అజిత్ ‘తెగింపు’ తగ్గేదేలే!
తమిళ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన ‘తెగింపు’ మూవీ సంక్రాంతి కానుకగా ఈనెల 11న థియేటర్లలో విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తొలుత విజయ్ ‘వారసుడు’ చిత్రం పోటీలో ఉండడంతో తగినన్ని థియేటర్లు దొరకలేదు. ప్రస్తుతం ‘వారసుడు’ వాయిదా పడడంతో తెగింపుకు అడ్డు లేకుండాపోయింది. ఈ మూవీలో అజిత్ సరసన్ మంజు వారియర్ నటించింది. వినోద్ దర్శకత్వం వహించగా, బోనీకపూర్ నిర్మించారు.