
లోకేష్ కనగరాజ్
జననం : మార్చి 14 , 1986
ప్రదేశం: కినాతుకడవు, కోయంబత్తూర్, తమిళనాడు, భారతదేశం
లోకేష్ కనగరాజ్ తమిళ చిత్రాలలో పనిచేసే భారతీయ చలనచిత్ర దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్. అతను 2016 సంకలనం అవియల్‌లో ఒక షార్ట్ ఫిల్మ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు.
కథనాలు

Pawan Kalyan: తమిళ స్టార్ డైరెక్టర్‌తో పవన్ మూవీ? రికార్డుల మోత ఖాయమేనా!
ఒకప్పుడు టాలీవుడ్‌కు పరిమితమైన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పేరు ప్రస్తుతం రాజకీయాల్లోనూ మారుమోగుతోంది. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహరిస్తున్నారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీ బిజీగా ఉంటూనే చేతిలో ఉన్న మూవీ ప్రాజక్ట్స్‌ను ఫినిష్ చేసేందుకు పవన్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో అక్కడి స్టార్ డైరెక్టర్‌పై పవన్ ప్రశంసలు కురిపించారు. అతడి ఫిలిం మేకింగ్ బాగుంటుదంటూ ఆకాశానికి ఎత్తారు. దీంతో ఆ డైరెక్టర్‌తో సినిమా పడితే వేరే లెవల్లో ఉంటుందని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు. అటు పవన్ కామెంట్స్‌పై సదరు డైరెక్టర్ కూడా తాజాగా స్పందించడంతో వీరి కాంబోకు ఎక్కువ రోజులు పట్టదన్న చర్చ మెుదలైంది. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు? పవన్ చేసిన కామెంట్స్ ఏంటి? వంటి విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
లోకేష్ కనగరాజ్ మేకింగ్ ఇష్టం: పవన్
కోలీవుడ్‌లో తనకు ఇష్టమైన దర్శకుడి గురించి పవన్ కల్యాణ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దర్శకుల విషయానికి వస్తే తనకు మణిరత్నం (Maniratnam) అంటే చాలా ఇష్టమని పవన్ అన్నారు. ప్రస్తుత దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఫిల్మ్ మేకింగ్ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘లియో’, ‘విక్రమ్’ సినిమాలు తాను చూశానని అన్నారు. అవి తనకు బాగా నచ్చాయని ప్రశంసించారు. అలాగే తమిళ హాస్యనటుడు యోగిబాబు (Yogi Babu) కామెడీ అంటే తనకు బాగా నచ్చుతుందని పవన్ ఇంటర్యూలో పేర్కొన్నారు. ఈ కామెంట్స్‌పై తమిళ ఆడియన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎలాంటి భేషజాలం లేకుండా పక్క ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్లను ఆకాశానికి ఎత్తడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
https://twitter.com/i/status/1841446808888758277
పవన్‌కు థ్యాంక్స్ చెప్పిన డైరెక్టర్
తన మేకింగ్‌పై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రశంసలు కురిపించడంపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘మీ నుంచి అలాంటి మాటలు వినడం ఎంతో ఆనందంగా గౌరవంగా ఉంది సర్. నా వర్క్ మీకు నచ్చడం ఎంతో గ్రేట్‌గా ఆహ్లదంగా అనిపిస్తుంది. మీకు నా కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చారు. ఇక లోకేష్ కనగరాజ్ విషయానికి వస్తే ఆయన తక్కువ టైమ్‌లోనే ఎంతో పాపులర్ అయ్యారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్‌ను సృష్టించి పాన్ ఇండియా స్థాయిలో ఆసక్తి కలిగించారు. అటువంటి డైరెక్టర్ గురించి పవన్ మాట్లాడటంతో వీరిద్దరి కాంబోపై ఒక్కసారిగా చర్చమెుదలైంది. వీరి కాంబోలో ఓ మాస్ సినిమా పడితే థియేటర్లు దద్దరిల్లిపోతాయంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఫ్యాన్స్ కోరికను పవన్ అంగీకరిస్తారో లేదో చూడాలి మరి.
https://twitter.com/Dir_Lokesh/status/1841691807983534592
సమ్మర్‌లో గ్రాండ్ రిలీజ్
ప్రస్తుతం పవన్ చేతిలో మూడు క్రేజీ ప్రాజెక్పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veera Mallu). క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యారు. ఈ క్రమంలోనే ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu Release Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్రకటించింది. వచ్చే ఏడాది మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా దీనిని విడుదల చేయనున్నట్లు తెలిపింది.
త్వరలో పట్టాలపైకి ‘ఉస్తాద్’, ‘ఓజీ’!
హరిహర వీరమల్లుతో పాటు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ పవన్ చేతిలో ఉన్నాయి. టాలెంటెడ్ డైరెక్టర్ సుదీప్‌తో ‘ఓజీ’ (OG), హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) చిత్రాల్లో పవన్ నటిస్తున్నారు. రాజకీయాల్లో నిమగ్నం కావడంతో హరిహర వీరమల్లుతో పాటు ఆ రెండు చిత్రాల షూటింగ్ కూడా వాయిదా పడ్డాయి. ఇటీవల హరిహర వీరమల్లు షూట్ తిరిగి ప్రారంభం కావడంతో పెండింగ్ పడ్డ ఆ రెండు చిత్రాలు కూడా త్వరలో పట్టాలెక్కే సంకేతాలు కనిపిస్తున్నాయి. అటు పవన్ సైతం ఆ రెండు ప్రాజెక్ట్స్‌ను కూడా త్వరగా ఫినిష్ చేయాలన్న ఆలోచనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెటొచ్చని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అక్టోబర్ 03 , 2024
Malavika Mohanan: తడి అందాలతో సోకుల విందు చేస్తున్న మలయాళి తెగింపు !
తమిళ్ స్టార్ నటి మాళవిక మోహన్ మరోసారి సోకుల విందు చేసింది. నదిలో జలకాలాడుతూ తడిసిన అందాలతో ఫోటో షూట్ చేసింది.
ట్సాన్సపరెంట్ వైట్ శారీలో పాల మీగడ లాంటి అందాలను కుర్రకారుకు విందు చేసింది. తడి అచ్ఛాదనతో అమ్మడి అందం ద్విగుణీకృతమైంది.
ఓవైపు తడిసిన ఎద అందాలు, వయ్యారపు నడుమందాలు మరోవైపు.. నాభి అందాల మేళవింపుతో కైఫెక్కిస్తోంది.
ఈ కుర్రదాని మత్తిక్కించే చూపులు తడిసిన దేహంతో ఉన్న అందాన్ని ఇంకాస్తా దొంతర్లు ఎక్కిస్తోంది
దక్షిణాది చిన్నదే అయినా గ్లామర్‌ను వడ్డించడంలో నార్త్ ముద్దు గుమ్మలకు ఏమాత్రం తీసిపోదు.
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా... అందాలను తనదైన శైలీలో వడ్డించడంలో ఈ మలయాళి తెగింపు దిట్ట
కనీసం వారానికో హాట్ ఫొటో షూట్ అయినా చేస్తూ కుర్రాళ్ల అందాల దాహం తీరుస్తుంటుంది
సూపర్ స్టార్ రజినీకాంత్ 'పేట' మూవీ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈ సోగసుల కోవకు పెద్దగా సక్సెస్ మాత్రం దక్కలేదు.
ఆ మధ్య లోకేష్ కనగరాజ్ డైరెక్షన్‌లో వచ్చిన మాస్టర్ చిత్రంలో నటించి మెప్పించింది. అయితే అవకాశాలు మాత్రం ఈ తడి అందానికి అంతగా రావడం లేదు.
అయితేనేం.. సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తూ భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను మాత్రం సంపాదించింది.
స్టన్నింగ్ ఫిగర్‌తో హాట్ ఫొటో షూట్ చేస్తూ... ఎప్పటికప్పుడూ వార్తల్లో నిలుస్తోంది.
మాళవిక మోహన్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహన్ కుమార్తే. ఆమె కుటుంబం కేరళకు చెందినది అయినా పుట్టి పెరిగింది మాత్రం ముంబైలోనే.
అలా సినీ నేపథ్యం ఉన్నా మలయాళి కుట్టి ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మలయాళంలో ఆమె నటించిన గ్రేట్ ఫాదర్ సినిమా మంచి విజయం సాధించింది.
ప్రస్తుతం తమిళ్‌లో తంగాళన్, హిందీలో యుద్ర మూవీల్లో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్స్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది.
అక్టోబర్ 26 , 2023
Leo Movie Review: సోషల్ మీడియాలో లియో డిజాస్టర్ టాక్.. మరి సినిమా ఎలా ఉంది?
నటీనటులు : విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్, మాథ్యూ, ప్రియా ఆనంద్, మడోన్నా సెబాస్టియన్ తదితరులు
దర్శకత్వం : లోకేష్ కనగరాజ్
సంగీతం : అనిరుధ్ రవిచందర్
సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస
నిర్మాతలు : S.S లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి
విడుదల తేదీ: అక్టోబర్ 19, 2023
తమిళ స్టార్ నటుడు విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లియో’. ‘విక్రమ్’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ మూవీని రూపొందించారు. దీంతో ఈ సినిమాపై తమిళ్‌తో పాటు తెలుగులోనూ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అంతేగాక LCU (లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్)లో ఈ సినిమా కూడా భాగం కావడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. దీనికితోడు ఇటీవల విడుదలైన లియో ట్రైలర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య నేడు(అక్టోబర్ 19) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ‘లియో’ మూవీ ఎలా ఉంది? విజయ్ ఏ మేరకు మెప్పించాడు? తదితర విషయాలు ఈ రివ్యూలో చూద్దాం.
కథ
హిమాచల్ ప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో పార్తీబన్ (విజయ్) కాఫీ షాప్ నడుపుతుంటాడు. భార్య సత్య (త్రిష), ఇద్దరు పిల్లలు (అబ్బాయి, అమ్మాయి)తో అతడి జీవితం సంతోషంగా సాగుతుంటుంది. ఈ క్రమంలోనే ఊరి ప్రజల నుంచి హైనాను, హైనా నుంచి ఊరి ప్రజలను పార్తీబన్ కాపాడటంతో అతడి ఫోటోలు పేపర్లలో వస్తాయి. అక్కడి నుంచి పార్తీబన్‌కు కష్టాలు మెుదలవుతాయి. అతడ్ని వెతుకుతూ ఏపీలోని ఆంటోనీ దాస్ (సంజయ్ దత్) & గ్యాంగ్ హిమాచల్ ప్రదేశ్ వస్తారు. లియో దాస్‌గా ఉన్న పార్తీబన్ కోసం వెంటాడుతారు. ఇంతకీ లియో దాస్ ఎవరు? అతని గతం ఏమిటి? ఆంటోనీ దాస్, హరోల్డ్ దాస్ (అర్జున్) బ్రదర్స్ ఎవరు? నిజంగా లియో దాస్ మరణించాడా? లేదంటే పార్తీబన్ పేరుతో కొత్త జీవితం మొదలు పెట్టాడా? అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే.
ఎవరెలా చేశారంటే
స్టార్‌డమ్‌ను పక్కన పెట్టి మరీ విజయ్ ‘లియో’ చిత్రంలో నటించాడు. తనతో సమానమైన ఎత్తు ఉన్న అబ్బాయికీ తండ్రిగా ఇందులో కనిపించాడు. విజయ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా అనిపిస్తుంది. అయితే మూవీలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ విజయ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసింది. ఫైట్స్‌లో విజయ్ తన మార్క్ చూపించాడు. ఇక తల్లి పాత్రలో త్రిష ఒదిగిపోయారు. ఆంటోనీ దాస్ పాత్రలో సంజయ్ దత్, హరోల్డ్ దాస్ పాత్రలో అర్జున్ సర్జాకు ఇచ్చిన ఇంట్రడక్షన్స్ బావున్నాయి. వారు తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ఇక గౌతమ్ మీనన్, మన్సూర్ అలీ ఖాన్ పాత్రల పరిధి మేరకు నటించారు. ప్రియా ఆనంద్ చిన్న అతిథి పాత్రలో, మడోన్నా సెబాస్టియన్ కథను మలుపు తిప్పే క్యారెక్టర్‌లో మెప్పించారు.
డైరెక్షన్ ఎలా ఉందంటే
'లియో'లో కూడా దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన స్టైల్‌ను అనుసరించాడు. సినిమా ప్రారంభంలో హైనాతో ఫైట్, కాఫీ షాపులో షూటౌట్, 'లియో' ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌ను ఆయన బాగా తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా ఆయన మార్క్ సినిమా ఆసాంతం కనిపించదు. ఇంటర్వెల్ తర్వాత మాత్రమే అసలు కథ ప్రారంభమవుతుంది. పార్తీబన్, లియో ఒక్కరేనా? ఇద్దరూ వేర్వేరా? అని పాయింట్ మీద సెకండాఫ్‌ను డైరెక్టర్ నడిపించడంతో కాస్త సాగదీసిన భావన అందరికీ కలుగుతుంది. కార్ ఛేజింగ్ యాక్షన్ సీన్ బాగున్నప్పటికీ క్లైమాక్స్ ఫైట్ అంతగా ఆకట్టుకోలేదు. ఈ విషయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరింత దృష్టి పెట్టాల్సింది.
టెక్నికల్‌గా
టెక్నికల్ అంశాలకు వస్తే మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ సినిమాకు పెద్ద ప్లస్ అని చెప్పవచ్చు. పతాక సన్నివేశాల్లో ఆయన కెమెరా పనితనం మెప్పిస్తుంది. సినిమా అంతటా సన్నివేశాలకు తగ్గట్టు డిఫరెంట్ లైటింగ్ ద్వారా ఆ సీన్స్ మూడ్‌ను మనోజ్ పరమహంస సెట్ చేశారు. అనిరుధ్ రవిచందర్ నేపథ్య సంగీతం బావుంది. కానీ, 'విక్రమ్', 'జైలర్' చిత్రాలతో పోలిస్తే 'లియో' మ్యూజిక్ అంతగా ఆకట్టుకోదు. ముఖ్యంగా పాటల్లో అనిరుధ్ మార్క్ కనిపించదు. తెలుగు సాహిత్యం కూడా బాలేదు. ప్రొడక్షన్ వేల్యూస్ హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్
విజయ్ నటనసినిమాటోగ్రఫీనేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్
పాటలుసాగదీత సీన్స్
చివరిగా : లోకేష్ కనగరాజ్ గత చిత్రాలతో (ఖైదీ, విక్రమ్) పోలిస్తే అంచనాలను అందుకోవడంలో 'లియో' కాస్త వెనకపడిందని చెప్పవచ్చు. యాక్షన్ మూవీ ప్రేమికులకు మాత్రం సినిమా నచ్చుతుంది. విజయ్ అభిమానులను మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5
అక్టోబర్ 19 , 2023
Prabhas Upcoming Movies: ఇండియాలోని టాప్ డైరెక్టర్స్‌తో ప్రభాస్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్!
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ప్రస్తుతం కెరీర్ పరంగా దూసుకెళ్తున్నాడు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లైనప్ (Prabhas Upcoming Movies) లో పెడుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇటీవల ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న ప్రభాస్ ప్రస్తుతం ‘రాజాసాబ్’ షూటింగ్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడు. ఇటీవల హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్‌లో ‘ఫౌజీ’ చిత్రాన్ని పట్టాలెక్కించారు. అదే విధంగా ‘స్పిరిట్’, ‘కల్కి 2’ వంటి ప్రాజెక్ట్స్ పట్టాలెక్కించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో మూడు సాలిడ్ ప్రాజెక్ట్స్‌కు ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. తద్వారా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ ఇలా లాంగ్వేజ్‌కు ఒక స్టార్ డైరెక్టర్‌తో ప్రభాస్ తన సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ డైరెక్టర్లు ఎవరు? వారు చేయనున్న చిత్రాలు ఏవి? ఇప్పుడు తెలుసుకుందాం.
తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో..
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)తో ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్లు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. ‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘మాస్టర్’, ‘లియో’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు తెరకెక్కించి లోకేష్ కనగరాజ్ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. త్వరలోనే వీరి ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ బ్యానర్ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రజనీకాంత్‌తో 'కూలీ' అనే చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనంతరం హీరో కార్తీతో ‘ఖైదీ 2’ తెరకెక్కించనున్నాడు. దాని తర్వాతనే ప్రభాస్-లోకేష్ చిత్రం పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
హిందీ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో..
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani)తో సినిమా చేయడం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సందర్భంలో చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ప్రభాస్ కల అతి త్వరలోనే నెరవేరే ఛాన్స్ ఉందని నెట్టింట ప్రచారం జరుగుతోంది. రాజ్‌కుమార్ హిరానీ - ప్రభాస్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితులు కనిపిస్తున్నట్లు బీటౌన్‌లో జోరుగా ప్రచారం వినిపిస్తోంది. ఈ ఏడాది చివర లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’, ‘త్రీ ఇడియట్స్’,’ పీకే’, ‘సంజు’, ‘డుంకీ’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలకు రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వం వహించారు. హిందీలో ఆయన సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అటు ప్రభాస్‌కు సైతం దేశ, విదేశాల్లో అభిమానులు ఉన్నారు. వీరి కాంబోలో సినిమా పడితే అన్ని రికార్డులు గల్లంతు కావడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో..
కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో ప్రభాస్ మరో చిత్రం (Prabhas Upcoming Movies) చేయనునున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ‘సలార్’ (Salaar) చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ప్రభాస్ కటౌట్ తగ్గ యాక్షన్ సీన్స్‌తో ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంది. అయితే సినిమాకు సీక్వెల్‌గా ‘సలార్ 2’ రానున్నట్లు గతంలోనే ప్రశాంత్ నీల్ ప్రకటించారు. సలార్ మూవీ ఎండింగ్‌లో సెకండ్ పార్ట్‌కు సంబంధించిన లింక్ కూడా చూపించారు. అయితే ఇటీవల తారక్ - ప్రశాంత్ నీల్ కాంబోలో 'NTR 31' ప్రాజెక్ట్ లాంచ్ అయ్యింది. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా తర్వాత 'సలార్ 2'ను పట్టాలెక్కించే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ యూనివర్స్‌లోకి ప్రభాస్!
‘హనుమాన్’ (Hanuman) చిత్రంతో యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించాడు. అటువంటి ప్రశాంత్ వర్మతో ప్రభాస్ (Prabhas Upcoming Movies) ఓ సినిమా చేయడం దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రశాంత్ వర్మ చెప్పిన కథకి ప్రభాస్ పచ్చజెండా ఊపడంతో ఈ కలయికలో సినిమా రావడం కన్ఫార్మ్ అయినట్లు సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సంస్థ ఈ మూవీని నిర్మించేందుకు రంగం చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుంత ప్రశాంత్ వర్మ చేతిలో రెండు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ‘జై హనుమాన్’ (Jai Hanuman)తో పాటు బాలయ్య తనయుడు మోక్షజ్ఞ తేజ (Mokshagna Teja) ఎంట్రీ చిత్రాన్ని ప్రశాంత్ వర్మనే డైరెక్ట్ చేయనున్నారు. ఈ రెండింటి తర్వాత ప్రభాస్‌తో సినిమా ఉంటుందని సన్నిహిత చెబుతున్నాయి.
నవంబర్ 05 , 2024

లియో
19 అక్టోబర్ 2023 న విడుదలైంది

ముంబైకర్
02 జూన్ 2023 న విడుదలైంది
.jpeg)
విక్రమ్:హిట్‌లిస్ట్
03 జూన్ 2022 న విడుదలైంది
.jpeg)
మాస్టర్
13 జనవరి 2021 న విడుదలైంది
.jpeg)
ఖైదీ
25 అక్టోబర్ 2019 న విడుదలైంది

నగరం
10 మార్చి 2017 న విడుదలైంది

కూలీ
లోకేష్ కనగరాజ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే లోకేష్ కనగరాజ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.