అల్లు రామలింగయ్య
ప్రదేశం: పాలకొల్లు, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం పాలకొల్లు, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం)
అల్లు రామలింగయ్య తెలుగులో గొప్ప హాస్య నటులు, ఆయన హాస్యం మూడు తరాల సినీ ప్రేక్షకులను అలరించింది. అతను కుటుంబ సభ్యులు చాలామంది సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. అతని కుమారుడు అల్లు అరవింద్ సినీ నిర్మాత. మెగాస్టార్ చిరంజీవి అతని అల్లుడు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ అతని మనవళ్లు. అల్లు రామలింగయ్య పుట్టిల్లు(1952) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత మూగమనసులు, దొంగరాముడు, మాయా బజార్, ముత్యాల ముగ్గు, మనవూరి పాండవులు, అందాలరాముడు, శంకరాభరణం, యముడికి మొగుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి, మిస్సమ్మ వంటి చిత్రాల ద్వారా గుర్తింపు పొందారు. దాదాపు 50 ఏళ్ల సినీ ప్రయాణంలో 1030 సినిమాల్లో కామెడీ విలన్, క్యారెక్టర్ పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక ఆయనకు ఉండేది కానీ ఆ కోరిక తీరలేదు.
అల్లు రామలింగయ్య వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే అల్లు రామలింగయ్య కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.