• TFIDB EN
  • మిస్ పర్ఫెక్ట్Web Series8 Episodes
    UATelugu
    లావణ్య రావు (లావణ్య త్రిపాఠి)కి ఓసీడీ. అపరిశుభ్రత కనిపిస్తే అసలు సహించలేదు. ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన లావణ్య.. రోహిత్ (అభిజీత్) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లోనే అద్దెకు దిగుతుంది. ఓ కారణం చేత ఆమె.. రోహిత్‌ ఫ్లాట్‌గా వెళ్లగా పనిమనిషి అని అతడు భ్రమపడతాడు. ఆ తర్వాత ఏమైంది? వారిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? అన్నది స్టోరీ.
    ఇంగ్లీష్‌లో చదవండి
    మూవీ & ఓటీటీ అప్‌డేట్స్‌
    స్ట్రీమింగ్‌ ఆన్‌Hotstarఫ్రమ్‌
    Watch
    రివ్యూస్
    How was the movie?

    తారాగణం
    లావణ్య త్రిపాఠి
    అభిజీత్
    ఝాన్సీ లక్ష్మి
    హర్ష వర్ధన్
    మాస్టర్ హర్ష్ రోషన్
    అభిజ్ఞ వూతలూరు
    సతీష్ సారిపల్లి
    మహేష్ విట్టా
    సిబ్బంది
    విశ్వక్ ఖండేరావుదర్శకుడు
    సుప్రియ యార్లగడ్డనిర్మాత
    ప్రశాంత్ ఆర్ విహారి
    సంగీతకారుడు
    ఎడిటోరియల్ లిస్ట్
    కథనాలు
    Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    Miss Perfect Web Series Review: ఓసీడీతో లావణ్యకి ఎన్ని సమస్యలో.. సిరీస్‌ ఎలా ఉందంటే?
    నటీనటులు: లావణ్య త్రిపాఠి, అభిజిత్‌, కేశవ్‌ దీపక్‌, ఝాన్సీ, హర్షవర్ధన్‌, అభిజ్ఞ, రోషన్‌, సతీష్‌ సరిపల్లి, మహేష్‌ విట్టా తదితరులు డైరెక్టర్‌: విశ్వక్ ఖండేరా సినిమాటోగ్రాఫర్‌ : అదిత్య జవ్వాది సంగీతం : ప్రశాంత్‌ ఆర్. విహారి స్ట్రీమింగ్‌ భాషలు : తెలుగు, మలయాళం, తమిళం, హిందీ, బెంగాలి, కన్నడ, మరాఠీ ఓటీటీ వేదిక: డిస్నీ + హాట్‌స్టార్‌ విడుదల తేదీ:  02 ఫిబ్రవరి, 2024 లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ 'మిస్ పర్ఫెక్ట్' (Miss Perfect Web Series Review in Telugu). 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేమ్, 'బిగ్ బాస్ 4' విన్నర్ అభిజీత్ (Abhijith) ఆమెకు జంటగా నటించాడు. అభిజ్ఞ, హర్షవర్ధన్, ఝాన్సీ, మహేష్ విట్టా, సునైనా ఇతర ప్రధాన తారాగణంగా ఉన్నారు. 'స్కై ల్యాబ్' (Sky Lab) ఫేమ్ విశ్వక్ ఖండేరావు ఈ సిరీస్‌కు దర్శకత్వం వహించగా నేటి నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ (Disney + Hotstar) వేదికగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి ఈ సిరీస్‌ ఎలా ఉంది? ఓటీటీ ప్రేక్షకులను మెప్పించిందా? ఇప్పుడు చూద్దాం. కథ లావణ్య రావు (లావణ్య త్రిపాఠి) శుచి - శుభ్రతలకు బ్రాండ్ అంబాసిడర్ లాంటి అమ్మాయి. ఓసీడీ ఉండటం వల్ల పరిసరాలు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని భావిస్తుంటుంది. ప్రమోషన్‌లో భాగంగా లావణ్య హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అవుతుంది. రోహిత్ (అభిజీత్) ఉంటున్న అపార్ట్‌మెంట్‌లో ఓ ఫ్లాట్‌లో అద్దెకు దిగుతుంది. వీరిద్దరి ఫ్లాట్‌లో జ్యోతి (అభిజ్ఞ) వంట చేస్తుంటుంది. ఓ కారణం చేత లావణ్య.. రోహిత్ ఫ్లాట్‌కు వెళ్తుంది. ఆమెను జ్యోతి పంపిన పనిమనిషి అని రోహిత్‌ భ్రమపడటంతో కథ మలుపు తిరుగుతుంది. మరి లావణ్య రోజూ రోహిత్‌ ఫ్లాటుకు ఎందుకు వెళ్లింది? రోహిత్‌ ఆమెను ఎందుకు ఇష్టపడ్డాడు? ఆ విషయాన్ని ఆమెకు చెప్పాడా లేదా? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ఎవరెలా చేశారంటే మిస్‌ పర్ఫెక్ట్‌గా (Miss Perfect) లావణ్య త్రిపాఠి అద్భుతంగా నటించింది. అపరిశుభ్రతను భరించలేని పాత్రలో ఆమె చక్కగా ఒదిగిపోయింది. బిగ్‌బాస్‌ ఫేమ్‌ అభిజీత్‌ కూడా చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులకు కనిపించాడు. ఫ్రెష్‌ లుక్‌లో తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. అభిజిత్‌ - లావణ్య జోడీ చూడటానికి చాలా బాగుంది. ఇద్దరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక హర్షవర్ధన్‌, ఝూన్సీ క్యారెక్టర్లు పరిమితంగా ఉన్నాయి. మహేష్‌ విట్టాతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. డైరెక్షన్‌ ఎలా ఉందంటే తెలుగు ప్రేక్షకులకు ఓసీడీ కథ కొత్త కాదు. 'మహానుభావుడు' చిత్రం ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిందే. అయితే మహిళకు ఓసీడీ ఉంటే ఎలా ఉంటుందన్న లైన్‌ను దర్శకుడు విశ్వక్‌ ఖండేరావు తీసుకోవడం ఆసక్తికరం. అందుకు అనుగుణంగానే లావణ్య క్యారెక్టర్‌ను బాగా డిజైన్‌ చేశారు. అయితే ఆ పాత్రకు తగ్గ సన్నివేశాలను రాసుకోవడంలో ఆయన విఫలమయ్యారు. ఆమెకున్న ఓసీడీని క్యాష్‌ చేసుకొని కామెడీని పండించడంలో ఆయన విఫలమయ్యారు. కథ - కథనాల్లో, కామెడీలో, నెక్స్ట్ ఏంటి అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలోనూ డైరెక్టర్‌ తడబడ్డారు. రైటింగ్‌ ఫెయిల్యూర్‌ వల్ల భావోద్వేగాలు కూడా పెద్దగా పండలేదు.  సాంకేతికంగా టెక్నికల్‌ అంశాల విషయానికి వస్తే.. క్రెడిట్ అంతా మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ ఆర్. విహారికే దక్కుతుంది. సిరీస్ అని లైట్ తీసుకోకుండా మంచి మెలోడీ పాటలు కంపోజ్ చేశారు. నేపథ్య సంగీతం కూడా బావుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ ఓకే. నిర్మాణ విలువలు కూడా ఉన్నతంగా ఉన్నాయి.  ప్లస్‌ పాయింట్స్‌ లావణ్య, అభిజిత్ నటనసంగీతంసినిమాటోగ్రఫి మైనస్‌ పాయింట్స్‌ కథ, కథనంసాగదీత సీన్లుపండని భావోద్వేగాలు రేటింగ్‌: 2.5/5
    ఫిబ్రవరి 02 , 2024
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    Top 25 Actresses in Bikini: బికినీలో పంబ రేపుతున్న హీరోయిన్లు… చూసి తట్టుకునే దమ్ముందా?
    తెలుగు చిత్ర సీమలో అందాలకు కొదువ లేదు. హాట్ గ్లామర్‌ను పండిచడంలో మన హీరోయిన్లు ఏ చిత్ర పరిశ్రమకు తక్కువకాదు. హాట్ సీన్లైనా, బెడ్‌రూం సీన్లలోనైనా నటించేందుకు వెనకాడటం లేదు. ఇక సినిమాల్లో గ్లామర్‌ షోను కాసేపు పక్కన పెడితే... సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో అదరహో అనిపిస్తున్నారు. బికినీ సూట్‌లలో దర్శనమిస్తూ హీటెక్కిస్తున్నారు. కుర్ర హీరోయిన్లే కాదు.. వారితో పోటీపడుతూ మరి సీనియర్ భామలు కూడా పరువాల ప్రదర్శనకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరి ఆ అందాలపై మీరు ఓ లుక్కేయండి. [toc] Samantha Ruth Prabhu సమంత సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్. కెరీర్ ఆరంభంలో మోడలింగ్ చేసిన సమంత... గౌతమ్‌ మీనన్ డైరెక్షన్‌లో వచ్చిన 'ఏ మాయ చేశావే'(2010) చిత్రంతో తెలుగు చిత్ర సీమకు పరిచయమైంది. ఈ చిత్రంలో ఆమె నటనకు గాను విమర్శల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో తెలుగులో ఆమెకు అవకాశాలు వెల్లువెత్తాయి. బృందావనం, దూకుడు (2011), ఈగ (2012), ఎటో వెళ్ళిపోయింది మనసు (2012), సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013), అత్తారింటికి దారేది (2013), మనం(2014), మజిలి(2019), ఖుషి(2023) వంటి సూపర్ హిట్ చిత్రాలతో అతితక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. అటు సమంత హిందీ వెబ్-సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్లో రాజీ పాత్రను పోషించింది. ఈ సిరీస్‌లో ఆమె నటనకు ఎంతో గుర్తింపు లభించింది. తొలి తరంలో కాస్త గ్లామర్ షోకు దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం..ఐటెం సాంగ్స్, లిప్ లాక్, బెడ్‌ రూం సీన్లలోనూ నటించేందుకు సిద్ధమైంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత ఫ్యాన్స్‌ను కవ్విస్తుంటుంది. హాట్ ఫొటో షూట్‌తో అలరిస్తుంది. ఆమె బికినీ ఫొటోలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి సమంత బికినీ ఫోటోస్‌పై మీరు ఓ లుక్కేయండి. Samantha bikini images Kajal Aggarwal కాజల్ అగర్వాల్   తెలుగు, హిందీ, తమిళ్ భాషాల్లో ప్రధానంగా నటించింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. కాజల్ నటించిన నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారం అందుకుంది. ఇక కాజల్ అగర్వాల్ అందాలకు ఫ్యాన్‌ బేస్ ఓ రేంజ్‌లో ఉంటుంది. చీర కట్టులో ఉన్నా, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్నా తరగని అందం ఆమె సొంతం. బహిరంగంగా బికినీలో తన అందాలు చూపించేందుకు కాజల్‌కు ఇష్టముండదట. బికినీ ధరించాల్సి వచ్చిన సమయంలో సినిమాలనే వదులుకుంది ఈ భామ. అయితే కాజల్ తన బర్త్‌డే సందర్భంగా బికినీలో స్విమ్ చేసిన వీడియో మాత్రం ఉంది.  Kajal Agarwal bikini video https://twitter.com/TCINEUpdate/status/1670989988929077250 Tamannaah Bhatia తమన్నా భాటియా తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో ప్రధానంగా నటిస్తోంది. 70కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీ(2005) చిత్రంతో ఆరంగేట్రం చేసింది. ఆ తర్వాత హ్యాపీ డైస్(2007) చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా హిట్ కావడంతో ఆమెకు అవకాశాలు క్యూకట్టాయి. కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009), 100% లవ్ (2011), ఊసరవెల్లి (2011), రచ్చ (2012), తడాఖా (2013), బాహుబలి: ది బిగినింగ్ (2015), బెంగాల్ టైగర్ (2015), ఊపిరి (2016), బాహుబలి 2: ది కన్‌క్లూజన్ (2017), ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2019), సైరా నరసింహా రెడ్డి (2019), ఎఫ్3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ (2022) వంటివి తమన్నా నటించిన ప్రముఖ తెలుగు సినిమాలు. కల్లూరి (2007), అయాన్ (2009), పయ్యా (2010), సిరుతై (2011), వీరమ్ (2014), ధర్మ దురై (2016), దేవి (2016), స్కెచ్ (2018), జైలర్ (2023) వంటి సూపర్ హిట్ తమిళ చిత్రాల్లో నటించింది. నవంబర్ స్టోరీ (2021), జీ కర్దా (2023), ఆఖ్రీ సచ్ (2023), లస్ట్ స్టోరీస్2 వంటి వెబ్‌సిరీస్‌ల్లో ప్రధాన నటిగా పనిచేసింది. లస్ట్‌ స్టోరీస్‌లో ఆమె గ్లామర్ షోపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. అయితేనేం ఏమాత్రం పరువాల ఘాటు తగ్గించకుండా దూసుకెళ్తోంది. ఆమె బికినీలో చేసే హాట్ షోకు అభిమానులు ఉక్కిరి బిక్కిరి అవుతుంటారు. Tamannaah Bhatia Bikini images View this post on Instagram A post shared by Think Music India (@thinkmusicofficial) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) Anushka Shetty అనుష్క శెట్టి  పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన సూపర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ త్వారత విక్రమార్కుడు(2006), లక్ష్యం(2007) వంటి సూపర్ హిట్ చిత్రాల ద్వారా తెలుగులో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. అరుంధతి(2009), బిల్లా(2009), మిర్చి(2013), బాహుబలి(2015), రుద్రమదేవి(2015), బాహుబలి ది కన్‌క్లూజన్(2017) వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల ద్వారా గుర్తింపు పొందింది. దాదాపు 50కి పైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో విజయశాంతి తర్వాత లేడీ సూపర్ స్టార్ హోదాను పొందిన ఏకైక హీరోయిన్‌గా అనుష్క శెట్టిని చెప్పవచ్చు. Anushka shetty Bikini Images Disha Patani దిషా పటాని తెలుగు చిత్రం లోఫర్ (2015)తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె బయోపిక్ MS ధోనితో  హిందీ చలన చిత్రాల్లోకి అడుగుపెట్టింది. సాహో చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. దిషా నటనతోనే కాదు తన అందంతోనూ ఆకట్టుకుంటుంది. ఆమె గ్లామర్ షోకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా ఎప్పటికప్పుడు బికినీ ఫొటోలు పెడుతూ కుర్రకారును ఊరిస్తు ఉంటుంది. Disha Patani Bikini images Pragya Jaiswal ప్రగ్యా జైస్వాల్ ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. జైస్వాల్ తెలుగు పీరియడ్ డ్రామా కంచె (2015)తో గుర్తింపు పొందింది. తొలి చిత్రంతోనే ఉత్తమ డెబ్యూ యాక్టర్‌గా ఫిల్మ్‌ ఫేర్ అవార్డును పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మకు చెప్పుకోదగ్గ అవాకాశాలు ప్రస్తుతం లేకున్నా…తనదైన గ్లామర్‌ షోతో ఆకట్టుకుటుంది. ఆ అందాలను మీరు చూసేయండి. Pragya Jaiswal bikini Images ShwetaTiwari శ్వేతా తివారీ హిందీ సినిమా, టెలివిజన్ నటి. 2000లో 'ఆనే వాలా పల్' సీరియల్ ద్వారా నటిగా పరిచయమైంది. తివారీ బిగ్ బాస్ 4 (2010–11), కామెడీ సర్కస్ కా నయా దౌర్ (2011) రియాల్టీ షోలలో విజేతగా నిలిచి గుర్తింపు పొందింది. ఇక ఈ ముద్దుగుమ్మ అందాల ఆరబోతకు హద్దు అంటూ లేదు. ఓసారి మీరు చూసేయండి మరి. ShwetaTiwari Bikini Images Deepika Padukone దీపికా పదుకొనే ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు, ఆమె ప్రశంసలలో మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు ఉన్నాయి. ఆమె దేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తుల జాబితాలలో ఉంది; టైమ్ ఆమెను 2018లో ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తులలో ఒకరిగా పేర్కొంది మరియు 2022లో ఆమెకు టైమ్100 ఇంపాక్ట్ అవార్డును ప్రదానం చేసింది. deepika padukone bikini Images Pooja Hegde పూజా హెగ్డే తెలుగులో ఒక లైలా కోసం(2014) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత ముకుంద చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. దువ్వాడ జగన్నాథం, రంగస్థలం, అరవింద సమేత వీర రాఘవ, గద్దలకొండ గణేష్, అలవైకుంఠపురములో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, రాధేశ్యామ్, బీస్ట్, మహర్షి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. మహర్షి చిత్రానికి గాను జీసినీ అవార్డ్స్ ఉత్తమ నటి అవార్డు, అల వైకుంఠపురములో చిత్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా పురస్కారాలు అందుకుంది. కొద్ది కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు అందాల దేవతగా మారింది. ఈ అమ్మడి సోకులకు కుర్రకారు హుషారెక్కుతుంటారు. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా చూడండి. Pooja Hegde Bikini Images Pooja Hegde Hot Videos https://twitter.com/RakeshR86995549/status/978983052364808194 View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) Raashii Khanna రాశి ఖన్నా తెలుగు, హిందీ చిత్ర పరిశ్రమలో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. రాశి ఖన్నా చదువులో టాపర్‌. ఐఏఎస్‌ కావాలని ఆకాంక్షించినప్పటికీ... క్రమంగా మోడలింగ్ వైపు మొగ్గు చూపింది. ఆ తర్వాత తెలుగులో ఊహలు గుసగుసలాడే చిత్రంలో నటించి మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తర్వాత ప్రతిరోజు పండగే, జీల్, జై లవకుశ వంటి హిట్ చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో అవకాశాలు తగ్గడంతో హిందీ బాట పట్టింది. అక్కడ హాట్ గ్లామర్ షో చేస్తూ టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ఈ అమ్మడి అందాలకు మంచి క్రేజ్ ఉంది. ఫొటోలు పెట్టినా క్షణాల్లోనే లక్షల్లో లైక్‌లు వస్తుంటాయి. Raashii Khanna Bikini images Dimple Hayathi డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. గల్ఫ్(2017) చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే ఆమెకు గద్దలకొండ గణేష్ చిత్రంలోని 'సూపర్ హిట్టు.. బొమ్మ హిట్టు ఐటెం' సాంగ్ ద్వారా గుర్తింపు లభించింది. ఆ తర్వాత రవితేజ సరసన ఖిలాడి చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. గోపిచంద్‌తో రామబాణం సినిమాలోనూ కథానాయికగా నటించింది. అయితే ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయి. డింపుల్ డ్యాన్స్‌కు పేరుగాంచింది. ఆమె డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. కేవలం ఆమె అందం కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. డింపుల్ బికినీ అందాలను ఇప్పటికీ ఏ హీరోయిన్‌ బీట్‌ చేయలేదంటే అతిశయోక్తి కాదు. మీరు ఓసారి ఆ సోగసులపై లుక్‌ వేయండి https://twitter.com/PicShareLive/status/1525365506471231488 Ketika Sharma Bikini Images కేతిక శర్మ తెలుగు సినిమా నటి. పూరిజగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి నటించిన రొమాంటిక్(2021) చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఈ చిత్రం పరాజయం పొందినప్పటికీ.. ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. లక్ష్య, రంగరంగా వైభవంగా, బ్రో చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉంటూ గ్లామరస్ డాల్‌గా గుర్తింపు పొందింది. కేతిక సినిమాల్లోకి రాకముందే మంచి క్రేజ్ దక్కించుకుంది. ఆమె 2016లో నటించిన 'థగ్‌ లైఫ్‌ (2016)' వీడియోతో పాపులర్‌ అయ్యింది. దబ్ స్మాష్ వీడియోలు, మోడలింగ్, యూట్యూబ్ వీడియోలతో యూత్‌లో సూపర్ క్రేజ్ పొందింది. ఈ పాప సోషల్ మీడియాలో కాస్త కూడా కుదురుగా ఉండదు. హాట్ హాట్ ఫొటో షూట్‌లతో వెర్రెక్కిస్తుంటుంది. మరి మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్‌ వేయండి Ketika Sharma Bikini Images Catherine Tresa కేథరీన్ థెరీసా ప్రధానంగా తెలుగు, మలయాళ, కన్నడ, తమిళ్ భాషల్లో నటిస్తోంది. తెలుగులో చమ్మక్ చల్లో చిత్రం ద్వారా పరిచయమైంది. కన్నడలో ఉపేంద్ర సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన కేథరీన్ ఆ సినిమాతో మంచి గుర్తింపును పొందింది. అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలతో సినిమా నటించింది. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. సరైనోడు, నేనేరాజు నేనే మంత్రి, బింబిసారా, వదలడు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. సినిమాల్లోకి రాకముందు కేథరీన్ మోడలింగ్ చేసింది. "నల్లి సిల్క్స్", "చెన్నై సిల్క్స్", "ఫాస్ట్ ట్రాక్","దక్కన్ క్రానికల్" లకు మోడల్‌గా వ్యవహరించింది. ఈ ముద్దుగుమ్మ నటనలోనే కాదు అందాల ప్రదర్శనలోనూ ఓ మెట్టు ఎక్కింది. తన సొగసుల సంపదను అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ కుర్రాళ్ల గుండెల్లో వీణలు మోగిస్తుంటుంది. ఆ అందాలను మీరు ఓసారి తనివితీరా ఆస్వాదించండి. Catherine Tresa Bikini images Mrunal Thakur మృణాల్ ఠాకూర్ లవ్‌ సోనియా(2018) హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి ఆరంగేట్రం చేసింది. తెలుగులో వచ్చిన జెర్సీ రీమేక్‌లో షాహిద్ కపూర్ సరసన నటించడంతో ఆమె టాలీవుడ్ పెద్దల దృష్టి పడింది. దీంతో ఆమెకు తెలుగులో సీతారామం(2022) చిత్రం ద్వారా అవకాశం వచ్చింది. ఈ సినిమా అన్ని భాషల్లో బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ సినిమాలో ఆమె నటనకు గాను రెండు సైమా అవార్డలు వరించాయి. ఈ చిత్రం తర్వాత మృణాల్ నాని సరసన 'హాయ్ నాన్న'(2023) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. దీంతో ఆమెకు తెలుగులో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తోంది. ఇక మృణాల్ అందాల గురించి ఎంత మాట్లాడిన తక్కువే అవుతుంది. మరి ఆ రేంజ్‌లో ఉంటుంది ఈ అమ్మడి అందాల తెగింపు. ఒక్క పాటలో చెప్పాలంటే ఇంతందం దారి మళ్లిందా అనిపిస్తుంది తన సోగసుల సోయగాలు చూస్తుంటే.. మీరు ఓసారి చూసేయండి మరి. Mrunal Thakur Bikini images Mrunal Thakur hot video https://twitter.com/MassssVishnu/status/1786566946600988750 https://twitter.com/MrunalThakur143/status/1788433120221401193 https://twitter.com/SastaJasoos/status/1788498532162236427 Anasuya Bharadwaj బుల్లితెర వ్యాఖ్యతగా అలరించిన గ్లామరస్ యాంకర్ అనసూయ.. నటిగా తొలిసారి నాగ(2003) చిత్రం ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన సొగ్గాడే చిన్నినాయన చిత్రంలో బుజ్జి క్యారెక్టర్‌లో నటించింది. ఈ చిత్రంలో ఆమె గ్లామరస్ నటనకుగాను అవకాశాలు క్యూ కట్టాయి. రామ్‌చరణ్ నటించిన రంగస్థలం చిత్రంలో ఆమె చేసిన రంగమత్త పాత్రకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. యాంకర్ రోల్‌ను వదిలి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా స్థిరపడేలా చేసింది. క్షణం, విన్నర్, పుష్ప, రంగమర్తాండ, విమానం వంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు తనలోని నటనా కోణాన్ని పరిచయం చేసింది. రంగస్థలం, క్షణం చిత్రాలకుగాను ఉత్తమ సహాయనటిగా సైమా పురస్కారాలు అందుకుంది. నటన కంటే ముందు ఆమెను పాపులర్ చేసింది మాత్రం ఆమె గ్లామర్ షో అని చెప్పాలి. బిగువైన అందాల విందుతో కుర్రకారుకు కలల రాణిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఏ ఫొటో పెట్టినా ఇట్టే ట్రెండ్ అవుతాయి మరి. Anasuya Bharadwaj Bikini images View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) Nidhhi Agerwal నిధి అగర్వాల్  ప్రధానంగా తెలుగుతో పాటు హిందీ భాషల్లో నటిస్తోంది. తెలుగులో సవ్యసాచి చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత మిస్టర్ మజ్ను సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పూరి డైరెక్షన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో తొలి బ్లాక్‌బాస్టర్ విజయాన్ని అందుకుంది. పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు చిత్రంలో నటిస్తోంది. సోషల్ మీడియాలో గ్లామరస్ క్వీన్‌గా గుర్తింపు పొందింది. సినిమాల్లోకి రాకముందు.. కపిల్ శర్మ టాక్ షో, కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా సీజన్‌-4లో వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఇక నిధి శర్మ ఇచ్చే గ్లామర్ షో గురించి మాట్లాడితే.. చూసేవారికి కన్నుల పండుగేనని చెప్పాలి. ఈ పాప బికిని వేసిన ఫొటోలు తక్కువేకానీ..చూపించిన ఇంపాక్ట్ మాత్రం గట్టిగానే ఉంది. కావాలంటే మీరు ఓసారి చూసేయండి. Nidhhi Agerwal Bikini Images Mehreen Kaur Pirzada మెహ్రీన్ తెలుగు సినిమా నటి. 'కృష్ణ గాడి వీర ప్రేమ గాధ' సినిమాతో టాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో నాని సరసన హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మహానుభావుడు చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. రవితేజ నటించిన రాజా ది గ్రేట్ చిత్రం ఆమె కెరీర్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. జవాన్, F2, అశ్వథ్థామ, F3 సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక ఈ పిల్ల అందాల ప్రదర్శన గురించి మాట్లాడితే.. పర్వాలేదనే చెప్పాలి. ఫోటో షూట్‌ల కంటే ఈ అమ్మడు వీడియో షూట్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటుంది. Mehreen Kaur Pirzada Bikini Videos View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) Manushi Chillar మానుషి చిల్లర్.. ప్రముఖ మోడల్‌. మిస్‌ వరల్డ్‌ 2017 పోటీల్లో విజేతగా నిలిచింది. మిస్‌ వరల్డ్‌ కిరీటం పొందిన ఆరో భారత మహిళగా రికార్డులకెక్కింది. 'ఆపరేషన్‌ వాలెంటైన్‌' చిత్రంతో ఈ భామ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్‌గా బడేమియా చోటేమియా సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ మాజీ ప్రపంచ సుందరి బికినీ అందాల గురించి చెప్పేదిమి లేదు. మీరే చూసేయండి. Manushi Chillar Bikini Images Manushi Chillar Bikini videos View this post on Instagram A post shared by Manushi Chhillar (@manushi_chhillar) https://twitter.com/ManushiChhillar/status/1787462061280166182 Sobhita Dhulipala శోభితా ధూళిపాళ ప్రధానంగా తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్‌ను గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. అనురాగ్ కశ్యప్ యొక్క థ్రిల్లర్ చిత్రం రామన్ రాఘవ్ 2.0 (2016)లో ఆమె తొలిసారిగా నటించింది మరియు అమెజాన్ ప్రైమ్ వీడియో డ్రామా సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ (2019)లో ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చీర కట్టినా.. మోడ్రన్ డ్రెస్ వెసినా తరగని అందంతో చెలరేగుతుంటుంది. మరి ఆ అందాల విందును మీరు చూసేయండి మరి. Sobhita Dhulipala bikini images Hot videos View this post on Instagram A post shared by Sobhita (@sobhitad) Tripti Dimri తృప్తి డిమ్రి.. కామెడీ చిత్రం పోస్టర్ బాయ్స్ (2017) ద్వారా తెరంగేట్రం చేసింది. అయితే రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను (2018)లో ఆమె మొదటి సారి లీడ్ రోల్‌లో నటించింది. ఆ తరువాత ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిలిమ్స్ బుల్బుల్ (2020), కళ (2022)లలో చిత్రాలలో నటించింది. అయితే ఇన్ని సినిమాల్లో నటించిన రాని గుర్తింపు యానిమల్ చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా వచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. 2021లో ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకుంది. రెడిఫ్ డాట్ కామ్ 2020 బాలీవుడ్ ఉత్తమ నటీమణుల జాబితాలో ఆమె 8వ స్థానంలో నిలిచింది. ఇక అమ్మడు ఎక్స్‌పోజింగ్‌లో బాలీవుడ్ హీరోయిన్లకంటే రెండు అకులు ఎక్కువే చదివింది. ఓసారి ఆ అందాల విందును మీరు తనివితీరా ఎంజాయ్ చేయండి. Tripti Dimri Bikini images View this post on Instagram A post shared by Triptii Dimri (@tripti_dimri) Shirley Setia షిర్లె సెటియా... కృష్ణ వ్రింద విహారి చిత్రం(2022) ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. సినిమా యావరేజ్‌గా ఆడిన మంచి గుర్తింపు సాధించింది. అయితే ఈ చిత్రానికి కంటే ముందు లాక్‌డౌన్(2018) వెబ్‌సిరీస్‌ ద్వారా గుర్తింపు దక్కించుకుంది. షిర్లె సెటియాలో బహుముఖ ప్రజ్ఞ దాగి ఉంది. నటిగా మాత్రమే కాకుండా.. సింగర్‌గాను రాణించింది. ఇక కుర్రదాని అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. Shirley Setia Bikini Images
    మే 11 , 2024
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    New OTT Movies: ఈ వారం చిన్న సినిమాలదే హవా.. ఓటీటీలో 21 చిత్రాలు/సిరీస్‌లు!
    సంక్రాంతి సందడి ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు (This Week Movies) క్యూ కట్టేందుకు రెడీ అయిపోయాయి. ఈ వీకెండ్‪‌లో 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు', 'బూట్ కట్ బాలరాజు' లాంటి చిత్రాలతో పాటు పలు డబ్బింగ్ మూవీస్ కూడా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలోనూ ఏకంగా 21 కొత్త సినిమాలు / వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. వాటి విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు అంబాజీపేట మ్యారేజీ బ్యాండు ‘కేరాఫ్‌ కంచర పాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేశ్‌ మహా. ఇప్పుడాయన సమర్పణలో సుహాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అంబాజీపేట మ్యారేజ్‌ బ్యాండు’ (Ambajipeta Marriage Band). దుశ్యంత్‌ కటికనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌ విశేషంగా ఆకట్టుకుంటోంది. బూట్‌కట్ బాలరాజు బిగ్‌బాస్ ఫేమ్‌ సోహెల్‌, అనన్య నాగళ్ల జంటగా లక్కీ మీడియా పతాకంపై రూపొందిన చిత్రం  ‘బూట్‌కట్‌ బాలరాజు’ (Bootcut balraju). శ్రీ కోనేటి దర్శకత్వం వహిస్తున్నారు. బెక్కం వేణుగోపాల్‌ నిర్మాత. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 2న (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.  ధీర వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు లాంటి సినిమాలలో మాస్‌ హీరోగా నటించిన లక్ష్‌ చదలవాడ ఈ వారం 'ధీర' (Dheera) సినిమాతో ప్రేక్షకుల ముందురు రాబోతున్నాడు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది.  హ్యాపీ ఎండింగ్‌ యష్‌ పూరి, అపూర్వ రావ్‌ జంటగా కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌’ (Happy Ending). యోగేష్‌ కుమార్‌, సంజయ్‌ రెడ్డి, అనిల్‌ పల్లాల సంయుక్తంగా నిర్మించారు. కౌశిక్‌ భీమిడి తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న థియేటర్లలోకి రానుంది. హీరోకి ఒక శాపం ఉంటే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కింది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర గ్లింప్స్‌, టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకుంటున్నాయి. ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు మిస్‌ పర్ఫెక్ట్‌ మెగా కోడలు లావణ్య త్రిపాఠీ (Lavanya Tripathi) నటించిన లేటెస్ట్‌ వెబ్‌సిరీస్‌ 'మిస్‌ పర్ఫెక్ట్‌' (Miss Perfect). బిగ్‌బాస్‌ విజేత అభిజీత్‌ (Abhijit) ప్రధాన పాత్రలో నటించాడు. విశ్వక్‌ ఖండేరావ్‌ ఈ సిరీస్‌ను రూపొందించారు. ఫిబ్రవరి 2 నుంచి హాట్‌స్టార్‌ వేదికగా ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేసే హాస్యభరితమైన టామ్ అండ్ జెర్రీ కథలా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఇందులో లావణ్య పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చే యువతి పాత్రలో కనిపిస్తుంది.  సైంధవ్‌ వెంకటేశ్‌ లేటెస్ట్‌ చిత్రం 'సైంధవ్‌' (Saindhav) సంక్రాంతి కానుకగా విడుదలై డివైడ్‌ టాక్‌ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా స్ట్రీమింగ్‌ డేట్ త్వరగానే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2న ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని అంటున్నారు. మరోవైపు మహా శివరాత్రి సందర్భంగా 9న కూడా రావొచ్చని వార్తలు వస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చని ప్రచారం జరుగుతోంది. స్ట్రీమింగ్‌ తేదీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీనిపై ఈ వారంలోనే క్లారిటీ రానుంది. TitleCategoryLanguagePlatformRelease DateMighty Bheem Play TimeSeriesEnglishNetflixJan 29The Greatest Night In PopMovieEnglishNetflixJan 29Jack Whitehall: Settle DownMovieEnglishNetflixJan 30NASCAR: Full SpeedSeriesEnglishNetflixJan 30Alexander: The Making of a GodSeriesEnglishNetflixJan 31Baby BanditoSeriesEnglishNetflixJan 31Let's Talk About CHUSeriesEnglishNetflixFeb 2MarichiMovieKannadaAmazon PrimeJan 29Mr. & Mrs. SmithSeriesEnglishAmazon PrimeFeb 2SaindhavMovieTeluguAmazon PrimeFeb 2 (Rumor)KoierSeriesEnglishDisney+HotStarJan 31Miss PerfectSeriesTeluguDisney+HotStarFeb 2Self MovieEnglishDisney+HotStarFeb 2AsedioMovieSpanish/EnglishBook My ShowJan 30In The NoSeriesEnglishJio CinemaJan 29
    జనవరి 29 , 2024
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ గురించి ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసా?
    కాజల్ అగర్వాల్ దశాబ్దకాలం పాటు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది. తెలుగులో లక్ష్మీ కళ్యాణం(2007) చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముంబై అందం... రాజమౌళి డైరెక్షన్‌లో వచ్చిన మగధీర చిత్రం ద్వారా గుర్తింపు పొందింది. ఈ సినిమా ఆమెకు టాలీవుడ్‌లో మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఆర్య2, డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మాన్, ఖైదీ 150, నేనేరాజు నేనే మంత్రి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతో ఈమె నటించింది. పెళ్లి చేసుకుని కొద్దికాలం సినిమాలకు విరామం ఇచ్చి తిరిగి మళ్లీ భగవంత్ కేసరి చిత్రం ద్వారా కమ్‌బ్యాక్ ఇచ్చింది. ఆమె సహజ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి కొన్ని(Some Lesser Known Facts About Kajal Aggarwal) ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకోసం కాజల్ అగర్వాల్ ఎవరు? కాజల్ అగర్వాల్ భారతీయ నటి. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. కాజల్ అగర్వాల్ దేనికి ఫేమస్? కాజల్ అగర్వాల్ మగధీర, ఖైదీ150, బిజినెస్‌మ్యాన్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి గుర్తింపు పొందింది. కాజల్ అగర్వాల్  వయస్సు ఎంత? కాజల్ అగర్వాల్  1985 జూన్ 19న జన్మించింది. ఆమె వయస్సు  38 సంవత్సరాలు  కాజల్ అగర్వాల్  మందన్న ముద్దు పేరు? కాజు కాజల్ అగర్వాల్  మందన్న ఎత్తు ఎంత? 5 అడుగుల 5 అంగుళాలు  కాజల్ అగర్వాల్  ఎక్కడ పుట్టింది? ముంబాయి కాజల్ అగర్వాల్‌కు వివాహం అయిందా? 2020 అక్టోబర్ 30న గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది కాజల్ అగర్వాల్‌కు ఎంతమంది పిల్లలు? కాజల్ అగర్వాల్- గౌతమ్ కిచ్లూ ఒక మగ బిడ్డను కన్నారు. అబ్బాయి పేరు నేయిల్ కిచ్లూ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన రంగు? వైట్, రెడ్, బ్లూ కాజల్ అగర్వాల్‌ అభిరుచులు? డ్యాన్సింగ్, ట్రావెలింగ్ కాజల్ అగర్వాల్‌కు ఇష్టమైన ఆహారం? ఎగ్స్, తియ్యని పండ్లు కాజల్ అగర్వాల్‌ అభిమాన నటుడు? జూ.ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ కాజల్ అగర్వాల్‌ తొలి సినిమా? లక్ష్మి కళ్యాణం(2007) కాజల్ అగర్వాల్‌కు గుర్తింపు తెచ్చిన సినిమాలు? మగధీర, బృందావనం, డార్లింగ్ కాజల్ అగర్వాల్‌ ఏం చదివింది? మాస్ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చేసింది కాజల్ అగర్వాల్‌ పారితోషికం ఎంత? కాజల్ ఒక్కొ సినిమాకు రూ.కోటి- రూ.2కోట్ల వరకు ఛార్జ్ చేస్తోంది. కాజల్ అగర్వాల్‌ తల్లిదండ్రుల పేర్లు? వినయ్ అగర్వాల్, సుమన్ అగర్వాల్ కాజల్ అగర్వాల్‌ ఎన్ని అవార్డులు గెలుచుకుంది? కాజల్ అగర్వాల్ తెలుగులో నేనే రాజు నేనే మంత్రి చిత్రానికి గాను ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. అలాగే బృందావనం చిత్రానికి గాను ఉత్తమ నటిగా సిని'మా' అవార్డును పొందింది. కాజల్ అగర్వాల్‌ మోడ్రన్ డ్రెస్సులు వేస్తుందా? కాజల్ అగర్వాల్‌ అన్నిరకాల డ్రెస్సులు వేస్తుంది.  కాజల్ అగర్వాల్‌కు సిస్టర్ పేరు? నిషా అగర్వాల్, ఆమె కూడా హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. కాజల్ అగర్వాల్‌ ఇన్‌స్టాగ్రాం లింక్? https://www.instagram.com/kajalaggarwalofficial/?hl=en కాజల్ అగర్వాల్‌ ఎంత మంది హీరోలతో లిప్ లాక్ సీన్లలో నటించింది? కాజల్ అగర్వాల్‌ తొలుత బిజినెస్ మ్యాన్ చిత్రంలో మహేష్ బాబుతో లిప్ లాక్ సీన్‌లో నటించింది. కాజల్ అగర్వాల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? రామ్ చరణ్, తమన్నా భాటియా https://www.youtube.com/watch?v=zh3DbdY0w40
    ఏప్రిల్ 27 , 2024
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    Item Songs Lyrics: ఈ ఐటెమ్‌ సాంగ్స్‌లోని లిరిక్స్ ఎప్పుడైన మిమ్మల్ని ఆలోచింపజేశాయా?
    సినిమాల్లో ఐటెం సాంగ్స్‌కి ఉండే క్రేజే వేరు. ఈ పేరు చెప్పగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది హీరోయిన్ల అంద చందాలే. ఎంత విప్పి చూపిస్తే అంత రసపట్టులో ఉంటుందనే భావన పాతుకుపోయింది. అందుకే లిరిక్స్ దగ్గరనుంచి కాస్ట్యూమ్స్ వరకు పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకుంటారు. మిగతా పాటల చిత్రీకరణతో పోలిస్తే వీటికి ఎక్కువ వెచ్చిస్తారు. అయితే, కొన్ని ఐటెం సాంగ్స్ రూటే వేరు. తెరపై స్కిన్ షో కన్నా లిరిక్స్‌తోనే ఆకట్టుకుంటాయి. అవి జీవితపు సత్యాన్ని చెబుతాయి. తత్వాన్ని బోధిస్తాయి. వాస్తవాన్ని ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో కొన్ని చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఆ సాంగ్స్ ఏంటో చూద్దాం.  ముసుగు వెయ్యొద్దు(ఖడ్గం) కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఖడ్గం సినిమాలోని ‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద’ పాట ఇప్పటికీ సాహిత్య ప్రేమికులకు ఫేవరేట్ సాంగ్. ఇందులోని లిరిక్స్ శ్రోతల్ని ఆలోచింపజేస్తాయి.  ‘‘ముసుగు వెయ్యొద్దు మనసు మీద.. వలలు వెయ్యొద్దు వయసు మీద.. ఎగరనివ్వాలి కుర్రాళ్ల రెక్కల్ని తుపాను వేగాలతో’’ అంటూ యువత వయసు విలువేంటో చెబుతాయి. సమస్యలు సహజం. భయపడి ఆగిపోతే అక్కడే మిగిలిపోతాం. ధైర్యంగా ముందుకు అడుగేస్తేనే లక్ష్యాన్ని చేరుకుంటాం అని చెప్పడానికి రచయిత సిరివెన్నెల ఈ లిరిక్స్‌ని రాశారు.    ‘‘సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపుని.. చీకటైనా ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ.. పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశనీ.. దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావనీ?’’  ‘‘కొంతకాలం నేలకొచ్చాం అతిధులై వుండి వెళ్లగా.. కోటలైనా కొంపలైనా ఏవీ స్థిరాస్థి కాదుగా.. కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా.. అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటంలో లేదుగా..’’ జీవితంలో ఆస్తిపాస్తులు శాశ్వతం కాదనీ, మనం జీవించిన విధానమే చిరస్థాయిగా గుర్తుండిపోతుందని పై లిరిక్స్ చెప్పకనే చెబుతాయి.  https://www.youtube.com/watch?v=FrkG_SxMTRk పుడుతూనే ఉయ్యాల(నేనింతే) పూరి జగన్నాథ్, చక్రి కాంబినేషన్లో వచ్చిన మరో మూవీ ‘నేనింతే’. ఇందులోని ఐటెం సాంగ్ ‘పుడుతూనే ఉయ్యాల’ ఆకట్టుకుంటుంది. ‘ప్రయత్నం విరమించి ఓడిపోయిన సందర్భాలున్నాయి. కానీ, ప్రయత్నిస్తూ ఓడిపోవడం చరిత్రలో లేదు’ అంటూ పాట స్ఫూర్తిని నింపుతాయీ లిరిక్స్.  ‘‘అవకాశం రాలేదంటూ గుక్కే పెట్టి ఏడవొద్దే.. ఏనాడో వచ్చి ఉంటాది నువ్వే వదిలేసుంటావే.. చీకటిని తిడుతూ తొంగుంటే వేకువకి చోటే లేదులే.. నిన్నేం తిరిగి రాదు కదా రేపేం జరుగు తుందో కదా.. నీకై మిగిలివుంది ఇక ఈరోజే..’’ ‘‘టర్నే లేని దారులూ.. ట్విస్టే లేని గాథలూ.. రిస్కే లేని లైఫులూ.. బోరు బోరే..’’ అంటూ సవాలును స్వీకరిస్తే వచ్చే ఉత్సాహం ఎలా ఉంటుందో చెప్పారు రైటర్ భువనచంద్ర.  https://www.youtube.com/watch?v=t8Afn_CX-tc తౌబ తౌబ(సర్దార్ గబ్బర్ సింగ్) సర్దార్ గబ్బర్‌సింగ్ సినిమాలోని ‘తౌబ తౌబ’ ఐటెం సాంగ్ పైకి మామూలుగా కనిపిస్తోంది. కానీ, ఇది సిచ్యుయేషనల్ సాంగ్. అందుకు తగ్గట్టే లిరిక్స్ ఉంటాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు.  ఈ సమాజంలో మంచి చేస్తే ఒప్పు. చెడు చేస్తే తప్పు అంటారు. మద్యపానం సేవించడం, జూదం ఆడటం వంటివి చెడు పనులు. మరి, నాడు ధర్మరాజు జూదం ఆడటం, దేవతలు సురాపానం సేవించడం కూడా తప్పే కదా? అని లిరిక్స్ ఇలా ప్రశ్నిస్తాయి. ‘‘చేతిలో పేక ఉన్న ప్రతివాడ్ని.. చేతకాని వాడల్లే చూడొద్దే.. ధర్మరాజు అంతటివాడు ఆడాడే.. తీసిపారేయొద్దు జూదాన్ని.. మత్తులో మజాలు చేస్తుంటే కుళ్లుతో గింజేసుకుంటారే.. స్వర్గ లోకంలో దేవతలంతా సురనే సారాగా వేస్తారే.. ఇంద్రుడు అండ్ కంపెనీ పగలు రాత్రీ కొడతారే.. వాళ్లకో రూల్ మనకి ఓ రూల్ పెట్టమనడం తప్పు కాదా?’’ https://www.youtube.com/watch?v=OzIL-v_OcRk పక్కా లోకల్(జనతా గ్యారేజ్) ఓ పల్లెటూరి ఆడపిల్లకు ఉండే ఆలోచనలను ప్రతిబింబిస్తుంది ఈ పాట. తనకు నచ్చనిది ఏదైనా, ఎంత విలువైనదైనా సులువుగా వద్దని చెప్పే యువతి అంతర్మథనం ఈ సాంగ్‌లో కనిపిస్తుంది.   తప్పయిన ఒప్పయినా తాను మాత్రం ఊరు దాటను అని నాటుగా చెబుతుంటుంది.. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ  సాంగ్‌లోని ఓ చరణం పరిశీలిస్తే… ‘‘వన్ ప్లస్ వన్ ఆఫరున్నదే.. లండన్ ఎల్లొద్దాం లగేజట్టుకో.. ఉన్నూరు గీత దాటనే.. సరకు తోటల్లో సైకిలేసుకో.. ప్లాస్మా నా, బ్లాక్ అండ్ వైటా…TV ఏదిష్టం నీకు చెప్పుకో..వినసొంపు వివిధ భారతే… మంచీ రేడియోని గిఫ్ట్ ఇచ్చుకో.. అటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు..నీకు ఇద్దరిలో ఎవరు ఇష్టం ఎంచుకో..షర్టు నలగందే ఎట్ట ఏముంటది కిక్కు..రెంచ్ స్పానరుకే నా ఓటు రాస్కో..టచ్ చేసావు అమ్మడు..నేనింతే పిల్లడు..నచ్చిసావాదంట క్లాసు ఐటమూ..’’ డైమండ్ నెక్లెస్ ఆఫర్ చేస్తే ఏ పిల్లయినా అయితే సిగ్గు పడుతుంది. లేదంటే వద్దని చెబుతుంది. కానీ, ఇందులో మాత్రం ‘వజ్రానికి నా ఒంటికి వరుస కుదరదే.. తిరణాల పూసల దండ తెచ్చి ఏస్కో’ అంటూ చెప్పేస్తుంది. ఇలా ఒక్కో విషయంలో ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది. ఊరు దాటకుండా ఏదడిగినా లోకల్‌గా సమాధానం ఇస్తుంది. https://www.youtube.com/watch?v=GFEj1vnhvxA మరికొన్ని.. తెలుగు చిత్రాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో వాస్తవికత, సాహిత్య ప్రతిభ ప్రతిబింబిస్తుంది. తరచి చూడాలే గానే తనివి తీరని ఆనందం కలుగుతుంది. ఇలా పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా మామా’ పాట, ఇస్మార్ట్ శంకర్‌లోని ‘సిలక సిలక’ సాంగ్, అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘జుంజుమారే జుంజుం’ పాటలు లిరిక్స్‌తో మెస్మరైజ్ చేస్తాయి. మీరూ ఓ సారి ట్రై చేసి చూడండి మరి.  https://www.youtube.com/watch?v=WkPsPWZQkzk
    జూన్ 23 , 2023
    Pushpa 2 Teaser: టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోన్న ‘పుష్ప 2’ టీజర్‌.. కారణం ఏంటంటే?
    Pushpa 2 Teaser: టాలీవుడ్‌ను షేక్‌ చేస్తోన్న ‘పుష్ప 2’ టీజర్‌.. కారణం ఏంటంటే?
    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా చేస్తున్న 'పుష్ప 2' (Pushpa 2) కోసం సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సుకుమార్‌ (Sukumar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్‌గా చేస్తోంది. ఇవాళ అల్లు అర్జున్ (HBD Allu Arjun) పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది. సినిమాలో ఎంతో కీలకమైన జాతర సన్నివేశానికి సంబంధించిన క్లిప్‌ను టీజర్‌ రూపంలో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ వీడియో టాలీవుడ్‌ను షేక్ చేస్తోంది.  టీజర్‌లో ఏముంది? 'పుష్ప 2'కు సంబంధించిన లేటెస్ట్‌ టీజర్‌లో బన్నీ చాలా పవర్‌ఫుల్‌గా, ఫెరోషియస్‌గా కనిపించాడు. అమ్మవారి గెటప్‌లో మాస్‌ అవతారంతో గూప్‌బంప్స్‌ తెప్పించాడు. జాతరలో ఫైట్‌కు సంబంధించిన సీన్‌ను మేకర్స్‌ ఫ్యాన్స్‌ కోసం ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఇందులో బన్నీ నడిచే స్టైల్, స్వాగ్ అదిరిపోయాయి. కాళ్లకు గజ్జెలు, చెవులకు రింగ్స్, కళ్లకు కాటుకతో ‘పుష్ప రాజ్‌’ లుక్ అదిరిపోయింది. టీజర్‌లో రివీల్‌ చేసిన ఫైట్ సీక్వెన్స్ థియేటర్లను మోత మోగించేలా కనిపిస్తోంది. ఇక టీజర్‌లో దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్ట్స్ లెవెల్ అనేలా ఉంది. ఓవరాల్‌గా ఈ టీజర్‌ ఫ్యాన్స్‌కు విపరీతంగా నచ్చేసింది. అల్లు అర్జున్ బర్త్ డేకు ఈ టీజర్‌ పర్ఫెక్ట్ గిఫ్ట్‌ అని ఫ్యాన్స్‌ కామెంట్లు చేస్తున్నారు.  https://twitter.com/i/status/1777210307448029663 రిలీజ్‌ ఎప్పుడంటే? పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు.  స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్‌తోపాటు రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, ధనుంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో వచ్చిన ‘పుష్ప ది రైజ్‌’ 2021లో విడుదలై సెన్సేషన్‌ క్రియేట్ చేసింది. దీంతో దీనికి సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప 2'పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. 
    ఏప్రిల్ 08 , 2024
    SUMMER HAIR STYLES: స్టైల్‌ స్టైల్‌రా ఇది సూపర్ స్టైల్‌రా… సూపర్ లుక్స్‌తో అదరగొడుతున్న ఐపీఎల్ స్టార్స్
    SUMMER HAIR STYLES: స్టైల్‌ స్టైల్‌రా ఇది సూపర్ స్టైల్‌రా… సూపర్ లుక్స్‌తో అదరగొడుతున్న ఐపీఎల్ స్టార్స్
    వేసవికాలం వచ్చిందంటే వాతావరణ పరిస్థితుల కారణంగా కాస్త చికాకు ఉంటుంది. అసలే ఉక్కపోత ఆపై చెమటలు… ఇక తలపై జుట్టు ఎక్కువగా ఉంటే ఇంక అంతే సంగతి. ఇలాంటి సమయంలో కొన్ని సమ్మర్‌ హెయిర్‌ కట్స్‌ చేయించుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది. మనకు తెలిసిన చాలామంది క్రికెటర్స్‌ కూడా ఇదే ఫాలో అవుతున్నారు. ఓసారి వాటిపై లుక్కేసి కుదిరితే ఫాలో అయిపోండి. ధోని  విభిన్నమైన హెయిర్‌ స్టైల్స్‌లో కనిపించడం ధోని ప్రత్యేకత. కానీ, ఈసారి పెద్దగా ప్రయోగాలు చేయలేదు. హెయిర్‌ షేప్‌ను అలాగే ఉంచి కాస్త తక్కువ జుట్టుతో కనిపిస్తున్నాడు. సైడ్‌లో ప్రొఫెషనల్‌గా కనిపించేలా మెయింటెన్ చేస్తున్నాడు MSD.  డేవిడ్ వార్నర్‌ ఆస్ట్రేలియా క్రికెటర్‌ డేవిడ్ వార్నర్‌ స్టైల్‌ను వేసవిలో ఫాలో కావచ్చు. సైడ్స్‌ పూర్తిగా తగ్గించి మధ్యలో తక్కువ జుట్టును ఉంచుకుంటే బెటర్. మీసం, గడ్డం కూడా ట్రిమ్‌ చేసుకుంటే లుక్ అదిరిపోతుంది. దీంతో పాటు ఉక్కపోత నుంచి ఉపశమనం కలుగుతుంది. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ గుజరాత్ కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా ట్రెండ్‌ను ఫాలో అవుతుంటాడు. ప్రస్తుతం హార్దిక్‌ కూడా వార్నర్‌ లాంటి హెయిర్‌ స్టైల్‌ను చేయించుకున్నాడు. సైడ్స్‌ను పూర్తిగా తగ్గించి మధ్యలో మీడియం జుట్టుతో ఉంటే సూపర్‌ కూల్‌గా ఉంటుంది.  నితీశ్‌ రాణా నితీశ్ రాణా ఫ్యాషన్ ఫ్రీక్‌ అని చెప్పవచ్చు. గతేడాది పర్పుల్ షేడ్‌ హెయిర్‌ స్టైల్‌తో కనిపించిన అతడు ఈ సారి పెద్దగా మార్పులు చేయలేదు. నితీశ్‌ది సమ్మర్‌కి సరిగ్గా సరిపోయే అండర్‌ కట్‌. ఇలాంటిది మీకు సూట్‌ అయితే ట్రై చేయవచ్చు. కేఎల్‌ రాహుల్‌ కేఎల్ రాహుల్ లాంటి హెయిర్‌ కట్‌ చూడటానికి సూపర్‌గా ఉంటుంది. సైడ్‌ పూర్తిగా ట్రిమ్ చేసుకొని ఫ్రెంచ్‌ గడ్డం మెయింటెన్ చేస్తే వేసవిలో ఇక తిరుగుండదు. మీకు ఇలాంటి లుక్ సెట్ అయితే ఆలస్యం లేకుండా చేసుకోండి. శిఖర్ ధావన్ వేసవి కాలానికి పర్‌ఫెక్ట్ కటింగ్ ధావన్‌ స్టైల్‌. అసలు జుట్టు ఉందా లేదా అనేంతలా ట్రిమ్ చేసి మధ్యలో స్టైల్‌ కోసం లైన్స్‌ పెట్టారంటే మాములు లుక్‌ ఉండదు. చిరాకు నుంచి కాస్తైనా తప్పించుకోవాలని అనుకుంటే ధావన్ హెయిర్ కట్ చేయించాల్సిందే. విరాట్ కోహ్లీ సమ్మర్‌లో విరాట్ కోహ్లీ హెయిర్‌ కట్‌ను కూడా ఫాలో కావచ్చు. సైడ్స్‌ పూర్తిగా ట్రిమ్ చేసుకొని మధ్యలో లైన్ తీసి జెల్ పెట్టారంటే ఇక అదిరిపోతుంది.  మార్క్రమ్‌ సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఉన్న మార్క్రమ్‌ సూపర్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఫంకీ స్లీక్‌ హెయిర్‌ స్టైల్‌ చేయించుకున్నాడు. సైడ్‌లో క్లాసీ లుక్ ఉంచి మధ్యలో బ్యాలెన్స్‌డ్‌గా జుట్టును మెయింటెన్‌ చేస్తే బాగుంటుంది.
    ఏప్రిల్ 26 , 2023
    TAAPSEE PANNU: ఇంత అందం దారి మళ్లిందా?... హాట్ అందాలతో రెచ్చిపోయిన తాప్సీ!
    TAAPSEE PANNU: ఇంత అందం దారి మళ్లిందా?... హాట్ అందాలతో రెచ్చిపోయిన తాప్సీ!
    సొట్ట బుగ్గల సుందరి తాప్సీ పొన్ను ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రెండింగ్‌లోకి వచ్చింది.  హాట్‌లుక్‌లో అందాల కనువిందు చేసింది  పాలవన్నెల పరువాలు ప్రదర్శిస్తూ షేక్ చేసింది ముద్దుగుమ్మ. నగుమోము వయ్యరాలను ఒలకబోస్తూ యువతకు మత్తెక్కిస్తోంది.  గోల్డ్ కలర్ డ్రెస్‌లో.. థండర్ థైస్, నాభి అందాలు చూపిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తున్నాయి.  తడిసిన చీరలో నాభి కేంద్రం కనిపించేలా అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారుకు మతిపోయేలా చేస్తోంది ఈ కుర్రది రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ఝమ్మంది నాదంతో తెలుగు సినిమాలోకి ఎంట్రీ ఇచ్చింది తాప్సీ. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే ఆకట్టుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంపిక చేసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది ఈ ఢిల్లీ భామ.  Mr. పర్‌ఫెక్ట్‌, సాహసం, కాంచన 2, ఘాజీ, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. తెలుగులో చాలా కాలం వరకు కెరీర్ బాగానేసాగిన తాప్సి స్టార్ హీరోలతో మాత్రం అనుకున్నంతగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.  గోపిచంద్‌తో సాహసం సినిమా ఆమె కెరీర్‌లో మంచి హిట్ పడ్డప్పటికీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇక ఆ తరువాత బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి బికినీ అందాలతో రెచ్చిపోయింది.  కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకా మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తాప్సి చాలా చేంజ్ అవుతూ వచ్చింది. పింక్ వంటి సందేశాత్మక చిత్రంలో నటించి మంచిపేరు తెచ్చుకుంది. నామ్‌ శభానా, బద్లా వంటి బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో నటించి మెప్పించింది.  సినిమాల్లోనే కాకుండా వ్యాపారిగానూ రాణిస్తుంది ఈ బ్యూటీ. పూణే 7 Aces బ్యాడ్మింటన్‌ ఫ్రాంఛైజీకి యజమాని.  అంతేకాదు, వెడ్డింగ్ ఫ్యాక్టరీ అనే ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ సంస్థను కూడా నడిపిస్తోంది. ఇటీవల మిషన్ ఇంపాజిబుల్‌ చిత్రంతో తెలుగులో మెరిసింది తాప్సీ.   తాజాగా షారుఖ్ ఖాన్‌తో డుంకీ సినిమాలో నటించి నటనపరంగా మంచి మార్కులు కొట్టేసింది.  ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ఏలియన్, ఓ లడ్కీ హై కహాన్ అనే చిత్రాల్లో నటిస్తోంది.
    జనవరి 09 , 2024
    Taapsee Pannu: ప్రియుడితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. వేదిక ఎక్కడంటే?
    Taapsee Pannu: ప్రియుడితో సీక్రెట్‌గా పెళ్లికి సిద్ధమైన తాప్సీ.. వేదిక ఎక్కడంటే?
    ప్రస్తుతం భారత సినీ పరిశ్రమలలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. దేశంలోని వివిధ ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు పెళ్లి బాట పడుతున్నారు. ఇటీవల యంగ్‌ హీరో దిల్‌రాజు సోదరుడు కుమారుడు ఆశీష్‌ రెడ్డి పెళ్లి చేసుకోగా.. ఈ మధ్య స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సైతం వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. తాజాగా సొట్టబుగ్గల సుందరి తాప్సీ పన్ను (Taapsee Pannu) కూడా పెళ్లి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమె పేరు #TaapseePannu హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్‌ అవుతోంది.  https://twitter.com/memesbyAru/status/1762745277944054182 తాప్సీ పన్ను.. తన బాయ్‍ఫ్రెండ్, డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియస్ బోయ్ (Mathias Boe)ని వివాహం చేసుకోనున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. సుమారు పదేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని.. మార్చి నెలఖారు లోపు పెళ్లి బంధంతో వీరు ఒక్కటవుతారని సమాచారం.  సినీ తారల వెడ్డింగ్ డెస్టినేషన్‌గా మారిపోయిన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా తాప్సి - మథియస్‌ వివాహం జరుగనున్నట్లు తెలుస్తోంది. ఈ శుభకార్యానికి కుటుంబ సభ్యులు, బంధువులు మాత్రమే హాజరవుతారని, సినీ తారలు ఎవరూ హాజరుకావడం లేదని అంటున్నారు.  సిక్కు, క్రైస్తవ పద్ధతుల్లో వీరి వివాహం జరగనుందని వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అతి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని నెట్టింట ప్రచారం జరుగుతోంది.  సుమారు పదేళ్లుగా తాప్సీ - మథియస్ ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటకు రాకుండా ఈ జంట చాలా జాగ్రత్త పడింది. ఇటీవల తాప్సీ ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ గురించి చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది.  బాలీవుడ్‍లో తన తొలి సినిమా ‘ఛష్మీ బద్దూర్’ (2013) షూటింగ్ సమయంలో మథియస్‍ను తాను కలిశానని తాప్సీ ఆ ఇంటర్యూలో చెప్పింది. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది. ఇలా దశాబ్దం నుంచి తాప్సీ - మథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ తాప్సీ పరువాలకు మంచి ప్రశంసలే దక్కాయి.  ‘ఝమ్మంది నాదం’ (Jhummandi Naadam) తర్వాత తాప్సీ వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.  ప్రభాస్‌తో ‘Mr. పర్‌ఫెక్ట్‌’, గోపీచంద్‌తో ‘సాహసం’, లారెన్స్‌తో ‘కాంచన 2’, దగ్గుబాటి రానాతో ‘ఘాజీ’, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.  2013లో బాలీవుడ్‍లో అడుగుపెట్టిన తాప్సీ.. 'పింక్‌' సినిమాతో అక్కడ చాలా పాపులర్ అయ్యింది. ఆమె టాలెంట్‌కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముడేళ్లుగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు. తాప్సీ పన్ను లేటెస్ట్ మూవీ ‘డంకీ’ (Dunki) గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మెప్పించింది.  ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ చేతిలో ఓ లడ్కీ హై కహాన్‌ (Woh Ladki Hai Kahaan?) పిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా (Phir Aayi Haseen Dillruba) ఖేల్‌ ఖేల్‌ మీన్‌ (Khel Khel Mein) వంటి చిత్రాలు ఉన్నాయి.
    ఫిబ్రవరి 28 , 2024
    Taapsee Pannu Marriage: విదేశీయుడ్ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. అతికొద్ది మంది మాత్రమే హాజరు!
    Taapsee Pannu Marriage: విదేశీయుడ్ని సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న తాప్సీ.. అతికొద్ది మంది మాత్రమే హాజరు!
    ప్రముఖ హీరోయిన్‌ తాప్సీ పన్ను (Taapsee Pannu) సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియాస్‌ బో (Mathias Boe)తో ఆమె ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు పదేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. తాజాగా ఈ ప్రేమ జంట వివాహబంధంతో ఒక్కటైనట్లు  మీడియాలో వార్తలు వస్తున్నాయి.  మార్చి 20న ఈ జంట ప్రీవెడ్డింగ్‌ వేడుకలు జరిగినట్లు తెలుస్తోంది. 23న ఉదయ్‌పుర్‌లో తాప్సీ- మథియాస్‌ బోతో పెళ్లి జరిగిందని.. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరైనట్లు సమాచారం.  ఇక ఈ వార్తలకు బలం చేకూరుస్తూ తాప్సీ బెస్ట్ ఫ్రెండ్‌, ప్రొడ్యూసర్‌ కనిక (Kanika Dhillon) తాజాగా కొన్ని ఫొటోలు షేర్‌ చేశారు. వాటికి ‘నా స్నేహితుల పెళ్లిలో’ అని క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఆమె ఈ పెళ్లికే వెళ్లారంటూ పలువురు వెల్లడిస్తున్నారు.  తాప్సీ - మథియాస్‌ వేడుకకు బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ (Anurag Kashyap) కూడా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తాప్సీ అధికారిక ప్రకటన కోసం ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోనున్నారంటూ వార్తలు రాగా వాటిపై తాప్సీ స్పందించారు.  ‘వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుందో చెప్పమంటూ ఎవరినీ ఒత్తిడి చేయకూడదు. ఒకవేళ నేను దేని గురించైనా ప్రకటన చేయాలనుకుంటే స్వయంగా వెల్లడిస్తాను. పెళ్లి గురించి నేనేం దాచాలనుకోవడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది’ అని ఆమె పేర్కొంది.  బాలీవుడ్‍లో తన తొలి సినిమా ‘ఛష్మీ బద్దూర్’ (2013) షూటింగ్ సమయంలో మథియస్‍ను తాను కలిశానని తాప్సీ ఓ ఇంటర్యూలో చెప్పింది. అతడితో రిలేషన్‍లో తాను చాలా సంతోషంగా ఉన్నానని అప్పట్లో పేర్కొంది. ఇలా దశాబ్ద కాలం  నుంచి తాప్సీ - మథియస్ లవ్ స్టోరీ నడుస్తోంది. రాఘవేంద్ర రావు దర్శకత్వం వహించిన ‘ఝమ్మంది నాదం’ సినిమాతో తాప్సీ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. పాలమీగడలాంటి పరువాలతో మెుదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ సినిమా ఫ్లాప్‌ అయినప్పటికీ తాప్సీ పరువాలకు మంచి ప్రశంసలే దక్కాయి.  ‘ఝమ్మంది నాదం’ (Jhummandi Naadam) తర్వాత తాప్సీ వరుస అవకాశాలు దక్కించుకుంది. అగ్రహీరోల సరసన అవకాశాలు కొట్టేస్తూ అనతికాలంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగిపోయింది.  ప్రభాస్‌తో ‘Mr. పర్‌ఫెక్ట్‌’, గోపీచంద్‌తో ‘సాహసం’, లారెన్స్‌తో ‘కాంచన 2’, దగ్గుబాటి రానాతో ‘ఘాజీ’, గేమ్ ఓవర్ వంటి తెలుగు హిట్ సినిమాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.  2013లో బాలీవుడ్‍లో అడుగుపెట్టిన తాప్సీ.. 'పింక్‌' సినిమాతో అక్కడ చాలా పాపులర్ అయ్యింది. ఆమె టాలెంట్‌కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆమె ముడేళ్లుగా బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టారు. తాప్సీ పన్ను ఇటీవల ‘డంకీ’ (Dunki) గత డిసెంబర్‌లో రిలీజై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో బాలీవుడ్‌ బాద్‌షా షారుక్‌ ఖాన్‌కు జోడీగా నటించి ఈ బ్యూటీ మెప్పించింది.  ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటిస్తూ తాప్సీ బిజీ బిజీగా ఉంటోంది. ఈ భామ చేతిలో ఓ లడ్కీ హై కహాన్‌ (Woh Ladki Hai Kahaan?) పిర్ ఆయీ హసీన్‌ దిల్‌రూబా (Phir Aayi Haseen Dillruba) ఖేల్‌ ఖేల్‌ మీన్‌ (Khel Khel Mein) వంటి చిత్రాలు ఉన్నాయి.
    మార్చి 25 , 2024
    Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
    Oscar Award Winning Movies 2024: ఆస్కార్‌ గెలిచిన ఈ సినిమాలు ఎందుకు చూడాలంటే?
    సాధారణంగా అవార్డ్ విన్నింగ్ సినిమా అంటే సినీ ప్రేమికులు చూసేందుకు ఇష్టపడతారు. ఇక ఆస్కార్ దక్కించుకున్న సినిమా అంటే వారి ఆసక్తి ఇక ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయా చిత్రాలు అవార్డు సాధించేంత స్పెషాలిటీ ఆ సినిమాల్లో ఏముందోనని తెలుసుకునేందుకు వారు తెగ వెతికేస్తుంటారు. తాజాగా అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో అంగరంగ వైభవంగా అస్కార్‌ వేడుకలు జరిగాయి. ఇందులో 10 చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఆయా చిత్రాల విశేషాలను YouSay మీ ముందుకు తెచ్చింది. అంతేకాకుండా ఆస్కార్‌కు నామినేట్ అయినా చిత్ర వివరాలను సైతం ఈ కథనంలో పొందుపరిచింది. ఆయా సినిమాల కథ, ఏ ఓటీటీ వేదికలో స్ట్రీమింగ్ అవుతోంది అన్న విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.  ఆస్కార్‌ గెలిచిన చిత్రాలు ఓపెన్ హైమర్ (Oppenheimer) అందరూ ఊహించనట్లే ఈసారి 'ఓపెన్ హైమర్' చిత్రానికి ఏకంగా ఏడు పురస్కారాలు దక్కాయి. ఈ చిత్రానికి హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ క్రిస్టోపర్‌ నోలాన్‌ (Christopher Nolan) దర్శకత్వం వహించారు. కథ విషయానికి వస్తే ఈ సినిమా.. ప్రముఖ అమెరికన్‌ సైంటిస్ట్ జె. రాబర్ట్‌ ఓపెన్‌హైమర్‌ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఫాదర్‌ ఆఫ్‌ ఆటమ్‌ బాంబ్‌గా అతడి జర్నీ ఎలా మెుదలైంది? అసలు అణుబాంబును అమెరికా ఎందుకు తయారు చేయాల్సి వచ్చింది? జపాన్‌లోని హీరోషిమా - నాగసాకిపైనే వారు ఎందుకు దాడి చేశారు? ఆ దాడి తర్వాత ఓపెన్‌హైమర్‌ మానసిక పరిస్థితి ఎలా ఉండేది? ఆపే అతని జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? అన్నది స్టోరీ. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ బేసిస్ తో చూడొచ్చు. అయితే మార్చి 21 నుంచి జియో సినిమాలో ఉచితంగా స్ట్రీమింగ్ కానుంది. బార్బీ (Barbie) గ్రెటా గర్‌విగ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఒక  ఫాంటసీ కామెడీ ఫిల్మ్. ఒక ట్రాన్స్ జెండర్ ఓ బార్బీ మధ్య జరిగే కథ ఇది. బార్బీ డాల్స్ కోసం నిజంగా ఒక లోకం ఉంటే... తన లోకం వదిలి సదరు బార్బీ డాల్ భూలోకంలో అడుగు పెడితే ఎలా ఉంటుంది. బార్బీ డాల్ పట్ల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుంది. అసలు బార్బీ తన ప్రపంచం వదిలి భూలోకంలోకి ఎందుకు వచ్చింది? వంటి విషయాల సమాహారమే ఈ మూవీ. అవుట్ అండ్ అవుట్ కామెడీ రొమాంటిక్ ఎంటర్టైనర్‌గా ‘బార్బీ’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని ‘జియో సినిమా’ ఓటీటీ వేదికలో వీక్షించవచ్చు.  పూర్‌ థింగ్స్‌ (Poor Things) ఈ సినిమా కథలోకి వెళ్తే.. అసాధారణ శాస్త్రవేత్త గాడ్విన్‌ బాక్స్‌టర్‌.. చనిపోయిన యువతికి తిరిగి జీవం పోస్తాడు. ఆమె మెదడును కడుపులో ఉన్న బిడ్డతో అనుసంధానం చేస్తాడు. దీంతో శిశువు తెలివితేటలు అసాధారణంగా పెరిగిపోతాయి. బయటి ప్రపంచం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రయాణం మెుదలు పెడుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనూహ్య పరిస్థితులు ఎదురవుతాయి. చివరికీ ఏమైంది? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని డిస్నీ + హాట్‌స్టార్‌లో చూడవచ్చు.  అమెరిన్‌ ఫిక్షన్‌ (American Fiction) అమెరికన్‌ ఫిక్షన్ సినిమా.. ఓ నవలా రచయిత చుట్టూ తిరుగుతుంది. కథలోకి వెళ్తే.. మాంక్‌ ఒక తెలివైన గొప్ప నవలా రచయిత. అతడి నవలలకు అకాడెమిక్‌ ప్రశంసలు లభించినా ప్రచురణకు మాత్రం పెద్దగా నోచుకోవు. నల్లజాతీయుడు కావడం చేత మాంక్‌కు కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. దీంతో విసుగు చెందిన మాంక్‌.. మనసు లోతుల్లో ఎప్పటి నుంచో దాగున్నా అభిప్రాయాలను ఓ పుస్తకం ద్వారా ప్రపంచానికి తెలియజేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో మాంక్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది కథ. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.  అనాటమి ఆఫ్‌ ఏ ఫాల్‌ (Anatomy of a Fall) ఈ సినిమా మిస్టరీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందింది. కథలోకి వెళ్తే.. శామ్యుల్‌, శాండ్రా భార్య భర్తలు. వారిద్దరు తమ బిడ్డ డానియేల్‌తో కలిసి సంతోషంగా జీవిస్తుంటారు. ఓ రోజు అనుమానస్పద స్థితిలో శామ్యుల్‌ చనిపోతాడు. పోలీసులు అతడి భార్య శాండ్రాపై అనుమానం వ్యక్తం చేస్తారు. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి విషయాలు వెలుగు చూశాయి? శామ్యుల్‌ను హత్య చేసింది ఎవరు? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.  ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌  (The Zone of Interest) కమాండెంట్‌ రూడొల్ఫ్‌ హాస్‌ తన భార్య, పిల్లలతో కలిసి చెరువుకు ఆనుకొని ఉన్న ఇంటిలో జీవిస్తుంటాడు. అతడి ఇంటి ఆవరణలో ఉండే గార్డెన్‌లో కొందరు బానిసలు పనిచేస్తుంటారు. ఓ రోజు చెరువులో తన పిల్లల మృతదేహాలు రుడోల్ఫ్‌కు కనిపిస్తాయి. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది కథ. ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.  ది హోల్డోవర్స్‌ (The Holdovers) టీచర్‌, స్టూడెంట్‌కు మధ్య ఉండే సంబంధాలను ఈ చిత్రం ప్రతిబింబిస్తుంది. ప్రిపరేషన్‌ స్కూల్‌లో క్రాంకీ హిస్టరీ టీచర్‌గా పనిచేస్తుంటాడు. అతడంటే విద్యార్థులకు చాలా భయం. స్కూల్‌కు క్రిస్మస్‌ సెలవులు రావడంతో కొందరు విద్యార్థులు హాలీడేస్‌కు వెళ్లలేకపోతారు. వారికి గార్డియన్‌గా క్రాంకీ ఉండాల్సి వస్తుంది. ఈ క్రమంలో టీచర్‌కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్నది స్టోరీ. ఈ చిత్రాన్ని అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్ విధానంలో చూడవచ్చు.  మ్యాస్ట్రో (Maestro) ఈ చిత్రం అద్భుతమైన ప్రేమ కావ్యంగా రూపొందింది. కండక్టర్‌ - స్వరకర్త లియోనార్డ్ బెర్న్‌ స్టెయిన్‌ ఓ కార్యక్రమంలో నటి ఫెలిసియాను చూసి మనసు పడతాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడటంతో ఇద్దరూ డేటింగ్‌కు వెళ్తారు. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారు. వారి వైవాహిక బంధం ఎంత మధురంగా సాగింది? ఈ ప్రయాణంలో వారికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించారు? అన్నది కథ. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.  కిల్లర్‌ ఆఫ్‌ ద ఫ్లవర్‌ మూన్‌ (Killers of the Flower Moon) లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా.. గతేడాది విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. 1920లో ఒక్లాహోమాలోని ఓసేజ్‌ నేషన్ ల్యాండ్‌ కింద చమురు బయటపడుతుంది. ఆ తర్వాత నుంచి ఆ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఈ మిస్టరీని ఛేదించేందుకు ఎఫ్‌బీఐ రంగంలోకి దిగుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అన్నది ప్లాట్‌. ప్రస్తుతం ఈ సినిమా ఆపిల్‌ టీవీ ప్లస్‌లో అందుబాటులో ఉంది. ఆస్కార్‌ నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాలు ఆస్కార్ గెలిచిన చిత్రాలతో పాటు ఈ అవార్డుల రేసులో నిలిచిన మరికొన్ని చిత్రాల విశిష్టతను ఓసారి తెలుసుకుందాం. పాస్ట్ లైవ్స్‌ (Past Lives) నోరా, హే సంగ్ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు. నోరా కుటుంబం దక్షిణ కొరియాకు వెళ్లిపోవడంతో వారు విడిపోతారు. ఇరవై సంవత్సరాల తర్వాత వారు తమ ఒకరికొరు ప్రేమలు ఉన్నట్లు గ్రహిస్తారు. వారు తిరిగి ఎలా ఒక్కటయ్యారు? అన్నది స్టోరీ. ఈ సినిమాను కూడా అమెజాన్‌ ప్రైమ్‌లో రెంటల్‌ విధానంలో చూడవచ్చు. ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. సొసైటీ ఆఫ్‌ ది స్నో (Society of the Snow) రగ్బీ బృందంతో ప్రయాణిస్తున్న విమానం.. ప్రమాదవశాత్తు ఆండీస్‌ మంచు పర్వతాల్లో కుప్పకూలుతుంది. ఈ ప్రమాదం నుండి కొందరు ప్రయాణికులు బయటపడతారు. అత్యంత కష్టతరమైన వాతావరణంలో తమ ప్రాణాలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. బాహ్య ప్రపంచానికి తాను బతికే ఉన్నామని చెప్పేందుకు వివిధ రకాలు అన్వేషిస్తారు. మరి వారు ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నది కథ. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.  లో క్యాపిటనో (Lo Capitano) వలసదారులు పడే కష్టాలకు ఈ చిత్రం అద్దం పడుతుంది. ఇద్దరు నల్లజాతి యువకులు యువకులు చేసే సాహస యాత్రనే ఈ చిత్రం కథ. యూరప్ చేరుకోవడానికి డాకర్ నుండి ఇద్దరు యువకులు సెడౌ, మౌసా బయలుదేరుతారు. గమ్యాన్ని చేరుకునే క్రమంలా వారికి ఎలాంటి కఠిన పరిస్థితులు ఎదురయ్యాయి. వాటిని ఎలా అధిగమించారు? చివరికి వారు యూరప్‌ చేరుకున్నారా? లేదా? అన్నది ప్లాట్‌.  పర్‌ఫెక్ట్‌ డేస్‌ (Perfect Days) ఆస్కార్‌ నామినేషన్‌లో నిలిచి ఈ చిత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. హిరాయామా అనే వ్యక్తి టోక్యోలో టాయిలెట్ క్లీనర్‌గా పని చేస్తూ సంతృప్తికరమై జీవితాన్ని అనుభవిస్తుంటాడు. క్యాసెట్ టేపులలో సంగీతాన్ని వింటూ, పుస్తకాలు చదువుతూ హాయిగా రోజులు గడుపుతుంటాడు. కొన్ని ఊహించని ఘటనలు అతడి జీవితంలో ఎనలేని మార్పులను తీసుకొస్తాయి.  ది టీచర్స్‌ లాంజ్‌ (The Teachers' Lounge) కర్నా నోవాక్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తుంటుంది. ఆమె స్టూడెంట్స్‌లో ఒకరు దొంగతనానికి సంబంధించి అనుమానితుడుగా ఉంటాడు. నిజా నిజాలు తెల్చేందుకు ఆమె రంగంలోకి దిగుతుంది. ఈ క్రమంలో ఆమెకు అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ప్రస్తుతం ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో వీక్షించవచ్చు. 
    మార్చి 11 , 2024
    Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
    Upcoming Telugu Movies: 2024లో రాబోతున్న టాలీవుడ్‌ బడా చిత్రాలు ఇవే!
    కొత్త సంవత్సరంలో పలు భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలు సంక్రాంతికి రిలీజ్‌ అవుతుండగా మరికొన్ని షూటింగ్‌, పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. వీటిలో రామ్‌చరణ్‌, ప్రభాస్‌, అల్లుఅర్జున్‌, పవన్‌ కల్యాణ్‌, కమల్‌హాసన్‌ వంటి స్టార్‌ హీరోల ప్రతిష్టాత్మక చిత్రాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాలు టాలీవుడ్‌ ఖ్యాతిని మరింత పెంచుతాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో రానున్న మోస్ట్‌ వాటెండ్‌ చిత్రాలు ఏవో ఇప్పుడు చూద్దాం.  గుంటూరు కారం సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'గుంటూరు కారం' (Guntur Kaaram). భారీ అంచనాల నడుమ ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. ఈ మూవీలో మహేష్‌కు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరీలు నటిస్తున్నారు.  హనుమాన్ ఈ సంక్రాంతికే రాబోతున్న పాన్‌ వరల్డ్ చిత్రం ‘హనుమాన్‌’ (Hanuman). డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ ఇది. హనుమంతుడికి మించిన సూపర్ మాన్ మరొకరు ప్రపంచంలో లేరని ఈ సినిమా ద్వారా చూపించబోతున్నారు డైరెక్టర్‌. యంగ్ హీరో తేజ సజ్జా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. జనవరి 12న తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్‌గా హనుమాన్‌ విడుదల కానుంది.  భారతీయుడు 2 అగ్ర కథానాయకుడు కమల్‌ హాసన్‌, దర్శకుడు శంకర్‌ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం 'భారతీయుడు 2'. కాజల్‌ అగర్వాల్‌, సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వృద్ధుడు పాత్రలో కమల్‌ హాసన్‌ కనిపించనున్నారు.  పుష్ప 2 సుకుమార్‌ దర్శకత్వంలో అల్లుఅర్జున్ నటిస్తున్న చిత్రం 'పుష్ప2' (Pushpa 2). తొలి భాగం 'పుష్ప' పాన్‌ ఇండియా స్థాయిలో సూపర్‌హిట్‌ కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి పార్ట్‌-2పై పడింది. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక మందన్న నటిస్తోంది. కేరళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడు పాత్ర పోషిస్తున్నాడు.  ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌'. ఈ చిత్రం కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నెల రోజుల క్రితం వరకూ ఈ చిత్ర షూటింగ్‌ శరవేగంగా జరగ్గా.. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో బ్రేక్‌ పడింది. ఏపీ ఎన్నికల తర్వాత ఈ సినిమా మిగిలిన షూటింగ్‌ను పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. గేమ్‌ ఛేంజర్‌ మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోగా.. డైరెక్టర్ శంకర్‌ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్‌ పట్టుదలగా ఉన్నారు. కాగా, ఇందులో చరణ్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది. అంజలి, ఎస్‌.జే. సూర్య, నవీన్ చంద్ర, సునీల్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  కల్కి 2898 ఏడీ సలార్‌ సూపర్‌ హిట్‌ కావడంతో సినీ ప్రియులంతా ఆయన తర్వాత చిత్రం 'కల్కి 2898 ఏడీ' కోసం ఎదురు చూస్తున్నారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే నటిస్తోంది. కమల్‌ హాసన్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. స్పిరిట్‌ సందీప్‌ రెడ్డి వంగా డైరెక్షన్‌లో ప్రభాస్‌ హీరోగా రానున్న క్రేజీ పార్జెక్ట్‌ 'స్పిరిట్‌' (Spirit). ఈ చిత్రంలో ప్రభాస్‌ కెరీర్‌లోనే మెుదటి సారి ఖాకీ డ్రెస్‌ వేసుకోబోతున్నాడు. అగ్రెసివ్ పోలీసు ఆఫీసర్‌గా రెబల్‌ స్టార్‌ కనిపిస్తాడని నిర్మాత ప్రణయ్‌రెడ్డి వంగా పేర్కొన్నారు. ఈ చిత్ర షూటింగ్‌ కూడా కొత్త ఏడాదిలోనే ప్రారంభం కానున్నట్లు ఇటీవల డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా తెలియజేశారు. 
    డిసెంబర్ 30 , 2023
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    Latest OTT telugu Movies: ఈ వీకెండ్‌లో ఈ చిత్రాలను అస్సలు మిస్ కాకండి.. సూపర్బ్ థ్రిల్లింగ్ సినిమాలు
    రీసెంట్‌గా చాలా సినిమాలు ఓటీటీల్లోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో థియేటర్లలో విడుదలై రెండు వారాలు గడవకముందే ఓటీటీలోకి వచ్చిన సినిమాలు ఉన్నాయి. మరికొన్ని నేరుగా ఓటీటీల్లోకి విడుదలైన వెబ్ సిరీస్‌లు ఉన్నాయి. ఇక్కడ అందిస్తున్న లిస్ట్‌లో దాదాపు అన్నింటికీ ప్రేక్షకుల నుంచి మంచి రివ్యూలు అందుకున్నవే ఉన్నాయి. మరి వీటిలో మీకు నచ్చిన జనర్‌ను ఎంచుకుని వీకెండ్‌ను ఎంజాయ్ చేయండి లవ్ మీ ఇఫ్ యు డేర్ మీ రౌడీ బాయ్స్ ఫేమ్ ఆశిష్, బేబీ మూవీ వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘లవ్‌ మీ’ (Love Me). ఇఫ్‌ యూ డేర్‌ (If You Dare) అనేది ఉప శీర్షిక. ఈ చిత్రాని అరుణ్‌  తెరకెక్కించారు. దిల్ రాజు (Dil Raju) ప్రొడక్షన్స్ బ్యానర్‌లో హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి నిర్మించారు. దెయ్యంతో హీరో ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్న కాన్సెప్ట్‌తో ఈ మూవీని రూపొందించారు. మే 25న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మిక్స్డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్(జూన్ 15) వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో కాస్త రొమాంటిక్ డోస్‌ కావాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే... అర్జున్ (ఆశిష్), ప్రతాప్(రవికృష్ణ) కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఉంటారు. దెయ్యాలు, ఆత్మలు, స్మశానాలకు సంబంధించిన వీడియోలు చేస్తుంటారు. ప్రతాప్‌ లవర్‌ ప్రియా (వైష్ణవి చైతన్య).. దివ్యవతి అనే దెయ్యం గురించి చెప్పడంతో ఆమె ఉంటున్న పాడుబడ్డ అపార్ట్‌మెంట్‌కు అర్జున్‌ వెళ్తాడు. అలా వెళ్లిన అర్జున్‌ దివ్యవతి ఆత్మతో ప్రేమలో పడతాడు. మరి ఆ దెయ్యం కూడా అర్జున్‌ ప్రేమలో పడుతుందా? అసలు ఈ దివ్యవతి ఎవరు? సినిమా ప్రారంభంలో నిప్పంటించుకొని చనిపోయిన కపుల్‌తో ఆమెకున్న సంబంధం ఏంటి? చివరికీ ఏమైంది? అన్నది కథ. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు.మే 31న  థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్ల పరంగా బ్రేక్ ఈవెన్ సాధించి విజయం అందుకుంది. ముఖ్యంగా విష్వక్ సేన్ మాస్ నటన ప్రేక్షకులను అలరించింది. నెహ శెట్టి, అంజలి గ్లామర్ తోడవడంతో (Gangs of Godavari Ott) ఆశించిన ఫలితం సాధించింది. అయితే థియేటర్లలో ఈ సినిమా మిస్‌ అయినవారు ఓటీటీలో వీక్షించే అవకాశం తాజాగా లభించింది. ప్రస్తుతం ఈ చిత్రం(జూన్ 14నుంచి) నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌పామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అప్పుడు మిస్ అయిన వారు ఈ వీకెండ్‌లో చూసి ఎంజాయ్ చేయండి.  ఇక ఈ సినిమా కథ విషాయానికొస్తే..  పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ. పారిజాత పర్వం సునీల్‌, శ్రద్ధాదాస్‌, చైతన్య రావు, మాళవిక సతీశన్‌ ప్రధాన పాత్రల్లో చేసిన చిత్రం 'పారిజాత పర్వం' (Paarijatha Parvam). సంతోష్‌ కంభంపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి 'కిడ్నాప్‌ ఈజ్‌ ఏన్‌ ఆర్ట్‌' అని ఉపశీర్షిక పెట్టారు.  (ఏప్రిల్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం(జూన్ 12 నుంచి) ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కామెడీ జనర్‌లో వచ్చిన ఈ సినిమా వీకెండ్‌లో చూసేందుకు మంచి ఛాయిస్‌గా చెప్పవచ్చు. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే.. చైత‌న్య (చైత‌న్య‌రావు) డైరెక్టర్ కావాలని క‌ల‌లు కంటుంటాడు. స్నేహితుడ్ని (హ‌ర్ష‌) హీరోగా పెట్టి ఓ కథతో నిర్మాత‌ల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్‌ కాకపోవడంతో చివ‌రికి తానే నిర్మాత‌గా మారి సినిమా తీయాల‌ని ఫిక్స‌వుతాడు. డ‌బ్బు కోసం శెట్టి (శ్రీ‌కాంత్ అయ్యంగార్‌) సెకండ్ సెట‌ప్‌ని కిడ్నాప్ చేయాల‌ని ప్లాన్‌ వేస్తాడు.  మ‌రోవైపు బారు శ్రీ‌ను (సునీల్‌), పారు (శ్ర‌ద్దా దాస్‌) కూడా ఆమెను కిడ్నాప్‌ చేసేందుకు స్కెచ్ వేస్తారు. మ‌రి ఈ ఇద్ద‌రిలో శెట్టి భార్య‌ని ఎవ‌రు కిడ్నాప్ చేశారు? అస‌లు బారు శ్రీ‌ను ఎవ‌రు? అతడి క‌థేంటి? చైతన్య డైరెక్టర్‌ అయ్యాడా? లేదా? అన్నది కథ.  యక్షిణి మంచు లక్షి, వేదిక ప్రధాన పాత్రల్లో నటించిన సోషియో ఫాంటసి & హారర్‌ సిరీస్‌ 'యక్షిణి'. కోటా బొమ్మాళి ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా చేశాడు. డైరెక్టర్ తేజ (Yakshini Ott) మార్ని రూపొందించిన ఈ సిరీస్‌.. నేరుగా డిస్నీ హాట్‌స్టార్‌లో జూన్ 14 విడుదలైంది. ఈ వెబ్‌ సిరీస్‌పై పాజిటివ్ సమీక్షలు అయితే వస్తున్నాయి. వీకెండ్‌లో మంచి హరర్‌ థ్రిల్లర్ సినిమా కావాలనుకునే వారు ఈ సిరీస్‌ను చూడవచ్చు. ఇక కథ విషయానికొస్తే.. యక్షిణిల రాజైన అయిన కుబేరుడు,  మాయ అనే దేవకన్యను (వేదిక)ను శపిస్తాడు. ఆమె తిరిగి అల్కపురికి వచ్చేందుకు 100 మందిని చంపాలని షరతు పెడుతాడు. దీంతో ఆమె అమాయకుడైన  కృష్ణ (రాహుల్ విజయ్)ని  ప్రేమిస్తున్నట్లు నాటకమాడి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. అతన్ని చంపే క్రమంలో మహాకల్ (అజయ్) మహాకల్ అడ్డుపడుతాడు. ఇంతకు ఈ మహాకల్ ఎవరు? మాయకు ఎందుకు అడ్డుపడుతాడు? జ్వాలముఖి(మంచు లక్ష్మి) ఎలా ప్రవేశిస్తుంది? చివరకు మాయ తన స్వస్థలం అల్కాపురికి చేరుకుందా? లేదా? అనేది మిగతా కథ. పరువు నివేదా పేతురాజ్‌, నరేష్‌ అగస్య ప్రధాన పాత్రల్లో నటించిన సిరీస్‌ ‘పరువు’. సిద్దార్థ్ నాయుడు, వడ్లపాటి రాజశేఖర్ తెరకెక్కించిన ఈ సిరీస్‌లో నాగబాబు, ప్రణీత పట్నాయక్, బిందు మాధవి, అమిత్ తివారి ప్రముఖ పాత్రలు పోషించారు. జూన్ 14న ఈ వెబ్ సిరీస్ నేరుగా జీ5లో(Paruvu ott) విడుదలైంది. ఈ వెబ్ సిరీస్‌పైన మిక్స్‌డ్ రివ్యూస్ వస్తున్నాయి. పబ్లిక్ మాత్రం ఈ క్రైమ్ థ్రిల్లర్‌ను చూడొచ్చు అని అడ్వైజ్ చేస్తున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ కథ విషయానికొస్తే... పల్లవి(నివేదా పేతురాజ్), సుధీర్(నరేష్ అగస్త్య) ఒకరినొకరు ప్రేమించుకుంటారు. కులాలు వేరు కావడంతో పెద్దలు ఓప్పుకోరు. దీంతో ప్రేమ వివాహం చేసుకుంటారు. ఈక్రమంలో పల్లవి పెద్దనాన్న చనిపోవడంతో అతన్ని చూసేందుకు పల్లవి, సుధీర్ బయల్దేరుతారు. మార్గమాధ్యలో ఇద్దరు కలిసి పల్లవి బావ చందును చంపుతారు. ఇంతకు చందును వీరిద్దరు ఎందుకు చంపాల్సి వచ్చింది. ఆ తర్వాత వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది మిగతా కథ.
    జూన్ 15 , 2024
    NANDINI GUPTHA: 19 ఏళ్ల అమ్మాయి… మిస్ ఇండియాగా గెలిచి ప్రపంచ వేదికపైకి !
    NANDINI GUPTHA: 19 ఏళ్ల అమ్మాయి… మిస్ ఇండియాగా గెలిచి ప్రపంచ వేదికపైకి !
    తొమ్మిదేళ్ల కల.. వయసు 19 ఏళ్లు.. ఆశయానికి అనుగుణంగా కష్టపడిన ఆమెను విజయం వరించింది. రాజస్థాన్‌కు చెందిన నందినీ గుప్తా మిస్‌ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. మిస్‌ వరల్డ్‌ పోటీలకు భారత్‌ నుంచి ప్రాతినిధ్యం వహించనుంది ఈ సుందరి. ఆమె గురించి మరిన్ని వివరాలు  తెలుసుకుందాం.  మిస్ ఇండియా 2023 మిస్ ఇండియా పోటీల్లో రాజస్థాన్‌ కోటాకు చెందిన నందనీ గుప్తా గెలుపొందింది. మణిపూర్‌లో జరిగిన 59వ అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఈ ముద్దుగుమ్మ… కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఏప్రిల్ 15న జరిగిన ఫైనల్స్‌ జరగ్గా… ఆమె అందానికి అందరూ దాసోహం అయ్యారు. విజేతగా ప్రకటిస్తూ జడ్జీలు నిర్ణయం తీసుకున్నారు. కిరీటాన్ని పెట్టి మిస్ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు బాటలు వేశారు. దీంతో నందినీ గుప్తా సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.  చిన్ననాటి కల నందినీ 10 ఏళ్ల వయసు నుంచే మిస్ ఇండియా కావాలని కలలు కంటోంది. ఈ విషయాన్ని తన బయోలో వెెల్లడించింది ఈ అందాల తార. చిన్నతనంలోనే వివిధ కార్యక్రమాలకు హోస్టింగ్ చేయడం పట్ల ఆసక్తి చూపించేదట. ఈ క్రమంలోనే ఫ్యాషన్ రంగంవైపు అడుగులు వేసింది నందినీ. చిన్న పట్టణం నుంచి ప్రపంచ వేదికపైకి వెళ్తున్నందుకు సంతోషంగా ఉందని ప్రకటించింది. “రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ కంటే ఈ ప్రయాణం తక్కువేం కాదు. కష్టం, సంకల్పం, అంతులేని మద్దతు నా విజయానికి కారణం. ప్రతిక్షణం దేశం గర్వించేలా చేసేందుకు కష్టపడతాను. ఈ విజయం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులకు అంకితం” అని పేర్కొంది.  స్ఫూర్తినిచ్చింది వీళ్లే రతన్ టాటా, ప్రియాంక చోప్రా తనకు ఆదర్శమని నందినీ గుప్తా వెల్లడించారు. “రతన్ టాటా నా జీవితంలో అత్యంత ప్రభావం చూపించిన వ్యక్తి. మానవత్వంతో సంపాదించిన చాలా మెుత్తం చారిటీకి ఖర్చు చేస్తారు. ఎంతో మంది ఆయన్ని ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే మనస్తత్వంతో ఉంటారు. అందుకే రతన్‌ టాటా నాకు స్ఫూర్తి” అని చెప్పింది. అంతేకాదు, ప్రియాంక చోప్రా కూడా అంతే స్ఫూర్తినిచ్చినట్లు వెల్లడించింది. చిన్న వయసులోనే భారతదేశం గర్వించేలా ప్రపంచ వేదికపై మిస్ వరల్డ్‌గా నిలిచిన ఆమె ప్రయాణం తనను ప్రేరేపించిందని చెప్పింది నందినీ గుప్తా.  నందినీ లక్ష్యం రాజస్థాన్‌ కోటాలో లభించే అత్యంత మన్నికైన ఫాబ్రిక్‌ గురించి ప్రచారం కల్పించాలని చూస్తోంది మిస్ ఇండియా. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత రంగానికి ప్రచారం కల్పించి నేతన్నలకు మేలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు… చాలామందికి ఉపాధి కల్పించాలనేది ఆమె లక్ష్యం.  విశ్వ సుందరి అవుతుందా? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగబోయే 71వ మిస్ వరల్డ్ పోటీల్లో నందినీ గుప్తా పోటీ పడబోతుంది.ఇందుకోసం ఎంతవరకైనా కష్టపడతానని చెబుతోంది ఈ ముద్దుగుమ్మ.  మరి, ఈ పోటీల్లో గెలిచి విశ్వ సుందరిగా రికార్డు సృష్టిస్తుందో లేదో చూడాలి. 
    ఏప్రిల్ 17 , 2023
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    Mem Famous Review: ‘జాతిరత్నాలను’ తలపించిన ‘మేమ్‌ ఫేమస్‌’...కానీ ఒక్కటి మిస్ అయ్యింది!
    నటీనటులు: సుమంత్‌ ప్రభాస్‌, సిరి రాశి, మురళిధర్‌ గౌడ్‌, అంజి, నరేంద్ర రవి, మౌర్య చౌదరి,  డైరెక్టర్‌: సుమంత్‌ ప్రభాస్‌ సంగీతం: కళ్యాణ్‌ నాయక్‌ సినిమాటోగ్రఫీ: శ్యామ్‌ దూపాటి నిర్మాతలు: చంద్రు మనోహరన్, అనురాగ్‌ రెడ్డి, శరత్‌ చంద్ర, సూర్య చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా వరకూ సినిమాలు తెలంగాణ నేపథ్యంతోనే తెరకెక్కుతున్నాయి. ఇలా వచ్చిన బలగం, జాతిరత్నాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్స్‌ సాధించాయి. తాజాగా ఇదే కోవలో తెరకెక్కిన సినిమా ‘మేమ్‌ ఫేమస్‌’. సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా అతడి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. `రైటర్‌ పద్మభూషణ్‌` వంటి సూపర్‌ హిట్‌ సినిమాను నిర్మించిన ఛాయ్‌ బిస్కెట్‌, లహరి ఫిల్మ్స్ వాళ్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కూడా ఇటీవలే విడుదలై ఆకట్టుకుంది. అంతేగాక టాలీవుడ్ స్టార్స్‌తో చేసిన విభిన్న ప్రమోషన్స్‌ కూడా సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ నేపథ్యంలో ఇవాళ (మే 26) రిలీజ్‌ అయిన ‘మేమ్‌ ఫేమస్‌’ అందరి అంచనాలను అందుకుందో లేదో ఇప్పుడు చూద్దాం.  కథ తెలంగాణలోని ఓ విలేజ్‌కు చెందిన మయి(సుమంత్‌ ప్రభాస్‌), దుర్గ(మణి ఏగుర్ల), బాలి(మౌర్య చౌదరి) మంచి స్నేహితులు. తెల్లారితే గొడవలు, రాత్రి అయితే తాగుడు అన్నట్లు జీవితాన్ని గడుపుతుంటారు. మయి త‌న మ‌ర‌ద‌లు మౌనిక (సార్య ల‌క్ష్మ‌ణ్‌)ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడ్ని ఇష్టపడుతుంది. మయి ఫ్రెండ్‌ బాలి కూడా ఊరిలోని ఇంకో అమ్మాయిని ఇష్టపడుతుంటాడు.  అయితే జులాయిగా తిరిగే స్నేహితులంతా కలిసి ఓ టెంట్‌ హౌజ్ పెడతారు. అది బాగా నడుస్తున్న సమయంలో షాట్‌ సర్య్కూట్‌కి టెంట్‌ హౌజ్‌ మొత్తం కాలిపోతుంది. దీంతో యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి వీడియోలు చేయడం స్టార్ట్‌ చేస్తారు. ఆ వీడియోల వల్ల గ్రామానికి ఎలాంటి మేలు జరిగింది? మయి, బాలి ప్రేమ కథలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి? అనేది మిగతా కథ. ఇది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.  ఎలా సాగిందంటే.. ముగ్గ‌రు ఫ్రెండ్స్ ఎడాపెడా తప్పులు చేస్తూ పంచాయతీలో నిలబడటం ఫ‌స్టాఫ్ అంతా రిపీట్‌ మోడ్‌లో క‌నిపిస్తుంది. అది చూసేవారికి కాస్త బోరింగ్‌ అనిపిస్తుంది. అసలు సినిమాలో కథ ఉందా అన్న ప్రశ్నను కూడా రేకెత్తిస్తుంది. ఊరి ప్రజల సూటిపోటీ మాటలతో టెంట్‌ హౌజ్‌ పెట్టుకొని స్నేహితులు బాధ్యత తెలుసుకున్నట్లు కనిపిస్తారు. ఈ క్రమంలో వచ్చే లవ్‌ ఇష్యూస్‌, టెంట్‌హౌజ్‌ అగ్నిప్రమాదానికి గురికావడం సెకాండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. అయితే సెకాండాఫ్‌ అంతా యూట్యూబ్‌ వీడియోస్‌ చుట్టే తిరుగుతుంది. ఈ క్రమంలో వచ్చే కామెడీ పంచ్‌లు నవ్విస్తాయి.  అలాగే సుమంత్ ప్ర‌భాస్‌, సార్య ల‌క్ష్మ‌ణ్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్ యూత్‌కి క‌నెక్ట్ అవుతుంది. సుమంత్ న‌ట‌న కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇక మ‌ణి, సార్య ల‌క్ష్మ‌ణ్‌, మ‌ణి ఏగుర్ల, ముర‌ళీధ‌ర్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల మేర‌కు న‌టించారు.  ఎవరెలా చేశారంటే? నటన పరంగా సుమంత్ ప్రభాస్ ఫ‌ర్వాలేద‌నిపించాడు.  నటనలో ఇంకాస్తా రాటుదేలాల్సి ఉంది. అతని ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసిన మ‌ణి, మౌర్య పాత్రల పరిధి మేరకు నటించారు. అంజిమామ‌, ముర‌ళీధ‌ర్ గౌడ్, కిర‌ణ్ మ‌చ్చా పాత్రలు గుర్తిండి పోతాయి. లిప్‌స్టిక్ స్పాయిల‌ర్ రోల్‌లో యాక్ట్ చేసిన శివ‌నంద‌న్ కామెడీ బాగుంది.  అన‌వ‌స‌ర స‌న్నివేశాలు సినిమాలో ఇబ్బ‌డిముబ్బ‌డిగా క‌నిపిస్తాయి.  డైరెక్షన్ ఎలా ఉందంటే? మేమ్‌ ఫేమస్‌ సినిమా చూస్తున్నంత సేపు ‘పెళ్లిచూపులు’, ‘జాతిరత్నాలు’ చిత్రాలే గుర్తుకువస్తాయి. సుమంత్‌ ప్రభాస్‌ కథను తన స్టైల్‌లో అద్భుతంగా రాసుకున్నప్పటికీ దానిని సమర్థవంతంగా తెరకెక్కించడంలో విఫలమైనట్లు కనిపించింది.  సుమంత్ రాసుకున్న స్టోరీలో ఏమాత్రం బ‌లం లేదు. రోటీన్‌గా ఉంది. కామెడీ, భావోద్వేగాల్ని తాను రాసుకున్న విధంగా తెరపై చూపించలేకపోయాడు. షార్ట్‌ఫిల్మ్‌ను తలపిస్తుంది. సినిమాను సరదాగా తీసుకెళ్తూనే మధ్య మధ్యలో ఎమోషనల్‌ సీన్స్‌ను ఇరికించారు. ఇక రైతు పడే కష్టం గురించి చెప్పే సీన్లు సందర్భానుసారంగా అనిపించదు. అయితే కొన్ని సీన్లు చాలా కొత్తగా అన్నిపిస్తాయి. కామెడీ కూడా నచ్చుతుంది. అయితే కొన్ని సీన్లు మినహా సినిమా ఓవరాల్‌గా మెప్పించలేకపోయింది.  టెక్నికల్‌గా సాంకేతికంగా చూస్తే శ్యామ్ దూపాటి కెమెరా వ‌ర్క్ బావుంది. క‌ళ్యాణ్ నాయ‌క్ పాట‌ల కంటే నేప‌థ్య సంగీతం ఆకట్టుకుంది. నిర్మాణ విలువలు కూడా సో సో గానే ఉన్నాయి. సినిమాకు ఎక్కువ బడ్జెట్‌ ఎందుకని భావించినట్లు అనిపించింది. ప్లస్‌ పాయింట్స్‌ కామెడీనేపథ్య సంగీతంఇంటర్‌వెల్‌కు ముందు సీన్లు మైనస్‌ పాయింట్స్‌ రొటిన్‌ స్టోరీసాగదీతపాటలు రేటింగ్‌: 2.75/5
    మే 26 , 2023
    Gangs Of Godavari Review: విష్వక్‌ సేన్‌- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
    Gangs Of Godavari Review: విష్వక్‌ సేన్‌- నేహా శెట్టి రొమాన్స్ సూపర్బ్! కానీ ఒక్కటి మిస్!
    నటీ నటులు: విశ్వక్ సేన్, అంజలి, నేహా శెట్టి, నాజర్, పి. సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు దర్శకత్వం: కృష్ణ చైతన్య సంగీతం: యువన్ శంకర్ సినిమాటోగ్రఫీ: అనిత్ మదాడి నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య విడుదల తేదీ : 31-05-2024 విష్వక్‌ సేన్‌ (Vishwak Sen) హీరోగా డైరెక్టర్ కృష్ణ చైతన్య తెరకెక్కించిన తాజా చిత్రం ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ (Gangs of Godavari Review In Telugu). నేహాశెట్టి హీరోయిన్‌. అంజలి కీలక పాత్ర పోషించింది. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌, టీజర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో విష్వక్‌ నటన సినిమాపై అంచనాలను మరింత పెంచింది. కాగా, మే 31న ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? విష్వక్‌ ఖాతాలో మరో హిట్‌ పడినట్లేనా? ఈ రివ్యూలో తెలుసుకుందాం.  కథేంటి పని పాట లేకుండా ఖాళీగా తిరిగే లంకల రత్నం(విష్వక్‌ సేన్‌).. తమ ఊరి రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ తట్టుకోలేకపోతాడు. రాజకీయాల్లోకి ప్రవేశించి ఆ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటాడు. మంచి ఉద్దేశ్యంతో పాలిటిక్స్‌లోకి దిగిన అతడికి ఊహించని సవాళ్లు ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? ప్రేమించిన అమ్మాయిని ఎలా సొంతం చేసుకున్నాడు? పాలిటిక్స్‌లో తన లక్ష్యాన్ని హీరో చేరుకున్నాడా? లేదా? అన్నది కథ.  ఎవరెలా చేశారంటే యంగ్‌ హీరో విష్వక్‌ సేన్‌.. మరోమారు తన మాస్ మెస్మరైజింగ్‌ నటనతో మాయ చేశాడు. లంకల రత్నం అనే మాస్‌ క్యారెక్టర్‌లో జీవించేశాడు. ముఖ్యంగా ఈ పాత్ర విష్వక్‌ నటనలోని మరో కొత్త కోణాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా యాక్షన్‌ సీన్లలో మాస్‌ జాతరే అన్నట్లు విష్వక్‌ నటన ఉంటుంది. ఇక హీరోయిన్‌ నేహా శెట్టి తనదైన నటనతో మెప్పించింది. విష్వక్- నెహా శెట్టి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.  ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మెప్పిస్తాయి. అందాల రాణిలా సాంగ్ థియేటర్లలో విజిల్స్ కొట్టిస్తుంది.  మరో నటి అంజలికి కూడా మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రనే దక్కింది. రత్నమాల క్యారెక్టర్‌లో జీవించింది. గతంలో ఎన్నడూ చేయని పాత్ర ద్వారా ఈ సినిమాలో అలరించింది. ఆమె   ఊరమాస్ డైలాగ్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. జబర్దస్త్‌ ఫేమ్ హైపర్ ఆది పంచ్‌లు సినిమాలో నవ్విస్తాయి. మిగతా నటీనటులు సహ తమ పాత్రలకు న్యాయం చేశారు.  డైరెక్షన్ ఎలా ఉందంటే దర్శకుడు కృష్ణ చైతన్య ఈ సినిమాను చాలా ఎంగేజింగ్‌గా తీసుకురావడంలో సక్సెస్‌ అయ్యాడు. తన గత చిత్రాలు రౌడీ ఫెలో, ఛల్ మోహన్ రంగా సినిమాలకు ఎంతో భిన్నంగా గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరిని తీర్చిదిద్దాడు. ప్రతీ పాత్రను కథకు అనుగుణంగా చక్కగా వినియోగించుకున్నాడు. సినిమా ఎండింగ్‌లో తండ్రికూతుళ్ల సన్నివేశాలు, క్లైమాక్స్, డైలాగ్స్‌ సినిమాకు చాలా బాగా ప్లస్ అయ్యాయి. అయితే ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌ స్లోగా నడవడం, రొటీన్‌ సన్నివేశాలు, రెగ్యులర్‌ స్టోరీ మూవీకి కాస్త మైనస్‌గా చెప్పవచ్చు.  టెక్నికల్‌గా సాంకేతిక అంశాల విషయానికి వస్తే.. యువన్ శంకర్ రాజా అందించిన నేపథ్య సంగీతం హైలెట్‌గా నిలిచింది. యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎలివేట్‌ చేయడానికి BGM ఎంతగానో ఉపయోగపడింది. అనిత్ మదాడి కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్‌ వర్క్‌ ఓకే. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. ఖర్చు విషయంలో నిర్మాత ఎక్కడ రాజీపడలేదు.  ప్లస్‌ పాయింట్స్‌ విష్వక్‌ సేన్‌ నటన డైలాగ్స్‌ సంగీతం మైనస్‌ పాయింట్స్‌ రెగ్యులర్‌ స్టోరీ స్లో నారేషన్‌ Telugu.yousay.tv Rating : 3/5   Public Talk On Gangs of Godavari సినిమా చాలా బాగుందంటూ ఓ నెటిజన్‌ ఎక్స్‌లో పోస్టు పెట్టాడు. కొన్ని ల్యాగ్‌ సీన్స్‌ ఉన్నాయని, స్క్రీన్‌ప్లే మాత్రం అద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.  https://twitter.com/raghav917252/status/1796382241532334575 చాలా రోజుల తర్వాత హౌస్‌ ఫుల్స్‌ చూస్తున్నట్లు మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఇది మ్యాసివ్ వీకెండ్‌ అంటూ వ్యాఖ్యానించాడు.  https://twitter.com/PulakithSai/status/1796399917969412273 ఫస్టాఫ్‌ బాగుందని.. కానీ స్టోరీలో మాత్రం కొత్తదనం లేదని మరో నెటిజన్‌ పోస్టు పెట్టాడు. అయితే మూవీ ఎక్కడా బోర్‌ కొట్టదని స్పష్టం చేశాడు.  https://twitter.com/PinkCancerian/status/1796336006402355622 పుష్ప సినిమా ఫాస్ట్ ట్రాక్‌ వెర్షన్‌లా గ్యాంగ్‌ ఆఫ్‌ గోదావరి ఉందని ఓ నెటిజన్‌ పోస్టు పెట్టాడు. ఎడిటింగ్ అసలు  బాలేదని పేర్కొన్నాడు. రన్‌టైమ్‌ చాలా క్రిస్పీగా ఉందని పోస్టు పెట్టాడు.  https://twitter.com/Kamal_Tweetz/status/1796330322730373525 https://telugu.yousay.tv/top-secrets-you-dont-know-about-vishwak-sen.html https://telugu.yousay.tv/do-you-know-these-top-secrets-about-neha-shetty.html
    మే 31 , 2024
    REVIEW: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం హిట్టా? ఫట్టా?
    REVIEW: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం హిట్టా? ఫట్టా?
    ]కథ అల్లరి నరేశ్ నటన మాటలుబలాలుబలహీనతలుకథనం ఎమోషనల్ మిస్ అవ్వటం కథ అంచా వేసే విధంగా ఉండటంరేటింగ్‌: 2.5Download Our App
    ఫిబ్రవరి 14 , 2023
    విశ్వ‌సుంద‌రి హార్నాజ్ కౌర్ సంధు హొయ‌లు
    విశ్వ‌సుంద‌రి హార్నాజ్ కౌర్ సంధు హొయ‌లు
    ]21 ఏళ్ల త‌ర్వాత ఇండియాకు విశ్వ‌సుంద‌రి కిరీటాన్ని తీసుకొచ్చింది17 ఏళ్లకే మోడలింగ్‌ రంగంలో అడుగు పెట్టింది 2017లో ‘మిస్‌ చంఢీఘర్‌’ కిరీటాన్ని గెలుచుకుంది2019లో ‘మిస్‌ ఇండియా’ టైటిల్‌ కోసం పోటీ పడి టాప్‌ 12 జాబితాలో నిలిచింది. ప్రియాంక చోప్రా, సుస్మితా సేన్ త‌ర్వాత ఇండియా నుంచి మూడవ‌ మిస్ వ‌రల్డ్ హ‌ర్నాజ్
    అక్టోబర్ 21 , 2022
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
    స్వయంకృషితో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవీన్ పొలిశెట్టి. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ అంచెలంచెలుగా హీరో స్థాయికి ఎదిగాడు. హీరోగా తొలి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో విమర్శకుల ప్రశంసలు పొందాడు. జాతిరత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి విజయాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. టాలీవుడ్‌లో కామెడీ స్టార్‌గా ఎదిగిన నవీన్ పొలిశెట్టి గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం. నవీన్ పొలిశెట్టి హీరోగా తొలి సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి ఎత్తు ఎంత? 5 అడుగుల 10 అంగుళాలు నవీన్ పొలిశెట్టి  ఎక్కడ పుట్టాడు? హైదరాబాద్ నవీన్ పొలిశెట్టి పుట్టిన తేదీ ఎప్పుడు? 1990, డిసెంబర్ 26 నవీన్ పొలిశెట్టికి వివాహం అయిందా? ఇంకా జరగలేదు. నవీన్ పొలిశెట్టి  ఫెవరెట్ హీరో? మహేష్ బాబు, అనిల్ కపూర్ నవీన్ పొలిశెట్టి  తొలి హిట్ సినిమా? ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ నవీన్ పొలిశెట్టి గుర్తింపునిచ్చిన చిత్రం? జాతి రత్నాలు నవీన్ పొలిశెట్టి ఇష్టమైన కలర్?  బ్లాక్ నవీన్ పొలిశెట్టి  తల్లిదండ్రుల పేరు? మంజుల(బ్యాంక్ ఉద్యోగి), రాజ్‌కుమార్( ఫార్మస్యూటిక్ బిజినెస్) నవీన్ పొలిశెట్టి ఇష్టమైన ప్రదేశం? అమెరికా నవీన్ పొలిశెట్టికి ఇష్టమైన సినిమాలు? షోలే నవీన్ పొలిశెట్టి ఏం చదివాడు? సివిల్ ఇంజనీరింగ్(NIT భోపాల్) నవీన్ పొలిశెట్టి అభిరుచులు?  ట్రావలింగ్, డ్యాన్స్ చేయడం, రీడింగ్ బుక్స్ నవీన్ పొలిశెట్టి ఎన్ని సినిమాల్లో నటించాడు? 2024 వరకు 7 సినిమాల్లో నటించాడు.  నవీన్ పొలిశెట్టి సినిమాకి ఎంత తీసుకుంటాడు? ఒక్కో సినిమాకు రూ.2కోట్లు తీసుకుంటున్నాడు. https://www.youtube.com/watch?v=6SPYe3HkBVo
    మార్చి 21 , 2024
    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
    Miss Shetty Mr. Polishetty: అనుష్క తిరిగి కమ్‌బ్యాక్‌ ఇచ్చినట్లేనా..? ఈ భామ రెమ్యూనరేషన్‌ తెలిస్తే షాకే!
    టాలీవుడ్‌ ప్రముఖ కథానాయికల్లో అనుష్క శెట్టి ఒకరు. పలు సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఆపై అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, బాహుబలి వంటి చిత్రాలతో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి తర్వాత అనుష్క కెరీర్‌ పూర్తిగా చతికిలపడింది. దీనికి కారణం ఆమె తీసిన ‘సైజ్‌ జీరో’ చిత్రం. 2015లో వచ్చిన ఈ మూవీ కోసం అనుష్క బరువు పెరిగింది. మూవీ అనంతరం తగ్గేందుకు యత్నించినా అది వర్కౌట్‌ కాలేదు. దీంతో ఈ భామకు సినిమా అవకాశాలు సన్నగిల్లాయి. అయితే తాజాాగా యంగ్‌ హీరో నవీన్‌కు జతగా ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రంలో అనుష్క నటించింది. సోమవారం (ఆగస్టు 21) విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. వైవిధ్యమైన ప్రేమ కథ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సెప్టెంబర్ 7న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను బట్టి చూస్తే మరో వైవిధ్యమైన ప్రేమకథతో అనుష్క తన అభిమానులను మెస్మరైజ్ చేయబోతున్నారని అర్థమవుతోంది. ఈ సినిమాలో అనుష్క షెఫ్‌గా, నవీన్ స్టాండప్ కమెడియన్‌గా నటించారు. ప్రేమ, రిలేషన్‌షిప్స్, పెళ్లి మీద అస్సలు ఆసక్తి, నమ్మకం లేని అమ్మాయిగా అనుష్క కనిపించింది. అలాంటి అమ్మాయి హీరోని ఇష్టపడుతుంది. కానీ పెళ్లి చేసుకోవడానికి కాదు. గర్భం దాల్చడానికి అతడిని హెల్ప్ అడుగుతుంది. ఇదేంటో అర్థంకాక గందరగోళ పరిస్థితిలో హీరో పడతాడు. ఇదే విషయాన్ని ట్రైలర్‌లో ఆసక్తికరంగా చెప్పారు. సరికొత్త ప్రేమకథను ఎంటర్‌టైనింగ్‌, ఎమోషనల్‌గా చెప్పడానికి దర్శకుడు మహేష్ సిద్ధమయ్యారు.  అనుష్క.. గ్రేట్‌ కమ్‌బ్యాక్‌! ఈ సినిమాకు ముందు వరకు పెద్దగా అవకాశాలు లేక అనుష్క ఎంతగానో ఇబ్బంది పడింది. సుదీర్ఘకాలం పాటు మూవీస్‌కు దూరమైంది. దీంతో ఇక అనుష్క కెరీర్‌ అయిపోయినట్లేనని అంతా భావించారు. ఫ్యాన్స్‌ కూడా దాదాపు ఇదే అభిప్రాయానికి వచ్చేశారు. అనుష్కను ఇక వెండితెరపై చూడలేమా అని అనుకుంటున్న సమయంలో ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ చిత్రం ద్వారా ఈ భామ గ్రేట్ కమ్‌ బ్యాక్‌కు సిద్దమైంది. ఈ సినిమా ట్రైలర్‌లో మునుపటి ‌అనుష్కను స్వీటీ గుర్తు చేసింది. తన గ్లామర్‌, గ్రేస్‌ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. హీరో ప్రభాస్‌ సైతం ట్రైలర్‌ చూసి అద్భుతంగా ఉందంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ట్రైలర్‌ ఆధ్యాంతం కడుపుబ్బా నవ్వించిందని పేర్కొన్నాడు. పలువురు సినీ ప్రముఖులు సైతం ట్రైలర్‌ను మెచ్చుకుంటున్నారు. సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుందని అభిప్రాయపడుతున్నారు.  రెమ్యూనరేషన్‌ ఎంతంటే? ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా కోసం అనుష్క భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అనుష్క నటించినందుకు మేకర్స్‌ ఆమెకు రూ.6 కోట్లు చెల్లించారని సోషల్‌ మీడియాలో చర్చించుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే సినిమాలకు దూరమైనప్పటికీ అనుష్క క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదని అర్థం చేసుకోవచ్చు. మరోవైపు అంచనాలకు ‌అనుగుణంగా ఈ చిత్రం భారీ విజయం సాధిస్తే తిరిగి అనుష్క టాలీవుడ్‌లో బిజీ కావడం ఖాయమని సినీ విశ్లేషకులు అంటున్నారు. అటు స్వీటి అభిమానులు సైతం ఇదే జరగాలని కోరుకుంటున్నారు.
    ఆగస్టు 22 , 2023

    @2021 KTree