టాలీవుడ్‌లోని టాలెండెడ్ యంగ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం ఒకరు. తొలి చిత్రం ‘రాజా వారు రాణి గారు’తో సాలిడ్ విజయాన్ని అందుకు ఈ కుర్ర హీరో కెరీర్ పరంగా సత్తా చాటేలా అనిపించాడు. ఆ తర్వాత చేసిన ఏడు చిత్రాల్లో ఎస్.ఆర్. కళ్యాణమండపం మినహా ఏ మూవీ ఆకట్టుకోలేదు. దీంతో కిరణ్ అబ్బవరం పని అయిపోయినట్లేనని అంతా భావించారు. ఈ క్రమంలో ‘క’ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ఒక్కసారిగా తెరపైకి వచ్చాడు ఈ కుర్ర హీరో. గత కొన్ని రోజులుగా ఈ సినిమా గురించి టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. దీపావళి కానుకగా ఈ సినిమా వస్తుండటంతో తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్‌కు విశేష స్పందన వస్తోంది.
ట్రైలర్ రిలీజ్
కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ‘క’. తన్వీ రామ్ (Tanvi Ram) హీరోయిన్. సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న దీనిని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం తాజాగా ‘క ట్రైలర్’ను విడుదల చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. కిరణ్ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై పెంచేలా ఉన్నాయి. ట్రైలర్‌ను ఓసారి చూసేయండి.
ఇవి గమనించారా?
ట్రైలర్ అసాంతం యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో ఆకట్టుకుంటోంది. ఆరంభంలోనే చుట్టూ కొండల మధ్య ఉన్న కృష్ణగిరి అనే అందమైన ఊరిని చూపించారు. మధ్యాహ్నం 3 గంటలకే ఊరిలో చీకటిపడిపోవడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఆ ఊరికి పోస్ట్ మ్యాన్‌గా వచ్చిన అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) సత్యభామతో ప్రేమతో పడతాడు. ఉత్తరాలు పంచే క్రమంలో 1979 ఏప్రిల్ 22న అభిషేక్ పేరుతో వచ్చిన ఉత్తరం వాసుదేవ్ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ ఉత్తరంలో ఏముందో చెప్పమంటూ ఓ ముసుగు వ్యక్తి వాసుదేవ్‌ను బెదిరించడం ట్రైలర్లో చూడవచ్చు. ఆ ఉత్తరంలో ఏముంది? వాసుదేవ్‌ను ఆ ముసుగు వ్యక్తి, అతని గ్యాంగ్ ఎందుకు వెంటాడుతున్నారు? అనే అంశాలు ఆసక్తికిని పెంచేలా ఉన్నాయి. అయితే ట్రైలర్ చివరలో ‘జాతర మొదలుపెడదామా’ అంటూ ముసుగు వ్యక్తిగా వాసుదేవ్‌ను చూపించడం ఆడియన్స్‌కు బిగ్ ట్విస్ట్ అని చెప్పవచ్చు.
బ్లాక్ బాస్టర్ పక్కానా?
‘క’ ట్రైలర్‌పై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. గ్రిప్పింగ్ సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘క’ పక్కాగా ఆకట్టుకుంటుందని సినీ లవర్స్ విశ్వసిస్తున్నారు. హై క్వాలిటీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ట్రైలర్లో కనిపించాయని కామెంట్స్ చేస్తున్నారు. సరైన హిట్ లేక ఇంతకాలం ఇబ్బంది పడుతూ వస్తోన్న కిరణ్ అబ్బవరం ఈ సినిమా దెబ్బకు స్టార్ హీరోగా మారిపోవడం ఖాయమన్న కామెంట్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఇటీవలే ప్రముఖ నటి రహాస్య గోరక్‌ను కిరణ్ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత టాలీవుడ్లో చాలా మంది హీరోలకు కలిసి వచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత కిరణ్‌కు కూడా బాగా కలిసి వస్తుందన్న సెంటిమెంట్ నెట్టింట వినిపిస్తోంది. మరోవైపు కిరణ్ అబ్బవరం సైతం ఈ ప్రాజెక్ట్‌పై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఈ సినిమా సక్సెస్‌పైనే అతడి ఫిల్మ్ కెరీర్ ఆధారపడి ఉందన్న విశ్లేషణలు ఉన్నాయి.
తొలి ఫిల్మ్ హీరోయిన్‌తోనే పెళ్లి
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) – రహస్య గోరక్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబ సభ్యులు, కొద్ది అతిథుల సమక్షంలో ఇటీవల పెళ్లి చేసుకున్నారు. ‘రాజావారు రాణిగారు’ (2019)తో కిరణ్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్గా నటించారు. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. తర్వాత ప్రేమగా మారింది. తమపై వచ్చిన రూమర్స్‌పై ఎప్పుడూ స్పందించని ఈ హీరో- హీరోయిన్లు కొన్ని రోజుల క్రితం పెళ్లి కబురు వినిపించి అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం