

లావణ్య త్రిపాఠి
జననం : డిసెంబర్ 15 , 1990
ప్రదేశం: అయోధ్య, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
లావణ్య త్రిపాఠి తెలుగు సినిమా నటి. అందాల రాక్షసి(2012) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్నినాయనా చిత్రాలు సూపర్ హిట్ కావడంతో ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ దొరికింది. రాధ, మిస్టర్, ఉన్నది ఒక్కటే జిందగీ, అంతరిక్షం, అర్జున్ సురవరం వంటి హిట్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.
లావణ్య త్రిపాఠి వయసు ఎంత?
లావణ్య త్రిపాఠి వయసు 34 సంవత్సరాలు
లావణ్య త్రిపాఠి ఎత్తు ఎంత?
5' 7'' (170cm)
లావణ్య త్రిపాఠి అభిరుచులు ఏంటి?
ట్రావెలింగ్
లావణ్య త్రిపాఠి ఏం చదువుకున్నారు?
ఎకనామిక్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.
లావణ్య త్రిపాఠి ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
మార్షల్ స్కూల్, ఉత్తరాఖండ్, రిషి దయారామ్ అండ్ సేత్ హసారామ్ నేషనల్ కాలేజ్, ముంబయి
లావణ్య త్రిపాఠి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
అనితా రెడ్డి
లావణ్య త్రిపాఠి ఫిగర్ మెజర్‌మెంట్స్?
36-28-34
లావణ్య త్రిపాఠి ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
2024లో ఇప్పటివరకూ 19 చిత్రాల్లో లావణ్య త్రిపాఠి నటించింది.
లావణ్య త్రిపాఠి ఇప్పటివరకూ చేసిన వెబ్ సిరీస్‌లు?
పులి మేక (2023), మిస్ పర్ఫెక్ట్ (2024)
లావణ్య త్రిపాఠి In Saree
లావణ్య త్రిపాఠి Hot Pics
లావణ్య త్రిపాఠి In Modern Dress
లావణ్య త్రిపాఠి In Ethnic Dress
లావణ్య త్రిపాఠి అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
- Stars celebrate Christmas 2024: క్రిస్మస్ రోజున సెలబ్రటీల వెలుగు జిలుగులు.. ఓ లుక్కేయండి!క్రిస్మస్ పర్వదినం (Stars celebrate Christmas 2024) సందర్భంగా పలువులు సెలబ్రిటీలు ఎంతో సంతోషంగా గడిపారు. కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి క్రిస్మస్ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. కొందరు ఇంట్లో పండగ జరుపుకుంటే మరికొందరు చర్చికి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరికొందరు విదేశాల్లో పండగను ఆస్వాదించారు. అభిమానులకు పండగ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. రామ్‌చరణ్ - ఉపాసన జంట.. కూతురు క్లింకారతో కలిసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఇంట్లో పనిచేసే వారితో కలిసి సంతోషంగా ఈ పండగ చేసుకున్నారు. స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde).. క్రిస్మస్ రోజున ఎంతో సరదాగా గడిపింది. క్రిస్మస్ ట్రీ పక్కన కాఫీ దాగుతూ బ్యూటీఫుల్ ఫొటోను షేర్ చేసింది. బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ (Kiara Advani) తన భర్త సిద్ధార్ధ్ మల్హోత్రా (Sidharth Malhotra)తో కలిసి క్రిస్మస్ వేడుకలను జరుపుకుంది. భర్తను ఆలింగనం చేసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుంది. బాలీవుడ్ స్టార్ జంట విక్కీ కౌషల్ (Vicky Kaushal) - కత్రీనా కైఫ్ (Katrina Kaif) విదేశాల్లో క్రిస్మస్ జరుపుకుంది. శాంటా క్లాజ్ గెటప్‌లో ఉన్న వ్యక్తితో వారు దిగిన ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. హీరోయిన్ డింపుల్ హయాతీ ఇంట్లోనే క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసుకొని ఆనందంగా గడిపింది. క్రిస్మస్ ట్రీ, కేక్ మధ్య ఆమె దిగిన ఫొటో అలరిస్తోంది. ప్రముఖ నటి కీర్తి సురేష్ (Keerthi Suresh) 'బేబీ జాన్' హీరో వరుణ్ ధావన్ (Varun Dhawan)తో కలిసి క్రిస్మస్ జరుపుకుంది. చేతులు చాచి వారిద్దరు దిగిన ఫొటోపై మీరు ఓ లుక్కేయండి. స్టార్ హీరోయిన్ నయనతార (Nayanthara).. భర్త విఘ్నేష్, కవల పిల్లలతో క్రిస్మస్ రోజున సరదాగా గడిపింది. క్రిస్మస్ ట్రీ వద్ద ఏర్పాటు చేసిన గిఫ్ట్ బాక్సులను పిల్లలకు ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. మలయాళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) తన తల్లితో కలిసి క్రిస్టమస్ జరుపుకుంది. తలపై క్రిస్మస్ టోపీతో తల్లిని ఆలింగనం చేసుకున్న ఫొటో ఆకట్టుకుటోంది. క్రిస్మస్ సందర్భంగా రణ్‌బీర్ (Ranbir Kapoor) - అలియా (Alia Bhatt) జంట మరోమారు తళుక్కుమంది. కూతురు రాహాతో కలిసి వారు సంతోషంగా దిగిన ఫొటో ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తోంది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ సారా అలీఖాన్ (Sara Ali Khan) క్రిస్మస్ రోజున సోదరుడు ఇబ్రహీం అలీఖాన్‌తో దిగిన ఫొటో ప్రత్యేకంగా నిలుస్తోంది. వారిద్దరు క్రిస్మస్ ట్రీ ఎదుట ఫొటోకు ఫోజులిచ్చారు. టీమిండియా మాజీ కెప్టెన్ ఎం.ఎస్. ధోని (MS Dhoni) కుటుంబ సభ్యులతో క్రిస్మస్ను ఘనంగా జరుపుకున్నారు. క్రిస్మస్ క్యాప్‌తో భార్య, కూతురుతో అతడు దిగిన ఫొటో క్రికెట్ లవర్స్‌ను తెగ మెప్పిస్తోంది. తమిళ స్టార్ హీరో శివకార్తికేయ (Sivakarthikeyan) తన కుమారుడు గుగన్ దాస్‌తో పండగను సెలబ్రేట్ చేసుకున్నాడు. క్రిస్మస్ ట్రీ ముందు కుమారుడితో అందమైన సెల్ఫీ దిగి నెట్టింట పోస్టు చేశాడు. మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej), భార్య లావణ్య త్రిపాఠితో కలిసి విదేశాల్లో క్రిస్మస్ జరుపుకున్నాడు. ధ్రువపు జింకతో వారు జిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ (Shruti Hassan).. క్రిస్మస్ ట్రీతో దిగిన ఫొటో వైరల్ అవుతోంది. మోడ్రన్ డ్రెస్‌లో ఆమె దిగిన ఫొటో నెటిజన్లను మెప్పిస్తోంది. తెలుగు హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh) క్రిస్మస్ రోజున చాలా సంతోషంగా గడిపింది. వివిధ రకాల ఫోజుల్లో క్రిస్టమస్ చెట్టుతో ఫొటోలు దిగింది. వాటిని మీరూ చూసేయండి. కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) ఇంట్లోనే క్రీస్తు పండగను చేసుకుంది. క్రిస్మస్ ఎంతో ఉత్తేజకరమైన రోజని ఆమె పేర్కొన్నారు. తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) తలపై శాంటా క్లాజ్ హెయిర్ బాండ్ పెట్టుకొని పోస్టు చేసిన ఫొటో ఆకట్టుకుంటోంది. టిల్లు బ్యూటీ నేహా శెట్టి (Neha Shetty).. పారిస్ నగరంలో క్రిస్మస్ను ఘనంగా చేసుకుంది. ఈఫిల్ టవర్ కనిపించేలా ఆమె దిగిన ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ‘హనుమాన్’ ఫేమ్ అమృత అయ్యర్ (Amrita Aiyer) క్రిస్మస్ ట్రీ పక్కన ఎంతో అందంగా ఫొటో దిగింది. క్రిస్మస్ వెలుగుల మధ్య ఆమె అందం మరింత రెట్టింపు అయ్యిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అందాల భామ హన్సిక (Haniska) ఈ పండగ సందర్భంగా తళుక్కున మెరిసింది. క్రిస్మస్ చెట్టు, శాంటా క్లాజ్ బొమ్మ పక్కన ఎంతో స్టైలిష్‌గా ఫొటో దిగింది. ప్రముఖ నటి రాయ్ లక్ష్మీ (Ray Lakshmi) క్రిస్మస్ వెలుగుల మధ్య ఎంతో సంతోషంగా గడిపింది. ఫ్యాన్స్‌ను ఉత్తేజపరుస్తూ ఆమె ఇచ్చిన ఫోజు మెప్పిస్తోంది. 'గద్దల గణేష్' ఫేమ్ మృణాళిని రవి (Mirnalini Ravi).. విదేశాల్లో క్రిస్మస్ పండుగను ఆస్వాదించింది. అక్కడి వీధుల్లో విద్యుత్ దీపాల వెలుగుల్లో ఆమె దిగిన ఫొటో ఆకట్టుకుంటోంది. ప్రముఖ నటి రుక్సార్ ధిల్లాన్ (Ruksar Dillon) కూడా ఘనంగా జరుపుకుంటోంది. రెడ్ కలర్ డ్రెస్, మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్‌తో అభిమానులను సర్ప్రైజ్ చేసింది. డిసెంబర్ 26 , 2024
- Diwali Photos Of Tollywood Celebrities: దీవాళి వేళ తళక్కున మెరిసిన తెలుగు హీరోయిన్లుదీపావళి సందర్భంగా పలువురు తెలుగు హీరోయిన్లు సాంప్రదాయ వస్త్రాలంకరణలో తళక్కున మెరిసారు. కుటుంబ సమేతంగా ఆనందంగా జరుపుకున్న ఆనంద క్షణాలను ఇన్‌స్టా పోస్ట్‌ల ద్వారా పంచుకున్నారు. మరి ఎవరెవరూ పండుగను ఎలా జరుపుకున్నారో మీరు ఓ లుక్ వేయండి. టాలీవుడ్ కుర్ర హీరోయిన్ పూజిత పొన్నాడ బ్లూ కలర్ శారీలో అందంగా కనిపించింది. చేతిలో దీపాలతో ఫొటోలకు పొజులిచ్చింది. ఇంటిళ్లిపాది దీపాలను అలంకరించింది. నేషనల్ క్రష్ రష్మిక మంధాన దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంది. రాత్రిపూట తన ఇంటి టెరాస్పై దీపాలు పెడుతూ అందంగా కనిపించింది. దేవర బ్యూటి జాన్వీ కపూర్ దీపావళి సందర్భందా టిష్యూ సిల్క్ చీరలో తళక్కున మెరిసింది. కుటుంబ సభ్యులతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకుంది. రాశీ ఖన్నా దీపావళి వేళ.. ఇంటి ముగ్గువేసి పువ్వులతో అలంకరించింది. వాటిపై దీపాలు పెడుతూ పండుగను సెలబ్రేట్ చేసుకుంది. బాలయ్య ముద్దుగుమ్మ ప్రాగ్య జైస్వాల్ దీపావళి వేళ తన ఇంటిని బంతిపూల మాలలతో అలంకరించింది. వీటికి సంబంధించిన ఫిక్స్‌ను ఇన్‌స్టాలో షేర్ చేసింది. తమిళ్ సూపర్ స్టార్ సూర్య తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకున్నాడు. ఈ ఆనంద క్షణాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. అందాల తార అనసూయ దీపావళి వేళ.. సాంప్రదాయ వస్త్రాలంకరణలో మెరిసింది. చేతిలో దీపం చూపిస్తూ తన సంతోషాన్ని పంచుకుంది. ఇస్మార్ట్ భామ నభా నటేష్ హాట్ లుక్‌లో దియా పట్టుకుని ఫొటోకు పొజులిచ్చింది. బ్యాక్ గ్రౌండ్ వెలుతురులో అందంగా కనిపించింది. మేజర్ బ్యూటీ సాయి మంజ్రేకర్ దీపావళి ట్రెడిషనల్ అవుట్ లుక్‌లో వావ్ అనిపించింది. దీపాలు వెలిగిస్తున్న ఫొటోలు షేర్ చేసింది. హీరోయిన్ నేహా శర్మ పండుగ వేళ హాట్ లుక్‌లో దియాను పట్టుకుని ఫొటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ గ్లామరస్ పిక్స్ వైరల్‌గా మారాయి. కొత్త జంట మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దీపావళిని ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు షేర్ చేశారు. టాలీవుడ్ గ్లామరస్ బ్యూటి పూజా హెగ్డే తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళిని ఘనంగా జరుపుకుంది. రెడ్ శారీలో అందంగా కనిపించింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి పాటాసులు కాల్చే ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశాడు. కుటుంబంతో దీపావళిని ఆనందంగా జరుపుకున్నట్లు పోస్ట్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ సైతం తన కుటంబ సభ్యులతో కలిసి దీపావళిని ఆనందంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు.నవంబర్ 02 , 2024
- వరుణ్ తేజ్ (Varun Tej) గురించి మీకు తెలియని ఆసక్తికరమైన సంగతులుమెగా ప్రిన్స్‌గా ఇండస్ట్రీకి పరిచయం అయిన వరుణ్ తేజ్… టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. గద్దలకొండ గణేష్ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్‌తో మాస్ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. కంచె, ముకుందా, తొలిప్రేమ వంటి హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యాడు. ప్రస్తుతం యంగ్ హీరోల్లో స్టార్ డంతో కొనసాగుతున్న వరుణ్ తేజ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. వరుణ్ తేజ్ అసలు పేరు? సాయి వరుణ్ తేజ్. స్క్రీన్‌పై పెద్దదిగా ఉంటుందని తీసేశారట. అతని అన్ని సర్టిఫికెట్లలో ఇదే పేరు ఉంటంది. వరుణ్ తేజ్ ఎత్తు ఎంత? 6 అడుగుల 4 అంగుళాలు వరుణ్ తేజ్ తొలి సినిమా? ముకుందా ద్వారా తొలిసారి నటుడిగా వెండితెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత కంచె చిత్రం గుర్తింపు తెచ్చింది. వరుణ్ తేజ్‌కు వివాహం అయిందా? 2023 నవంబర్ 1న లావణ్య త్రిపాఠితో ఇటలీలో పెళ్లి జరిగింది. వరుణ్ తేజ్ క్రష్ ఎవరు? తనకు తన భార్య లావణ్య త్రిపాఠి అంటే మొదటి నుంచి క్రష్ ఉండేదని.. తర్వాత అది ప్రేమగా మారి ఆమెనే పెళ్లి చేసుకున్నట్లు చెప్పాడు. అయితే సెకండ్ ఆప్షన్‌గా సాయి పల్లవి పేరు చెప్పాడు. వరుణ్ తేజ్ తొలి బ్లాక్ బాస్టర్ హిట్స్? గద్దలకొండ గణేష్, ఎఫ్2 వంచి చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాయి. వరుణ్ తేజ్‌కు ఇష్టమైన కలర్? వైట్ వరుణ్ తేజ్ పుట్టిన తేదీ? 19 January 1990 వరుణ్ తేజ్ తల్లి పేరు? పద్మజ వరుణ్ తేజ్ వ్యాపారాలు? ఆర్ట్స్ వర్క్స్ రీ సెల్లింగ్ వరుణ్ తేజ్‌కు ఎన్ని అవార్డులు వచ్చాయి? సైమా అవార్డ్స్‌ల్లో ఉత్తమ హీరో కెటగిరీలో కంచె, గద్దలకొండ గణేష్, తొలిప్రేమ చిత్రాలకు గాను నామినేట్ అయ్యాడు. కానీ అవార్డులు రాలేదు. వరుణ్ తేజ్ ఎన్ని సినిమాల్లో నటించాడు? వరుణ్ తేజ్ 2024 వరకు 13 సినిమాల్లో హీరోగా నటించాడు. https://www.youtube.com/watch?v=Mh9qxcJVGfI వరుణ్ తేజ్‌కు ఇష్టమైన సినిమా? ఇంద్ర వరుణ్ తేజ్‌కు ఇష్టమైన ఆహారం? థాయ్, మెక్సికన్ వంటలంటే ఇష్టం వరుణ్ తేజ్ ఇల్లు ఎక్కడ? వరుణ్ తేజ్ తన భార్య లావణ్య త్రిపాఠితో కలిసి హైదరాబాద్- మణికొండలో కొత్తగా నిర్మించిన ఇంటిలో ఉంటున్నాడు.మార్చి 21 , 2024

Lavanya Tripathi: విదేశాల్లో వరుణ్ తేజ్‌తో కలిసి లావణ్య త్రిపాఠి ఎంజాయ్.. వరుణ్ బాధను తగ్గించేందుకే వెకేషన్?
మెగా ఫ్యామిలీకి కాబోయే కోడలు లావణ్య త్రిపాఠి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ప్రస్తుతం కాబోయే భర్త వరుణ్‌తో అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలను తాజాగా ఆమె షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి.
వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ కాస్త హాట్ లుక్‌లో కనిపించింది. వంకాయ కలర్ డ్రెస్‌లో సోగసుల విందు చేసింది. స్లీవ్ లెస్‌టాప్‌లో మెరసిపోయింది.
లావణ్య త్రిపాఠి టాలీవుడ్‌లో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అందాల రాక్షసి సినిమాతో తెలుగులోకి తెరంగేట్రం చేసిన ఈ భామ తన అందం, నటనతో చాలా మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది.
భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన, దూసుకెళ్తా లాంటి సినిమా హిట్స్ ఈ సొట్ట బుగ్గల చిన్నదాని ఖాతాలో ఉన్నాయి.
విభిన్న పాత్రలు చేసేందుకు ఎప్పుడూ రెడీగా ఉండే లావణ్య అంతరిక్షం లాంటి భిన్నమైన సినిమాలోనూ నటించింది.
కుర్రహీరోల నుంచి అగ్రహీరోల సరసన పలు హిట్ సినిమాల్లో నటించినా... ఎందుకనో లావణ్యకు అవకాశాలు బాగా తగ్గాయి.
రీసెంట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్‌తో నిశ్చితార్థం జరుపుకోవడంతో ఒక్కసారిగా లావణ్య టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. మిస్టర్ మూవీ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారని టాక్.
ఇక వీరి లవ్ స్టోరీ విషయానికి వస్తే.. ఈ ఇద్దరూ 2017లో వచ్చిన మిస్టర్ సినిమాలో మొదటి సారి కలిసి నటించారు. ఈ సినిమాలో ఇటలీలో షూటింగ్ జరుపుకుంది.
ఆక్రమంలోనే ఇద్దరి అభిప్రాయాలు కలిసి తొలుత స్నేహితులుగా మారి తర్వాత పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు.
విశేషమేమిటంటే.. వీరి పెళ్లి తర్వాత.. హనీమూన్‌ను వారి ప్రేమకు బీజం వేసిన ఇటలీలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారంట.
ఇక వరుణ్ తేజ్ విషయానికొస్తే... శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో తెరకెక్కిన ముకుందాతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యాడు. క్రిష్ కంచె మూవీతో నటనలో పరిణతి చెందాడు.
అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసిన F2, శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వచ్చిన ఫిదా చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్స్ కొట్టాడు.
రీసెంట్‌గా రిలీజైన గాండీవధారి అర్జున ఆశించినంత విజయం సాధించకపోవడంతో నిరాశలో ఉన్నాడు వరుణ్ తేజ్. ఈ క్రమంలోనే అతని బాధను తగ్గించేందుకు వెకేషన్ చేపట్టారు వరుణ్- లావణ్య త్రిపాఠి.
సెప్టెంబర్ 06 , 2023
VARUNLAV: ఈ జంటల స్ఫూర్తితోనే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లికి సిద్ధమయ్యారు!
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి పీటలెక్కబోతున్నాడు. హీరోయిన్ లావణ్య త్రిపాఠికి మనసిచ్చిన ఈ హీరో ఇప్పుడు మనువాడేందుకు రెడీ అవుతున్నాడు. గత కొద్ది కాలంగా రిలేషన్‌షిప్‌పై సైలెంట్‌గా ఉన్న వీరు ఏకంగా పెళ్లి ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. కలిసి సినిమాల్లో నటించి ప్రేమ పెళ్లి చేసుకుంటున్నది వీరొక్కరే కాదు. ఈ జాబితాలో ఇప్పటికే ఎంతో మంది ఉన్నారు. ఆ జంటలేవో తెలుసుకుందాం.
https://twitter.com/tupakinews_/status/1667059120313352192?s=20
https://twitter.com/Pallavi_M_K/status/1664277523608518657?s=20
కియారా- సిద్ధార్థ్ మల్హోత్రా
బాలీవుడ్ జంట కియారా అడ్వాణీ, సిద్ధార్థ్ మల్హోత్రా 2023 ఫిబ్రవరి 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ షేర్షా సినిమాతో పరిచయం. అప్పటినుంచి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. చివరికి పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
నయనతార- విఘ్నేష్ శివన్
లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది నయనతార. తెలుగు, తమిళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న నయన్.. డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో మూడు ముళ్లు వేయించుకుంది. కొంతకాలంగా నడిచిన వీరి ప్రేమాయణం పెళ్లి పీటలెక్కి మరో స్థాయికి చేరుకుంది. 2022లో వీరికి వివాహం కాగా సరోగసి విధానంలో వీరు సంతానాన్ని పొందారు.
Screengrab Instagram:nayanatara
నమ్రత- మహేశ్ బాబు
నమ్రత, మహేశ్ బాబులది ప్రేమ వివాహమే. వంశీ సినిమాతో తొలిసారి వీరిద్దరూ కలిసి పనిచేశారు. అప్పుడే మిల్క్ బాయ్ ప్రేమల్లో పడ్డాడు. ఐదేళ్ల పాటు నమ్రతతో ప్రేమాయణం నడిపి చివరికి నాన్న కృష్ణ పర్మిషన్‌తో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. గౌతమ్, సితార.
అలియా భట్- రణ్‌బీర్ కపూర్
బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణ్‌బీర్ కపూర్.. ప్రేమ ద్వారానే ఒక్కటయ్యారు. వీరిద్దరూ కలిసి చేసిన బ్రహ్మాస్త్ర సినిమాతో ప్రేమలో పడ్డారు. 2022లో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ కుమార్తె పుట్టింది.
విజయనిర్మల- కృష్ణ
సెలబ్రిటీ కపుల్స్‌లలో ఎప్పటికీ గుర్తుండిపోయే జంట వీరిది. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. బాపూ ‘సాక్షి’ సినిమాతో వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. అలా సంవత్సరాలు గడిచాక 1969లో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం.
జ్యోతిక- సూర్య
సౌత్‌లో పేరొందిన సెలబ్రిటీ కపుల్ జ్యోతిక- సూర్య. ఇద్దరికీ ఒకరిపై మరొకరికి ఎంతో అభిమానం, ప్రేమ. 2006లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు(దియా), కుమారుడు(దేవ్).
అమల- నాగార్జున
తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున, అమల సెలబ్రిటీల జంటకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. 1992 జూన్‌లో వీరు వివాహం చేసుకున్నారు. ప్రేమ యుద్ధం, కిరాయి దాదా, శివ, నిర్ణయం సినిమాల్లో ఈ జంట కలిసి పనిచేసింది.
నిక్కీ గల్రానీ- ఆది పినిశెట్టి
గొడవలతోనే వీరిద్దరి ప్రేమాయణం మొదలైంది. ‘మలుపు’ సినిమా వీరి జీవితాలను మలుపు తిప్పింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య గొడవలు, మనస్పర్దలు వచ్చాయి. కానీ, ఆ తర్వాత అర్థం చేసుకుని ప్రయాణాన్ని కొనసాగించారు. అలా ప్రేమలో పడి 2022, మే నెలలో ఒక్కటయ్యారు.
జీవిత- రాజశేఖర్
జీవిత, రాజశేఖర్‌లది విచిత్ర ప్రయాణం. తలంబ్రాలు సినిమాతో వీరి మధ్య పరిచయం పెరిగి ప్రేమించుకున్నారు. ‘ఆహుతి’ సినిమా చిత్రీకరణ సమయంలో రాజశేఖర్‌కి గాయాలైతే దగ్గరుండి చూసుకుంది జీవిత. అలా తమ ప్రేమను పెద్దలతో పంచుకుని నిజ జీవితంలోనూ హీరో, హీరోయిన్లు అయ్యారు. 1991లో వీరి వివాహమైంది. వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు. శివానీ, శివాత్మికలు హీరోయిన్లుగా చేస్తున్నారు.
షాలిని- అజిత్
బేబి షాలినిగా గుర్తింపు పొందింది షాలిని. తమిళ స్టార్ అజిత్‌తో ప్రేమాయణం పెళ్లి పీటల దాకా తీసుకొచ్చింది. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నారు.
దీపిక పదుకొణె- రణ్‌వీర్ సింగ్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె, స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బాజీరావ్ మస్తానీ సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అనంతర కాలంలో ప్రేమలో మునిగి తేలి 2018లో పెళ్లితో ఒక్కటయ్యారు.
ఈ జంటలు కూడా..
బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్-జయా బచ్చన్, శ్రీకాంత్- ఊహ, అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్, కరీనా కపూర్- సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్- విక్కీ కౌశల్, శివబాలాజీ- మధుమిత, వరుణ్ సందేశ్- వితిక, రాధిక- శరత్ కుమార్, ఆర్య- సాయేషా సైగల్ కూడా ప్రేమ వివాహం చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగిస్తున్నారు.
జూన్ 09 , 2023
Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?
టాలీవుడ్ స్టార్స్ వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.
అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు. ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు #VarunLav హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే వరుణ్ లావణ్య జంట ఇటలీనే పెళ్లి వేదికగా ఎందుకు ఎంచుకుందన్న సందేహం చాలా మందిలో ఉంది. ఎన్నో డెస్టినేషన్ వెడ్డింగ్ పాయింట్స్ ఉండగా ఇటలీనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని చాలా మంది ప్రశ్న. అయితే దీనికి ఓ ప్రధాన కారణమే ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వివరాల్లోకి వెళితే.. 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమాతో వరుణ్ తేజ్ - లావణ్య మధ్య పరిచయం ఏర్పడింది. ఆ సినిమా షూటింగ్‌లోనే ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు. కాలక్రమేణా ఇద్దరూ ప్రేమికులుగా మారిపోయారు. అయితే ఆ సినిమా ఇటలీలోని షూటింగ్ జరుపుకోవడం విశేషం. అలా వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమకు తొలి అడుగు ఇటలీలోనే పడింది.
వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠికి తన ప్రేమను ఇటలీలోనే వ్యక్తం చేశారని చెబుతున్నారు. ఆ విధంగా తమ ప్రేమకు మూలమైన ఇటలీని, తాము పెళ్లి చేసుకోవడానికి వేదికగా మార్చుకున్నారు ఈ జంట. అంతేకాదు సుందరమైన ప్రాంతాలతో ఇటలీలోని టస్కనీ డెస్టినేషన్ వెడ్డింగ్స్ కు ఎంతో ప్రసిద్ధిగాంచింది.
ఇక వీరిద్దరి పెళ్ళికి వరుణ్ తేజ్ సన్నిహితులలో ఒకరైన యువ హీరో నితిన్ దంపతులు, నిహారిక, లావణ్య త్రిపాఠికి సన్నిహితురాలైన రీతూ వర్మ కూడా హాజరయ్యారు. సమంత, నాగచైతన్య, రష్మిక మందాన, పూజ హెగ్డే కూడా వీరి పెళ్లికి హాజరైనట్లు తెలిసింది.
నవంబర్ 01 , 2023
Varun Tej Reception: వైభవంగా వరుణ్-లావణ్య రిసెప్షన్.. సందడి చేసిన సినీ ప్రముఖులు..!
టాలీవుడ్ స్టార్స్ వరుణ్‌తేజ్ (Varun Tej Konidela), లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మ్యారెజ్ రిసెప్షన్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఆదివారం రాత్రి హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ వేడుకలో పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. #VarunTejReception హ్యాష్‌ట్యాగ్‌తో రిసెప్షన్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుకేద్దాం.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఈ రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బ్లాక్ కలర్ కోటులో మనవరాలితో కలిసి వేడుకకు హాజరయ్యారు. నవ దంపుతులను మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు.
టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేష్ కూడా రిసెప్షన్‌లో సందడి చేశారు. వరణ్-లావణ్యలకు శుభాకాంక్షలు తెలిపి వారితో ఫొటోలు దిగారు.
యంగ్ హీరో నాగ చైతన్య కూడా రిసెప్షన్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. బియర్డ్ లుక్‌లో పెళ్లి కొడుకు, కూతురితో ఫొటోలకు ఫోజులు ఇచ్చాడు
యంగ్ హీరోలు సాయి ధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్‌లతో పాటు నాగబాబు దంపతులు, నిహారిక ఈవెంట్‌లో హల్‌చల్ చేశారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దంపతులు సైతం రిసెప్షన్‌కు హజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం వీరి ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు దంపతులు కూడా రిసెప్షన్ ఈవెంట్‌లో సందడి చేశారు.
యువ హీరో అల్లు శిరీష్ ఈవెంట్‌లో అందరి దృష్టిని ఆకర్షించాడు. వైట్ అండ్ బ్లాక్ కోటులో వరుణ్, లావణ్య జంటతో ఫొటో దిగారు.
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దంపతులు, మరో డైరెక్టర్ సంపత్ నంది కూడా రిసెప్షన్‌కు హాజరయ్యారు.
బెల్లంకొండ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో తళుక్కుమంది. నిర్మాత బెల్లంకొండ సురేష్ దంపతులు వారి పెద్ద కుమారుడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్, చిన్న కుమారుడు రిసెషన్షన్‌కు వెళ్లారు.
యంగ్ హీరో కార్తికేయ, నటుడు నవదీప్ కూడా యువ జంటతో కలిసి ఫొటోలు దిగారు.
టాలీవుడ్ యువ హీరోలు సాయి సజ్జ, అడవి శేషు, సందీప్ కిషన్ నవ దంపతులతో ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం వీరి ఫొటోలు తెగ ట్రెండ్ అవుతున్నాయి.
సీనియర్ నటుడు జగపతి బాబు సైతం వేడుకకు హాజరై కొత్త జంటకు ఆశీర్వచనాలు అందజేశారు.
నవంబర్ 06 , 2023

అందాల రాక్షసి
డ్రామా , రొమాన్స్
10 ఆగస్టు 2012 న విడుదలైంది

భలే భలే మగాడివోయ్
హాస్యం , రొమాన్స్
04 సెప్టెంబర్ 2015 న విడుదలైంది

సోగ్గాడే చిన్ని నాయనా
హాస్యం , డ్రామా
15 జనవరి 2016 న విడుదలైంది

శ్రీరస్తు శుభమస్తు
డ్రామా , రొమాన్స్ , హాస్యం
05 ఆగస్టు 2016 న విడుదలైంది

ఉన్నది ఒకటే జిందగీ
డ్రామా , రొమాన్స్
27 అక్టోబర్ 2017 న విడుదలైంది

ప్రాజెక్ట్ Z
06 ఏప్రిల్ 2024 న విడుదలైంది

మిస్ పర్ఫెక్ట్
02 ఫిబ్రవరి 2024 న విడుదలైంది

పులి మేక
24 ఫిబ్రవరి 2023 న విడుదలైంది
.jpeg)
హ్యాపీ బర్త్ డే
08 జూలై 2022 న విడుదలైంది

చావు కబురు చల్లగా
19 మార్చి 2021 న విడుదలైంది

A1 ఎక్స్‌ప్రెస్
05 మార్చి 2021 న విడుదలైంది

అర్జున్ సురవరం
29 నవంబర్ 2019 న విడుదలైంది

అంతరిక్షం 9000 KMPH
21 డిసెంబర్ 2018 న విడుదలైంది

ఇంటెలిజెంట్
09 ఫిబ్రవరి 2018 న విడుదలైంది

ఉన్నది ఒకటే జిందగీ
27 అక్టోబర్ 2017 న విడుదలైంది

యుద్ధం శరణం
08 సెప్టెంబర్ 2017 న విడుదలైంది
.jpeg)
రాధ
12 మే 2017 న విడుదలైంది
లావణ్య త్రిపాఠి పెంపుడు కుక్క పేరు?
ఒలివర్
లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు ఎవరు?
రత్న త్రిపాఠి, కిరణ్ బాల తివారి
లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు ఏం చేస్తారు?
తండ్రి రతన్ త్రిపాఠి హైకోర్టు లాయర్. తల్లి కిరణ్ బాల తివిరా రిటైర్డ్ టీచర్.
లావణ్య త్రిపాఠి సోదరుడు/సోదరి పేరు ఏంటి?
ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నారు. బ్రదర్ పేరు సిద్దార్థ్ రతన్ త్రిపాఠి. సిస్టర్ పేరు శివాని త్రిపాఠి (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్)
లావణ్య త్రిపాఠి పెళ్లి ఎప్పుడు అయింది?
మెగా హీరో వరుణ్ తేజ్‌ను లావణ్య వివాహం చేసుకుంది. వీరి పెళ్లి నవంబర్ 1, 2023లో ఇటలీలో జరిగింది. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్.. లావణ్యకు మామయ్యలు అవుతారు. స్టార్ హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, పంజా వైష్ణవ్ తేజ్ లావణ్యకు కజిన్స్ అవుతారు.
లావణ్య త్రిపాఠి Family Pictures
లావణ్య త్రిపాఠి ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
అందాల రాక్షసి చిత్రంతో లావణ్య త్రిపాఠి ఫేమస్ అయ్యింది.
లావణ్య త్రిపాఠి లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
అందాాల రాక్షసి (2012)
తెలుగులో లావణ్య త్రిపాఠి ఫస్ట్ హిట్ మూవీ ఏది?
లావణ్య త్రిపాఠి కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
అందాల రాక్షసిలో మిథున పాత్ర
లావణ్య త్రిపాఠి బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
Lavanya Tripathi best stage performance
లావణ్య త్రిపాఠి బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
Lavanya Tripathi best dialogues
లావణ్య త్రిపాఠి రెమ్యూనరేషన్ ఎంత?
రూ.3-5 కోట్లు
లావణ్య త్రిపాఠి కు ఇష్టమైన ఆహారం ఏంటి?
హెల్తీ ఫుడ్
లావణ్య త్రిపాఠి కు ఇష్టమైన నటుడు ఎవరు?
లావణ్య త్రిపాఠి కు ఇష్టమైన నటి ఎవరు?
లావణ్య త్రిపాఠి ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తెలుగు, హిందీ, ఇంగ్లీషు
లావణ్య త్రిపాఠి ఫేవరేట్ కలర్ ఏంటి?
పింక్, రెడ్
లావణ్య త్రిపాఠి ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
లావణ్య త్రిపాఠి ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
విరాట్ కోహ్లీ
లావణ్య త్రిపాఠి కు ఇష్టమైన పర్యాటక ప్రాంతాలు ఏవి?
గోవా, మనాలి, దుబాయ్
లావణ్య త్రిపాఠి ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
రూ.15 కోట్లు
లావణ్య త్రిపాఠి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
3.6 మిలియన్లు
లావణ్య త్రిపాఠి సోషల్ మీడియా లింక్స్
లావణ్య త్రిపాఠి కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
సినిమా అవార్డ్స్ - 2013
'అందాల రాక్షసి' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా సినిమా అవార్డ్స్ గెలుచుకుంది.
అప్సర అవార్డు - 2016
'భలే భలే మగాడివోయ్' చిత్రానికి గాను రైజింగ్ స్టార్ ఆఫ్ ది ఇయర్‌గా జీ తెలుగు అప్సర అవార్డు అందుకుంది.
సాక్షి ఎక్స్‌లెన్స్, జీ సినిమా అవార్డ్స్ - 2017
2017లో 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమాకి గాను సాక్షి ఎక్స్‌లెన్స్, జీ సినిమా అవార్డ్స్ పొందింది.
లావణ్య త్రిపాఠి ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
త్రిపుర హెర్బల్ హెయిర్ ఆయిల్, గోల్డ్ విన్నర్ ఆయిల్, బ్రాండ్ హౌస్ తదితర ప్రకటనల్లో లావణ్య త్రిపాఠి నటించింది.
లావణ్య త్రిపాఠి కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?
లావణ్య త్రిపాఠికి ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. అయితే ఆమె మామ నాగబాబు.. సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.
లావణ్య త్రిపాఠి వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే లావణ్య త్రిపాఠి కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.