• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • శైలేష్ కొలనుతో వెంకీ మామ 75వ చిత్రం

  విక్టరీ వెంకటేశ్‌ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించారు. ఇదివరకు ప్రచారం జరిగినట్లుగానే శైలేష్ కొలను దర్శకత్వంలో నటించనున్నారు. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పథాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ మేరకు చిత్రబృందం ప్రీలుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో వెంకీ మామ చేతిలో ఏదో వస్తువు పట్టుకొని వెళ్తుండగా భారీ పేలుడుతో పొగ కమ్మెసినట్లు ఉంది. దీనిబట్టి యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇది వెంకటేశ్‌కు 75వ చిత్రం. Screengrab Twitter:VenkyMama

  వెంకీ మామకు చిరు బర్త్‌డే విషెష్; పార్టీ ఎక్కడా?

  ఈ నెల 12న టాలీవుడ్ నటుడు విక్టరీ వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా హోరెత్తుతోంది. పలువురు సెలబ్రిటీలు, అభిమానుల బర్త్‌డే విషెష్‌తో సందడి చేస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా తనదైన స్టైల్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ వెంకీమామకు పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీ ఎక్కడా?’’ అంటూ అడిగారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. కాగా వెంకటేష్ ‘రానా నాయుడు’ వెబ్‌సీరీస్‌లో నటించాడు. ఈ వెబ్ సీరీస్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

  REVIEW: “ఓరి దేవుడా” ఆకట్టుకుందా?

  తమిళంలో సూపర్‌హిట్‌ సాధించిన ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కిన సినిమా “ఓరి దేవుడా” తమిళ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెలుగులోనూ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్‌, మిథిలా పాల్కర్ లీడ్‌ రోల్స్‌లో నటించారు.  తొలుత సినిమాకు “హే భగవాన్‌” అనే టైటిల్‌ అనుకున్నా, విశ్వక్‌ సేన్‌ గత సినిమాలు పాగల్‌, హిట్‌ ఇలా ఇంగ్లీష్‌ హిందీ పేర్లు ఉండటంతో ఈ సినిమా టైటిల్‌ పక్కా తెలుగులో ఉండాలని మేకర్స్‌ ఈ పేరు పెట్టారు. అయితే తమిళ సూపర్‌హిట్‌గా నిలిచిన “ఓ మై కడవులే” … Read more

  మెగాస్టార్ మూవీలో వెంకటేష్

  మెగాస్టార్ చిరంజీవి హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న మెగా 154 మూవీలో విక్టరీ వెంకటేష్ నటించనున్నారనే వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. చిత్రంలో వెంకటేష్ అతిథి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇద్దరు అగ్ర హీరోలను ఒకే తెరపై చూడొచ్చని అభిమానులు సంతోషపడుతున్నారు. కాగా మెగా 154 మూవీకి ’వాల్తేరు వీరయ్య‘ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.

  ‘నువ్వు నాకు న‌చ్చావ్‌’కు 21 ఏళ్లు

  వెంక‌టేశ్, ఆర్తి అగ‌ర్వాల్ జంట‌గా న‌టించిన ‘నువ్వు నాకు న‌చ్చావ్’ సినిమా వ‌చ్చి నేటికి 21 ఏళ్లు పూర్త‌యింది. మూవీ వ‌చ్చి ఎంత‌కాలం అయిన‌ప్ప‌టికీ ఇప్పుడు టీవీలో చూసినా ఫ్రెష్‌గా అనిపిస్తుంది. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్టోరీ, డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌కు ఎప్ప‌టికీ గుర్తుండిపోతాయి. విజ‌య్ భాస్క‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో ల‌వ్‌స్టోరీతో పాటు కామెడీని జోడించి మంచి క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు అందించారు. శ్రీ స్ర‌వంతి మూవీస్ దీన్ని నిర్మించింది. కోటి సంగీతం అందించాడు.

  వినాయక చవితికి ఈ పాటలను అస్సలు మర్చిపోలేం..!

  ఆదిదేవుడు గణపతికి పూజ చేయకుండా కెమెరా ఆన్ కాదు. క్లాప్పింగ్ పడదు. వినాయక చవితి వచ్చిందంటే చాలు చిత్రపరిశ్రమలో సందడే సందడి. కొత్త సినిమా ప్రకటనలతో, ట్రైలర్, టీజర్, ఫస్ట్ లుక్ విడుదలతో పండుగ చేసుకుంటుంది. తారల సెలబ్రేషన్స్ ఈ ఉత్సవానికి అదనపు ఆకర్షణ. అయితే, ఏకదంతుడిపై రూపొందిన కొన్ని గేయాలు ఇప్పటికీ తెలుగు లోగిళ్లలో వినిపిస్తుంటాయి. అవేంటో ఓ లుక్కేద్దామా..! దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. వినాయక చవితికి ఏ మండపం వద్ద చూసినా, ఏ వీధిలోకెళ్లినా.. తప్పక వినిపించే పాట.. ‘దండాలయ్యా.. ఉండ్రాలయ్యా.. దయుంచయ్యా … Read more

  విశ్వ‌క్‌సేన్ మూవీలో వెంకీమామ‌

  విశ్వ‌క్‌సేన్ ప్ర‌స్తుతం ‘ఓరి దేవుడా’ అనే ఒక సినిమాలో న‌టిస్తున్నాడు. ఇది త‌మిళ్ సూప‌ర్‌హిట్ మూవీ ఓ మై క‌డ‌వులే రీమేక్‌గా తెర‌కెక్కుతుంది. మిథిలా పాల్క‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. అయితే ఈ సినిమాలో దేవుడి పాత్ర ఒక‌టి ఉంటుంది. త‌మిళ్‌లో ఆ పాత్ర‌ను విజ‌య్ సేతుప‌తి చేశాడు. తెలుగులో ఆ క్యారెక్ట‌ర్‌లో వెంక‌టేశ్ క‌నిపించ‌బోతున్నాడ‌ని స‌మాచారం. మూడు రోజుల్లో వెంకీ ఈ షూటింగ్ పూర్తిచేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. త‌మిళ్‌లో ఈ మూవిని తీసిన డైరెక్ట‌ర్ అశ్వ‌త్ మారిముత్తు తెలుగు వ‌ర్ష‌న్‌కు కూడా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.

  వెంకీతో ప‌వ‌న్ అనుకుంటే మ‌హేశ్ వ‌చ్చాడు

  ‘సీత‌మ్మ‌వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు’ సినిమా ఎంత స‌క్సెస్ అయిందో తెలిసిందే. అయితే ఈ సినిమాలో మొద‌ట వెంక‌టేశ్‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ అని అనుకున్నార‌ట‌. కానీ అనుకోకుండా ఒక‌సారి మ‌హేశ్‌ను క‌లిసిన‌ప్పుడు క‌థ చెప్పాడు ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ అడ్డాల‌. దీంతో మ‌హేశ్‌కు క‌థ న‌చ్చి నేను చేస్తాను అని నిర్మాత దిల్‌రాజుతో చెప్పాడ‌ట‌. దీంతో క‌థ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌ర‌కు వెళ్ల‌కుండానే మ‌హేశ్‌తో ఫిక్స్ అయిపోయింద‌ట‌. కానీ చిన్నోడు, పెద్దోడుగా వెంక‌టేశ్, ప‌వ‌న్ చేస్తే సినిమా ఇంకో రేంజ్‌లో ఉండేది అంటున్నారు ఫ్యాన్స్.

  ఎఫ్ 3 ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

  ప్రేక్షకుల ఆదరణ పొందిన ఎఫ్ 3 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 22న సోనీ లివ్ లో స్ట్రీమ్ కానున్నట్లు మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.థియేటర్లలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్ ఎఫ్ 3.. ఓటీటీలోనూ అదే తరహా జోష్ కొనసాగిస్తుందని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేసింది.

  F3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

  వెంక‌టేశ్, వ‌రుణ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన F3 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. జులై 22న సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎఫ్ 3 త‌ర్వాత విడుద‌లైన సినిమాల‌న్నీ ఇప్ప‌టికే ఓటీటీల్లోకి వ‌చ్చాయి. అయితే ఎనిమిది వారాల వ‌ర‌కు మూవీ ఓటీటీలోకి రాద‌ని చిత్ర‌బృందం ముందుగానే ప్ర‌క‌టించింది. ఇచ్చిన మాట ప్ర‌కారం రెండు నెల‌ల త‌ర్వాతే సినిమా డిజిట‌ల్ ప్లాట్‌ఫామ్‌లోకి రాబోతుంది. మే 27న విడుద‌లైన F3 మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. త‌మ‌న్నా, మెహ్రిన్ హీరోయిన్లుగా న‌టించారు. సునీల్, అలీ, … Read more