ఏపీకి భారీ వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రవాయుగుండంగా బలపడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం చెన్నైకి 570కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దక్షిణ కోస్తా, తమిళనాడు తీరం వైపు వాయుగుండం పయనిస్తోందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరో 24 గంటల్లో వాయుగుండం బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో తమిళనాడు, కోస్తా ఆంధ్రా తీరం వెంబడి ఇవాళ రేపు భారీ వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది.