• TFIDB EN
  • దేవి శ్రీ ప్రసాద్
    జననం : ఆగస్టు 02 , 1979
    ప్రదేశం: వెదురుపాక, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    దేవీశ్రీ ప్రసాద్ భారతీయ సంగీత దర్శకుడు. ఆయన ప్రధానంగా తెలుగుతో పాటు తమిళ్ చిత్రాలకు సంగీతం అందించారు. దేవీశ్రీ కుటుంబం శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. అందుకనే ఆయన చిన్నప్పటి నుంచి మ్యూజిక్ డైరెక్టర్‌ కావాలని కలలు కనేవారు. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన దేవి(1999) చిత్రం ద్వారా మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత 'ఆనందం' చిత్రం ఆయనకు బ్రేక్ ఇచ్చింది. ఖడ్గం, మన్మథుడు, సొంతం, వెంకీ, ఆర్య, శంకర్‌దాదా MBBS, మాస్, నువ్వువస్తానంటే నేనొద్దంటానా, వర్షం, రెడీ, 100%లవ్, గబ్బర్ సింగ్, అత్తారింటికిదారేది, కుమారి 21F, రంగస్థలం, పుష్ప వంటి సూపర్ హిట్ చిత్రాలకు సంగీతం సమకూర్చారు. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు)లలో భాగంగా తెలుగులో ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలో అత్యధికంగా 11సార్లు నామినేటై, ఏడుసార్లు అవార్డును గెలుచుకున్నాడు. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో పుష్ప (2021) సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డు అందుకున్నాడు.

    దేవి శ్రీ ప్రసాద్ వయసు ఎంత?

    దేవి శ్రీ ప్రసాద్ వయసు 45 సంవత్సరాలు

    దేవి శ్రీ ప్రసాద్ ముద్దు పేరు ఏంటి?

    రాక్‌ స్టార్, DSP

    దేవి శ్రీ ప్రసాద్ ఎత్తు ఎంత?

    5' 7'' (170 cm)

    దేవి శ్రీ ప్రసాద్ అభిరుచులు ఏంటి?

    సినిమాలు చూడటం, పాటలు రాయడం

    దేవి శ్రీ ప్రసాద్ ఏం చదువుకున్నారు?

    ఇంటర్మిడియట్

    దేవి శ్రీ ప్రసాద్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    వెంకట సుబ్బారావు స్కూల్, టీ నగర్, చెన్నై

    దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    దేవి శ్రీ ప్రసాద్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    దేేవి శ్రీ ప్రసాద్ తెలుగులో 50కి పైగా సినిమాలకు సంగీతం అందించారు.

    దేవి శ్రీ ప్రసాద్ In Sun Glasses

    Images

    Devi Sri Prasad Images in Sunglasses

    Images

    Singer Devi Sri Prasad

    దేవి శ్రీ ప్రసాద్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Devi Sri Prasad

    Images

    Devi Sri Prasad

    Viral Videos

    View post on Instagram
     

    Devi Sri Prasad Viral Video

    Devi Sri Prasad Hits: DSP టాప్‌-10 బెస్ట్‌ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..!
    Devi Sri Prasad Hits: DSP టాప్‌-10 బెస్ట్‌ సాంగ్స్.. ఈ పాటలు వింటే మైమరిచిపోవాల్సిందే..! టాలీవుడ్ టాప్‌ మ్యూజిక్‌ డైరెక్టర్లలో దేవి శ్రీ ప్రసాద్‌ ఒకరు. 1999లో విడుదలైన దేవి చిత్రంతో దేవిశ్రీ సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ సినిమా పాటలు సూపర్‌హిట్‌ కావడంతో దేవిశ్రీ కెరీర్‌కు తిరుగులేకుండా పోయింది. దేవి సినిమా నుంచి రీసెంట్‌ వాల్తేరు వీరయ్య వరకు డీఎస్పీ ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ అందించారు. హీరోకు తగ్గట్లు మ్యూజిక్ అందించే దేవి.. మాస్‌, క్లాస్, మెలోడి, ట్రెడిషనల్‌ సాంగ్స్‌లో తనదైన ముద్ర వేశాడు. ఈ నేపథ్యంలో దేవిశ్రీ ఇచ్చిన టాప్‌-10 సూపర్ హిట్ సాంగ్స్‌ మీకోసం.. 1. పూనకాలు లోడింగ్ మెగాస్టార్‌ చిరంజీవి లేటెస్ట్‌ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. ఇందులో అన్ని పాటలు ప్రేక్షకుల ఆదరణ పొందాయి. అయితే ‘పూనకాలు లోడింగ్‌’ పాట మాత్రం ప్రేక్షకులను ఉర్రూతలూగించిందనే చెప్పాలి. దేవిశ్రీ సంగీతానికి తోడు చిరు, రవితేజ డ్యాన్స్‌ నిజంగానే థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించింది.  https://www.youtube.com/watch?v=4JMpHGMYm1w 2. శ్రీవల్లి సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించింది. సినిమా విజయానికి దేవిశ్రీ ఇచ్చిన పాటలు సైతం ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా ‘శ్రీవల్లి’ పాట అప్పట్లో మార్మోగింది. పందిళ్లు, శుభకార్యాలు, వేడుకలు ఇలా ఏ కార్యక్రమమైన శ్రీవల్లి పాట వినిపించాల్సిందే. ఈ పాట ద్వారా సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌కు మంచి పేరు వచ్చింది.  https://www.youtube.com/watch?v=txHO7PLGE3o 3. బుల్లెట్‌ సాంగ్ రామ్‌ పోతినేని, కృతి శెెట్టి జంటగా నటించిన ‘వారియర్‌’ సినిమాలో ‘బుల్లెట్‌ సాంగ్’ బాగా హిట్ అయింది. సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ ఈ పాట మాత్రం మ్యూజిక్‌ లవర్స్‌కు బాగా దగ్గరైంది. దేవిశ్రీ ప్రసాద్ మాస్‌ బీట్‌కు రామ్‌, కృతి డ్యాన్స్‌ తోడవడంతో ఈ సాంగ్‌ ఓ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకుంది.  https://www.youtube.com/watch?v=WgrLE4Fqxeo 4. జల జల జలపాతం నువ్వు చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ఉప్పెన. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో దేవిశ్రీ ఇచ్చిన పాటలు కూాడా అంతే ఆదరణ పొందాయి. ముఖ్యంగా ‘జల జల జలపాతం’ నువ్వు అనే పాట యూత్‌కు చాలా బాగా కనెక్ట్ అయింది.  https://www.youtube.com/watch?v=PTpimuHzlvE 5. ఎంత సక్కగున్నావే రామ్‌చరణ్‌లోని గొప్ప నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సినిమా ‘రంగస్థలం’. ఇందులో చెర్రీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అంతేగాక దేవిశ్రీ ఇచ్చిన పాటల్లో చరణ్‌ తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. ముఖ్యంగా ‘ఎంత సక్కగున్నావే’ పాట అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో సమంత హోయలు, రామ్‌చరణ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ పాటకు మరింత హైప్‌ తీసుకొచ్చింది.  https://www.youtube.com/watch?v=NuWs_eKu_ic 6. ప్రేమ వెన్నెల చిరు మేనల్లుడు సాయిధరమ్‌ కెరీర్‌లో మంచి వసూళ్లను రాబట్టిన సినిమా చిత్ర లహరి. ఇందులో తేజ్ నటనతో పాటు దేవిశ్రీ సంగీతానికి ప్రేక్షుకుల నుంచి మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ‘ప్రేమ వెన్నెల’ పాట సినిమాకే హైలెట్‌ అని చెప్పాలి. లవ్‌ మెలోడీగా రూపొందిన ఈ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. తేజ్‌ కెరీర్‌లోనే వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మెలోడి సాంగ్‌గా నిలించింది.  https://www.youtube.com/watch?v=tpvNtKjlf5E 7. మైండ్‌ బ్లాక్‌ మహేశ్‌ బాబు, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద హిట్ టాక్ తెచ్చుకుంది. దేవి శ్రీ అందించిన సంగీతం ఈ సినిమాకా బాగా ప్లస్‌ అయింది. ముఖ్యంగా ‘మైండ్‌ బ్లాక్‌’ పాటపై చాలా మంచి హైప్ వచ్చింది. దేవి శ్రీ ఇచ్చిన హై ఎనర్జిటిక్‌ మ్యూజిక్‌కు మహేశ్‌, రష్మి హై వోల్టెజ్‌ పర్‌ఫార్మెన్స్‌ తోడవడంతో సాంగ్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది.  https://www.youtube.com/watch?v=ZBDSNy4Yn9Q 8. సీటీ మార్‌ అల్లుఅర్జున్‌ హీరోగా హరీశ్ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన దువ్వాడ జగన్నాథం చిత్రానికి దేవిశ్రీనే సంగీతం ఇచ్చారు. ఇందులోని అన్ని పాటలు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించాయి. ముఖ్యంగా ‘సీటీమార్‌’ పాట అప్పట్లో ఎంతో క్రేజ్‌ తెచ్చుకుంది. దేవిశ్రీ ఎనర్జీటిక్ మ్యూజిక్‌కు అల్లు అర్జున్‌ క్లాస్‌ స్పెప్పులు జతకావడంతో పాట రేంజ్‌ పెరిగిపోయింది.  https://www.youtube.com/watch?v=F5X694sak5U 9. నువ్వొస్తానంటే నేనొద్దంటానా ప్రభాస్‌ హీరోగా చేసిన వర్షం సినిమాకు దేవిశ్రీ ఫీల్‌గుడ్‌ సాంగ్స్‌ను అందించారు. ముఖ్యంగా హీరోయిన్ త్రిష వర్షంలో డ్యాన్స్‌ చేసే పాట ఎప్పటికీ దేవిశ్రీ టాప్‌ సాంగ్స్‌లో ఒకటిగా ఉంటుంది.‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అంటూ సాగే ఈ పాట హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. https://www.youtube.com/watch?v=eUrC0jWdu-M 10. నువ్వుంటే దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన అన్ని సినిమాాల్లో కెల్లా కెరీర్‌ స్టార్టింగ్‌లో చేసిన ఆర్య చిత్రం ఎంతో ప్రత్యేకమైంది. ఈ సినిమాలోని అన్ని సాంగ్స్‌ ఇప్పటికీ సూపర్‌హిట్‌గా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ‘నువ్వుంటే’ పాటను ఇప్పటికీ గుర్తుచేసుకొని వినేవాళ్లు చాలా మందే ఉన్నారు. ప్రేమ గొప్పతనాన్ని వర్ణిస్తూ సాగే ఈ పాటలో అల్లుఅర్జున్‌ నటన ఆకట్టుకుంటుంది.  https://www.youtube.com/watch?v=Llw7cXHmDDo
    ఏప్రిల్ 04 , 2023
    Pushpa 2 Climax:  పుష్ప 2లో క్లైమాక్స్ వైల్డ్ ఫైర్.. కనివినీ ఎరుగని రేంజ్‌లో ఫైట్ సీక్వెన్స్! సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా ‘పుష్ప 2: ది రూల్‌’ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్‌ నవంబర్ 17న  విడుదలైన తర్వాత అల్లు అర్జున్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. ఇప్పటివరకు ప్రచారంలో ఉన్న కంటెంట్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌ సన్నివేశంపై తాజాగా ఆసక్తికర వార్తలు వెలువడుతున్నాయి. పుష్ప రాజ్‌ ఊచకోత సన్నివేశం యాక్షన్‌ ప్రేక్షకులకు వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. ఈ సన్నివేశం ఊహించని విధంగా ఉంటుందని, యాక్షన్‌ ప్రేమికులకు ఇది నిజమైన పండగగా మారుతుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న మరోసారి శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది. ‘పుష్ప: ది రైజ్‌’లో వీరి జంటకు అందరూ ఫిదా కాగా, ఈసారి ఈ కాంబినేషన్‌ మరింత ఎమోషనల్‌గా ఉంటుందని చెబుతున్నారు. భారీ బడ్జెట్‌ నిర్మాణం మైత్రి మూవీ మేకర్స్‌ సంస్థపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియన్‌ స్థాయిలో నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా కోసం రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు సమాచారం. సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌, తమన్‌ ఇద్దరూ కలిసి సంగీతం అందిస్తున్నారు. వీరి కాంబినేషన్‌ అందరికీ అద్భుతమైన అనుభూతిని కలిగించనుందని సినీ వర్గాలు అంటున్నాయి. https://twitter.com/resulp/status/1858089345464279297 సోషల్ మీడియాలో ‘వైల్డ్ ఫైర్’ ‘పుష్ప 2: ది రూల్‌’ ట్రైలర్‌ సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తోంది. భారీ వ్యూస్‌ను సాధించి, ట్రెండింగ్‌లో నిలిచిన ఈ ట్రైలర్‌పై ప్రేక్షకులతో పాటు ప్రముఖుల ప్రశంసలు కురుస్తున్నాయి. “ఇది నిజంగానే వైల్డ్‌ ఫైర్‌” అని రాజమౌళి వంటి దిగ్గజ దర్శకులు ప్రశంసలు అందజేశారు. క్లైమాక్స్ గురించి ఆసక్తికర సమాచారం తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా క్లైమాక్స్ ప్రేక్షకులకు హై ఓల్టేజ్‌ ఎనర్జీ అందించనుందని తెలిసింది. క్లైమాక్ యాక్షన్ సీన్ల కోసం భారీ స్థాయిలో సెట్స్ వేశారని తెలిసింది. గతంలో అల్లు అర్జున్ ఎప్పుడూ చేయని యాక్షన్ ఫీట్స్ ఈ చిత్రంలో చేశాడని సమాచారం. అభిమానులకు క్లైమాక్స్ సీన్లు మంచి థ్రిల్‌ను పక్కాగా అందిస్తాయని ట్రైలర్‌ లోనే హింట్స్ ఉన్నాయి.  ముఖ్యంగా పుష్ప రాజ్ పాత్ర క్లైమాక్స్‌లో చూపించే ఊచకోత సీక్వెన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తుందని సమాచారం. కేవలం సెట్స్‌కే రూ.10 కోట్ల మేర ఖర్చు పెట్టినట్లు తెలిసింది.  ఈ క్లైమాక్స్ సీన్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని భావిస్తున్నారు. ప్రముఖుల స్పందన ఈ చిత్ర ట్రైలర్‌పై పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు: రాజమౌళి: "పుష్పగాడి వైల్డ్‌ ఫైర్‌ దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్‌ 5న ఈ అగ్ని మరింత ఎత్తుకు చేరనుంది."అనిల్‌ రావిపూడి: "ఇది పవర్‌ ప్యాక్డ్‌ ట్రైలర్‌. బిగ్‌ స్క్రీన్‌పై చూసేందుకు ఎదురుచూస్తున్నా."హరీశ్‌ శంకర్‌: "పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాపై మీ ప్రేమకు హ్యాట్సాఫ్‌."రిషబ్‌ శెట్టి: "ట్రైలర్‌లో మాస్‌ ఎలిమెంట్స్‌ అద్భుతంగా ఉన్నాయి. మరో బ్లాక్‌బస్టర్‌ సిద్ధమవుతోంది."ప్రశాంత్ వర్మ: "పుష్పరాజ్ తిరుగుబాటును విప్లవంగా మార్చాడు. ఈసారి మరింత ఘోరంగా రాబోతున్నాడు." ఫ్యాన్స్ కోసం బన్నీ రిప్లై నటుడు కిరణ్‌ అబ్బవరం చేసిన ట్వీట్‌కు అల్లు అర్జున్ స్పందిస్తూ, "థ్యాంక్యూ మై బ్రదర్‌. నీ సినిమా ‘క’ చూసి త్వరలో కాల్‌ చేస్తాను" అంటూ ప్రేమతో రిప్లై ఇచ్చారు. డిసెంబర్ 5 - పుష్ప పండుగ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పుష్పరాజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లు, క్లైమాక్స్‌ విజువల్స్‌ థియేటర్లలో ఓ పండుగలా ఉంటాయని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ‘పుష్ప’ ఎప్పుడు తగ్గడు, ఈసారి మరింత శక్తివంతమైన ఫిల్మ్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. "నేషనల్‌ అనుకుంటారా, ఇంటర్నేషనల్‌ అనుకుంటారా..?" అంటూ డైరెక్టర్‌ బుచ్చిబాబు చేసిన కామెంట్‌ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. ఇంతకు మించి ఫ్యాన్స్‌ ఈ సినిమా కోసం మరెంత ఆసక్తిగా ఎదురుచూస్తారో మాటల్లో చెప్పలేం! డిసెంబర్‌ 5న పుష్ప 2 ప్రేక్షకులకు ఎలా సర్‌ప్రైజ్‌ ఇస్తుందో చూడాలి!
    నవంబర్ 18 , 2024
    69th National Film Awards: జాతీయ స్థాయిలో సత్తాచాటిన టాలీవుడ్‌.. అవార్డ్స్ విజేతలు వీరే! 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల (69th National Film Awards) ప్రదానోత్సవం దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. 2021కి గాను కేంద్రం ఇటీవల ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతికనిపుణులను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అవార్డులను విజేతలకు అందజేశారు. టాలీవుడ్‌ నుంచి పలువురు ప్రముఖులు రాష్ట్రపతి చేతుల మీదగా జాతీయ పురస్కారాలను అందుకున్నారు. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్ (Allu Arjun) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నాడు. టాలీవుడ్‌ నుంచి ఈ ఘనత సాధించిన తొలి హీరోగా బన్నీ నిలిచాడు. https://twitter.com/i/status/1714234869629558869 జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రజాధరణ పొందిన చిత్రంగా ‘RRR’ నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అవార్డును దర్శకధీరుడు రాజమౌళి రాష్ట్రపతి చేతుల మీదగా అందుకున్నారు.  https://twitter.com/i/status/1714263091029107087 పుష్ప చిత్రానికి గాను జాతీయ స్థాయిలో ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీ ప్రసాద్‌ నిలిచారు. ఈ అవార్డును రాష్ట్రపతి ముర్ము ఆయనకు అందజేశారు. https://twitter.com/bharatidubey/status/1714279017837474231 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీకి గాను ఉత్తమ నేపథ్య సంగీతం అవార్డును ఎం. ఎం. కీరవాణి దక్కించుకున్నారు. జాతీయ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును కైవసం చేసుకున్నారు.  https://twitter.com/i/status/1714256005079704005 'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని ‘కొమరంభీముడో..’ పాట ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ పాటను ప్రాణం పెట్టి పాడిన సింగర్‌ కాల భైరవ.. ఉత్తమ నేపథ్య గాయకుడిగా నేషనల్‌ అవార్డు అందుకున్నారు. https://twitter.com/i/status/1714253448215228480 ఉత్తమ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌గా కింగ్‌ సోలోమన్ జాతీయ అవార్డు అందుకున్నారు. RRR చిత్రానికి గాను ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి చేతుల మీదుగా కైవసం చేసుకున్నారు. https://twitter.com/i/status/1714255504153993419 టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రేమ్ రక్షిత్ జాతీయ స్థాయిలో ఉత్తమ నృత్య దర్శకుడిగా నిలిచారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి గాను రాష్ట్రపతి చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు. https://twitter.com/i/status/1714253832241422699 ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌ విభాగంలో టాలీవుడ్‌కు చెందిన వి. శ్రీనివాస్‌మోహన్‌ జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఇతను కూడా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి సంబంధించే తీసుకోవడం విశేషం. https://twitter.com/i/status/1714266870713647487 టాలీవుడ్‌ ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్‌.. కొండపొలం చిత్రానికి గాను జాతీయస్థాయిలో ఉత్తమ సాహిత్యం అవార్డు అందుకున్నారు.  https://twitter.com/i/status/1714230631885062219 జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ అవార్డును చిత్ర దర్శకుడు బుచ్చిబాబు రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.  https://twitter.com/i/status/1714224832316080266 ఇక జాతీయ స్థాయిలో ఉత్తమ సినీ విమర్శకుడిగా తెలుగు రాష్ట్రాలకు చెందిన పురుషోత్తమాచార్యులు అవార్డు అందుకున్నారు.  https://twitter.com/i/status/1714218637362659515 జాతీయ అవార్డు వేడుకల సందర్భంగా టాలీవుడ్‌కు చెందిన విజేతలు అందరూ కలిసి దిగిన ఫొటో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇందులో అల్లుఅర్జున్‌, రాజమౌళి, ఎం.ఎం. కీరవాణి, దేవిశ్రీ ప్రసాద్ సహా పలువురు విజేతలు ఉన్నారు. ఈ ఫొటోను బన్నీ తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేయడం విశేషం. https://twitter.com/alluarjun/status/1714300482934751553
    అక్టోబర్ 18 , 2023
    KISI KA BHAI KISI KI JAAN REVIEW : సల్మాన్ ఖాన్ వన్‌మేన్ షో.. అంతా కాపీ పెస్టేనా? ప్రేక్షకులకు నచ్చిందా? బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం కిసీ కా భాయ్ కిసీ కి జాన్. దాదాపు మూడేళ్ల తర్వాత సల్మాన్‌ తెరపై కనిపిస్తున్నాడు. తమిళ్ చిత్రం వీరమ్ రీమేక్‌గా చిత్రాన్ని రూపొందించారు. కొద్దిపాటి మార్పులు చేసి తీర్చిదిద్దిన సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందా? విక్టరీ వెంకటేశ్ రోల్ ఎలా ఉంది? అనే విషయాలను తెలుసుకోండి. దర్శకుడు: ఫర్హద్ సమ్జీ నటీ నటులు: సల్మాన్‌ ఖాన్, పూజా హెగ్డే, విక్టరీ వెంకటేశ్ సంగీతం:  రవి బస్రూర్, హిమేశ్‌ రేష్మియా, దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ: వి. మణికందన్ కథ భాయ్ జాన్( సల్మాన్ ఖాన్) తన ఊరిలో శక్తివంతమైన నాయకుడు. అమ్మాయిలంటే పడుదు. తన జీవితాంతం బ్రహ్మచారిగా జీవించాలనుకుంటాడు. తన ముగ్గురు సోదరులను ఎంతో ప్రేమగా చూసుకుంటుంటాడు. అయితే  అతని ముగ్గురు తమ్ముళ్లు తన  అన్నయ్యకు పెళ్లి చేసి వాళ్ల ప్రేమకు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తుంటారు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మిని ( పూజా హెగ్డే) ప్రేమించేలా చేస్తారు. ఆమె ప్రేమలో పడిన భాయ్ జాన్, భాగ్యలక్ష్మికి ప్రాణ హాని ఉందని తెలిసి ఆమెను ఎలా కాపాడతాడు. అసలు  భాగ్యలక్ష్మికి  విలన్‌ నుంచి ఉన్న ఆపద ఏంటి? భాగ్యలక్ష్మిని భాయి జాన్ పెళ్లి చేసుకుంటాడా? లేదా అన్నది మిగతా కథ.  ఎలా ఉందంటే ఈ సినిమాను ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు రెండు సార్లు చూశారు. అజిత్ హీరోగా నటించిన వీరమ్‌ చిత్రం తెలుగులో డబ్ చేసి విడుదల చేశారు. అయినా… పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ అదే కథను కాటమ రాయుడుగా తెరకెక్కించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దీన్ని కిసీకా భాయ్ కిసీ కా జాన్ పేరుతో సల్మాన్‌ తీశాడు.  చిత్రంలో స్వల్పంగా మార్పులు మాత్రమే చేశారు. అచ్చుగుద్దినట్లు కాటమరాయుడు చూస్తున్నట్లే అనిపిస్తుంది.సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్‌లో కామెడీతో మెప్పించాడు. హీరోయిన్‌తో లవ్ ట్రాక్ మధ్యలో మాస్ ఫైట్లు అలరించాయి. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో ఫైట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్ జోష్ తెప్పిస్తుంది.  సెకాండాఫ్ సాదాసీదాగా సాగుతున్నప్పటికీ వెంకటేశ్‌, సల్మాన్ మధ్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. పాటలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక సల్లు భాయ్‌ లుంగీలో చేసిన డాన్స్‌ కామెడీగా ఉన్నట్లు అనిపిస్తుంది. అభిమానులు కూడా ఈ విషయంలో కాస్త నిరాశగానే ఉన్నారు. క్లైమాక్స్‌ అంతా రొటీన్‌గానే ఉంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులకు ఏ మాత్రం నచ్చుతుందో చూడాలి.  ఎవరెలా చేశారు సినిమా మెుత్తం సల్మాన్ ఖాన్ వన్‌ మేన్‌ షో. చిత్రం మెుదలైనప్పటి నుంచి క్లైమాక్స్ వరకు సల్లు భాయ్‌దే హవా. కామెడీ, ఫైట్లతో అలరించాడు. మరోసారి సినిమాను తన భుజాలపై మోశాడు. పూజా హెగ్డే నటనతో మెప్పించింది. తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. విక్టరీ వెంకటేశ్, షెహనాజ్ గిల్‌ సహా మిగతా వారందరూ తమ పరిధి మేరకు నటించారు. పాటలో రామ్ చరణ్‌ డాన్స్‌ బాగుంది.  సాంకేతిక పనితీరు సినిమాటోగ్రఫీ బాగుంది. కిసీ కా భాయ్‌ కిసీ కా జాన్ చిత్రానికి దాదాపు ఐదుగురు సంగీత దర్శకులు పనిచేశారు. పాటలు, నేపథ్య సంగీతం ఫర్వాలేదు. స్క్రీన్‌ ప్లేపై దర్శకుడు మరింత దృష్టి పెట్టాల్సింది. అచ్చుగుద్దినట్లు కాకుండా మార్పులు చేర్పులు చేస్తే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  బలాలు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కామెడీ బలహీనతలు తెలిసిన కథ రేటింగ్ : 2.75/5
    ఏప్రిల్ 21 , 2023

    దేవి శ్రీ ప్రసాద్ తల్లిదండ్రులు ఎవరు?

    సత్యమూర్తి (తండ్రి) శిరోమణి (తల్లి)

    దేవి శ్రీ ప్రసాద్ తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    దేవి శ్రీ ప్రసాద్ తండ్రి సత్యనారాయణ తెలుగు సినీరంగంలో రచయితగా మంచి పేరుంది. దేవత(1982), ఖైదీ నం 786(1988), పెదరాయుడు(1985) వంటి సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించాడు.

    దేవి శ్రీ ప్రసాద్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    పద్మిని( సోదరి), సాగర్(సోదరుడు)

    దేవి శ్రీ ప్రసాద్ Family Pictures

    Images

    Devi Sri Prasad With His Mother

    Images

    Devi Sri Prasad's Mother

    దేవి శ్రీ ప్రసాద్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఆనందం, ఆర్య, గబ్బర్‌సింగ్వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించి ఫేమస్ అయ్యాడు.

    దేవి శ్రీ ప్రసాద్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో దేవి శ్రీ ప్రసాద్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన దేవి శ్రీ ప్రసాద్ తొలి చిత్రం ఏది?

    దేవి శ్రీ ప్రసాద్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    ఆర్య, ఆనందం, పుష్ప, శంకర్‌దాదా MBBS, వర్షం, వాల్తేరు వీరయ్య, భద్రవంటి హిట్‌ సినిమాలకు మ్యూజిక్ అందిచారు.

    దేవి శ్రీ ప్రసాద్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    దేవి శ్రీ ప్రసాద్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ. 3 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

    దేవి శ్రీ ప్రసాద్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యాని

    దేవి శ్రీ ప్రసాద్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    దేవి శ్రీ ప్రసాద్ కు ఇష్టమైన నటి ఎవరు?

    దేవి శ్రీ ప్రసాద్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్

    దేవి శ్రీ ప్రసాద్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌

    దేవి శ్రీ ప్రసాద్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    బ్యాడ్మింటన్

    దేవి శ్రీ ప్రసాద్ కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?

    కాశ్మీర్

    దేవి శ్రీ ప్రసాద్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    929K మంది ఫాలోవర్లు ఉన్నారు.

    దేవి శ్రీ ప్రసాద్ సోషల్‌ మీడియా లింక్స్‌

    దేవి శ్రీ ప్రసాద్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా పురస్కారం

      ఉత్తమ సంగీత దర్శకుడు

    • సైమా పురస్కారం

      ఉత్తమ సంగీత దర్శకుడు

    దేవి శ్రీ ప్రసాద్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    ఊ అంటావా.. ఉఊ అంటావా ఐటెం సాంగ్‌ ట్యూన్‌ను భక్తి సాంగ్‌కు ఉపయోగించడంపై దేవి శ్రీ ప్రసాద్‌పై పెద్దఎత్తున విమర్శలు వ్యక్తం అయ్యాయి.
    దేవి శ్రీ ప్రసాద్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే దేవి శ్రీ ప్రసాద్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree