విజయ్
ప్రదేశం: మద్రాసు, తమిళనాడు, భారతదేశం, (ప్రస్తుత చెన్నై)
విజయ్ దక్షిణాదికి చెందిన ప్రముఖ హీరో. మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు. వెట్రి (1984) సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా విజయ్ కెరీర్ ప్రారంభించారు. 'నాలయ్య తీర్పు' (1992) అనే సినిమాతో హీరోగా మారాడు. తుపాకీ, మాస్టర్, కత్తి, బీస్ట్, లియో చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ పాపులర్ అయ్యాడు. ఇటీవల 'తమిళగ వెట్రి కజగం' అనే పార్టీని స్థాపించి తమిళ రాజకీయాల్లోకి వెళ్లేందుకు విజయ్ సిద్ధమయ్యాడు.
విజయ్ వయసు ఎంత?
విజయ్ వయసు 50 సంవత్సరాలు
విజయ్ ముద్దు పేరు ఏంటి?
ఇళయదళపతి
విజయ్ ఎత్తు ఎంత?
5' 10'' (178 cm)
విజయ్ అభిరుచులు ఏంటి?
డ్యాన్సింగ్, సింగింగ్
విజయ్ ఏం చదువుకున్నారు?
బీఏ (డ్రాప్ ఔట్)
విజయ్ ఏ విద్యాసంస్థల్లో చదువుకున్నారు?
ఫాతిమా మెట్రిక్యూలేషన్ హైయర్ సెకండరీ స్కూల్, కొడంబక్కం
బాలలోక్ మెట్రిక్ హైయర్ సెకండరీ స్కూల్, చెన్నై
లయోలా కాలేజ్, చెన్నై
విజయ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు?
శ్రీనాథ్, సంజీవ్
విజయ్ ఇప్పటివరకూ చేసిన తెలుగు చిత్రాలు ఏవి?
విజయ్ తెలుగులో నేరుగా చేసిన ఒకే ఒక్క ఫిల్మ్ 'వారసుడు'. అతడు తమిళంలో చేసిన చాలా వరకూ చిత్రాలు తెలుగులోనూ రిలీజై అతడికి పాపులారిటీ తెచ్చిపెట్టాయి. విజయ్ 2024 వరకూ 68 చిత్రాల్లో నటించాడు.
విజయ్ అన్ కేటగిరైజ్డ్ ఇమేజెస్
లియో
యాక్షన్ , థ్రిల్లర్
తుప్పాకి
యాక్షన్ , థ్రిల్లర్
పోలీసోడు
యాక్షన్ , థ్రిల్లర్
విజిల్
యాక్షన్
మాస్టర్
యాక్షన్ , థ్రిల్లర్
బీస్ట్
యాక్షన్ , క్రైమ్
ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్
లియో
బీస్ట్
మాస్టర్
విజిల్
సర్కార్
అదిరింది
ఏజెంట్ భైరవ
పోలీసోడు
పులి
జిల్లా
తుప్పాకి
విజయ్ తల్లిదండ్రులు ఎవరు?
విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు, తల్లి శోభ చంద్రశేఖర్ సినిమా నేపథ్యగాయని.
విజయ్ సోదరుడు/సోదరి పేరు ఏంటి?
విజయ్‌కు బ్రదర్స్ లేరు. విద్య అనే సోదరి ఉండేది. అయితే రెండేళ్ల వయసులో అనారోగ్యం కారణంగా చనిపోయింది.
విజయ్ పెళ్లి ఎప్పుడు అయింది?
కాస్ట్యూమ్ డిజైనర్ సంగీతను 1999 ఆగస్టు 25న విజయ్ పెళ్లి చేసుకున్నారు.
విజయ్ కు పిల్లలు ఎంత మంది?
విజయ్‌కు ఒక పాప, బాబు ఉన్నారు. వారి పేరు జసన్ సంజయ్, దివ్య సాషా.
విజయ్ ఫేమస్ అవ్వడానికి రీజన్ ఏంటి?
విజయ్ లీడ్ రోల్‌లో చేసిన తొలి తెలుగు చిత్రం ఏది?
వెట్రి (1984) సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా విజయ్ కెరీర్ ప్రారంభించారు. 'నాలయ్య తీర్పు' (1992) అనే సినిమాతో హీరోగా మారాడు. విజయ్ కెరీర్‌లో వచ్చిన చాలా వరకూ చిత్రాలు తెలుగు నుంచి తీసుకొని రీమేక్ చేయబడినవే.
రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన విజయ్ తొలి చిత్రం ఏది?
విజయ్ కెరీర్‌లో అత్యత్తుమ పాత్ర ఏది?
తుపాాకి, కత్తి చిత్రాల్లోని పాత్రలు విజయ్ కెరీర్‌లో అత్యుత్తమమైనవి.
విజయ్ బెస్ట్ స్టేజ్ పర్‌ఫార్మెన్స్ వీడియోలు?
విజయ్ బెస్ట్ డైలాగ్స్ వీడియోలు ఏవి?
విజయ్ రెమ్యూనరేషన్ ఎంత?
విజయ్ ఒక్కో సినిమాకు రూ.100-150 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. తన లేటెస్ట్ చిత్రం G.O.A.T మూవీకి ఏకంగా రూ.200 కోట్లు తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
విజయ్ కు ఇష్టమైన ఆహారం ఏంటి?
చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ విత్ దోశ
విజయ్ కు ఇష్టమైన నటుడు ఎవరు?
విజయ్ కు ఇష్టమైన నటి ఎవరు?
విజయ్ ఎన్ని భాషలు మాట్లాడగలరు?
తమిళం, ఇంగ్లీషు
విజయ్ ఫేవరేట్ కలర్ ఏంటి?
బ్లూ, బ్లాక్
విజయ్ ఫేవరేట్ క్రీడ ఏది?
క్రికెట్
విజయ్ ఫేవరేట్ క్రికెట్ ప్లేయర్లు ఎవరు?
ఎం.ఎస్ ధోని
విజయ్ వద్ద ఉన్న లగ్జరీ కార్లు ఏవి?
• Audi A8 L
• BMW 7 Series
• BMW X6
• Mercedes Benz GLA
• Land Rover Range Rover Evoque
• Ford Mustang
• BMW 5 Series
• Volvo XC90
• Benz E350D
• BMW 3 Series
• Mini Cooper S
• Toyota Innova Crysta
• Maruti Suzuki Celerio
• BMW i7 xDrive60 electric car
విజయ్ ఆస్తుల విలువ (నెట్‌వర్త్) ఎంత?
విజయ్ ఆస్తుల విలువ రూ. 474 కోట్ల వరకూ ఉంటుందని అంచనా.
విజయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య?
11.5 మిలియన్లు
విజయ్ సోషల్ మీడియా లింక్స్
విజయ్ కి ఎన్ని అవార్డులు వచ్చాయి?
ఒసాకా అవార్డ్ - 2023
'మాస్టర్' చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపిక
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ - 1997
'కధలుక్కు మరియాదై' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపిక
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ - 2000
టతుల్లధ మనముం తుల్లుం' చిత్రానికి ఎంజీఆర్ అవార్డ్ తీసుకున్నారు
తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్ - 2005
'తిరుపాచి' చిత్రానికి బెస్ట్ యాక్టర్‌గా ఎంపిక
సైమా అవార్డ్స్ సౌత్ - 2016
'తేరి' చిత్రానికి గాను బెస్ట్ ఎంటర్‌టైనర్ అవార్డు
ఆసియానెట్ ఫిల్మ్ అవార్డ్ - 2010
మోస్ట్ పాపులర్ తమిళ్ యాక్టర్‌గా స్పెషల్ అవార్డ్ తీసుకున్నారు
జీ సినీ అవార్డ్ - 2020
'బిగిల్' చిత్రానికి గాను ఫేవరేట్ హీరోగా అవార్డ్ అందుకున్నారు
విజయ్ కు సంబంధించిన వివాదాలు?
- 2015-16లో రూ.15 కోట్లకు పన్ను చెల్లించని కారణంగా విజయ్‌కు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ రూ.1.5 కోట్లు పెనాల్టీ వేయడం చర్చనీయాంశంగా మారింది.
- మెర్సల్ (2017) సినిమాలో విజయ్ చెప్పిన ఓ డైలాగ్ వివాదానికి దారి తీసింది. గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు కన్నా ఆసుపత్రులు ఉండటం ఎంతో ముఖ్యమని ఈ మూవీలో విజయ్ అంటాడు. దీనిపై హిందు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
- 2023 జులై 11న ట్రాఫిక్ సిగ్నల్‌ను విజయ్ కారు జంప్ చేయడంతో పోలీసులు అతడి వాహనానికి రూ.500 జరిమానా విధించారు. ఈ ఘటనను పలు వార్త చానళ్లు హైలెట్ చేశాయి.
విజయ్ ఎలాంటి వ్యాపార ప్రకటనల్లో నటిస్తున్నారు?
జోసాలుక్కాస్, పరక్కత్ జ్యూయలరీస్ తదితర ప్రకటనల్లో విజయ్ నటించారు.
విజయ్ కు ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా?
విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2 ఫిబ్రవరి 2024న 'తమిళగ వెట్రి కజగం' పార్టీని స్థాపించారు. G.O.A.T మూవీ తర్వాత సినిమాలకు స్వస్థి పలికి రాజకీయాల్లో ఫుల్‌గా బిజీగా అవుతారని సమాచారం.
విజయ్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్ డేట్, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే విజయ్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.