బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసిన దృశ్యం పార్ట్ 1 తరువాత ఈరోజు దృశ్యం పార్ట్ 2 విడుదలైంది. హీరో తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనే మెయిన్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి క్రేజ్ చాలానే ఉంది. దృశ్యం పార్ట్ 2ను నవంబర్ 25న అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ చేసారు. అయితే పార్ట్ 2 ఎలా ఉంది, కథేంటి విషయాలను తెలుసుకుందాం.
కథ
దృశ్యం మొదటి భాగంలో రాంబాబు(వెంకటేష్) వరుణ్ డెడ్ బాడీని పోలీస్ స్టేషన్ కింద పాతిపెడతాడు. దీంతో రాంబాబు, అతని కుటుంబం సేఫ్‌గా పోలీసుల కళ్ళ నుంచి తప్పించుకుంటారు. అయితే “దృశ్యం పార్ట్ 2” లో వరుణ్ కుటుంబ సభ్యులు.. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ఒక సూపర్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ సంపత్‌ను రంగంలోకి దించుతారు. పోలీస్ ఆఫీసర్ సంపత్ కొన్ని ఆధారాలు సేకరించి రాంబాబు కుటుంబంపై FIR ఫైల్ చేస్తాడు. రాంబాబు మరోసారి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడనేదే ఇంట్రెస్టింగ్ పార్ట్.
ప్లస్ పాయింట్స్
వెంకటేష్ సహజంగా ఫ్యామిలీ డ్రామాలో ఇమిడి పోతారు. దృశ్యం పార్ట్ 2లో వెంకటేష్ పర్ఫార్మెన్స్ సూపర్‌గా ఉంది. ఆయనకు భార్యగా మీనా నటన ఎక్సలెంట్‌గా సాగింది. పోలీస్ ఆఫీసర్‌గా సత్యం రాజేష్ అదరగొట్టాడు. తన మాస్ అప్పీయరెన్సు, పోలీస్ బాడీ లాంగ్వేజ్‌తో షో ని స్టిల్ చేశాడు. సినిమా మొత్తం ఎక్కడ బోర్ కొట్టకుండా, కన్‌ఫ్యూస్ లేకుండా దర్శకుడు జీతూ జోసెఫ్ అద్భుతంగా తెరకెక్కించాడు.
మైనస్ పాయింట్స్
ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత కిక్ సెకండ్ పార్ట్‌లో లేదు . ఆడియన్స్ అంచనాలకు దృశ్యం 2 రీచ్ కాలేక పోయింది. మూవీ స్టార్ట్ అవ్వగానే కథ స్లో గా నడిచిందన్న ఫీల్ కలిగింది.
తారాగణం
మూవీ: దృశ్యం 2
నటీనటులు : వెంకటేష్, మీన, తనికెళ్ళ భరణి, నదియా, నరేష్, సంపత్ రాజ్, కృతిక, జయకుమార్, ఎస్తేర్ అనిల్
దర్శకుడు: జీతూ జోసెఫ్
నిర్మాతలు: డి. సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి
సంగీతం: అనూప్ రూబెన్స్
‘సినిమాటోగ్రఫీ: సతీష్ కురుప్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
రిలీజ్ డేట్: నవంబర్ 25, 2021
ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో
రేటింగ్ : 2.5
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!