KGF 2: హిందీలో సోమవారం ఒక్కరోజే రూ.25 కోట్లు
ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన KGF: చాప్టర్ 2 కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మూవీకి అద్భుతమైన రివ్యూలు రావడంతో థియేటర్లలో జనాలు సినిమా చూసేందుకు ఎగబడుతున్నారు. రాబోయే రెండు వారాల పాటు బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తుందని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా కేరళలో నాలుగు రోజుల్లో రూ.28 కోట్లు వసూలుచేసింది. హిందీలో సోమవారం ఒక్కరోజే రూ.25 కోట్లు రాబట్టింది. దీంతో బాలివుడ్లో మొత్తం ఇప్పటివరకు రూ.200 కోట్లు వసూళ్లను క్రాస్ చేసింది.