• TFIDB EN
  • గెటప్ శ్రీను
    జననం : డిసెంబర్ 12 , 1984
    ప్రదేశం: ఆకివీడు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    "గెటప్ శ్రీను టాలీవుడ్‌లో స్టాండ్-అప్ కమెడియన్‌గా గుర్తింపు పొందాడు. ఈ టివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ కార్యక్రమాల్లో హాస్య పాత్రలకు గాను గెటప్ శ్రీనుగా గుర్తింపు పొందాడు. గెటప్ శ్రీను 2014లో విడుదలైన దిక్కులు చూడకు రామయ్య సినిమాతో నటుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్, జాంబిరెడ్డి, ఆచార్య, లైగర్ చిత్రాల్లో నటించి గుర్తింపు పొందాడు. తాజాగా రాజు యాదవ్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యాడు.

    గెటప్ శ్రీను వయసు ఎంత?

    గెటప్‌ శ్రీను వయసు 40 సంవత్సరాలు

    గెటప్ శ్రీను ముద్దు పేరు ఏంటి?

    బుల్లితెర కమల్‌ హాసన్‌

    గెటప్ శ్రీను ఎత్తు ఎంత?

    5'10'' (178cm)

    గెటప్ శ్రీను ఏం చదువుకున్నారు?

    ఇంటర్‌

    గెటప్ శ్రీను ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    సిద్దాపురం హైస్కూల్‌, సిద్దాపురం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ, దుంపగడప

    గెటప్ శ్రీను బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    సుడిగాలి సుధీర్‌, ఆటో రాంప్రసాద్‌

    గెటప్ శ్రీను‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 48కి పైగా చిత్రాల్లో నటించాడు.

    గెటప్ శ్రీను‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    గెటప్ శ్రీను In Sun Glasses

    Images

    Getup Srinu Stylish Images

    Images

    Getup Srinu Images in Sunglasses

    గెటప్ శ్రీను అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Getup Srinu

    Viral Videos

    View post on X

    Getup Srinu Viral Video

    View post on X

    Getup Srinu Viral Video

    OTT Release Movies Telugu: ఈ వారం ఓటీటీల్లో/ థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రాల లిస్ట్ ఇదే!
    OTT Release Movies Telugu: ఈ వారం ఓటీటీల్లో/ థియేటర్లలో రిలీజ్ కానున్న చిత్రాల లిస్ట్ ఇదే! ఎన్నికల హడావుడితో ఈ వారం చెప్పుకోదగ్గ సినిమాలు థియేటర్లలో విడుదల కావడం లేదు.  అనుకున్న దాని ప్రకారం మాస్‌కా దాస్ విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా మే 31 కి వాయిదా పడింది. కానీ జబర్దస్త్ కమెడియన్ గెటప్(OTT Release Movies Telugu) శ్రీను హీరోగా నటిస్తున్న రాజు యాదవ్ చిత్రం ఈ వారం థియేటర్లలో రిలీజ్ కానుంది. అలాగే విక్రమ్ నటించిన బ్లాక్ బాస్టర్ చిత్రం అపరిచితుడు సినిమాను రీరిలీజ్ చేయనున్నారు. ఇవి తప్పితే థియేటర్లలో అలరించే చిత్రాలేవి ఈవారం లేవు. అయితే ఓటీటీల్లో మాత్రం 20కి పైగా చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి వాటిపై ఓ లుక్‌ వేద్దాం థియేటర్లలో విడుదలవుతున్న సినిమాలు రాజు యాదవ్ గెటప్ శ్రీను, అంకిత ఖారత్ జంటగా నటిస్తున్న చిత్రం రాజు యాదవ్(Raju yadav). ఈ సినిమాను సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్టర్ కృష్ణమాచారి తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. క్రికెట్ ఆడుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు రాజు యాదవ్(గెటప్ శ్రీను) మూతికి బలమైన గాయం అవుతుంది. ఆ గాయం వల్ల అతను ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటాడు. అతని స్మైలింగ్ ఫేస్ చూసిన అంకిత ఖారత్ అతనికి దగ్గరవుతుంది. అయితే కొన్నినాటకీయ పరిణామాల తర్వాత అతన్ని దూరం పెడుతుంది. అప్పుడు రాజు యాదవ్ ఏం చేశాడు. తన లోపాన్ని అధిగమించేందుకు ఏం చేశాడు అనేది మిగతా కథ. కాగా ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ఈవారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న చిత్రాలు(OTT Release Movies Telugu) ఈ వారం ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేసేందుకు 20పైగా సినిమాలు సిద్ధమయ్యాయి. వాటిలో ముఖ్యంగా గాడ్జిల్లాX కాంగ్(తెలుగు డబ్బింగ్), చోరుడు(తెలుగు డబ్బింగ్)తో పాటు బస్తర్: ది నక్సల్స్ స్టోరీ, జర హట్కే జర బచ్కే వంటి హిందీ చిత్రాలు ఉన్నాయి. మరి ఏఏ ప్లాట్ ఫామ్స్‌లో ఏ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్ వేయండి. TitleCategoryLanguagePlatformRelease DateVidya Vasula AhamMovieTeluguAhaMay 17Blood of Zeus S2Series EnglishNetflixMay 15Ashley Madison: Sex, Lies & ScandalSeries EnglishNetflixMay 15Madame WebMovieEnglishNetflixMay 16Bridgerton Season3 Part - 1 SeriesEnglishNetflixMay 16The 8 ShowSeriesKoreanNetflixMay 17Thelma the UnicornMovieEnglish NetflixMay 17PowerMovieEnglishNetflixMay 17CrashSeriesKoreanDisney+ HotstarMay 13ChoruduMovieTelugu DubbedDisney+ HotstarMay 14Uncle SamsikSeriesKoreanDisney+ HotstarMay 15Bahubali: Crown of BloodAnimates SeriesHindiDisney+ HotstarMay 17Outer Range Season 2SeriesEnglishAmazon PrimeMay 16AaveshamMovieTelugu DubbedAmazon PrimeMay 1799SeriesEnglishAmazon PrimeMay 17Bastar: The Naxal StoryMovieHindiZee5May 17Thalaimai SeyalagamSeriesTamilZee5May 17Godzilla x Kong: The New EmpireMovieTelugu DubbedBook My ShowMay 13Demon SlayerSeriesJapaneseJio CinemaMay 13C.H.U.E.C.O Season 2SeriesSpanishJio CinemaMay 14Zara Hatke Zara BachkeMovieHindiJio CinemaMay 17LampanSeriesMarathiSony LivMay 16
    మే 14 , 2024
    Hanuman Movie Review: సూపర్‌ హీరోగా అదరగొట్టిన తేజ సజ్జ.. ‘హనుమాన్‌’ హిట్‌ కొట్టినట్లేనా? నటీనటులు: తేజ సజ్జ, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వినయ్ రాయ్, సముద్రఖని, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, గెటప్ శ్రీను, సత్య దర్శకుడు : ప్రశాంత్ వర్మ సంగీతం: గౌర హరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: శివేంద్ర ఎడిటింగ్: సాయిబాబు తలారి నిర్మాత: నిరంజన్ రెడ్డి ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman Movie Review). అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. బడ్జెట్‌ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్‌ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్‌ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ చిత్రం.. ట్రైలర్‌తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని ‘హనుమాన్‌’ అందుకున్నాడా? ఈ సూపర్‌ హీరో చేసిన సాహసాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథ సౌరాష్ట్రలో ఉండే మైఖేల్‌ (వినయ్ రాయ్‌) చిన్నప్పటి నుంచి సూపర్‌ హీరో అవ్వాలని భావిస్తుంటాడు. ఇందుకు అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను కూడా మట్టు పెడతాడు. మరో పక్క అంజనాద్రి అనే గ్రామంలో దొంగతనాలు చేస్తూ కొంటె కుర్రాడిలా హనుమంతు (తేజ సజ్జ) తిరుగుతుంటాడు. కొన్ని పరిణామాల రీత్యా అతడు హనుమాన్ శక్తులని పొందుతాడు. ఈ శక్తి హనుమంతుకు ఎలా వచ్చింది? ఆ శక్తి భూమిపై ఎలా నిక్షిప్తం అయ్యింది? హనుమంతు పవర్స్‌ గురించి మైఖేల్ ఎలా తెలుసుకున్నాడు? మైఖేల్‌ నుంచి గ్రామస్తులకు ఏర్పడ్డ ముప్పును హనుంతు ఎలా తొలగించాడు? విభీషణుడు (సముద్రఖని), అంజమ్మ (వరలక్ష్మి) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జ (Teja Sajja) ఒదిగిన తీరు మెప్పిస్తుంది. సూపర్‌ పవర్స్‌ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. యాక్షన్‌, భావోద్వేగ  సన్నివేశాల్లో తేజ చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్‌ (Amritha Aiyer) అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) పాత్ర ద్వితీయార్ధంలో సర్‌ప్రైజ్‌ చేస్తుంది. వినయ్‌ రాయ్‌ (Vinay Rai) స్టైలిష్‌ విలన్‌గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్‌ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్‌ మాస్టర్‌ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే సూపర్‌ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ (Prasanth varma) సినిమాను తీర్చిదిద్దారు. సూపర్‌ హీరో అవ్వాలనే కోరికతో విలన్‌ చేసే ప్రయత్నాలను ప్రశాంత్‌ ఆసక్తికరంగా తెరకెక్కించారు. అంజనాద్రి ఊరు.. దాన్ని పరిచయం చేసిన తీరు కనులవిందుగా ఉంటుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డిటైల్డ్‌గా చూపించడం ప్రేక్షకులకు బోర్‌ కొట్టిస్తుంది. హనుమంతుకు సూపర్‌ పవర్స్‌ వచ్చినప్పటి నుంచి కథ సూపర్‌ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లా పరుగులు పెడుతుంది. విరామానికి ముందు వచ్చే కుస్తీ పోటీ సన్నివేశం కిక్కిస్తుంది. ముఖ్యంగా మైఖేల్‌ స్థావరంలోకి హనుమంతు వెళ్లినప్పుడు వచ్చే యాక్షన్‌ ఎపిసోడ్‌ను ప్రశాంత్‌ అద్భుతంగా తెరకెక్కించారు. క్లైమాక్స్‌లో చివరి 20నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేశాడు.  సాంకేతికంగా ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రశాంత్‌ తనకిచ్చిన బడ్జెట్‌లోనే చక్కటి గ్రాఫిక్స్‌తో క్వాలిటీ ఫిల్మ్‌ను చూపించారు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. సాయిబాబు తలారి అందించిన ఎడిటింగ్‌ వర్క్‌ పర్వాలేదు.  ప్లస్ పాయింట్స్‌ కథా నేపథ్యంతేజ సజ్జా నటనగ్రాఫిక్స్‌, నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ అక్కడక్కడా నెమ్మదిగా సాగే సీన్స్‌ రేటింగ్‌ : 3.5/5
    జనవరి 12 , 2024
    Upcoming Telugu Movies November 2023: దీపావళి బరిలో పోటీ పడుతున్న సినిమాలు ఇవే! అక్టోబర్‌లో పెద్ద హీరోల చిత్రాలు సందడి చేసి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. దసరా బరిలో నిలిచిన భగవంత్‌కేసరి, టైగర్‌నాగేశ్వరరావు సినిమాలు సక్సెస్ సాధించాయి. అయితే నవంబర్‌లో పెద్ద హీరోల సినిమాలు మాత్రం లేవు. చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం యాక్ట్ చేస్తున్న కీడాకోలా, నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ చిత్రాలు దీపావళి బరిలో ఉన్నాయి. వీటితో పాటు పాయల్ రాజ్‌పూత్ నటించిన హరర్‌ మూవీ మంగళవారం సైతం నవంబర్‌లోనే విడుదల కానుంది. మరి నవంబర్‌ నెలలో విడుదల కానున్న ఇతర తెలుగు చిత్రాల వివరాలపై ఓ లుక్ వేయండి. మా ఊరి పొలిమేర-2  సత్యం రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన 'మా ఊరి పొలిమెర-2' చిత్రం నవంబర్ 3న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని డాక్టర్ అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించారు. సత్యం రాజేష్‌తో పాటు గెటప్ శ్రీను, రాకెందు మౌళి, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించారు.  కీడా కోలా బ్రహ్మానందం ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం కీడాకోలా. ఈ చిత్రాన్ని  డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారు. బ్రహ్మానందంతో పాటు ఈ సినిమాలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎర్ర చీర శ్రీరామ్, అజయ్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ఎర్ర చీర. ఈ సినిమాను సుమన్ బాబు డైరెక్ట్ చేశారు. అమ్మ సెంటిమెంట్, హరర్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఈచిత్రాన్ని తెరకెక్కించారు. నవంబర్ 9న ఎర్రచీర సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదికేశవ పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఆదికేశవ. ఈ చిత్రం నవంబర్ 10న థియేటర్లలో రిలీజ్‌ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌ అంచనాలను పెంచేసింది.  ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఎన్‌ రెడ్డి డైరెక్ట్ చేశారు. సాయి సౌజన్య సంగీతం అందిస్తున్నారు. నాగవంశి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టైగర్ 3 సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న టైగర్ 3 మూవీ నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం పాన్ఇండియా లెవల్లో డైరెక్టర్ మానిష్ శర్మ తెరకెక్కించారు. సల్మాన్ సరసన కత్రీనా కైఫ్ హీరోయిన్‌గా నటించింది. ఇమ్రాన్ హష్మి, అషుతోష్ రాణా ముఖ్య పాత్రల్లో నటించారు. మంగళవారం పాయల్ రాజ్‌పూత్ లీడ్‌ రోల్‌లో ఈ సినిమాను సైకాలజికల్ హరర్‌ చిత్రంగా డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఇక ఈ సినిమాకు కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. మంగళవారం చిత్రం నవంబర్ 17న విడుదల కానుంది. సప్తసాగరాలు దాటి- సైడ్ బీ కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన సప్తసాగరాలు దాటి-సైడ్ బీ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగం కన్నడలో సూపర్ హిట్‌ కాగా.. తెలుగులో యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు రెండో భాగాన్ని డబ్బింగ్ వెర్షన్‌లో నవంబర్‌ 17న రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని  హేమంత్ రావు డైరెక్ట్ చేశారు.  రక్షిత్ శెట్టి సరసన రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటించింది. డెవిల్ నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త మీనన్ కాంబోలో వస్తున్న చిత్రం డెవిల్. ఈ చిత్రం నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను 'బాబు బాగా బిజీ' ఫేమ్ నవీన్ మేడారం తెరకెక్కిస్తున్నారు. డెవిల్ చిత్రంలో కళ్యాణ్ సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. 
    అక్టోబర్ 26 , 2023
    Double iSmart Review: మాస్ ఎనర్జీతో ఇరగదీసిన రామ్‌ పొత్తినేని.. సినిమా ఎలా ఉందంటే? ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని కావ్యాథాపర్ జంటగా నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల నడుమ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'లైగర్' ఫ్లాప్  తర్వాత పూరి జగన్నాథ్ (Puri Jagannadh), 'స్కంద' పరాజయం తర్వాత రామ్ పోతినేని (Ram Pothineni) కలిసి చేసిన  సినిమా కావడంతో ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీలోనూ ఈ చిత్రంపై పెద్ద ఎత్తున బజ్ ఏర్పడింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? రామ్‌- పూరి కాంబో మరోసారి హిట్‌ అయిందా? లేదా? ఈ సమీక్షలో చూద్దాం.  కథేంటి? మాఫియా డింపుల్ బిగ్‌ బుల్‌(సంజయ్ దత్‌) మరణం లేకుండా ఉండాలని అనుకుంటాడు. (Double iSmart Review)ఈ క్రమంలో వైద్యులు అతనికి ఓ సలహా ఇస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ గురించి వివరిస్తారు. మెమోరీ ట్రాన్సఫర్ చేస్తే అలాంటి అవకాశం ఉందని చెబుతారు. బిగ్‌ బుల్ మెమోరిని రకరకాల వ్యక్తులకు ట్రాన్స్‌ఫర్ చేస్తారు. కానీ విఫలమవుతుంది. ఈక్రమంలో ఇస్మార్ట్ శంకర్ గురించి బిగ్‌ బుల్‌కు తెలుస్తుంది. తన మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేసేందుకు శంకర్‌ను ఎంచుకుంటారు. మరీ శంకర్‌ బ్రేయిన్‌లోకి బిగ్‌ బుల్ మెమోరీని ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇస్మార్ట్ శంకర్ ఏం చేశాడు? మళ్లీ బిగ్ బుల్, ఇస్టార్ట్ శంకర్ ఎందుకు తలపడుతారు? కావ్యా థాపర్‌కు శంకర్‌కు మధ్య సంబంధం ఏమిటి? బోకా(అలీ) క్యారెక్టర్‌కు ఈ చిత్రంలో ఉన్న ప్రాధాన్యత ఏమిటి అన్నది మిగతా సినిమా. సినిమా ఎలా ఉందంటే? ఫస్టాఫ్‌ లవ్, కామెడీ ట్రాక్‌తో ఉంటుంది. తెలంగాణ స్లాంగ్ డైలగ్‌లతో మాస్ జాతర ఉంటుంది.  పూరీ జగన్నాథ్ మార్క్ పంచ్‌ డైలాగ్‌లు తన స్టైల్ కామెడీ సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ నుంచి ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు రివీల్ అవుతుంటాయి. ముఖ్యంగా రామ్- సంజయ్ దత్‌ల మధ్య వచ్చే సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్ ట్విస్ట్‌ అయితే నెక్స్ట్ లెవల్లో ఉంటుంది. అలాగే డైలాగ్స్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పవచ్చు. తెలంగాణ స్లాంగ్‌లో రామ్ చెప్పే సామెతలు సూపర్బ్‌గా పేలాయి. రామ్- కావ్యాథాపర్ మధ్య రొమాంటిక్ సీన్స్, అలాగే రామ్- సంజయ్ దత్‌ల మధ్య మైండ్ గేమ్, మదర్ సెంటిమెంట్ ఇంట్రెస్టింగ్‌ ఉంటాయి.  రామ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో అలరించాడు.అలీ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి.  ఎవరెలా చేశారంటే? ఇస్మార్ట్ శంకర్‌గా రామ్‌ పొత్తినేని యాక్టింగ్ ఇరగదీశాడు. ఇస్మార్ట్ శంకర్‌ సినిమా కంటే ఈ చిత్రంలో రామ్ యాక్టింగ్ ట్రిపుల్ టైమ్ మాస్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. తన ఎనర్జీకి మించి కష్టపడ్జాడని ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఇక విలన్ బిగ్‌ బుల్‌గా సంజయ్ బాబా యాక్టింగ్ సూపర్బ్‌గా ఉంటుంది. (Double iSmart Review) తన పాత్రకు 100శాతం న్యాయం చేశాడు. హీరోయిన్ జన్నత్‌గా కావ్యాథాపర్ తన పాత్రలో ఒదిగిపోయింది. ఇక సీబీఐ అధికారిగా షియాజీ షిండే, బన్నీ జయశంకర్, రామ్‌ తల్లిగా ఝాన్సీ, బొకాగా అలీ, రామ్‌ స్నేహితుడిగా గెటప్ శ్రీను తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే? లైగర్ ప్లాఫ్ తర్వాత పూరి జగన్నాథ్ చాలా శ్రద్ధగా కథను రాసుకున్నట్లు ఈ సినిమాను చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాతో పూరి తిరిగి కమ్‌బ్యాక్ అయ్యారని చెప్పవచ్చు. తాను అనుకున్న స్టోరీని బాగా తీశాడు. స్క్రీన్‌ప్లే కూడా బాగుంది.  యూత్‌ను అట్రాక్ట్ చేసే ఎలిమెంట్స్‌తో పూరి జగన్నాథ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే సన్నివేశాలు చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తాయి. తనదైన మార్క్ సింగిల్ లైన్ పంచ్‌ డైలాగ్‌లతో మరోసారి పాత తరం పూరిని పరిచయం చేశాడు. మదర్ సెంటిమెంట్ బాగున్నా(Double iSmart Review) ఇంకాస్తా ఎలివేట్ చేస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్‌గా యూత్‌ను అట్రాక్ట్‌ చేసే ఎలిమెంట్స్‌తో సినిమా తీయడంలో పూరి సక్సెస్ అయ్యాడు అని చెప్పవచ్చు. సాంకేతికంగా టెక్నికల్ పరంగా సినిమా చాలా ఉన్నతంగా ఉంది. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా కనిపిస్తుంది. మణిశర్మ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. జియాన్ కే గియాన్ హెల్లి, శ్యామ్‌ కే నాయుడు అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. మొత్తంగా ఈ సినిమా మాస్ పీస్ట్ అని చెప్పవచ్చు.  ప్లస్ పాయింట్స్ రామ్ పొత్తినేని నటన పూరి డైరెక్షన్ సంజయ్ దత్- రామ్ మధ్య సీన్లు మైనస్ పాయింట్స్ లెంగ్తీగా ఉన్న అలీ కామెడీ ట్రాక్ కొన్ని పాటలు తీర్పు:  ఓవరాల్‌గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ రేటింగ్:  3/5
    ఆగస్టు 16 , 2024

    గెటప్ శ్రీను తల్లిదండ్రులు ఎవరు?

    బొడ్డుపల్లి రామస్వామి, దాలమ్మ దంపతులకు గెటప్‌ శ్రీను జన్మించాడు.

    గెటప్ శ్రీను‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    గెటప్‌ శ్రీనుకు ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు.

    గెటప్ శ్రీను పెళ్లి ఎప్పుడు అయింది?

    గెటప్‌ శ్రీను.. సుజాత అనే యువతి ప్రేమ వివాహం చేసుకున్నారు.

    గెటప్ శ్రీను కు పిల్లలు ఎంత మంది?

    ఒక బాబు ఉన్నాడు. పేరు హిమాంషు

    గెటప్ శ్రీను Family Pictures

    Images

    Getup Srinu

    Images

    Getup Srinu's Brother

    గెటప్ శ్రీను ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఈటీవీలో వచ్చిన జబర్దస్త్‌ షో ద్వారా గెటప్‌ శ్రీను పాపులర్‌ అయ్యాడు. వివిధ రకాల గెటప్స్‌లో తనదైన కామెడీతో నవ్వులు పంచాడు. 'రాజు యాదవ్‌' (2024) చిత్రంతో సోలో హీరోగానూ మారాడు.

    గెటప్ శ్రీను లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగబ్బాయి(2013) చిత్రం ద్వారా గెటప్‌ శ్రీను తెరంగేట్రం చేశాడు.

    తెలుగులో గెటప్ శ్రీను ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన గెటప్ శ్రీను తొలి చిత్రం ఏది?

    గెటప్ శ్రీను కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    జాంబిరెడ్డి'లో కసి రెడ్డి.. 'హనుమాన్‌'లో కాసి పాత్రలు.. శ్రీను కెరీర్‌లో అత్యుత్తమమైనవి.

    గెటప్ శ్రీను బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    గెటప్ శ్రీను బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    గెటప్ శ్రీను రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.15-20 లక్షలు తీసుకుంటున్నట్లు సమాచారం.

    గెటప్ శ్రీను కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యాని

    గెటప్ శ్రీను కు ఇష్టమైన నటుడు ఎవరు?

    గెటప్ శ్రీను ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    గెటప్ శ్రీను ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌

    గెటప్ శ్రీను ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    గెటప్ శ్రీను వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Hyundaui Creta

    గెటప్ శ్రీను ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    4.33 లక్షల మంది ఫాలోవర్లు

    గెటప్ శ్రీను సోషల్‌ మీడియా లింక్స్‌

    గెటప్ శ్రీను కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    గెటప్‌ శ్రీనుకు ఎలాంటి వ్యాపారాలు లేవు. అయితే అతని భార్య సుజాత సోషల్‌ మీడియా వేదికగా వస్త్రాల బిజినెస్‌ చేస్తోంది.

    గెటప్ శ్రీను కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీతో గెటప్‌ శ్రీను సన్నిహత సంబంధాలను కలిగి ఉన్నాడు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పవన్‌ కోసం పిఠాపురంలో అతడు ప్రచారం చేశాడు.
    గెటప్ శ్రీను వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే గెటప్ శ్రీను కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree