
వందేమాతరం శ్రీనివాస్
జననం : సెప్టెంబర్ 09 , 1964
వందేమాతరం శ్రీనివాస్ అసలు పేరు కన్నెబోయిన శ్రీనివాస్. తెలుగులో ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుడు, గాయకుడు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో 250కి పైగా సినిమాలకు స్వరాలు అందించారు. డైరెక్టర్ టి. కృష్ణ వందేమాతరం సినిమాలో 'వందేమాతర గీతం వరసమారుతున్నది' అనే పాటతో నేపథ్య గాయకుడిగా పరిచయమయ్యాడు. ఈ పాటతో తన పేరులో వందేమాతరం వచ్చి చేరింది. ఇతడు ప్రజా నాట్యమండలిలో గాయకుడిగా ఉంటూ తదనంతరం ప్రజా ఉద్యమాల దర్శకుడిగా ప్రఖ్యాతి పొందిన ఆర్.నారాయణమూర్తి సినిమాలతో వెలుగులోకొచ్చాడు. అతడి సినిమాలకే అత్యధికంగా సంగీతాన్ని అందించి, పలు గీతాలు రాయడం, పాడటం చేసాడు. విప్లవ చిత్రాలతో గుర్తింపు పొందిన శ్రీనివాస్, దేవుళ్ళు చిత్రంలో భక్తి పరమైన గీతాలను అందించి తనలోని వైవిధ్యాన్ని చాటాడు. ఆయుధం, దేవుళ్లు, ఎర్రసైన్యం, దండోరా, లాల్‌సలాం, ఎర్రోడు, ఓసెయ్ రాములమ్మ, ఒరేయ్ రిక్షా, ఎన్‌కౌంటర్, మిస్సమ్మ(2003), జయంమనదేరా వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించారు. వందేమాతరం శ్రీనివాస్ సినిమాలకే కాక టీవీ సీరియళ్ళకు కూడా నేపథ్య సంగీతం అందించారు. 9 నంది అవార్డులు, 9 సార్లు భరతముని పురస్కారాలు, 6 సార్లు మద్రాసు కళాసాగర్ అవార్డు, సాలూరి రాజేశ్వర రావు, ఎం. ఎస్. విశ్వనాథన్ స్మారక పురస్కారాలు అందుకున్నారు.

సీమ టపాకాయ్
13 మే 2011 న విడుదలైంది

రాజా వారి చేపల చెరువు
15 మే 2009 న విడుదలైంది
.jpeg)
మేస్త్రి
12 మార్చి 2009 న విడుదలైంది

గజీబీజీ
08 ఆగస్టు 2008 న విడుదలైంది

సీమా శాస్త్రి
16 నవంబర్ 2007 న విడుదలైంది

సామాన్యుడు
19 అక్టోబర్ 2006 న విడుదలైంది

గుడ్ బాయ్
22 సెప్టెంబర్ 2005 న విడుదలైంది

ఒక్కడే - ఆఫీసర్ ఆన్ డ్యూటీ
01 సెప్టెంబర్ 2005 న విడుదలైంది
.jpeg)
అయోధ్య
21 ఏప్రిల్ 2005 న విడుదలైంది

సదా మీ సేవలో
25 మార్చి 2005 న విడుదలైంది

శ్రావణమాసం
26 ఫిబ్రవరి 2005 న విడుదలైంది
వందేమాతరం శ్రీనివాస్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వందేమాతరం శ్రీనివాస్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.