
Ever Anderson
Born : November 03 , 2007
Place: Toronto, Canada
Ever Anderson, born on November 3, 2007, in Los Angeles, is an American actress and model known for her roles as a young Alicia Marcus/Red Queen in "Resident Evil: The Final Chapter" (2016), a young Natasha Romanoff in "Black Widow" (2021), and Wendy Darling in "Peter Pan & Wendy" (2023).
Articles

రామ్ పోతినేని (Ram Pothineni) గురించి మీకు తెలియని టాప్ సీక్రెట్స్
తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదిగిన హీరోల్లో రామ్ పొత్తినేని ఒకడు. దేవదాసు, రెడీ, ఇస్మార్ట్ శంకర్ వంటి చిత్రాల సక్సెస్ స్టార్ డం అందించాయి. తనదైన స్లాంగ్, మెనరిజం, స్టైలీష్ డ్యాన్స్‌తో యూత్ ప్రేక్షకులకు RAPO దగ్గరయ్యాడు. తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఉస్తాద్‌గా గుర్తింపు పొందాడు. మరి యూత్‌ను ఆకట్టుకున్న రామ్ పొత్తినేని గురించి చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
రామ్ పొత్తినేని ఎవరు?
వ్యాపారవేత్త మురళి పొత్తినేని కుమారుడు. ప్రముఖ నిర్మాత స్రవంతి రవి కిశోషోర్ స్వయానా మేనళ్లుడు.
రామ్ పొత్తినేని ముద్దు పేర్లు?
RAPO, ఉస్తాద్, ఎనర్జిటిక్ స్టార్
రామ్ పొత్తినేని ఎత్తు ఎంత?
5 అడుగుల 8 అంగుళాలు
రామ్ పొత్తినేని ఎక్కడ పుట్టారు?
హైదరాబాద్
రామ్ పొత్తినేని పుట్టిన తేదీ ఎప్పుడు?
1988 మే 15
రామ్ పొత్తినేనికి వివాహం అయిందా?
ఇంకా కాలేదు.
రామ్ పొత్తినేనికి ఇష్టమైన రంగు?
వైట్, బ్లూ
రామ్ పొత్తినేని తల్లిపేరు
పద్మ శ్రీ
రామ్ పొత్తినేని అభిరుచులు?
డ్యాన్స్ చేయడం, క్రికెట్ ఆడటం
రామ్ పొత్తినేనికి ఇష్టమైన ఆహారం?
బిర్యాని
రామ్ పొత్తినేని అభిమాన నటుడు?
వెంకటేష్
రామ్ పొత్తినేనికి నచ్చిన సినిమా?
కలిసుందాం రా
రామ్ పొత్తినేని స్టార్ డం అందించిన సినిమాలు?
దేవదాసు, ఇస్మార్ట్ శంకర్, రెడీ
రామ్ పొత్తినేని ఏం చదివాడు?
చెన్నై యూనివర్సిటీలో డిగ్రీ
రామ్ పొత్తినేని ఎన్ని సినిమాల్లో నటించాడు?
2024 వరకు 20 సినిమాల్లో నటించాడు
https://www.youtube.com/watch?v=nqh6O2HFT-g
రామ్ పొత్తినేని సినిమాకు ఎంత తీసుకుంటారు?
ఒక్కో సినిమాకి దాదాపు రూ.15కోట్లు- రూ.20కోట్లు తీసుకుంటున్నాడు.
రామ్ పొత్తినేని ఎన్ని అవార్డులు గెలుచుకున్నాడు?
దేవదాసు, రెడీ చిత్రాలకు గాను ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాడు.
March 21 , 2024
2022లో మార్మోగిన పాటలు]రామ్ పోతినేని నటించిన చిత్రంలో ఈ ఎనర్జిటిక్ పాటను తమిళ్ సూపర్ స్టార్ శింబు పాడాడు. శింబు వాయిస్‌తో పాటు రామ్ డాన్స్‌తో చాలా పాపులర్ అయ్యింది.12. బుల్లెట్ ( ది వారియర్ )Listen nowమరికొన్ని హిట్స్కల్యాణం ( సీతారామం )నీతో ఉంటే చాలు ( బింబిసార )మరికొన్ని హిట్స్నామది ( తిరు )మేఘం కరిగేనా ( తిరు )మరికొన్ని హిట్స్కోకా ( లైగర్ )విజిల్( ది వారియర్)మరికొన్ని హిట్స్రా రా రక్కమ్మ ( విక్రాంత్ రోణ )నాకోసం మారావా నువ్వు ( బంగార్రాజు )
February 13 , 2023
Double Ismart: రామ్‌తో కోల్డ్ వార్? అందుకే ట్రైలర్ లాంచ్‌కు పూరీ రాలేదా!
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా, పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart). ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటికీ నుంచి మూవీ టీమ్‌కు ఏదోక సమస్య వస్తూనే ఉంది. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పంద్రాగస్టు బరిలో నిలవడం, ‘లైగర్’ డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను సెటిల్ చేయాలని డిమాండ్ చేయడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్, డైరెక్టర్ పూరికి మధ్య మనస్పర్థలు (Ram Pothineni vs Puri Jagannadh) తలెత్తినట్లు ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ కోల్డ్ వార్‌కు కారణమేంటో ఇప్పుడు చూద్దాం.
రామ్ అసంతృప్తి!
హీరో రామ్, డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ (Ismart Shankar) బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ మూవీకి సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart)ను రూపొందించారు. ఆగస్టు 15న ఈ సినిమా రిలీజ్ రెడీ కాగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై హీరో రామ్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. 'లైగర్' వివాదం కారణంగా తన చిత్రానికి చిక్కులు రావడంపై రామ్ గుర్రుగా ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న తరుణంలో ఇప్పటికీ నైజాం పంపిణీ వ్యవహారం కొలిక్కిరాకపోవడం, నిర్మాత ఛార్మీ ప్రమోషన్స్ షురూ చేయకపోవడంపై రామ్ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడిపోతున్నారట. ఆదివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరగ్గా డైరెక్టర్ పూరి రాకపోవడం వెనుక రామ్‌తో తలెత్తిన వివాదాలే కారణమని ఫిల్మ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రైలర్ ఈవెంట్‌లో ఏకాకిగా రామ్ తన సినిమాను ప్రమోట్ చేసుకోవడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.
పూరి వివరణ!
'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు రాకపోవడంపై డైరెక్టర్ పూరి ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు. సెన్సార్ కోసం ముంబయిలో ఫైనల్ మిక్సింగ్ ఉండి ఈవెంట్‌కి రాలేకపోయినట్లు తెలిపారు. ఈవెంట్‌కు రాలేకపోయినందుకు చాలా బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఇవేమి నమ్మశక్యంగా లేవని పేర్కొంటున్నారు. ఒక దర్శకుడు లేకుండా ట్రైలర్ లాంచ్ జరగడమేంటని ప్రశ్నిస్తున్నారు. రామ్‌తో గ్యాప్ వల్లే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు పూరి రాలేదని ఆరోపిస్తున్నారు. డబుల్ ఇస్మార్ట్ సూపర్ హిట్ సాధిస్తే ఆటోమేటిక్‌గా వీరి మధ్య గ్యాప్ తొలగిపోతుందని కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. రామ్, పూరి మధ్య విభేదాలకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ చిత్ర యూనిట్ దీనిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.
https://twitter.com/i/status/1820365775439552575
ట్రైలర్ ఎలా ఉందంటే?
ఆదివారం రిలీజైన 'డబుల్ ఇస్మార్ట్' ట్రైలర్ ఊహించిన విధంగానే మాస్ యాక్షన్‍తో, నాటు డైలాగ్‍లతో నిండిపోయింది. అటు తన మార్క్ ఎనర్జిటిక్ యాక్షన్, మాస్ డైలాగ్‍లు, డ్యాన్స్‌తో రామ్ ట్రైలర్‌లో దుమ్మురేపారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ (Sanjay Dutt) ఇందులో విలన్‍గా బిగ్‍బుల్ పాత్రను చేశారు. బిగ్‍బుల్ బ్రెయిన్‍లోని మెమొరీని శంకర్ (రామ్ పోతినేని) మెదడులో పంపించడం ఈ ట్రైలర్‌లో ముఖ్యమైన అంశంగా కనిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చిప్‍ను తలలో పెడితే ఈ డబుల్ ఇస్మార్ట్ మూవీలో ఏకంగా బ్రెయిన్ మెమొరీ ట్రాన్స్‌ఫర్ కాన్సెప్ట్ తీసుకున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
https://www.youtube.com/watch?v=ym0upoayqJg
మిస్టర్ బచ్చన్ దూకుడు!
డబుల్ ఇస్మార్ట్ టీమ్‌తో పోలిస్తే ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) టీమ్ ప్రమోషన్స్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. వరుసగా ప్రెస్ మీట్‌లు నిర్వహిస్తూ తమ సినిమాను ఆడియన్స్‌లోకి తీసుకెళ్తోంది. సాధారణంగా ప్రమోషన్స్ అనేవి సినిమా ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతాయి. అటువంటి కీలకమైన ప్రమోషన్స్‌ను ‘డబుల్ ఇస్మార్ట్’ సరిగా మెుదలు పెట్టకపోవడంపై సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మిస్టర్ బచ్చన్ ఆగస్టు 15 రేసులోకి రావడంతో పూరి ఢీలా పడిపోయారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ సక్సెస్ ఏంతో కీలకమైన నేపథ్యంలో రిజల్ట్‌పై పూరి ఆందోళనతో ఉన్నారా? అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కోరినా.. వెనక్కి తగ్గలేదా?
పంద్రాగస్టు రోజున ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ కాకుండా ఉండేందుకు ‘డబుల్ ఇస్మార్ట్’ టీమ్ అన్ని ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. సినిమాను వాయిదా వేసుకోవాలని బచ్చన్ టీమ్‌ను వారు అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనికి బచ్చన్ టీమ్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలోనే డబుల్ ఇస్మార్ట్ నిర్మాత ఛార్మీ ఇటీవల రవితేజతో పాటు దర్శకుడు హరీశ్ శంకర్‌ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసినట్లు కథనాలు వచ్చాయి.
August 05 , 2024
Bhagyashri Borse: మరో బంపరాఫర్ కొట్టేసిన భాగ్యశ్రీ.. ఈ అమ్మడి దూకుడు మామూల్గా లేదుగా!
యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఇటీవల పెద్ద ఎత్తున టాలీవుడ్‌లో మార్మోగింది. తెలుగులో ఆమె ఫస్ట్ ఫిల్మ్ ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైనప్పటికీ బాగ్యశ్రీ ప్రదర్శన మాత్రం మెప్పించింది. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించి తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. తాజాగా మరో బంపరాఫర్ కొట్టేసి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. టాలీవుడ్‌లో చిన్నగా గేర్లు మారుస్తూ టాప్ హీరోయిన్ స్థాయికి భాగ్యశ్రీ ఎదుగుతోందంటూ ఫిల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
రామ్ సరసన హీరోయిన్‌గా..
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది. 'RAPO22' వర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ తెరకెక్కనుంది. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) డైరెక్టర్ మహేష్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపికచేసినట్లు నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. ఈ మేరకు స్పెషల్ పోస్టర్‌ను సైతం విడుదల చేసింది. ’రీసెంట్ సెన్సేషన్ భాగ్య శ్రీ తమ ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం వల్ల ఈ చిత్రానికి మరింత అందం వచ్చింది’ అని సదరు సంస్థ పేర్కొంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను గురువారం (నవంబర్ 21) వెల్లడించనున్నట్లు స్పష్టం చేసింది. గురువారం (నవంబర్ 21) పూజా కార్యక్రమంతో షూటింగ్ ప్రారంభించనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది.
https://twitter.com/MythriOfficial/status/1859100765832261753
రామ్ ఆశలన్నీ 'RAPO22' పైనే!
'RAPO22' రామ్ 22వ చిత్రంగా రానుంది. గురువారం(నవంబర్ 21) పూజా కార్యక్రమాలు నిర్వహించి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను మెుదలుపెట్టనున్నారు. హై ఎనర్జీ న్యూ ఏజ్ స్టోరీగా ఇది రాబోతోన్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీస్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్‌లు దీన్ని నిర్మించనున్నారు. ఇదిలా ఉంటే మూవీ సక్సెస్‌పైనే రామ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత కొంత కాలంగా రామ్‌కు సాలిడ్ హిట్ పడలేదు. ఆయన గత చిత్రాలు ‘రెడ్’, ‘ది వారియర్’, ‘స్కంద’, ‘డబుల్ ఇస్మార్ట్ ‘బాక్సాఫీస్ వద్ద దారుణంగా నిరాశ పరిచాయి. దీంతో 'RAPO22'తోనైనా హిట్ కొట్టి ఫ్యాన్స్‌ను సంతోష పెట్టాలని ఈ ఎనర్జటిక్ స్టార్ భావిస్తున్నారు. మరోవైపు 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ నేపథ్యంలో భాగ్యశ్రీకి (Bhagyashri Borse) ఈ సినిమా సక్సెస్ కీలకం కానుంది.
ఫ్లాప్ వచ్చినా ఏమాత్రం తగ్గని క్రేజ్!
‘మిస్టర్ బచ్చన్’ సినిమా టైంలో భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) పేరు ఎంతగా ట్రెండ్ అయిందో తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికగా ఎంపికైన దగ్గర్నుంచి ఆమె సోషల్ మీడియా దృష్టినీ ఆకర్షిస్తూనే వచ్చింది. సినిమా నుంచి తొలి పాటను అనౌన్స్ చేసినపుడు కొన్ని విజువల్స్ చూసి కుర్రాళ్లకు మతిపోయింది. అయితే ఊహించని విధంగా ‘మిస్టర్ బచ్చన్’ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ అంచనాలన్నీ తలకిందులు అయ్యాయి. తొలి చిత్రమే దారుణ పరాజయాన్ని మిగిల్చడంతో ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన దూకుడు కాస్త తగ్గించింది. ఇటీవల 'కాంత' సినిమాలో హీరోయిన్‌గా ఎంపికై తన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఆ సినిమా సెట్స్‌పై ఉండగానే రామ్ సరసన మరో క్రేజీ ఆఫర్ దక్కించుకొని ఆశ్చర్యపరిచింది.
దుల్కర్‌కి జోడీగా పాన్ ఇండియా ఫిల్మ్
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరో, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ‘కాంత’ (Kaantha). ‘నీలా’ ఫేమ్ సెల్వమణి సెల్వరాజ్ (Selvamani Selvaraj) దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగా కొన్ని వారాల క్రితం పూజా కార్యక్రమాలు సైతం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి అందంగా చీరకట్టుకొని మరి భాగ్యశ్రీ హాజరయ్యింది. ఆమె లుక్స్‌కు మరోమారు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె మంచి ఛాన్స్ కొట్టేశారంటూ పోస్టులు పెట్టారు. వేఫరెర్ ఫిలిమ్స్, స్పిరిట్ మీడియా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో రానా దగ్గుబాటి ఓ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.
https://twitter.com/DQsWayfarerFilm/status/1833013939837276196
విజయ్ దేవరకొండతోనూ..
విజయ్ దేవరకొండ - గౌతమ్ తిన్ననూరి కాంబోలో రూపొందుతున్న 'VD12' చిత్రంలోనూ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ అమ్మడు షూటింగ్‌లోనూ చురుగ్గా పాల్గొంటోంది. ఈ సినిమాలో విజయ్ పోలీసు ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ఓ సాధారణ పోలీసు కానిస్టేబుల్ అయిన హీరో, మాఫియా లీడర్‌గా ఎలా ఎదిగాడన్న కాన్సెప్ట్‌తో 'VD12' రాబోతున్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనున్నారు. ఇక నేచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో రానున్న మూవీలోనూ హీరోయిన్‌గా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు టాక్ ఉంది.
భాగ్యశ్రీ ప్రేమలో పడిందా?
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) ఓ వ్యక్తితో ప్రేమలో పడినట్లు ఇతర వార్తలు వచ్చాయి. 'ప్రేమ.. ఎలాంటి హెచ్చరిక లేకుండా పుడుతుంది' అంటూ గతంలో ఆమె పెట్టిన ఇన్‌స్టా పోస్టు ఒక్కసారిగా వైరల్‌గా మారింది. తనకు బాగా దగ్గరైన వ్యక్తి ఇచ్చిన పూల బొకేను షేర్ చేస్తూ దానికి లవ్ సింబల్‌ను కూాడా ఈ అమ్మడు జత చేసింది. మంచుతో నిండిన కొండలోయలను ఇష్టమైన వాడితో వీక్షిస్తూ ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. తాము ప్రేమ పక్షులం అని అర్థం వచ్చేలా రెండు బర్డ్స్ ఉన్న ఫొటోను షేర్ చేసి ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చింది. ఓ వ్యక్తితో కలిసి సూర్యస్తమయాన్ని వీక్షిస్తూ అతడి ముఖం కనిపించకుండా జాగ్రత్తపడింది. చివరిగా ‘ఈ వీక్‌లో కొంత భాగం’ అంటూ లవ్ ఎమోజీ, ఓ పక్షి ఫొటోను పెట్టింది. దీంతో భాగ్యశ్రీ ప్రేమలో పడిపోయిందంటూ నెటిజన్లు జోరుగా పోస్టులు పెట్టారు.
November 20 , 2024

Resident Evil: The Final Chapter
Released On 23 December 2016
Discover everything about Ever Anderson, from personal details like height, Place of Birth, Date of Birth, and age to professional achievements, awards, business ventures, favorites, and fascinating facts. Learn about Ever Anderson's family background, including details about parents, siblings, and relationships. Stay updated on the latest pics, latest projects, career milestones, and educational background. Connect with Ever Anderson on official social media accounts and website for an exclusive peek into their life and direct interaction.