• TFIDB EN
  • రవీంద్ర విజయ్
    జననం : మే 03 , 1986
    ప్రదేశం: బెంగళూరు, కర్ణాటక, భారతదేశం
    "రవీంద్ర విజయ్ కన్నడ నటుడు. ఆయన ప్రధానంగా తెలుగు, తమిళ్, హిందీ భాషా చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన థియేటర్ నటుడిగా తన కెరీర్‌ను ప్రారంభించిన తర్వాత, తమిళ సినిమా ఓడు రాజా ఓడు (2018)తో సినీరంగంలోకి అడుగుపెట్టాడు. తెలుగులో ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కీడాకోలా, మంగళవారం, ఆరంభం వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు పొందాడు.

    రవీంద్ర విజయ్ వయసు ఎంత?

    రవీంద్ర విజయ్ వయసు 39 సంవత్సరాలు

    రవీంద్ర విజయ్ ఎత్తు ఎంత?

    5' 8'' (173cm)

    రవీంద్ర విజయ్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, సంగీతం వినడం

    రవీంద్ర విజయ్ ఏం చదువుకున్నారు?

    MBBS

    రవీంద్ర విజయ్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    సినిమాల్లోకి రాకముందు థియేటర్‌ ఆర్టిస్టుగా పనిచేశారు.

    రవీంద్ర విజయ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    బెంగుళూరు మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌

    రవీంద్ర విజయ్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో ఏడు చిత్రాల్లో నటించారు. తమిళం, హిందీ, మలయాళ భాషలు కలుపుకొని 17 చిత్రాల్లో నటించారు.

    రవీంద్ర విజయ్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    రవీంద్ర విజయ్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Ravindra Vijay

    <strong>Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే?</strong>
    Matka Movie Review: కెరీర్ బెస్ట్ నటనతో ఆకట్టుకున్న వరుణ్‌ తేజ్‌.. ‘మట్కా’ ఎలా ఉందంటే? నటీనటులు: వరుణ్‌ తేజ్‌, మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ, నవీన్‌ చంద్ర, కిషోర్‌ కుమార్‌, అజయ్‌ ఘోష్‌, రవీంద్ర విజయ్‌, మైమ్‌ గోపి, రూపలక్ష్మీ తదితరులు రచన, దర్శకత్వం : కరుణ కుమార్‌ సంగీతం : జి. వి. ప్రకాష్‌ సినిమాటోగ్రఫీ: కిషోర్‌ కుమార్‌ ఎడిటింగ్‌ : కార్తికేయ శ్రీనివాస్‌ నిర్మాతలు: రజనీ తాళ్లూరి, విజేందర్ రెడ్డి తీగల విడుదల తేదీ: 14-11-2024 మెగా హీరో వరుణ్‌తేజ్‌ (Varun Tej) నటించిన లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మట్కా’ (Matka). కరుణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా చేసింది. విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. వరణ్‌లోని నటుడ్ని మరోస్థాయికి తీసుకెళ్లే చిత్రం మట్కా అవుతుందని చిత్ర బృందం తెగ ప్రచారం చేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. నవంబర్‌ 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌కు రీచ్‌ అయ్యిందా? ఫ్లాప్స్‌తో ఇబ్బంది పడుతున్న వరుణ్‌కు సక్సెస్‌ ఇచ్చిందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం. (Matka Movie Review) కథేంటి మట్కా మూవీ 1958 నుంచి 1982 మధ్య సాగే ఓ గ్యాంగ్‌స్టర్‌ కథ. పాకిస్తాన్‌ నుంచి ముంబయికి వచ్చిన రతన్‌ కత్రీ అనే గ్యాంగ్‌స్టర్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మట్కా స్టోరీకి వస్తే.. వాసు (వరుణ్‌ తేజ్‌) బతుకుదెరువు కోసం బర్మా నుంచి వైజాగ్‌ వస్తాడు. కూలీగా పనిచేస్తూ అనేక కష్టాలు పడతాడు. జీవితంలో ఏదైనా సాధించాన్న లక్ష్యం వాసుకి ఉంటుంది. ఈ క్రమంలో మట్కా గ్యాంబ్లింగ్‌లోకి అడుగుపెట్టడం అతడి కెరీర్‌ను ఊహించని మలుపు తిప్పుకుంది. మట్కాలో బాగా కలిసిరావడంతో అందులో ఎవరికి అందనంతగా ఎత్తుకు ఎదుగుతాడు. గ్యాంగ్‌స్టర్‌గా వ్యవస్థను శాసించే స్థాయికి వెళ్తాడు. కూలీ నాలి చేసుకునే సాధారణ కుర్రాడు మట్కా వాసుగా ఎలా మారాడు? ఈ ప్రయాణంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? కథలో సుజాత ఎవరు? ఆమెతో వాసు ప్రేమాయణం ఏంటి? అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.&nbsp; ఎవరెలా చేశారంటే వాసు పాత్రలో వరుణ్‌ తేజ్‌ ఇరగదీశాడని చెప్పవచ్చు. ‘మట్కా’తో నటన పరంగా (Matka Movie Review) మరో మెట్టు ఎక్కేశాడు. లుక్స్, హెయిర్‌ స్టైల్‌, వాకింగ్‌ ఇలా అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకొని పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వయసుకు అనుగుణంగా పాత్రలో వేరియషన్స్ చూపిస్తూ మెప్పించాడు. ఇక హీరోయిన్‌ మీనాక్షి చౌదరికి మంచి రోలే దక్కింది. వరుణ్‌తో అమె కెమెస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సోఫియా పాత్రలో మ్యాజిక్ చేసింది. తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించింది. ‘మర్యాద రామన్న’ ఫేమ్‌ సలోనితో పాటు నవీన్‌ చంద్ర, సత్యం రాజేష్‌లు సైతం కీలక పాత్రల్లో కనిపించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే ఒకప్పటి గ్యాంగ్‌ స్టార్‌ రతన్‌ కత్రీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు కరణ్‌ కుమార్ ఈ సినిమాను రూపొందించారు. (Matka Movie Review) 1970-80ల్లో కథ నడిపిస్తూ తన అద్భుతమైన టేకింగ్‌తో ఆకట్టున్నాడు. తాను అనుకున్న కథను పక్కాగా చూపించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడని చెప్పవచ్చు. ముఖ్యంగా వరుణ్‌ తేజ్‌ను వాసు పాత్రకు ఎంచుకోవడం, అతడి నుంచి ఉత్తమ నటనను రాబట్టడంలో డైరెక్టర్ పూర్తిగా విజయం సాధించాడని చెప్పవచ్చు. సాధారణ కుర్రాడైన వాసు మట్కా అనే జూదాన్ని అడ్డంపెట్టుకొని దేశాన్ని శాసించే స్థాయికి ఎలా ఎదిగాడు? అన్న పాయింట్‌ను చాలా బాగా ప్రెజెంట్‌ చేశాడు. అయితే స్క్రీన్‌ ప్లే విషయంలో దర్శకుడు కాస్త తడబడ్డాడు. అక్కడక్కడ వచ్చే సాగదీత సన్నివేశాలు, వరుణ్‌ మినహా ఏ పాత్రకు బలమైన నేపథ్యం లేకపోవడం మైనస్‌గా చెప్పవచ్చు.&nbsp; టెక్నికల్‌గా..&nbsp; సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగా ప్లస్‌ అయ్యింది. కెమెరామెన్‌ కిషోర్‌ కుమార్‌ తన ప్రతిభతో ప్రేక్షకులను 1970ల్లోకి తీసుకెళ్లారు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కూడా పీరియాడిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చేందుకు బాగా కష్టపడింది. (Matka Movie Review) మ్యూజిక్‌ డైరెక్టర్‌ జి. వి. ప్రకాష్‌ అందించిన పాటలు పెద్దగా గుర్తుంచుకునేలా లేవు. నేపథ్య సంగీతం మాత్రం బాగుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను బాగా ఎలివేట్‌ చేసింది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్&nbsp; వరుణ్‌ తేజ్ నటనయాక్షన్‌ సీక్వెన్స్‌సినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్‌ స్క్రీన్‌ప్లేసాగదీత సీన్స్‌పాటలు Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;
    నవంబర్ 14 , 2024
    Brinda Web Series Review: పోలీసు ఆఫీసర్‌గా త్రిష తొలి వెబ్‌ సిరీస్‌ ఆకట్టుకుందా? నటీనటులు: త్రిష, ఇంద్రజీత్‌ సుకుమారన్‌, జయప్రకాశ్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌సామి, రాకేందుమౌళి తదితరులు రచన, దర్శకత్వం: సూర్య మనోజ్‌ వంగల సినిమాటోగ్రఫీ : దినేష్‌ కె. బాబు సంగీతం : శక్తి కాంత్‌ కార్తిక్‌ ఎడిటర్‌ : అన్వర్‌ అలీ నిర్మాత : కొల్ల ఆశిష్‌ విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 ఓటీటీ వేదిక : సోనీలివ్‌ సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌ రాణించిన త్రిష (Trisha) ఓటీటీలో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలిసారి బృంద (Brinda) అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది. క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్‌కు సూర్య మనోజ్‌ వంగల దర్శకత్వం వహించారు. ఇందులో త్రిష పోలీసు ఆఫీసర్‌గా నటించింది. ఇంద్రజీత్‌ సుకుమారన్‌, జయప్రకాశ్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌సామి, రాకేందుమౌళి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. బృంద సిరీస్ ఆగస్టు 2 నుంచి సోనిలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను ఆకట్టుందా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి బృంద (Trisha) ఓ పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా చేరిన ఎస్సై. మహిళ కావడంతో తోటి పోలీసులు ఆమెకు ప్రాధాన్యం ఇవ్వరు. ఈ క్రమంలో ఓ రోజు స్థానిక చెరువులో శవం బయటపడుతుంది. హంతకుడు దానికి గుండు కొట్టి, గుండెల్లో 16 సార్లు కత్తితో పొడిచినట్లు పోస్ట్‌మార్టంలో తేలుతుంది. అయితే ఉన్నతాధికారి ఈ కేసును క్లోజ్‌ చేయమని చెప్పినా బృంద ఇన్వెస్టిగేషన్‌ మెుదలుపెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు సంచలన నిజం తెలుస్తుంది. ఆ తరహాలో మొత్తం 16 మంది అతి దారుణంగా హత్యకు గురైనట్లు ఆమె కనిపెడుతుంది. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి అందులో బృందని భాగస్వామిని చేస్తారు. ఇంతకీ ఆ సీరియల్ కిల్లర్ ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అతడ్ని బృందా టీమ్ ఎలా పట్టుకుంది? మూఢ నమ్మకాలకు ఈ హత్యలకు సంబంధం ఏంటి? అన్నది స్టోరీ.&nbsp; ఎవరెలా చేశారంటే పోలీసు ఆఫీసర్‌ బృందాగా త్రిష తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆత్మగౌరవం కలిగిన మహిళగా ఆమె నటన మెప్పిస్తుంది. యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టింది. మరోవైపు విలన్‌గా ఆనందసామి మెప్పించాడు. అమాయకత్వం, క్రూరత్వం కలగలుపుతూ ఆనందసామి చేసిన నటన సిరీస్‌కే హైలెట్‌గా నిలిచింది. ఇంద్రజీత్‌, రవీంద్ర విజయ్‌ తమ పరిధి మేరకు నటించారు. మిగతా నటీనటులు కూడా తమ యాక్టింగ్‌తో పర్వాలేదనిపించారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే కథ పరంగా చూస్తే రొటిన్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ థీమ్‌తోనే దర్శకుడు సూర్య మనోజ్‌ వంగల ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఆరంభ సన్నివేశం నుంచి ఆసక్తిరేకెత్తించేలా స్క్రీన్‌ప్లేను నడిపి ఆకట్టుకున్నారు. భూత, వర్తమాన కాలాల్లో జరిగే సంఘటనలను ఒకదానితో ఒకటి ముడివేస్తూ చెప్పిన తీరు బాగుంది. ఇక హంతకుడిని కనిపెట్టే క్రమంలో బృందా టీమ్‌ ఒక్కో క్లూను కనిపెట్టడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. అయితే డిటెయిల్ ఇన్‌వెస్టిగేషన్‌ పేరుతో సిరీస్‌ను మరీ పొడిగించినట్లు అనిపిస్తుంది. ఆధారాలు సేక‌రించే సీన్స్ కొన్ని లాజిక్‌ల‌కు దూరంగా సాగుతాయి. ఆమె చుట్టూ ఉన్న పోలీస్ ఆఫీస‌ర్స్ చిన్న చిన్న క్లూలు కూడా క‌నిపెట్ట‌లేనివారిగా చూపించ‌డం అంత‌గా ఆక‌ట్టుకోదు. త్రిష చెల్లెలి ఎపిసోడ్ క‌థ‌కు ఏ మాత్రం సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తుంది. మెుత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌తో ఈ సీరిస్ సాగగా కొన్ని ఎపిసోడ్స్‌ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ఓవరాల్‌గా మెుదటి నుంచి చివరి వరకూ కథను ఎంగేజింగ్‌గా నడపడించి దర్శకుడు మంచి మార్కులు కొట్టేశాడు.&nbsp; టెక్నికల్‌గా.. సాంకేతిక అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు కాస్త పని చెప్పి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ కథ, కథనాలుత్రిష నటనఇన్‌వెస్టిగేషన్‌ సీన్స్‌ మైనస్ పాయింట్స్‌ నిడివిసాగదీత సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    ఆగస్టు 02 , 2024
    Bahishkarana Series Review: వేశ్య పాత్రలో అంజలి మెప్పించిందా! సిరీస్‌ ఎలా ఉందంటే? నటీనటులు : అంజలి, అనన్య నాగళ్ల, చైతన్య సాగిరాజు, రవీంద్ర విజయ్‌, షణ్ముఖ్‌, మహబూబ్‌ బాషా, శ్రీతేజ్‌, బేబీ చైత్ర, సమ్మెట గాంధీ తదితరులు దర్శకత్వం : ముఖేష్‌ ప్రజాపతి సినిమాటోగ్రఫీ : ప్రసన్న ఎస్‌. కుమార్‌ సంగీతం : సిద్ధార్థ్‌ సదాశివుని ఎడిటింగ్‌ : రవితేజ గిరిజల నిర్మాత : ప్రశాంత్‌ మలిశెట్టి ఓటీటీ వేదిక : జీ 5 విడుదల తేదీ : 19-07-2024 ప్రముఖ నటి అంజలి (Anjali) వేశ్య పాత్రలో నటించిన సిరీస్‌ 'బహిష్కరణ'. రూరల్‌ రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ సిరీస్‌ను ముకేశ్‌ ప్రజాపతి తెరకెక్కించారు. ఇందులో&nbsp; అంజలితో పాటు రవీంద్ర విజయ్ (Ravindra Vijay), అనన్య నాగళ్ల (Ananya Nagalla), శ్రీతేజ్ (Sri Tej), షణ్ముఖ్ (Shanmukh), మహబూబ్ బాషా (Mahaboob Basha), చైతన్య సాగిరాజు (Chaitanya Sagiraju) కీలకపాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ఈ సిరీస్‌ అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో జులై 19న ఈ సిరీస్‌ ఓటీటీలోకి వచ్చింది. జీ 5 వేదికగా మెుత్తం ఆరు ఎపిసోడ్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి 1990 దశకంలో కథ సాగుతుంది. గుంటూరు జిల్లాలోని పెద్దపల్లి గ్రామానికి శివయ్య (రవీంద్ర విజయ్‌) ప్రెసిడెంట్‌గా ఉంటాడు. ఊర్లో ఆయన మాటే శాసనం. డబ్బు, అధికారం అడ్డుపెట్టుకొని మహిళల జీవితాలతో ఆడుకుంటూ ఉంటాడు. పుష్ప (అంజలి) అతడి ఉంపుడుగత్తెగా ఉంటుంది. శివయ్య దగ్గర పనిచేసే దర్శి (శ్రీతేజ్‌) పుష్పను ప్రేమిస్తాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకు శివయ్య ఒప్పుకున్నట్లే నటించి తెలివిగా అడ్డుకుంటాడు. దర్శికి మరదలు లక్ష్మీ (అనన్య నాగళ్ల)తో పెళ్లి జరిపిస్తాడు. ఈ క్రమంలోనే దర్శి ఓ కేసులో ఇరుక్కుంటాడు. అసలు దర్శిని ఇరికించింది ఎవరు? శివయ్యకు దర్శి ఎందుకు ఎదురుతిరిగాడు? దానివల్ల దర్శికి పట్టిన గతి ఏంటి? దర్శి భార్య లక్ష్మీ సాయంతో శివయ్యపై పుష్ప ఎలా ప్రతీకారం తీర్చుకుంది? అన్నది ఈ సిరీస్‌ స్టోరీ. ‘ ఎవరెలా చేశారంటే వేశ్య పాత్రలో నటి అంజలి అదరగొట్టింది. తన డైలాగ్స్‌, మ్యానరిజమ్స్‌తో మిస్మరైజ్ చేసింది. ఇష్టంలేని జీవితాన్ని గడిపే వేశ్యగా, ప్రియుడి ప్రేమ కోసం పరితపించే మహిళగా చక్కటి వేరియేషన్స్‌ చూపించింది. ఇక యాక్షన్‌ సీక్వెన్స్‌లోనూ అంజలి దుమ్మురేపింది. క్లైమాక్స్‌లో విశ్వరూపం చూపించింది. అటు దర్శిగా శ్రీతేజ్‌ నటన ఆకట్టుకుంది. అన్యాయాలను సహించలేని అట్టడుగు వర్గానికి చెందిన యువకుడి పాత్రలో అతడు ఒదిగిపోయాడు. అటు లక్ష్మీ పాత్రలో అనన్య నాగళ్ల సహజమైన నటన కనబరిచింది. విలన్‌గా శివయ్య పాత్రలో రవీంద్ర విజయ్‌ సెటిల్‌ పర్‌ఫార్మెన్స్‌ కనబరిచాడు. తన డైలాగ్స్‌, లుక్స్‌తో ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించాడు. మిగిలిన నటీనటులు తమ పరిధిమేరకు యాక్ట్‌ చేసి పర్వాలేదనిపించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే పిరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే రివేంజ్‌ యాక్షన్‌ డ్రామాగా దర్శకుడు ముఖేష్‌ ప్రజాపతి ఈ సిరీస్‌ను రూపొందించారు. త‌న ప్రియుడికి జ‌రిగిన అన్యాయంపై ఓ వేశ్య ఏ విధంగా పోరాడింది అన్న కాన్సెప్ట్‌తో తీసుకొచ్చారు. ఒకప్పుడు గ్రామాల్లో కులాల పట్టింపులు ఎలా ఉండేవో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు తక్కువ జాతిని వారిని ఎలా అణిచివేశారో చూపించారు. ముఖ్యంగా మ‌హిళ‌లు ఏ విధంగా అణిచివేయ‌బ‌డ్డార‌న్న‌ది రా అండ్ ర‌స్టిక్‌గా దర్శకుడు చూపించారు. క్యాస్ట్‌, అంటరానితనం వంటి సున్నితమైన అంశాలను టచ్‌ చేశారు. డ్రామా, ఎమోష‌న్స్‌కు ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే కాన్సెప్ట్ బాగున్నా ప్ర‌జెంటేష‌న్ మాత్రం రొటీన్‌గా అనిపిస్తుంది. సిరీస్ మొత్తం పెద్ద మ‌లుపులేమి లేకుండా ఫ్లాట్‌గా సాగిపోతుంది. వేశ్య బ్యాక్‌డ్రాప్ కొత్త‌గా ఉన్న మిగిలిన స్టోరీలైన్ పాత సినిమాల‌ను గుర్తుకు తెస్తుంటుంది. కొన్ని డిస్టబింగ్‌ సన్నివేశాలను పక్కన పెడితే ‘బహిష్కరణ’ మిమ్మల్ని తప్పుకండా ఎంటర్‌టైన్‌ చేస్తుంది.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రాఫర్‌ ప్రసన్న ఎస్‌. కుమార్‌ చక్కటి పనితీరు కనబరిచాడు. తన కెమెరా నైపుణ్యంతో ఆడియన్స్‌ 90వ దశకంలోకి తీసుకెళ్లారు. సిద్ధార్థ్‌ సదాశివుని అందించిన నేపథ్య సంగీతం సిరీస్‌కు బాగా ప్లస్‌ అయ్యింది. యాక్షన్‌ సీక్వెన్స్‌ను ఓ రెంజ్‌లో ఎలివేట్‌ చేసింది. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్‌ అంజలి నటనపిరియాడికల్‌ రివేంజ్‌ డ్రామానేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ ట్విస్టులు లేకపోవడంకొన్ని బోరింగ్‌ సన్నివేశాలు Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    జూలై 19 , 2024
    Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే? నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్‌ బొడ్డెపల్లి తదితరులు దర్శకుడు : అజయ్‌ నాగ్‌ సంగీతం: సింజిత్‌ యర్రమిల్లి సినిమాటోగ్రఫి: దేవ్‌దీప్‌ గాంధీ నిర్మాతలు: అభిషేక్‌ వి. తిరుమలేశ్‌, వియన్‌ రెడ్డి మామిడి విడుదల తేదీ: 10-05-2024 మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథ కాలాఘటి జైలులో మిగిల్ (మోహన్ భగత్) శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఉరి తీయడానికి సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్యంగా జైలు నుంచి మిస్‌ ‌అవుతాడు. జైలు గదికి ఉన్న తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అతడు చేస్తున్న దర్యాప్తులో మిగిల్‌కు సంబంధించిన ఓ డైరీ దొరుకుతుంది. అందులో ఏముంది? మిగిల్‌ కథేంటి? అతడికి డెజావు ఎక్స్‌పరిమెంట్‌కు ఏంటి సంబంధం? అసలు మిగిల్‌ ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ.&nbsp; ఎవరెలా చేశారంటే కేరాఫ్ కంచర పాలెంలో (Aarambham Review In Telugu) గడ్డం క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్‌ భగత్‌.. ఈ సినిమాలో మిగిల్‌ పాత్రలో అదరగొట్టాడు. మెయిన్ లీడ్‌లో కనిపించి తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్‌లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్‌గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు. డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు అజయ్‌ నాగ్‌.. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఓ తోడు ఉండాలని అనే కాన్సెప్ట్‌కు డెజావు అనే సైన్స్‌ ఎక్స్‌పెరమెంట్‌ను జోడించి సస్పెన్స్‌ను క్రియేట్‌ చేశాడు. కథతో పాటు కథనాన్ని కూడా ఆసక్తికరంగా నడిపించాడు. స్టోరీలో అక్కడక్కడా బోరింగ్‌ సీన్లు ఉన్నప్పటికి సస్పెన్స్‌ను చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు.&nbsp; టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Aarambham Review In Telugu) ఈ మూవీకి అన్ని విభాగాలు చక్కటి పనితీరును అందించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొండ ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామాన్ని తన కెమెరాలతో ఎంతో చక్కగా చూపించాడు. సింజిత్‌ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి. ప్లస్‌ పాయింట్స్‌ కథ, స్క్రీన్‌ప్లేసస్పెన్స్‌నేపథ్య సంగీతం మైనస్‌ పాయింట్స్‌ బోరింగ్‌ సన్నివేశాలుకమర్షియల్‌ హంగులు లేకపోవడం Telugu.yousay.tv Rating : 3/5&nbsp;&nbsp;
    మే 10 , 2024

    రవీంద్ర విజయ్‌ సోదరుడు/సోదరి పేరు ఏంటి?

    ఒక సోదరుడు ఉన్నాడు. పేరు శ్రీనివాస బాలాజీ షణ్ముగం

    రవీంద్ర విజయ్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య' చిత్రంతో పాపులర్ అయ్యాడు.

    రవీంద్ర విజయ్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    తెలుగులో రవీంద్ర విజయ్ ఫస్ట్‌ హిట్‌ మూవీ ఏది?

    రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన రవీంద్ర విజయ్ తొలి చిత్రం ఏది?

    రవీంద్ర విజయ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    బహిష్కరణవెబ్‌సిరీస్‌లో అత్యుత్తమ పాత్ర పోషించాడు.

    రవీంద్ర విజయ్ బెస్ట్‌ డైలాగ్స్‌ వీడియోలు ఏవి?

    రవీంద్ర విజయ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    నాన్‌ వెజ్‌

    రవీంద్ర విజయ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రవీంద్ర విజయ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీషు

    రవీంద్ర విజయ్ ఫెవరెట్ డైరెక్టర్ ఎవరు?

    రవీంద్ర విజయ్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    బ్లాక్‌, రెడ్‌

    రవీంద్ర విజయ్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    రవీంద్ర విజయ్ ఫేవరేట్‌ క్రికెట్‌ ప్లేయర్లు ఎవరు?

    ఎం.ఎస్‌. ధోని

    రవీంద్ర విజయ్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    7,553 ఫాలోవర్లు ఉన్నారు

    రవీంద్ర విజయ్ సోషల్‌ మీడియా లింక్స్‌

    రవీంద్ర విజయ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రవీంద్ర విజయ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree