• TFIDB EN
  • అజయ్ దేవగన్
    జననం : ఏప్రిల్ 02 , 1969
    ప్రదేశం: న్యూ ఢిల్లీ, ఢిల్లీ, భారతదేశం
    బాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో అజయ్‌ దేవగన్‌ ఒకరు. వందకు పైగా చిత్రాల్లో నటించిన ఆయన నాలుగు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. నటుడిగా, డైరెక్టర్‌గా, నిర్మాతగా సేవలందించిన అజయ్‌ దేవగన్‌ను కేంద్రం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. బాలీవుడ్‌ నటి కాజల్‌ను ఆయన ఫిబ్రవరి, 1999లో వివాహం చేసుకున్నారు.
    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలుEditorial List
    Telugu Pan India Movies: జాతీయ స్థాయిలో పాపులర్‌ అయిన టాలీవుడ్‌ చిత్రాలు
    Rajinikanth: అవేం ప్రశ్నలు.. మీడియాపై మండిపడ్డ రజనీకాంత్
    Rajinikanth: అవేం ప్రశ్నలు.. మీడియాపై మండిపడ్డ రజనీకాంత్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ తాజాగా తన చిత్రం ‘కూలీ’ షూటింగ్‌ కోసం థాయిలాండ్‌కు వెళ్లారు. అక్కడ మీడియాతో జరిగిన చర్చలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన తాజా చిత్రంపై కొన్ని వివరాలను వెల్లడించారు. అయితే ఓ విలేకరి సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్నించడంతో, రజనీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. "ఇలాంటివి అసంబద్ధమైన ప్రశ్నలు. దయచేసి రాజకీయ అంశాల గురించి అడగవద్దు" అని ఘాటుగా తెలిపారు. ఇటీవలి కాలంలో చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విలేకరి మహిళల భద్రతపై రజనీకాంత్ అభిప్రాయాలను అడిగారు. దీనిపై రజనీకాంత్, తన సినిమాతో సంబంధం లేని ప్రశ్నలు అడగవద్దని మరింత స్పష్టంగా పేర్కొన్నారు. ‘కూలీ’ చిత్రంపై తాజా అప్‌డేట్స్ రజనీకాంత్‌ తన అభిమానుల కోసం ‘కూలీ’ చిత్రం గురించి కొన్ని ముఖ్యమైన వివరాలను పంచుకున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తయిందని తెలిపారు. జనవరి 13 నుంచి జనవరి 28 వరకు చిత్రానికి మరో షెడ్యూల్ జరగనుందని చెప్పారు. త్వరలోనే మరిన్ని వివరాలు అభిమానులతో పంచుకుంటామని పేర్కొన్నారు. ‘కూలీ’ చిత్రం రజనీకాంత్‌ కెరీర్‌లో 171వ చిత్రం కావడం విశేషం. ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇది బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంలోని యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, శ్రుతిహాసన్, సత్యరాజ్ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కథ ఈ చిత్రంలో రజనీకాంత్‌ దేవా అనే కూలీ నెంబర్‌ 1421గా కనిపించనున్నారు. నాగార్జున, సైమన్‌గా, స్మగ్లింగ్‌ మాఫియాలో కీలక పాత్ర పోషించనున్నారు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ‘చికిటు వైబ్...’ పాట బీట్ విడుదల చేయగా, అభిమానుల నుండి విశేష స్పందన లభించింది. సాంకేతిక విభాగం ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, బృందం ఈ సినిమాను అద్భుతంగా మలచేందుకు కృషి చేస్తోంది. రజనీకాంత్‌ తన సినిమాల ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటూ, ఎప్పటికప్పుడు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ‘కూలీ’ చిత్రం కూడా ఆయన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు.
    జనవరి 07 , 2025
    Lal Salaam Movie Review In Telugu: రజనీకాంత్ సినిమా ఎలా ఉందంటే? నటీనటులు : రజనీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్‌, కపిల్‌ దేవ్‌, నిరోషా రాధా, సెంథిల్‌, జీవిత, తంబి రమేష్‌ తదితరులు దర్శకత్వం:  ఐశ్వర్య రజనీకాంత్‌ సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌ సినిమాటోగ్రఫీ : విష్ణు రంగస్వామి నిర్మాత: సుభాస్కరణ్‌ అల్లిరాజా విడుదల తేదీ : 09 ఫిబ్రవరి, 2024 సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ ప్రధాన పాత్రలో (Lal Salaam Movie Review In Telugu) నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam). ఈ సినిమాకు ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ దర్శకత్వం వహించారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించింది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ ముఖ్యపాత్రలు పోషించారు. భారత మాజీ క్రికెటర్‌ కపిల్‌దేవ్‌ కూడా అతిథి పాత్రలో నటించారు. క్రికెట్‌ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్‌ మూవీ ఇవాళ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్‌ రీ ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉంది? రజనీ మరోమారు తన నటనతో మెప్పించాడా? కూతురికి విజయాన్ని అందించాడా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ తిరు (విష్ణు విశాల్‌), మెుయిద్దీన్ భాయ్‌ (రజనీకాంత్‌) కొడుకు షంశుద్దిన్‌ చిన్నప్పటి నుంచి ప్రత్యర్థులు. మెుయిద్దీన్ భాయ్‌ స్థాపించిన త్రీ స్టార్‌ క్రికెట్‌ జట్టులో కీలక ప్లేయర్లుగా ఉంటారు. తిరు సక్సెస్‌ పట్ల అసూయ పడే కొందరు వ్యక్తులు అతడు జట్టు నుంచి బయటకొచ్చి కొత్త టీమ్‌ పెట్టుకునేలా ప్రేరేపిస్తారు. ఈ క్రమంలో తిరు.. ఎంసీసీ టీమ్‌ను ఏర్పాటు చేస్తాడు. అయితే ఈ జట్లు రెండు విభిన్న మతాలను (హిందూ - ముస్లిం) రిప్రెజెంట్‌ చేస్తాయి. ఊర్లో ఈ రెండు జట్ల మ్యాచ్‌ అంటే అది ఇండియా - పాక్‌ మ్యాచ్‌ను తలపిస్తుంది. ఈ క్రమంలో ఓ మ్యాచ్‌ తిరు-షంశు జీవితాలను మలుపు తిప్పుతుంది. జాతీయ జట్టుకు ఆడాలన్న షంశు కలను ప్రశ్నార్థకం చేస్తుంది. ఇంతకీ ఆ మ్యాచ్‌లో ఏం జరిగింది? మతాల వారిగా విడిపోయిన ఊరు, జట్లను మెుయిద్దీన్ భాయ్ ఎలా కలిపాడు? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే? లాల్‌ సలాం చిత్రంలో రజనీకాంత్ (Lal Salaam Movie Review In Telugu) ప్రత్యేక పాత్రలో కనిపించినా కథను ఆయన పూర్తిగా ఆక్రమించేశారు. మరోమారు తన అద్భుతమైన నటనతో మెప్పించారు. ఒక కొడుక్కి తండ్రిగా, మత పెద్దగా మెుయిద్దీన్‌ పాత్రలో ఆయన జీవించారు. కనిపించింది కొద్దిసేపే అయినా సినిమాకు రజనీ  వెన్నెముకగా మారారు. ఇక ప్రత్యర్థులుగా విష్ణు విశాల్‌, విక్రాంత్‌ నటన ఆకట్టుకుంది. వారు ప్రొఫెషనల్‌ క్రికెటర్స్‌లా స్క్రీన్‌పై కనిపించారు. టీమిండియా మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అతిథి పాత్రలో కనిపించి ప్రేక్షకలకు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. నిరోషా రాధా, సెంథిల్‌, జీవిత, తంబి రమేష్‌ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే? డైరెక్టర్‌ ఐశ్వర్య రజనీకాంత్‌.. రెండు విభిన్న మతాలను (Lal Salaam Movie Review In Telugu) తన కథాంశంగా ఎంచుకోవడం సాహసమనే చెప్పాలి. ప్రస్తుత రాజకీయ, సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఆమె కథను తీర్చిదిద్దారు. పవర్‌ఫుల్‌ సబ్జెక్ట్‌ను ఆమె ఎంచుకున్నప్పటికీ దానిని సరిగ్గా ప్రజెంట్ చేయడంలో విఫలమయ్యారని చెప్పవచ్చు. విష్ణు-విక్రాంత్‌ల సీన్లు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. కొన్ని అంశాలను క్లారిటీగా చెప్పకపోవడంలోనూ డైరెక్టర్ల వైఫల్యం కనిపిస్తుంది. ఇక రజనీకాంత్‌ పాత్ర నిడివి మరి తక్కువగా ఉంది. సినిమాలో ఆయన ప్రెజెన్స్‌ను ఇంకాస్త పెంచి ఉంటే ప్లస్‌ అయ్యేది. ఇంకా సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది డైలాగ్స్‌. ముస్లింలను రిప్రెజెంట్‌ చేస్తూ తాము ఈ దేశ పౌరులమేనంటూ రజనీ చెప్పే డైలాగ్స్ థియేటర్లో చప్పట్లు కొట్టిస్తాయి.  టెక్నికల్‌గా.. టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే (Lal Salaam Movie Review In Telugu).. ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం సినిమాకు పెద్ద ప్లస్‌ అయ్యింది. ముఖ్యంగా రజనీకాంత్‌ పాత్రకు ఎలివేషన్స్‌ ఇస్తూ ఆయన ఇచ్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. రెహమాన్ BGM.. రజనీపాత్ర మరింత ఎలివేట్ అయ్యేందుకు దోహదపడింది. ఇక విష్ణు రంగస్వామి కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనంరజనీకాంత్‌ నటనసంగీతం మైసన్‌ పాయింట్స్‌ స్పష్టత లేని సన్నివేశాలుసాగదీత సీన్స్‌ Telugu.yousay.tv Rating: 3/5
    ఫిబ్రవరి 09 , 2024
    HBD Rajinikanth: రజనీకాంత్‌ - చిరంజీవి కలిసి ఎన్ని చిత్రాల్లో నటించారో తెలుసా? ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ కలిగిన అగ్ర నటుల్లో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) ఒకరు. కోలీవుడ్‌కు చెందిన రజనీకి తెలుగుతో పాటు హిందీలోనూ వీరాభిమానులు ఉన్నారు. ఆయన చేసిన చాలవరకూ చిత్రాలు తెలుగులో డైరెక్ట్‌గా రిలీజై సూపర్‌ హిట్‌ విజయాలను అందుకున్నారు. కాగా, ఇవాళ (12 December) రజనీకాంత్‌ (HBD Rajinikanth) పుట్టిన రోజు . 74వ ఏటలోకి సూపర్‌ స్టార్‌ అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌తో కలిసి నటించిన తెలుగు స్టార్‌ హీరోలు ఎవరు? ఏ ఏ చిత్రాల్లో నటించారు? ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  నందమూరి తారకరామారావుతో.. టాలీవుడ్‌ దిగ్గజ నటుడు, దివంగత నందమూరి తారకరమారావు (Nandamuri Taraka Rama Rao)తో రజనీకాంత్‌ నటించారు. వారి కాంబోలో రూపొందిన ఒకే ఒక్క చిత్రం ‘టైగర్‌’ (Tiger Movie). 1979లో వచ్చిన ఈ చిత్రంలో రామారావు ప్రధాన హీరోగా నటిస్తే రజనీకాంత్‌ రెంటో కథానాయకుడిగా స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ఈ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాను హిందీలో అమితాబ్‌ బచ్చన్‌, వినోద్‌ ఖన్నా హీరోలుగా ‘ఖూన్‌ పసీనా’ పేరుతో రీమేక్‌ చేశారు.  శోభన్‌ బాబుతో..  నట భూషణ్‌ శోభన్ బాబు (Sobhan Babu) తోనూ రజనీకాంత్‌ ఓ చిత్రంలో నటించారు. 1986లో వచ్చిన ‘జీవన పోరాటం’ సినిమాలో శోభన్‌ బాబు, రజనీకాంత్‌ అన్నదమ్ములుగా చేశారు. ఈ సినిమా కూడా తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రాన్ని హిందీలో సూపర్‌ హిట్‌గా నలిచిన ‘రోటి కపడా ఔర్‌ మకాన్‌’ చిత్రానికి రీమేక్‌గా తీశారు. అందులో మనోజ్‌ కుమార్‌, శశికపూర్‌, అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషించారు.  సూపర్‌ కృష్ణతో.. ఒకప్పటి దిగ్గజ నటుడు సూపర్‌ కృష్ణ (Krishna) తోనూ రజనీకాంత్‌ నటించారు. ఏకంగా మూడు సినిమాల్లో వారు కలిసి చేశారు. ‘ఇద్దరూ అసాధ్యులే’ (1979), ‘అన్నదమ్ముల సవాల్‌’ (1978), ‘రామ్‌ రాబర్ట్‌ రహీమ్‌’ (1977) చిత్రాల్లో కృష్ణ, రజనీ నటించారు. ఈ మూడు చిత్రాలు యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.  మెగాస్టార్‌ చిరంజీవితో..  మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)తోనూ రజనీకాంత్‌ మూడు చిత్రాల్లో నటించారు. తెలుగులో వచ్చిన ‘కాళీ’, ‘బందిపోటు సింహం’ సినిమాల్లో వీరు (Chiranjeevi Rajinikanth Movies) స్క్రీన్‌ షేర్‌ చేసుకున్నారు. ‘కాళీ’ సినిమాలో చిరు, రజనీ హీరోలుగా చేశారు. అయితే ‘బందిపోటు సింహం’లో మాత్రం రజనీకి విలన్‌గా చిరు నటించారు. అయితే ఆ రెండు చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించలేదు. అటు తమిళంలో రూపొందిన ‘మాపిళ్లై’ సినిమాలో చిరు గెస్ట్‌ రోల్‌లో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్‌ చేశాడు. తెలుగు చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మెుగుడు సినిమాకు రీమేక్‌గా ‘మాపిళ్లై’ తమిళంలో రూపొందింది.  https://twitter.com/atheisttindian/status/1212794102867083265 డైలాగ్‌ కింగ్‌ మోహన్‌బాబుతో..  తెలుగు ఇండస్ట్రీలో నటుడు మంచు మోహన్‌బాబు (Manchu Mohan Babu)తో రజనీకాంత్‌కు మంచి స్నేహబంధం ఉంది. ఒకరినొకరు ఓరేయ్‌ అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఉంది. ఇది పలు వేదికల్లో నిరూపితమైంది. ఇదిలా ఉంటే వీరి కాంబోలో పలు చిత్రాలు వచ్చాయి. రజనీ నటించిన చిత్రాల్లో మోహన్‌బాబు విలన్ పాత్ర పోషించారు. అయితే వీరి కాంబోలో వచ్చిన ‘పెదరాయుడు’ (Pedarayudu Movie) చిత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇందులో మోహన్‌బాబు తండ్రిగా రజనీకాంత్‌ కనిపించారు. పాపారాయుడు పాత్రలో నట విశ్వరూపం చూపించారు. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో నందమూరి తారకరామారావు పాల్గొనడం విశేషం.  అక్కినేని నాగార్జునతో.. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna), రజనీకాంత్‌ (HBD Rajinikanth) కాంబోలో చాన్నాళ్ల తర్వాత ఓ సినిమా రూపుందుతోంది. రజనీకాంత్‌ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఒక్కసారి కూడా తెరపై కనిపించలేదు. దీంతో ‘కూలీ’పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గతంలో ఒకే సినిమా షూటింగ్‌లో నాగార్జున - రజనీకాంత్‌ పాల్గొన్నారు. కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్‌తో కలిసి ‘పోలీస్ బుల్లెట్’ అనే సినిమాలో రజనీకాంత్‌ నటించారు. అయితే తెలుగులో ఈ సినిమాను ‘శాంతి క్రాంతి’ పేరుతో నాగార్జున, రవిచంద్రన్ తీశారు. ఒకేసారి తెరకెక్కించడంతో రజనీకాంత్‌ షూట్‌ అవ్వగానే నాగార్జున ఆయన పాత్రలో షూటింగ్‌లో నటించాడు. జగపతి బాబుతో.. రజినీకాంత్ (HBD Rajinikanth), జగపతి బాబు (Jagapathi Babu) కలిసి ‘కథానాయకుడు’తో పాటు ‘లింగ’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అలాగే ‘అన్నాత్తే’, ‘పెద్దన్న’ సినిమాల్లో కూడా ఈ దిగ్గజ నటులు కలిసి నటించారు. ముఖ్యంగా ‘కథానాయకుడు’ సినిమాలో వీరి నటనకు మంచి గుర్తింపు లభించింది.  https://twitter.com/SolidLover123/status/1562791842898669568
    డిసెంబర్ 12 , 2024
    Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్ తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన గురువారం (అక్టోబర్‌ 3) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే రజనీ అనారోగ్యానికి కూలి షూటింగ్‌కు ముడిపెడుతూ కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. షూటింగ్‌ ఒత్తిడి వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌, నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. దీనిపై కూలి సినిమా డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పలు యూట్యూబ్‌ ఛానల్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.  ‘రజనీ కంటే షూటింగ్‌ ముఖ్యం కాదు’ రజనీకాంత్‌ ఆరోగ్యం విషయంలో కూలి చిత్ర బృందాన్ని తప్పుబడుతూ చక్కర్లు కొడుతున్న వార్తలపై డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ఆయా వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. అలాంటి ప్రచారాలు చూస్తుంటే బాధగా ఉంటుందని చెప్పుకొచ్చారు. 'దాదాపు నెల రోజుల క్రితం వైజాగ్‌ షెడ్యూల్‌లో తన ఆరోగ్యం గురించి రజనీకాంత్‌ మాతో చెప్పారు. తానొక సర్జరీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ క్రమంలోనే మేము సెప్టెంబర్‌ 28 నాటికి ఆయనకు సంబంధించిన ముఖ్యమైన షూటింగ్‌ పోర్షన్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేను ఆయనతో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం కంటే షూటింగ్‌ మాకు ముఖ్యం కాదు. కాబట్టి ఏదైనా విషయంపై పూర్తి అవగాహన వచ్చిన తర్వాతే ఇలాంటి వార్తలు రాయండి అని కోరుతున్నా’ అని లోకేశ్‌ కనగరాజ్‌ మండిపడ్డారు. అక్టోబర్‌ 15 తర్వాత రజనీకాంత్‌ తిరిగి సెట్‌లోకి అడుగుపెడతారని ఆయన స్పష్టం చేశారు.  రజనీ అనారోగ్య సమస్య ఏంటంటే? రజనీకాంత్‌ ఆరోగ్యం విషయానికి వస్తే సెప్టెంబర్‌ 30న ఆయన చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. గుండె నుంచి బయటకు వచ్చే ప్రధాన రక్తనాళంలో వాపు ఏర్పడినట్లు వైద్యులు గుర్తించారు. ట్రాన్స్‌కాథెటర్‌ పద్ధతి ద్వారా చికిత్స అందించి స్టెంట్ అమర్చారు. ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఆయన్ని గురువారం రాత్రి డిశ్చార్జ్‌ చేశారు. కొన్ని వారాల పాటు విశ్రాంతి అవసరమని రజనీకి సూచించారు. దీంతో ప్రస్తుతం కుటుంబ సమక్షంలో రజని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన త్వరగా కోలుకొని షూటింగ్‌లో పాల్గొనాలని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.  కూలీలో స్టార్ క్యాస్ట్‌! రజనీకాంత్‌ 171 చిత్రంగా ‘కూలీ’ (Coolie Movie) సినిమా రూపుదిద్దుకుంటోంది. ‘మాస్టర్‌’, ‘విక్రమ్‌’, ‘లియో’ వంటి వరుస హిట్స్‌ తర్వాత లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం కావడంతో సహజంగానే ‘కూలి’పై అంచనాలు ఏర్పడ్డాయి. బంగారం స్మగ్లింగ్‌ నేపథ్యంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘కూలీ నెంబర్‌ 1421’ దేవాగా రజనీకాంత్‌ కనిపించనున్నారు. ఇందులో టాలీవుడ్‌ దిగ్గజ నటుడు నాగార్జున ఓ స్పెషల్‌ పాత్ర చేస్తున్నాడు. సైమన్‌ అనే క్రూయల్‌ పాత్రలో నాగ్ కనిపించనున్నాడు. అలాగే కన్నడ స్టార్‌ హీరో ఉపేంద్ర కూాడా ఇందులో నటిస్తున్నాడు. అలాగే సౌబిన్‌ షాహిర్‌, శ్రుతి హాసన్‌, సత్యరాజ్‌ వంటి పాపులర్‌ నటులు ఈ బిగ్‌ ప్రాజెక్టులో భాగమయ్యారు.  సైమన్‌ యాక్షన్‌ సీన్‌ లీక్‌ రజనికాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబోలో వస్తోన్న ‘కూలీ’ చిత్రంలో నాగార్జున ఓ స్పెషల్‌ రోల్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. నాగ్‌ పోషిస్తున్న సైమన్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను సైతం చిత్ర యూనిట్‌ గతంలో రిలీజ్‌ చేసింది. ఇదిలా ఉంటే షూటింగ్‌లో నాగార్జునకు సంబంధించిన వైలెంట్‌ సీన్‌ ఇటీవల లీకయ్యింది. ఇందులో నాగ్‌ రూత్‌ లెస్‌గా కనిపించాడు. రోలెక్స్‌ (విక్రమ్‌ సినిమాలో సూర్య పాత్ర) తరహాలో చాలా క్రూరంగా కనిపించాడు. ఓ వ్యక్తిని కొట్టి కొట్టి చంపేస్తున్నాడు. తమిళ్‌లో డైలాగ్‌ కూడా చెప్పాడు. ఈ క్లిప్‌ క్షణాల్లో నెట్టింట వైరల్ అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నాగార్జునను ఇంత వైలెంట్‌గా ఎప్పుడు చూడలేదని కామెంట్స్‌  చేశారు..  https://twitter.com/pakkatelugunewz/status/1836362784348737582 లోకేష్‌పై పవన్‌ ప్రశంసలు కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్‌ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్‌ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) ఫిల్మ్‌ మేకింగ్‌ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్‌’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. పవన్‌ వంటి స్టార్‌ హీరో తనను మెచ్చుకోవడంతో దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.  https://twitter.com/i/status/1841446808888758277 https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
    అక్టోబర్ 05 , 2024

    అజయ్ దేవగన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అజయ్ దేవగన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree