• TFIDB EN
  • పవన్ కళ్యాణ్
    ప్రదేశం: ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్లలో జన్మించారు.
    పవన్ కళ్యాణ్ 1971 సెప్టెంబరు 2 న కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా ఏపీలోని బాపట్లలో జన్మించాడు. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య. ఇండస్ట్రీలో చిరంజీవిని చూసి నటన పట్ల పవన్ ఆసక్తిని పెంచుకున్నాడు. పవన్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రవీణ్యం ఉంది. కరాటేలో బ్లాక్ బెల్ట్ సంపాదించాడు. తెలుగులో చిరంజీవి తర్వాత ఆమేరకు కల్ట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించిన ఏకైక హీరోగా పవన్‌కు పేరుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు జనసేన పార్టీని స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లో పవన్ పాలుపంచుకుంటున్నారు.

    పవన్ కళ్యాణ్ వయసు ఎంత?

    పవన్ కళ్యాణ్ వయసు 53 సంవత్సరాలు

    పవన్ కళ్యాణ్ ముద్దు పేరు ఏంటి?

    పవర్ స్టార్

    పవన్ కళ్యాణ్ ఎత్తు ఎంత?

    5'10"(177cm)

    పవన్ కళ్యాణ్ అభిరుచులు ఏంటి?

    పవన్ కళ్యాణ్‌కు పుస్తకాలు చదవడమంటే ఇష్టం. ఆయన ఎక్కడికి వెళ్లిన తన వెంట కొన్ని పుస్తకాలను తీసుకెళ్తారు. పశుపోషణ, వ్యవసాయం అంటే ఆయనకు ఆసక్తి

    పవన్ కళ్యాణ్ ఏం చదువుకున్నారు?

    ఇంటర్

    పవన్ కళ్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?

    పవన్‌ కళ్యాాణ్‌కు బెస్ట్ ఫ్రెండ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్

    పవన్ కళ్యాణ్ In Sun Glasses

    పవన్ కళ్యాణ్ Childhood Images

    పవన్ కళ్యాణ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Viral Videos

    View post on X

    Pawan Kalyan Viral Video

    Description of the image
    Editorial List
    పవన్ కళ్యాణ్ టాప్ 10 కామెడీ చిత్రాలు
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండిEditorial List
    ప్రముఖ ఓటీటీల్లో ఫ్రీగా ఈ సినిమాలు ఇంకా వెబ్‌ సిరీస్‌లు చూసేయండి
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన  ఈ సినిమాల గురించి మీకు తెలుసా?Editorial List
    తేజ సజ్జా 'హనుమాన్' మాదిరి తెలుగులో ఇప్పటి వరకు వచ్చిన ఈ సినిమాల గురించి మీకు తెలుసా?
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!Editorial List
    తెలుగులో టాప్ స్పోర్ట్స్ డ్రామా చిత్రాలు ఇవే!

    పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు ఎవరు?

    పవన్ కళ్యాణ్ కొణిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు మూడవ కుమారునిగా జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నయ్యలు. తెలుగు సినిమా నటుడు మెగాస్టార్ చిరంజీవి పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్ర బాబు పవన్‌కు రెండవ అన్నయ్య. సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు. సినిమా నటులైన రామ్ చరణ్ తేజ్, వరుణ్ తేజ్‌లకు చిన్నాన్న. సాయి ధరం తేజ్, వైష్ణవ్ తేజ్‌, అల్లు అర్జున్ లకు మామయ్య.

    పవన్ కళ్యాణ్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    చిరంజీవి, నాగేంద్రబాబు, విజయ్ దుర్గ, మాధవి రావు

    పవన్ కళ్యాణ్ పెళ్లి ఎప్పుడు అయింది?

    పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని. పవన్ కళ్యాణ్‌కు నందిని సత్యానంద్ యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో పరిచయం కావడం జరిగింది. 1997లో వీరి వివాహం జరిగింది. ఆ తర్వాత వీరు విడిపోయారు. విడాకుల అనంతరం నందిని తన పేరును జాన్వీగా మార్చుకుని డా. కృష్ణా రెడ్డిని వివాహం చేసుకుంది. ప్రస్తుతం వీరు అమెరికాలో సెటిల్ అయ్యారు. ఆ తర్వాత తనతో బద్రిసినిమాలో నటించిన హీరోయిన్ రేణు దేశాయ్‌ను పవన్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. 2013లో రష్యన్ మోడల్ అన్నా లెజ్నెవాను ఎర్రగడ్డ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. తీన్‌మార్చిత్రం సందర్భంగా పవన్ కళ్యాణ్‌తో అన్నాకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి వివాహానికి దారి తీసింది.

    పవన్ కళ్యాణ్ కు పిల్లలు ఎంత మంది?

    పవన్‌ కళ్యాణ్‌కు నలుగురు సంతానం. పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ సంతానంగా అకీరా, ఆద్య. మూడో భార్య అన్నా లెజ్నెవాకు మార్క్ శంకర్ పవనోవిచ్, పోలేనా అంజనా పవనోవా జన్మించారు.

    పవన్ కళ్యాణ్ Family Pictures

    పవన్ కళ్యాణ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    పవన్ కళ్యాణ్ స్వాగ్, డైలాగ్ మాడ్యూలేషన్ అతన్ని ప్రత్యేకంగా నిలిపింది. ముఖ్యంగా అతని యూనిక్ యాక్టింగ్ స్టైల్‌కు కల్ట్ ఫ్యాన్ బేస్‌ను సంపాదించి పెట్టింది.

    పవన్ కళ్యాణ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో పవన్ కళ్యాణ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    తొలి ప్రేమ చిత్రం పవన్ కళ్యాణ్‌కు తొలి విజయాన్ని రుచి చూపించింది.

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన పవన్ కళ్యాణ్ తొలి చిత్రం ఏది?

    పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో చాలా వైవిధ్యమైన పాత్రలు చేశాడు. ముఖ్యంగా ఖుషి చిత్రంలో సిద్ధార్థ రాయ్, తమ్ముడు చిత్రంలో బాలు, గబ్బర్ సింగ్ వంటి క్యారెక్టర్లు పేరు తెచ్చాయి.

    పవన్ కళ్యాణ్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    Watch on YouTube

    pawan Kalyan Stage Performance

    పవన్ కళ్యాణ్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    Watch on YouTube

    Best Dialogues

    పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత?

    పవన్ కళ్యాణ్ ఒక్కో చిత్రానికి రూ.30 కోట్లు నుంచి రూ.40 కోట్ల వరకు తీసుకుంటున్నాడు

    పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    అరిటికాయ వేపుడు

    పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    పవన్ కళ్యాణ్ కు ఇష్టమైన నటి ఎవరు?

    పవన్ కళ్యాణ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, తమిళం

    పవన్ కళ్యాణ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    పవన్ కళ్యాణ్ ఫెవరెట్ సినిమా ఏది?

    పవన్ కళ్యాణ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్, వైట్, బ్లూ

    పవన్ కళ్యాణ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?

    Volvo XC90, Mercedes Benz R Class, Toyota Fortuner

    పవన్ కళ్యాణ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    పవన్ కళ్యాణ్‌కు హైదరాబాద్ శివారులో రూ.18 కోట్ల విలువ చేసే వ్యవసాయ భూమి ఉంది. బంజారహిల్స్‌లో 1.75 కోట్ల విలువ చేసే ఓ ప్లాట్ ఉంది. 2024 ఎన్నికల అఫడవిట్‌లో సమర్పించిన లెక్కల ప్రకారం ఆయన నికర ఆస్తుల విలువ రూ. 164 కోట్లు

    పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    3 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు

    పవన్ కళ్యాణ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    పవన్ కళ్యాణ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • ఫిల్మ్‌ఫేర్ సౌత్ - 2012

      గబ్బర్ సింగ్ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అవార్డు

    • సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ - 2012

      గబ్బర్ సింగ్ చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అవార్డు

    • సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ - 2013

      అత్తారింటికి దారేది చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అవార్డు

    • మార్గదర్శి బిగ్ తెలుగు అవార్డ్స్ - 2013

      అత్తారింటికి దారేది చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అవార్డు

    పవన్ కళ్యాణ్ కు ఎలాంటి వ్యాపారాలు ఉన్నాయి?

    అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్

    పవన్ కళ్యాణ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?

    పవన్ కళ్యాణ్ 2001లో సాఫ్ట్ డ్రింగ్ పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు. 2017లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల చేనేత వస్త్రాల బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు.

    పవన్ కళ్యాణ్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?

    పవన్ కళ్యాణ్ మార్చి 14, 2014న జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఏడాది జరిగిన పార్లమెంట్, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయ్యనప్పటికీ.. బీజేపీ, టీడీపీకి మద్దతు పలికారు. 2019 ఎన్నికల్లో ఏపీలోని మొత్తం 175 స్థానాలకు గాను 140 చోట్ల పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన పార్టీ ఘోర పరాజయం చవి చూసింది. పవన్ కళ్యాణ్ పోటీచేసిన గాజువాక, భీమవరం స్థానల్లో ఓడిపోయారు. రాజోల్ స్థానంలో ఆయన పార్టీ అభ్యర్థి గెలుపొందారు. 2019 తర్వాత ఎన్నికల ఓటమి తర్వాత పవన్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అనేక ప్రజాసమస్యలపై పోరాడారు. ఉద్దానం కిడ్నీ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై పోరాడారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీని ఒక్కటిగా చేసి వారితో కలిసి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో.. రెండు ఎంపీ స్థానాల్లో పోటీచేసి అన్ని స్థానాల్లోనూ విజయం సాధించింది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ MLAగా విజయం సాధించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతోపాటు పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
    పవన్ కళ్యాణ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree