• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Venkatesh: గుట్టు చప్పుడుకాకుండా వెంకటేష్ రెండో కూతురు పెళ్లి.. ఫోటోలు వైరల్ 

    టాలీవుడ్‌ హీరో వెంకటేశ్‌ రెండో కుమార్తె హయ వాహిని నిశ్చితార్థం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

    విక్టరీ వెంకటేష్ ఇంట్లో త్వరలోనే పెళ్లిసందడి మొదలు కానుంది. ఆయన రెండో కూతురు హయ వాహిని ఎంగేజ్‌మెంట్‌ అతి తక్కువ మంది బంధువులు, టాలీవుడ్ ప్రముఖుల మధ్య ఘనంగా జరిగింది.

    ఈ నిశ్చితార్థం వేడుక వెంకటేష్ ఇంట్లో జరగ్గా.. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్‌ బాబు, రానా, నాగచైతన్యలతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. 

    వెంకటేష్ రెండో కుమార్తే హయ వాహినికి విజయవాడకు చెందిన ఓ ప్రముఖ డాక్టర్‌ కుమారుడితో వివాహం జరగనుంది.

    వెంకటేష్, నీరజ దంపతులకు మొత్తం నలుగురు సంతానం… ఆశ్రిత, హయ వాహిని, భావన, అర్జున్ ఉన్నారు.  మూడో కుమార్తే భావన, కుమారుడు అర్జున్ విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు.

    వీరిలో పెద్ద కుమార్తే ఆశ్రిత వివాహం 2019లో జరిగింది. . హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆశ్రిత పెళ్లి జైపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ఆశ్రిత దంపతులు స్పెయిన్‌లో సెటిల్ అయినట్లు తెలిసింది.

    అయితే వెంకటేష్ రెండో అల్లుడు వివరాలు మాత్రం ఇంకా వెళ్లడించలేదు. కొంత గోప్యత పాటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో తన రెండో కుమార్తె హయ వాహిని పెళ్లి చేయనున్నట్లు సమాచారం.

    మంచి ముహూర్తం ఉండటంతో ఇప్పుడు నిశ్చితార్థం చేసి.. వచ్చే ఏడాదిలో పెళ్లి చేయనున్నారు. 

    ఇక సినిమాల విషయానికొస్తే.. వెంకటేష్ ప్రస్తుతం ‘సైంధవ్’ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా  శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.

     ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచాయి. చాలా రోజుల తర్వాత వెంకటేష్ పూర్తి స్థాయి యాక్షన్ చిత్రంలో నటిస్తుండటంతో అంచనాలు ఏర్పడ్డాయి. వెంకటేష్ సరసన రుహాని శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

    కాగా సైంధర్ చిత్రం ద్వారా బాలీవుడ్ విలక్షణ నటుడు నవజుద్దీన్ సిద్దిఖీ టాలీవుడ్‌కు పరిచయం కానున్నారు. ఈ సినిమాలో నవజుద్దీన్ విలన్‌ రోల్‌లో కనిపించనున్నారు. సైంధవ్ సినిమాకు సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు.

    సంక్రాంతి కానుకగా సెంధవ్ చిత్రాన్ని జనవరి 13న విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv