• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • సచివాలయాల్లో మ్యారేజ్ సర్టిఫికెట్

    AP: రాష్ట్రంలో ఇక నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లోనే మ్యారేజీ సర్టిఫికెట్‌ని జారీ చేయనున్నారు. దీంతో రేషన్ కార్డు విభజన ప్రక్రియ సులువవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు సంబంధించిన యూజర్ మాన్యువల్‌ను అన్ని సచివాలయాలకు పంపించారు. గ్రామాల్లో అయితే తొలి 60రోజుల్లో, పట్టణాల్లో 90రోజుల్లోగా ధ్రువపత్రం కోసం స్థానిక సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ గడువు దాటితే రిజిస్ట్రార్ కార్యాలయంలో అప్లై చేసుకోవాలి. నవదంపతుల ఆధార్ కార్డులు, ఇతర వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. పెళ్లి జరిగిన ప్రాంత పరిధిలోనే సర్టిఫికెట్ పొందాల్సి … Read more

    గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు రూ.3000 కోట్లు మంజూరు

    ఏపీ రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌కు రూ.3,000.80 కోట్లు జారీచేసింది. ప్ర‌జ‌లకు అత్యంత అవ‌స‌ర‌మైన ప‌నుల‌ను చేప‌ట్టేందుకు ఈ నిధుల‌ను ఉప‌యోగించ‌నున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వంలో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు స‌చివాల‌యాల‌ను సంద‌ర్శిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో వారు గ్రామానికి లేదా వార్డుకు ల‌క్ష రూపాయ‌ల నుంచి రూ.20 ల‌క్ష‌ల వ‌ర‌కు మంజూరు చేసే అవ‌కాశం క‌ల్పించింది. ఆ నిధుల‌ను ఎలాంటి ప‌నుల‌కు ఉప‌యోగించాలో రాష్ట్ర ప్రణాళికా శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

    సచివాలయం దగ్గర గేదెలు..కారణమిదే

    ఏపీ సచివాలయం దగ్గర గేదెలను కట్టేశారు. ఓ వింత ఫిర్యాదులో అవి చివరకు అక్కడకు చేరాయి. గుంటూరులో ఓ వ్యక్తి తన ఇంటి పక్కన గేదెల వల్ల వాసన వస్తుందని అధికారులు ఫిర్యాదు చేశాడు. స్పందించిన శానిటరీ సిబ్బంది ఆ గేదెల రైతుకు పలుమార్లు నోటీసులివ్వగా పట్టించుకోలేదు. కోర్టుకు కూడా వెళ్లారు. అయినా మార్పులేదు. దీంతో ఆ రైతు పశువులను తీసుకొచ్చి అధికారులు సచివాలయం వద్ద ఉంచారు. సమస్య పరిష్కరించకుంటే తమపై చర్యలు తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు.