ఓటీటీ రాకతో సినీ ప్రేక్షకుల ఆలోచనల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి. ఇంట్లోనే ఎంచక్కా కొత్త సినిమాలు / సిరీస్‌లు చూసేందుకు వారు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇందుకు తగ్గట్లే ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రతీవారం కొత్త సినిమాలను తీసుకొస్తూ ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. ఈ వీకెండ్ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఓటీటీలోకి రాబోతున్నాయి.ఇంతకీ ఆ సినిమాలు ఏవి? ఎక్కడ స్ట్రీమింగ్ కానున్నాయి? వాటి స్టోరీ లైన్ ఏంటి? ఇప్పుడు చూద్దాం.
ఉషా పరిణయం (Usha Parinayam)
కుమారుడు శ్రీకమల్‌ను హీరోగా పెట్టి స్టార్ డైరెక్టర్ కె. విజయ్‌భాస్కర్ తెరకెక్కించిన చిత్రం ‘ఉషా పరిణయం’. తాన్వీ ఆకాంక్ష కథానాయిక. ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ యువతను మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో నవంబరు 14 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘హనీ (శ్రీకమల్) పెళ్లి చూపుల్లో ఉషాను రిజెక్ట్ చేస్తాడు. అయితే అతడు జాయిన్ అయిన ఫ్యాషన్ కంపెనీలోనే ఉషా పనిచేస్తుంటుంది. క్రమంగా ఆమెను ఇష్టపడతాడు. అయితే ఉషాకు వేరొకరితో నిశ్చితార్థం జరుగుతుంది. అప్పుడు హనీ ఏం చేశాడు? ఉషా ప్రేమను పొందగలిగాడా?’ అన్నది స్టోరీ.
మా నాన్న సూపర్ హీరో (Maa Nanna Super Hero)
తెలుగు హీరో సుధీర్‌బాబు నటించిన లేటెస్ట్ చిత్రం ‘మా నాన్న సూపర్ హీరో‘. అభిలాష్ రెడ్డి దర్శకుడు. అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు నవంబర్ 13 నుంచి స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘చిన్నప్పుడే తండ్రి (సాయిచంద్) జైలుకు వెళ్లడంతో జానీ (సుధీర్‌బాబు) అనాథగా మారతాడు. అతడ్ని స్టాక్ బ్రోకర్ శ్రీనివాస్ (షాయాజీ షిండే) దత్తత తీసుకుంటాడు. జానీ రాకతో శ్రీనివాస్ లైఫ్ తలకిందులై అప్పులపాలవుతాడు. దీంతో జానీపై శ్రీనివాస్ ద్వేషం పెంచుకుంటాడు. కానీ జానీ మాత్రం పెంపుడు తండ్రిపై ప్రేమను చూపిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రాజకీయ నాయకుడి వద్ద శ్రీనివాస్ పీకల్లోతు సమస్యలో చిక్కుకుంటాడు. అప్పుడు జానీ ఏం చేశాడు? తన తండ్రిని ఎలా రక్షించాడు? మరి సొంత తండ్రిని కలుసుకున్నాడా? లేదా?’ అన్నది స్టోరీ.
డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ (Deadpool & Wolverine)
హాలీవుడ్ నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్న డెడ్‌పూల్ అండ్ వోల్వరైన్ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. మార్వెల్ & డెడ్‌పూల్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రం జూలై 26న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు, హిందీ, తమిళం భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో వోల్వారిన్‌గా హ్యూగ్ జాక్‌మాన్ నటించగా డెడ్‌పూల్‌గా ర్యాన్ రేనాల్డ్స్ చేశాడు. ప్లాట్ ఏంటంటే ‘డెడ్‌పూల్ అలియాస్ వేడ్ విల్సన్ కార్ల సేల్స్ మ్యాన్‌గా పని చేస్తూ సాధారణ జీవితం గడుపుతుంటాడు. ఓ రోజు అతడ్ని టైమ్ వేరియెన్స్ అథారిటీని నిర్వహించే పారాడాక్స్ మనుషులు ఎత్తుకెళ్తారు. ఎర్త్ 616కు తీసుకెళ్తారు. అక్కడకు వెళ్లిన డెడ్‌పూల్‌కు వాల్వెరైన్ సాయం అవసరం అవుతుంది. అసలు ఎర్త్ 616 అంటే ఏంటి? డెడ్‌పూల్‌ను ఎందుకు అక్కడికి తీసుకెళ్లారు? అక్కడ డెడ్‌పూల్ – వాల్వెరైన్ చేసిన సాహసాలు ఏంటి?’ అన్నది స్టోరీ.
ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్ (Freedom At Midnight)
ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న ఆసక్తికరమైన సిరీస్ ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్’. ఓ పుస్తకం ఆధారంగా ఈ వెబ్‌సిరీస్ రూపొందింది. నిఖిల్ అద్వాణీ దర్శకత్వం వహించారు. 1947 స్వాతంత్రం అనంతరం జరిగిన రాజకీయ పరిణామాలు, గాంధీ పాత్ర నేపథ్యంలో ఈ సిరీస్ సాగనుంది. హిందీతో పాటు, తెలుగులోనూ ఈ సిరీస్ నవంబరు 15వ తేదీ నుంచి ఓటీటీ వేదిక సోనీలివ్‌లో (SonyLiv) స్ట్రీమింగ్ కానుంది.
ఆదితట్టు (Adithattu)
జిజో ఆంటోని దర్శకత్వంలో సన్నీ వేన్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషించిన చిత్రం ‘ఆదితట్టు‘. 2022 జూన్‌లో విడుదలైన ఈ మలయాళ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దాదాపు రెండేళ్ల తర్వాత తాజాగా ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా నంబర్ 15 నుంచి తెలుగులో స్ట్రీమింగ్ కాబోతోంది. కథ ఏంటంటే ‘ఆంబ్రోస్, మార్కోస్ మత్స్యకారులు. ఐదుగురితో కలిసి సముద్రంలో వేటకు వెళ్లగా వారిలో ఒకరు చనిపోతారు. తమలోనే ఒకరు ఆ వ్యక్తిని చంపారని ఒకరిపై మరొకరు అనుమానపడతారు. ఈ అనుమానాలు ఎలాంటి గొడవలకు దారితీశాయి? అసలైన హంతకుడు ఎవరు? అన్నది స్టోరీ.
దేవర (Devara)
ఇదిలా ఉంటే గతవారం పలు సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలోకి వచ్చాయి. అవి ఇప్పటివరకూ చూడకుండా ఉంటే ఈ వీకెండ్‌తో ఎంచక్కా చూసేయండి. జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర (OTT Suggestions) మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 27న రిలీజైన సంగతి తెలిసిందే. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘సముద్రానికి ఆనుకొని కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప, కుంజర ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకు రవాణా చేస్తూ జీవిస్తుంటారు. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి దేవర సరకు దొంగతనం చేయవద్దని ఫిక్స్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? భైరవను దేవర ఎలా అడ్డుకున్నాడు? సముద్రంలోకి వెళ్లిన దేవర ఏమయ్యాడు? అతడి కొడుకు వర (ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు?’ అన్నది స్టోరీ.
వేట్టయన్ (Vettaiyan)
రజనీకాంత్ (Rajinikanth), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) నటించిన తమిళ హిట్ మూవీ ‘వేట్టయన్’ (OTT Suggestions) కూడా గత వారమే ఓటీటీలోకి అడుగుపెట్టింది. నవంబర్ 8 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో రజనీ, అమితాబ్‌తోపాటు రానా, ఫహాద్ ఫాజిల్, మంజు వారియర్ కీలక పాత్రలు చేశారు. ప్లాట్ ఏంటంటే ‘ఎస్పీ అదియన్ (రజనీకాంత్) స్కూల్ టీచర్ శరణ్య (దుషారా విజయన్) ఫిర్యాదుతో గంజాయి మాఫియాను అణిచివేస్తాడు. ఈ క్రమంలో చెన్నైకి ట్రాన్స్‌ఫర్ అయిన శరణ్య అనూహ్యంగా అక్కడ హత్యాచారానికి గురవుతుంది. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు మెుదలవడంతో ఈ కేసును అదియన్‌కు ప్రభుత్వం అప్పగిస్తుంది. అసలు శరణ్య హత్యకు కారణం ఏంటి? దాని వెనక ఉన్న ఎడ్యుకేషన్ మాఫియా ఏంటి? శరణ్యకు అదియన్ ఎలా న్యాయం చేశాడు?’ అన్నది స్టోరీ.
ఏఆర్ఎం (ARM)
మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ (Tovino Thomas) నటించిన రీసెంట్ చిత్రం ‘ఏఆర్‌ఎం’ (ARM). ఈ మూవీ నవంబర్ 8 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (OTT Suggestions)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. మలయాళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ప్లాట్ ఏంటంటే ‘అజయ్ (టొవినో థామస్) ఊళ్లో చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తుంటాడు. ఆ ఊరి గుడిలో కొలువైన శ్రీభూతి దీపం బంగారం కంటే విలువైంది. దాన్ని కొట్టేసి ఆ నిందని అజయ్‌పై వేయాలని సుదేవ్‌వర్మ కుట్ర చేస్తాడు. అయితే విగ్రహాన్ని అజయ్ ఫ్యామిలీ తరతరాలుగా రక్షిస్తుంటుంది. మరి ఈసారి అజయ్ దాన్ని ఎలా కాపాడాడు? ఆ విగ్రహం చరిత్ర ఏంటి? కథలో మహావీరుడు కుంజికేలు, మణియన్ ఎవరు?’ అన్నది స్టోరీ.
సిటడెల్: హనీ బన్నీ (Citadel: Honey Bunny)
సమంత (Samantha), వరుణ్ ధావన్ (Varun Dhawan) నటించిన మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ‘సిటడెల్: హనీ బన్నీ‘. ఈ సిరీస్ గత వారమే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ వేదికగా నవంబర్ 7 నుంచి స్టీమింగ్ అవుతోంది. హిందీతోపాటు తెలుగులోనూ ఈ వెబ్‌సిరీస్‌ను వీక్షించవచ్చు. ప్లాట్ ఏంటంటే ‘బన్నీ (వరుణ్ ధావన్) ఓ స్టంట్ మ్యాన్. సీక్రెట్ ఏజెంట్‌గాను పనిచేస్తుంటాడు. షూటింగ్‌లో పరిచయమైన హనీ (సమంత)ను ఓ మిషన్‌లో భాగం చేస్తాడు. ఈ క్రమంలో ఇద్దరూ దగ్గరవుతారు. అయితే ఈ మిషన్‌లో హనీ చనిపోయిందని బన్నీ భావిస్తాడు. కానీ, 8 ఏళ్ల తర్వాత హనీ బతికున్న విషయం తెలుస్తుంది. వారిద్దరికి పుట్టిన కూతురు కూడా ఉందని తెలుస్తుంది. మరోవైపు హనీ, ఆమె కూతుర్ని చంపేందుకు కొందరు యత్నిస్తుంటారు. అప్పుడు బన్నీ ఏం చేశారు? విలన్ గ్యాంగ్‌ను హనీ-బన్నీ ఎలా ఎదుర్కొన్నారు? విలన్ గ్యాంగ్ హనీ వెంట ఎందుకు పడుతోంది?’ అన్నది స్టోరీ.
జనక అయితే గనక (Janaka Aithe Ganaka)
యంగ్ హీరో సుహాస్ (Suhas) నటించిన లేటెస్ట్ చిత్రం ‘జనక అయితే గనక‘ (OTT Suggestions). సందీప్ రెడ్డి బండ్ల దర్శకుడు. సంగీర్తన విపిన్ హీరోయిన్. రాజేంద్రప్రసాద్, గోపరాజు రమణ, వెన్నెల కిషోర్, మురళీశర్మ కీలక పాత్రలు పోషించారు. అక్టోబర్ 12 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. నవంబర్ 8 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. ప్లాట్ ఏంటంటే ‘మధ్య తరగతి ఫ్యామిలీకి చెందిన ప్రసాద్ (సుహాస్) బెస్ట్ ఇవ్వలేనని భావించి పెళ్లై రెండేళ్లు అవుతున్నా పిల్లలు వద్దనుకుంటాడు. ఈ క్రమంలో అనూహ్యంగా భార్య ప్రెగ్నెంట్ అవుతుంది. దీంతో కండోమ్ కంపెనీపై ప్రసాద్ కేసు వేస్తాడు. తర్వాత ఏం జరిగింది? తండ్రయ్యాక ప్రసాద్‌లో వచ్చిన మార్పు ఏంటి? ఇంతకీ కేసు గెలిచాడా? లేదా?’ అన్నది స్టోరీ.
త్వరలో ఓటీటీలోకి రానున్న చిత్రాలు, సిరీస్‌లు..
Title | Category | Language | Platform | Release Date |
Martin | Movie | Telugu Dub | Zee 5 | Nov 23 |
Vikatakavi | Series | Telugu | Zee 5 | Nov 28 |
Amaran | Movie | Telugu Dub | Netflix | Dec 11 |
Squid Games S2 | Series | Telugu Dub | Netflix | Dec 26 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!