• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Mr.Pregnent Review: మిస్టర్ ప్రెగ్నెంట్ డెలివర్ చేసిన మెసేజ్ ఏంటి?

    నటీనటులు: సొహైల్, రూప కొడవయూర్, సుహాసిని, వైవా హర్ష, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, అభిషేక్. 

    దర్శకుడు: శ్రీనివాస్ వింజనంపాటి 

    నిర్మాత: అప్పిరెడ్డి, సజ్జల రవిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి 

    సంగీతం: శ్రవణ్ భరద్వాజ్  

    బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. ఎట్టకేలకు ఈ సినిమా శుక్రవారం(Aug 18) థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, సంగీతం ఆకట్టుకున్నాయి. ప్రమోషన్లు కూడా గట్టిగానే చేశారు. ఇటీవల 200 మంది గర్భిణులకు ప్రత్యేకంగా సినిమా స్క్రీనింగ్ చేయించడంతో ప్రేక్షకుల చూపు మూవీపై పడింది. మరి, ఈ సినిమా ఎలా ఉంది? థియేటర్లలో ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనేది రివ్యూలో చూద్దాం. 

    కథ

    గౌతమ్ (సొహైల్) అనాథ. అతడికి పిల్లలంటే ఇష్టముండదు. సిటీలో టాటూ ఆర్టిస్ట్‌గా పనిచేస్తుంటాడు. వృత్తి పరంగా ఉన్నత స్థానంలో ఉంటాడు గౌతమ్. మంచి డిమాండ్ ఉన్న టాటూ ఆర్టిస్ట్. తన స్నేహితులందరూ కుళ్లుకునేంత టాలెంట్ & ఫేమ్ ఉన్న గౌతమ్‌ను మహి (రూప కొడవయూర్) గాడంగా ప్రేమిస్తుంది. మొదట్లో ఆమె ప్రేమను నిరాకరించిన గౌతమ్.. ఆమె ప్రేమలోని నిజాయితీని అర్ధం చేసుకొని ఆమెను పెళ్లి చేసుకుంటాడు. కానీ, పిల్లలు వద్దని చెబుతాడు. ఈ క్రమంలో మహి గర్భం దాల్చిన విషయం తెలుస్తుంది. అయితే, బిడ్డ తన కడుపులో పెరగాలని డిసైడ్ అయ్యి గర్భాన్ని తనకు మార్పిడి చేసుకుంటాడు గౌతమ్. మరి, ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? ఆ తర్వాత ఏమైందనేది మిగతా కథ.

    ఎలా ఉందంటే?

    పురుషుడు గర్భం దాల్చవచ్చా? దాలిస్తే ఎలా ఉంటుందన్న కథాంశం ఆసక్తిని రేపింది. ఈ పాయింట్‌తోనే సినిమా చూడాలనిపిస్తుంది. కాకపోతే, మూవీలో అసలు విషయం దగ్గరికి రావడానికి కాస్త సమయం పడుతుంది. కథానాయకుడి పరిచయ సన్నివేశాలు, లవ్ ట్రాక్, ఇరికించినట్లుగా అనిపించే కామెడీ ఫస్టాఫ్‌ని బోర్ కొట్టిస్తాయి. కానీ, సొహైల్ నిర్ణయం తర్వాత సినిమా ఆసక్తికరంగా మారింది. సెకండాఫ్‌లో ఎమోషన్ సీన్స్ బాగా పండాయి. గర్భం దాల్చాక ఒకరి పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎమోషనల్ కనెక్టివిటీతో చూపించడం ప్రేక్షకుడికి నచ్చుతుంది. గర్భం చుట్టూ జరిగే కామెడీ నవ్వు పుట్టిస్తుంది. చివరికి ఇచ్చిన మెసేజ్ ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు బాగా మరీ నాటకీయంగా అనిపిస్తాయి. అయితే, మహిళలకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. 

    ఎవరెలా చేశారు?

    నటనకు ఎంతో స్కోప్ ఉన్న పాత్రను ఎంచుకున్నాడు సొహైల్. గర్భం దాల్చాక ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా నటించాడు. ద్వితీయార్థంలో సొహైల్ చేసిన యాక్టింగ్ నచ్చుతుంది. చక్కగా భావాలు పలికించాడు. ఇక, రూప తన పాత్ర పరిధి మేరకు నటించింది. ఇంకొంచెం బాగా చేసే అవకాశం కూడా ఉంది. చాన్నాళ్ల తర్వాత సుహాసిని మణిరత్నంకి మంచి పాత్ర దొరికింది. డాక్టర్‌గా ఆమె బాగా నటించారు. కీలక సన్నివేశాల్లో తను ఆకట్టుకుంది. ఇక, బ్రహ్మాజీ, వైవా హర్ష కామెడీతో అలరించారు. చిన్న పాత్రే అయినా రాజా రవీంద్ర మెప్పించాడు.

    టెక్నికల్‌గా

    దర్శకుడు శ్రీనివాస్ క్లిష్టమైన సబ్జెక్ట్‌ని ఎంచుకుని చక్కగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశాడు. మగాళ్లు గర్భం దాల్చొచ్చనే అంశంపై బాగా రీసెర్చ్ చేసినట్లు అనిపించింది. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకున్నాడు. కాకపోతే, పాత్రల ఎలివేషన్ కోసం సమయం తీసుకున్నాడు. క్లైమాక్స్ పార్ట్ బాగా వర్కౌట్ చేశాడు. ఇక, సినిమాకు శ్రవణ్ భరద్వాజ్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలం. నిజార్ షఫీ కెమెరా పనితనం ఓకే. 

    ప్లస్ పాయింట్స్

    సొహైల్ నటన

    సెకండాఫ్, క్లైమాక్స్

    బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

    మైనస్ పాయింట్స్

    ఇరికించిన కామెడీ సీన్లు

    ఫస్టాఫ్

    కాస్ట్యూమ్స్

    ఫైనల్‌గా.. మిస్టర్ ప్రెగ్నెంట్ కథ తెలుసుకోవాలంటే మొదటి 45 నిమిషాలు ఓపిక పట్టాల్సిందే.  

    రేటింగ్: 2/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv