• TFIDB EN
  • నరేష్
    జననం : జనవరి 20 , 1964
    నరేష్‌.. టాలీవుడ్‌కు చెందిన దిగ్గజ నటుడు. దివంగత విజయ నిర్మల మెుదటి భర్త సంతానమైన నరేష్‌.. నాలుగు స్తంభాలాట (1982) సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు. 'చిత్రం భళారే విచిత్రం', 'రెండుజెళ్ళ సీత', 'జంబలకిడి పంబ' సినిమాలతో హాస్య నటుడిగా గుర్తింపు పొందాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా 200 పైగా చిత్రాల్లో ఆయన నటించారు. ప్రముఖ నటి పవిత్ర లోకేష్‌ను నాల్గో పెళ్లి చేసుకొని ఇటీవల వార్తల్లో నిలిచారు.

    నరేష్ వయసు ఎంత?

    నరేష్‌ వయసు 61 సంవత్సరాలు

    నరేష్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, పాటలు వినడం, ఫొటోగ్రఫీ

    నరేష్ ఏం చదువుకున్నారు?

    10th క్లాస్‌

    నరేష్ రిలేషన్‌లో ఉంది ఎవరు?

    ప్రముఖ టాలీవుడ్‌ నటి పవిత్రతో గతంలో ఆయన కొంతకాలం పాటు రిలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నారు.

    నరేష్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    నరేష్‌ హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇప్పటివరకూ 200 పైగా చిత్రాల్లో నటించారు.

    నరేష్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Naresh

    Viral Videos

    Watch on YouTube

    Naresh Viral Video

    నరేష్ నటించి టాప్ కామెడీ చిత్రాలుEditorial List
    నరేష్ నటించి టాప్ కామెడీ చిత్రాలు

    నరేష్ తల్లిదండ్రులు / పిల్లలు / భార్య/ భర్తకు సంబంధించిన మరింత సమాచారం

    కృష్ణమూర్తి, విజయ నిర్మల దంపతులకు నరేష్‌ 1960 జనవరి 20న జన్మించారు. విజయ నిర్మల అలనాటి టాలీవుడ్‌ దిగ్గజ నటి. సూపర్ స్టార్‌ కృష్ణను ఆమె రెండో పెళ్లి చేసుకున్నారు. విజయ్‌ నిర్మల.. తెలుగులో 47 చిత్రాల్లో నటించారు. మలయాళం, తమిళ భాషలు కలిపి మరో 35 చిత్రాలు చేశారు. అంతేకాదు 44 చిత్రాలకు దర్శకత్వం వహించి.. అత్యధిక సినిమాలను తెరకెక్కించిన మహిళా డైరెక్టర్‌గా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో చోటు సంపాదించారు.

    నరేష్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    నరేష్‌కు తోబుట్టువులు లేరు. కృష్ణ మెుదటి భార్య బిడ్డలైన రమేష్‌ బాబు (లేటు), మహేష్‌బాబు, మంజుల ఘట్టమనేని, పద్మావతి, ప్రియదర్శిని సవతి సోదరులు, సిస్టర్స్‌గా ఉన్నారు.

    నరేష్ పెళ్లి ఎప్పుడు అయింది?

    నరేష్‌.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. సీనియర్‌ కెమెరామెన్‌ శ్రీను కుమార్తెను మెుదటి పెళ్లి చేసుకున్నారు. మనస్పర్థలతో వారు విడిపోయారు. రేఖను రెండో పెళ్లి చేసుకొని ఆమెకూ డివోర్స్‌ ఇచ్చారు. అనంతరం రమ్య రఘుపతిని మూడో వివాహం చేసుకున్నారు. వారి మధ్య కూడా సమస్యలు రావడంతో విడిపోయారు. ప్రముఖ నటి పవిత్రనునరేష్‌.. నాల్గో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.

    నరేష్ కు పిల్లలు ఎంత మంది?

    నరేష్‌కు ముగ్గురు కొడుకులు ఉన్నారు. వారిలో నవీన్‌, తేజస్వి కృష్ణ.. రెండో భార్య సంతానం కాగా, రణవీర్‌ కృష్ణ మూడో భార్యకు జన్మించిన బిడ్డ.

    నరేష్ Family Pictures

    Images

    Actor Naresh

    నరేష్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    నాలుగు స్తంభాలాట, జంబలకిడి పంబా చిత్రాల ద్వారా హాస్య నటుడిగా నరేష్‌ పాపులర్ అయ్యారు.

    నరేష్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    1972లో వచ్చిన 'పండంటి కాపురం' సినిమాతో బాలనటుడిగా నరేష్‌.. సినీ రంగ ప్రవేశం చేశారు. 'నాలుగు స్తంభాలాట' (1982) మూవీతో కథానాయకుడిగా మారారు.

    తెలుగులో నరేష్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    నరేష్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    జంబలకిడి పంబా' సినిమాలో విజయ్‌ పాత్ర

    నరేష్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    Naresh best stage performance

    Watch on YouTube

    Naresh stage performance

    నరేష్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Naresh best dialogues

    Watch on YouTube

    Naresh best dialogues

    నరేష్ రెమ్యూనరేషన్ ఎంత?

    ఒక్కో సినిమాకు రూ.50 లక్షల నుంచి రూ.కోటీ వరకూ రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నారు.

    నరేష్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    నరేష్ కు ఇష్టమైన నటి ఎవరు?

    నరేష్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    నరేష్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    తెెలుపు, నలుపు

    నరేష్ కు ఇష్టమైన సింగర్స్ ఎవరు?

    నరేష్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    నరేష్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    • Caravan • Sports car DC Avanti • Mercedes-Benz S-Class • Honda CR-V Bike Collection • BMW S 1000 RR Bike • Royal Enfiled SHL M11 Bike

    నరేష్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    నరేేష్‌ ఆస్తుల విలువ రూ.1000 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.

    నరేష్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    2,037K ఫాలోవర్లు ఉన్నారు.

    నరేష్ సోషల్‌ మీడియా లింక్స్‌

    నరేష్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • నంది అవార్డ్స్‌ - 1995

      సొగసు చూడతరమా (1995) - ఉత్తమ నటుడు

    • నంది అవార్డ్స్‌ - 1992

      చిత్రం భళారే విచిత్రం (1992) - స్పెషల్‌ జ్యూరి అవార్డు

    • నంది అవార్డ్స్‌ - 2013

      పరంపర (2013) - ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్టు

    • నంది అవార్డ్స్‌ - 2017

      శతమానం భవతి (2017) - ఉత్తమ క్యారెక్టర్‌ ఆర్టిస్టు

    నరేష్ కు సంబంధించిన వివాదాలు?

    మూడో భార్యకు విడాకులు ఇవ్వకుండా నటి పవిత్రతో ఆయన సన్నిహితంగా ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓ హోటల్‌ గదిలో వారిద్దరు ఉండగా మూడో భార్య రమ్య రఘుపతి వారిని రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర వివాదస్పదమైంది.

    నరేష్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    నరేష్‌.. 1990 దశకంలో భాజపా పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరించారు. యువనేత నుంచి రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ స్థాయిగి ఎదిగాడు. 2009లో భాజపా తరపున ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు స్వస్థి చెప్పారు.
    నరేష్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే నరేష్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree