మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోగా దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన చిత్రం ‘మట్కా’ (Matka). మీనాక్షి చౌదరి హీరోయిన్గా చేసింది. బాలీవుడ్ భామా నోరా ఫతేహి మరో కీలక పాత్రలో నటించింది. గురువారం(నవంబర్ 14న) గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రం బృందం చురుగ్గా ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఆడియన్స్‌లో తమ మూవీపై హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే నటుడు వరుణ్ తేజ్ సైతం వినూత్న ప్రమోషన్స్ (Matka Promotions)కు తెరతీశాడు. తన పాత్ర చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని అతడు చేసిన ఓ వీడియో సినీ ఆడియన్స్‌ను విశేషంగా ఆకర్షిస్తోంది.
ఇదెక్కడి మాస్ ప్రమోషన్స్!
మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నాగబాబు తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. 2014లో వచ్చిన ‘ముకుంద’తో తెలుగు ఆడియన్స్‌కు తొలిసారి పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘కంచె’, ‘ఫిదా’, ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలు చేశాడు. అలాగే లోఫర్, మిస్టర్, ‘గాండీవధారి అర్జున’ వంటి ఫ్లాప్‌లు కూడా తీశాడు. ఇదిలా ఉంటే ‘మట్కా’ ప్రమోషన్స్‌లో భాగంగా తన చిత్రాలను రిఫరెన్స్‌గా తీసుకొని వరుణ్ ఓ ఆసక్తికర వీడియోను చేశాడు. కెరీర్లో ఇప్పటివరకూ చేసిన హిట్, ఫ్లాప్ చిత్రాలు ఎదురుపడితే తన రియాక్షన్ ఎలా ఉంటుందో చేసి చూపించాడు. ఒక్కో వ్యక్తిని ఒక్కో సినిమాగా భావిస్తూ తన ఫీలింగ్స్‌ను పంచుకున్నాడు. చివర్లో ‘మట్కా’గా వచ్చిన వ్యక్తికి బిగ్ హగ్ ఇచ్చి బాగా ప్రమోట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోపై మీరు ఓ లుక్కేయండి.
తిరుమలలో ‘మట్కా’ టీమ్!
తిరుమల శ్రీవారిని ‘మట్కా’ (Matka Promotions) చిత్రబృందం ఇవాళ (నవంబర్ 13) తెల్లవారుజామున దర్శించుకుంది. వీఐపీ దర్శన సమయంలో నటుడు వరుణ్ తేజ్, చిత్ర యూనిట్ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో చిత్ర యూనిట్‌కు పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. గురువారం ‘మట్కా’ సినిమా విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు వరుణ్ తెలిపారు. తిరుమలలో మట్కా టీమ్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
వరుణ్ మేకోవర్ చూశారా?
మట్కా సినిమాలో వరుణ్ తేజ్ శివ అనే పాత్ర పోషించాడు. మట్కా జూదాన్ని ప్రారంభించిన రతన్ ఖాత్రి అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా దీన్ని రూపొందించారు. 1970-90 ప్రాంతంలో వైజాగ్ పరిస్థితులను ఈ చిత్రంలో కళ్లకు కట్టనున్నారు. ఇదిలా ఉంటే వాసు పాత్ర కోసం వరుణ్ తేజ్ పూర్తిగా తన గెటప్‌ను మార్చుకున్నాడు. తన హెయిర్‌స్టైల్, కాస్ట్యూమ్స్‌ను 1970వ దశకానికి అనుగుణంగా మార్చుకున్నాడు. ఆ పాత్రలకు వరుణ్ ఏ విధంగా మారాడో తెలియజేసే వీడియోను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ అవుతోంది. మరోవైపు ఓవర్సీస్లో ఏ ఏ థియేటర్లలో తమ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారో ఓ పోస్టర్ ద్వారా మట్కా టీమ్ తెలియజేసింది.
సెన్సార్ రివ్యూ
వరుణ్ తేజ్ మట్కా (Matka Promotions) చిత్రం తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు యూఏ (U/A) సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలియజేశారు. ఇంటర్వెల్ ముందు నాలుగు ఫైట్స్ ఉంటాయని సమాచారం. ఆ నాలుగూ బాగా వచ్చాయని టాక్. ఇక క్లైమాక్స్‌లో వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. దర్శకుడు కరుణ కుమార్ రాసిన కథ, తీసిన తీరు సెన్సార్ సభ్యులకు బాగా నచ్చిందట. డైలాగులు కూడా నెక్స్ట్ లెవల్లో ఉన్నాయని వారు ఫీలయ్యారట. మట్కా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ చాలా ఎంగేజింగ్‌గా ఉన్నట్లు వారు భావించారట. క్యారెక్టర్ పరంగా వరుణ్ తేజ్ గెటప్స్ హైలైట్ అవుతాయని టాక్. నటుడిగా వరుణ్ తేజ్ మరో మెట్టు ఎక్కే సినిమా ‘మట్కా’ అవుతుందని అంటున్నారు.
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ