
అశ్విని నాచప్ప
జననం : అక్టోబర్ 21 , 1967
ప్రదేశం: కర్ణాటక, భారతదేశం
అశ్వని నాచప్ప ప్రముఖ మాజీ క్రీడాకారిణి, సినీ నటి. 1967 అక్టోబరు 21 కర్ణాటకలోని కూర్గ్‌లో జన్మించారు. 80వ దశకంలో మహిళల పరుగుపందెంలో అశ్వని విశేషంగా రాణించారు. పి.టి.ఉషను ఓడించి భారతీయ ఫ్లోజోగా గుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో భారత ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు కూడా అందుకున్నారు. తన స్వీయ కథతో రూపొందిన అశ్వని (1991) చిత్రంలో నటించి వెండితెరపై అడుగుపెట్టారు. ‘ఆదర్శం’ (1993), ‘ఇన్స్‌పెక్టర్ అశ్విని’ (1993), ‘మిస్ 420’ (1995), ‘అందరూ అందరే’ (1996) వంటి చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత నుంచి ఆమె సినిమాల్లో నటించడం లేదు.
అశ్విని నాచప్ప వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అశ్విని నాచప్ప కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.