అమర్నాథ్:15,000 మంది సురక్షితం
అమర్నాథ్ గుహ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 15వేల మందిని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. గుహ నుంచి పంజ్తర్ని వరకు ఐటీబీపీ జవాన్లు బందోబస్తు కల్పించారు. ఇప్పటి దాకా 15 మంది జలసమాధి కాగా, పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు హెలికాప్టర్లు, రెస్క్యూ శునకాల సాయంతో గాలింపు కొనసాగిస్తున్నారు.