పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ రీసెంట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సూపర్ హిట్ కాగా, సందీప్ రెడ్డి తెరకెక్కించిన ‘యానిమల్‘ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక వీరిద్దరి కాంబోలో రాబోతున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రం ఇక ఏ స్థాయిలో ఉంటుందోనని ఆడియన్స్‌లో ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాపై చాలా గాసిప్స్ ఉన్నప్పటికీ అఫిషియల్‌గా ఏ ప్రకటన రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన స్పిరిట్ నిర్మాత.. మూవీకి సంబంధించి పలు కీలక ప్రకటనలు చేశారు.
‘2026 మిడిల్లో రిలీజ్’
సందీప్ రెడ్డి గత చిత్రం ‘యానిమల్’ను నిర్మించిన బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ‘స్పిరిట్’ను సైతం ప్రొడ్యూస్ చేయనున్నారు. తాజాగా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన టీ సిరీస్ నిర్మాత భూషణ్ కుమార్ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ గురించి తొలిసారి స్పందించారు. ప్రభాస్ ‘స్పిరిట్’ చిత్రాన్ని డిసెంబర్లో సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే నెలలోనే ముహోర్తం షాట్ ఉంటుందని చెప్పారు. 2026 మిడిల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం స్టోరీ వర్క్‌లో బిజీగా ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే స్పిరిట్ సాంగ్స్ గురించి కూడా ఆయన వర్క్ చేస్తున్నట్లు చెప్పారు. తాను రెండు సాంగ్స్ విన్నానని, అవి బాగున్నాయని వివరించారు. కాగా, యానిమల్కు సంగీతం అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్ స్పిరిట్‌కు సైతం మ్యూజిక్ ఇవ్వనున్నారు. ఇటీవల హర్షవర్దన్ కంపోజ్ చేసిన సాంగ్‌ను సందీప్ రెడ్డి వింటున్న వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
రాజా సాబ్పై ప్రశంసలు..
ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమాపై కూడా నిర్మాత భూషణ్ కుమార్ మాట్లాడారు. తాను రాజా సాబ్ మూవీకి సంబంధించి కొన్ని సీన్స్ చూశానని, విజువల్స్ అద్భుతంగా వచ్చాయని ప్రశంసించారు. హాలీవుడ్ సినిమా ‘హ్యారీ పోటర్’ను తలపించేలా ఆ సన్నివేశాలు ఉన్నాయని ఆకాశానికెత్తారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ది రాజా సాబ్ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్స్ చేస్తున్నాడు. ప్రభాస్ ఓల్డ్ లుక్కు సంబంధించి ఇటీవల ఓ పోస్టర్ సైతం రిలీజైంది. ఇందులో ప్రభాస్ డెవిల్ అట్మాస్పియర్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2025 ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం రిలీజ్ కానుంది.
తొలుత పోలీసు.. తర్వాత!
సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రూపొందించనున్న ‘స్పిరిట్’ (Spirit) చిత్రంలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా కనిపిస్తారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ పాత్రతో పాటు మరో కీ రోల్లో ప్రభాస్ కనిపిస్తారని ఓ వార్త ఇటీవల చక్కర్లు కొట్టింది. దాని ప్రకారం కథలో తొలుత పోలీసుగా కనిపించిన ప్రభాస్ అనేక నాటకీయ పరిణామాల తర్వాత గ్యాంగ్‌స్టర్‌గా మారతారని సమాచారం. అంతేకాదు ఈ సినిమాలో భారీ వైల్డ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు. ‘యానిమల్’కు మించిన వైలెన్స్, ఫైట్ సీక్వెన్స్‌ను ‘స్పిరిట్’లో చూస్తారని అంటున్నారు. దీంతో స్పిరిట్‌పై అంచనాలు మరింత పెరిగాయని చెప్పవచ్చు.
భారీ బడ్జెట్‌తో..
స్పిరిట్ చిత్రాన్ని టీ-సిరీస్ భూషణ్ కుమార్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నట్లు సమాచారం. ఏకంగా రూ.1000 కోట్ల బడ్జెట్‌ను ఈ మూవీకి కేటాయించినట్లు టాక్ వినిపిస్తోంది. తొలుత ఈ మూవీ బడ్జెట్ రూ.500 కోట్లు అంటూ ప్రచారం జరిగింది. ఆ తర్వాత రూ. 750 కోట్లకు పెరిగిందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏకంగా రూ.1000 కోట్లతో ఈ సినిమా రూపొందనున్నట్లు బజ్ వినిపిస్తోంది. అదే నిజమైతే బడ్జెట్ పరంగా ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా ‘స్పిరిట్’ నిలవనుంది. బడ్జెట్లో రూ.600 కోట్లు నటీనటుల పారితోషానికే వెళ్లనున్నట్లు సమాచారం. ఒక్క ప్రభాస్‌కే రూ.300 కోట్లు చెల్లించనున్నట్లు ఫిల్మ్ వర్గాల టాక్.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ