• TFIDB EN
  • రూప కొడువాయూర్
    జననం : డిసెంబర్ 27 , 2000
    ప్రదేశం: విజయవాడ, ఆంధ్రప్రదేశ్
    రూప కొడువాయూర్‌ టాలీవుడ్‌కు చెందిన యువ నటి. 2000 డిసెంబర్‌ 27న విజయవాడలో జన్మించింది. కూచిపూడిలో ప్రావీణ్యం సంపాదించింది. అలాగే డాక్టర్‌ విద్యను అభ్యసించింది. ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య (2020) చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టింది. 'మిస్టర్‌ ప్రెగ్నెంట్‌'తో నటిగా గుర్తింపు సంపాదించింది. హాస్య నటుడు ప్రియదర్శితో ఓ ఫిల్మ్‌లో నటిస్తోంది.

    రూప కొడువాయూర్ వయసు ఎంత?

    రూప కొడువాయూర్‌ 24 సంవత్సరాలు

    రూప కొడువాయూర్ ఎత్తు ఎంత?

    5' 7'' (170cm)

    రూప కొడువాయూర్ అభిరుచులు ఏంటి?

    ట్రావెలింగ్‌, వాచింగ్ మూవీస్‌

    రూప కొడువాయూర్ ఏం చదువుకున్నారు?

    ఎంబీబీఎస్‌

    రూప కొడువాయూర్ సినిమాల్లోకి రాకముందు ఏం చేశారు?

    యూట్యూబ్‌ షార్ట్ ఫిల్మ్స్‌లో నటించింది.

    రూప కొడువాయూర్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?

    కాటూరి మెడికల్‌ కాలేజ్‌, గుంటూరు

    రూప కొడువాయూర్ ఫిగర్ మెజర్‌మెంట్స్?

    32-26-34

    రూప కొడువాయూర్‌ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?

    తెలుగులో 'ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య' (2020), 'మిస్టర్‌ ప్రెగ్నెంట్‌' (2024) చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. అటు తమిళంలో 'యమకాతగి' (2022) అనే చిత్రంలోనూ ఆమె నటించింది.

    రూప కొడువాయూర్‌ ఇప్పటివరకూ చేసిన వెబ్‌ సిరీస్‌లు?

    వెబ్‌ సిరీస్‌లు చేయలేదు. అయితే జీ టీవీ వచ్చిన 'డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌ సీజన్‌ 6' కంటెస్టెంట్‌గా పాల్గొంది.

    రూప కొడువాయూర్ In Saree

    Images

    Roopa Koduvayur Beautiful Images in Saree

    Images

    Roopa Koduvayur Images in Saree

    రూప కొడువాయూర్ In Ethnic Dress

    Images

    Roopa Koduvayur Images

    Images

    Roopa Koduvayur Pics

    రూప కొడువాయూర్ In Half Saree

    Images

    Roopa Koduvayur Looks In Half Saree

    Images

    Roopa Koduvayur In Half Saree

    రూప కొడువాయూర్ With Pet Cats

    Images

    Roopa Koduvayur With Pet Cat

    రూప కొడువాయూర్ Hot Pics

    Images

    Actress Roopa Koduvayur Hot Pics

    Images

    Roopa Koduvayur

    రూప కొడువాయూర్ అన్‌ కేటగిరైజ్డ్ ఇమేజెస్‌

    Images

    Roopa Koduvayur

    <strong>OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్!</strong>
    OTT Releases Telugu: ఈ వారం ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాల లిస్ట్! క్రిస్మస్‌ (Christmas 2025)ను పురస్కరించుకొని ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద కొత్త చిత్రాలు సందడి చేయబోతున్నాయి. డిసెంబర్‌ మూడో వారంలో పలు ఆసక్తికర చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. పసందైన వినోదాన్ని పంచనున్నాయి. అటు ఓటీటీలోని ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటర్‌టైన్‌ చేసేందుకు సై అంటున్నాయి. ఆయా చిత్రాలకు సంబంధించిన విశేషాలేంటో ఈ ప్రత్యక కథనంలో తెలుసుకుందాం.&nbsp; థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు.. బచ్చల మల్లి (Bachchala Malli) అల్లరి నరేశ్‌ (Allari Naresh) మాస్‌ రోల్‌లో నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘బచ్చల మల్లి’ (Bachchala Malli). అమృత అయ్యర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సుబ్బు మంగదేవి దర్శకత్వం వహించారు. రాజేశ్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 20న (Bachhala Malli Movie Release Date) విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, టీజర్‌, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. విడుదల పార్ట్‌ 2 (Vidudala Part 2) గతేడాది తెలుగు, తమిళ భాషల్లో రిలీజై మెప్పించిన ‘విడుదల’ చిత్రానికి ఈ వారం థియేటర్లలో సీక్వెల్‌ రాబోతోంది. సూరి (Soori), విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రల్లో నటించిన ‘విడుదల పార్ట్‌ 2’ (Viduthalai Part 2) డిసెంబర్‌ 20న విడుదల కాబోతోంది. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్‌ దర్శకత్వం వహించారు. మావోయిస్టు నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది.  సారంగపాణి జాతకం (Sarangapani Jathakam) కమెడియన్‌ ప్రియదర్శి (Priyadarsi) కథానాయకుడిగా చేసిన ‘సారంగపాణి జాతకం’ కూడా ఈ వారమే థియేటర్లలోకి రాబోతోంది. డిసెంబర్‌ 20 నుంచి థియేటర్లలో ఈ సినిమాను వీక్షింవచ్చు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించిన ఈ మూవీలో రూప కొడువాయూర్‌ (Roopa Koduvayur) హీరోయిన్‌గా చేసింది. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్‌, టీజర్‌ను బట్టి చూస్తే ఫన్‌ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.  యూఐ (UI) కన్నడ నటుడు ఉపేంద్ర (Upendra) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘యూఐ’ (UI). ఈ ఫాంటసీ చిత్రాన్ని జి.మనోహరన్‌ కేపీ శ్రీకాంత్‌ నిర్మించారు. ఈ సినిమా విజువల్స్ పరంగా, సంగీతం పరంగా కొత్త అనుభూతిని పంచుతుందని మేకర్స్ తెలిపారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్‌ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఓటీటీలో విడుదల్లే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు లీలా వినోదం (Leela Vinodam) ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'లీలా వినోదం'. ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్‌'లో ఈ వీక్‌ స్ట్రీమింగ్‌కు రాబోతోంది. డిసెంబర్‌ 19 నుంచి ఈ సిరీస్‌ను వీక్షించవచ్చు. పవన్‌ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్‌, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ సిరీస్‌ సాగనుంది. జీబ్రా (Zebra) సత్యదేవ్‌, ధనుంజయ్ హీరోలుగా నటించిన రీసెంట్‌ చిత్రం ‘జీబ్రా’ (Zebra). ప్రియాభవానీ శంకర్‌ హీరోయిన్‌. ఈశ్వర్‌ కార్తీక్‌ దర్శకుడు. నవంబర్‌ 22న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఈ వారం ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో డిసెంబర్‌ 20 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్‌లోకి రానుంది.  Telugu Movies OTT Release Dates 2024 TitleCategoryLanguagePlatformRelease DateZebraMovieTelugu&nbsp;AhaDec 20Leela VinodamSeriesTelugu&nbsp;ETV WinDec 19Mechanic RockyDocumentaryTelugu&nbsp;AmazonDec 13HarikathaSeriesTelugu&nbsp;Hot StarDec 13Roti Kapda RomanceMovieTelugu&nbsp;ETV WinDec 127/G – The Dark StoryMovieTelugu&nbsp;AhaDec 12Thangalaan&nbsp;MovieTelugu&nbsp;NetflixDec 10 OTT Releases This Week 2024 TitleCategoryLanguagePlatformRelease DateInigmaMovieEnglishNetflixDec 17Love to hate it juliasMovieEnglishNetflixDec 17Stepping StonesDocumentaryEnglishNetflixDec 18The Dragan PrinceSeriesEnglishNetflixDec 18Virgin River 6SeriesEnglishNetflixDec 19The Six Triple EightMovieEnglishNetflixDec 20Yo Yo HoneysinghDocumentaryHindiNetflixDec 21Girls Will Be GirlsMovieHindiAmazonDec 18Beast GamesMovieEnglishAmazonDec 18TwistersMovieEnglishJio CinemaDec 18Moon WalkMovieHindiJio CinemaDec 20TelmaMovieEnglishSonyLIVDec 21
    డిసెంబర్ 16 , 2024
    Mr.Pregnent Review: మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివర్ చేసిన మెసేజ్ ఏంటి? నటీనటులు: సొహైల్, రూప కొడవయూర్, సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, అభిషేక్.&nbsp; దర్శకుడు: శ్రీనివాస్ వింజనంపాటి&nbsp; నిర్మాత: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి&nbsp; సంగీతం: శ్రవణ్ భరద్వాజ్&nbsp;&nbsp; బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం(Aug 18) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సంగీతం ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. ఇటీవల 200 మంది గర్భిణులకు ప్రత్యేకంగా సినిమా స్క్రీనింగ్ చేయించడంతో ప్రేక్షకుల చూపు మూవీపై పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? థియేటర్లలో ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనేది రివ్యూలో చూద్దాం.&nbsp; కథ గౌతమ్ (సొహైల్) అనాథ. అతడికి పిల్లలంటే ఇష్టముండదు. సిటీలో టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. వృత్తి పరంగా ఉన్నత స్థానంలో ఉంటాడు గౌతమ్. మంచి డిమాండ్ ఉన్న టాటూ ఆర్టిస్ట్. తన స్నేహితులందరూ కుళ్లుకునేంత టాలెంట్ &amp; ఫేమ్ ఉన్న గౌతమ్‌ను మహి (రూప కొడవయూర్) గాడంగా ప్రేమిస్తుంది. మొదట్లో ఆమె ప్రేమను నిరాకరించిన గౌతమ్.. ఆమె ప్రేమలోని నిజాయితీని అర్ధం చేసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ, పిల్లలు వద్దని చెబుతాడు. ఈ క్రమంలో మహి గర్భం దాల్చిన విషయం తెలుస్తుంది. అయితే, బిడ్డ తన కడుపులో పెరగాలని డిసైడ్ అయ్యి గర్భాన్ని తనకు మార్పిడి చేసుకుంటాడు గౌతమ్. మరి, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ. https://twitter.com/RyanSohel/status/1691410954377220096?s=20 ఎలా ఉందంటే? పురుషుడు గర్భం దాల్చవచ్చా? దాలిస్తే ఎలా ఉంటుందన్న కథాంశం ఆసక్తిని రేపింది. ఈ పాయింట్‌తోనే సినిమా చూడాలనిపిస్తుంది. కాకపోతే, మూవీలో అసలు విషయం దగ్గరికి రావడానికి కాస్త సమయం పడుతుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు, లవ్ ట్రాక్, ఇరికించినట్లుగా అనిపించే కామెడీ ఫస్టాఫ్‌ని బోర్ కొట్టిస్తాయి. కానీ, సొహైల్ నిర్ణయం తర్వాత సినిమా ఆసక్తికరంగా మారింది. సెకండాఫ్‌లో ఎమోషన్ సీన్స్ బాగా పండాయి. గర్భం దాల్చాక ఒకరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎమోషనల్ కనెక్టివిటీతో చూపించడం ప్రేక్షకుడికి నచ్చుతుంది. గర్భం చుట్టూ జరిగే కామెడీ నవ్వు పుట్టిస్తుంది. చివరికి ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా మరీ నాటకీయంగా అనిపిస్తాయి. అయితే, మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.&nbsp; ఎవరెలా చేశారు? నటనకు ఎంతో స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకున్నాడు సొహైల్. గర్భం దాల్చాక ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా నటించాడు. ద్వితీయార్థంలో సొహైల్ చేసిన యాక్టింగ్ నచ్చుతుంది. చక్కగా భావాలు పలికించాడు. ఇక, రూప తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇంకొంచెం బాగా చేసే అవకాశం కూడా ఉంది. చాన్నాళ్ల తర్వాత సుహాసిని మణిరత్నంకి మంచి పాత్ర దొరికింది. డాక్టర్‌గా ఆమె బాగా నటించారు. కీలక సన్నివేశాల్లో తను ఆకట్టుకుంది. ఇక, బ్రహ్మాజీ, వైవా హర్ష కామెడీతో అలరించారు. చిన్న పాత్రే అయినా రాజా రవీంద్ర మెప్పించాడు. టెక్నికల్‌గా దర్శకుడు శ్రీనివాస్ క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ఎంచుకుని చక్కగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మగాళ్లు గర్భం దాల్చొచ్చనే అంశంపై బాగా రీసెర్చ్ చేసినట్లు అనిపించింది. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు. కాకపోతే, పాత్రల ఎలివేషన్ కోసం సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ పార్ట్ బాగా వర్కౌట్ చేశాడు. ఇక, సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలం. నిజార్ షఫీ కెమెరా పనితనం ఓకే.&nbsp; https://twitter.com/RyanSohel/status/1691722567441412475?s=20 ప్లస్ పాయింట్స్ సొహైల్ నటన సెకండాఫ్, క్లైమాక్స్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ పాయింట్స్ ఇరికించిన కామెడీ సీన్లు ఫస్టాఫ్ కాస్ట్యూమ్స్ ఫైనల్‌గా.. మిస్టర్ ప్రెగ్నెంట్ కథ తెలుసుకోవాలంటే మొదటి 45 నిమిషాలు ఓపిక పట్టాల్సిందే.&nbsp;&nbsp; రేటింగ్: 2/5 https://www.youtube.com/watch?v=MDUVa03xbIs
    ఆగస్టు 18 , 2023
    Leela Vinodham Review: టీనేజ్‌లోకి తీసుకెళ్లే వింటేజ్‌ ప్రేమకథ.. ‘లీలా వినోదం’ మెప్పించిందా? నటీనటులు : షణ్ముఖ్ జస్వంత్, అనఘా అజిత్, గోపరాజు రమణ, ఆమని, రూప, శరన్, ప్రసాద్ బెహరా తదితరులు. దర్శకుడు : పవన్ సుంకర సంగీత దర్శకుడు : టి.ఆర్. కృష్ణ చేతన్ సినిమాటోగ్రఫీ : అనుష్ కుమార్ ఎడిటర్: నరేష్ అదుప నిర్మాత : సైర్ధర్ మారిస ఓటీటీ వేదిక:&nbsp; ఈటీవీ విన్‌ ప్రముఖ యూట్యూబర్‌ షణ్ముఖ్‌ జస్వంత్‌ (Shanmukh Jaswanth) కథానాయకుడిగా చేసిన లేటెస్ట్‌ ఫిల్మ్‌ 'లీలా వినోదం' (Leela Vinodham Review). పవన్‌ సుంకర దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో అనగ అజిత్‌, గోపరాజు రమణ, ఆమని, రూపాలక్ష్మికీలక పాత్రలు పోషించారు. పల్లెటూరులో సాగే స్వచ్ఛమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ మూవీ రూపొందింది. తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఈటీవీ విన్‌'లో నేరుగా స్ట్రీమింగ్‌కు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఓటీటీ ఆడియన్స్‌ను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి సినిమా కథ 2008లో జరుగుతుంటుంది. ప్రసాద్ (షణ్ముఖ్ జస్వంత్) ఓ కాలేజ్ స్టూడెంట్. క్లాస్ మేట్ లీలా (అనగ అజిత్)ను ప్రేమిస్తాడు. కానీ ఈ విషయాన్ని ఆమెకు చెప్పలేకపోతాడు. ఈ క్రమంలో కాలేజీ అయిపోవడంతో ఇద్దరూ ఒకరి ఫోన్‌ నెంబర్లు ఒకరు మార్చుకుంటారు. అలా సరదాగా రోజూ చాట్‌ చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ఓ రోజు ఫ్రెండ్ రాజేష్‌ (మిర్చి శరణ్‌) హెల్ప్‌తో తన ప్రేమ విషయాన్ని లీలాకు చెబుతాడు ప్రసాద్‌. దీంతో లీలా సైలెంట్ అయిపోతుంది. ఆ క్షణం నుంచి ఆమె సైడ్‌ నుంచి ఒక్క మెసేజ్‌ గానీ, ఫోన్‌ కాల్‌ గానీ రాదు. లీలా ఎందుకు రిప్లే ఇవ్వలేదు? అప్పుడు ప్రసాద్ ఏం చేశాడు? అతడి ప్రేమ సక్సెస్‌ అయ్యిందా? లేదా? అన్నది స్టోరీ.  ఎవరెలా చేశారంటే ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఈ సినిమాలో ఆకట్టుకున్నాడు. ప్రసాద్‌ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ప్రేమను చెప్పేందుకు ఇబ్బంది పడే యువకుడి పాత్రలో అతడు జీవించాడు. లవ్‌ సీన్స్‌లో అతడు ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌ యూత్‌ను ఇంప్రెస్‌ చేస్తాయి. 2008 కాలంలో అబ్బాయిలు ప్రేమ విషయంలో ఎంత బిడియంగా ఉండేవారో తన నటనతో కళ్లకు కట్టాడు. హీరోయిన్ అనగ అజిత్‌ కూడా తన నటనతో మంచి మార్కులు సంపాదించింది. తన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో మెస్మరైజ్‌ చేసింది. వీరిద్దరి జంట స్క్రీన్‌పై చాలా ఫ్రెష్‌ ఫీలింగ్ తీసుకొచ్చింది. ఫ్రెండ్ పాత్రలు చేసిన మిర్ఛి శరణ్‌, ప్రసాద్ బెహరా తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. మిగిలిన పాత్రదారులు తమ పరిధిమేరకు నటించారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు పవన్ సుంకర స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథగా ఈ చిత్రాన్ని రూపొందించారు. మిడ్‌ ఏజ్‌ వాళ్లకి కనెక్ట్‌ అయ్యేలా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ముఖ్యంగా 30+ ఉన్న వారు ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. తమ టీనేజ్‌ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటారు. ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో యువకులు ఎంత ఇబ్బంది పడతారో దర్శకుడు బాగా చూపించాడు. చాటింగ్‌ చేసుకునే సీన్స్‌ను కూడా చక్కగా తెరకెక్కించారు. ‌మిర్ఛి శరణ్‌, ప్రసాద్ బెహరా పాత్రలతో కామెడీని రాబట్టాడు. అయితే రొటీన్‌ స్టోరి, ఆసక్తి లేని కథనం సినిమాకు మైనస్‌గా మారాయి. చాటా చోట్ల కథ నెమ్మదిగా, అక్కడక్కడే తిరిగిన ఫీలింగ్‌ కలిగింది. ఎమోషనల్‌ సీన్స్‌ను ఇంకాస్త బెటర్‌గా తీసి ఉంటే బాగుండేది. ఆమని, గోపరాజు రమణ, రూపలక్ష్మీ వంటి సీనియర్ నటులు ఉన్నా వారి పాత్రలకు ప్రాధాన్యం లేదు.  సాంకేతికంగా..&nbsp; టెక్నికల్‌ విషయాలకు వస్తే (Leela Vinodham Review In Telugu) సినిమాటోగ్రఫీ బాగుంది. అనుష్ కుమార్ తన కెమెరా పనితనంతో పల్లెటూరి వాతావరణాన్ని చక్కగా చూపించాడు. విజువల్స్‌ చాలా ఫ్రెష్‌గా అనిపిస్తాయి. &nbsp; టి.ఆర్. కృష్ణ చేతన్ అందించిన సంగీతం బాగుంది. అతడు ఇచ్చిన నేపథ్య సంగీతంతో సన్నివేశాలు చాలా ప్లెజెంట్‌గా సాగిపోయాయి. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని పెట్టి ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ షణ్ముఖ్‌, అనగ అజిత్‌ నటనవింటేజ్‌ లవ్‌ సీన్స్‌కామెడీ మైనస్‌ పాయింట్స్‌ అసక్తిలేని కథనంసాగదీత సన్నివేశాలుఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5
    డిసెంబర్ 19 , 2024
    Vidya Vasula Aham Review: ఓటీటీలోకి వచ్చేసిన ‘విద్య వాసుల అహం’.. సినిమా ఎలా ఉందంటే? నటీనటులు: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, రవివర్మ అడ్డూరి, కాశీ విశ్వనాథ్, రూప లక్ష్మి, రాజశ్రీ నాయర్, తదితరులు దర్శకుడు: మణికాంత్ గెల్లి సంగీత దర్శకుడు: కల్యాణి మాలిక్ సినిమాటోగ్రఫీ: అఖిల్ వల్లూరి ఎడిటింగ్: సత్య గిడుతూరి నిర్మాతలు: నవ్య మహేష్ ఎమ్, రంజిత్ కుమార్ కొడాలి, చందన కట్ట ఓటీటీ : ఆహా రాహుల్ విజయ్, శివాని జంటగా నటించిన&nbsp; లేటేస్ట్‌ చిత్రం 'విద్య వాసుల అహం'. మణికాంత్‌ గెల్లి దర్శకుడు. ఈ చిత్రాన్ని ఎటర్నిటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై లక్ష్మీ సవ్య, రంజిత్‌ కుమార్‌ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, ప్రచార చిత్రాల సినిమా ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా నేరుగా ఇవాళ ఓటీటీలోకి వచ్చింది. మే 17 నుంచి ఆహా వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?&nbsp; ఈ రివ్యూలో తెలుసుకుందాం.&nbsp; కథేంటి విద్య (శివానీ రాజశేఖర్) తాను పెళ్లి చేసుకోబోయే అబ్బాయికి కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. తను పెట్టిన పరీక్షల్లో నెగ్గిన వరుడినే పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పిస్తుంది. అలా వాసు (రాహుల్‌ విజయ్‌)ను విద్య వెళ్లి చేసుకుంటుంది. అయితే రోజులు గడుస్తున్న కొద్ది వారిలోని అహం మెుదలవుతుంది. అది వారి బంధాన్ని ప్రభావితం చేస్తుంటుంది. కొన్ని నాటకీయ పరిణామాలు.. వాసు-విద్య జీవితాల్లో ఎలాంటి మార్పులకు కారణమయ్యాయి? వారి మధ్య వచ్చిన గొడవలు ఏంటి? వాసు జాబ్‌ పోతే విద్య ఏం చేసింది? కొత్త జంట తమ కలహాలకు ఎలాంటి ముగింపు ఇచ్చారు? అన్నది కథ. ఎవరెలా చేశారంటే యువ నటుడు రాహుల్ విజయ్ కొత్త పెళ్ళి కొడుకు పాత్రలో మెప్పించాడు. ఈ జనరేషన్‌ యూత్‌ను ప్రతిబింబిస్తూ తన నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ పాత్రలో శివాని రాజశేఖర్‌ చక్కటి నటన కనబరిచింది. నవ వధువుగా చీరలో క్యూట్‌గా కనిపిస్తూనే భర్తతో గొడవ పడే సీన్స్‌లో అదరగొట్టింది. ప్రధానంగా ఈ రెండు పాత్రల చుట్టే కథ మెుత్తం తిరిగింది. ఇక నారదుడుగా శ్రీనివాస రెడ్డి, లక్ష్మి దేవిగా అభినయ, విష్ణుమూర్తిగా అవసరాల శ్రీనివాస్ కాస్సేపు కనపడి అలరించారు. ఇతర నటీనటులు తమ పరిధిమేరకు నటించి ఆకట్టుకున్నారు.&nbsp; డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు మణికాంత్‌ గెల్లి.. ఈ జనరేషన్‌ యూత్‌ను లక్ష్యంగా చేసుకొని ఈ మూవీని తెరకెక్కించారు. పెళ్లైన తర్వాత యువతీ యువకులు ఎలా ఉంటున్నారో కళ్లకు కట్టే ప్రయత్నం చేశారు. సినిమాను మాముల కథలా చెప్పకుండా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవి, నారదుడు మాటల ద్వారా స్టోరీని నడిపించడం కొత్తగా అనిపిస్తుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య బలమైన సన్నివేశాలను రాసుకోవడంలో డైరెక్టర్‌ విఫలమయ్యారు. అహం కారణంగా వారి జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయో తెరపై స్పష్టంగా చూపించడంలో తడబడ్డాడు. డైలాగ్స్‌ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కథ మెుత్తాన్ని భార్య భర్తల మధ్యే తిప్పడం.. ఆకట్టుకునే ఇతర పాత్రలు లేకపోవడం ఆడియన్స్‌కు బోర్‌ కొట్టిస్తుంది.&nbsp;&nbsp; సాంకేతికంగా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. కల్యాణి మాలిక్ సంగీతం బాగుంది. నేపథ్య సంగీతం కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్‌ చేసింది. సినిమాటోగ్రాఫర్‌ చక్కటి విజువల్స్ అందించాడు. ఎడిటర్‌ తన కత్తెరకు మరింత పని పెట్టి ఉంటే బాగుండేంది. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.&nbsp; ప్లస్‌ పాయింట్స్‌ రాహుల్‌, శివానీ నటనసంగీతంసినిమాటోగ్రఫీ మైనస్‌ పాయింట్స్ స్లో స్క్రీన్‌ప్లేఎడిటింగ్‌ Telugu.yousay.tv Rating : 2.5/5&nbsp;&nbsp;
    మే 17 , 2024

    రూప కొడువాయూర్ ఫేమస్‌ అవ్వడానికి రీజన్‌ ఏంటి?

    మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ సినిమాతో తెలుగులో ఫేమస్‌ అయ్యింది.

    రూప కొడువాయూర్ లీడ్‌ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?

    రూప కొడువాయూర్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?

    మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ చిత్రంలో మహి పాత్ర

    రూప కొడువాయూర్ బెస్ట్‌ స్టేజ్‌ పర్‌ఫార్మెన్స్‌ వీడియోలు?

    రూప కొడువాయూర్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?

    పిజ్జా, హైదరాబాద్‌ బిర్యాని

    రూప కొడువాయూర్ కు ఇష్టమైన నటుడు ఎవరు?

    రూప కొడువాయూర్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?

    తెలుగు, హిందీ, ఇంగ్లీషు

    రూప కొడువాయూర్ ఫేవరేట్‌ కలర్ ఏంటి?

    వైట్‌

    రూప కొడువాయూర్ ఫేవరేట్‌ క్రీడ ఏది?

    క్రికెట్‌

    రూప కొడువాయూర్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్‌) ఎంత?

    రూప కడువాయూర్‌ ఆస్తుల విలువ రూ.5 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం.

    రూప కొడువాయూర్ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?

    67.6K ఫాలోవర్లు ఉన్నారు.

    రూప కొడువాయూర్ సోషల్‌ మీడియా లింక్స్‌

    రూప కొడువాయూర్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?

    • సైమా అవార్డ్‌ - 2020

      'ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య' చిత్రానికి గాను ఉత్తమ తెరంగేట్ర నటిగా ఎంపిక

    రూప కొడువాయూర్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే రూప కొడువాయూర్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree