• TFIDB EN
  • ఘంటసాల
    జననం : డిసెంబర్ 04 , 1922
    తెలుగులో తొలి తరం నేపథ్యగాయకులు, సంగీత దర్శకుల్లో ఘంటసాల ఒకరు. ఆయన మధురమైన కంఠంతో గొప్ప పేరు పొందారు. ఘంటసాల చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. కష్టపడి సంగీతం నేర్చుకున్నారు. స్వర్గసీమ చిత్రం ద్వారా తొలిసారి ఆయనకు నేపథ్య గాయకుడిగా అవకాశం లభించింది. పాతళభైరవి విజయం తెలుగునాట ఆయనకు గుర్తింపునిచ్చింది. దేవదాసు, అనార్కలి, శ్రీవెంకటేశ్వర మహత్యం, మయాబజార్ సినిమాల్లో ఆయన పాడిన పాటలు తెలుగువారి నోట ఇప్పటికీ మార్మోగుతునే ఉంటాయి. భగవద్గీతలో ఆయన పాడిన శ్లోకాలు వినుల విందుగా ఆద్యాత్మికతను చాటుతుంటాయి. నేపథ్య గాయకుడిగా మాత్రమే కాకుండా సంగీత దర్శకుడిగాను ఆయన రాణించారు. దాదాపు 100కు పైగా చిత్రాలకు బాణిలు అందించారు. బాలరాజు, కీలుగుర్రం, మనదేశం, అలీబాబు 40 దొంగలు, చంద్రహారం, శభాష్ రాముడు, మర్మయోగి, లవకుశ, గుండమ్మకథ, పాండవ వనవాసం, భువనసుందరి కథ వంటి చిత్రాలకు సంగీతం అందించారు. సంగీతంలోఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. దాదాపు 30 ఏళ్లపాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ నేపథ్య గాయకుడిగా అవార్డులు అందుకున్నారు. ఇప్పటికీ ఇదొక రికార్డు.
    ఘంటసాల వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే ఘంటసాల కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree