• TFIDB EN
  • రామ్ గోపాల్ వర్మ
    ప్రదేశం: విజయవాడ, ఆంధ్ర ప్రదేశ్, భారతదేశం
    రామ్ గోపాల్ వర్మ భారతీయ సినిమా దర్శకుడు. సాంకేతికంగా పరిణితి చెందిన, మాఫియా, హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో ప్రఖ్యాతిగాంచాడు. సినీమాలు తీయడంలో ఆయనది ప్రత్యేక శైలీ. ఆ తర్వాత ఆ శైలీని అనేకమంది కొత్త డైరెక్టర్లు అనుసరించారు. తెలుగులో శివ(1989) చిత్రం ద్వారా డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో స్థిరపడ్డాడు. ఆయనకు పేరు తెచ్చిన చిత్రాలలో శివ (తెలుగు), క్షణ క్షణం (తెలుగు), గోవిందా గోవిందా, గాయం, రక్తచరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్, రంగీలా (హిందీ), సత్య (హిందీ), కంపెనీ (హిందీ), భూత్ (హిందీ), సర్కార్(హిందీ) చిత్రాలు ముఖ్యమైనవి. ఫాక్టరీగా అతని నిర్మాణ సంస్థ "వర్మ కార్పొరేషన్" పలు చిత్రాలు నిర్మించింది. రామ్‌గోపాల్ వర్మ హిందీ సినిమాల్లో గణనీయమైన ప్రభావం చూపాడు. రంగీలా చిత్ర ఘనవిజయంతో బాలీవుడ్‌లో అతని జైత్రయాత్ర ఆరంభమైంది. ఈ సినిమాతో ఊర్మిళ (నటి) మంచి పేరు సంపాదించుకుంది. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ ఈ సినిమాతోనే బాలీవుడ్‌లోకి రంగప్రవేశం చేశాడు. సత్యా సినిమా వర్మకు ఒక ప్రతిష్ఠాత్మక చిత్రం. అతి తక్కువ బడ్జెటుతో తారలెవరూ లేకుండా తీసిన ఈ సినిమా అనేకమంది నటులు, సాంకేతికులకు ప్రాణం పోసింది. అందులో మనోజ్ బాజ్‌పాయి, చక్రవర్తి, మకరంద్ దేశ్‌పాండే, అనురాగ్ కశ్యప్, సందీప్ చౌతా వంటి టెక్నిషియన్లను పరిచయం చేసింది. ఈ చిత్రం తరువాత బాలీవుడ్‌లో అనేక అనుకరణలకు మాతృక అయ్యింది. శివ, క్షణ క్షణం, ప్రేమకథ చిత్రాలకు మూడుసార్లు ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డులు గెలుచుకున్నారు. 'సత్య' చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెల్చుకున్నారు.

    రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రామ్ గోపాల్ వర్మ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree