టాలీవుడ్‌కు టాలెంటెడ్ యంగ్ నటీమణుల్లో శ్రీ గౌరి ప్రియ ఒకరు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు చేసిన ఈ అమ్మడు ఈ ఏడాది ‘మ్యాడ్’ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. తన అందం, అభినయంతో మంచి మార్కులు సంపాదించింది. ఫ్యూచర్‌లో స్టార్ హీరోయిన్ కాగల సత్తా తనలో ఉందని చాటి చెప్పింది. ఇదిలా ఉంటే ఇవాళ శ్రీ గౌరి ప్రియ పుట్టిన రోజు. 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమెకు సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం.
శ్రీ గౌరి ప్రియ మన హైదరాబాదీ అమ్మాయే. 1998 నవంబరు 13న ఆమె జన్మించింది. ఆమె తల్లిదండ్రుల పేర్లు శ్రీనివాస్ రెడ్డి, వసుంధర.
శ్రీ గౌరి ప్రియ విద్యాభ్యాసం అంతా హైదరాబాద్‌లోనే జరిగింది. బేగంపేట్‌లోని సెంట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ పూర్తి చేసింది.
స్కూల్ డేస్ నుంచే కల్చరల్ యాక్టివిటీస్‌లో శ్రీగౌరి చురుగ్గా ఉండేది. స్కూల్, కాలేజ్‌లో జరిగే వినోద కార్యక్రమాల్లో పాల్గొని మంచి ప్రశంసలు అందుకుంది.
శ్రీగౌరిలో మంచి నటితో పాటు బెస్ట్ సింగర్ కూడా దాగుంది. బాల్యంలోనే పలు టెలివిజన్ షోలలో ఈ అమ్మడు పాటల ప్రదర్శన చేసింది. విన్నర్‌గా నిలిచి సత్తా చాటింది.
ప్రముఖ టెలివిజన్ షో ‘బోల్ బేబీ బోల్’ (Bol Baby Bol)లో చిన్నప్పడు శ్రీగౌరి పాల్గొంది. సెకండ్ సీజన్‌లో రన్నరప్‌గా, మూడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచి ప్రశంసలు అందుకుంది.
సినిమాల్లోకి రాకముందు జెమినీ టీవీలో యాంకర్‌గానూ చేసింది. తన వాక్ చాతుర్యంతో టెలివిజన్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది.
2016లో వచ్చిన ‘నిర్మలా కాన్వెంట్’ మూవీతో ఈ అమ్మడు సినిమాల్లోకి అడుగుపెట్టింది. కానీ అందులో పెద్దగా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయలేదు.
ఆ తర్వాత చేసిన ‘మనలో ఒకడు’, ‘ఫిదా’ చిత్రాల్లోనూ గుర్తుంచుకోతగ్గ రోల్స్ చేయలేదు. దీంతో మూడు సినిమాలు చేసిన శ్రీగౌరి పేరు పెద్దగా ఎవరికీ తెలియలేదు.
దీంతో మోడలింగ్ వైపు అడుగులు వేసిన ఈ అమ్మడు 2018లో మిస్ హైదరాబాద్ టైటిల్ గెలిచి సినీ పెద్దల దృష్టిలో పడింది.
ఆహాలో వచ్చిన ‘మెయిల్’ వెబ్‌సిరీస్‌లో తొలిసారి లీడ్ రోల్ యాక్ట్రెస్‌గా ఛాన్స్ దక్కించుకుంది. ఇందులో రోజా అనే పల్లెటూరి అమ్మాయిగా అదరగొట్టింది.
ఆ తర్వాత సుహాస్ నటించిన ‘రైటర్ పద్మభూషణ్‘ సినిమాలో కన్నా అనే పాత్రలో కనిపించి మెప్పించింది. తన నటనతో మంచి మార్కులు సంపాదించింది.
గతేడాది వచ్చిన ‘మ్యాడ్’ చిత్రం శ్రీగౌరి కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇందులో శ్రుతి పాత్రలో కనిపించి యూత్‌ను ఎంతగానో ఇంప్రెస్ చేసింది.
ఈ ఏడాది తమిళంలో ‘ట్రూ లవర్‘ అనే చిత్రంలో హీరోయిన్‌గా ఈ ముద్దుగుమ్మ నటించింది. ఇందులో దివ్య అనే పాత్రతో శభాష్ అనిపించుకుంది. ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది.
ప్రస్తుతం మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా సరసన ఓ సినిమాలో నటిస్తోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ‘ప్రొడక్షన్ నెం.27’ వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ రూపొందుతోంది.
సింగర్‌గా గౌరి ప్రియ రెండు సినిమాల్లో పాటలు కూడా పాడింది. తేజ దర్శకత్వంలో వచ్చిన ‘హోరాహోరీ’, ‘మనలో ఒక్కడు’ చిత్రాలకు గాయనిగా పనిచేసి అభిమానులను మెప్పించింది.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. రజనీ.. తన ఆల్‌టైమ్ ఫేవరేట్ అంటూ చెప్పుకొచ్చింది.
ఏ కాస్త సమయం దొరికినా డ్యాన్స్ చేస్తుంటానని శ్రీగౌరి తెలిపింది. అలాగే పుస్తకాలు చదవం, పెయింటింగ్ వేయడం, ఫొటోగ్రఫీ తన హాబీస్ అని స్పష్టం చేసింది.
ఫుడ్ విషయానికి వస్తే భారతీయ వంటకాలను ఈ అమ్మడు ఎంతగానో ఇష్టపడుతుంది. అలాగే చైనీస్, జపనీస్ ఫుడ్‌ను సైతం ఇష్టంగా తింటుంది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలోనూ శ్రీగౌరి చురుగ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.
శ్రీగౌరి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రస్తుతం 510K మంది ఫాలో అవుతున్నారు. ఆమె పోస్టు చేసిన ఫొటోలను వెంటనే షేర్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్