో లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. అయితే, లంకేశుడి పాత్రను చూపించిన తీరుపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాల్మీకీ రామాయణంలో లేని రావణుడిని సృష్టించారంటూ గుణ గణాలను పోలుస్తున్నారు. ఇప్పటివరకు చూసిన రావణుడు, ఆదిపురుష్ రావణుడు పూర్తిగా విరుద్ధంగా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు.&nbsp; వీఎఫ్ఎక్స్‌పై.. గతేడాది ఆదిపురుష్ ట్రైలర్ రిలీజైనప్పటి నుంచి ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్‌పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. సినిమా విడుదలయ్యాక కూడా ఇవి ఆగట్లేదు. సినిమా కోసం దాదాపు రూ.500 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయినా, విజువల్ ఎఫెక్ట్స్ పేలవంగా ఉన్నాయంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఇతర సినిమాల గ్రాఫిక్స్‌తో పోల్చుతూ కామెంట్ చేస్తున్నారు. https://twitter.com/Lordofbattles8/status/1669609782595170305 మరికొందరు, ఇతర లోకల్ వీడియోలను షేర్ చేస్తూ ఆదిపురుష్ కన్నా ఇదే నయం అంటున్నారు.&nbsp; https://twitter.com/DoctorrSays/status/1669622038544400384 ఇప్పుడొచ్చిన ఆదిపురుష్ కన్నా 20 ఏళ్ల కిందట విడుదలైన అంజి సినిమాలో కంప్యూటర్ గ్రాఫిక్స్ బాగుందని మరొక నెటిజన్ ట్వీట్ చేశారు.&nbsp; https://twitter.com/superking1816/status/1669611748188622848 2010లోనే షారూక్ ఖాన్ సినిమాలో ఇంత చక్కని గ్రాఫిక్స్ ఉపయోగించడం గొప్ప విషయం అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. కర్మ ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుందని ట్వీట్ చేశారు. https://twitter.com/KaranAr37362920/status/1669563764017086464
    జూన్ 16 , 2023
    నోరా ఫతేహి.. ఫిఫా ప్రపంచకప్‌‌లో ప్రదర్శన చేసిన ఈ నటి ఎవరు?
    నోరా ఫతేహి.. ఫిఫా ప్రపంచకప్‌‌లో ప్రదర్శన చేసిన ఈ నటి ఎవరు?
    ]ఏదేమైనా, ఓ చిన్న పట్టణంలో డ్యాన్సర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. ఫిఫా ప్రపంచకప్‌లో స్టేజీ ప్రదర్శన చేసే స్థాయికి నోరా ఎదిగింది. నిజంగా&nbsp; ఈ నటి ప్రస్థానం స్ఫూర్తిదాయకం.స్ఫూర్తిదాయకం..
    ఫిబ్రవరి 13 , 2023
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    Tollywood Nepotism: నెపోటిజం వల్లే నాని, విజయ్ దేవరకొండ ‘టైర్‌ 2’ హీరోలుగా ఉండి పోయారా? దీనికి అసలు కారణం ఎవరు?
    నెపోటిజం అనేది సినీ పరిశ్రమలో ఎప్పుడు చర్చనీయాంశమే. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తర్వాత నెపోటిజంపై విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. వారసులుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నటీనటుల వల్ల ఇతరులకు అవకాశాలు లభించడం లేదన్న కామెంట్స్‌ పెద్ద ఎత్తున వినిపించాయి. అయితే వారసత్వం అనేది సినీ పరిశ్రమలో కామన్‌గా మారిపోయింది. ఇందుకు టాలీవుడ్‌ ఏమి అతీతం కాదు. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌ తర్వాత ఆ స్థాయిలో వారసత్వం ద్వారా వచ్చిన హీరోలు మన ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది ఉన్నారు. దీంతో నాని, విజయ్‌ దేవరకొండ, నితీన్‌, అడివిశేష్‌, శర్వానంద్‌, గోపిచంద్‌ తదితరులు ‘టైర్‌ 2’ హీరోలుగా మిగిలిపోతున్నారన్న వాదనలు ఉన్నాయి. అందులో వాస్తవమెంతా? నెపోటిజం వల్లే వారు రాణించలేకపోతున్నారా? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.&nbsp; అసలు ‘టైర్‌-2’ అంటే ఏంటి? సాధారణంగా ప్రతీ ఇండస్ట్రీలోనూ హీరో, హీరోయిన్లను వారికి ఉన్న క్రేజ్‌ను బట్టి రెండు లేదా మూడు రకాలుగా విడదీస్తారు. టాలీవుడ్‌కు వచ్చేసరికి ప్రభాస్‌ (Prabhas), రామ్‌చరణ్‌ (Ram Charan), ఎన్టీఆర్‌ (Jr NTR), అల్లు అర్జున్‌ (Allu Arjun), పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan), మహేష్‌బాబు (Mahesh Babu), చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Balakrishna) వంటి వారిని టైర్‌-1 హీరోలుగా ఇండస్ట్రీ వర్గాలు, సినీ విశ్లేషకులు లెక్కగడతారు. ఎందుకంటే వారి సినిమా రిలీజ్‌ అవుతుందంటే థియేటర్లలో పండగ వాతావరణం ఉంటుంది. తొలి రోజే దాదాపు 30 నుంచి 50 శాతం బడ్జెట్‌ వసూలవుతుంది. భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కూడా ఉండటంతో వారిని అగ్ర శ్రేణి నటులుగా దర్శకులు, నిర్మాతలు లెక్కగడతారు. టైర్‌ 2 విషయానికి వస్తే పరిస్థితులు కాస్త భిన్నంగా ఉంటాయి. ముందుగా చెప్పుకున్నట్లు ఈ జాబితాలో నాని, విజయ్‌ దేవరకొండ, నితిన్‌, రామ్‌ పోతినేని, నాగచైతన్య, గోపిచంద్‌ వంటి వారు ఉంటారు. అగ్రహీరోల రెమ్యూనరేషన్‌, ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, సినిమాల బడ్జెట్‌ పరంగా చూస్తే వీరు కాస్త వెనకబడి ఉంటారు. అగ్ర హీరోలతో పోటీ పడుతూ వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ వీరి చిత్రాల కలెక్షన్స్ పరిమితంగానే ఉంటాయి.&nbsp; కన్నెత్తి చూడని స్టార్‌ డైరెక్టర్స్‌! రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌, కొరటాల శివ వంటి స్టార్‌ డైరెక్టర్లు అగ్ర హీరోలతోనే సినిమాలు చేసేందుకు అసక్తి కనబరుస్తున్నారు. దీనివల్ల విజయ్‌ దేవరకొండ, నాని వంటి స్టార్‌ హీరోలకు అన్యాయం జరుగుతోందని వారి ఫ్యాన్స్‌ అంటున్నారు. స్టార్ డైరెక్టర్స్‌ తమ హీరోలను పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల వారు పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ కాలేకపోతున్నట్లు చెబుతున్నారు. కొత్త డైరెక్టర్లతో సినిమాలు చేసి పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదని చెబుతున్నారు. హీరో నాని ‘సరిపోదా శనివారం’ విషయంలో ఇదే జరిగిందని గుర్తుచేస్తున్నారు. పాన్ఇండియా స్థాయిలో ‘సరిపోదా శనివారం’ రిలీజ్‌ని ప్లాన్‌ చేసినా ఇప్పటికీ హిందీలో విడుదల కాలేదు. టాలీవుడ్‌ దాటి స్టార్‌ డమ్‌ లేకపోవడం వల్ల టాలెంట్‌ ఉన్నా కూడా నానికి మైనస్‌గా మారుతోందని ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; కథలు సైతం వెళ్లడం లేదా? ఒక సినిమాలో ఎంత మంచి తారాగణం ఉన్నప్పటికీ సరైన కథ లేకుంటే ఆ సినిమా ఆడటం కష్టం. ఒక సినిమా సక్సెస్సా? ఫెయిల్యూరా? అనేది డిసైడ్‌ చేసేది స్టోరీనే. అయితే ఇటీవల ‘టైర్‌ 2’ హీరోల చిత్రాలు చూస్తుంటే స్టోరీలు సరిగా వినే చేస్తున్నారా అన్న ప్రశ్న ఫ్యాన్స్‌ నుంచి ఎదురవుతోంది. ఇటీవల రామ్ పోతినేని చేసిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’, రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’, నితిన్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, గోపిచంద్‌ ‘రామబాణం’ సినిమాలు అసలు ఎందుకు ఒప్పుకున్నారో కూడా ఫ్యాన్స్‌కు అర్థం కాని పరిస్థితి. అయితే పాన్‌ ఇండియా స్థాయి స్క్రిప్ట్స్‌ పెద్ద హీరోల వద్దకే వెళ్లిపోతుండటంతో ఇలా ‘టైర్‌ 2’ హీరోలు వచ్చిన కథలతో సంతృప్తి పడాల్సి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.&nbsp; నెపోటిజం vs టాలెంట్‌! అయితే వారసత్వం ఉంటేనే సినిమాల్లోనే రాణిస్తారనేది పూర్తిగా అవాస్తవం. అలా అయితే పెద్ద పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరూ స్టార్‌ హీరోలు అయిపోయేవారు కదా. ఎంత పెద్ద సినీ నేపథ్యమున్నా యాక్టింగ్‌ టాలెంట్ లేకుంటే ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మనుగడ సాగించలేరు. ఇది చాలా మంది వారసత్వ నటుల విషయంలో నిరూపితమైంది. నాని, విజయ్‌ దేవరకొండ, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్‌, నవీన్‌ పోలిశెట్టి వంటి నటులు ఎలాంటి నేపథ్యం లేకుండానే వచ్చి ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. వారిలో టాలెంట్‌ ఉంది కాబట్టే ఇదంతా సాధ్యమైంది. హీరో నాని ఇంకో భారీ విజయం లభిస్తే టైర్‌-1 హీరో స్థాయికి ఎదగడం పక్కా అన్న ప్రచారం జరుగుతోంది.&nbsp; తప్పు ప్రేక్షకుల్లో ఉంది! గతంలో ఓ ఇంటర్యూలో పాల్గొన్న నటులు రానా, నాని నెపోటిజంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముందుగా రానా మాట్లాడుతూ వారసత్వం వల్ల వచ్చే బరువు, బాధ్యతలు అందరికీ తెలియవని అన్నారు. నెపోటిజం అన్నది కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుందని టాలెంట్ లేకపోతే సినీ ఇండస్ట్రీలో నెట్టుకురావడం కుదరదని రానా తేల్చి చెప్పాడు. నెపోటిజంపై మరో యంగ్ హీరో నాని మాట్లాడుతూ నెపోటిజాన్ని సినీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరు ఫాలో కావడం లేదని, సినిమాలు చూసే ప్రేక్షకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. తాను చేసిన మొదటి సినిమాని లక్ష మంది ప్రేక్షకులు మాత్రమే చూశారని, అదే చరణ్ చేసిన మొదటి సినిమాని కోటి మంది చూశారని చెప్పారు. మరి చూసిన ప్రేక్షకులే కదా నెపోటిజాన్ని ప్రోత్సహిస్తోందని నాని ప్రశ్నించాడు.&nbsp;
    సెప్టెంబర్ 13 , 2024
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..&nbsp; ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…&nbsp; మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా షురూ..&nbsp; ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్…&nbsp; మనల్ని ఎవడ్రా ఆపేది?
    పవన్ కల్యాణ్ మేనియా మరోసారి మెుదలయ్యింది. వరుస పెట్టి సినిమాలు కమిట్ అవుతున్న పవర్ స్టార్.. షూటింగ్స్‌ను షురూ చేస్తున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్‌(Ustaad Bhagat Singh) చిత్రం మార్చి 28 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి దర్శకుడు హరీశ్ శంకర్ ప్రీ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్న పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మెుదలయ్యింది. పవన్ మళ్లీ ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.&nbsp; మనల్ని ఎవడ్రా ఆపేది గబ్బర్ సింగ్ హిట్ తర్వాత మళ్లీ హరీశ్ కాంబినేషన్‌లో పవన్ సినిమా రాబోతుంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్‌ డేట్ కూడా ప్రకటించడంతో అభిమానుల సందడి మెుదలయ్యింది. బ్లాక్ బస్టర్ కాంబో యాక్షన్‌లోకి దిగిదంటూ పోస్టులు పెడుతున్నారు. https://twitter.com/sunny4u007/status/1633901586413154304 ఉస్తాద్ భగత్ సింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. మనల్ని ఏవడ్రా ఆపేది అనే పోస్టులు కనిపిస్తున్నాయి. త్వరగా సినిమాలు పూర్తి చేసేందుకు పవన్ కంకణం కట్టుకోవటంతో ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోతున్నాయి.&nbsp; https://twitter.com/i/status/1633886352583565313 ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్టు&nbsp; ఉస్తాద్ భగత్‌సింగ్’ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ లుక్ టెస్టు నిర్వహించారు. ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇచ్చేందుకు హరీశ్ శంకర్ గురువారం కెమెరామెన్లతో లుక్ టెస్ట్ చేపట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్‌ సినిమా థేరి రీమేక్ అని వినికిడి. అయితే.. కేవలం మాతృకను మాత్రమే తీసుకొని కథను విభిన్నంగా రాశారని తెలుస్తోంది. ఇందులో ఓ హీరోయిన్‌గా శ్రీలీల నటిస్తుంది.&nbsp; https://twitter.com/PawanKalyanFan/status/1633878228619386880?s=20 వరుస పెట్టి సినిమాలు క్రిష్ దర్శకత్వంలో వస్తున్న హరిహర మీరమల్లు చిత్రంతో పాటు వినోదయ సీతమ్ రీమేక్‌లో పాల్గొంటున్నాడు పవన్. మార్చి 20 వరకు సముద్రఖని సినిమా పూర్తి చేసి వెంటనే హరీశ్‌ శంకర్‌ షూటింగ్‌ను మార్చి 28నుంచి&nbsp; పట్టాలెక్కించనున్నాడు. ఏప్రిల్ చివరి వారంలో సుజీత్ ఓజీ (OG) చిత్రాన్ని కూడా ప్రారంభించనున్నట్లు టాక్.&nbsp; https://twitter.com/CrazyBuffOffl/status/1633371708030849025 https://twitter.com/SupremePSPK/status/1630933852058423302 ఫటా ఫట్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతున్నాడు. రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటూనే వరుస సినిమాలు చేస్తున్నాడు. హరిహర వీరమల్లు, వినోదయ సీతమ్ రీమేక్, ఉస్తాద్ భగత్ సింగ్, OG చిత్రాలు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. పవర్ స్టార్ సినిమా కోసం ఎదురు చూసే ఫ్యాన్స్‌కి ఇవి పండగనే చెప్పాలి. &nbsp; పవన్ క్యూ జనసేనానితో సినిమా తీసేందుకు చాలామంది దర్శకులే క్యూలో ఉన్నారు. అధికారికంగా ప్రకటించకపోయినా దర్శకుడు సురేందర్ రెడ్డితో చిత్రం ఉంటుందని తెలిసింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లోనూ ఓ చిత్రం ఉంటుందని వినికిడి. ఇవి ప్రస్తుతం ప్రారంభమయ్యే సూచనలు మాత్రం కనిపించడం లేదు. ఎన్నికలకు వేళాయే ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని నిర్ణయించుకున్నాడు పవన్. అందుకోసమే త్వరగా షూటింగ్స్‌ పూర్తి చేయాలని భావిస్తున్నాడు. వరుస షెడ్యూల్స్‌ను ప్రకటిస్తూ చిత్రీకరణలో పాల్గొంటున్నాడు జనసేనాని. ప్రస్తుతమున్న చిత్రాలు పూర్తైతే దాదాపు సంవత్సరం పాటు సినిమాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
    మార్చి 10 , 2023
    KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?
    KAVYA KALYAN RAM: నటన సరే.. మరి అక్కడ రాణిస్తుందా?
    ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఓ హీరోయిన్‌ గురించే చర్చ. ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు కావ్య కల్యాణ్ రామ్. బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య…మసూద, బలగం సినిమాలతో హీరోయిన్‌గా మారి గుర్తింపు తెచ్చుకుంది.&nbsp; అచ్చమైన తెలుగమ్మాయి హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి నాగార్జున హీరోగా వచ్చిన స్నేహమంటే ఇదేరా చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది. గంగోత్రి, ఠాగూర్‌, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్‌, పాండురంగడు వంటి ఎన్నో చిత్రాల్లో చిన్నప్పట్నుంచే క్యారెక్టర్లు చేసింది కావ్య. హీరోయిన్ ఛాన్స్‌ గతేడాది చివర్లో వచ్చిన హార్రర్ చిత్రం మసూదలో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది కావ్య కళ్యాణ్ రామ్. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. కమేడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగంలోనూ కావ్యకు కథానాయికగా మెరిసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవటంతో కావ్య గురించి అందరూ వెతుకుతున్నారు. ఫాలోయింగ్ ఎక్కువే సినిమాల్లో చేస్తూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టింది కావ్య. B.A, L.L.B పూర్తి చేసింది. సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 95.5k ఫాలోవర్స్‌ ఉన్నారు. అటు ఫిట్‌నెస్‌ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది అందాల భామ. ఉదయాన్నే కసరత్తులు చేస్తూ గ్లామర్ మెయింటెన్‌ చేస్తోంది. దశ మారుతుందా? వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టడంతో ఆమెకు అవకాశాలు చాలా పెరగొచ్చు. అందులోనూ దిల్ రాజు వంటి బడా నిర్మాతతో పనిచేయడం కలిసి వస్తుందని ఆశిస్తోంది. ఇప్పటికే మరో సినిమా షూటింగ్‌లోనూ బిజీగా గడుపుతోంది కావ్య. మత్తు వదలరా చిత్రంతో హీరోగా మారిన శ్రీ సింహా సరసన నటిస్తోంది. బడ్జెట్ కాస్త తక్కువ ఉండే సినిమాల్లో హీరోయిన్‌గా కావ్యను ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.&nbsp;
    మార్చి 17 , 2023
    Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
    Jai Hanuman First Look: హనుమంతుడిగా రిషబ్ శెట్టి.. సస్పెన్స్‌కు తెర!
    టాలీవుడ్ స్టార్ డైరెక్టర్  ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న  “జై హనుమాన్” నుండి ఆసక్తికరమైన అప్డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఎప్పటి నుంచో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తారా అన్న చర్చకు ఎట్టకేలకు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సీక్వెల్‌లో(Jai Hanuman First Look) హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్  హీరో రిషబ్ శెట్టి నటిస్తున్నారని పోస్టర్ విడుదల చేశారు.  ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రిషబ్ శెట్టి హనుమంతుడిగా శక్తివంతంగా దర్శనమిస్తుండగా, ఆయన చేతిలో రాముడి విగ్రహాన్ని పట్టుకుని ఉన్న చిత్రం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. యంగ్ హీరో తేజా సజ్జ (Teja Sajja), డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) కాంబినేషన్‌లో వచ్చిన 'హనుమాన్‌' యావత్‌ దేశాన్ని షేక్‌ చేసింది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.  ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం పెద్ద పెద్ద హీరోల సినిమాలను సైతం మట్టి కరిపించి సత్తా చాటింది. బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తూ నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ ఈమూవీకి సీక్వెల్‌గా రానున్న ‘జై హనుమాన్‌’పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే ఇందులో హనుమంతుడి పాత్ర కోసం పెద్ద ఎత్తున సంప్రదింపులు జరిగాయి. కానీ ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారన్న విషయాన్ని సస్పెన్స్‌గా ఉంచారు.  ‘హనుమాన్‌’గా&nbsp; తొలుత యష్ ‘హనుమాన్’ సినిమా ఎండింగ్‌లోనే 'జై హనుమాన్‌' ఎలా ఉండనుందో హింట్‌ ఇచ్చి దర్శకుడు ప్రశాంత్‌ వర్మ అమాంతం అంచనాలు పెంచేశాడు. ఈ క్రమంలోనే హనుమాన్‌ సీక్వెల్‌లో అగ్రనటులు నటిస్తారని తొలి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. చిరంజీవి, (Jai Hanuman First Look)రామ్‌చరణ్‌లలో ఎవరో ఒకరు హనుమంతుడి పాత్ర పోషించే ఛాన్స్ ఉందంటూ రూమర్లు వినిపించాయి. కేజీఎఫ్‌ ఫేమ్ యష్‌తోనూ ప్రశాంత్ వర్మ సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. అయితే యష్ టాక్సిక్ షూటింగ్‌లో బిజీగా ఉండటంతో కాంబినేషన్ కుదరలేదు. అయితే గత నెలలో రిషబ్‌ శెట్టిని ప్రశాంత్ వర్మ కలిసి స్టోరీ వినిపించగా ఆయన ఈ ప్రాజెక్ట్‌ పట్ల ఆసక్తి కనబరిచినట్లు తెలిసింది.&nbsp; దీంతో అధికారికంగా మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి పేరును అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. అటు మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అందుకే రిషబ్ శెట్టిని సెలెక్ట్ చేశారా? రిషబ్ శెట్టి హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన కన్నడ చిత్రం 'కాంతారా' జాతీయ స్థాయిలో సత్తా చాటింది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. కాంతారా ముందు వరకు కన్నడ పరిశ్రమకు మాత్రమే పరిమితమైన రిషబ్‌శెట్టి పేరు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుపరిచితమయ్యింది. ఆ సినిమాకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా కేంద్రం నుంచి అవార్డు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం 'కాంతారా చాప్తర్ 1' (Kantara chapter 1) పేరుతో ప్రీక్వెల్‌ను కూడా రిషబ్‌ రూపొందిస్తున్నారు. ఈ సినిమా కోసం ఓ ప్రముఖ హాలీవుడ్‌ వీఎఫ్‌ఎక్స్‌ కంపెనీతో చిత్ర బృందం చేతులు కలిపిందని సమాచారం. ‘ది క్రానికల్స్‌ ఆఫ్‌ నార్నియా’, ‘ది లయన్‌ కింగ్‌’, ‘బాట్‌మ్యాన్‌’ లాంటి విజయవంతమైన హాలీవుడ్‌ సినిమాలకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించిన ఆ సంస్థ ఇప్పుడు ఈ ప్రీక్వెల్‌ కోసం పని చేస్తున్నట్లు తెలిసింది. దీంతో రిషబ్ శెట్టి క్రేజ్ జై హనుమాన్‌కు బాగా కలిసి వస్తుందని మూవీ మేకర్స్ అంచనా వేశారు. మరోవైపు కన్నడ మార్కెట్‌ కూడా కలిసి వస్తోందని భావిస్తున్నారు. పాన్ ఇండియా గోల్‌ను రిషబ్ శెట్టి ద్వారా ఈజీగా చేరుకోవచ్చని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ‘మహా కాళీ’ ప్రాజెక్ట్‌ మరోవైపు ‘హనుమాన్’ డైరెక్టర్ క్రియేట్ చేసిన 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ (PVCU) నుంచి మూడో ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్ ఇటీవలే వచ్చింది. ఈ మూవీకి 'మ‌హా కాళీ' (MAHAKALI) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు టైటిల్‌ రివీల్‌ చేస్తూ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను(Jai Hanuman First Look) మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. భార‌తీయ సినీ ప్ర‌పంచంలో మొద‌టి మ‌హిళా సూప‌ర్ హీరో సినిమాగా ఈ చిత్రం ఉండ‌నున్న‌ట్లు పోస్టర్ చూస్తే తెలుస్తోంది. దాంతో పాటు ఈ మూవీకి మ‌హిళా ద‌ర్శ‌కురాలు పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వ‌హిస్తోండటం ఆసక్తి కలిగిస్తోంది. RKD స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘మా యూనివర్స్‌కు కొత్త శక్తి జోడైంది. అత్యంత భయంకరమైన చెడుపై యుద్ధం చేయడానికి కాళికాదేవి స్వరూపం రానుంది. సూపర్‌ హీరోలు ఎలా ఉంటారో ఈ చిత్రంలో చూపించనున్నాం’ అంటూ ప్రశాంత్‌ వర్మ పోస్టు పెట్టారు.&nbsp; https://twitter.com/PrasanthVarma/status/1844236760215392423
    అక్టోబర్ 30 , 2024
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    Rajanikanth vs Suriya: స్టార్‌ హీరోల మధ్య బిగ్‌ ఫైట్‌.. బాక్సాఫీస్‌ బరిలో రజనీ - సూర్య చిత్రాలు!
    భారతీయ చిత్ర పరిశ్రమలో మరో బిగ్‌ ఫైట్‌ లాక్‌ అయ్యింది. ఇద్దరు పాన్‌ ఇండియా స్టార్లు ఒకే రోజు బాక్సాఫీస్‌ వద్ద తలపడబోతున్నారు. సాధారణంగా ఏ రెండు చిన్న హీరోల సినిమాలు రిలీజైనా అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది. ఎవరు పైచేయి సాధిస్తారు? ఎవరు ఫ్లాప్‌ టాక్‌తో సరిపెట్టుకుంటారు? అని ప్రతీ ఒక్కరు ఆసక్తిగా గమనిస్తుంటారు. అలాంటిది ఇద్దరు అగ్ర కథానాయకులు తలపడితే చిత్ర సీమలో ఇక ఏ స్థాయి అటెన్షన్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ ఆ హీరోలు ఎవరు? వారు చేసిన చిత్రాలు ఏంటి? అవి బాక్సాఫీస్‌ వద్ద ఎప్పుడు ఢీకొట్టబోతున్నాయి? ఈ కథనంలో పరిశీలిద్దాం.&nbsp; రజనీకాంత్‌ vs సూర్య తమిళ పరిశ్రమలో దసరాకు పెద్ద యుద్ధమే జరగబోతోంది. రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వేట్టయాన్’ (Vettaiyan), సూర్య (Suriya) నటిస్తున్న ‘కంగువా’ (Kanguva) చిత్రాలు ఒకదానికొకటి ఢీకొట్టబోతున్నాయి. సూర్య చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయబోతున్నట్లు తాజాగా మేకర్స్‌ ప్రకటించారు. మరోవైపు అంతకుముందే ఆ డేట్‌కు రజనీకాంత్‌ ఫిల్మ్‌ వేట్టయాన్‌ను మేకర్స్‌ లాక్‌ చేశారు. దీంతో ఈ ఇద్దరు స్టార్‌ హీరోల మధ్య భీకర పోరు తప్పదని ఇప్పటి నుంచే ఫిల్మ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ బిగ్‌ఫైట్‌లో విజయం తమదంటే తమదని ఫ్యాన్స్‌ నెట్టింట సవాలు విసురుకుంటున్నారు.&nbsp; భారీ తారాగణం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘కంగువా’ చిత్రాన్ని స్టార్‌ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. అజిత్‌తో ‘వేదాలం’, ‘వివేగం’ వంటి సూపర్‌ హిట్‌ సినిమాలు తీసిన శివ.. తొలిసారి సూర్యతో కలిసి పనిచేస్తుండటంతో తమిళనాట ఈ సినిమాపై మంచి బజ్‌ ఏర్పడింది. పైగా ఇందులో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బాబీ డియల్ ప్రతీనాయకుడి పాత్రను పోషించాడు. హీరోయిన్‌గా గ్లామర్‌ డాల్‌ దిశా పటానీ చేసింది. అలాగే ప్రకాష్‌ రాజ్‌, జగపతిబాబు, డైరెక్టర్‌ కే.ఎస్‌. రవికుమార్‌ కీలకమైన రోల్స్‌లో కనిపించనున్నారు. ప్రముఖ కమెడియన్‌ యోగిబాబు సైతం ఓ ముఖ్యమైన పాత్రతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే మేకర్స్‌ రిలీజ్‌ చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో రజనీకాంత్‌కు గట్టి సవాలు తప్పదని సూర్య ఫ్యాన్స్ అంటున్నారు.&nbsp; గిరిజన యోధుడిగా 'సూర్య' కోలీవుడ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన చిత్రాల్లో ఒకటిగా కంగువా నిలిచింది. ఈ సినిమా నిర్మాణానికి రూ.350 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. అయితే ఈ మూవీ పవర్‌ కథతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో సూర్య గిరిజన యోధుడిలా కనిపిస్తాడట. 1678 నాటి బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథ నటుడుస్తుందని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలను గమనిస్తే ఇదే విషయం అర్థమవుతుంది. అయితే కథకు టైమ్‌ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ను కూడా జోడించినట్లు కోలివుడ్‌ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మూవీ విడుదల తర్వాతే దీనిపై స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది.&nbsp; రజనీకాంత్‌- అమితాబ్‌ ఇక రజనీకాంత్‌ హీరోగా చేసిన 'వేట్టయాన్‌' సినిమాకి 'జై భీమ్‌' వంటి బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ అందించిన టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు. ఇందులో బాలీవుడ్‌ దిగ్గజం అమితాబ్‌ బచ్చన్‌ ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. 32 ఏళ్ల తర్వాత రజనితో కలిసి ఆయన యాక్ట్ చేస్తున్నారు. దగ్గుబాటి రానా, ఫహాద్‌ ఫాజిల్‌, రానా, రితికా సింగ్‌, రావు రమేష్‌ ఇతర ముఖ్య తారాగణంగా ఉన్నారు. ఒక రిటైర్‌ అయిన పోలీసు ఆఫీసర్‌.. సమాజంలోని అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. రజనీ మార్క్‌ యాక్షన్‌ ఈ మూవీలో ఉంటుందని ప్రచార చిత్రాలను బట్టే తెలుస్తోంది. దీంతో ‘వేట్టయాన్‌’ చిత్రంపై కూడా భారీగా అంచనాలు ఏర్పడ్డాయి మరి అక్టోబర్‌ 10న జరగబోయే ఈ సంగ్రామంలో విజయం ఎవరిదన్న అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.&nbsp; అటు టాలీవుడ్‌లోనూ.. టాలీవుడ్‌లోనూ ఇద్దరు స్టార్‌ హీరోలు తలపబడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్‌ vs రామ్‌చరణ్‌ బాక్సాఫీస్‌ బరిలో నిలిచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బన్నీ హీరోగా చేస్తున్న ‘ పుష్ప 2’ రిలీజ్‌ డేట్‌ ఆగస్టు 15 నుంచి డిసెంబర్‌ 6కు మారింది. మరోవైపు రామ్‌చరణ్‌-శంకర్‌ కాంబోలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్‌’ మూవీ కూడా డిసెంబర్‌లో విడుదలయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిర్మాత దిల్‌రాజు కూడా డిసెంబర్‌ మెుదటి వారంలోనే ‘గేమ్‌ ఛేంజర్‌’ రిలీజ్‌ చేయాలని భావిస్తే బాక్సాఫీస్‌ వద్ద బిగ్‌ ఫైట్‌ తప్పదు. &nbsp;
    జూన్ 28 , 2024
    అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    అడవి శేషు (Adivi Sesh ) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    మేజర్ సినిమా విజయంతో మంచి పేరు తెచ్చుకున్న అడవి శేషు.. తక్కువ కాలంలోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. హిట్ 2,  ఎవరు, గూఢాచారి వంటి హిట్ సినిమాలతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. విలక్షణమైన పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంటున్న అడవి శేషు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అడవి శేషు అసలు పేరు? అడవి శేషు అసలు పేరు అడవి శేషు సన్నీ చంద్ర అడవి శేషు ఎత్తు ఎంత? 5 అడుగుల 11 అంగుళాలు అడవి శేషు తొలి సినిమా? సొంతం(2002) చిత్రం ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత మేజర్ చిత్రం గుర్తింపు తెచ్చింది.  అడవి శేషుకు వివాహం అయిందా? ఇంకా కాలేదు. అయితే ఆయన ప్రియురాలు సుప్రియ యార్లగడ్డతో త్వరలో ఎంగేజ్‌మెంట్ కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది. అడవి శేషు ఫస్ట్ క్రష్ ఎవరు? 5 వ తరగతి చదువుతున్నప్పుడు తన క్లాస్ టీచర్ ఫస్ట్ క్రష్ అని చెప్పాడు.&nbsp; అడవి శేషు తొలి బ్లాక్ బాస్టర్ హిట్? అడవి శేషు నటించిన మేజర్ చిత్రం అతని కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మించారు. అడవి శేషుకు ఇష్టమైన కలర్? బ్లాక్, వైట్ అడవి శేషు పుట్టిన తేదీ? 17 December 1984 అడవి శేషు తల్లిదండ్రుల పేర్లు? చంద్ర, భవాని అడవి శేషుకు ఇష్టమైన ప్రదేశం? కాలీఫోర్నియా అడవి శేషు ఏం చదివాడు? అమెరికాలో ఫిల్మ్ మేకింగ్ కోర్సు చేశాడు అడవి శేషుకు ఎన్ని అవార్డులు వచ్చాయి? ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు ఒక నంది అవార్డు కూడా అందుకున్నాడు అడవి శేషు ఎన్ని సినిమాల్లో నటించాడు? అడవి శేషు 2024 వరకు 18 సినిమాల్లో నటించాడు.&nbsp; అడవి శేషుకు ఇష్టమైన ఆహారం? అడవి శేషు శాఖహారి, అన్ని రకాల వెజ్ వెరీటైస్ ఇష్టపడుతానని చెప్పాడు అడవి శేషు ఇల్లు ఎక్కడ? అడవి శేషు ప్రస్తుతం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్‌లో ఉంటున్నాడు https://www.youtube.com/watch?v=Kftx5NEwvwg
    మార్చి 21 , 2024
    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నందమూరి నటసింహంగా తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న బాలకృష్ణను అభిమానులు ముద్దుగా ఆయన్ను బాలయ్య అని పిలుస్తారు. క్యాన్సర్ పెషెంట్లకు ఉచిత వైద్య అందిస్తూ మనవతావాదిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగులో అగ్ర హీరోల్లో ఒకరైన బాలకృష్ణ గురించి చాలా మందికి తెలియని కొన్న విషయాలు నందమూరి బాలకృష్ణ ఎవరు? బాలకృష్ణ దిగ్గజ నటుడు నందమూరి తారకరామారావు గారికి ఆరవ సంతానం. నందమూరి బాలకృష్ణ ఎత్తు ఎంత? 5 అడుగుల 9&nbsp; అంగుళాలు నందమూరి బాలకృష్ణ ఎక్కడ పుట్టారు? చెన్నై నందమూరి బాలకృష్ణ పుట్టిన తేదీ ఎప్పుడు? 1960 జూన్ 10 &nbsp;నందమూరి బాలకృష్ణ భార్య పేరు? వసుంధర దేవి బాలకృష్ణపై ఉన్న వివాదం ఏమిటి? ప్రముఖ నిర్మాత బెల్లంకొండ శ్రీనివాస్‌పై కాల్పులు జరిపి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. అసెంబ్లీలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విమర్శలు ఎదుర్కొన్నారు. నందమూరి బాలకృష్ణకు ఎంత మంది పిల్లలు?&nbsp; ముగ్గురు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి(బ్రాహ్మణి, మోక్షజజ్ఞ, తేజస్విని) నందమూరి బాలకృష్ణ అభిరుచులు? పుస్తకాలు చదవడం, కుకింగ్ NTR డైరెక్ట్ చేసిన ఎన్ని సినిమాల్లో బాలకృష్ణ నటించాడు? తత్తమ్మ కల, శ్రీమద్విరాటపర్వం, అన్నదమ్ముల, దాన వీర శూర కర్ణ బాలకృష్ణ అభిమాన నటుడు? నందమూరి తారక రామారావు బాలకృష్ణ అభిమాన హీరోయిన్? సావిత్రి బాలకృష్ణకు స్టార్ డం అందించిన సినిమాలు? మంగమ్మ గారి మనవడు, భార్గవ రాముడు, ముద్దుల మావయ్య, రౌడీ ఇన్‌స్పెక్టర్, బంగారు బుల్లోడు, నరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, సింహ, లెజెండ్, అఖండ. బాలకృష్ణకు ఇష్టమైన కలర్? వైట్ బాలకృష్ణ ఏం చదివాడు? నిజాం కాలేజీలో డిగ్రీ బాలకృష్ణ ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 108 సినిమాల్లో నటించాడు బాలకృష్ణకు ఇష్టమైన ఆహారం? చికెన్ పలావు బాలకృష్ణ సినిమాకు ఎంత తీసుకుంటారు? &nbsp;ఒక్కో సినిమాకి దాదాపు రూ.28కోట్లు తీసుకుంటున్నారు. బాలకృష్ణ 100వ సినిమా పేరు? గౌతమిపుత్ర శాతకర్ణి https://www.youtube.com/watch?v=1BqS3ZPsdGM బాలకృష్ణ MLAగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం? హిందూపురం బాలయ్య గెలుచుకున్న అవార్డులు? బాలయ్య&nbsp; 3 నంది అవార్డులు, 1 సినిమా అవార్డు, 3 సంతోష్ అవార్డులు, 3 TSR జాతీయ అవార్డులు, 1 సైమా అవార్డు, 6 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్నారు.
    మార్చి 19 , 2024

    @2021 KTree