తెలుగులో విలన్ అంటే కొందరే గుర్తుకొస్తారు. రావు గోపాల్‌రావు, అమ్రిష్ పురి, సోనూ సూద్ వంటి నటులు విలన్లుగా మరపురాని పాత్రలు పోషించారు. వీరి డైలాగ్, డిక్షన్, యాక్టింగ్.. యూనిక్‌గా ఉంటాయి. ఆ తర్వాత బాలకృష్ణ లెజెండ్ సినిమాతో విలన్‌గా ఎంట్రీ ఇచ్చాడు జగపతి బాబు. నెరిసిన గడ్డంతో ఓ రెండు, మూడు సినిమాల్లో నటించి మెప్పించాడు. కానీ, పర్మనెంట్‌గా ఈ పాత్రలో ఒదగలేక పోయాడు. ఇక, ఇద్దరు, ముగ్గురు నటులు విలన్ రోల్స్‌లో ట్రై చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేక పోయారు. ఎప్పటి నుంచో అలా ఈ విలన్ సీటు ఖాళీగా ఉంటూ వస్తోంది. ఈ సమయంలో విలన్ పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాడు బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan). విలన్ రోల్స్‌కి తానే పర్మనెంట్ సొల్యూషన్ అంటూ ముందుకు వస్తున్నాడు.
దేవరలో ‘భైరా’గా
జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ‘దేవర’. ఇందులో విలన్‌గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు(August 16) సైఫ్ అలీ ఖాన్(Saif Ali Khan BirthDay) పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి అతడి లుక్ విడుదలైంది. ఈ లుక్ ఆకట్టుకుంటోంది. పొడవాటి ఉంగరాల జుట్టుతో కనిపించి సినిమాపై మరింత అంచనాలు పెంచాడు. మాసిన గడ్డం, చూసే చూపుతో నెగెటివ్ ఛాయలను ముఖంలో ప్రదర్శించేశాడు. మరి, ‘భైరా’గా సైఫ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోందో తెరపై చూడాల్సిందే.
ఆదిపురుష్
ప్రభాస్ ఆదిపురుష్ సినిమాలో సైఫ్ ‘లంకేష్’ పాత్రను పోషించాడు. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ విలన్‌గా సైఫ్ మెప్పించాడు. తన నటనతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశాడు. తన పాత్రకు న్యాయం చేశాడు.
హిందీ చిత్రాలు
30 ఏళ్ల సినీ కెరీర్‌లో సైఫ్ అలీ ఖాన్ పలు విలన్ పాత్రల్లో నటించి మెప్పించాడు. ఆదిపురుష్ సినిమాకు ముందు సైఫ్ అలీ ఖాన్ ‘తానాజీ’(Tanhaji) చిత్రంలో నటించాడు. ఇందులో ‘ఉదయ్ భాను సింగ్ రాథోడ్’ అనే పాత్రను పోషించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ చిత్రాన్ని కూడా ‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించడం గమనార్హం.
2009లో విడుదలైన కుర్భాన్(Kurbaan) సినిమాలోనూ సైఫ్ విలన్ రోల్ చేశాడు. రాడికల్ టెర్రరిస్టు ‘ఖలీద్’ పాత్రలో నటించి ప్రేక్షకులను భయపెట్టాడు. 2006లో విడుదలైన ‘ఓంకార’(Omkara) సినిమాను మాత్రం ఎవరూ మర్చిపోలేరు. ఇందులో సైఫ్ చేసిన రోల్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సైఫ్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అంతకుముందు 2004లో వచ్చిన ‘ఏక్ హసన్ థీ’ సినిమాలోనూ కరణ్ సింగ్ రాథోడ్‌గా నటించాడు.
ఫ్యూచర్ విలన్
ప్రస్తుతం టాలీవుడ్ బలమైన విలన్ క్యారెక్టర్ కోసం ఎదురు చూస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు ప్రాధాన్యత తగ్గడమూ ఇందుకు కారణం. అయితే, పవర్ ఫుల్ విలన్ రోల్స్ కోసం స్టార్ నటులను, ఇతర ఇండస్ట్రీ యాక్టర్లను ఒప్పించే పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో సైఫ్ ‘దేవర’ సినిమాతో వస్తున్నాడు. కండలు తిరిగిన దేహం సైఫ్‌కి ఉండటం మరో అడ్వాంటేజీ. ఒకవేళ ఈ సినిమా విజయం సాధిస్తే ఇక సైఫ్ అలీ ఖాన్‌కి తిరుగుండదు. సైఫ్ యాక్టింగ్ తెలిసిన వారు ఈ విషయాన్ని కచ్చితంగా చెబుతున్నారు. టాలీవుడ్‌లో ఫ్యూచర్ విలన్‌గా సైఫ్ మారగలడని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్