ఉగ్రవాదులను మనమే వెంబడించాలి: ప్రధాని
ఉగ్రవాదులు ఇంట్లోకి వచ్చే వరకు చూడొద్దని… మనమే ముష్కరులను వెంటాడాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు నిధులను నిరోధించే అంశంపై దిల్లీ వేదికగా జరుగుతున్న నో మనీ ఫర్ టెర్రర్ అంతర్జాతీయ సదస్సును ప్రారంభించారు. కొన్ని దశాబ్దాలుగా దేశం ఎన్నో విధాలుగా ముష్కర కుట్రలను ఎదుర్కొంటోందని..ఎంతో మంది ప్రాణాలు పోయాయని అన్నారు. అయినా..ధైర్యంగా పోరాడుతున్నామని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే వరకు విశ్రమించబోమన్నారు.