వరుణ్ తేజ్ (Varun Tej) లేటెస్ట్ చిత్రం ‘మట్కా’ను అల్లు అర్జున్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇటీవల మట్కా ఈవెంట్‌లో మాట్లాడిన వరుణ్ తేజ్ పరోక్షంగా బన్నీకి చురకలు అంటించారు. ‘జీవితంలో మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన వెనకాల ఎవరున్నారన్నది మర్చిపోతే ఆ విజయం దేనికీ పనికి రాదు’ అంటూ వరుణ్ వ్యాఖ్యానించాడు. దీనిని పర్సనల్‌గా తీసుకున్న బన్నీ ఫ్యాన్స్ ‘మట్కా’పై రివేంజ్ తీర్చుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆ పోస్టులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
మట్కా వన్ వర్డ్ రివ్యూ అంటు బన్నీ అభిమాని ఎక్స్‌లో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ అవుతోంది. మట్కా చూసి బయటకు వచ్చిన ఓ ఆడియన్ ‘ఈ మూవీ పెద్ద డిజాస్టర్. దీనిని తెలంగాణ వాదులు, సమైక్యవాదులు ఆపోద్దు. ఎందుకంటే మధ్యాహ్నానికి ఇదే ఆగిపోతుంది’ అంటూ చెప్తాడు. దీనిని బన్నీ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు.
వరుణ్ తేజ్ ‘మట్కా’ చిత్రాన్ని చూసేందుకు ఎవరు ఇష్టపడటం లేదంటూ రెడీ సినిమాలోని బ్రహ్మీ తలబాదుకునే సీన్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
టికెట్స్ బుకింగ్స్‌లో ‘సన్ ఆఫ్ ఇండియా’ రికార్డ్స్‌ను మట్కా బద్దలు కొట్టిందని బన్నీ అభిమాని ఓ పోస్టు పెట్టాడు. ఓ థియేటర్‌లో ఖాళీగా ఉన్న సీట్లను హైలెట్ చేశాడు.
అందరూ సూర్య నటించిన కంగువా గురించే మాట్లాడుకుంటున్నారని, మరి మట్కా పరిస్థితి ఏంటంటూ ఓ నెటిజన్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
మట్కా ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటాన్ని హైలెట్ చేస్తూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ‘మెగా ఫ్యాన్స్ సపోర్ట్ లేదా సార్‌కి?’ అంటూ పోస్టు చేశాడు.
మెగా ఫ్యాన్స్ వరుణ్ తేజ్‌ను మోసం చేశారని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. మెగా అభిమానుల మద్దతు ట్విటర్ వరకే ఉంటుందని, థియేటర్లకు వారు వెళ్లరని అతడు ఆరోపించారు.
మట్కాకు పోయే ధైర్యం లేక టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసుకున్నట్లు ఓ వ్యక్తి ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. దీంతో సినిమా అంత దారుణంగా ఉందా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
‘మట్కా’ గురించి మెగా ఫ్యాన్స్ తప్పా మరే ఇతర హీరో అభిమానులు పాజిటివ్‌గా చెప్పడం లేదంటూ ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు.
అల్లు అర్జున్ ఫ్యాన్స్ వరుణ్ తేజ్‌పై ఏ విధంగా దాడి చేస్తున్నారో అద్దంపట్టేలా మహేష్ అభిమాని పెట్టిన వీడియో ఎక్స్‌లో వైరల్ అవుతోంది.
‘మట్కా’ డే 1 కలెక్షన్స్ గురించి కూడా నెట్టింట ట్రోల్స్ మెుదలయ్యాయి. తొలి రోజు వసూళ్లు చూసి షాకవ్వడం పక్కా అని అర్థం వచ్చేలా బ్రహ్మీ వీడియోను ట్రెండ్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మెగా ఆడియన్స్ నుంచి మాత్రం మట్కాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వరుణ్ తేజ్ ర్యాంప్ ఆడించాడని వారు పోస్టులు చేస్తున్నారు.
మెగా ఫ్యామిలీ నుంచి ఒక బ్లాక్ బాస్టర్ మట్కా రూపంలో వచ్చేసిందని ఓ ఫ్యాన్ పోస్టు పెట్టాడు. తర్వాత ‘గేమ్ ఛేంజర్’తో మరో బ్లాక్ బాస్టర్ రాబోతోందని రాసుకొచ్చాడు.
మట్కా విజయవంతం అయినందుకు పవన్ ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
మట్కా సినిమా చాలా బాగుందని కావాలనే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారని సినిమా చూసిన అభిమానులు చెబుతున్నారు.
Featured Articles Movie News
Dil Raju: అన్ని చేస్తాం.. అన్నింటికీ చెక్ పెడతాం