ఇండియాలో BGMI బ్యాన్ !
మోస్ట్ పాపులర్ మొబైల్ BGMI(బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా)ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో గూగుల్, యాపిల్ సంస్థలు తమ తమ స్టోర్ల నుంచి ఈ యాప్‌ను తొలగించాయి. గతంలో PUBGని బ్యాన్ చేయడంతో.. ఆ గేమ్ స్థానంలో BGMI వచ్చింది. అతి తక్కువ కాలంలోనే విశేష ఆదరణ పొందిన ఈ గేమ్.. తొలి వార్షికోత్సవం కూడా పూర్తి చేసుకుంది. ఇంతలోనే ఈ గేమ్‌పై నిషేధం విధించారు. కాగా భారత ప్రభుత్వం నిషేధం విధించడంపై BGMI సంస్థ అయిన క్రాఫ్టాన్ ఇంకా స్పందించలేదు.