• TFIDB EN
  • శైలేష్ కొలను
    జననం : అక్టోబర్ 26 , 1986
    ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం (ప్రస్తుత చెన్నై)
    శైలేష్ కొలను ఒక భారతీయ చలనచిత్ర దర్శకుడు మరియు స్క్రీన్ రైటర్, అతను ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేస్తున్నాడు.
    కథనాలు
    Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్!
    Tollywood: ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్యా.. హిట్ కొట్టామా లేదా? కొత్త డైరెక్టర్ల దెబ్బకు ఈ స్టార్ డైరెక్టర్లు ఫసక్! తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ డైరెక్టర్ల పదును తగ్గిపోయింది. ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన శ్రీను వైట్ల, తేజ, వి.వి.వినాయక్ వంటి దర్శకులు ప్రేక్షకులను మెప్పించలేక పోతున్నారు. అనుభవాన్ని రంగరించినా ఒక హిట్ కొట్టలేక నానా తంటాలు పడుతున్నారు. మరోవైపు, కొత్తగా మెగాఫోన్ పట్టుకున్న కుర్రాళ్లు అదరగొడుతున్నారు. విభిన్న కథాంశాలతో ముందుకు వచ్చి ప్రేక్షకుడిని ఇంప్రెస్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో ఈ తరహా డైరెక్టర్ల జాబితా పెరిగిపోయింది. ఇక ఇండస్ట్రీలో ఈ డైరెక్టర్లదే హవా కానుందని చర్చ నడుస్తోంది.  తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమాతో డైరెక్టర్‌గా పరిచయమై ‘ఈ నగరానికి ఏమైంది’ అంటూ అందరినీ నవ్వించిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. కేవలం డైరెక్టర్‌గానే కాకుండా డైలాగ్ రైటర్‌గానూ తరుణ్ భాస్కర్ రాణిస్తున్నాడు. మీకు మాత్రమే చెప్తా సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇండస్ట్రీలో భవిష్యత్తును పదిలం చేసుకున్నాడీ డైరెక్టర్. ‘కీడా కోలా’ అనే యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు తరుణ్. బ్రహ్మానందం లీడ్‌ రోల్‌లో 8 మంది స్టార్లు ఇందులో నటిస్తున్నారు. శైలేష్ కొలను హిట్ యూనివర్స్‌తో సినీ జర్నీని విభిన్నంగా స్టార్ట్ చేసిన డైరెక్టర్ శైలేష్ కొలను. క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్‌ని కథాంశంగా తీసుకుని సినిమాలు తీస్తున్నాడు. హిట్ ఫ్రాంఛైజీలో రెండో సినిమా తీసి మరో హిట్ కొట్టాడు. ఇప్పుడు వెంకటేశ్ సైంధవ్ సినిమాతో బిజీగా ఉన్న ఈ డైరెక్టర్ నాని హీరోగా హిట్3 తీయనున్నాడు. ఇలా వరుసగా సినిమాలను ట్రాక్‌లో పెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. వెంకటేశ్ సైంధవ్ సినిమాపై శైలేష్ తెగ కష్టపడుతున్నాడు. బుచ్చిబాబు సానా కరోనా సమయంలో ఉప్పెన సినిమాతో వచ్చి థియేటర్లలో కాస్త అలజడి తీసుకొచ్చాడు బుచ్చిబాబు సానా. సుకుమార్ శిష్యుడిగా పరిచయమై మెగాఫోన్ పట్టుకున్నాడు. మంచి కథాంశాన్ని ఎంచుకుని కొత్త యాక్టర్లతో సినిమాను మలిచిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీంతో మెగా ఫ్యామిలీ నుంచి ఫోన్ వచ్చేసింది. రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశాన్ని బుచ్చిబాబు కొట్టేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా ఇది తెరకెక్కనున్నట్లు సమాచారం. క్లైమాక్స్ రైటింగ్ కూడా కంప్లీట్ అయినట్లు టాక్. ఈ ఏడాది నవంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి నాని హీరోగా వచ్చిన చిత్రం ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. నాని నటనకు ఎన్ని ప్రశంసలు దక్కాయో గౌతమ్ డైరెక్షన్‌కీ ఆ స్థాయిలో గుర్తింపు లభించింది. తొలి సినిమాతోనే హీరోలు, ప్రొడ్యూసర్ల కంటపడ్డాడు. రామ్‌చరణ్‌కి ఓ కథ వినిపించాడు. స్టోరీ బాగానే ఉన్నా చెర్రీకి కుదరలేదు. దీంతో విజయ్ దేవరకొండని ఒప్పించి సినిమా తెరకెక్కిస్తున్నాడీ జెర్సీ డైరెక్టర్. రౌడీ బాయ్ సరసన శ్రీలీల నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. కేవీ అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన డైరెక్టర్ కేవీ అనుదీప్. 2016లోనే పిట్టగోడ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. లాజిక్ లేని కామెడీకి కేరాఫ్‌ అనుదీప్. జాతిరత్నాలు తర్వాత శివ కార్తికేయన్‌తో ‘ప్రిన్స్’  సినిమా తీసి జాతిరత్నం అని నిరూపించుకున్నాడు. అయితే, ఇప్పటికే ఎంతో మంది ప్రొడ్యూసర్లు అనుదీప్‌కు అడ్వాన్స్ ఇచ్చారట. రామ్ పోతినేనితోనూ అనుదీప్ సినిమా తీయనున్నట్లు టాక్. రాపో కూడా అనుదీప్‌తో సినిమాకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట.  ప్రశాంత్ వర్మ అ!, కల్కి, జాంబి రెడ్డి వంటి విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పుడు హనుమాన్ చిత్రంతో రాబోతున్నాడు. పాన్ వరల్డ్ చిత్రంగా ఇది రాబోతోంది. ఈ డైరెక్టర్ ఏకంగా ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’ని ఏర్పాటు చేసి సినిమాలు తీయబోతున్నాడు. ఇందుకు ఆసక్తి కలిగిన వారిని రిక్రూట్ చేసుకుంటున్నాడు.  వేణు యెల్దండి కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చిన వేణు అడపాదడపా రోల్స్ చేస్తూ కెరీర్‌ని నెట్టుకొచ్చాడు. కానీ, బలగం సినిమాతో డైరెక్టర్‌గా మారి బంపర్ హిట్ అందుకున్నాడు. ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఖజానాను నింపాడు. దీంతో వేణు స్క్రిప్ట్‌ని ప్రొడ్యూస్ చేయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. దిల్ రాజు బ్యానర్‌లోనే వేణు మరో సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకు కూడా ఓ కథ వినిపించినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. శ్రీకాంత్ ఓదెల నాని ‘దసరా’ సినిమాతో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాడు. ఈ సినిమాకు దర్శకత్వం వహించింది డెబ్యూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుని ప్రొడ్యూసర్ల దృష్టిని ఆకర్షించాడు. ప్రస్తుతానికి ఈ డైరెక్టర్ తదుపరి సినిమాపై ప్రకటన చేయలేదు. కానీ, గొప్ప సినిమాలు చేయగల సత్తా శ్రీకాంత్‌లో ఉందని నాని కితాబిచ్చాడు.
    జూన్ 14 , 2023
    Tollywood Rewind 2024: ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన టాప్ 10 సినిమాలు ఇవే! 2024 సంవత్సరానికి చివరి ఘడియలు దగ్గరపడుతుండగా, ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్, ఫెయిల్యూర్స్ పైన చర్చ మొదలైంది. టాలీవుడ్‌కి పెద్ద హిట్ లను అందించిన 'కల్కి', 'పుష్ప 2', హనుమాన్ వంటి సినిమాలు ఈ ఏడాది తెలుగు సినీ పరిశ్రమను ముందుకు నడిపించాయి. కానీ, మరోవైపు కొన్ని అగ్రహీరోల సినిమాలు, యంగ్ హీరోల ప్రాజెక్టులు భారీ అంచనాల మధ్య విడుదలై ప్రేక్షకుల్ని తీవ్రంగా నిరాశపరిచాయి. ఇప్పుడు 2024లో అత్యధికంగా నిరాశపరిచిన పెద్ద సినిమాల గురించి తెలుసుకుందాం. 1. ఈగల్ మాస్ మహారాజా రవితేజ ఈ ఏడాది కూడా డిజాస్టర్ల జాబితాలో చేరారు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన 'ఈగల్' సినిమా, భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ ప్రేక్షకుల ఆశలపై నీళ్లు చల్లింది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసిన 'కేజీఎఫ్' సినిమాల ప్రభావంతో, నేటి యువ దర్శకులు సరికొత్త కథలు తీసుకోకుండా, భారీ బడ్జెట్‌తో యాక్షన్ సన్నివేశాలు, భారీ గన్స్, విచిత్రమైన ఫ్లాష్‌బ్యాక్‌లతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. కానీ 'ఈగల్' కథపై దృష్టి పెట్టకుండా ఒక్కో సన్నివేశం మాత్రమే బాగా రావాలని ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. భారీ బడ్జెట్ వృథాగా అయిందని చెప్పుకోవచ్చు. 2. మిస్టర్ బచ్చన్ 2024లో మరో పెద్ద డిజాస్టర్‌గా నిలిచిన చిత్రం 'మిస్టర్ బచ్చన్'. ఈ సినిమా రీమేక్ సినిమాల విషయంలో ఎలా చేయకూడదో అనిపించేలా ఉంది. ప్రేక్షకులను ఆకట్టుకునే క్రిస్టల్ క్లియర్ కథనం లేకపోవడం, క్రింజ్ కామెడీ సన్నివేశాలు సినిమాను పూర్తిగా డీలా పడేయించాయి. మంచి నటీనటుల ఫేస్ వాల్యూ వృథా అయింది. ఒక రీమేక్ సినిమాలో కథకు ప్రత్యేకత లేకుంటే ప్రేక్షకులు సులభంగా తిరస్కరిస్తారని మరోసారి రుజువైంది. 3. సైంధవ్ వెంకటేష్ తన 75వ సినిమాగా వచ్చిన 'సైంధవ్' సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా విషయంలో భారీ అంచనాలు ఉండేవి. కానీ, కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథనం లేకపోవడంతో పండగ రోజు సినిమా థియేటర్ల నుంచి రానివ్వకుండా వెళ్లిపోయింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ వంటి అద్భుతమైన నటుడు సైతం ఈ సినిమాలో ప్రాభవాన్ని చూపించలేకపోయాడు. కథలో లోపాలు, ఆర్య పాత్ర లాంటి అనవసరమైన పాత్రలు సినిమాను మరింతగా దెబ్బతీశాయి. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది. 4. డబుల్ ఇస్మార్ట్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని నటించిన 'డబుల్ ఇస్మార్ట్' భారీ అంచనాల మధ్య విడుదలైంది. అటు పూరికి ఇటు రామ్‌ పొత్తినేనికి వరుస ఫ్లాప్స్ ఉండటంతో సహజంగానే ఈ సినిమాపై పెద్ద ఎత్తున హైప్ ఏర్పడింది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశపరిచింది. పూరీ స్టైల్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ సరైన ప్రామాణికతను అందించకపోవడం ఈ చిత్రానికి పెద్ద షాక్‌గా మారింది. వరుస ఫ్లాప్‌లతో రామ్‌కు ఈ సినిమా మరో పెద్ద మైనస్‌గా మారింది. 5. ఆపరేషన్ వాలెంటైన్ & మట్కా మెగా ప్రిన్సెస్‌ వరుణ్ తేజ్ ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు – 'ఆపరేషన్ వాలెంటైన్' మరియు 'మట్కా'. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయాయి. వరుణ్ తేజ్ లాంటి ప్రామాణిక నటుడు కూడా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్‌లు ఇవ్వడం అతని కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపింది. వినూత్న కథా సామర్థ్యం లేకపోవడం ఈ సినిమాల వైఫల్యానికి ప్రధాన కారణం. 6. ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన 'ఫ్యామిలీ స్టార్' కూడా 2024లో ప్రేక్షకులను నిరాశపరిచిన మరో సినిమా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం, తొలి వారం ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ, ఆ తరువాత బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. కామెడీ డ్రామా జానర్‌ను ప్రయత్నించినప్పటికీ, కథలో లోపాలు సినిమాను కిందికి దించాయి. 7. మనమే శర్వానంద్ నటించిన 'మనమే' కూడా ఈ ఏడాది మరో నిరాశపరిచిన మరో సినిమా. వినూత్న కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే శర్వానంద్ ఈసారి సక్సెస్ అందుకోలేకపోయాడు. సినిమా మొత్తం స్లో నేరేషన్, అర్థరహితమైన ఎమోషనల్ సన్నివేశాలు, ముఖ్యమైన పాయింట్లను సరిగా హైలైట్ చేయకపోవడం ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిల్చింది. 8. తిరగబడరా సామీ, బడ్డీ, శివంభజే ఇంకా యంగ్ హీరోలు అశ్విన్ బాబు, రాజ్ తరుణ్, అల్లు శిరీష్ వంటి హీరోలు కూడా నిరాశపరిచారు. అశ్విన్ బాబు నటించిన 'శివంభజే', అల్లు శిరీష్ నటించిన 'బడ్డీ', రాజ్ తరుణ్ నటించిన 'తిరగబడరా సామీ' చిత్రాలు నాటకీయ అంచనాలను తలపించి, థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సినిమాలు థియేటర్లలో సందడి చేయకపోవడంతో నిర్మాతలకు నష్టాలు మిగిల్చాయి. 9. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కార్తికేయ సిరీస్‌ సినిమాలతో స్టార్ హీరోగా ఎదిగిన నిఖిల్ సిద్ధార్థ్‌కు ఈ ఏడాది చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఇటీవల విడుదలైన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాకు సుధీర్‌వర్మ దర్శకత్వం వహించారు. నిఖిల్‌, రుక్మిణి వసంత్, దివ్యాంశ కౌశిక్, హర్ష చెముడు ప్రధాన పాత్రల్లో నటించారు. 10. చిన్న సినిమాలు 2024లో చిన్న సినిమాల జాబితాలో కూడా చాలా నిరాశ ఎదురైంది. మంచి కథా బలం ఉన్నా సరైన ప్రమోషన్ లేకపోవడం, కొత్త దర్శకుల సినిమాలు సరైన కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం వల్ల ప్రేక్షకులు ఈ సినిమాలను పట్టించుకోలేదు. ఈ సినిమాల వల్ల చిన్న నిర్మాతలకు ఆర్థిక నష్టాలు మిగిలాయి. 2024లో టాలీవుడ్ పెద్ద ఆశలు పెట్టుకున్న కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరాశపరిచాయి. రవితేజ, వెంకటేష్, రామ్, విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, శర్వానంద్ వంటి అగ్ర హీరోలు బాక్సాఫీస్ విజయాల జాబితాలో స్థానం సంపాదించలేకపోయారు. ఒక వైపు 'పుష్ప 2', 'కల్కి' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు టాలీవుడ్‌ను ముందుకు నడిపిస్తే, మరో వైపు ఈ డిజాస్టర్లు నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. కొత్త సంవత్సరం 2025లో వీరు తిరిగి పుంజుకుంటారా లేదా అనేది ఆసక్తికరమైన అంశం.
    డిసెంబర్ 19 , 2024
    Sankranti Heroines 2024: సంక్రాతి రేసులో అందాల తారలు.. విజయం ఎవర్ని వరిస్తుందో! యావత్‌ ప్రపంచం కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టింది. కొత్త సంవత్సరంలో వచ్చే తొలి పండగ సంక్రాంతి. తెలుగు వారికి ఇది ఎంతో ప్రత్యేకమైంది. ముఖ్యంగా అగ్రహీరోల చిత్రాలు సంక్రాంతికి విడుదలై ప్రేక్షకులను అలరిస్తుంటాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంటాయి. ఈ ఏడాది సంక్రాంతికి స్టార్ హీరోలతో పాటు పలువురు హీరోయిన్లు సైతం సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. కొత్త ఏడాదిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇంతకీ ఆ అందాల తారలు ఎవరు? వారు నటించిన చిత్రాలు ఏవి? ఇప్పుడు చూద్దాం. మీనాక్షి చౌదరి యంగ్‌ బ్యూటీ మీనాక్షి చౌదరి సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. మహేష్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ‘గుంటూరు కారం’ చిత్రంలో ఆమె హీరోయిన్‌గా చేసింది. ఈ చిత‌్ర విజయంపై మీనాక్షి ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాగా, ఈ సినిమా జనవరి 13న గ్రాండ్‌గా విడుదల కానుంది.  శ్రీలీల గతేడాది వరుస చిత్రాలతో అలరించిన శ్రీలీల ఈ ఏడాది ప్రారంభంలోనే మరో భారీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ భామ కూడా ‘గుంటూరు కారం’ చిత్రంలో మహేష్‌కు జోడీగా నటిస్తోంది.  ఆషికా రంగనాథ్‌ కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్‌ గతేడాది ‘అమిగోస్‌’ చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విఫలం కావడంతో నిరాశకు గురైంది. ఈ ఏడాది నాగార్జున పక్కన ‘నా సామిరంగ’ చిత్రంలో ఈ తార నటించింది. ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సినిమా విజయం సాధిస్తే టాలీవుడ్‌లో అవకాశాలు క్యూ కడతాయని ఆషికా భావిస్తోంది.  రుక్సార్‌ థిల్లాన్‌ యంగ్‌ హీరోయిన్‌ రుక్సార్‌ థిల్లాన్‌ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్ధం’ చిత్రంలో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈ భామ కూడా ‘నా సామిరంగ’ సినిమాలో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమా విజయంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.  మిర్నా మీనన్‌ తమిళ నటి మిర్నా మీనన్‌.. గతేడాది ఉగ్రం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. నాగార్జున సరసన ‘నా సామిరంగ’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది. ఈ సినిమా విజయం ద్వారా మరిన్ని టాలీవుడ్‌ అవకాశాలను దక్కించుకోవాలని మిర్నా భావిస్తోంది. అమృత అయ్యర్‌ కన్నడ నటి అమృత అయ్యర్‌.. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత శ్రీవిష్ణు పక్కన అర్జున ఫల్గుణలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం పాన్‌ వరల్డ్‌ స్థాయిలో రూపొందిన హనుమాన్‌ చిత్రంలో తేజ సజ్జ సరసన ఈ భామ నటించింది. ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా రిలీజ్‌ కాబోతుంది. శ్రద్ధ శ్రీనాథ్‌ స్టార్‌ హీరో వెంకటేష్‌ నటించిన ‘సైంధవ్‌’ సినిమా సంక్రాంతి బరిలో నిలిచింది. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధా శ్రీనాథ్‌ నటించింది. 'జెర్సీ' సినిమా తర్వాత శ్రద్ధాకు ఆ స్థాయి హిట్‌ లభించలేదు. దీంతో ఈ బ్యూటీ సైంధవ్ చిత్రంపై భారీగా ఆశలు పెట్టుకుంది. శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం.. జనవరి 13న విడుదల కానుంది. రుహానీ శర్మ 2018లో వచ్చిన ‘చి.ల.సౌ.’ సినిమా ద్వారా రుహానీ శర్మ టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నుంచి వరసగా సినిమాలు చేస్తున్నప్పటికీ పెద్దగా కలిసిరాలేదు. ఈ క్రమంలోనే వెంకటేష్‌ సైంధవ్‌లో ఈ భామకు అవకాశం వచ్చింది. ఈ చిత్ర విజయంతో టాలీవుడ్‌లో నిలదొక్కుకోవాలని రుహానీ భావిస్తోంది. అనుపమ పరమేశ్వరన్‌ మాస్‌ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘ఈగల్‌’. ఈ మూవీలో కేరళ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా చేసింది. ఈ చిత్ర విజయం ద్వారా కొత్త ఏడాదిని గ్రాండ్‌ ప్రారంభించాలని అనుపమ భావిస్తోంది. ఇక ఈమె నటించిన ‘టిల్లు స్క్వేర్’ ఈ సంవత్సరమే విడుదల కానుంది. కావ్యా థాపర్‌ 'ఏక్ మినీ కథ' సినిమాతో నటి కావ్యా థాపర్‌ తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా మంచి విజయం సాధించినప్పటికీ ఈ బ్యూటీకి పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ‘ఈగల్‌’ సినిమాలో ఆమె సెకండ్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రం విజయంతోనైనా మంచి అవకాశాలు వస్తాయని కావ్యా భావిస్తోంది.
    జనవరి 02 , 2024
    Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్  టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఆయన రెండో కూతురు హయ వాహిని ఎంగేజ్‌మెంట్‌ అతి తక్కువ మంది బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది. ఈ నిశ్చితార్థం వేడుక వెంకటేష్ ఇంట్లో జరగ్గా.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు.  వెంకటేష్ రెండో కుమార్తే హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ కుమారుడితో వివాహం జరగనుంది. వెంకటేష్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం... ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్ ఉన్నారు.  మూడో కుమార్తే భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరిలో పెద్ద కుమార్తే ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. . హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జైపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆశ్రిత దంపతులు స్పెయిన్‌లో సెటిల్ అయినట్లు తెలిసింది. అయితే వెంకటేష్ రెండో అల్లుడు వివరాలు మాత్రం ఇంకా వెళ్లడించలేదు. కొంత గోప్యత పాటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తన రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి చేయనున్నట్లు సమాచారం. మంచి ముహూర్తం ఉండటంతో ఇప్పుడు నిశ్చితార్థం చేసి.. వచ్చే ఏడాదిలో పెళ్లి చేయనున్నారు.  ఇక సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ ప్రస్తుతం 'సైంధవ్' సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా  శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.  ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా సైంధర్ చిత్రం ద్వారా బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నవజుద్దీన్ విలన్‌ రోల్‌లో కనిపించనున్నారు. సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి కానుకగా సెంధవ్ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 
    అక్టోబర్ 26 , 2023

    శైలేష్ కొలను వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే శైలేష్ కొలను కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree