• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Aarambham Review: థ్రిల్లింగ్‌ కథాంశంతో వచ్చిన ‘ఆరంభం’.. సినిమా ఎలా ఉందంటే?

    నటీనటులు : మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ సురభి పద్మావతి, అభిషేక్‌ బొడ్డెపల్లి తదితరులు

    దర్శకుడు : అజయ్‌ నాగ్‌

    సంగీతం: సింజిత్‌ యర్రమిల్లి

    సినిమాటోగ్రఫి: దేవ్‌దీప్‌ గాంధీ

    నిర్మాతలు: అభిషేక్‌ వి. తిరుమలేశ్‌, వియన్‌ రెడ్డి మామిడి

    విడుదల తేదీ: 10-05-2024

    మోహన్ భగత్ , సుప్రిత సత్యనారాయణ్ , భూషణ్ కళ్యాణ్ , రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఆరంభం’ (Aarambam). వి. అజయ్ నాగ్ (Ajay Nag) దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను ఆకట్టుకుందా? లేదా?. ఈ రివ్యూలో తెలుసుకుందాం. 

    కథ

    కాలాఘటి జైలులో మిగిల్ (మోహన్ భగత్) శిక్ష అనుభవిస్తూ ఉంటాడు. ఉరి తీయడానికి సరిగ్గా ఒక రోజు ముందు అనూహ్యంగా జైలు నుంచి మిస్‌ ‌అవుతాడు. జైలు గదికి ఉన్న తాళాలు, గోడలు అలాగే ఉన్నప్పటికీ అతడు మిస్‌ కావడం పోలీసులకు ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని గురించి కనిపెట్టేందుకు డిటెక్టివ్ (రవీంద్ర విజయ్‌) రంగంలోకి దిగుతాడు. అతడు చేస్తున్న దర్యాప్తులో మిగిల్‌కు సంబంధించిన ఓ డైరీ దొరుకుతుంది. అందులో ఏముంది? మిగిల్‌ కథేంటి? అతడికి డెజావు ఎక్స్‌పరిమెంట్‌కు ఏంటి సంబంధం? అసలు మిగిల్‌ ఎందుకు జైలుకు వెళ్లాడు? అక్కడ నుంచి ఎలా బయటపడ్డాడు? అన్నది మిగిలిన కథ. 

    ఎవరెలా చేశారంటే

    కేరాఫ్ కంచర పాలెంలో (Aarambham Review In Telugu) గడ్డం క్యారెక్టర్‌లో కనిపించిన మోహన్‌ భగత్‌.. ఈ సినిమాలో మిగిల్‌ పాత్రలో అదరగొట్టాడు. మెయిన్ లీడ్‌లో కనిపించి తన మార్క్‌ నటనతో ఆకట్టుకున్నాడు. సుప్రీతా సత్యనారాయణ ఫిమేల్ లీడ్‌లో ఓకే అనిపించింది. తల్లి పాత్రలో సురభి ప్రభావతి అదరగొట్టేసింది. సైంటిస్ట్‌గా భూషణ్ చాలా బాగా నటించారు. లక్ష్మణ్ మీసాల, రవీంద్ర విజయ్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.

    డైరెక్షన్ ఎలా ఉందంటే

    దర్శకుడు అజయ్‌ నాగ్‌.. సరికొత్త కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. జీవితంలో ఓ తోడు ఉండాలని అనే కాన్సెప్ట్‌కు డెజావు అనే సైన్స్‌ ఎక్స్‌పెరమెంట్‌ను జోడించి సస్పెన్స్‌ను క్రియేట్‌ చేశాడు. కథతో పాటు కథనాన్ని కూడా ఆసక్తికరంగా నడిపించాడు. స్టోరీలో అక్కడక్కడా బోరింగ్‌ సీన్లు ఉన్నప్పటికి సస్పెన్స్‌ను చివరి వరకూ కొనసాగించడంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడు. అయితే కమర్షియల్ అంశాలు పెద్దగా లేకపోవడం సినిమాకు మైనస్‌గా చెప్పవచ్చు. ఓ వర్గం ప్రేక్షకులకు ఈ సినిమా అంతగా రుచించకపోవచ్చు. 

    టెక్నికల్‌గా

    సాంకేతిక అంశాల విషయానికి వస్తే (Aarambham Review In Telugu) ఈ మూవీకి అన్ని విభాగాలు చక్కటి పనితీరును అందించాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ సినిమాకు బాగా ప్లస్ అయ్యింది. కొండ ప్రాంతాల్లోని ఓ చిన్న గ్రామాన్ని తన కెమెరాలతో ఎంతో చక్కగా చూపించాడు. సింజిత్‌ యర్రమిల్లి అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ పనితీరు కూడా బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు బాగున్నాయి.

    ప్లస్‌ పాయింట్స్‌

    • కథ, స్క్రీన్‌ప్లే
    • సస్పెన్స్‌
    • నేపథ్య సంగీతం

    మైనస్‌ పాయింట్స్‌

    • బోరింగ్‌ సన్నివేశాలు
    • కమర్షియల్‌ హంగులు లేకపోవడం

    Telugu.yousay.tv Rating : 3/5  

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv