• TFIDB EN
  • ఈవీవీ సత్యనారాయణ
    ప్రదేశం: కోరుమామిడి, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం
    తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇ.వి.విగా పెరొందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ కుటుంబ కథా చిత్రాలు, హాస్య చిత్రాలకు ప్రఖ్యాతి పొందారు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు దర్శకుడు జంధ్యాల శిష్యుడు. చెవిలో పువ్వు సినిమా డైరెక్టర్‌గా ఆయనకు మొదటి సినిమా. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. ప్రేమ ఖైదీ(1990) చిత్రం ద్వారా తొలి విజయం అందుకున్నారు. ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజనుదొంగలు, జంబలకిడి పంబ, సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది, ఆమె, తాళి, ఆవిడా మా ఆవిడే, చాలా బాగుంది, ఆరుగురు పతివ్రతలు, అమ్మో ఒకటో తారీఖు, ఎవడి గోల వాడిదే వంటి హిట్ చిత్రాలను డైరెక్ట్ చేశారు. 'ఆమె' చిత్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డు అందుకున్నారు. ఈవీవీ ఇద్దరు కుమారులు, నరేష్, ఆర్యన్ రాజేష్ తెలుగులో నటులుగా రాణిస్తున్నారు.
    ఈవీవీ సత్యనారాయణ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఈవీవీ సత్యనారాయణ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree