మూడేళ్ళలో భారీగా పులుల మరణాలు
వన్యప్రాణుల సంరక్షణకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోతుంది. గత మూడేళ్ళలో దేశంలో 329 పులులు మరణించినట్లు పర్యావరణ శాఖ సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే లోక్సభలో తెలిపారు. 2019లో 96, 2020లో 106, 2021లో 127 పులులు మరణించాయని వెల్లడించారు. వాటిలో 68 సహజ మరణాలు కాగా.. 29 పులులు వేట కారణంగా మరణించాయని తెలిపారు. మిగిలిన మరణాలపై విచారణ చేస్తున్నామన్నారు. అటు గత మూడేళ్ళలో పులుల దాడిలో 125 మంది మృత్యువాత పడినట్లు ఆయన వెల్లడించారు.