• TFIDB EN
  • హర్ష చెముడు
    జననం : ఆగస్టు 31 , 1990
    ప్రదేశం: విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
    హర్ష చెముడు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు. 1990 ఆగస్టు 31న జన్మించాడు. యూట్యూబ్‌లో వచ్చిన 'వైవా' సిరీస్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకొని వైవా హర్షగా మారాడు. మసాలా (2013) చిత్రంతో తొలిసారి టాలీవుడ్‌లో అడుగుపెట్టాడు. పలు చిత్రాల్లో హాస్య పాత్రలు పోషించి ఇండస్ట్రీలో పాపులర్‌ అయ్యాడు. 'సుందరం మాస్టర్‌' (2024) ఫిల్మ్‌తో హీరోగానూ మారాడు. హర్ష ఇప్పటివరకు 67 చిత్రాల్లో నటించాడు.

    హర్ష చెముడు వయసు ఎంత?

    హర్ష చెముడు వయసు 34 సంవత్సరాలు

    హర్ష చెముడు ముద్దు పేరు ఏంటి?

    వైవా హర్ష

    హర్ష చెముడు ఎత్తు ఎంత?

    5' 7'' (170 cm)

    హర్ష చెముడు అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌

    హర్ష చెముడు ఏం చదువుకున్నారు?

    బీటెక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌

    హర్ష చెముడు సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    యూట్యూబ్‌లో హాస్య వీడియోలు చేశాడు.

    హర్ష చెముడు ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    చైతన్య ఇంజనీరింగ్‌ కాలేజ్‌, విశాఖపట్నం

    హర్ష చెముడు‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 2024 వరకూ 67 చిత్రాల్లో నటించాడు.

    హర్ష చెముడు‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    ది గ్రిల్‌, హాస్టల్‌ డేస్‌, షిట్‌ హ్యాపెన్స్‌, 3 రోజెస్‌, డెడ్ పిక్సెల్స్ వెబ్‌సిరీస్‌లలో హర్ష నటించాడు.

    హర్ష చెముడు In Sun Glasses

    Images

    Harsha Chemudu In Sunglasses

    హర్ష చెముడు Childhood Images

    Images

    Harsha Chemudu Childhood Images

    హర్ష చెముడు With Pet Dogs

    Images

    Harsha Chemudu With Pet Dog

    Images

    Harsha Chemudu

    హర్ష చెముడు అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Harsha Chemudu

    మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవేEditorial List
    మార్చిలో అత్యధికంగా వసూలు చేసిన తెలుగు సినిమాలు ఇవే
    ఈ వారం ఓటీటీల్లో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలుEditorial List
    ఈ వారం ఓటీటీల్లో టాప్‌లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు
    Sundaram Master Review: ‘సుందరం మాస్టర్‌’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే?
    Sundaram Master Review: ‘సుందరం మాస్టర్‌’గా మెప్పించిన ‘వైవా హర్ష’.. సినిమా ఎలా ఉందంటే? నటీనటులు : హర్ష చెముడు, దివ్య సరిపడ, చైతు బాబు రచన & దర్శకత్వం : కళ్యాణ్ సంతోష్‌ సంగీతం : సాయి చరణ్‌ పాకాల సినిమాటోగ్రఫీ : దీపక్ ఎరగేరా ఎడిటర్‌ : కార్తిక్ ఉన్నవ నిర్మాతలు : రవితేజ, సుధీర్‌ కుమార్ కుర్రు విడుదల తేదీ : 23-02-2024 హాస్య నటుడు హర్ష చెముడు ప్రధాన పాత్రలో (Sundaram Master Review) నటించిన చిత్రం ‘సుందరం మాస్టర్‌’ (Sundaram Master). దివ్య శ్రీపాద కథానాయిక. ఈ చిత్రాన్ని హీరో రవితేజ (Ravi Teja), సుధీర్‌ కుమార్‌ కుర్రు సంయుక్తంగా నిర్మించారు. కల్యాణ్‌ సంతోష్‌ దర్శకత్వం వహించారు. కాగా, ఈ చిత్రం ఇవాళ (ఫిబ్రవరి 23) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథానాయకుడిగా హర్ష మెప్పించాడా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. కథ సుందరం మాస్టర్ (వైవా హర్ష) గవర్నమెంట్‌ స్కూల్‌లో సోషల్ టీచర్‌గా పనిచేస్తుంటాడు. ప్రభుత్వ ఉద్యోగం కావడంతో కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఆ ఏరియా ఎమ్మెల్యే (హర్ష వర్ధన్) ఇంగ్లీష్‌ నేర్పడం కోసం అతడిని మిర్యాలమెట్ట అనే గ్రామానికి పంపుతాడు. 90 ఏళ్లుగా బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉన్న ఆ ఊరిలో ఓ విలువైన వస్తువు ఉందని.. దాన్ని తీసుకురావాలని సూచిస్తాడు. ఆ మిస్టరీ గ్రామానికి వెళ్లిన సుందరం మాస్టర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆ ఊరికి బ్రిటిష్‌ వాళ్లకు ఉన్న సంబంధం ఏంటి? అక్కడి మనుషులు ఎలా ఉన్నారు? తను వెళ్లిన పనిని సుందరం పూర్తి చేశాడా? లేదా? అసలు దివ్య శ్రీపాద పాత్ర ఏంటి? అన్నది కథ. ఎవరెలా చేశారంటే? కామెడీతో ఇన్నాళ్లు మెప్పించిన వైవా హర్ష (Sundaram Master Review).. ఈ సినిమాలో కామెడీతో పాటు అన్ని రకాల ఎమోషన్స్‌ని బాగా పండించాడు. హర్ష మాత్రమే ఈ పాత్రకి బాగా సూట్ అవుతాడు అనేలా చేసాడు. దివ్య శ్రీపాద ఆ ఊర్లో ఓ అనాధ పిల్లగా బాగా నటించింది. ఇక ఆ ఊర్లో ఉన్న జనాలుగా నటించిన ఆర్టిస్టులు అంతా అదరగొట్టేశారనే చెప్పొచ్చు. డైరెక్షన్ ఎలా ఉందంటే డైరెక్టర్ కళ్యాణ్ సంతోష్‌ ఎంచుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. కథనం కూడా ఆయన ఆసక్తికరంగా ఎక్కడా బోర్‌ కొట్టకుండా నడిపించాడు. ముఖ్యంగా అడవులు, జలపాతం మధ్యలో ఉన్న చిన్న ఊరును ఆయన చాలా అందంగా చూపించాడు. గ్రామస్తులకు ఇంగ్లీష్‌ నేర్పే క్రమంలో సుందరం మాస్టర్‌ పడ్డ కష్టాలు ప్రేక్షకులకు నవ్వులు పూయిస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు నవ్వించిన సుందరం మాస్టర్‌ను తర్వాత డైరెక్టర్‌ సీరియస్‌ మోడ్‌లోకి తీసుకెళ్లాడు డైరెక్టర్‌. సెకండాఫ్‌ అంతా ఫిలాసఫీ చూట్టూ తిప్పారు. ఆ సన్నివేశాలను డీల్‌ చేయడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. ఫస్టాఫ్‌ అంతా సరదా సరదా సన్నివేశాలతో నడిపించి.. సెకండాఫ్‌లో మాత్రం డైరెక్టర్ నిరాశపరిచాడు.  టెక్నికల్‌గా ఈ సినిమా సాంకేతిక విభాగం అద్భుత పనితీరు కనబరిచింది. ఊరిని అద్భుతంగా డిజైన్‌ చేసిన ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. సాయి చరణ్‌ పాకాల ఇచ్చిన సంగీతం, దీపక్ ఎరగేరా కెమెరా వర్క్‌ ఆకట్టుకుంటాయి. ఇక నిర్మాతగా రవితేజ, సుధీర్ కుమార్ ఓ మంచి సినిమానే అందించారు. నిర్మాణ విషయంలో కూడా తక్కువ బడ్జెట్ లోనే మంచిగా తీసినట్టు అనిపిస్తుంది. ప్లస్ పాయింట్స్ హర్ష నటనకామెడీ సంగీతం మైనస్‌ పాయింట్స్ పసలేని క్లైమాక్స్‌ లాజిక్‌కు అందని సీన్లు Telugu.yousay.tv Rating : 3/5
    ఫిబ్రవరి 23 , 2024
    Paarijatha Parvam Review: సినిమా వాళ్ల కిడ్నాప్‌ సక్సెస్‌ అయ్యిందా! ‘పారిజాత పర్వం’ హిట్టా? ఫట్టా? నటీనటులు : చైతన్యరావు, సునీల్‌, హర్ష చెముడు, శ్రద్ధా దాస్‌, మాళవికా సతీశన్‌, శ్రీకాంత్ అయ్యంగార్‌, సమీర్‌ తదితరులు దర్శకుడు : సంతోష్‌ కంభంపాటి సంగీతం : రీ సినిమాటోగ్రాఫర్‌ : బాల సరస్వతి ఎడిటర్‌ : శశాంక్‌ ఉప్పుటూరి నిర్మాతలు : మహిధర్‌ రెడ్డి, దేవేష్‌ శ్రీనివాసన్‌ సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్‌.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచాయి. కాగా, శుక్రవారం (ఏప్రిల్ 19న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు. మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే కథానాయకుడు చైతన్యరావు హ్యాండ్సమ్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. ఎప్పటిలాగే చక్కటి నటన కనబరిచాడు. అయితే ఈ సినిమాకు హీరో కంటే హర్ష చెముడు, సునీల్‌ పాత్రలే కీలకమని చెప్పవచ్చు. ముఖ్యంగా హర్ష.. తన కమెడీ టైమింగ్‌తో అదరగొట్టాడు. అటు సునీల్‌ సైతం తన కామెడీతో మెప్పించాడు. వింటేజ్‌ సునీల్‌ను మరోమారు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. హీరోయిన్‌గా మాళవిక రావు నటన పర్వాలేదు. హర్ష, మాళవిక మధ్య వచ్చే కామెడీ ట్రాక్‌ నవ్విస్తుంది. బార్‌ డ్యాన్సర్‌గా శ్రద్ధా దాస్ నటన ఓకే. శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సురేఖ వాణి చాలా రోజుల తర్వాత ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కనిపించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు సంతోష్‌ కంభంపాటి.. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో ఈ ఫన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కించారు. సినిమాలు తీసేవాళ్లకు తమ జీవితాల్లో ఎదురయ్యే కష్టాలను చూపించారు. వైవా హర్షను హీరోగా పెట్టి సినిమా తీస్తానని చైతన్య చెప్పడం, నిర్మాతలు ఇచ్చే సమాధానాలు నవ్విస్తాయి. హర్ష, సునీల్‌లోని కామెడీ టైమింగ్‌ను డైరెక్టర్ చాలా బాగా వాడుకున్నారు. అయితే చైతన్యరావులోని నటుడ్ని సరిగా వాడుకోలేదని అనిపిస్తుంది. కథ కూడా సాదా సీదాగా సాగడం, పేలవమైన స్క్రీన్‌ప్లే, రొటీన్‌ ట్విస్టులు సినిమాకు మైనస్‌గా మారాయి. సినిమాలో చాలా చోట్ల లాజిక్కులు మిస్‌ అయ్యాయి. కిడ్నాప్ డ్రామా తెరపైకి వచ్చి ట్విస్టులు రివీల్ అయ్యాక కామెడీ డైల్యూట్ అయ్యింది. ఫలితంగా ప్రేక్షకుల్లో కథపై క్యూరియాసిటీ తగ్గిపోయింది. అప్పటి వరకు సినిమా బ్యాక్‌డ్రాప్‌తో కొత్తగా అనిపించిన 'పారిజాత పర్వం'.. డైరెక్టర్‌ చేసిన కొన్ని తప్పిదాల వల్ల రొటీన్‌ మూవీగా మారిపోయింది.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కెమెరా, ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. సంగీత దర్శకుడు 'రీ' బాణీల్లో పెప్పీ, మోడ్రన్ స్టైల్ వినిపించింది. నేపథ్య సంగీతం సోసోగా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీపడినట్లు కనిపించలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ కథకామెడీ సన్నివేశాలు మైనస్‌ పాయింట్స్‌ రొటీన్‌ సన్నివేశాలుపేలవమైన స్క్రీన్‌ప్లేలాజిక్స్‌కు అందని సీన్స్‌ Telugu.yousay.tv Rating : 2.5/5 
    ఏప్రిల్ 19 , 2024
    Bubblegum Review: హీరోగా ఆకట్టుకున్న యాంకర్‌ సుమ తనయుడు.. ‘బబుల్‌ గమ్‌’ ఎలా ఉందంటే? న‌టీనటులు: రోషన్ కనకాల, మానస చౌదరి, హర్ష చెముడు, కిరణ్ మచ్చ, అనన్య ఆకుల, హర్షవర్ధన్, అను హాసన్, చైతు జొన్నలగడ్డ, బిందు చంద్రమౌళి తదితరులు దర్శకత్వం: రవికాంత్ పేరేపు సంగీతం: శ్రీచరణ్ పాకాల ఛాయాగ్ర‌హ‌ణం: సురేష్ రగుతు నిర్మాణ సంస్థ‌లు: మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విడుద‌ల తేదీ: 29-12-2023 రాజీవ్ క‌న‌కాల, సుమ దంప‌తుల కుమారుడు రోష‌న్ హీరోగా అరంగేట్రం చేసిన చిత్రం ‘బబుల్‌ గమ్‌’. ర‌వికాంత్ పేరేపు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, రాజ‌మౌళి, వెంక‌టేష్ వంటి ప్ర‌ముఖ తార‌లు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు యువ‌త‌రాన్ని ఆకర్షించేలా ఉండ‌టంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. మ‌రి ఆ అంచ‌నాల్ని ఈ చిత్రం అందుకుందా? హీరోగా రోష‌న్ తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యాన్ని అందుకున్నాడా? ఇప్పుడు చూద్దాం.  కథ హైదరాబాదీ కుర్రాడు ఆది (రోషన్ కనకాల) డీజే కావాలని కలలు కంటాడు. ఓరోజు పబ్‌లో జాన్వీ(మానస చౌదరి)ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ఫాలో అవుతుంటాడు. అయితే జాన్వీ పెద్దింటి అమ్మాయి. లవ్, రిలేషన్స్ పెద్దగా నచ్చవు. అబ్బాయిల్ని ఆటబొమ్మల్లా చూస్తుంటుంది. ఇలాంటి అమ్మాయి అనుకోని పరిస్థితుల్లో ఆదితో లవ్‌లో పడుతుంది. భిన్న మనస్తత్వాలు కలిగిన ఆది, జాన్వీ ఎలాంటి సమస్యలు ఫేస్‌ చేశారు? చివరకు ఒక్కటయ్యారా? లేదా? అనేదే కథ. ఎవరెలా చేశారంటే హీరోగా రోషన్ కనకాలకు ఇది తొలి సినిమా అయినప్పటికీ ఆకట్టుకున్నాడు. హైదరాబాదీ కుర్రాడి పాత్రలో ఒదిగిపోయాడు. లుక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా అన్నీ బాగున్నాయి. హీరోయిన్ మానస చౌదరి తన నటనతో మంచి మార్కులే సంపాదించింది. రొమాంటిక్ సీన్స్‌లో ఆమె మరింత రెచ్చిపోయింది. మిగతా సన్నివేశాల్లో పర్వాలేదనిపించింది. హీరో తండ్రి పాత్రలో చైతు జొన్నల గడ్డ మంచి కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్‌ చేశాడు. హర్షవర్ధన్‌, అనుహాసన్‌ వంటి నటులు తమ పాత్ర పరిధిమేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే యువతరాన్ని లక్ష్యంగా చేసుకొని డైరెక్టర్‌ రవికాంత్‌ పేరేపు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే కథ, కథనం రొటీన్‌గా అనిపిస్తాయి. విరామ సన్నివేశాలు, క్లైమాక్స్‌ మినహా మిగతా స్టోరీ అంతా చాలా సినిమాల్లో చూసిన భావన కలుగుతుంది. జాను-ఆదిల మధ్య వచ్చే రొమాంటిక్‌ సన్నివేశాలను మాత్రం యూత్‌కు నచ్చేలా డైరెక్టర్ తెరకెక్కించారు. ముఖ్యంగా విరామ సన్నివేశాలు ద్వితియార్థంపై ఆసక్తిని పెంచుతాయి. గతంలో వచ్చిన లవ్‌ సినిమాలకు భిన్నంగా పతాక సన్నివేశాలను డైరెక్టర్‌ ప్రజెంట్‌ చేశారు. యువతకు మంచి సందేశమిచ్చి కథను ముగించారు.   టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. సినిమాలో 'జిలేబీ' పాట బాగుంది. శ్రీ చరణ్‌ పాకాల అందించిన నేపథ్యం సంగీతం ఆకట్టుకుంది. అయితే కొన్ని సీన్స్‌లో మ్యూజిక్ డామినేట్ చేసినట్లు అనిపించింది. సురేశ్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ రోషన్‌, మానస నటనతండ్రి, కొడుకుల సీన్లుసెకండాఫ్‌, క్లైమాక్స్‌ మైసన్‌ పాయింట్స్‌ రొటిన్‌ కథ, కథనంసాగదీత సీన్స్ రేటింగ్‌: 2.5/5
    డిసెంబర్ 29 , 2023
    Appudo Ippudo Eppudo Review: బోరింగ్ లవ్‌ట్రాక్స్‌తో నిరాశపరిచిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’.. కానీ! నటీనటులు : నిఖిల్‌, దివ్యాంన్ష కౌషిక్‌, సత్య, అజయ్‌, సాయిరామ్‌ రెడ్డి, రుక్మిణి వసంత్‌, హర్ష చెముడు తదితరులు రచన, డైరెక్టర్‌ : సుధీర్ వర్మ సంగీతం:  కార్తిక్‌ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్‌ ఎడిటింగ్‌: నవీన్‌ నూలి నిర్మాత: బి.వి.ఎస్‌. ఎన్‌. ప్రసాద్‌ విడుదల తేదీ: నవంబర్‌ 8, 2024 యంగ్ హీరో నిఖిల్‌ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ (Appudo Ippudo Eppudo Review). నిఖిల్‌తో ‘స్వామిరారా’, ‘కేశవ’ తీసిన దర్శకుడు సుధీర్‌ వర్మ ఈ సినిమా రూపొందించారు. బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించారు. రుక్మిణీ వసంత్‌ కథానాయిక. దివ్యాంశ కౌశిక్‌ కీలక పాత్ర పోషించింది. నవంబరు 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుందా? నిఖిల్‌కు విజయాన్ని అందించిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి హైదరాబాద్‌కు చెందిన రిషి (నిఖిల్‌) కెరీర్‌పై పెద్దగా ఆశలు లేకుండా సరదాగా తిరుగుతుంటాడు. ఈ క్రమంలో తొలి చూపులోనే తార (రుక్మిణి వసంత్‌) చూసి ఇష్టపడతాడు. కొన్ని నాటకీయ పరిణామాల వల్ల వారి లవ్‌ బ్రేకప్‌ అవుతుంది. లవ్‌ ఫెయిల్‌ అవ్వడంతో కెరీర్‌పై ఫోకస్‌ పెట్టిన రిషి లండన్‌కు వచ్చేస్తాడు. అక్కడ రేసర్‌గా ట్రైనింగ్‌ తీసుకుంటూ పాకెట్‌ మనీ కోసం చిన్నపాటి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో లండన్‌లో పరిచయమైన తులసి (దివ్యాంశ కౌశిక్‌)కు రిషి దగ్గరవుతాడు. ఆమెను పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే తులసి అనూహ్యంగా మిస్ అవుతుంది. మరోవైపు హైదరాబాద్‌లో ప్రేమించిన తార లండన్‌లో ప్రత్యక్షమవుతుంది. అటు రిషి అనుకోకుండా లోకల్‌ డాన్‌ బద్రినారాయణ (జాన్ విజయ్‌) చేతిలో ఇరుక్కుంటాడు. అసలు బద్రి నారాయణ ఎవరు? తులసి ఎలా మిస్ అయ్యింది? తారా ఎందుకు లండన్‌కు వచ్చింది? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Appudo Ippudo Eppudo Review) ఎవరెలా చేశారంటే హీరో నిఖిల్ (Nikhil) ఎప్పటిలాగే సెటిల్డ్‌ నటనతో ఆకట్టుకున్నాడు. తన లుక్స్‌, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. అయితే అతడి పాత్రలో నటన పరంగా పెద్దగా మెరుపులు లేదు. సాఫీగా చేసుకుంటూ వెళ్లాడు. హీరోయిన్ రుక్మిణి వసంత్‌ తన సహజమైన నటనతో ఆకట్టుకుంది. హావభావాలను చక్కగా పలకిస్తూ మంచి నటిగా మరోమారు నిరూపించుకుంది. మరో నటి దివ్యాంశ కౌశిక్‌కు ఇందులో మంచి పాత్రే దక్కింది. నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న తులసి పాత్రలో ఆమె ఆకట్టుకుంది. లుక్స్‌, గ్లామర్‌ పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. హాస్యనటుడు హర్ష చెముడు కామెడీ టైమింగ్ నవ్విస్తుంది. జాన్ విజయ్, అజయ్ పాత్రలు పర్వాలేదు. సత్యదేవ్, సుదర్శన్ పాత్రలు కథలో వేగం పెంచేందుకు దోహదం చేశాయి. డైరెక్షన్‌ ఎలా ఉందంటే దర్శకుడు సుధీర్ వర్మ రొటీన్‌ స్టోరీ (Appudo Ippudo Eppudo Review)నే ఈ సినిమాకు ఎంచుకున్నాడు. అయితే కథనం, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం దర్శకుడు తన మార్క్‌ను చూపించాడు. ముఖ్యంగా మూడో వ్యక్తి (కమెడియన్‌ సత్య) కోణంలో కథను నడిపించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సినిమాకు కీలకమైన హీరో, హీరోయిన్ల రెండు లవ్‌ట్రాక్స్‌ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. హీరో పరిచయం, అతడి ఫస్ట్ లవ్‌ట్రాక్‌తో తొలి భాగం పేవలంగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. సెకండాఫ్‌ కాస్త పర్వాలేదనిపించినా కీలక సన్నివేశాల విషయంలో దర్శకుడు పూర్తిగా తడబడ్డాడు. ట్విస్టులు రివీల్‌ చేసిన విధానం కూడా బెడిసికొట్టింది. అయితే హర్ష చెముడు, సత్య, సుదర్శన్‌ కమెడితో దర్శకుడు కొంతమేర సినిమాను లాక్కొచ్చాడని చెప్పవచ్చు. కమర్షియల్‌ పాళ్లు తక్కువగా ఉండటం, పేలవమైన యాక్షన్‌ సీక్వెన్స్‌ మరింత మైనస్‌గా మారాయి.  సాంకేతికంగా .. టెక్నికల్ విషయాలకు వస్తే (Appudo Ippudo Eppudo Review) రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. కార్తిక్ అందించిన పాటలు సోసోగా ఉంది. నేపథ్య సంగీతం కాస్త పర్వాలేదు. ఎడిటింగ్ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ నిఖిల్‌ నటనకామెడీసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ పేలవమైన స్టోరీబోరింగ్ లవ్‌ట్రాక్స్‌కమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 2/5 
    నవంబర్ 08 , 2024

    హర్ష చెముడు తల్లిదండ్రులు ఎవరు?

    సత్యనారాయణ రావు, రమాదేవి దంపతులకు 1991 ఆగస్టు 31న హర్ష చెముడు జన్మించాడు.

    హర్ష చెముడు తల్లిదండ్రులు ఏం చేస్తారు?

    హర్ష తండ్రి సత్యనారాయణ రావు ఫెడరల్‌ బ్యాంక్‌లో మేనేజర్‌గా పనిచేశారు.

    హర్ష చెముడు‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    హర్షకు ఒక సిస్టర్ ఉంది. పేరు శ్వేత. ఇన్ఫోసిస్‌లో వర్క్‌ చేస్తోంది.

    హర్ష చెముడు పెళ్లి ఎప్పుడు అయింది?

    అక్షరను 2021లో ప్రేమ వివాహం చేసుకున్నాడు.

    హర్ష చెముడు ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    యూట్యూబ్‌లో వైవా డిస్కషన్‌పై చేసిన వీడియో ద్వారా హర్ష పాపులర్ అయ్యాడు. ఆ వీడియో వైరల్‌ కావడంతో హర్షకు సినిమాల్లో అవకాశాలు దక్కాయి.

    హర్ష చెముడు లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    2013లో వచ్చిన 'మసాలా' చిత్రంతో హర్ష తెరంగేట్రం చేశాడు. సుందరం మాస్టర్‌ (2024) చిత్రంలో తొలిసారి హీరోగా నటించాడు.

    తెలుగులో హర్ష చెముడు ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    హాస్యనటుడిగా 'పవర్‌' చిత్రం అతడి కెరీర్‌లో వచ్చిన ఫస్ట్ హిట్‌ మూవీ.

    హర్ష చెముడు కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    సుందరం మాస్టర్‌ (2024) చిత్రంలోని పాత్ర

    హర్ష చెముడు బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    హర్ష చెముడు బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    హర్ష చెముడు కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    హైదరాబాద్‌ బిర్యానీ

    హర్ష చెముడు కు ఇష్టమైన నటుడు ఎవరు?

    హర్ష చెముడు ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    హర్ష చెముడు ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లూ, వైట్‌

    హర్ష చెముడు ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    హర్ష చెముడు ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    హర్ష చెముడు ఆస్తుల విలువ రూ.10-15 కోట్లు ఉంటుందని సమాచారం.

    హర్ష చెముడు ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    585K ఫాలోవర్లు ఉన్నారు.

    హర్ష చెముడు సోషల్‌ మీడియా లింక్స్‌

    హర్ష చెముడు కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సంతోషం ఫిల్మ్‌ అవార్డ్ - 2023

      అల్లు రామలింగయ్య స్మారక అవార్డును అందుకున్నాడు

    హర్ష చెముడు వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే హర్ష చెముడు కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree