• TFIDB EN
  • రహస్య గోరక్
    జననం : మార్చి 26 , 1995
    ప్రదేశం: హైదరాబాద్‌
    రహస్య గోరక్‌ టాలీవుడ్‌కు చెందిన యంగ్‌ హీరోయిన్‌. 1995 మార్చి 26న హైదరాబాద్‌లో జన్మించింది. ఆమె అసలు పేరు ఐశ్వర్య గోరక్‌. సినిమాల్లోకి వచ్చాక తన పేరును రహస్యగా మార్చుకుంది. 'ఆకాశమంతా ప్రేమ' (2016) సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. 'రాజా వారు రాణి గారు' (2019) చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమాలో హీరోగా చేసిన కిరణ అబ్బవరంను 2024 ఆగస్టు 22న ప్రేమ వివాహం చేసుకుంది. తమిళంలో 'సర్బత్‌' అనే చిత్రంలోనూ రహస్య నటించింది.

    రహస్య గోరక్ వయసు ఎంత?

    రహస్య గోరక్‌ వయసు 30 సంవత్సరాలు

    రహస్య గోరక్ ముద్దు పేరు ఏంటి?

    రహస్య గోరఖ్‌ అసలు పేరు ఐశ్వర్య గోరక్‌. అందరూ ముద్దుగా ఐషూ అని పిలుస్తారు.

    రహస్య గోరక్ ఎత్తు ఎంత?

    5' 5'' (165 cm)

    రహస్య గోరక్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, డ్యాన్సింగ్‌

    రహస్య గోరక్ ఏం చదువుకున్నారు?

    బీటెక్‌

    రహస్య గోరక్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఆఫ్‌ సైన్స్‌, పిలాని

    రహస్య గోరక్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    34-28-34

    రహస్య గోరక్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 'ఆకాశమంతా ప్రేమ' (2016), 'రాజా వారు రాణి గారు' (2019) చిత్రాలు చేసింది. తమిళంలో 'సర్బత్‌' (2021) అనే సినిమాలో కనిపించింది.

    రహస్య గోరక్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Rahasya Gorak

    Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్‌తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా?
    Kiran Abbavaram: ఐదేళ్లుగా హీరోయిన్‌తో ప్రేమ.. కిరణ్ అబ్బవరం ఎలా దొరికిపోయాడో తెలుసా? టాలీవుడ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన తొలి సినిమా హీరోయిన్‌ రహస్య గోరక్‌ (Rahasya Gorak)ను ఆయన పెళ్లి చేసుకోనున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో మార్చి 13న నిశ్చితార్థం జరగనుంది.  హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ రిసార్ట్స్‌లో అతి తక్కువమంది బంధువులు, స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో పెళ్లి జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.  ‘రాజావారు రాణిగారు’ (Raja Vaaru Rani Gaaru)తో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు కిరణ్‌ అబ్బవరం. ఇందులో రహస్య కథానాయిక పాత్ర పోషించింది. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య స్నేహం కుదిరింది.  https://twitter.com/i/status/1332879102211096577 ఆ స్నేహం ఇష్టంగా మారి వీరిద్దరు ప్రేమలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది. అయితే, అలాంటిది ఏమీ లేదని.. రహస్య తనకు మంచి స్నేహితురాలు మాత్రమేనని కిరణ్‌ ఓ సందర్భంలో చెప్పారు. కానీ ఎవరూ నమ్మలేదు. ఇందుకు కారణం ఇద్దరూ కలిసి తరచూ వెకేషన్‌కు వెళ్లడమే. ఇలా ఏళ్లుగా చాటుగా ప్రేమించుకున్న ఈ జంట తమపై వచ్చిన వార్తలకు పెళ్లితో చెక్‌ చెప్పాలని నిర్ణయించుకుందట. కిరణ్‌-రహస్యల ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి బంధంతో నెక్స్ట్‌ లెవల్‌కు వెళ్లనుండటంతో అభిమానులు ఈ లవ్‌ బర్డ్స్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.  గతేడాది ‘వినరో భాగ్యము విష్ణు కథ’ (Vinaro Bhagyamu Vishnu Katha), ‘మీటర్‌’ (Meter), ‘రూల్స్‌ రంజన్‌’ (Rules Ranjan) చిత్రాలతో కిరణ్‌ అబ్బవరం ప్రేక్షకులను అలరించాడు.  ప్రస్తుతం ‘దిల్‌ రుబా’ అనే చిత్రం కిరణ్‌ నటిస్తున్నాడు. 1970 దశకం నేపథ్యంలో సాగే పీరియాడిక్ మూవీపై ఈ యంగ్‌ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.  ఇక రహస్య గోరక్‌ విషయానికి వస్తే.. ఈ బ్యూటీ 2016లో వచ్చిన ‘ఆకాశమంత ప్రేమ’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.  ఆ తర్వాత మూడేళ్లు సినిమాకు దూరంగా ఉన్న రహస్య.. తిరిగి 2019లో కిరణ్‌ అబ్బవరం సినిమా (రాజా వారు రాణి గారు)తోనే తెలుగు ఆడియన్స్‌ను పలకరించింది. ఇందులో అచ్చమైన పల్లెటూరు అమ్మాయిగా తన నటనతో ఆకట్టుకుంది.  అదే ఏడాది 'బాయ్స్‌ ఇన్ స్కూల్‌' సినిమాలో కనిపించి మెప్పించింది. ఆ తర్వాత 'సర్బత్‌' అనే తమిళ్‌ మూవీలోనూ ఈ బ్యూటీ మెరిసింది. 
    మార్చి 11 , 2024
    KA Trailer Review: ‘క’ ట్రైలర్‌లో ఇవి గమనించారా? ఆ సెంటిమెంట్‌ వర్కౌట్‌ అయితే బ్లాక్‌బాస్టరే! టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్‌ హీరోల్లో కిరణ్‌ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం 'రాజా వారు రాణి గారు'తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్‌ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్‌ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ సినిమా వస్తుండటంతో తాజాగా ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది.  ట్రైలర్ రిలీజ్‌ కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన తొలి పాన్‌ ఇండియా మూవీ ‘క’. తన్వీ రామ్‌ (Tanvi Ram) హీరోయిన్‌. సుజిత్‌, సందీప్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న దీనిని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘క ట్రైలర్‌’ను విడుదల చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కిరణ్‌ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్‌ సన్నివేశాలు సినిమాపై పెంచేలా ఉన్నాయి. ట్రైలర్‌ను ఓసారి చూసేయండి.  https://www.youtube.com/watch?v=n75xEs-9u1I ఇవి గమనించారా? ట్రైలర్ అసాంతం యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఆరంభంలోనే చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిని చూపించారు. మధ్యాహ్నం 3 గంటలకే ఊరిలో చీకటిపడిపోవడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఆ ఊరికి పోస్ట్‌ మ్యాన్‌గా వచ్చిన అభినయ వాసుదేవ్‌ (కిరణ్ అబ్బవరం) సత్యభామతో ప్రేమతో పడతాడు. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ను బెదిరించడం ట్రైలర్‌లో చూడవచ్చు. ఆ ఉత్తరంలో ఏముంది? వాసుదేవ్‌ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు? అనే అంశాలు ఆసక్తికిని పెంచేలా ఉన్నాయి. అయితే ట్రైలర్ చివరలో 'జాతర మొదలుపెడదామా' అంటూ ముసుగు వ్యక్తిగా వాసుదేవ్‌ను చూపించడం ఆడియన్స్‌కు బిగ్‌ ట్విస్ట్‌ అని చెప్పవచ్చు.  బ్లాక్‌ బాస్టర్‌ పక్కానా? ‘క’ ట్రైలర్‌పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘క’ పక్కాగా ఆకట్టుకుంటుందని సినీ లవర్స్‌ విశ్వసిస్తున్నారు. హై క్వాలిటీ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కూడా ట్రైలర్‌లో కనిపించాయని కామెంట్స్ చేస్తున్నారు. సరైన హిట్‌ లేక ఇంతకాలం ఇబ్బంది పడుతూ వస్తోన్న కిరణ్‌ అబ్బవరం ఈ సినిమా దెబ్బకు స్టార్ హీరోగా మారిపోవడం ఖాయమన్న కామెంట్స్‌ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ నటి రహాస్య గోరక్‌ను కిరణ్‌ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత టాలీవుడ్‌లో చాలా మంది హీరోలకు కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కిరణ్‌కు కూడా బాగా కలిసి వస్తుందన్న సెంటిమెంట్‌ నెట్టింట వినిపిస్తోంది. మరోవైపు కిరణ్‌ అబ్బవరం సైతం ఈ ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్‌పైనే అతడి ఫిల్మ్‌ కెరీర్‌ ఆధారపడి ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి.  తొలి ఫిల్మ్‌ హీరోయిన్‌తోనే పెళ్లి గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) - రహస్య గోరక్‌ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్ది అతిథుల సమక్షంలో ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ (2019)తో కిరణ్‌ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్‌గా నటించారు. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. తర్వాత ప్రేమగా మారింది. తమపై వచ్చిన రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించని ఈ హీరో- హీరోయిన్లు కొన్ని రోజుల క్రితం పెళ్లి కబురు వినిపించి అభిమానుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు. https://twitter.com/vamsikaka/status/1826657731585147141
    అక్టోబర్ 25 , 2024
    Tollywood Couples: నారా రోహిత్‌ - సిరి లేళ్ల తరహాలో ఒక్కటైన సెలబ్రిటీ జంటలు వీరే! రీల్‌ లైఫ్‌లో జంటగా చేసిన సెలబ్రిటీలు నిజ జీవితంలోనూ ఒక్కటవుతున్నారు. ముందుగా ప్రేమ బంధంతో ఒక్కటై ఆ తర్వాత పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కృష్ణ- విజయ నిర్మల, రాజశేఖర్‌- జీవిత, నాగార్జున-అమల, శ్రీకాంత్‌-ఊహా, మహేశ్‌ బాబు- నమ్రత ఈ కోవకు చెందిన వారే. అయితే టాలీవుడ్‌లో ఈ సెలబ్రిటీ పెళ్లిళ్లు ఇటీవల కాలంలో బాగా ఎక్కువయ్యాయి. యంగ్‌ హీరో నారా రోహిత్‌ రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్లను వివాహం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ జనరేషన్‌ హీరో- హీరోయిన్లు ఎవరో ఓ లుక్కేద్దాం.  నారా రోహిత్‌ - సిరి లేళ్ల ఏపీ సీఎం నారా చంద్రబాబు సోదరుడి కుమారుడైన నటుడు నారా రోహిత్‌ (Nara Rohit) ‘బాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. సోలో, ప్రతినిధి, అసుర, సుందరకాండ వంటి చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నారు. రీసెంట్‌గా యువ నటి సిరి లేళ్ల (Siri Lella) ను ఆయన నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి వివాహం డిసెంబర్‌లో జరగనుంది. అయితే ఇటీవల వచ్చిన ‘ప్రతినిధి 2’లో వీరిద్దరు జంటగా నటించారు. షూటింగ్ సందర్భంగా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. హృదయాలు సైతం కలిసిపోవడంతో బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. సిరి లేళ్ల విషయానికి వస్తే ఆమె తెలుగమ్మాయే. ఏపీలోని రెంట చింతల ఆమె స్వగ్రామం. ఆస్ట్రేలియాలో మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఆమె నటనపై మక్కువతో ఇండియాకు తిరిగి వచ్చింది. ‘ప్రతినిధి 2’ ఆడిషన్స్‌లో పాల్గొని హీరోయిన్‌గా ఛాన్స్‌ దక్కించుకుంది.  నాగచైతన్య - శోభిత దూళిపాళ్ల అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala) త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి నిశ్చితార్థం ఇటీవలే బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. వాస్తవానికి 2017లో సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో 2021లో వారు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత నాగ చైతన్య, శోభిత చాలా సార్లు కలిసి కనిపించారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తోందనే పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోని ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని  స్పందించకపోయినప్పటికీ నిశ్చితార్థంతో వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. శోభితా ఇటీవల మంకీ మ్యాన్ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటించింది. హిందీలో ఆమె లవ్‌, సితారా చిత్రం రీసెంట్‌గా ఓటీటీలోకి వచ్చింది. కిరణ్‌ అబ్బవరం - రహస్య గోరఖ్‌ యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం (Kiran Abbavaram) ‘రాజా వారు రాణిగారు’ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఇందులో రహస్య గోరఖ్‌ (Rahasya Gorak)హీరోయిన్‌గా చేసింది. తొలి చిత్రంతోనే అందమైన జంటగా వీరు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఏర్పడిన స్నేహం వీరి మధ్య ప్రేమ చిగురించేలా చేసింది. అలా ఐదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట ఆగస్టు 22న కర్ణాటకలోని కూర్గ్‌లో వివాహం చేసుకుంది. సినిమాల్లోకి రాకముందు కిరణ్‌, రహస్య ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లుగా పనిచేశారు. నటనపై ఆసక్తితో ఉద్యోగాలకు స్వస్థి చెప్పి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం కిరణ్‌ నటిస్తున్న ‘క’ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానుంది.  వరుణ్‌ తేజ్‌ - లావణ్య త్రిపాఠి మెగా బ్రదర్‌ నాగబాబు కుమారుడైన వరుణ్‌ తేజ్‌ (Varun Tej) ‘ముకుంద’ (2014) చిత్రంతో హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఆ తరవాత ‘కంచె’, ‘ఫిదా’, ‘లోఫర్‌’, ‘ఎఫ్‌3’ వంటి విజయవంతమైన చిత్రాల్లో హీరోగా నటించి ఆకట్టుకున్నాడు. ప్రముఖ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi)ని గతేడాది నవంబర్‌లో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకున్నాడు. అయితే 2017లో వచ్చిన ‘మిస్టర్‌’ చిత్రంలో ఈ జంట తొలిసారి కలిసి నటించింది. ఆ తర్వాత ‘అంతరిక్షం’ సినిమాలోనూ జోడీగా కనిపించి మెప్పించారు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మెుదలైన స్నేహం పెళ్లి పీటలపై వైపు అడుగులు వేసేలా చేసింది. ఇటలీ జరిగిన వీరి వివాహానికి మెగా ఫ్యామిలీ మెుత్తం హాజరయ్యింది. ఇదిలా ఉంటే వరుణ్‌ తేజ్‌ ప్రస్తుతం మట్కా చిత్రంలో నటించాడు. ఈ మూవీ నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య ప్రస్తుతం ‘తనల్‌’ అనే తమిళ చిత్రంలో నటిస్తోంది.  ఆది పినిశెట్టి - నిక్కీ గల్రానీ ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి వారసుడిగా యంగ్‌ హీరో ఆది పినిశెట్టి (Aadi Pinisetty) ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. వైవిధ్యమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’, రామ్‌ హీరోగా చేసిన ‘వారియర్‌’ చిత్రాల్లో విలన్‌గా చేసి ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే నటి నిక్కీ గల్రానీ (Nikki Galrani)ని ఆది 2022 మే నెలలో ప్రేమ వివాహం చేసుకున్నారు. నిక్కీ ఆదితో రెండు చిత్రాలు చేసింది. ‘మలుపు’, ‘మరకతమణి’ చిత్రాల్లో వీరిద్దరు కలిసి నటించారు. మలుపు షూటింగ్‌ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. అది కాస్త పెళ్లి పీటలకు దారితీసింది.  వరుణ్‌ సందేశ్‌ - వితిక షేరు యంగ్‌ హీరో వరుణ్‌ సందేశ్‌ (Varun Sandesh) 2007లో విడుదలైన ‘హ్యాపీడేస్‌’తో  తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ‘కొత్త బంగారు లోకం’ సక్సెస్‌తో యూత్‌కు మరింత కనెక్ట్‌ అయ్యారు. నటి వితికా షేరు (Vithika Sheru)ను 2015 డిసెంబర్‌ 7న వివాహం చేసుకున్నారు. వీరిద్దరు అదే ఏడాది రిలీజైన 'పడ్డానండి ప్రేమలో మరి' సినిమాలో కలిసి నటించారు. మంచి స్నేహంతో పాటు ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌ 3లోనూ జంటగా అడుగుపెట్టి మంచి కపుల్‌గా బుల్లితెర ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. వరుణ్‌ సందేశ్ ఈ ఏడాది 'నింద', విరాజి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. వితిక షేరు ప్రస్తుతం యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. 
    అక్టోబర్ 17 , 2024
    Celebrities Weddings & Divorce: ఓవైపు పెళ్లిళ్లు మరోవైపు విడాకులు.. చిత్ర పరిశ్రమలో ఏంటీ విచిత్రం? భారతీయ సమాజ వ్యవస్థలో వివాహం అనేది ఎంతో కీలకమైంది. పాశ్చాత్య దేశాలను భారత్‌ను ప్రధానంగా వేరు చేసే అంశాల్లో వివాహం కచ్చితంగా టాప్‌లో ఉంటుంది. కలకాలం ఎంతో హాయిగా జీవించాలనే లక్ష్యంతో కొత్త జంట వైవాహిక బంధంలోకి అడుగుపెతుంటారు. చిత్ర పరిశ్రమలోనూ చాలా మంది సెలబ్రిటీలు ఒకరినొకరు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. అయితే సెలబ్రిటీలు ఏది చేసినా అది సెన్సేషన్ అయిపోతుంటుంది. కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్‌ చేసినా, పెళ్లి చేసుకున్నా లేదా విడాకులు తీసుకున్నా అవి వార్తల్లో హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. కొన్ని దశాబ్దాల చిత్ర పరిశ్రమ చరిత్ర తీసుకుంటే పెళ్లి చేసుకుంటున్న సెలబ్రిటీల కంటే విడిపోయే వారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది. తాజాగా స్టార్‌ హీరో సిద్ధార్థ్‌, అదితిరావు హైదరి వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ అంశం మరోమారు తెరపైకి వచ్చింది.  [toc] వైభవంగా సిద్ధార్థ్‌ వివాహం నటుడు సిద్ధార్థ్‌ (Siddharth), నటి అదితిరావు హైదరీ (Aditi Rao Hydari) తాజాగా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వనపర్తిలోని దేవాలయంలో వీరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ‘నువ్వే నా సూర్యుడు.. నువ్వే నా చంద్రుడు.. అలాగే నువ్వే నా తారాలోకం. మిసెస్‌ అండ్‌ మిస్టర్‌ అదు సిద్ధు’ అని అదితి క్యాప్షన్‌ జత చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. మహా సముద్రం షూటింగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడగా అది క్రమేణా ప్రేమగా మారింది. ఎక్కడ చూసిన ఈ ఇద్దరు తారలు జంటగా కనిపించేవారు. దీంతో వీరి పెళ్లిపై చాలా కాలం నుంచే రూమర్లు వచ్చాయి. తాజాగా పెళ్లి చేసుకొని ఆ రూమర్లకు సిద్ధార్థ్‌ - అదితి జంట చెక్‌ పెట్టింది.  https://twitter.com/UnrealAkanksha/status/1835569675968602477 ఓవైపు పెళ్లిళ్లు.. యంగ్‌ హీరో అక్కినేని నాగచైతన్య సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ప్రముఖ నటి శోభితా దూళిపాళను ఆయన వివాహం చేసుకోబోతున్నారు. ఇటీవలేే ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది. చైతూ తండ్రి అక్కినేని నాగార్జున తొలిసారి వీరి నిశ్చితార్థ ఫొటోలను నెట్టింట షేర్‌ చేయడంతో విషయం బయటకు వచ్చింది. యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం కూడా ఇటీవల వివాహం చేసుకున్నారు. ఇదిలా ఉంటే చైతన్య గతంలో స్టార్‌ హీరోయిన్‌ సమంతను వివాహం చేసుకున్నారు. ఆమెకు విడాకులు ఇచ్చి రెండో పెళ్లికి సిద్ధమవుతున్నాడు.  ‘రాజావారు రాణిగారు’ చిత్రంలో తనకు జోడీగా చేసిన రహస్య గోరఖ్‌ను ఇటీవల పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచారు. గతేడాది మెగా హీరో వరుణ్‌ తేజ్‌,  హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి అంగరంగ వైభంగా పెళ్లి చేసుకున్నారు. ఇటలీలో డెస్టినేషన్‌ మ్యారేజ్‌ చేసుకొని ఈ జంట ఆకట్టుకుంది.  https://twitter.com/iamnagarjuna/status/1821450886238851531 https://twitter.com/AadhanTelugu/status/1826816125809647850 మరోవైపు విడాకులు ఓవైపు సెలబ్రిటీలు ఎంత ఫాస్ట్‌గా వివాహం చేసుకుంటున్నారో అదే విధంగా తమ భాగస్వామికి విడాకులు ప్రకటిస్తూ షాక్ ఇస్తున్నారు. రీసెంట్‌గా తమిళ స్టార్‌ నటుడు జయం రవి తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో నిలిచాడు. తనకు తెలియకుండానే విడాకులపై అనౌన్స్‌మెంట్‌ చేశారని ఆయన భార్య ఆర్తి అతడిపై మండిపడటంతో ఈ వ్యవహారంలో ట్విస్ట్ ఏర్పడింది. ఇటీవల తమిళ స్టార్ హీరో ధనుష్‌ తన భార్య, రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. ప్రముఖ నటుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి.వి. ప్రకాష్‌ కూడా పదేళ్ల వైవాహిక బంధానికి చెక్‌ పెట్టి తన భార్య, సింగర్‌ సైంధవికి విడాకులు ఇచ్చారు. మెగా డాటర్‌ నిహారిక కొణిదెల కూడా గతేడాది తన భర్త చైతన్య జొన్నలగడ్డకు విడాకులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే పెళ్లిచేసుకోవడం, విడిపోవడం ‌అనేది వారి వ్యక్తిగత విషయాలే అయినప్పటికీ గతంతో పోలిస్తే ఇవి ఎక్కువ కావడం చర్చకు తావిస్తోంది.  గతంలో విడాకులు తీసుకున్న పాపులర్‌ సెలబ్రిటీలు నాగార్జున - లక్ష్మీ దగ్గుబాటి అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మెుదట రామానాయుడు కుమార్తె లక్ష్మీ దగ్గుబాటిని వివాహం చేసుకున్నారు ఆమె సినీ హీరో వెంకటేష్ (Venkatesh), నిర్మాత సురేష్ బాబుల సోదరి. వీరి సంతానంగా నాగచైతన్య జన్మించగా ఆరేళ్ల వివాహ బంధానికి వీరు గుడ్ బై చెప్పారు. ఆ తర్వాత లక్ష్మీ అమెరికా వెళ్లిపోగా నాగార్జున రెండేళ్ల తర్వాత అమలతో ప్రేమలో పడి ఆమెను వివాహం చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా అక్కినేని అఖిల్ జన్మించాడు. అక్కినేని కుటుంబంలో ఇది మొదటి విడాకుల వ్యవహారం. పవన్‌ కల్యాణ్‌ - రేణూ దేశాయ్‌ పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. తొలి భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత నటి రేణూ దేశాయ్‌ను రెండో వివాహం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతో ఆమెకు విడాకులు ఇచ్చి మూడో పెళ్లి చేసుకున్నారు. రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను మూడో పెళ్లి చేసుకొని ప్రస్తుతం ఆమెతో జీవిస్తున్నారు.  సుమంత్‌ - కీర్తి రెడ్డి నాగార్జున మేనల్లుడు సురేంద్ర యార్లగడ్డ -సత్యవతిల కుమారుడైన నటుడు సుమంత్ (Sumanth) కెరీర్ మంచి ఫామ్‌లో ఉండగా ‘తొలి ప్రేమ’ ఫేమ్‌ హీరోయిన్‌ కీర్తి రెడ్డిని ప్రేమించి 2004 ఆగస్టులో వివాహం చేసుకున్నాడు. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ రెండేళ్ల తర్వాత వారు విడాకులు తీసుకున్నారు. కీర్తి రెడ్డి బెంగళూరు వెళ్లి సెటిల్ కాగా సుమంత్ మాత్రం అప్పటి నుంచి సింగిల్‌గానే ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలతో బిజీగా మారుతున్నారు. అమీర్ ఖాన్ - కిరణ్ రావు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అమీర్ ఖాన్ తన మొదటి భార్యతో విడాకుల తర్వాత డిసెంబరు 28, 2015న కిరణ్ రావును పెళ్లి చేసుకున్నారు. వారికి ఆజాద్ రావు ఖాన్ అనే అబ్బాయి ఉన్నాడు. 16 సంవత్సరాల వివాహ బంధం తర్వాత 2021లో పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లు ప్రకటించారు.  మలైకా అరోరా - అర్బాజ్ ఖాన్ అర్బాజ్ ఖాన్, నటి మలైకా అరోరా 1998లో వివాహం చేసుకున్నారు. వారికి అర్హాన్ ఖాన్ అనే కుమారుడు 2002లో జన్మించాడు. ఈ జంట 28 మార్చి 2016న విడిపోతున్నట్లు ప్రకటించారు. 11 మే 2017న అధికారికంగా విడాకులు తీసుకున్నారు. హృతిక్ రోషన్ - సుసానే ఖాన్ బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్ రోషన్‌, సుస్సేన్ 20 డిసెంబర్ 2000న వివాహం చేసుకున్నారు. 14 సంవత్సరాల వివాహం తర్వాత ఈ జంట 2014లో పరస్పరం విడిపోవాలని నిర్ణయించుకుని విడాకులు తీసుకున్నారు. కరిష్మా కపూర్ - సంజయ్ కపూర్ కరిష్మా, సంజయ్ 2003లో వివాహం చేసుకున్నారు. అనేక విభేదాలు, ఆరోపణల కారణంగా ఈ జంట 2014లో అధికారికంగా విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైఫ్​ అలీఖాన్​ - అమృతా సైఫ్ అలీఖాన్ 1991లో ప్రముఖ హిందీ నటి అమృతా సింగ్​ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. భరణంగా అమృతాకు ఆస్తిలో సగం వాటా ఇచ్చారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్‏ను రెండో వివాహం చేసుకున్నారు. సంజయ్‌ దత్‌ - రిచా శర్మ 1987లో నటి రిచా శర్మతో సంజయ్​ దత్​ వివాహం జరిగింది. 1996లో రిచా బ్రెయిన్ ట్యూమర్‏తో మృతి చెందింది. వీరికి త్రిషాలా కూతురు. 1998లో మోడల్ రియా పిళ్లైతో రెండో పెళ్లి జరిగింది. 2005లో విడాకులు తీసుకున్నారు. 2008లో మాన్యతా దత్​ను గోవాలో మూడో పెళ్లి చేసుకున్నారు సంజయ్. 
    సెప్టెంబర్ 16 , 2024

    రహస్య గోరక్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    రితికేష్‌ గోరక్‌

    రహస్య గోరక్ పెళ్లి ఎప్పుడు అయింది?

    తెలుగు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరంను ఆగస్టు 22న వివాహం చేసుకుంది. కర్ణాటక కూర్గ్‌లోని ఓ ప్రైవేటు రిసార్టులో బంధు మిత్రుల సమక్షంలో సింపుల్‌గా వీరి పెళ్లి జరిగింది.

    రహస్య గోరక్ Family Pictures

    Images

    Actor Kiran Abbavaram and Actress Rahasya Gorak Wedding Images

    Images

    Kiran Abbavaram and Rahasya Gorak Wedding Images

    రహస్య గోరక్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    రాజా వారు రాణి గారు' (2019) సినిమాతో పాపులర్‌ అయ్యింది.

    రహస్య గోరక్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    ఆకాశమంత ప్రేమ (2016)

    తెలుగులో రహస్య గోరక్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రహస్య గోరక్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    రాజా వారు రాణి గారు' (2019) సినిమాలో రాణి పాత్ర.

    రహస్య గోరక్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    రహస్య గోరక్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌ వెజ్‌

    రహస్య గోరక్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రహస్య గోరక్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    రహస్య గోరక్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    రెడ్‌, పింక్‌

    రహస్య గోరక్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    రహస్య గోరక్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    3,980 పైగా ఫాలోవర్లు ఉన్నారు.

    రహస్య గోరక్ సోషల్‌ మీడియా లింక్స్‌

    రహస్య గోరక్పై ప్రచారంలో ఉన్న రూమర్లు ఏంటి?

    కిరణ్‌ అబ్బవరంతో ప్రేమలో ఉన్నట్లు గతంలో తెగ రూమర్లు వచ్చాయి. పెళ్లి బంధంతో ఒక్కటై వాటికి రహస్యా వాటికి చెక్ పెట్టింది.
    రహస్య గోరక్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రహస్య గోరక్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree