• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • BRS పేరుతో ఏపీలో ఫ్లెక్సీలు

    TRSను BRSగా మారుస్తూ జాతీయ రాజకీయాల్లో వెళ్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ ఏ ఏ రాష్ట్రాల్లో పోటీ చేస్తారో స్పష్టంగా చెప్పలేదు. అయితే ఏపీలో మాత్రం BRS పార్టీ పేరుతో రోజుకో ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. తాజాగా అమలాపురం పట్టణంలో రేవు అమ్మాజీరావు పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. పార్టీ ఏర్పాటైన రెండు రోజులకే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఆశ్యర్యానికి గురి చేస్తోంది. మరి KCR పార్టీకి ఏపీలో ఏ మాత్రం మైలేజ్ వస్తుందో … Read more

    గోదావరి గట్టుపై ఐటీ ఉద్యోగులు

    అమలాపురం అల్లర్ల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో కోనసీమ జిల్లాలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు నానా తంటాలు పడుతున్నారు. వర్క్ ఫ్రం హోం చేస్తున్న ఐటీ ఉద్యోగులు గోదావరి నది ఒడ్డుకు చేరి పనులు చేసుకుంటున్నారు. అక్కడ కొంచెం ఇంటర్నెట్ వస్తుండటంతో అలా కష్టపడుతున్నారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై నాలుగు రోజుల క్రితం అల్లర్లు చెలరేగగా..పోలీసులు 144 సెక్షన్ అమలుచేయడంతో పాటు ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. ప్రస్తుతం ఇవాళ కూడా నెట్ సేవలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. © File Photo … Read more

    రణక్షేత్రంలా మారిన కోనసీమ

    కోనసీమ జిల్లా పేరు మార్పు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తోంది. అంబేద్కర్ పేరును కోనసీమకు పెట్టడాన్ని స్వాగతిస్తూ కొందరు, వ్యతిరేకిస్తూ మరికొందరు… పోటా పోటీగా ఆందోళనలకు దిగారు. నిరసనకారుల దాడుల్లో ఎస్పీ సహా 20 మందికి పైగా పోలీసులు గాయపడ్డారు. 2 ప్రైవేటు బస్సులకు దగ్ధమయ్యాయి. ఇప్పటివరకు ఈ ఘటనలో 7 కేసులు నమోదయ్యాయి. 46 మందిని అరెస్ట్ చేశారు. మరో 72 మంది గాలిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని డీజీపీ వివరించారు. మరోవైపు అల్లర్ల వెనక టీడీపీ,జనసేన హస్తం ఉందని వైసీపీ … Read more

    ఇంటర్నెట్ సేవలు బంద్

    అమలాపురంలో ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు. కోనసీమ జిల్లా పేరును యథావిధిగా కొనసాగించాలంటూ హింసాత్మక ధోరణికి పాల్పడుతున్నారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు. అలాగే కాకినాడ, రాజమండ్రి నుంచి వచ్చే బస్సు సర్వీసులను రద్దు చేశారు. ప్రజా జీవనానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండ 144 సెక్షన్ విధించారు. అక్కడి పరిస్థితులపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.

    Categories AP

    ‘వెనకుండి రెచ్చగొట్టడం సరికాదు’

    పచ్చని కోనసీమలో కావాలనే కొన్ని సంఘ విద్రోహ శక్తులు విధ్వంసం సృష్టిస్తున్నాయని వైసీపీ ఎంపీ పిల్లి సుభాస్ చంద్రబోస్ అన్నారు. ప్రజల కోరిక మేరకే కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చారని వెల్లడించారు. చంద్రబాబు కూడ ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని గతంలో పేర్కొనట్లు వివరించాడు. పవన్ కల్యాణ్, చంద్రబాబు మీడియా ముందుకొచ్చి మాట్లాడాలని, వెనకుండి రెచ్చగొట్టడం సరికాదన్నారు. కోనసీమ జిల్లా పేరు మార్చినందుకు నిరసనకారులు అమలాపురంలో ఆందోళన సృష్టిస్తున్నారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు … Read more