ఏపీలో తుపాను బీభత్సం
మాండౌస్ తుపాను ఏపీలో బీభత్సం సృష్టిస్తోంది. గాలివానలకు అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు,వైఎస్ఆర్, ప్రకాశం, బాపట్ల, తూ.గో. జిల్లాల్లో భారీ వర్షాలు ముంచెత్తాయి. తిరుపతిలో ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపించాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అనేక చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. హైదరాబాద్-రేణిగుంట-విశాఖ ఇండిగో విమానాన్ని రద్దుచేశారు. శ్రీకాళహస్తి-తడ మార్గంలో సున్నపుకాల్వపై బస్సు వరదనీటిలో చిక్కుకోగా పోలీసులు ప్రయాణికులను కాపాడారు.