• TFIDB EN
  • వినాయకన్
    ప్రదేశం: తోప్పిల్ జంక్షన్, ఎడపల్లి, కేరళ, భారతదేశం
    వినాయకన్ T. K. ఒక భారతీయ నటుడు, నేపథ్య గాయకుడు మరియు స్వరకర్త, అతను ప్రధానంగా మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతను కొన్ని తమిళ భాషా చిత్రాలలో కూడా కనిపించాడు. అతను 1995 చిత్రం మాంత్రికంలో అతిధి పాత్రతో తన వృత్తిని ప్రారంభించాడు. ఆ తర్వాత రెండు సినిమాలు సపోర్టింగ్ రోల్స్‌తో పాటు కమెడియన్ రోల్స్ కూడా చేశాడు.
    Saif Ali Khan in Devara: మరో అమ్రిష్ పురి దొరికినట్టేనా.. విలన్‌గా షేక్ చేస్తున్న సైఫ్..!
    Saif Ali Khan in Devara: మరో అమ్రిష్ పురి దొరికినట్టేనా.. విలన్‌గా షేక్ చేస్తున్న సైఫ్..! తెలుగులో విలన్ అంటే కొందరే గుర్తుకొస్తారు. రావు గోపాల్‌రావు, అమ్రిష్ పురి, సోనూ సూద్ వంటి నటులు విలన్లుగా మరపురాని పాత్రలు పోషించారు. వీరి డైలాగ్, డిక్షన్, యాక్టింగ్.. యూనిక్‌గా ఉంటాయి. ఆ తర్వాత బాలకృష్ణ లెజెండ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. నెరిసిన గడ్డంతో ఓ రెండు, మూడు సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ, పర్మనెంట్‌గా ఈ పాత్రలో ఒదగలేక పోయాడు. ఇక, ఇద్దరు, ముగ్గురు నటులు విలన్ రోల్స్‌లో ట్రై చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. ఎప్పటి నుంచో అలా ఈ విలన్ సీటు ఖాళీగా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో విలన్ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). విలన్ రోల్స్‌కి తానే పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ముందుకు వస్తున్నాడు.   https://twitter.com/tarak9999/status/1691728962731589669?s=20 దేవరలో ‘భైరా’గా జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఇందులో విలన్‌గా  సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు(August 16) సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan BirthDay) పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి అతడి లుక్ విడుదలైంది. ఈ లుక్ ఆకట్టుకుంటోంది. పొడవాటి ఉంగరాల జుట్టుతో కనిపించి సినిమాపై మరింత అంచనాలు పెంచాడు. మాసిన గడ్డం, చూసే చూపుతో నెగెటివ్ ఛాయలను ముఖంలో ప్రదర్శించేశాడు. మరి, ‘భైరా’గా సైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందో తెరపై చూడాల్సిందే.  ఆదిపురుష్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సైఫ్ ‘లంకేష్’ పాత్రను పోషించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ విలన్‌గా సైఫ్ మెప్పించాడు. తన నటనతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు న్యాయం చేశాడు.  హిందీ చిత్రాలు 30 ఏళ్ల సినీ కెరీర్‌లో సైఫ్ అలీ ఖాన్ పలు విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆదిపురుష్ సినిమాకు ముందు సైఫ్ అలీ ఖాన్ ‘తానాజీ’(Tanhaji) చిత్రంలో నటించాడు. ఇందులో ‘ఉదయ్ భాను సింగ్ రాథోడ్’ అనే పాత్రను పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ చిత్రాన్ని కూడా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించడం గమనార్హం.  2009లో విడుదలైన కుర్భాన్(Kurbaan) సినిమాలోనూ సైఫ్ విలన్ రోల్ చేశాడు. రాడికల్ టెర్రరిస్టు ‘ఖలీద్’ పాత్రలో నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. 2006లో విడుదలైన ‘ఓంకార’(Omkara) సినిమాను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇందులో సైఫ్ చేసిన రోల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సైఫ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు 2004లో వచ్చిన ‘ఏక్ హసన్ థీ’ సినిమాలోనూ కరణ్ సింగ్ రాథోడ్‌గా నటించాడు.  ఫ్యూచర్ విలన్ ప్రస్తుతం టాలీవుడ్‌ బలమైన విలన్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గడమూ ఇందుకు కారణం. అయితే, పవర్ ఫుల్ విలన్ రోల్స్ కోసం స్టార్ నటులను, ఇతర ఇండస్ట్రీ యాక్టర్లను ఒప్పించే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సైఫ్ ‘దేవర’ సినిమాతో వస్తున్నాడు. కండలు తిరిగిన దేహం సైఫ్‌కి ఉండటం మరో అడ్వాంటేజీ. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే ఇక సైఫ్ అలీ ఖాన్‌కి తిరుగుండదు. సైఫ్ యాక్టింగ్ తెలిసిన వారు ఈ విషయాన్ని కచ్చితంగా చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఫ్యూచర్ విలన్‌గా సైఫ్ మారగలడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
    ఆగస్టు 16 , 2023
    ADIPURUSH REVIEW: రాముడిగా ప్రభాస్‌ సూపర్‌… ఐదేళ్ల తర్వాత ప్రభాస్‌కు హిట్‌ వచ్చినట్లేనా? నటీనటులు: ప్రభాస్, కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్, దేవదత్త నాగె, సన్నీ, తదితరులు. డైరెక్టర్: ఓం రౌత్ నిర్మాత: భూషణ్ కుమార్, ప్రసాద్ సుతార్, కృష్ణ కుమార్, ఓం రౌత్. మ్యూజిక్: అజయ్-అతుల్, సాచిత్ పరంపర ఐదేళ్లుగా ప్రభాస్‌కు ఒక్క హిట్ లేదు. అందుకే, గతేడాది నుంచి ప్రభాస్ అభిమానులు ‘ఆదిపురుష్’ కోసం ఆశగా ఎదురు చూశారు. సాంకేతిక కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు నేడు(జూన్ 16) విడుదలైంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ఎంతో ఆకట్టుకున్నాయి. సెలబ్రిటీలు కూడా ముందుకు వచ్చి భారీ ఎత్తున టికెట్లు కొనుగోలు చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి, థియేటర్లలో ప్రేక్షకుడిని ఆదిపురుష్ మెప్పించిందా? రామాయణ కథను ఆదిపురుష్ ఎంత కొత్తగా ఆవిష్కరించింది? వంటి విషయాలు రివ్యూలో తెలుసుకుందాం.  అదే కథ.. రామాయణం కథ అందరికీ తెలిసిందే. రాముడు మర్యాద పురుషోత్తముడు. విలువలను పాటించడంలో రాముడికి సాటెవరూ లేరు. అందుకే ఎన్ని యుగాలైనా ఇప్పటికీ రామాయణ కథను వింటూనే ఉన్నాం. ఆదిపురుష్‌లోనూ అదే కథ. ఈ సినిమాలో రాఘవ(ప్రభాస్) వనవాసం స్వీకరించిన ఘట్టం నుంచి కథ ప్రారంభం అవుతుంది. జానకి(కృతిసనన్), సోదరుడు శేషు(సన్నీ సింగ్)లతో కలిసి వనవాసం చేస్తుంటాడు. ఈ క్రమంలో శూర్పనక చెప్పుడు మాటలతో లంకేశ్(సైఫ్ అలీ ఖాన్) జానకిని అపహరిస్తాడు. జానకిని రాఘవ ఎలా కనిపెట్టాడు? లంక నుంచి తిరిగి తీసుకు రావడానికి ఏం చేశాడనేది తెరపై చూడాల్సిందే.  ఎలా ఉంది? రాఘవ, జానకిల కథని కొత్తగా చూపించడంలో ఆదిపురుష్ కొద్దిమేరకు సఫలం అయింది. ఇతిహాసాన్ని నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఆదిపురుష్ ప్రతిబింబించింది. రాఘవ, హనుమ, లంకేశుడికి మరింత శక్తిని ఆపాదిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. విజువల్ ఎఫెక్ట్స్‌తో కూడిన పోరాట సన్నివేశాలతో ప్రేక్షకులను మరింత మైమరిపిస్తుంది. ముఖ్యంగా, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలం చేకూర్చాయి. ఫస్టాఫ్‌లో ఎమోషనల్ డ్రామా కొనసాగుతుంది. సెకండాఫ్‌లో ఇక పూర్తిగా పోరాట సన్నివేశాలే. రామ్ సీతా రామ్, జైశ్రీరామ్ పాటలు వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంటుంది. హనుమంతుడి చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే, వీఎఫ్ఎక్స్‌పై మరింత దృష్టి సారించాల్సింది. రావణుడి గెటప్‌ డిజైన్‌ కాస్త వెగటుగా ఉంటుంది. సాగతీత సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. అతిగా గ్రాఫిక్స్ వాడటంతో నటీనటుల పర్ఫార్మెన్స్‌‌ మరుగున పడినట్లయింది. వాల్మీకి రామాయణం పరంగా లంక సుందరమైన నగరం. ఇందులో ఏదో రాక్షస గుహలా కనిపించడం ప్రేక్షకుడికి రుచించదు. 2Dలో కన్నా 3Dలో చూస్తే మెరుగైన అనుభూతిని పొందవచ్చు. ఎవరెలా చేశారు? రాఘవగా ప్రభాస్, జానకిగా కృతిసనన్ నటనతో మెప్పించారు. వీరి మధ్య వచ్చే సన్నివేశాలను చక్కగా పండించారు. పతాక సన్నివేశాల్లో నటనతో ప్రేక్షకుడిని కంటతడి పెట్టిస్తారు. లంకేశుడిగా సైఫ్ అలీ ఖాన్ ఫర్వాలేదనిపించాడు. తన పరిధి మేరకు నటించగలిగాడు. హనుమంతుడిగా దేవదత్త నాగె అద్భుతంగా నటించాడు. రాఘవతో జరిగే సన్నివేశాల్లో హనుమ వినయాన్ని తెరపై కనబరిచాడు. లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్ ఒకే అనిపించాడు.  టెక్నికల్‌గా  రామాయణ కథను విజువల్ వండర్‌గా చూపించాలన్న ఓం రౌత్ ఆలోచనను మెచ్చుకోవాల్సిందే. పౌరాణిక పాత్రలకు సూపర్ పవర్ కల్పిస్తే ఎలా ఉంటుందని చిత్రంలో చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. కానీ, లంకేశుడిని అలా ఎందుకు చూపించాడో అర్థం కాలేదు. పది తలలను ఒకే వరుసలో కాకుండా ఐదు తలలు కింద, ఐదు తలలు మీద చూపించడంలో ఆంతర్యం బోధపడలేదు. లంకను డిజైన్ చేసిన తీరు బాగోదు. ఇక, సినిమాటోగ్రఫీ బాగుంది. వీఎఫ్ఎక్స్‌పై మరింత ఫోకస్ పెట్టాల్సింది. అజయ్, అతుల్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇవ్వడంలో సంచిత్, అంకిత్ సక్సెస్ అయ్యారు. అయితే, ఎడిటర్ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది.  ప్లస్ పాయింట్స్ నటీనటులు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ పోరాట సన్నివేశాలు మైనస్ పాయింట్స్ గ్రాఫిక్స్ సాగతీత సన్నివేశాలు ఎడిటింగ్ చివరగా.. ఓం రౌత్ ‘ఆదిపురుష్’ని ఒక్కసారి వీక్షించొచ్చు. రేటింగ్: 2.75/5
    జూన్ 16 , 2023
    Devara Dialogues : గూస్‌బంప్ తెప్పించిన దేవర టాప్ డైలాగ్స్ ఇవే జూ.ఎన్టీఆర్‌ (Jr.NTR) హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. జూ.ఎన్టీఆర్‌ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేశాడు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషించాడు. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషించారు. సినిమా కథను కొరటాల చాలా జాగ్రత్తగా రాసుకున్నారు. ఆచార్య అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా సినిమా డైలాగ్స్ చాలా ప్రభావవంతంగా ఉన్నాయి. సినిమా పూర్తైన తర్వాత కూడా ఆ డైలాగ్స్ వెంటాడుతాయి. ముఖ్యంగా జూ.ఎన్టీఆర్, ప్రకాశ్ రాజ్, సైఫ్‌ అలీఖాన్, జాన్వీకపూర్ ఆయ పాత్రలకు అనుగుణంగా చెప్పే డైలాగ్స్ విజిల్స్ కొట్టిస్తాయి. [toc] బైరా(సైఫ్ అలీ ఖాన్) డైలాగ్: “ఎర్ర సముద్రం కాడికి వచ్చి రక్తం గురించి మాట్లాడుతుండావా.. నాకు చావు గురించి చెబుతుండావా” అక్కడి నుంచి తప్పించుకున్న అజయ్, ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్లినప్పుడూ… ప్రకాశ్ రాజ్ డైలాగ్: కొండ మీదకొచ్చి భయపెడుదామనుకున్నావా అజయ్ : ఎవడ్రా నువ్వు ప్రకాశ్ రాజ్: సింగప్పా.. నువు దిగివచ్చిన కొండ మీద తూర్పు దిక్కున ఉంటాను అజయ్: నేను ఇక్కడికో పనిమీద వచ్చాను. పెద్దాయనవి, మీ వాళ్లకు ఓ మాట చెప్పి ఒప్పించగలవా..! సముద్రంపై పడవలో వెళ్తున్న సమయంలో వచ్చే డైలాగ్స్… అజయ్ తన డైమండ్ ఉంగరం కోసం సముద్రంలో దూకి.. లోపల ఆస్తి పంజరాలు చూసి భయపడినప్పుడు.. ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్ బాగుటుంది. ప్రకాశ్ రాజ్: “వజ్రపు ఉంగరం దొరికిందా? సముద్రంలో నీకు కానొచ్చిన దాని భయంతో వజ్రం గుర్తుకు రాలే.! ఈ భయమే నీలాంటి వాళ్లు ఎంత మంది వచ్చినా, ఎంత ఆశ చూపినా, ఇక్కడ ఉన్నవాళ్లు ఈ సముద్రం జోలికి మాత్రం రారు.” ప్రకాశ్ రాజ్ దేవరను పరిచయం చేస్తూ చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయిస్తుంది. అజయ్: కళ్లు మూసినా, తెరిసినా సముద్రంలో చూసిందే కనిపిస్తోంది. అసలు ఎవరు వాళ్లంతా.. ఎవరు చేశారు ఇదంతా? ప్రకాశ్ రాజ్: “చాలా పెద్ద కథ సామీ, రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ“ అజయ్: ఎవరి కథ ప్రకాశ్ రాజ్: పడి పడి లేచే సముద్రం మీద పడకుండా నిలబడిన వాడి కథ.. మా దేవర కథ. “భయం పోవాలంటే దేవుడి కథ వినాలా,  భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలా” ”కులం లేదు, మతం లేదు, భయం లేదు వారికి తెలిసింది ధైర్యమే” దేవర… తన కొడుకు వరంకు తన తండ్రి గురించే చెప్పే సందర్భంలోని డైలాగ్స్‌ కూడా బాగుంటాయి. (Devara Movie Dialogues) వరం(జూ.ఎన్టీఆర్): అబ్బా ఎప్పుడూ మీ నాన్న కథలు, వాళ్ల నాన్న కథలు చెబుతుంటావ్..! మా నాన్న కథ చెప్పు దేవర కథ చెప్పు నాకు! దేవర: తరువాత తరానికి చెప్పుకునేటంత కథలు కావురా.. మీ నాయనవి. మా నాయనోళ్లవి దేశం కోసం పోరాడిన వీరుల కథలు. మావీ.. ఎవ్వరికీ చెప్పుకోలేని చీకటి కథలు, బతికున్నామే గాని, భావితరాలకు కథలుగా చెప్పుకునేలా ఈ బతుకులు మారుతాయో లేదో మాకుడా తెలియదు. దేవర తొలిసారి ఆయుధ వ్యాపారులకు ఎదురు తిరిగిన సందర్భంలో వచ్చే సీన్‌లో డైలాగ్స్ పవర్‌ఫుల్‌గా ఉంటాయి. దేవర: మా ఆయుధాల లెక్కే ఇందులో కూడా ఆయుధాలు ఉన్నాయంటావ్ “మా ఆయుధాలు మంచిని చెడు నుంచి కాపాడటానికి పుట్టాయ్.. మీ ఆయుధాలు మంచిని చంపడానికి పుట్టాయ్..” విలన్: మాటలు ఎక్కువ అవుతున్నాయ్,  సముద్రం ఎక్కాలా, సముద్రం ఎలాలా? దేవర గ్యాంగ్‌లోని కొండ ఎదురు తిరిగినప్పుడు ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ సూపర్బ్‌గా ఉంటుంది. Jr Ntr Dialogues- Devara దేవర:  “చేసే పని తప్పని తెలిసినా మన అవసరం కోసం చేస్తున్నావ్ అనుకున్నా, ఇప్పుడు అదే అలవాటుగా మారి తప్పుడు పనులు మన రక్తంలో ఇంకిపోయాయని ఇప్పుడే అర్ధం అవుతా ఉండాది.“ “మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు”. కాదు కూడదు అని మీరు మళ్లీ ఆ ధైర్యాన్ని కూడగడితే..ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా..! “దేవర అడిగినాడంటే.. సెప్పినాడనిఅదే సెప్పినాడంటే”… ఇంటర్వెల్ బ్యాంగ్‌కు ముందు ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది. తన మీద దాడికి వచ్చిన వారందర్ని దేవర చంపేస్తాడు. సముద్రం దేవర చంపిన వ్యక్తుల రక్తంతో ఎర్రగా మారుతుంది.అప్పుడు దేవర ఓ బండపై రాసిన డైలాగ్స్ మంచి కిక్‌ ఇస్తాయి ధైర్యం ఎక్కువై తప్పుడు పనులు చేస్తున్నా, మనోళ్లే కదా మాట చెబితే మారుతారు అనుకున్నా.. కానీ, భయం అంటే ఏమిటో తెలియని మృగాలుగా మారిపోయారు అని అర్థమై ఉండాది మీ కళ్లముందు ఉంటే భగవంతుడికి, భూతానికి కూడా భయపడరు అందుకే ఈరోజు నుంచి వాళ్లలెక్క మీ నుండి దూరంగా వెళ్లిపోయి.. కానరాని భయాన్ని అయితా.. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పనికోసం సంద్రం ఎక్కితే… సంద్రం ఒడ్డున ఇట్టా పండబెడుతా..!”. అలాగే సైఫ్ అలి ఖాన్ డైలాగ్స్ కూడా పవర్‌పుల్‌గా ఉంటాయి. “దేవరను చంపాలంటే సరైనా సమయమే కాదు సరైన ఆయుధం కూడా దొరకాలా.. జాన్వీ కపూర్ డైలాగ్స్ తంగా(జాన్వీకపూర్) వరం(జూ.ఎన్టీఆర్) పిరికితనం గురించి చెప్పే డైలాగ్ కామెడీగా ఉంటాయి. “వాడికి వాళ్ల అయ్య రూపం వచ్చింది కాని, రక్తం రాలే.. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడితో ఎట్టాగే, నా మగాన్ని ఆమడ దూరం నుంచి చూసినా.. లోపల నుంచి పొంగాలా.. ఉప్పొంగాలా!! సొరచెపను చంపి ‘వర’ తీసుకొచ్చాడని ఫ్రెండ్స్ చెప్పినప్పుడు.. తంగం చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది. “ఉందే వాడిలో .. ఉందే ఆడిలో..!నాకు తెలుసూ..ఇంతప్పటి నుంచి చూస్తుండాగాఉందే వాడిలో!! యంగ్ ఎన్టీఆర్‌ను చూసి జాన్వీ కపూర్ చెప్పే డైలాగ్‌ కూడా హెలేరియస్‌గా ఉంటుంది. ఆఆ ఆడా ఆడా.. వీరుడిలెక్క ఆ నడక చూడూ లోపల పొంగి ఉప్పొంగుతాందే..లోపల ఎన్టీఆర్, జాన్వీకపూర్ తొలిసారి ఒకరికొకరు ఎదురు పడినప్పుడు వారి మధ్య సాగే సంభాషణ రొమాంటిక్‌గా ఉంటుంది. తంగం(జాన్వీకపూర్): ఏంది ఇట్లా వచ్చినవ్ వర(ఎన్టీఆర్): రాయప్ప(శ్రీకాంత్)తో పని ఉండి వచ్చినా తంగం: అబ్బో అప్పుడే మా అయ్యతో మాట్లాడేదాక పోయినావా ఈరోజు నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది.నా వీరుడు ఆయుధ పూజకు సిద్ధమవుతున్నాడా ఆయుధ పూజలో మత్తు మందు ఇచ్చి గెలిచిన యంగ్ ఎన్టీఆర్‌ను తక్కువ చేసి విలన్(సైఫ్ అలీ ఖాన్) మాట్లాడినప్పుడు రాయప్ప(శ్రీకాంత్) చెప్పే డైలాగ్ పవర్‌పుల్‌గా ఉంటుంది. రాయప్ప  ఏమి జరగనట్లు అందరూ అంతా మరచిపోతే మంచిది బైరా..వాళ్లు ఆడు కలిపిన మత్తు మందుకే పడినారంటే.. పొద్దునకళ్లా మత్తు దిగాలా..కానీ, వాళ్లు మంచం కూడా దిగలా..ఆయుధ పూజలో మీరు వాడి కంట్లో బెరుకునే చూసుండారు..కానీ నేను వాడి దెబ్బలో ఒడుపు చూసినా!దేవర లెక్క బలాన్ని చూసినావాడి బలం వాడికి కూడా తెలియక, ఇలా అందర్ని మత్తులో పెట్టి గెలవాలనుకోవడం వాడి పసితనంకానీ ఓ రకంగా మీ అందరికీ, అదే మంచిదిసముద్రం మీద ఒక దేవర ఉన్నాడు చాలుకొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే అది మీకే మంచిది కాదు భైరా తంగం (జాన్వీ కపూర్ డైలాగ్స్) “నావళ్ల కావట్లా, అందరికీ మత్తు మందు ఇచ్చి గెలవడం ఏంటే.అక్కా, నా మొగుడంటే..సముద్ర అల అంతా ఊహించుకున్నా నేనువాడేమో.. ఒడ్డుకు చేరే పిల్ల అల మాదిరి ఉన్నాడు” తంగం స్నేహితురాలు ఓదార్చుతూ చెప్పే డైలాగ్ నవ్వు తెప్పిస్తుంది అన్ని తెలిసిన దాన్ని చెబుతానా విను “ప్రతి ఆడదానికి… నచ్చినోడు ఒకడుంటాడువచ్చినోడు ఇంకోడుంటాడువచ్చినోడిలో నచ్చినవాడిని చూసుకునిదీపం ఆర్పేసుకుని కాపురం చేసుకుంటేబతుకు సాఫీగా సాగిపోతది” Devara Climax Dialogues క్లైమాక్స్‌లో దేవర గురించి అతని భార్య జోగుల(శ్రుతి మరాఠే)కు ప్రకాశ్ రాజ్ చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. “నీ పెనిమిటి అందర్ని వదిలిపెట్టి ఎప్పుడో పొయినాడు తల్లిదేవర మనల్ని విడిచిపెట్టి ఎప్పుడో చనిపోయాడుఇన్నేళ్లుగా అందర్ని సముద్రంపై తప్పు చేయకుండా భయపెడతా ఉందినీ పెనిమిటి దేవర కాదు..నీ బిడ్డ వరచిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరిగి ఉండాడేమో..ఈ కొండను బతికించడానికి పెద్ద కథను రాసినాడు నీ బిడ్డఆ మృగాల మాయలోపడి గొర్రె పిల్లాల పోయాడు అనుకున్నావాకాదు తల్లి, వాడిని అడ్డుపెట్టుకుని వెళ్లిన వాళ్లు గొర్రెపిల్లలుసముద్రంలో ఈపాటికి మృగాన్ని వెటాడినట్లు వెటాడుతుంటాడు నీ బిడ్డ!
    సెప్టెంబర్ 30 , 2024
    Devara Movie Review: ఎర్ర సముద్రానికి ముచ్చెమటలు పట్టించిన ‘దేవర’.. తారక్‌ ఖాతాలో హిట్‌ పడినట్లేనా? నటీనటులు: ఎన్టీఆర్‌, జాన్వీకపూర్‌, సైఫ్‌ అలీఖాన్‌, శ్రుతి మరాఠే, ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో తదితరులు రచన, దర్శకత్వం: కొరటాల శివ సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌ సినిమాటోగ్రఫీ: ఆర్‌.రత్నవేలు ఎడిటింగ్‌: ఎ.శ్రీకర్‌ ప్రసాద్‌ నిర్మాత: సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్‌ విడుదల తేదీ: 27-09-2024 ఎన్టీఆర్‌ (NTR) కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ డ్రామా ‘దేవర’. జాన్వీకపూర్ (Janhvi Kapoor) కథానాయిక. ఎన్టీఆర్‌ చాలా సంవత్సరాల తర్వాత ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఆయన దేవర, వర పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. సైఫ్ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌, శ్రీకాంత్‌, షైన్‌ టామ్‌ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ సెప్టెంబరు 27న (devara release date) వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? అంచనాలను అందుకుందా? ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి ఆంధ్ర-తమిళనాడు సరిహద్దుల్లో కొండపై ఉన్న నాలుగు గ్రామాల సమూహాన్ని ఎర్ర సముద్రంగా పిలుస్తుంటారు. అక్కడ దేవర (ఎన్టీఆర్)తో పాటు భైరవ (సైఫ్ అలీ ఖాన్), రాయప్ప (శ్రీకాంత్), కుంజర (షైన్‌ టామ్‌ చాకో) ఒక్కో గ్రామ పెద్దగా ఉంటారు. సముద్రం గుండా దొంగ సరుకుని అధికారుల కంట పడకుండా తీసుకొచ్చి మురుగ (మురళీ శర్మ)కి ఇవ్వడం వీళ్ల పని. అయితే దాని వల్ల జరిగే నష్టం గ్రహించి ఇకపై అలాంటి దొంగతనం చేయొద్దని దేవర ఫిక్స్‌ అవుతాడు. ఇందుకు భైరవ ఒప్పుకోడు. దాంతో ఆ ఇద్దరి మధ్య అంతర్యుద్ధం మొదలవుతుంది. దేవర వారికి తీవ్రమైన భయాన్ని చూపిస్తాడు. ఇక దేవరని చంపేయాలని భైరవ ప్లాన్ వేస్తాడు. మరి ఆ ప్లాన్ వర్కౌట్ అయిందా? ఎర్ర సముద్రం ప్రజలు దొంగ సరకు తీసుకురాకుండా దేవర తీసుకున్న కీలక నిర్ణయం ఏంటి? అతని కొడుకు వర(ఎన్టీఆర్) ఎందుకు భయస్తుడిగా మారాడు? సముద్రం ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న భైరవ మనుషులని చంపేస్తుంది ఎవరు? తంగం (జాన్వీ కపూర్)తో వర ప్రేమాయణం ఎలా సాగింది? గ్యాంగ్‌స్టర్‌ యతితో దేవర కథకు సంబంధం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.  ఎవరెలా చేశారంటే తారక్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేస్తాడు. ఇందులోనూ దేవర, వర అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించి మెప్పించాడు. పాత్రకు తగ్గట్లు వేరియేషన్‌ చూపించి ఆకట్టుకున్నాడు. యాక్షన్‌లో తనకు తిరుగులేదని మరోమారు నిరూపించుకున్నాడు. అటు డ్యాన్స్‌లోనూ ఇరగదీశాడు. ఈ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్‌ పల్లెటూరి అమ్మాయిగా ఒదిగిపోయింది. తంగం పాత్రలో అచ్చమైన తెలుగమ్మాయిగా కనిపించింది. అయితే ఆమె పాత్ర కొద్దిసేపే ఉండటం గమనార్హం. విలన్‌గా బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీఖాన్‌ ఆకట్టుకున్నారు. తారక్‌ను ఢీ కొట్టే పాత్రలో అతడు గొప్ప ప్రభావం చూపించారు. శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్‌, అజయ్, మురళీశర్మ, శ్రుతి తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. మిగిలిన నటులు సైతం తమ పరిధిమేరకు చేశారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కొరటాల శివ ఎర్రసముద్రం పేరుతో కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించి తనదైన శైలిలో డ్రామా, భావోద్వేగాలు పండించే ప్రయత్నం చేశారు. ప్రథమార్ధంలో ఎర్ర సముద్రం కథ, దేవర-భైర పాత్రలు, వారు దొంగలుగా మారడానికి గల కారణాలు, పోరాట ఘట్టాలు, పాటలు, దేవర చూపించే భయం దేనికవే సాటి అనేలా కొరటాల చూపించారు. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ కూడా అదిరిపోయేలా ప్లాన్‌ చేశారు. ఫస్టాఫ్‌ అంతా దేవర చుట్టు తిప్పిన కొరటాల, సెకండాఫ్‌లో వర పాత్రను తెరపైకి తీసుకొచ్చారు. రెండో ఎన్టీఆర్‌ ఎంట్రీ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత కథ సాగదీతగా అనిపిస్తుంది. జాన్వీ కపూర్‌ ఎపిసోడ్స్‌ను బలవంతంగా ఇరికించినట్లు అనిపిస్తుంది. పాట మినహా ఆమెతో వచ్చే సీన్లన్ని బోరింగ్‌గానే సాగుతాయి. ఇక ప్రీ క్లైమాక్స్‌లో సముద్రం లోపల ఎన్టీఆర్‌తో వచ్చే యాక్షన్‌ సీన్లు అదిరిపోతాయి. క్లైమాక్స్‌ కొంతవరకు ఆసక్తికరంగా సాగినా ట్విస్ట్‌ పాయింట్‌ బాహుబలి సినిమాను గుర్తు చేస్తుంది. పార్ట్‌ 2కి లీడ్‌ ఇస్తూ దేవర కథను కొరటాల ముంగించారు. అయితే ప్రథమార్థం స్థాయిలో సెకండ్‌ పార్ట్‌ లేకపోవడం, పేలవమైన లవ్‌ట్రాక్‌, సాగదీత సీన్స్‌, ఊహకందేలా కథనం, ఒక్కప్పటి సినిమాల్లోని కొరటాల మార్క్‌ మిస్‌ కావడం మైనస్‌గా చెప్పవచ్చు.  సాంకేతికంగా  టెక్నికల్ అంశాల విషయానికి వస్తే అన్ని విభాగాలు మంచి పనితీరు కనబరిచాయి. అనిరుధ్‌ నేపథ్య సంగీతం సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన బీజీఎంతో సినిమా స్థాయిని పెంచేశాడు. పాటలు బాగున్నాయి. చుట్టంమల్లే పాటకు థియేటర్స్‌లో ఈలలు పడతాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ప్రతి సీన్‌ని తెరపై చాలా రిచ్‌గా చూపించారు. ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాలేదు.  ప్లస్‌ పాయింట్స్ ఎన్టీఆర్‌ నటనప్రథమార్థంసినిమాటోగ్రఫీసంగీతం మైనస్‌ పాయింట్స్‌ సెకండ్‌ పార్ట్‌పేలవమైన లవ్‌ట్రాక్‌ Telugu.yousay.tv Rating : 3.5/5  ‘దేవర’ గురించి నెటిజన్లు ఏమంటున్నారంటే? (Devara Public Talk) దేవర చిత్రాన్ని చూసిన ప్రేక్షకులు ట్విటర్‌లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తారక్‌ నటన, యాక్షన్‌ సీక్వెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా అనిరుధ్‌ అందించిన పాటలు, నేపథ్యం సంగీతం అదిరిపోయిందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. అదే సమయంలో కొన్ని నెగిటివ్‌ పోస్టులు సైతం దేవరపై దర్శనమిస్తున్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. దేవరలో ఎన్టీఆర్‌ నటన ఔట్‌ స్టాండింగ్‌గా ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. అన్ని వర్గాల ప్రేక్షకులకు దేవర నచ్చుతాడని పోస్టు పెట్టాడు. https://twitter.com/vamsikaka/status/1839539465427263788 దేవర చిత్రానికి అనిరుధ్‌ ఇచ్చిన నేపథ్య సంగీతం నెక్స్ట్‌ లెవల్లో ఉన్నట్లు నెటిజన్లు చెబుతున్నారు. 'అదేం కొట్టుడు రా బాబు' అంటూ అనిరుధ్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్‌ పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. https://twitter.com/NaveenKRaju22/status/1839415238132924882? దేవర దెబ్బకు థియేటర్లు తగలబడిపోతున్నాయంటూ మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఫస్టాఫ్‌ ఫెంటాస్టిక్‌.. సెకండాఫ్ సూపర్బ్‌.. బీజీఎం హై-వోల్టేజ్‌లో ఉందని కామెంట్‌ చేశాడు. https://twitter.com/Keerthan0712/status/1839544841291825305 దేవర ఫస్ట్‌ పార్ట్‌ చాలా బాగుందని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. అయితే సెకండ్‌ పార్ట్ మాత్రం చాలా ప్రిడక్టబుల్‌గా ఉందని పేర్కొన్నారు. ఓవరాల్‌గా దేవర సంతృప్తి ఇస్తుందని రాసుకొచ్చాడు. https://twitter.com/venkyreviews/status/1839437743883178036? దేవర చిత్రం తనను తీవ్రంగా నిరాశ పరిచినట్లు ఓ నెటిజన్‌ పేర్కొన్నాడు. అంచనాలను అందుకోవడంలో విఫలమైందని పేర్కొన్నాడు. అసలు జాన్వీని హీరోయిన్‌గా ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదని పోస్టు పెట్టాడు. https://twitter.com/Fukkard/status/1839446863818162549
    సెప్టెంబర్ 27 , 2024

    వినాయకన్ వ్యక్తిగత వివరాలు, ఎత్తు, పుట్టిన ప్రదేశం, బర్త్‌ డేట్‌, వయస్సు, సాధించిన విజయాలు, అవార్డులు, వ్యాపారాలు, ఇష్టాఇష్టాలు, అభిరుచులు తెలుసుకోండి. అలాగే వినాయకన్ కుటుంబ నేపథ్యం, తల్లిదండ్రులు, తోబుట్టువులు, రిలేషన్స్‌, విద్యా నేపథ్యం, కెరీర్ మైలురాళ్లు, తాజా ప్రాజెక్ట్‌లు, అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్, లేటెస్ట్‌ చిత్రాలను ఒక్క క్లిక్‌తో ఇక్కడ తెలుసుకోండి.

    @2021 KTree